
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో చంద్రశేఖర్ ఆజాద్ 93 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇతను పండిత్ సీతారాం తివారి అగారని దేవి పుణ్య దంపతులకు జన్మించాడు. తమ కుమారుడిని సంస్కృతంలో పెద్ద పండితున్ని చేయడానికి కాశీలో చదివించాలని పట్టుదల ఉండేది, కానీ ఆ పిల్లవాడికి చదువు పూర్తిగా అబ్బలేక .చదువుకోడానికి తల్లిదండ్రులు చేసిన ఒత్తిడిని భరించలేక తన పదమూడవ ఏట ఇల్లు వదిలి ముంబై పారిపోయాడు. ముంబైలో ఒక మురికివాడలో నివసిస్తూ బతకడానికి కూలి పని చేశాడు అనేక కష్టాలు ఎదురయ్యాయి అయినా ఇంటికి వెళ్లాలనిపించలేదు ఇంతటి కష్టాలకన్నా సంస్కృతం చదవడమే మేలనిపించింది రెండేళ్ల మురికివాడలో నికృష్టమైన జీవనం తర్వాత 1921 లోన వారణాసి వెళ్ళిపోయి అక్కడ సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు. అదే సమయంలో భారత స్వాతంత్రం కొరకు మహాత్మా గాంధీ చేస్తున్న సహాయానిరాకరోద్యమంతో దేశం యావత్తు అట్టుడికి పోతున్నది, అప్పుడే చంద్రశేఖర్ ఆజాద్ తాను కూడా భారత స్వాతంత్రం కొరకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు అతని వయసు 15 ఏళ్లు మాత్రమే ఉత్సాహంగా తన చదువుతున్న సంస్కృత పాఠశాల ముందే ధర్నా చేశాడు పోలీసులు వచ్చి పట్టుకెళ్ళి న్యాయస్థానంలో. నిలబెట్టారు న్యాయమూర్తి అడిగే ప్రశ్నలకు చంద్రశేఖర్ తలతిక్క సమాధానం చెప్పాడు నీ పేరు ఏంటి అని అడిగితే ఆజాద్ అని తండ్రి పేరు అడిగితే స్వాతంత్రం అని సమాధానం ఇచ్చాడు, మీ ఇల్లు ఎక్కడ అని అడిగితే జైలు అని తలదిక్క సమాధానం చెప్పాడు న్యాయమూర్తి అతనికి 15 రోజుల జైలు శిక్ష విధించాడు.శిక్షణ రద్దుచేసి 15 పోరాట దెబ్బలను శిక్షగా విధించాడు అతని ఒంటి మీద పడిన ప్రతి కోరడ దెబ్బ అతనికి తాను చేయవలసిన పనికి కర్తవ్య బోధ చేసింది ఆ విధంగా చంద్రశేఖర్ ఆజాద్ అయ్యాడు విప్లవకార్లంతా పోలీసుల చేతికి చిక్కారు ఒక చంద్రశేఖర్ ఆజాద్ తప్ప ఇతను ఆజ్ఞతవాసంలోకి వెళ్లిపోయాడు చంద్రశేఖర్ ఆజాద్ 1928 సెప్టెంబర్ లో భగత్ సింగ్ వారితో కలిసి హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించాడు వీరందరూ కలిసి లాలాలజపతిరాయ్ మరణానికి కారకుడు అయినా స్కాట్ అనే బ్రిటిష్ పోలీస్ అధికారిని చంపాలనుకున్నారు ఆ కుట్రలో భాగంగా పొరపాటున తమ గురిపెట్టిన వ్యక్తి స్కాట్ అనుకోని సాండర్స్ అనే పోలీసును కాల్చారు కాల్పుల తర్వాత పారిపోతున్న భగత్ సింగ్ రాజు గురు దేవ్ సింగ్ అనే వారిని పోలీసు వారు వెంబడించి పట్టుకోగలిగారు. ఆ ముగ్గురు పెనుగులాడుతున్న సమయంలో చంద్రశేఖర్ ఆజాద్ కు తమ మిత్రులను కాపాడుకోవడానికి పిస్తోల్ పేల్చక తప్పలేదు శత్రువుల చేతుల్లో చావను అంటూ చిన్ననాడు చేసిన శపథం నిజం చేస్తూ పిస్తోల్ తన కంథ పై గురిపెట్టి పేల్చుకున్నాడు ఆజాద్ పోరాడిన తీరు భారతదేశ విప్లవ చరిత్రకే వన్నెతెచ్చిన ఘటన భారతీయ యువత ముందు నిలిచిన ఒక మహోజ్వల ఉదాహరణ చివరికి 1931 ఫిబ్రవరి 27వ తారీఖున చనిపోయాడు కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య రంగారెడ్డి పల్లి వివేకానంద, కొండాపూర్ చెన్నయ్య, కొండాపూర్ రాం చంద్రయ్య, కొండాపూర్ శ్రీహరి, సల్కర్ పేట్ బుడుగు వెంకటయ్య,పగిడ్యాల్ కావలి అంజిలయ్య, పెద్దవార్వాల్ జోగు నర్సింలు, పెద్దవార్వాల్ జోగు నరేష్,చిట్లపల్లి చిన్న నర్సయ్య,చిట్లపల్లి పెద్ద చెన్నయ్య, కొప్పుల మాసయ్య,సంటెమ్ అంజిలయ్య,జంగంరెడ్డి పల్లి పాలమురి ఎల్లప్ప,తదితరులు పాల్గొన్నారు.