ఎల్బీనగర్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు.

ఎల్బీనగర్ లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు.

మీడియాతో మంత్రి హరీశ్ రావు..

రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడు. కలిసి పని చేశాడు.
సహచరుడినీ కాపాడుకోవాలి అని వచ్చాము.

కష్టకాలంలో పార్టీ కోసం పని చేశాడు. ముక్కు సూటి తత్వం ఉన్న మనిషి.

రెండు సార్లు టికెట్ ఇచ్చాం. స్వల్ప మెజార్టీతో ఓడిపోతారు

11 మంది కార్పొరేటర్లు గెలిపించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు తోడ్పాటు అందించారు.

కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి టికెట్ ఆశించి భంగపడ్డారు.

రామ్మోహన్ గౌడ్ కు బిఆర్ఎస్ పార్టీ తగిన ప్రాధాన్యమిస్తుంది. ఆయన వెంట వచ్చే కార్యకర్తలకు తగిన అవకాశాలు ఉంటాయి.

పార్టీ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. అందుకు నేను బాధ్యత తీసుకుంటాను.

మన ఇంటి సమస్య మనం పరిష్కరించకుందాం.

కాంగ్రెస్ గెలిచేది లేదు. డబ్బాలో రాళ్ళు వేసి కొడుతున్నారు.

అన్ని సర్వేలు బి ఆర్ ఎస్ గెలుపు ఖాయం అంటున్నాయి.

హైకమాండ్ ఢిల్లీలో ఉండే పార్టీ కావాలా, గల్లీలో ప్రజల మధ్య ఉండే పార్టీ కావాలా ప్రజలు ఆలోచిస్తున్నారు.

బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపే మా లక్ష్యం..!

*బడే నాగజ్యోతక్క మహిళా శక్తి సైన్యం అనే స్వచ్ఛంద సమితి ఏర్పాటు.

*అధ్యక్షురాలుగా భూతం సుశీల

మంగపేట నేటిధాత్రి

మంగపేట మండలం రాజుపేట గ్రామంలో స్వచ్ఛందంగా బడే నాగజ్యోతిని గెలిపించడానికి, బడే నాగజ్యోతక్క మహిళా శక్తి సైన్యం అనే స్వచ్ఛంద సమితి ని భూతం సుశీల అధ్యక్షతన ఏర్పాటు చేసుకోవడం జరిగిందనీ. ఈ సందర్బంగా భూతం సుశీల మాట్లాడుతూ,మహిళలమైన
మేము ముందు అడుగు వేసి, మా మహిళ శక్తిని చాటి చేప్పుతామని , బడే నాగజ్యోతక్క గెలుపులో మా పాత్ర కీలకం గా ఉండబోతుందని తెలియజేశారు. బడే నాగ జ్యోతక్క ను గెలిపించుకుంటామని ముక్తకంఠంతో తెలియజేస్తున్నాము అని అన్నారు .పేదల బాధలు తెలిసిన నాయకురాలు, ప్రజాభివృద్ధి తన జీవిత ధ్యేయంగా ఆచరిస్తున్న ఆత్మీయురాలు, ఈ సమాజమే తమ కుటుంబం అని సమాజక్షేమం కోసం ప్రతిక్షణం ఆలోచించి శ్రమించే తత్వం ఉన్న బడే నాగ జ్యోతక్క అధికారంలోకి వస్తేనే మా జీవితాల్లో అభివృద్ధి వస్తుందని, అన్నారు. ఈ కార్యక్రమంలో బడే నాగజ్యోతక్క మహిళా శక్తి సైన్యం స్వచ్ఛంద సమితి సభ్యులు భూతం సుశీల, గూడపు పద్మ, మైపా రమణ, కర్రీ‌. కుమారి, మైప నాగమణి, కర్రీ. సరస్వతి, దార్ల రామక్క, కర్రి ముత్తమ్మ, రాణి, గంపల జయ, తదితరులు పాల్గొన్నారు.

పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన బెల్ట్ షాపులను నియంత్రించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్

పాలకుర్తి నేటిధాత్రి

పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో మధ్య మాఫియాను అరికట్టడంలో ఎక్సేంజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గ్రామాలలో పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్ విమర్శించారు. గురువారం పాలకుర్తి నియోజకవర్గం వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ స్మారక భవనంలో సిపిఎం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం మండల నాయకులు సోమసత్యం అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా రమేష్ పాల్గొని మాట్లాడుతూ వివిధ గ్రామాలలో వైన్ షాపు యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉండటం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని బెల్టు షాపు వాళ్లు అధిక ధరలకు మధ్యాన్ని అమ్ముతూ మద్యం ప్రియుల జేబులు గుల్లా చేస్తూనే మరోవైపు వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే వైన్ షాపు యజమానులు సిండికేట్ గా మారి బెల్ట్ షాపుల దందాను నడిపిస్తుంటే సంబంధిత ఎక్సేంజ్ అధికారులు పట్టించుకోవడం లేదని మద్యం ప్రియులు వాపోతున్నారు. బెల్టు షాపుల వల్ల గ్రామాలలో ఉదయం నుండి మొదలుకొని రాత్రి పగలు తేడా లేకుండా జోరుగా మద్యం అమ్మకాలు కొనసాగుడంతో బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పాడుతుందని ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామాలలో బెల్ట్ షాపులు వందల సంఖ్యలో వెలుస్తున్నాయని అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరగాలంటే గ్రామాలలో బెల్ట్ షాపులను నియంత్రించాలని ఇంత జరుగుతున్న ఎక్సేంజ్ అధికారులు చోద్యం చూస్తున్నారు కానీ షాపు యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. గ్రామాలలో పేదలు, కూలీలు, యువకులు లిక్కర్కు అలవాటు పడుతూ మద్యానికి బానిసై పనులకు సైతం వెళ్లకుండా నిత్యం మద్యం మత్తులోనే వారి జీవితం తెల్లారిపోతుందని, మద్యం మత్తులో కుటుంబ కలహాలు ఎక్కువై సంసారాలు బజార్న పడుతున్నాయని బెల్ట్ షాపుల వల్ల మహిళలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటే భయపడి పోతున్నారని ఇప్పటికైనా ఎక్స్చేంజ్ అధికారులు నిద్రమత్తు విడిచి బెల్ట్ షాపులను నియంత్రించాలని అధిక ధరలకు విక్రయిస్తున్న బెల్ట్ షాపుల యజమాన్యంపై చర్యలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య, నాయకులు ముసుకు ఇంద్రారెడ్డి, బెల్లి సంపత్, తదితరులు పాల్గొన్నారు.

