
భద్రాచలం నేటి ధాత్రి
దుమ్ముగూడెం మండలం నరసాపురం గ్రామంలో MRPS ముఖ్య కార్యకర్తల సమావేశం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొప్పుల తిరుపతి మాదిగ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింద. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MRPS జిల్లా సీనియర్ నాయకులు ఎం ఎస్ పి జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా పెరియర్, ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు మేకల లత లు పాల్గొని మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్న ఆదేశాల మేరకు జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ, గ్రామాన మాదిగ జాతి ఆత్మగౌరవ పతాకలను ఎగరేయాలని ఆయన అన్నారు. MRPS ఉద్యమం ఈ సమాజంలోని బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం ప్రభుత్వాలపై ఉద్యమాలు చేసి అనేక సంక్షేమ ఫలాలు ఆరోగ్యశ్రీ, వికలాంగులు,వృద్ధులు, వితంతువుల, పెన్షన్ పెంపు కోసం చేసిన ఉద్యమం, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి వ్యక్తికి సుమారు 6 కేజీల బియ్యం అందించడం కోసం, ప్రమోషన్లు రిజర్వేషన్లు ఉద్యమం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంలో చేసిన ఉద్యమం మరియు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అండగా అమరవీరుల కుటుంబానికి ఉద్యోగం, 10 లక్షల ఎక్స్గ్రేషియా మరియు వారికి ఇంటి స్థలం కోసం అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర మందకృష్ణ మాదిగ కి దక్కుతుందని ఆయన గుర్తు చేశారు.ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే కు గ్రామంలో 1994 జూలై 7న ప్రారంభమైన ఎమ్మార్పీఎస్ ఉద్యమం అంచలంచలుగా ఎదుగుతూ జాతి లక్ష్యంతో పాటు… ఈ సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీ పేద వర్గాల పక్షాన నిలబడి ఉద్యమం చేస్తున్న సంఘం కేవలం MRPS ఉద్యమానికి దక్కుతుందని ఆయన గుర్తు చేశారు. మూడు దశాబ్దాల ఎంఆర్పిఎస్ ఆవిర్భవ వేడుకలు పురస్కరించుకొని గ్రామ, గ్రామాన ఎమ్మార్పీ ఎస్ జెండాలు ఎత్తాలి. మాదిగ అమరవీరులను స్మరించుకుంటూ ఘనంగా సెల్యూట్ చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో… ఈ కార్యక్రమంలో ఎంఆర్పి మండల సీనియర్ నాయకులు కొప్పుల మల్లూరు మాదిగ, ఎంఎంఎస్ జిల్లా అధికార ప్రతినిధి తెల్ల సమ్మక్క, ఉపాధ్యక్షురాలు కొచ్చర్ల కుమార్, కార్యదర్శి కొప్పుల నాగమణి,కనుకు వెంకటరామయ్య మాదిగ, కనుకు ముత్తయ్య మాదిగ, కనుకు నాగేశ్వరావు మాదిగ,కనుకు వెంకటేశ్వర్లు మాదిగ ,కనుకు కృష్ణ మాదిగ, కనుకు సాంబశివరావు మాదిగ, కనుకు సుశీల మాదిగ,
కనుకు వెంకటమ్మ, సీతమ్మ, నరసమ్మ,తదితరులు పాల్గొన్నారు.
సామాజిక ఉద్యమాభివందనాలతో…
కొప్పుల తిరుపతి మాదిగ
జిల్లా సీనియర్ నాయకులు
దుమ్మగూడెం మండల ఇంచార్జ్