– ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని కొక్కెరకుంట, వన్నారం, మోతె (కోత్తపల్లే), రుద్రారం, రంగసాయిపల్లి, దత్తోజిపేట, వెంకట్రావుపల్లి, లక్ష్మిపూర్, శ్రీరాములపల్లి, తిర్మలాపుర్, గుండి, రాంచంద్రపూర్, రామడుగు, కోరటపల్లి, గోలిరామయ్యపల్లి, పందికుంటపల్లి(కుర్మపల్లి), కిష్టాపూర్, వెలిచాల గ్రామాలలో కోటి ఇరవై లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా గుండి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన పది సంవత్సరాలలో రాష్ట్రాన్ని గత ముఖ్యమంత్రి కేసీఆర్ అర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారని, చొప్పదండి నియోజకవర్గం గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోలేదని, నాలుకోట్ల మందికి ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన మాట ప్రకారం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పదిలక్షల వరకు ఉచిత వైద్యాన్ని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, చేవెళ్లలో ఐదువందలకే సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని, అదేవిధంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పధకంను ఆర్టీసీలో జీరో టికెట్ ఎలాగైతే అందజేస్తున్నారో అదేవిధంగా జీరో చార్జిబిల్ రశీదు అందజేయడం జరుగుతుందని, నియోజకవర్గానికి పదికోట్ల ఎస్డిఎఫ్ నిధులను విడుదల చేసారని తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మరవేని తిరుపతి ముదిరాజ్, ఎంపీటీసీ బొమ్మరవేని తిరుమల, దేశరాజుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కోల రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, మాజీ ఎంపీపీ తడగొండ అంజలి హన్మంతు, ఉప్పుల ఆంజనీప్రసాద్, యూత్ అధ్యక్షులు సుధీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రేణికుంట బాపురాజ్, గుడ్ల మల్లికార్జున్, శేఖర్, కర్ర రాజిరెడ్డి, తడగొండ నర్సింగ్ బాబు, తడగొండ విష్ణు, పార్టీ కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.