భద్రాచలం లో
ముస్లింలకు పవిత్ర పండుగ అయిన రంజాన్ వేడుకలను భద్రాచలంలో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
భద్రాచలం నేటి ధాత్రి
ఉపవాస దినాల అనంతరం బుధవారం నాడు నెలవంక కనిపించగా గురువారం ముస్లిం కుటుంబాలు రంజాన్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించుకున్నారు. పట్టణంలోని ఏఎంసీ కాలనీలో ఉన్నటువంటి ఈద్గాలో వేలాదిమంది ముస్లింలు రంజాన్ ప్రార్థన నిర్వహించి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పట్టణంలోని పలు రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలపగా స్నేహితులకు ఆత్మీయులకు సేమియాలు పంచి వేడుకలు నిర్వహించారు. ఏం శిఖాలు ఈద్గా వద్దని నిర్వహించిన రంజాన్ ప్రార్థనలో పాల్గొన్న షేక్ షఫీ అబ్దుల్లా మునాఫ్ అజీమ్ లు మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రత్యేకంగా నిలిచే రంజాన్ పండుగను భారతదేశంలోనే కాక ప్రపంచ లోని అన్ని దేశాలలో ముస్లింలు సుఖ సంతోషాలతో నిర్వహించుకుంటున్నారని అన్నారు. రంజాన్ ఉపవాస నెల సందర్భంగా ఇఫ్తార్ విందులు ఇచ్చిన రాజకీయ ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా రంజాన్ తోఫా పేరుతో పేద ముస్లింలకు అండగా నిలిచిన ప్రముఖులకు వివిధ పార్టీల నాయకులకు ఈ సందర్భంగా వారు అభినందనలు తెలియజేశారు ఈ వేడుకలలో సలీం అక్బర్ ఆలీ పాషా మస్తా తదితర ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు