ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
ముఖ్యమంత్రి కేసిఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల జీవితాల్లో వెలుగులు నింపాడని ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళితుల ఆర్థిక స్థితిగతులను అర్ధం చేసుకున్న ముఖ్యమంత్రి. వారి ఆర్ధిక అభ్యున్నతి సాధించుట కోసం హుజురాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి.. సుమారు నియోజకవర్గ పరిదిలోని 18 వేల కుటుంబాలకు రూపాయల 10 లక్షల చొప్పున కేటాయించి వారి ఆర్థిక అభ్యున్నతికి దోహదం చేశాడని. కొంత మంది కావాలని ఆసత్య ఆరోపణలు చేస్తూ… మొదటి విడతగా 5 లక్షలు మాత్రమే ఇచ్చారని. రెండో విడత రాదని ఆసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం దళిత బంధు పురోగతి లేదని. ఆ ఎన్నికల తదనంతరం మిగిత 5 లక్షలు కూడా ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు చెప్పారు. మందకృష్ణ మాదిగ గత 30 ఏండ్లుగా దళితుల ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు చేశాడని. కాని.. ప్రస్తుతం బిజెపి దాన్ని అవకాశంగా మల్చుకోని కమిటి అనే పేరుతో కాలయాపన చేస్తుందని. ఇది సరైన విధానం కాదన్నారు. దళితుల వర్గీకరణ విషయాన్ని ఎన్నికల్లో లబ్ధిపొందడానికి బిజెపి ప్రయత్నం చేస్తుందని. ముఖ్యమంత్రి మాత్రం దళితుల అభ్యున్నతి కోసం పాటుపడే వ్యక్తని అన్నారు. పార్లమెంటు భవనానికి అక్కడ అంబేద్కర్ పేరు పెట్టాలని సూచించినప్పడికి.. దానిని పట్టించుకొనటువంటి బిజెపి ప్రభుత్వానికి దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల పై ఉన్న చిత్తశుద్ధితోనే అసెంబ్లీ భవనానికి అంబేద్కర్ భవనం అని. పట్టణం నడి ఒడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహన్ని ప్రతిష్టించడం అందుకు నిదర్శనం అన్నారు. కేసీఆర్ 3వ సారి ముఖ్యమంత్రి కావడం కాయమని. హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టితో గెలిపించుకొని. ముఖ్యమంత్రి కేసిఆర్ కు కానుకగా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 17న జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభకు దళిత కుటుంబ సభ్యులందరూ భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మంద రాజేష్, పొడేటి రామస్వామి, అంబాల ప్రభు, అంబాల రాజు, రాచపల్లి వంశీ, తదితరులు పాల్గొన్నారు.