కాల్గరీ కెనడా లో ఘనంగా జరుపబడిన హిందూ హెరిటేజ్,గణపతి నవరాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు

కాల్గరీ కెనడాలో, శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ, శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం  ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవ వేడుకలు ఎంతో  ఘనంగా జరిగాయి .

 ఆలయ ధర్మకర్తలు శ్రీమతి లలిత ద్వివేదుల మరియు శైలేష్ భాగవతుల గారి ఆధ్వర్యంలో గణపతి ఊరేగింపు వేడుకలు కాల్గరీ నగర డౌన్ టౌన్ వీధులలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రాజ్‌కుమార్ శర్మ గారు మందిరంలో ప్రతిరోజు గణపతి అభిషేకము, అర్చన, గణపతి హోమము మరియు హారతులు విధిగా నిర్వహించారు. గణపతి నవరాత్రి మరియు ఊరేగింపు సంబరాలు ఘనంగా నిర్వహించుటకు చాలా మంది వాలంటీర్లు మరియు వ్యాపార యజమానులు తమ  ప్రత్యేక సహాయాన్ని అందించారు
నగర వీధుల్లో గణపతి ఊరేగింపు కోసం హెచ్&హెచ్ డెకర్స్, హేమ మరియు హర్షిణి ట్రక్ ను ఎంతో అందంగా అలంకరించారు. 
గణనాధుని యాత్రకు కాల్గరీ ఎమ్మెల్యే అయిన గౌరవనీయులైన పీటర్ సింగ్ గారు విచ్చేసారు, ఊరేగింపులో పాల్గొన్న భక్తులను, ప్రజలను ఉద్దేశించి కాల్గరీ నగరంలో ఇటువంటి దైవ  కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు శ్రీ అనఘా దత్త యజమాన్యం వారిని ప్రశంసించారు. మరిన్ని భారతీయ సంప్రదాయాన్ని చాటిచెప్పే ఇటువంటి కార్యక్రమలని, అల్బెర్టా ప్రావిన్స్ కల్చర్ డేస్ ను పురస్కరించుకుని భారతీయ శాస్త్రీయ కళలు మరియు నృత్య కచేరీలు, హిందూ వారసత్వ వేడుకలు జరుపుతున్నందుకు శ్రీమతి లలిత మరియు శైలేష్ ను ఎంతో అభినందించారు.
గణపతి ఉరేగింపును అర్చకులు శ్రీ రాజ్ కుమార్ గారు గణపతి తాళం, అర్చన, హారతి తో ప్రారంభించగా  భక్తులు “శ్రీ గణేష్ మహరాజ్ కి జై” అనే నినాదాలతో యాత్ర కొనసాగింది. లోహిత్, ఓం సాయి మరియు ఫణి భజనలతో, పాటలతో గణపతిని స్తుతించారు. 
కాల్గరీ సిటీ మునిసిపల్ హాల్ వద్ద మొదలైన గణపతి ఊరేగింపు షా మిలీనియం పార్క్ చేరుకునే వరకు సుమారు  ఐదు వందలకు   పైగా భక్తులు ఆనందంతో నాట్యం చేస్తూ  గణపతి నామ సంకీర్తన చేశారు.  ఉత్తర అమెరికా ఖండంలో ఇటువంటి వేడుకలు జరపడం కష్టమైనప్పటికీ శ్రీ అనఘా దత్తా సొసైటీ ఆఫ్ కాల్గరీ యాజమాన్యం మరియు  సభ్యులు ఎన్నో దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ, రానున్న భావితరాలకి భారత సంప్రదాయ పూల బాటలు వేస్తున్నారని అందరూ ప్రశంసించారు. ఊరేగింపు ముగిసిన తర్వాత గణపతికి హారతి ఇచ్చి భక్తులందరికి ప్రసాద వితరణ చేశారు. 
కెనడా లో హిందూ వారసత్వ వేడుకల్లో నిర్వహించిన వయోలిన్  కచేరీ లో కెనడాలో, యూఎస్ఏలో ఉన్న విద్వాంసులైన srimathi Aarathi shankar, Srimati Anjana Srinivasan వయోలిన్ వాయించగా , శ్రీ ఆదిత్య నారాయణ్ మృదంగం తో, శ్రీ రమణ ఇంద్ర కుమార్, ఘటం తో , శ్రీ రత్తన్ సిద్ధు, తంబురాలతో సహకరించారు. విద్వాంసుల అందరిని అనఘా దత్త సంఘం అధ్యక్షురాలు శ్రీమతి లలిత బహుమతులతో ఘనంగా సత్కరించారు. 
అక్టోబర్ మాసంలో రానున్న దేవి నవరాత్రి ఉత్సవాల కి శ్రీమతి లలిత, స్వచ్ఛంద సేవకులైన శోభన నాయర్, మాధవి చల్లా, మాధవి నిట్టల, కళైజ్ఞర్ సంతానం మరియు అర్చకులు రాజ్‌కుమార్ ఘనమైన సన్నహాలు జరుపుతున్నారు. శ్రీ అనఘా దత్త సంఘం వారు నిర్వహించు దేవి నవరాత్రి వేడుకలతో,  కొన్ని వేల మంది భక్త జన సమూహం తో  పూజలనందుకునే అనఘా అమ్మవారి వేడుకల వల్ల కెనడా లో కాల్గరీ నగరం “కాళి” గిరి గా మారుతుందని భక్తులు తమ సంతోషాన్ని  వ్యక్తపరిచారు.
శ్రీమతి లలిత గారు మరియు ఎన్నో వాలంటీర్లు రేయిం బవళ్ళు శ్రమించారు.  ఈ వేడుకల్లో షుమారు 800 మందికి పైగా పాల్గొని ఈ వేడుకలు జయప్రదంగా ముగిసింది.

