
కొల్చారం, ( మెదక్ )నేటిధాత్రి :-
మెదక్ జిల్లా మండల కేంద్రమైన కౌడిపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు గురుకుల విద్యా JAC పిలుపు మేరకు శనివారం TTREITA ఆధ్వర్యం లో చాక్ డౌన్, పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. ఉపాధ్యాయులు విధులకు హాజరై తరగతిగది బోధన, కార్యాలయ పనులను బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కింది డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.
* అద్దె భవనాలలో కొనసాగుతున్న గురుకులాలకు శాశ్వత భవనాలను సమకూర్చాలి
* అన్ని గురుకులాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
* 0 1 0 పద్ధు ద్వారా ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లించాలి
* గురుకులలో నిధుల లోటు తీర్చడానికై ఆర్థిక శాఖ ద్వారా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలి
* పెండింగ్ బిల్లులను సత్వరం విడుదల చేయాలి
* అశాస్త్రీయమైన కొత్త టైం టేబుల్ ఉపసంహరించుకుని 9 నుండి 4:30 వరకు గల పాత టైం టేబుల్ ను పునరుద్ధరించాలి
* నైట్ స్టే, హాలిడే డ్యూటీలు చేసిన టీచర్లకు సిసిఎల్ లేదా వీక్ ఆఫ్ ప్రకటించాలి
* ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలను ఒకే గొడుగు కిందకు చేర్చి కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి
* ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.
అనంతరం తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పాఠశాల ప్రిన్సిపల్ ద్వారా గురుకులం సెక్రటరీకి మెమొరండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, వైస్ ప్రిన్సిపల్ నరసింహ, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ భవాని తో పాటు ఇతర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.