· స్పష్టంగా కనిపిస్తున్న ఆంధ్ర ప్రభావం
· రేవంత్ ద్వారా తెలంగాణలోకి ప్రవేశించాలనుకుంటున్న బాబు

· ఒక “అంతులేని వింతకథ”లా మారిన టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ
· అంతులేని భేతాళ ప్రశ్నలకు, విక్రమార్క సమాధానాలు

· ఇది రాజకీయ కక్షగా ప్రచారం జరిగే ప్రమాదం
· అదే జరిగితే కాంగ్రెస్‌కు నష్టం
· ఇప్పటికే బీఆరఎస్‌కు పెరుగుతున్న సానుకూలత
హైదరాబాద్, నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో క్రమానుగత మార్పులు చోటుచేసుకోవడం వర్తమాన పరిణామం. ఇందుకు ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మధ్య వున్న అత్యంత సన్నిహిత సంబం ధం. ఒకరకంగా చెప్పాలంటే ఇద్దరిదీ గురుశిష్యుల అనుబంధమన్న సంగతి రెండు తెలుగు రా ష్ట్రాల్లో ఎవరినడిగినా ఇట్టే చెప్పేస్తారు. అంతవరకు బాగానేవుంది. మొన్నటివరకు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా పాలన సాగించినంతకాలం ఆంధ్ర రాజకీయాల ప్రభావం తె లంగాణపై పడలేదు. ముఖ్యంగా కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డిల మధ్య సయోధ్య నెలకొన్నప్పటికీ ఎవరి పాలన వారు చేసుకున్నారు. పెద్దగా వివాదాలు వచ్చింది కూడా లేదు. కానీ ఇప్పుడు రేవంత్ పాలన వచ్చిన దగ్గరినుంచి తెలంగాణలో ఆంధ్ర రాజకీయం ముఖ్యంగా చంద్రబాబు ప్రభావం కొ{£్టచ్చినట్టు కనిపిస్తోంది. ఒక ఉద్యమకారుడిగా కేసీఆర్ కాంగ్రెస్ నాయకులపై వి రుచుకు పడటం చూశాం. ఇందుకు ప్రతిగా ఆయనపై ఎవరూ పెద్దగా స్పదించింది లేదు. కానీ ఇప్పుడు రేవంత్ కూడా అదేమాదిరి తిట్లపురాణం యదేచ్ఛగా వాడటం మొదలుపెట్టడంతో, ఇ ప్పుడు తెలంగాణలో గతంలోలేని “పరస్పర తిట్ల రాజకీయ సంస్కతి” మొదలైంది. ఇటువంటి సంస్కతి ఆంధ్రలో బాగా కనిపిస్తుంది.
ఇక అసలు విషయానికి వస్తే తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీడీపీ కానీ వైసీపీ కాని తెలంగాణ లో కోలుకోలేని స్థాయికి పడిపోయాయి. మొదట్లో చంద్రబాబు, టీఆరఎస్‌ను చీల్చే ప్రయత్నాల ను కేసీఆర్ సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాకుండా, రాష్ట్రంలో తెలుగుదేశం లేకుండా చేస్తాననిపట్టుపట్టి మరీ ఆపార్టీ మూలాలను పూర్తిగా దెబ్బతీశారు. విచిత్రమేమంటే ఆయన వచ్చిందీ తె లుగుదేశం నుంచే. అందువల్ల కేసీఆర్ అధికారంలో వున్నంతకాలం చంద్రబాబు కిమ్మనలేదు. ఇప్పుడు తన “శిష్యుడు” రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీని ఏదోవిధంగా పునరుద్ధరించుకోవడానికి ఇది అనుకూల సమయంగా ఆయన భావిస్తుండవ చ్చు. రేవంత్‌రెడ్డి కూడా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌లో చేరినవారు కావడం, ఆయన తెలుగు దేశంలో తన మూలాలను మరచిపోవకపోవడం కూడా చంద్రబాబుకు కలిసొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వచ్చే జీహెచఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టి పార్టీకి ఊపిరిపోయాలన్న తలంపుతో వున్నట్టు తెలుస్తోంది. ఆవిధంగా చంద్రబాబు`రేవంత్‌ల మధ్య వున్న సమన్వయం ప్రస్తుతం తెలంగాణ రాజకీయ దశ్యాన్ని మార్చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పడిన సరిహద్దులు ఇప్పుడు క్రమంగా చెరిగిపోతున్న దశ్యం ఆవిష్కతమవుతోంది. ముఖ్యంగా ఏ జలవివాదాలను చూపి తెలంగాణకు నష్టం వాటిల్లుతున్నదని కేసీఆర్ వాదించి, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారో, అంతటి కచ్చితత్వం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపించడంలేదు. కాంగ్రెస్ లో సీనియర్లలో రాష్ట్రవ్యాప్త ఛరిష్మా కొరవడటం, రేవంత్ వన్ మ్యాన్ షో వెరసి చంద్రబాబుకు సానుకూలతకు దోహదం చేస్తోంది. ఇప్పుడు చంద్రబాబు అనుకున్న విధంగా పార్టీ అభ్యర్థులను జీహెచఎంసీ ఎన్నికల్లో నిలబెడితే, కచ్చితంగా అది బీజేపీ, బీఆరఎస్ ఓట్లకు గండికొట్టడం ఖా యమన్న అంచనాలు మొదలయ్యాయి. అయితే ఇదే సమయంలో చంద్రబాబు`రేవంత్ ద్వయా న్ని గతంలో ఓటుకు నోటు కేసు వెన్నాడుతుండటం గమనార్హం.
తెలంగాణ ఉద్యమ కాలంనుంచి కూడా రెండు రాష్ట్రాల్లో సమైక్యవాదులున్నారు. ఉమ్మడి తెలుగు సంస్కతి, ఉమ్మడి అభివద్ధికే తమ మద్దతిచ్చేవారు ఇప్పటికీ వున్నారు. అటువంటి వారు చంద్ర బాబు యత్నాలకు కచ్చితంగా సానుకూలంగా వుంటారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంతో పోలిస్తే 2001 నుంచి కేసీఆర్ నేతత్వంలో సాగిన రెండో తెలంగాణ ఉద్యమం నాటికి, రెండు ప్రాంతాల మధ్య సాంస్కతిక, ఆర్థిక సంబంధాలతో పాటు, బంధుత్వాలు కూడా బాగా విస్తరిం చాయి. పెద్ద సంఖ్యలో ఆంధ్ర ప్రాంతం తెలుగువారు తెలంగాణలో సెటిలయ్యారు కూడా. ఫలి తంగా రెండు ప్రాంతాల సంస్కతులు విడదీయరాని రీతిలో కలిసిపోయాయి. కేసీఆర్ కూడా ఉద్యమ సమయంలో ఆంధ్రకు వ్యతిరేకంగా మాట్లాడినా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతం వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. ఉద్యమకాలంలో భయపడినా, తర్వాతి కాలంలో ఆంధ్ర ప్రాంత ప్రజలు హాయిగా ప్రశాంతంగా పూర్తి భద్రతా భావంతో మనుగడ సాగిస్తున్నారు. విచిత్ర మేమంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో, పనులకు ఇబ్బందులు పడిన ఆంధ్రప్రాంత వాసులు, తెలుగుదేశం నాయకుల పనులు తెలంగాణలో వేగంగా పూర్తికావడంతో కేసీఆర్‌పై అభిమానం పెంచుకున్నారు కూడా! ఉద్యమం నాటి ఉధతిని, ప్రతికూలతను తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కనుమరుగుచేసి, ఇక్కడి తెలుగువారందరినీ ఒక్కటిగా భావించి పాలన కొనసాగించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. లక్ష్య సాధన వరకు ఏం చేసినా, ఏం మాట్లాడినా, అనుకున్న గ మ్యం చేరిన తర్వాత అన్నీ మరచి సాధారణ పరిస్థితులు కల్పించి ఎవ్వరూ బాధపడని రీతిలో పాలన కొనసాగించిన గొప్పతనం కూడా కేసీఆర్‌కే దక్కుతుంది.
కేసీఆర్ ఇప్పుడు అధికారంలో లేరు కనుక, చంద్రబాబు రేవంత్ ద్వారా తెలంగాణలోకి అరంగేటట్రం చేయడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఇందుకు మొదటగా ఆయన చేసిన పని కాంగ్రెస్‌లో రేవంత్‌ను సుస్థిరం చేయడంలో భాగంగా ఇక్కడి తెలుగదేశం మీడియా రూపంలో అండగా నిలవడం. అయితే గత రెండేళ్ల కాలంలో ఈ అవకాశం రాలేదు. మొన్న సింగరేణి బ్లాక్‌ల టెండర్ల విషయంలో బయటపడ్డ విభేదాల్లో రేవంత్‌ను సుద్దపూసలా చిత్రీకరించేందుకు తెలుగుదేశం మీడియా శతధా ప్రయత్నించింది. ఇదే సమయంలో సీనియర్ మంత్రుల మధ్య విభేదాలు న్నాయని, పాపాల భైరవులు వాళ్లేనన్న ప్రచారాన్ని కూడా విజయవంతంగా చేశారు. రేవంత్, భట్టి విక్ర మార్కలు పైకి ఎటువంటి విభేదాలు లేవని ప్రకటిస్తున్నా పచ్చ మీడియా మాత్రం తన పాత్రను చాపకింద నీరులా పోషిస్తూనే వుంది. సందట్లో సడేమియా మాదిరిగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేపై వార్తలు రాసే సమయంలో కాళేశ్వరంను బాగా హైలైట్ చేసి, బీఆరఎస్‌పై వ్యతిరేక వార్తలు రాసాయి. ఇదే సమయంలో ఆర్థిక సర్వే పేర్కొన్న తెలంగాణ అభివద్ధి, సాగు విషయంలో సాధించిన విజయాలకు ఇవి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అంటే చిన్నగా బీఆరఎస్‌పై కూడా వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టినట్టు భావించాల్సి వుస్తున్నది. ఇంత చేస్తున్నా నిన్న ఢిల్లీలో జరిగిన జలమండలి సమావేశంలో పోలవరం`నల్లమల లింక్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రభు త్వం అజెండాగా చేర్పించలేక పోవడం గమనార్హం. ప్రత్యర్థి రాజకీయాలు బాగా తెలిసిన హరీష్, కేటీఆర్‌లు ఎప్పటికప్పుడు విరుచుకుపడు తుండటం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎటూ మెసలనీయకుండా చేస్తున్నారు.
