Full Support for BC Bandh: Chandragiri Shankar
బీసీ బందుకు సంపూర్ణ మద్దతు చంద్రగిరి శంకర్
ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్
భూపాలపల్లి నేటిధాత్రి
బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ కు ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక విమలక్క ,రైతు కూలీ సంఘం (ఆర్ సి ఎస్), ఏఐఎఫ్టియు లు
సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
ఈ సందర్భంగా
ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ మాట్లాడుతూ…
గడిచిన డెబ్బై ఎనిమిదేండ్ల భారత దేశ స్వాతంత్రంలో శోషిత జనసమూహానికి ఏమీ న్యాయం జరకపోగా ఇంకా పీడితులుగా మిగిలిపోయారనీ,కేంద్రంలోని భాజపా సర్కారు మొదటి నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంటూనే వస్తుందనీ,పాలక ప్రభుత్వాలు ప్రజల మధ్య అంతరాలను సృష్టిస్తూనే ఉన్నారనీ,దేశంలో భాజపా సర్కారు ఇప్పటికీ కుల గణన జరపకుండా న్యాయంగా దక్కవలసిన రిజర్వేషన్లను బీసీ,ఎస్ సి,ఎస్ స్టీ, మైనార్టీలకు అందకుండా చేస్తున్నదనీ,భాజపా సర్కారు కూలాల మధ్య చిచ్చుపెట్టడానికి ఈ డబ్లూ ఎస్ రిజర్వేషన్ అమలు చేసి బీసీలకు అన్యాయం చేసిందనీ,
ఏ పార్లమెంటరీ రాజకీయ పార్టీలైన గడిచిన డెబ్బై ఏళ్లుగా ఎన్నికల తంతులో ఇచ్చిన బూటకపు హామీలు ప్రజలని మభ్యపెట్టడానికేనని,అయితే తెలంగాణ రాష్ట్రంలో 2023 లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ లకు ఇచ్చిన హామీలో భాగంగా 42శాతం రిజర్వేషన్ లను ప్రవేశపెట్టిందనీ,దీని కోసం జీఓ 9 తీసుకొచ్చిందనీ,కేంద్రానికి ఆర్డినెన్సు కూడా పంపిందనీ,భాజపా సర్కారు ఫాసిస్టు పాలనలో బీసీలను అణచడం కోసం బీసీ ఆర్డినెన్సును అడ్డుకుందనీ,
తక్షణమే బీసీ ల 42 శాతం బిల్లును షెడ్యూల్డ్ 9 లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని, ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక డిమాండ్ చేస్తుందనీ,ఈ నెల 18 న జరిగే బంద్ కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చంద్రగిరి శంకర్ తెలిపారు.
