స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్న ఆర్టీసి కార్మికులు,ఉద్యోగులు
నర్సంపేట,నేటిధాత్రి :
ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేసిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన బిల్లును శాశనసభ ఆమోదించడం పట్ల నర్సంపేట డిపో కార్మికులు,ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సోమవారం నర్సంపేట డిపో మేనేజర్ విజయమాధురికి స్వీట్లు తినిపించి ఆమె ద్వారం సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు.తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీనీ కలపాలని ఏండ్ల తరబడి చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పోరాటం సీఎం కేసీఆర్ తో సాధ్యం అయిందని తెలిపారు.ఆర్టీసి కార్మికు నాయకుడు కేతిడి అశోక్ రెడ్డి తెలిపారు.43 వేల ఆర్టీసి కుటుంబాల జీవితాలలో వెలుగు నింపే చారిత్రకమైన నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు.సీఎం కేసీఆర్ కు జీవితాంతం ఋణపడి ఉంటామని ఈ సందర్భంగా పలువురు ఆర్టీసి కార్మికులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిపో సూపరింటెండెంట్ రాజబాబు,కార్మికులు బొమ్మినేని మహేందర్ రెడ్డి, వేముల రవి, తోటకూరి వెంకటేశ్వర్లు, మహిపాల్ రెడ్డి, జీకే స్వామి, ఎస్.కె హైమద్ ,హరిప్రసాద్, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ వీరారెడ్డి, గ్యారేజ్ సిబ్బంది పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.