చంద్రబాబు ఏదోవిధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కాళ్లూనుకునే దశకు తీసుకొస్తే బీఆరఎస్ దెబ్బతినడం ఖాయం. కానీ ఇప్పటికీ తెలంగాణ గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా వుంది. రేవంత్ కూడా ఈ సెంటిమెంట్‌ను కాదని ముందుకెళ్లడం కష్టం. అయితే హైదరాబాద్ పరిస్థితి వేరు. ఇక్కడ ఆంధ్రప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో వుండట మే కాదు, కొన్ని వార్డుల్లో గెలుపును నిర్దేశించే స్థాయిలో వుండటం చంద్రబాబుకు అనుకూలం. బీఆరఎస్ అధికారంలో వుండగా చంద్రబాబును హైదరాబాద్‌లో ప్రచారం చేయనీయకుండా కేసీఆర్ సమర్థవంతంగా నిరోధించగలిగారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు హైదరాబాద్‌ను తానే అభివద్ధి చేశానని, హైటెక్ ఈ స్థాయికి రావడానికి తానే కారణమని, ఫ్లెí ఓవర్ల నిర్మాణం అంతా తన పుణ్యమేనని గట్టిగా ప్రచారం చేసుకోవచ్చు. ప్రచార ీVAరు తో ప్రజల్లో మరో ఆలోచన లేకుండా చేసే సామర్థ్యమున్న పచ్చ మీడియా వుండనే వున్నది. అ యితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. హైటెక్ సిటీ, హైదరాబాద్ అభివద్ధికి కాంగ్రెస్ పునాది వేస్తే, చంద్రబాబు దాన్ని కొనసాగించారు, తర్వాత వైఎసఆర్ మరింత ముందుకు తీసుకెళ్లారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆరఎస్ ప్రత్యేక దష్టి పెట్టి మరీ అభివద్ధి చేసింది. హైదరాబాద్ అభివద్ధి వెనుక అందరి పాత్ర వున్నదన్న సంగతి మరువరాదు.
చంద్రబాబు, రేవంత్‌ల ఆలోచనలను పసిగట్టలేనంత అమాయకుడు కేసీఆర్ కాదు. ఇప్పటికే రేవంత్‌ను ఆంధ్రా ఏజెంట్‌గా, చంద్రబాబు శిష్యుడిగా, తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రకు తాక ట్టుపెట్టే వాడిగా కేటీఆర్, హరీష్‌లు ప్రచారం మొదలుపెట్టారు. ముఖ్యంగా నదీ జలాల విషయంలో వారు రేవంత్‌ను ఎటూ మెసలనీయడంలేదు. కష్ణా, గోదావరి జలాల విషయంలో ఏమాత్రం అటూ ఇటూ అయినా, కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయం. కేసీఆర్ రగిల్చిన నీళ్ల సెంటిమెంట్ తెలంగాణలో ఇంకా బలంగా వుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల బీడుగా వున్న పొలాలు సుక్షేత్రాలు గా మారిన నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు కేసీఆర్‌పై అభిమానాన్ని వదులుకో వడం కష్టం. నిజం చెప్పాలంటే సరిహద్దు ఆంధ్రప్రాంతంలో కూడా కేసీఆర్ పేరు చెప్పుకునే వారు ఎందరో వున్నారు. వారి భూముల రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెరగడమే అందుకు కారణం.
తాను అధికారంలో వున్నప్పుడు రేవంత్‌ను అరెస్ట్ చేయించి ఇబ్బందులకు గురిచేయడం కేసీఆర్ చేసిన ఘోర తప్పిదం. ఇది ఆయనకు సానుభూతి పెంచేందుకే దోహదం చేసింది. ఇప్పుడు రే వంత్ కూడా ఫోన్ ట్యాపింగ్‌ల పేరుతో, సిట్ విచారణంటూ “అంతులేని వింతకథ” మాదిరిగా ఎపిసోడ్లను నడపడం, ఎప్పటికీ ఎటూ తేల్చకపోవడం, ప్రజల్లో బీఆరఎస్ పట్ల సానుభూతిని పెంచక మానదు. గతంలో తనకు జరిగిన అనుభవమే, ఇప్పుడు కేసీఆర్‌కు పునరావతం కాగలదు. అందువల్ల కేసీఆర్ తప్పిదాన్ని, రేవంత్ మళ్లీ చేయకుండా వుంటేనే మంచిది. ప్రతీకారం దావానలం లాంటిది, అది నిరంతరం ప్రజ్వరిల్లుతూనే వుంటుంది తప్ప, చల్లారదు.
