చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి ఎమ్మెల్యే గండ్ర జిఎస్ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర విశేషమైనదని, ఆమె మహిళా చైతన్యం, శక్తికి ప్రతీక అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ 40వ వర్థంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మీ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం భూస్వాముల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి, బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి మార్గం చూపారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు. ఆమె ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ మాజీ కౌన్సిలర్ చిరుప అనిల్ ముంజల రవీందర్ తిరుపతి ఇర్ఫాన్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు