
కార్మిక వ్యతిరేకబిజెపి ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించండి.
టిఏజిఎస్.జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్.
మహా ముత్తారం నేటి ధాత్రి.
భారతీయ మజ్దూర్ సంగ్, భారత జనతా పార్టీ లకు తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ అన్నారు.
మహా ముత్తారం మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు, ముందుగా మినీ గూడ్స్ అసశేషయాన్ మండల అధ్యక్షులు లింగమల్ల సడవాలి రావు జెండా ఆవిష్కరించారు.
అనంతరం తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ మాట్లాడుతూ దేశంలో అధికారంలో కచ్చిన 10 సంవత్సరాల కాలం నుండి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్మిక హక్కులను బిజెపి పార్టీ కాలరాస్తుందని అన్నారు, అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, నాలుగు లేబర్ కోడలుగా మార్చి కార్మికులకు తీరని అన్యాయం చేసిందని అన్నారు. కనీసం సమ్మె చేసే హక్కు లేకుండా చేస్తుందన్నారు, కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం లేదని,కనీసం కార్మికుల శ్రమను గుర్తించడం గాని,కార్మికులను గోరవించడం లేదని అన్నారు. ఎంతోమంది కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మారిస్తేనే ఈ దే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.