డిల్లీ సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్న వార్తలు.
-లోకేష్‌ను సిఎం. చేయడానికి ఇదే అదును అని అనుకుంటున్న చంద్రబాబు.
-అదే సమయంలో తాను ఉప ప్రధాని కావాలని అనుకుంటున్నట్లు సమాచారం.
-గతంలోనే రెండుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వదులుకున్న చంద్రబాబు.
-యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకభూమిక ఫోషించిన చంద్రబాబు.
-యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా దేశ రాజకీయాల్లో తొలిసారి చక్రం తిప్పిన చంద్రబాబు.
-అంతకు ముందు నేషనల్ ప్రంట్‌తో దేశ రాజకీయాల్లో కీలకమైన చంద్రబాబు.
-ఆ తర్వాత చంద్రబాబు నేతత్వంలోనే దేశంలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు.
-యునైటెడ్ ఫ్రంట్‌గా ఇద్దరు ప్రధానులను చేసిన చంద్రబాబు.
-ఆ సమయంలోనే చంద్రబాబును ప్రధాని కావాలని పట్టుబట్టిన జాతీయ నాయకులు.
-యునైటెట్ ఫ్రంట్ ద్వారా దేవేగౌడ, ఐకే గుజ్రాల్‌లను ప్రదానులను చేశారు.
-తర్వాత కాలంలో బిజేపితో జత కట్టి ఎన్డీయే ఏర్పాటులో కీలకభూమిక పోషించిన చంద్రబాబు.
-వాయ్పాయ్ ప్రధాని కావడానికి అన్ని పార్టీలను ఏకం చేసిన చంద్రబాబు.
-ఎన్టీయేకు సుధీర్ఘ కాలం పాటు కన్వీనర్‌గా కొనసాగిన చంద్రబాబు.
-తన నాయకత్వంలో నలుగురు ప్రధానులను చేసిన నాయకుడు చంద్రబాబు.
-గతంలో దేవేగౌడ, ఐకే గుజ్రాల్తోపాటు అటల్ బిహరీ వాజ్పాయ్ ప్రదానులయ్యారు.
-ప్రస్తుతం చంద్రబాబు మద్దతుతోనే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయ్యారు.
-ఒకసారి రాష్ట్రపతి నియామకంలోనూ చంద్రబాబు మాటే చెల్లుబాటు అయ్యింది.
-అబ్దుల్ కలాం రాష్ట్రపతి కావడంలో చంద్రబాబు రాజకీయమే గెలిచింది.
-రెండు సార్లు ప్రదాని అవకాశం వచ్చినా రాష్ట్రం కోసం వదులుకున్నారు.
-ఇప్ప్పుడైనా కేంద్రంలో పదవి తీసుకోవాలని అనుకుంటున్నారు.
-రాష్ట్రంలో లోకేష్, కేంద్రంలో చంద్రబాబు వుండాలనుకుంటున్నారు.
హైదరాబాద్, నేటిధాత్రి:
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ ఏపి. సిఎం. చంద్రబాబు నాయకుడిది ప్రత్యేక పాత్ర. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఆ వెంటనే మంత్రి అయ్యారు. తర్వాత కాలంలో ఎన్టీఆర్‌కు అల్లుడయ్యారు. ఎన్టీఆర్ తెలుగుదేశంలో ఆదిలోనే కీలక భూమిక పోషించారు. ఆ పార్టీలో చేరిన వెంటనే పార్టీకి ఏకంగా ప్రదాన కార్యదర్శి పదవి పొందారు. ఇలా అంచెలంచెలుగా అతి తక్కువ సమయంలోనే ఆయన ఉన్నత పదవులు అదిరోహించారు. యూనివర్సిటీ నుంచి నేరుగా రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చిన ఆ తరం నాయకుల్లో చంద్రబాబు నాయకుడు ఒకే ఒక్కరు. అలా రాజకీయాల్లో చేరారో లేదో మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు. ఆ మూడేళ్లకే మంత్రి కూడా అయ్యారు. అలా అప్పటి నుంచి ఓటమి ఎరుగని నాయకుడిగా రాజకీయాల్లో గెలుస్తూ వస్తున్నారు. రాజకీయాలను ఆనాటి నుంచి శాసిస్తూ వస్తున్నారు. తెలుగుదేశంలో చేరిన తర్వాత నాదేండ్ల బాస్కర్‌రావు వల్ల ఏర్పడిన ఉపద్రవాన్ని ఎంతో చాకచక్యంగా ఎదుర్కొని తన రాజకీయ చాణక్యాన్ని ఆనాడే