Grand Shivaji Jayanti Celebrations in Zaheerabad
ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు :
జహీరాబాద్ నేటి ధాత్రి:
శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ యువజన సభ్యులకు శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకి కాళీ స్థలాన్ని ఇవ్వాలని కోరిన ఛత్రపతి శివాజీ మహరాజ్ యువజన సభ్యుల కోరికమేరకు గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ గ్రామకంఠంలోని కొంత కాళీ స్థలాన్ని కొల్లూరు గ్రామ పంచాయతీ అధ్వర్యం లో ఇవ్వడం జరిగింది…ఈ రోజు శివాజీ మహరాజ్ జయంతి సందర్బంగా కాళీ స్థలంలో శివాజీ మహారాజ్ జెండాను ఎగురవేసి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు…ఈ కార్యక్రమములో మాజీ ఎంపీటీసీ రాజ్‌కుమార్, గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్, మాజీ వార్డు సభ్యులు ఎం విష్ణు గ్రామ పెద్దలు మంగలి మొగులయ్య, చింతలగట్టు మొగులయ్య, డప్పూరు రాములు, డప్పూరు బీరప్ప మరియు శివాజీ మహారాజ్ యువజన సంఘ అధ్యక్షులు మరియూ నాయకులు,సభ్యులు యువకులు పాల్గొని శివాజీయహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి పూజ చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