మదర్ తెరిసా పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

 

మందమర్రి, నేటిధాత్రి:-

మందమర్రి పట్టణంలోని మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థిని, విద్యార్థులు. వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ముందస్తు బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఎన్జిఓ భువనేశ్వరి మాట్లాడుతూ, విద్యార్థినీ, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు, పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు భక్తిశ్రద్ధలతో దుర్గాదేవిని పూజిస్తూ, విద్యాబుద్ధులతో ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రార్థిస్తూ, బతుకమ్మ సంబరాలు ఆనంద ఉత్సాహాలతో పాఠశాల ఆవరణలో జరుపుకోవడం జరిగిందని అన్నారు. మన పూర్విక సాంప్రదాయాలను ఇలాగే కొనసాగించాలని తెలిపారు.

మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..!

 

ఊరువాడ ఒక్కచోట చేరి ఆడబిడ్డలు ఆనందంగా రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ స్వాగతం పలకగా…
మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..!

మహిళలు తమ కష్ట సుఖాలను పాటల ద్వారా చెప్పుతూ స్వాగతం పలకగా…
మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..!

మాయమ్మ నువ్వమ్మ మమ్మేలు మాయమ్మ
అంటూ వేడుకొనగా…
మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..!

బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ మహిళలు గాజుల సవ్వడితో స్వాగతం పలకగా…
మన ముందుకు వచ్చింది మన బతుకమ్మ..!

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన మన ‘బతుకమ్మ’ పండుగను తెలంగాణ ఆడబిడ్డలు అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ
ఎంగిలి పులా బతుకమ్మ శుభాకాంక్షలు.
శ్రీమతి మంజుల పత్తిపాటి కవయిత్రి
చరవాణి 9347042218

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు

 

భూపాలపల్లి నేటిధాత్రి

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు బీజేపీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని రావణ్ గా మార్ఫింగ్ ఫోటోలు చిత్రీకరించి, వివాదాస్పద అంశాలకు తెరలేపిన కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీ తీరును తీవ్రంగా ఖండిస్తూ జిల్లా కేంద్రంలో భూపాలపల్లి పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ అధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి నిరసన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అయిత ప్రకాశ్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి తీరును ఖండిస్తూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి అయిత ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ పై, వారి కుటుంబ సభ్యులపై అధికారాన్ని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలతో వారి ప్రతిష్ట దిగజార్చేందుకు బిజెపి చేస్తున్న కుటీల రాజకీయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బిజెపి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం దారుణమైన, హేయమైన చర్యగా అభివర్ణించారు భారత్ జోడోయాత్ర తర్వాత రాహుల్ గాంధీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక మతిభ్రమించి బిజెపి పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు ఇప్పటికైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు చల్లూరి మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర కొమురయ్య, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్,కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, చిట్యాల మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు మూల శంకర్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ నాయకులు పొనకంటి శ్రీనివాస్, కంచర్ల సదానందం, కాగితోజు రమణాచారి, అయిలవేణి రమేష్, పుల్ల మహేష్,ఖాసీం,యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బీర్తి పృద్వి,చుంచుల మహేష్, ఉస్మాన్,నోముల నారాయణ, మూత సహదేవ్, మట్టేవాడ సురేష్, అఖిల్,మురళి,సాగర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

బిఆర్ఎస్ పార్టీ లోకి నవాబుపేట బిఎస్పి,మాజీ మండల అధ్యక్షులు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం పోమాల గ్రామానికి చెందిన,
బిఎస్పి మాజీ మండల అధ్యక్షులు,పిడుగు సుధాకర్.తన సొంత గూటికి చేరుకున్నారు. మాజీమంత్రి వర్యులు& ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, గులాబీ కండువా కప్పి బి, ఆర్, ఎస్, పార్టీలో కీ ఆహ్వానించారు. గురువారం రోజు ఎంపీటీసీ ఊర్మిళాదేవి ఆధ్వర్యంలో మరియు బి, ఆర్, ఎస్, పారీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి, ఆధ్వర్యంలో పిడుగు సుధాకర్ చేరడం జరిగింది. పిడుగు సుధాకర్ మాట్లాడుతూ,గత తొమ్మిదేళ్లుగా సుస్థిర సుపరిపాలన అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీ లోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది అని, అన్నారు. బిఆర్ఎస్, పార్టీ బలపరిచిన.
లక్ష్మారెడ్డి ని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే గా గెలిపిద్దాం అని తెలిపారు.

భద్రాచలం మంత్రి కేటీఆర్ వస్తున్నందున సీఐటియు నాయకుల అక్రమ అరెస్టు

 

అంగన్వాడీ,ఆశా,మధ్యాహ్న భోజన కార్మికుల మానవహారం రాస్తా రోకో
ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్దం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
భద్రాచలానికి మంత్రి కేటీఆర్ వస్తున్నందున భద్రాచలం ఆఫీసు లో ఉన్న అంగన్వాడీ సీఐటీయూ నాయకులు జిలుకర పద్మ, ఎం బీ నర్సారెడ్డి,పాల్వంచలో సీఐటీయూ నేత దోడ్డా రవి కుమార్ లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి దుమ్ముగూడెం పోలీసు స్టేషన్ కు తరలించడానికి నిరసనగా గుండాల లో గత ఇరవై రోజులుగా అంగన్వాడీ లు, ఆశా వర్కర్లు 6రోజులుగా గత మూడు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు(సీఐటీయూ) ఎంఆర్ఓ, ఎంఈఓ ఆఫీసుల వద్ద గల సమ్మె శిబిరాలను ప్రదర్శనగా వచ్చి పీ హెచ్ సి సెంటర్ కూడలి వద్ద రాస్తా రోకో, మానవహారం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కే మరియ అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ జిల్లా నాయకులు వజ్జ సుశీల,పాయం సారమ్మ , ఎం డి నజ్మ లు మాట్లాడుతూ ప్రభుత్వం స్కీమ్ వర్కర్ల కు కనీస వేతనం ఇవ్వకపోగా సమ్మె లో ఉన్న కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యాహరిస్తున్నదని అన్నారు.ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని, లేనిచో సమ్మె తీవ్రం చేస్తామన్నారు.సీఐటీయూ నేతలు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో అంగన్వాడీలు కౌసల్యా,కళావతి,నీలిమ, వెంకటమ్మ,సరోజ, ఆశా లు అదిలక్ష్మి,వినోద,ఈశ్వరి,లక్ష్మీ,జయమ్మ,మధ్యాహ్న భోజన కార్మికులు పొంబాయిన లక్ష్మీ,నర్సమ్మ,చంద్రక్క,సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

డబ్బులు ఊరికే రావు!

https://epaper.netidhatri.com/

`గిట్టుబాటు కావాల్సిందే!