చూపించిన నాయకుడు చంద్రబాబు. అలా ఎన్టీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయడంలో చంద్రబాబు పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో లేకుంటే ఆ పార్టీ పరిస్దితి మరోలా వుండేది. ఈపాటికి తెలుగుదేశం పార్టీ ఒకటి వచ్చిపోయింది అని చెప్ప్పుకోవాల్సి వచ్చేది. అలా కాకుండా తొలి రోజుల్లోనే కాపాడిన నాయకుడు చంద్రబాబు. అలా తెలుగుదేశానికి ఊపిరిపోసి, ఎన్టీఆర్‌ను రెండోసారి సిఎం. చేశారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కోసం ఆయన చేసిన కషి అంతా ఇంతా కాదు. ఆనాటి నుంచి పార్టీని కంటికి రెప్పలా కాపాకుడుకుంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి వందేళ్ల చరిత్రకు పునాదులు వేశారు. 1989లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అది కూడా చంద్రబాబు నాయుడిని రాజకీయంగా మరో మెట్టు ఎక్కించేందుకేనేమో అనిపించింది. అలా జాతీయ రాజకీయాల్లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా ఎన్టీఆర్ వున్నప్పటికీ రాజకీయమంతా చూసుకున్నది చంద్రబాబు మాత్రమే. అలా జాతీయ రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా దేశానికి పరిచయమైన నాయకుడు చంద్రబాబు. ఆ సమయంలో ఇద్దరు ప్రధానులను చేయడం జరిగింది. తర్వాత కాలంలో నేషనల్ ఫ్రంట్ శకం ముగిసింది. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్మమంత్రి అయిన తర్వాత ఏకంగా ఆయనే యునైటెడ్ ప్రంట్ ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. అయితే అదే సమయంలో జాతీయ నాయకులంతా కలిసి చంద్రబాబు నాయుడినే పిఎం. కావాలని కోరారు. కాని ఆయన సున్నితంగా ఆ సమయంలో తిరస్కరించారు. ఇంకా తాను తెలుగు ప్రజలకు ఎంతో సేవ చేయాల్సి వుందని చెప్పారు. అలా యునైటెడ్ ఫ్రంట్ తర్వాత కనుమరుగైంది. అయినా చంద్రబాబు ప్రభ మాత్రం తగ్గలేదు. 1999 ఎన్నికల్లో బిజేపితో జతకట్టి ఎన్డీయే కూటమి ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన ఎన్డీయేకు 2019 వరకు చంద్రబాబు కన్వీనర్‌గా వున్నారు. ఆ సమయంలో బిజేపితో విభేదించి పక్కకు జరిగారు. ఇప్ప్పుడు మళ్లీ ఎన్టీయే కూటమిలోనే కాదు కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పాత్రలో వున్నారు. ఇప్ప్పుడు చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి సరైన సమయం అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇలా మంత్రి లోకేష్‌ను ఏపి ముఖ్యమంత్రిని చేయడంతోపాటు, అలా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ఏపికి అవసరమైన నిదులను సమకూర్చుకునే అవకాశం వుంటుంది. లోకేష్‌కు చిన్న వయసులోనే జాతీయ రాజకీయాలను పూర్తిగా పరిచయం చేసినట్లౌవుంది. ఇప్పటికే ప్రధాని మోడీ దగ్గర నుంచి జాతీయ నాయకుల చేత శబాష్ అనిపించుకుంటున్న లోకేష్ తండ్రికి తగ్గ తనయుడుగా రాజకీయాలు, పాలనలలో ఆరి తేరేందుకు ఈ సమయం ఎంతో మేలు చేస్తుందని అనుకుంటున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వంలో చేరడంతోపాటు ఉప ప్రధాని పదవి తీసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి.
