
హసన్ పర్తి / నేటి ధాత్రి
హసన్ పర్తి 66 డివిజన్ లో వర్ధన్నపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే నాగరాజు ఆదేశాల మేరకు డివిజన్ అధ్యక్షులు కనపర్తి కిరణ్ ఆధ్వర్యంలో హసన్ పర్తి బస్టాండ్ ఆవరణలో ఏఐసీసీ ఉప అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర మొదలు పెట్టీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం అట్టడుగున ఉన్న కాంగ్రెస్ పార్టీని ఉవ్వెత్తున దూసుకొని రావడంలో రాహుల్ గాంధీ పాత్ర ఎనలేనిదని అన్నారు.
జోడో యాత్ర 2.0 మొదలు పెట్టి ఉత్తర భారతదేశం నుంచి మద్య భారతదేశం వరకు సున్నా నుంచి యూపి, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాలలో బీజేపీకి చుక్కలు చూపించిన రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కనపర్తి కిరణ్ మాజీ దేవస్థానం చైర్మన్ జన్ను రవీందర్ మాజీ సర్పంచ్ పుల్ల రవీందర్ మేకల ఆనంద్ డివిజన్ యూత్ అధ్యక్షులు తాళ్ల మధు జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గొర్రె కిరణ్ కుమార్ సోషల్ మీడియా మండల్ కో ఆర్డినేటర్ బిగుల్లా సురేష్ శీలం పెద్దిరాజు ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు పెద్దమ్మ రాము నరసింహులు మార్కెట్ డైరెక్టర్ వీసం సురేందర్ రెడ్డి కనపర్తి రాజు బిసి సెల్ అధ్యక్షులు సంతోష్ రమేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.