
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు దయాకర్ ప్రొఫెసర్ జయశంకర్ యొక్క గొప్పతనాన్ని తెలంగాణ తీసుకురావడంలో వారి యొక్క పాత్రను వివరించారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు రమాదేవి, ఉమర్ అలీ, వినయ్ కుమార్, మంజుల, కవిత, జయ, రమేష్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.