కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
తెలంగాణ తొలి దశ ఉద్యమంలో తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన త్యాగధనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు శుక్రవారం ఆయన జయంతి సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో కొండా లక్ష్మణ్ బాపూ జీ చిత్రపటానికి మాలవేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూతొలి, మలి దశ తెలంగాణ రాష్ట్ర పోరాటంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్యపాత్ర పోషించారని అన్నారు. ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్, మంత్రిగా వివిధ హోదాలలో బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమానికి పరితపించారని గుర్తు చేశారు. ఆయన జీవితం యువతకు ఆదర్శమని, ఆయన పోరాటాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవా లని అన్నారు.ఈ కాంగ్రెస్ కార్యక్రమంలో మండల నాయకులు మారపెల్లి రవీందర్ చిందంరవి దుబాసి కృష్ణమూర్తి ప్రపంచ రెడ్డి రాజేందర్ బాసని మార్కండే య, రవి, కట్టయ్య వీరన్న, చంద్రమౌళి,వల్ప దాసు రాము తదితరులు పాల్గొన్నారు.