CC Road Works Launched in Ward 26
26వ వార్డులో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం
కౌన్సిలర్ మండల శ్రీదేవి శ్రీనివాస్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని 26వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని కౌన్సిలర్ మండల శ్రీదేవి శ్రీనివాస్ అన్నారు. రైతు బజార్ పక్కన కబేల నుంచి పాత సెంట్రల్ బ్యాంక్ మెయిన్ రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించినట్లు స్థానిక కౌన్సిలర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రోడ్డు పనులు నాణ్యతతో కూడిన విధంగా, ఎలాంటి లోపాలు లేకుండా చేపట్టాలని కాంట్రాక్టర్ ఏజెన్సీకి సూచించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో స్థానికులు కొమ్మ స్వరూప, గుండెబోయిన శివకోటి, దోర్నాల శ్రీధర్, నాడెం రామకృష్ణ, సంఘ రమేష్, పాశికంటి రాజు, లక్ష్మీనారాయణ, రామగిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
