మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని రాఘవపూర్ గ్రామంలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం రోజు దేవాలయ వార్షికోత్సవం కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి ని ఘనంగా సత్కరించారు. గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకు మరియు పోతురాజు, ఎల్లమ్మ, బొడ్రాయి దేవతలకు మరియు అంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు అభిమన్యు రెడ్డి కి ఆశీర్వాదం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి దొండ్లపల్లి పరిధిలోని వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, మాజీ ఉప ఉప సర్పంచ్లు, మాజీ వార్డు మెంబెర్స్, యువసేన నాయకులు, బి ఆర్ ఎస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.