మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా ధర్మారెడ్డి
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన కొనారి రఘువీరా రెడ్డి అనారోగ్యంతో మృతిచెందగా పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి వారి కుటంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. ఈ సందర్భంగా వారి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా గ్రామంలో కొద్దిరోజులక్రితం మరణించిన పోగు సారయ్య(భగవంతుడు) కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని కుటుంబసభ్యులకు భరోసానిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.