చల్లా ధర్మారెడ్డి ని మూడోసారి గెలిపించుకుంటాం

ఆరె కులస్థులమంతా మీవెంటే

చల్లా ధర్మారెడ్డి ని మూడోసారి గెలిపించుకుంటాం

నియోజకవర్గంలో మునుపెన్నడు చూడని అభివృద్ధి చూస్తున్నాం

పరకాల నేటిధాత్రి(టౌన్) గురువారం హనుమకొండ లోని వారి నివాసంలో చల్లా ధర్మారెడ్డి ని నీరుకుల్ల గ్రామానికి చెందిన 36 ఆరె కుల సంఘ కుటుంబాలు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిసి ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు ఇస్తున్నార‌ని, బి.ఆర్.ఎస్ ప్రభుత్వం వచ్చాకనే మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.వచ్చే ఎన్నికలలో బి.ఆర్.ఎస్ గుర్తు కారు,మా అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి అని సంఘం సభ్యులు తెలిపారు.మూడోసారి భారీ మెజారిటీతో చల్లా ధర్మారెడ్డి ని గెలిపించుకుంటామని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ తనకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన ఆరె కుల కుటుంబాలకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ అందిస్తానని హామీ ఇచ్చారు.వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపుకోసం అందరూ కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు.సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తొమ్మిదేండ్ల కాలంలోనే రాష్ట్రం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిని సాధించిందన్నారు.మరోసారి సీఎం కేసీఆర్ కి సంపూర్ణ మద్దతు తెలిపి రాష్ట్రంలో మరింత అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బలరాం,గ్రామశాఖ అధ్యక్షులు సాంబమూర్తి,కాకాని శ్రీధర్, అర్శం రాజేందర్,అర్షం మధుకర్,వంగటి వేణు,ఆరెకులస్థులు వాసరి సాంబరావు,లొల్లాటి రాజు,సురావు శ్రీనివాస్,నర్సింగ రావు,యుగేందర్,లొల్లాటి బాబురావు,వాసరి సాంబయ్య,బోరగాని బాలరాజు,నాగుర్ల రాజేశ్వర్ రావు,ఏసీకే రాజేశ్వర్ రావు,బాదరగాని మహేష్,బోరగాని కృష్ణ,సురావు నేతాజీ,బోరగాని రామోజీ,వరికెల సదయ్య,బదగాని రామారావు,బాధగానే నర్సింగరావు,వాసరి రాజేశ్వర రావు,బోరగాని రజినికాంత్,ఏసీకే అశోక్,గురజాల రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!