బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ..
◆:- ఐలమ్మ ఆశయాల స్పూర్తితో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ కులఘణన :
◆:- ఝరసంఘం లో ఘనంగా ఐలమ్మ వర్ధంతి వేడుకలు.
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ తొలి భూపోరాట వీరవనిత, నిజాం రజాకార్ల అరాచకాలకు, నిరంకుశత్వానికి, బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ కాగడా చాకలి ఐలమ్మ …
బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఝరసంగం మండల కేంద్రంలో ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.ఈ సంధర్బంగా రజక సంఘం సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో చిట్యాల ఐలమ్మ పాత్ర వెలకట్టలేనిదన్నారు.బడుగు జీవుల అస్థిత్వాన్ని పరిరక్షించడానికి బందుకులు పట్టి సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. ఆమె స్పూర్తితో మనమంతా ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.ఆమె స్పూర్తితో సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి, రాజకీయ హక్కులు,ఉద్యోగ అవకాశాల కోసమే సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు గాను తెలంగాణ అసెంబ్లీలో రెండు బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదింపజేసింది అని అన్నారు, ఈ కార్యక్రమంలో శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్త మల్లికార్జున్ పాటిల్ ,నవాజ్ రెడ్డి తీన్మార్ మల్లన్న టీం జహీరాబాద్ నియోజక వర్గ ఇంచార్జి నర్సింలు,మరియు రజక సంఘం మండల అధ్యక్షులు లక్ష్మణ్,రజక సంఘం నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్,రజక విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాకలి శివకుమార్ , క్రిష్ణ,రాజు,మారుతి, పాండు,యాదగిరి, రాజు బోపనపల్లి,యువజన నాయకులు కొమారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.