మహా ముత్తారం నేటి ధాత్రి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండల కేంద్రంలోని నేషనల్ సర్వీస్ డే సందర్భంగా. రైతులకు పార లీగల్ వాలంటీర్స్ లింగమల్ల రమాదేవి. పి అంజయ్య, పీక కిరణ్. మాట్లాడుతూ సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవ అందించడానికి చట్టాలు న్యాయ సంబంధిత విషయాలపై అవగాహన కల్పించేందుకు మరియు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలతోను నిర్వహించడానికి 11 అక్టోబర్ 1987లో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆక్టివ్ తీసుకురావడం జరిగింది. ఇది 1995 నవంబర్ 9న తేదీన అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి ఇదే రోజున ప్రతి ఏట జాతీయ న్యాయ సేవ దినోత్సవం జరుపుకుంటారు దీనిని జాతీయస్థాయిలో ప్యాట్రన్ చీప్ గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రస్థాయిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తారు జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయిలో లీగల్ సర్వీసెస్ అథారిటీలు పనిచేస్తాయని ఈ చట్టం ఉచిత న్యాయ సహాయం మరియు అవసరమైన వారికి సలహాలు మధ్యవర్తిత్వం మరియు సామరస్యం ద్వారా కేసులను పరిష్కరించడం జరుగుతుందని రైతులకు తెలియజేయడం జరిగింది.