పెట్టుబడి రాబట్టాల్సిందే!!

`గాంధీ భవన్‌ కు వేసిన సున్నాలతో సహా ఖర్చు వసూలు చేసుకోవాల్సిందే?

`పిసిసి పదవే రేవంత్‌ రూ. 50 కోట్లకు కొనుక్కున్నాడని అప్పట్లో వెంకట రెడ్డి అన్నదే…

`ఆ ఖర్చు ఇలా జమచేసుకోవాల్సిందే!

`ఆయారాం…గయారాం!?

`కాంగ్రెస్‌ లో అంతా గందరగోళం!

 

`వచ్చే వాళ్లు ఎందుకు వస్తున్నారో క్లారిటీ లేదు?

` గెలుస్తామన్న నమ్మకం ఎంతుందో తెలియదు?

` కాంగ్రెస్‌ గాలి వుందో లేదో అర్థం కావడం లేదు?

` బిజేపి పని అయిపోయిందని, కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు?

`వచ్చే వాళ్లంతా గాలి వాటం నాయకులే?

`ఒకవేళ వచ్చిన వాళ్లు గెలిచినా, పార్టీ అధికారంలోకి రాకుంటే హాండ్‌ ఇవ్వరన్న గ్యారంటీ లేదు?

`మంచి మంచి నాయకులే కాంగ్రెస్‌ ను వీడారు?

`గర్‌ వాపసీ అని వచ్చే వాళ్లు మళ్ళీ గడప దాటరా?

`టిక్కెట్ల లొల్లి ఆగలేదు?

`టికెట్ల అమ్మకం గోల ఆగడం లేదు?

`కర్ణాటకలో బలమైన నేతలున్నారు…అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత తోడైంది.

`తెలంగాణ లో ప్రభుత్వ వ్యతిరేకత లేదు.

`కాంగ్రెస్‌ మీద ప్రజలకు సానుభూతి లేదు.

`తెలంగాణలో సీనియర్లున్నారు…బలమైన నాయకులు లేరు?

`వాళ్ల గెలుపుపై వాళ్లకే ఆశలు అంతంత మాత్రం.

`వాళ్లు నలుగురిని గెలిపించడం కష్టం.

`కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం గాలిలో దీపం!

హైదరబాద్‌,నేటిధాత్రి:

