చేర్యాల నేటిధాత్రి…
ఇంటర్ ఫలితాలలో చేర్యాలలోని శ్రీవిoద్య ఒకేషనల్ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విభాగంలో పన్యాల శైలజ ఎం పి హెచ్ డబ్ల్యు(ఎఫ్) లో 471/500 మార్కులు వచ్చాయని ఆయన అన్నారు. ప్రిన్సిపాల్ సత్య వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ శైలజకు చిన్నతనంలోనే పెళ్లి జరగడంతో పదవ తరగతి వరకే చదువుకొని పెళ్లి కారణంగా మధ్యలోనే చదువు ఆపేసింది. 10 సంవత్సరముల గ్యాబ్ తర్వాత ఆమె చదువుపై ఉన్న శ్రద్ధతో వారి భర్త సహకారంతో శ్రీ వింధ్య వోకేషనల్ కాలేజీ లో చేరడం జరిగిందని శైలజ ముందు నుండే ఎంతో చురుగ్గా ఉంటూ బాగా చదివేదని కళాశాల ప్రిన్సిపల్ అన్నారు.కాలేజీ విద్యార్థిని శైలజ మాట్లాడుతూ మా ఇంట్లో గొడవల కారణంగా నాకు చిన్నతనంలోనే పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి అయిన తర్వాత చదువుకోడానికి వీలు కాకుండా పోయింది పిల్లలు కూడా స్కూలుకు వెళుతూ ఉండటంతో నేను కూడా చదువుకోవాలని మా భర్తతో చెప్పడంతో అతను కూడా ఒప్పుకోవడంతో నేను శ్రీవిoద్య ఒకేషనల్ కాలేజీలో చేరాను. చదువు అనేది ఒక్కరి సొంతమే కాదు కానీ ఎంతో శ్రద్ధతో చదివితే కానీ మంచి మార్కులు రావన్నారు. ఈ రోజుల్లో ఫోన్లు, సినిమాలు, అంటూ విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపడం లేదు అని శైలజ అన్నారు. నేను కళాశాల ఫస్టు రావడం వల్ల నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు.