
పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి
ధర్మసాగర్, నేటిధాత్రి: గర్భిణీలు, బాలింతలు, పిల్లలు మంచి పోషకాహార విలువలు కలిగిన ఆహార పదార్ధాలను తీసుకున్నప్పుడే మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారని సోమదేవరపల్లి సర్పంచ్ తోట మంజుల అన్నారు. శనివారం సోమదేవరపల్లి అంగన్వాడీ కేంద్రం-2 లో అక్షరాబ్యాసం, చేతుల పరిశుభ్రత, పోషకాహార ప్రదర్శనలు తదితర వాటిపై అవగాహన కార్యక్రమాన్నీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ తోట మంజుల హాజరై మాట్లాడుతూ మంచి పోషకాలు కలిగిన ఆహార పదార్ధాలను తీసుకున్నప్పుడే పూర్తి ఆరోగ్యం గా ఉండగలమని అన్నారు….