రాజకీయంలో కాంగ్రెస్‌ను ఎవరూ ఓడిరచాల్సిన పనిలేదని ఊరికే అనరు. తనను తాను బతికించుకోవాల్సిన తరుణమైనా సరే, మునిగిపోతున్నా సరే ఓడిరచుకునే విషయంలో వున్నంత పట్టుదల గెలుపులో చూపించుకోరు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ఆవిర్భావం వరకు రాజకీయంగా ఎదురులేని సమయంలో గెలుస్తూ వచ్చింది. కాని ఎప్పుడైతే దేశ రాజకీయాల్లో కొత్త రాజకీయ శక్తుల ఆవిర్భావంతో కాంగ్రెస్‌ చతికిల పడడం, లేవడం పరిపాటిగా మారినా, ఇకపై బతికి బట్టకుడుతుందా? లేదా? అన్నది అందరికీ అనుమానమే. అందుకే కాంగ్రెస్‌లో ఎవరు ఎప్పుడు నాయకులౌతారో? అన్నది తెలియకుండాపోయింది. ఎవరు కాంగ్రెస్‌ను కాపాడతారో? అన్న ఎదురుచూపులు మిగులుతున్నాయి. ఇదే అదునుగా కాంగ్రెస్‌ రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకున్న రేవంత్‌ రెడ్డి ఆడిరది ఆట పాడిరది పాటౌతుంది. రేవంత్‌కు రాజకీయం ఆట విడుపుగా మారితే, సీనియర్లకు రాజకీయ సంకటం మొదలైంది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లు ఆ మాత్రం మిగిలి వున్న కాంగ్రెస్‌ను రేవంత్‌ పూర్తిగా మింగేయడం ఖాయమని అందరూ చెబుతున్నమాటే. రేవంత్‌ చేరిన నాటి నుంచి అదే మాట చెబుతున్నారు. అదే బాటలో కాంగ్రెస్‌ సాగుతోంది. పాత కాపులు నిలబెట్టింది లేదు. కొత్త కాపు ఉద్దరిచ్చింది లేదు? అన్న సామెతలాగా కాంగ్రెస్‌ పరిసి ్ధతి మారిపోయింది. రేవంత్‌ను ముందు పెట్టి అధిష్టానం ఆట ఆడుతోంది. రేవంత్‌ను విమర్శిస్తూ సీనియర్లు గోల చేస్తున్నారు. ఇక్కడ దేనికీ సింక్‌ కావడం లేదు. అధిష్టానం రేవంత్‌ను ఎందుకు ఎందుకు అంత గడ్డిగా నమ్ముతుందన్నదానిపై ఎవరికీ సష్టత లేదు. సీనియర్ల మాట ఎందుకు కాదంటున్నారన్నదానిపై ఎక్కడా వివరణ లేదు. కాని పాము, ముంగీస ఆటలు సాగుతున్నాయి. ఎవరి బలం ఎంత అన్నది మాత్రం తెలియకుండాపోయినా రేవంత్‌ పెత్తనం మాత్రమే పైకి కనిపిస్తోంది. గత ఆరు నెలల కాలంగా రేవంత్‌రెడ్డి అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ షురూ చేసిండన్న సంగతి అందరికీ తెలుసు. ఒక్కొ నియోజకవర్గంలో ఒకరిద్దరికి పైగా అశావహులను లైన్లో పెట్టిండని తెలుసు. ఆనాడు మాత్రం ఏ సీనియర్‌ మాట్లాడలేదు. ఇప్పుడు టిక్కెట్లు అమ్ముకుంటుండు అన్న ప్రచారం సాగిస్తున్నారు. అంతే తమకంటే పరోక్షంగా రేవంత్‌ అతి బలవంతుడని ఒప్పుకున్నట్లౌతుందన్నది తెలుసుకోలేకపోతున్నారు.
రేవంత్‌ రెడ్డి ఎలా పిసిసి. అధ్యక్షుడు అయ్యారన్నదానిపై ఎవరి లెక్కలు వారికి వున్నాయి.
ఎందుకంటే స్వతాహాగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌వాది కాదు. పచ్చి కాంగ్రెస్‌ వ్యతిరేకి. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దగ్గర నుంచి రాష్ట్ర స్ధాయి నేతలను ఎవరినీ వదిలిపెట్టకుండా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నాయకుడు. అలాంటి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడమే ఆశ్చర్యకరమైన విషయం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరు అనేది నానుడే అయినా, తిట్టిన కాంగ్రెస్‌లో నాయకుడు కావడం వేరు. కాంగ్రెస్‌కే నాయకుడు కావడం వేరు. కాని రేవంత్‌రెడ్డి ఏకంగా పెద్ద కుర్చీ వేసుకొని కూర్చుకున్నాడు. రేవంత్‌ తిట్టిన తిట్లు విన్న నేతలు ఇప్పుడు ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. ఇదే రాజకీయం అంటే ఇంత వరకు బాగానే వుంది. ఇప్పుడు రేవంత్‌ టిక్కెట్టకు పెద్దఎత్తున డబ్బులు తీసుకుంటున్నాడని అంటున్న కాంగ్రెస్‌ నేతులు గతంలో రేవంత్‌ రెడ్డి కోట్లు పెట్టి పిసిసి. పదవి కొనుక్కున్నాడంటూ ఆరోపణలు చేశారు. అంటే కాంగ్రెస్‌లో పదవులు కావాలంటే అడిగినంత సమర్పించుకోవాల్సిందే అన్నది సీనియర్లే నేర్పినట్లైంది. కోమటి రెడ్డి వెంకటరెడ్డి గతంలో రేవంత్‌ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి పిసిసి. అధ్యక్షుడు అయ్యాడు అన్న మాటలు చెప్పిందే…తెలంగాణ ప్రజలు విన్నదే…ఇప్పుడు రేవంత్‌రెడ్డి టిక్కెట్టు అమ్ముకుంటున్నాడన్న మాట మాట్లాడే అర్హత వారికి వుందా? డబ్బులు ఊరికే ఎవరికీ రావు..ఆనాడు పెట్టిన డబ్బు రేవంత్‌ తిరిగి ఎలా సంపాదించుకోవాలన్నదానిపై లెక్కలుండవా? మిగతా నాయకుల డబ్బులు మాత్రమే , డబ్బులా? రేవంత్‌ పెట్టిన ఖర్చుకు లెక్కుండొద్దా? పదేళ్లు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్నా గాంధీ భవన్‌ బాగు చేసుకోలేకపోయారు? కొత్త గాంధీభవన్‌ కట్టుకోలేకపోయారు? కొన్నేళ్ల తర్వాత గాంధీభవన్‌ కు కొత్త కళ తెచ్చింది రేవంత్‌రెడ్డి కాదా? ఆయన పిసిసి. అధ్యక్షుడు అయ్యాకే కొత్త కొత్త రంగులు వేయలేదా? లోపల అంతా ముస్తాబు చేయలేదా? అందుకు రేవంత్‌కు ఖర్చు కాలేదా? అదంతా తిరిగి రాబట్టుకోవద్దా? గాంధీ భవన్‌కు వేసిన సున్నాల సొమ్ముతో సహా పెట్టిందంతా రాబట్టుకోవాల్సిందే….ఆ ఖర్చు జమా ఖర్చులో వేసుకోవాల్సిందే…కాదనే అధికారం..అర్హత ఎవరికీ లేదు. కాంగ్రెస్‌ చేసుకునే స్వయంకృతాపరధాంలో ఎప్పుడూ సెల్ప్‌ గోల్‌ చేసుకోవడం అలవాటే…
నిజంగా కాంగ్రెస్‌కు చిత్త శుద్ది వుంటే రేవంత్‌ను మించిన నాయకుడే కాంగ్రెస్‌లో దొరకలేదా?
అంటే ఔననే సమాధానం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ వస్తే నేనే సిఎం. అన్న నాయకులు అనేక మంది. ఇప్పటికీ ఒక వేళ పార్టీ అధికారంలోకి వస్తే నేనే సిఎం అంటూ ఇంకా కలలు కంటున్నవాళ్లు ఏం తక్కువ లేరు. కాని పార్టీని కాపాడుదాం..నిలబెడదాం…ముందుండి నడుద్దాం…పార్టీని రక్షించుకుందా…కష్టపడి అధికారంలోకి తీసుకొద్దామన్న ఆలోచన వున్న నాయకులు ఎంత మంది వున్నారు. తెలంగాణ రాగానే నాకు పిసిసి కావాలంటూ కోరి మరీ అధ్యక్షుడు అయిన పొన్నాల లక్ష్మయ్య ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీని నడపడం నావల్ల కాదని వదిలేశాడు. నేను వుండలేనంటూ పార్టీకి మొరపెట్టుకున్నాడు. ఆ తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిపిసి. అధ్యక్షుడయ్యాడు. కాని ఏం లాభం? అతి బలవంతంగా పిపిసి. అధ్యక్షుడిగా కొనసాగాడు. ఆఖరుకు ఇక నా వల్లకాదంటూ ఆయనకూడా కుర్చీ దిగిపోయాడు. ఆ తర్వాత పిసిసి. నాకే కావాలని కొట్లాడిన వారు లేరు. ఇస్తే తప్ప తీసుకోము అన్నట్లు మాట్లాడినవారే ఎక్కువ. సీనియర్లు బలంగా వుంటే రేవంత్‌ ఎందుకు పోటీకి వచ్చేవారు…పిసిసి. సీటు ఎలా సాధించేవారు? అయినా కాంగ్రెస్‌నాయకుల్లో ఐక్యత లేదు. రాదు…వస్తుందన్ననమ్మకం ఇప్పటికీ లేదు. సీనియర్లలలోనే తలోదారి నడిచేవారే ఎక్కువ. అందుకే రేవంత్‌రెడ్డిది ఆడిరది ఆట పాడిరది పాటగా మారింది. నిజానికి పొన్నాల లక్ష్మయ్య పిసిసి. అధ్యక్షుడుగా వున్న సమయంలో కాంగ్రెస్‌ అంతో ఇంతో బలంగా వున్నది. కాని పైకి ఎంతో వీక్‌గా కనిపించింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిసిసి. అధ్యక్షుడు వున్న సమయంలో కూడా కాంగ్రెస్‌ ఊపు మీదేవుంది. కాని లోన ఏదో వెలితిగా వుండేది. రేవంత్‌ రెడ్డి రాకతో ఎంతో జోష్‌ నిండిరది. లోన మాత్రం అంతా ఖాళీగానే వుంది. రేవంత్‌ పిసిసి. కాకముందు ఉప ఎన్నికల్లో కనీసం ఎంతో కొంత ప్రభావం చూపుతూ వచ్చింది కాంగ్రెస్‌. కాని రేవంత్‌ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఉప ఎన్నికలో కూడా కనీసం డిపాజిట్‌కూడా రాకుండాపోయాయి. ఇదీ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌కు పైకి పెంచినట్లు కనిపించినా, గ్రౌండ్‌కు దిగిజార్చిన గ్రాఫ్‌.
ఇదిలా వుంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌లో జోష్‌ నింపినట్లు చేసిన రేవంత్‌స్కెచ్‌ మాత్రం ఆయనకు కాసుల పంట పండిస్తోందని అంటున్నారు.
ఎందుకంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కర్నాటకలో బిజేపి మీద వ్యతిరేకతతో కాంగ్రెస్‌ గెలిస్తే, తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు ఊపు రావడం అంటేనే మమ్ములను చూసి ముంత ఒలకబోసుకోవడం…దాన్ని చూసి ఇతర పార్టీలనేతలు కాంగ్రెస్‌కు క్యూకట్టడం..అది రేవంత్‌రెడ్డికి అనుకూలంగా మారడం…ఒక రకంగా సీనియర్లు చెబుతున్నట్లు ఆదాయవనరుగా మారడం…! ఇంత వరకే రాజకీయం… ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడదు..కాంగ్రెస్‌ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది లేదు. రేవంత్‌ జేబులు నిండడం తప్ప మరోకటి లేదు…ఈ మాటలంటున్నది ఎవరో కాదు… సాక్ష్యాత్తు కాంగ్రెస్‌ నేతలు..కరిమింగిన వెలగపండు గదరా…రేవంత్‌ తీరు..అంటున్నారు సీనియర్లు…

