*కేఎస్ఆర్ ట్రస్ట్, ఆర్ఎన్ఆర్ సేవాదళ్ వ్యవస్థాపకుడు
కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎన్ఆర్*
శాయంపేట నేటి ధాత్రి:
సేవా దృక్పథంతోనే సమాజంలో మార్పు తీసుకురావచ్చని కేఎస్ఆర్ ట్రస్ట్, ఆర్ఎన్ఆర్ సేవాదళ్ వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడుకే.వీ.రాంనర్సిహారెడ్డి(ఆర్ఎన్ఆర్) అభిప్రాయ పడ్డారు. ట్రస్ట్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం మండల కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా ఆర్ఎన్ఆర్ పాల్గొని, కేకు కట్ చేసి సం బురాలు చేసుకున్నారు.అనంతరం ఆర్ఎన్ఆర్ మాట్లాడుతూ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుపేదలకు అనేక రకాలైన సేవలు అందిస్తు న్నామని తెలిపారు. ట్రస్ట్ అవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం శుభపరిణా మన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అనే నినాదంతో ముందుకెళ్తునన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు మారపెల్లి కట్టయ్య, మారపెల్లి వరదరాజు, మారపెల్లి రాజేందర్, మాడిశెట్టి చిరంజీవి. సుదర్శన్, చిందం సాయి. మహేందర్ తదితరులు పాల్గొన్నారు.