
కస్టమర్లే మా దేవుళ్ళు
బ్యాంకు చైర్మన్ ప్రతాప్ రెడ్డి,
ఇంటర్నెట్ సేవలు మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాము,
ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకులకు ధీటుగా మా బ్యాంకు పని చేస్తుంది.
గ్రామీణ బ్యాంకు పై అపోహలు వద్దు అన్ని రంగాల వారికి పనిచేస్తుంది
స్టేషన్ ఘనపూర్: (జనగాం) నేటిధాత్రి
జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సంబందించిన నూతన భవనంలో ఏపీజివిబి బ్యాంక్ ను ఎస్ ఎస్ కే హాస్పిటల్ పక్కకు పక్కన ఉన్న బ్యాంకును గ్రామపంచాయతీ మొదటి అంతస్తు లోకి తరలించిన సందర్భంగా సోమవారం రోజున ఏపీజీవీబీ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ 1983 లో ఈ స్టేషన్ ఘనపూర్ బ్రాంచ్ ని స్థాపించి 40 సంవత్సరాలు కావస్తుందని ఇప్పటివరకు 70 కోట్ల రూపాయల లావాదేవులు జరిగాయని రానున్న రెండు సంవత్సరాలలో 150 కోట్లుగా విస్తరించాలని వారన్నారు.
మంది ఈ బ్యాంకు మాత్రమే ఇస్తదని అభిప్రాయం వారిలో ఉండిపోయింది రైతులకే కాదు మిగతా బ్యాంకు లాగా మా బ్యాంకులో రకాల సేవలు అందిస్తున్నామని బ్యాంకులకు దీటుగా పనిచేస్తున్నామని మా బ్యాంకు లావాదేవీలలో మూడో స్థానంలో ఉందన్నారు. బ్యాంకులో ఇంటర్నెట్ సేవలు మొబైల్ బ్యాంకింగ్ ఫిక్స్ డిపాజిట్ లాంటి సేవలను కస్టమర్లకు అందిస్తున్నామని అన్నారు.
గ్రామీణ బ్యాంకులపై అపోహ వద్దు
చాలామంది ప్రజలలో అపోహ ఉంది రైతులకు క్రాప్ లోన్లు మహిళా పొదుపు సంఘాలు మాత్రమే ఈ బ్యాంకు నిర్వహిస్తుందని అపోహ ఉండిపోయింది కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రైవేట్ రంగ బ్యాంకులకు ఏమాత్రం తగ్గకుండా వాటికి అన్ని రంగాల లో ఉన్న ప్రజలకు మా బ్యాంకు పనిచేస్తుందని లోన్లు వాహనం కోరుకోవడానికి పాడి పరిశ్రమ పెట్టుకోవడానికి మార్ట్ గేజ్ లోన్లు కరెంట్ అకౌంట్స్ తీసుకునే విధంగా లిమిటేషన్ లేకుండా ఎన్ని డబ్బులు అయినా కూడా జమ చేసుకోవచ్చు తీసుకోవచ్చు అన్ని సదుపాయాలు కలిగించే విధంగా ఏపీజీవీబీ బ్యాంకు అని సదుపాయాలు కనిపిస్తూ పనిచేస్తుందనిన్నారు.
అపరిచితు ఫోన్ కాల్స్ తో కస్టమర్లు అప్రమత్తంగా ఉండండి
బ్యాంకు సిబ్బంది ఎప్పుడు ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని బ్యాంకు సిబ్బంది సేకరించారని ఎవరైనా ఫోన్ కాల్ లో ఆధార్ కార్డు పాన్ కార్డు వివరాలు అడుగుతే అలాంటి కాల్స్ విషయంలో కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు నుండి ఇలాంటి ఫోన్ కాల్స్ రావని ప్రజలకు సూచించారు.
బ్యాంకులో కల్పిస్తున్న ఇన్సూరెన్స్ ను ఉపయోగించుకోండి
కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష యోజన పథకం దీని ద్వారా ఒక కస్టమర్ సంవత్సరానికి కేవలం ఒక్క 20 రూ,, కట్టుకుంటే ప్రమాదవశాత్తు ఎక్కడైనా ఎప్పుడైనా ఆ వ్యక్తి మరణిస్తే మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయంగా రెండు లక్షల బీమా పడుతుంది. ప్రధానమంత్రి యోజన ఒక కస్టమర్ సంవత్సరానికి 430 రూపాయలు కట్టుకుంటే ప్రమాదవశాత్తుగా చనిపోయిన
సహజంగా మరణించిన కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. బ్యాంకు తరపున మరొక పాయింట్ అనేదాన్ని సంవత్సరానికి ₹1000 కట్టుకుంటే ఆ కుటుంబానికి 20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేయబడుతుంది ఇలాంటి వాటిని కస్టమర్లు కచ్చితంగా ఉపయోగించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ బ్యాంక్ మేనేజర్ పి సురేష్, పి సమత (రీజినల్ మేనేజర్ భువనగిరి బ్రాంచ్) స్థానిక సర్పంచ్ తాటికొండ సురేష్ ఎంపిటిసి గన్ను నరసింహులు ఎస్ఎం నాగేశ్వరరావు, కె ఎస్ నాయక్, సిబ్బంది శ్రీనివాస్, ఎస్కే శామ్యూల్, అనిత, ఫయాజ్, వివోలు, వీఏలు, బ్యాంకు మిత్రులు సభ్యులు బ్యాంకు కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.