లావాని పట్టాలకు పంట రుణాలు ఇవ్వని బ్యాంకు అధికారులు పై చర్యలు తీసుకోవాలి .

ప్రజాసంఘాల నాయకులు డిమాండ్.
మహా ముత్తారం నేటి ధాత్రి

మహా ముత్తారంలో పత్రికా విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ కాటారం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వివిధ బ్యాంకు అధికారులు లావని పట్టాలకు పంట రుణాలు ఇవ్వకపోవడం అనేది రైతులను అవమానపరచడమే రైతే దేశానికి వెన్నుముక అని చెప్పుకునేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పంట రుణాలు ఇచ్చే దగ్గర బ్యాంకు అధికారులు సవా లక్ష ఇబ్బందులకు గురిచేస్తూ లావని పట్టాలకు మేము మా పైనున్న అధికారులు ఇవ్వద్దని చెప్పారని రైతులకు చెప్పడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్క రైతుకు పంట రుణాలు ఇవ్వాలని పేపర్లో ప్రకటనలకు తప్ప కిందిస్థాయికచేవరకు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లావాని పట్టాదారునికి బ్యాంకు రుణాలు తక్షణమే ఇవ్వాలని సంబంధిత అటువంటి అధికారులను ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు లేనియెడల ఈ ప్రాంత రైతాంగం తోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు బెల్లంకొండ పోచయ్య పీక కిరణ్ ఇస్నం మహేందర్ అక్కల బాపు బొబ్బిలి రాజయ్య ఆషాడపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

నిమజ్జన మహోత్సవానికి సకల ఏర్పాట్లు

గ్రామ సర్పంచ్ కందగట్ల రవి శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా దేవుని చెరువును సందర్శించిన గ్రామ సర్పంచ్ కందగట్లరవి నిమజ్జనం కోసం దేవుని చెరువు కట్టమీద చెట్లను ఇరువైపులా తొలగించడం జరిగింది నిమజ్జనం సందర్భంగా ఎవరికి ఎలాంటి ఆపదలు కలుగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు శాయంపేట కార్యదర్శి రత్నాకర్, ఉప్పు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.వినాయక నిమజ్జనం కార్యక్రమం అందరూ సహకరించగలరని కోరడమైనది.

విధుల పట్ల అంకిత భావంతో పని చేయాలి

*నేరాల నియంత్రణకై విసిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి

*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్

వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం రోజున వేములవాడ డిఎస్పీ కార్యాలయం,వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ వేములవాడ డి.ఎస్.పి కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డ్స్ ను,సిడి ఫైల్స్ తనిఖీ చేసి ,సబ్ డిివిజనల్ పరిధిలో నమోదు అయిన కేసుల వివరాలు,ఎస్సీ ఎస్టీ, ఫోక్సో కేసుల, గ్రేవ్ కేసులలో,అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసుల వివరాల అడిగి తెలుసుకుని పలు సూచనలు చేసి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లలోఎక్కువగా నమోదవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం వార్షిక తనిఖీల్లో భాగంగా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు, రికార్డ్స్ , సీడీ ఫైల్స్ ను ఫంక్షన్ హాల్ వర్టికల్స్ అమలు తీరు,స్టేషన్ లో అమలవుతున్న 5s తీరును పరిశీలించి నమోదు అయిన కేసులల్లో ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఉండాలని కేసుల్లో శిక్షల శాతం పెంచాలని అధికారులకు సూచించారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.
అధికారులు, సిబ్బంది విధులల్లో అలసత్వం వహించకూడదని,పోలీసులు అంకితభావంతో విధులను నిర్వర్తించాలన్నారు,విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని గ్రామాల్లో తరచు పర్యటిస్తూ ప్రజలతో సస్సబంధాలు కలిగి ఉండాలని అన్నారు.నేరాల నియంత్రణకై పోలీస్ స్టేషన్ లో పెట్రోలింగ్,విజిబుల్ పోలీసింగ్ లు నిర్వహించాలన్నారు.
వివిధ ప్రాంతాల నుండి రాజన్న దర్శనికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్నారు.రానున్న ఎన్నికలు దృష్ట్యా సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండు ఎన్నికలకు సన్నద్ధం కావాలని అన్నారు.,పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత నేరస్తులు, సస్పెక్ట్ లు, రౌడీ షీటర్లపై నిఘాను ఉంచాలన్నారు. వేములవాడ సబ్ డివిసిన్ పరిధిలో సుమారు 823 గణేష్ విగ్రహాలు ఉన్నాయని వేములవాడ పట్టణ పరిధిలో 180 వరకు గణేష్ విగ్రహాల ఉన్నాయని,బుధవారం రోజున జరిగే
గణేష్ శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సిబ్బందికి కేటాయించిన గణేష్ మండపాలను సందర్శించి గణేష్ మండపాల నిర్వహకులతో మాట్లాడి బుధవారం రోజున మధ్యాన్నం 2 గంటల వరకు గణేష్ శోభయాత్ర మొదలై రాత్రి 12 గంటల లోపు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని,గణేష్ శోభయాత్రలో డి జె లకు అనుమతి లేదని,నిబంధనలకు విరుద్ధంగా డిజె లు వినియోగించే వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు.ఎస్పీ వెంట వేములవాడ డీఎస్పీ నాగేంద్రచరి, పట్టణ సి.ఐ కరుణాకర్, సి. ఐ లు కృష్ణకుమార్, కిరణ్, ఎస్.ఐ లు రమేష్, ప్రశాంత్, దిలీప్ సిబ్బంది ఉన్నారు.

గణపతి ఉత్సవాల సందర్భంగా పెన్నులు,నోట్ బుక్స్ పంపిణీ

నర్సంపేట టౌన్,నేటిధాత్రి :

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో పోచమ్మతల్లి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని మండపంలో స్థానిక కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ చిన్నారి విద్యార్థులకు నొటుబుక్స్ పెన్నులను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా కౌన్సిలర్ మాట్లాడుతూ సకల విద్యా మెదస్సు కలగడం కోసం గణపతి నవరాత్రుల సందర్భంగా కొలువుదీరిన వినాయకుని విగ్రహం వద్ద సరస్వతి గరక తులసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు విద్యార్థులు, తల్లిదండ్రులతో చేయించినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వేదపండితులు శ్రీమాన్ శ్రీ నిశాంత్ శర్మ, పోచమ్మ యూత్ అసోసియేషన్ సభ్యులు,వార్డు కమిటీ సభ్యులు,ప్రజలు పాల్గొన్నారు.

రాజకీయ ఉద్రిక్తతల మధ్య కెనడా వాణిజ్య మిషన్‌ను భారత్‌కు వాయిదా వేసింది

కెనడియన్ వాణిజ్య మంత్రి మేరీ ఎన్‌జి ప్రతినిధి శాంతి కోసెంటినో ప్రకారం, భారతదేశంలో కెనడియన్ వాణిజ్య మిషన్, వాస్తవానికి అక్టోబర్‌లో జరగాల్సి ఉంది, వాయిదా వేయబడింది. నిర్దిష్ట కారణాలను అందించకుండా, “ఈ సమయంలో, మేము రాబోయే వాణిజ్య మిషన్‌ను భారతదేశానికి వాయిదా వేస్తున్నాము” అని ప్రతినిధి పేర్కొన్నారు. ఏదేమైనా, అదే నెల ప్రారంభంలో, కెనడా భారతదేశంతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలను తాత్కాలికంగా నిలిపివేసింది.

న్యూఢిల్లీలో జరుగుతున్న G20 సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చర్చలు జరిపిన కొద్దిసేపటికే ఈ పరిణామం చోటు చేసుకుంది.

సెప్టెంబరు 10న వారి సంభాషణ సందర్భంగా, కెనడాలోని తీవ్రవాద మూలకాల కార్యకలాపాలు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని మరియు భారతీయ దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపిస్తున్నాయని, అదే సమయంలో అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజానికి కూడా బెదిరింపులకు గురిచేస్తున్నాయని పిఎం మోడీ ఢిల్లీ యొక్క తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీతో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రూడో, హింసను తిరస్కరిస్తూ, ద్వేషాన్ని ఎదుర్కొంటూ శాంతియుతంగా నిరసన తెలిపే స్వేచ్ఛను కాపాడేందుకు కెనడా నిబద్ధతను నొక్కి చెప్పారు. “కెనడా ఎల్లప్పుడూ భావప్రకటనా స్వేచ్ఛ, మనస్సాక్షి స్వేచ్ఛ మరియు శాంతియుత నిరసన స్వేచ్ఛను కాపాడుతుంది మరియు ఇది మాకు చాలా ముఖ్యమైనది” అని ఆయన పేర్కొన్నారు. మొత్తం కమ్యూనిటీకి లేదా మొత్తం కెనడాకు ప్రాతినిధ్యం వహించేలా కొంతమంది వ్యక్తుల చర్యలు తీసుకోకూడదనే విషయాన్ని ట్రూడో మరింత నొక్కిచెప్పారు.

అంతకుముందు జూన్‌లో ఇందిరా గాంధీ హత్యకు సంబంధించిన ఫ్లోట్‌తో కూడిన వీడియో సోషల్ మీడియాలో ప్రసారం చేయబడింది. ఈ ఫ్లోట్ బ్రాంప్టన్‌లో నిర్దిష్ట ఖలిస్తానీ ఎలిమెంట్స్ నిర్వహించిన కవాతులో భాగం. తదనంతరం, జూలైలో, కెనడాలో ఖలిస్థానీ అనుకూల గ్రూపుల పెరుగుతున్న కార్యకలాపాలకు ప్రతిస్పందనగా భారతదేశం కెనడా రాయబారిని పిలిపించి, డిమార్చ్ జారీ చేసింది.

వైరాఎమ్మెల్యే రాములు నాయక్ కు దళితుల స్మశాన వాటికకు 10 లక్షల నూతన సి.సి. రోడ్డు మంజూరి కొరకు

వినతి పత్రం అందించిన సింగరేణి సర్పంచ్ ఆదేర్ల స్రవంతి

కారేపల్లి నేటి ధాత్రి.

స్వాతంత్రం వచ్చి 76 ఏళ్ళు గడిచిన సింగరేణి గ్రామపంచాయతీలో కుల వ్యవస్థ అలాగే ఉన్నది సింగరేణి గ్రామపంచాయతీలోని దళితులు మాదిగ, మాల,కులాలతోపాటు ఉపకులాల కు సంబంధించిన దాదాపు సుమారు 400.ల కుటుంబాలు ఉన్న.సింగరేణిగ్రామపంచాయితి లో మా తాత. ముత్తాత.ల నుండి ఎవరైనా చనిపోతే గ్రామంలో ఉన్న స్మశాన వాటికలో ఖననం చేయడానికి ఊరు పెద్దలు అంగీకరించక పోనందున దళితుల కంటూ ఒక ప్రత్యేకమైన స్మశాన వాటికను ఆనాడే ఏర్పాటు చేసుకొని ఉన్న దానినే ఉపయోగిస్తున్నారు, కానీ మా స్మశాన వాటికకు వెళ్ళిందుకు కనీసం రహదారి కూడాలేక ముళ్లపోదలుగా మారిపోయింది శవాన్ని తీసుకెళ్లడానికి కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న దుస్థితి ఏర్పడిందని గ్రామపంచాయతీ ద్వారా మూడు నాలుగు సార్లు ముళ్ళ పొదలను తొలగించడం జరిగింది. అయినా గాని మరల రోడ్డుపై ముళ్లపోదలు దట్టంగా మొలుస్తూ ఉన్నాయి కావున మీరు మా యందు దయవుంచి 10,లక్షల రూపాయల తోటి నూతన సీ.సీ రోడ్డును మంజూరు చేయగలరని.అదేవిదంగ దళితుల శ్మశాన వాటిక కు కాంపోండ్ వాలు ఏర్పాటు చేయాలని సింగరేణి గ్రామపంచాయతీ సర్పంచ్ గాతమరిని కోరుతున్నాను.

కౌండిన్య యువసేన సంఘం నూతన కార్యవర్గం

బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామ కౌండిన్య యువజన సంఘం అధ్యక్షులుగా బత్తిని కమల్ గౌడ్, ఉపాధ్యక్షులుగా వుయ్యల అనిల్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా వుయ్యాల తిరుపతి గౌడ్, క్యాషియర్ గా చింతలకోటి మహేష్ గౌడ్, కార్యదర్శిగా చింతలకోటి పర్శరంగౌడ్, కార్యవర్గ సభ్యులు ఉయ్యాల శేఖర్,ఉయ్యాల బాలాజీ,ఉయ్యాల నవీన్, బండారి మహేందర్,చింతలకోటి మధు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నరు.నూతన కమిటీకి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ కాసారపు శ్రీధర్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు ఉయ్యాల రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు బండారి మహేందర్ గౌడ్, నాయకులు బత్తిని లసుమయ్య గౌడ్, ఉయ్యాల పరిషరాములు గౌడ్, నాగుల చంద్రయ్య,పుదరి వెంకటేశం,ఉయ్యాల లచ్చయ్య, బండారి శ్రీను,సంఘ సభ్యులు పాల్గొన్నారు.

మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని రూరల్ బిఆర్ఎస్ శ్రేణుల పిలుపు!

హనుమాజీపేట గ్రామంలో ప్రెస్ మీట్ నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

వేములవాడ రూరల్ నేటి దాత్రి

ఈ నెల 15వ తేదీ శుక్రవారం రోజున సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం సందర్భంగా ర్యాలీ, బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బుదవారం రోజు వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గొస్కుల రవి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహాక సమావేశం నిర్వహించారు.
ఇట్టి సమావేశంలో సెస్ డైరెక్టర్ ఆకుల దేవరజం, రూరల్ గ్రామాల సర్పంచ్లు బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు

J&K పూంచ్‌లోని నియంత్రణ రేఖ దగ్గర BSF జవాన్ అదృశ్యమయ్యాడు

బీహార్‌కు చెందిన కానిస్టేబుల్ శుక్రవారం బాలకోట్ సెక్టార్‌లోని భరణి ఫార్వర్డ్ పోస్ట్‌లో జనరల్ డ్యూటీలో ఉండగా అదృశ్యమైనట్లు వర్గాలు తెలిపాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ దగ్గర బిఎస్‌ఎఫ్ జవాన్ తన పోస్ట్ నుండి తప్పిపోయినట్లు అధికారులు శనివారం తెలిపారు.

బీహార్‌కు చెందిన కానిస్టేబుల్ బాలకోట్ సెక్టార్‌లోని భరణి ఫార్వర్డ్ పోస్ట్‌లో జనరల్ డ్యూటీలో ఉండగా శుక్రవారం అదృశ్యమయ్యాడని వారు తెలిపారు.

సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) దళాలు జవాన్ కోసం అన్వేషణ నిర్వహించాయని, ఆ తరువాత జావాను కనుగొనలేకపోయారని సంబంధిత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.

భారతదేశానికి హైటెక్ ఎగుమతి అడ్డంకులను తొలగించడానికి US హౌస్‌లో చట్టం ప్రవేశపెట్టబడింది

హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ ర్యాంకింగ్ సభ్యుడు, కాంగ్రెస్ సభ్యులు గ్రెగొరీ మీక్స్ మరియు హౌస్ ఇండియా కాకస్ వైస్ చైర్ ఆండీ బార్ శుక్రవారం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు.

ప్రెసిడెంట్ జో బిడెన్ న్యూఢిల్లీని సందర్శించినప్పుడు, ఇద్దరు శక్తివంతమైన చట్టసభ సభ్యులు యుఎస్ ప్రతినిధుల సభలో భారతదేశానికి హైటెక్ ఎగుమతి అడ్డంకులను తొలగించడానికి చట్టాన్ని ప్రవేశపెట్టారు, దేశానికి సున్నితమైన సాంకేతికతలను అనియంత్రిత ఎగుమతి చేయడానికి మరియు ద్వైపాక్షిక సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి.

హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ ర్యాంకింగ్ సభ్యుడు, కాంగ్రెస్ సభ్యులు గ్రెగొరీ మీక్స్ మరియు హౌస్ ఇండియా కాకస్ వైస్ చైర్ ఆండీ బార్ శుక్రవారం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు.

