
చందుర్తి, నేటిధాత్రి
చందుర్తి మండల కేంద్రంలో చిట్యాల ఐలమ్మ 128వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కోశాధికారి కొడగంటి గంగాధర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని తొలిదశ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వీర వనిత అని అప్పట్లో ఉన్నటువంటి వెట్టి చాకిరీ విధానాన్ని నిర్మూలించడం కోసం ఆమె ఎన్నో పోరాటాలు చేసిందని, తనకు తన కుటుంబానికి ఎన్ని కష్టాలు వచ్చినా భూమిలేని వారికి దొరల నుంచి జమీందారుల నుంచి భూమిని లాక్కొని పేదలకు పంచి ఇచ్చిందని ఆమె ఈ తరానికి ఎంతో ఆదర్శవంతురాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు రజక సంఘం మండల అధ్యక్షులు సుద్దాల నరసయ్య, ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్, కోశాధికారి కొడగంటి గంగాధర్ చందుర్తి రజక సంఘం యూత్ అధ్యక్షులు లింగంపల్లి రాములు టాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ సర్పంచ్ సిరికొండ శ్రీనివాస్ ఉపసర్పంచ్ చిర్రం తిరుపతి కో ఆప్షన్ నెంబర్ బత్తుల కమలాకర్ కుమ్మరి మల్లయ్య లింగంపల్లి కొండయ్య సుద్దాల రామచంద్రం లింగంపల్లి మహేష్ వెంకటి బాలయ్య శ్రీకాంత్ శ్రీనివాస్ మహేష్ మల్లయ్య దేవయ్య రాములు మల్లయ్య నేరెళ్ల అంజయ్య మార్పాక రాములు పొలాస ప్రమోద్ కొడగంటి రమేష్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు