చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
– చింతగట్టు గ్రామాభివృద్ధి అధ్యక్షుడు మల్లేశం
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని చింతగట్టు గ్రామ అభివృద్ధి అధ్యక్షుడు మల్లేశం అన్నారు. 55వ డివిజన్ పరిధిలోని చింతగట్టులో బాలవికాస ఆదర్శ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వేసవి క్రీడలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, దాతగా హాజరై వాలీబాల్ క్రీడలు ప్రారంభించారు. తాను పుట్టిన గ్రామంలోని విద్యార్థులకు తన సొంత ఖర్చుతో వాలీబాల్ , నెట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాంనర్సయ్య, పాపయ్య, ఆడెపు సుదర్శన్, శ్యామ్, బాలవికాస ప్రతినిధులు నద్దునూరి బాబురావు, రాజకొమురయ్య, వాలీబాల్ కోచ్ రాణప్రతాప్, శ్రావణ్, చింటూ, విద్యార్థులు పాల్గొన్నారు.