“భారతదేశానికి సాంకేతికత ఎగుమతుల చట్టం” భారతదేశానికి అధిక-పనితీరు గల కంప్యూటర్‌లు మరియు సంబంధిత పరికరాల విక్రయాన్ని సులభతరం చేయడం మరియు యునైటెడ్ స్టేట్స్-ఇండియా టెక్నాలజీ సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

“అధ్యక్షుడు బిడెన్ G-20 సమ్మిట్ కోసం భారతదేశాన్ని సందర్శించినందున, యునైటెడ్ స్టేట్స్ మరియు భారతదేశం మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి ‘భారతదేశానికి సాంకేతికత ఎగుమతుల చట్టం’ను ప్రవేశపెట్టడం మాకు సంతోషంగా ఉంది” అని ఇద్దరు చట్టసభ సభ్యులు సంయుక్త ప్రకటనలో తెలిపారు.

“ఈ బిల్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ లైసెన్స్ లేకుండా భారతదేశానికి డిజిటల్ కంప్యూటర్లు మరియు ఎలక్ట్రానిక్ అసెంబ్లీల వంటి US ఉత్పత్తుల విక్రయాలపై పరిమితులను తొలగిస్తుంది, తద్వారా US-భారతదేశం సాంకేతిక వాణిజ్యం, మా టెక్నాలజీ కంపెనీల మధ్య అనుసంధానం మరియు సప్లై చైన్ రెసిలెన్స్‌ను పెంపొందిస్తుంది. పరిశ్రమ,” వారు రాశారు.

“భారత్‌తో మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్న నేపథ్యంలో, ఈ శాసన మార్పు సాంకేతిక సహకారానికి నియంత్రణ అడ్డంకులను తగ్గిస్తుంది” అని మీక్స్ మరియు బార్ చెప్పారు.

భాగస్వామ్య భౌగోళిక రాజకీయ మరియు భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి భారతదేశంతో సాంకేతిక మరియు రక్షణ సహకారం చాలా కీలకమని కాంగ్రెస్ భావిస్తున్నట్లు బిల్లు పేర్కొంది.
అందువల్ల, జాతీయ భద్రతను పెంపొందించే మరియు వ్యూహాత్మక ప్రాధాన్యతలను అభివృద్ధి చేసే మార్గాల్లో భారతదేశంతో సాంకేతిక సహకారానికి నియంత్రణ అడ్డంకులను తగ్గించడం చాలా ముఖ్యం అని బిల్లు పేర్కొంది.

భారతదేశానికి అధిక-పనితీరు గల కంప్యూటర్‌లను ఎగుమతి చేయడానికి అధ్యక్షుడు బిడెన్ సౌలభ్యాన్ని అందించడం యునైటెడ్ స్టేట్స్-ఇండియా సాంకేతిక సహకారాన్ని బలపరుస్తుందని మరియు వ్యూహాత్మక భాగస్వామిగా భారతదేశానికి కాంగ్రెస్ నిబద్ధతను ప్రదర్శిస్తుందని బిల్లు పేర్కొంది.

అందువల్ల, కోడ్ ఆఫ్ ఫెడరల్ రెగ్యులేషన్స్ టైటిల్ 15లోని సెక్షన్ 740.7(డి)లోని ‘‘కంప్యూటర్ టైర్ 3’’ అర్హతగల దేశాల జాబితా నుంచి భారత్‌ను తొలగించడం ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని బిల్లు పేర్కొంది.

యునైటెడ్ స్టేట్స్ భారతదేశాన్ని US మేజర్ డిఫెన్స్ పార్ట్‌నర్‌గా నియమించిందని, వాణిజ్య శాఖచే నియంత్రించబడే విస్తృత శ్రేణి సైనిక మరియు ద్వంద్వ-వినియోగ వస్తువులకు ప్రాప్యతను కల్పిస్తుందని పేర్కొంటూ, వాణిజ్య శాఖ ద్వారా జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా నియంత్రించబడే అంశాల కోసం బిల్లు పేర్కొంది. , అణు, క్షిపణి లేదా రసాయన లేదా జీవసంబంధ కార్యకలాపాలకు వస్తువులు కానంత వరకు భారతదేశంలో లేదా భారత ప్రభుత్వంలో పౌర లేదా సైనిక అంతిమ ఉపయోగాల కోసం లైసెన్స్‌ల కోసం భారతదేశం ఆమోదం యొక్క సాధారణ విధానానికి లోబడి ఉంటుంది.

అయితే, ప్రస్తుతం, భారతదేశానికి నిర్దిష్ట నిర్దేశాలకు అనుగుణంగా అధిక-పనితీరు గల కంప్యూటర్‌లను ఎగుమతి చేయడానికి 1998 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ సెక్షన్ 1211 ప్రకారం యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం యొక్క అధికారం అవసరం.

మినహాయించబడిన కంప్యూటర్ టైర్ 3 అర్హత గల దేశ జాబితా నుండి భారతదేశాన్ని తొలగించడానికి లేదా తొలగించడానికి US అధ్యక్షుడికి అధికారం లేదు. ఒకసారి కాంగ్రెస్ ఆమోదించిన బిల్లు దానిని సులభతరం చేయడానికి సహాయపడుతుంది.

శుక్రవారం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు US అధ్యక్షుడు బిడెన్ న్యూఢిల్లీలో G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సమావేశమయ్యారు మరియు ద్వైపాక్షిక ప్రధాన రక్షణ భాగస్వామ్యాన్ని మరింత లోతుగా మరియు వైవిధ్యపరచడానికి ఇద్దరు నాయకులు ప్రతిజ్ఞ చేశారు.

లబ్ధదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

మహబూబాబాద్,నేటిధాత్రి:

సీఎం కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకురుస్తున్నదని
మహబూబాబాద్ శాసన సభ్యులు
బానోత్ శంకర్ నాయక్ అన్నారు.మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలో నేడు యాదవ్ కులస్తుల 36 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను అందజేశారు.గ్రామస్థులు ఎమ్మేల్యే శంకర్ నాయక్ కి భారీ ర్యాలితో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మేల్యే శంకర్ నాయక్ వారితో కలిసి నృత్యం చేసి అలరించారు.అనంతరం లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేసి వారితో మాట్లాడటం జరిగింది.గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 20 మంది ఎమ్మెల్యే శంకర్ నాయక్ సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.ఈ సంద్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ
సీఎం కెసిఆర్ ప్రతి పేద కుటుంబానికి సహాయ సహాకరలు అందిస్తూ అందరినీ అధుకుంటున్న గొప్ప సీఎం కెసిఆర్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో తెల్ల శ్రీను,అశోక్,పాష మరియు గ్రామస్థులు,పార్టీ కార్యకర్తలు యాదవ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version