తెలంగాణ స్వాభిమాన పతాక

https://epaper.netidhatri.com/

`స్వావలంబన అభిమాన గీతిక.

`తెలంగాణ ప్రగతి ఆత్మ గౌరవ ప్రతీక.

` కేంద్ర సాయం మీద ఆధారపడకుండా నిలిచిన వేధిక.

`విభజన హామీలు అమల కోసం ఎదురు చూడకుండా ఎదిగిన అభివృద్ధి నమూన.

` కేసిఆర్‌ నిరంతర శ్రమ..అహర్నిశలు పడిన తపన.

`ఇంత వేగవంతమైన అభివృద్ధి ఒక్క కేసిఆర్‌ తోనే సాధ్యమైంది.

`ఉమ్మడి పాలకులు పీల్చి పిప్పి చేశారు.

`పదేళ్లలో కేసిఆర్‌ నిలబెట్టి చూపించారు.

`తెలంగాణ బాగు పడడం గిట్టని వాళ్ల కళ్లు కుళ్లుకుంటున్నాయి.

`తెలంగాణను దోచుకోవాలని చూస్తున్నాయి.

`తెలంగాణకు మళ్ళీ పాత రోజులు తేవాలని చూస్తున్నాయి.

తెలంగాణ పోరాటి సాధించుకున్న ఆత్మ గౌరవ పతాక. స్వాభిమాన వీచిక. గుండె ధైర్యం నిండిన విజయ వేధిక. ఉద్యమమే నినాదమైన, తెలంగాణ పదమే వేదమైన కరదీపిక. దేశానికే వెలుగు రేఖ. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వావలంబన గీతిక. ఇంత గొప్పది నా తెలంగాణ. ఆ తెలంగాణ రావడానికి, నేడు బంగారు తెలంగాణ నిర్మాణం జరిగింది ఒక్కరితోనే. ఆ ఒక్కరే ముఖ్యమంత్రి కేసిఆర్‌. అసలు తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఆత్మాభిమాన ఉద్యమ బాట. తెలంగాణకు పోరాటం కొత్త కాదు. గెలవడం కొత్త కాదు. సమస్యలు కొత్త కాదు. వాటిని అధిగమించడం కొత్త కాదు. గెలిచి నిలబడిన చరిత్ర కొత్త కాదు. ఎప్పుడూ ఏదో ఒక చరిత్ర సృష్టించడమే తెలంగాణ గొప్పదనం. ప్రపంచ దేశాలకే పోరాట విలువలు నేర్పిన ఏకైక ప్రాంతం తెలంగాణ. నిజాం కాలంలో రైతంగా సాయధ పోరాటమైనా, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమమైనా వ్యవస్ధలకు పట్టుదలను రుచి చూపించిన నిఘంటువు నా తెలంగాణ. భూమికోసం , భుక్తి కోసం, బానిస సంకెళ్ల విముక్తికోసం పోరాటాలు ఎన్ని జరిపినా అలసిపోలేదు. అలాగే అభివృద్దిలోనూ ఆగిపోలేదు. పోరాటమైనా, ప్రగతి దారైనా ముందుకే. తెలంగాణ ఎవరి సహాకారం కోరదు. తెలంగాణ ఎవరి మీద ఆధారపడదు. ఇది నిరూపించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌.
తెలంగాణ రాక ముందు ఉద్యమ సమయంలో సీమాంధ్ర నేతలు ఎన్ని మాటలు అన్నారో విన్నాం.
తెలంగాణ వచ్చిన తర్వాత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత పదేళ్లుగా తెలంగాణ గురించి మాట్లాడుతున్న మాటలు వింటున్నాం. అయినా ఎక్కడా వెరవలేదు. ఆగిపోలేదు. అలసిపోలేదు. దేశంలో అన్ని రాష్ట్రాలను దాటకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏనాడో గుజరాత్‌ను వెనక్కి నెట్టేశాం. ఇదే బిజేపికి నచ్చని విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును బిజేపి సహకరించిందన్న మాట మినహా…2014 నుంచి తెలంగాణ కోసం కేంద్రం ఏ సహాయం చేయలేదన్నది తెలుసుకోవాలి. 2014 ఎన్నికల్లో సాక్ష్యాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి కొండ కింద ప్రధాని మోడీ మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని అన్నారు. ఆ తర్వాత ఆ మాటను అనేక మార్లు ఉటంకించారు. అవకాశం దొరికనప్పుడల్లా తెలంగాణ మీద విషం కక్కారు. తెలంగాణ ఏర్పాటు కావడం తనకు ఇష్టం లేదన్నంతగా పరక్ష వ్యాఖ్యలు చేశారు. 1998లో కాకినాడలో జరిగిన బిజేపి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ తీర్మాణం చేసి, ఉత్తరాధిన మూడు రాష్ట్రాలు ఇచ్చింది. కాని తెలంగాణను వదిలేసింది. నిజానికి బిజేపి ప్రభుత్వ హాయంలో ఇచ్చిన మూడు రాష్ట్రాలకన్నా ముందు నుంచి సాగుతున్న ఉద్యమం తెలంగాణది. 1956లోనే నాటి ప్రధాని నెహ్రూ తెలంగాణ ప్రజలు వద్దనుకున్న నాడు ప్రత్యేకమైపోవచ్చు. అని కూడా చెప్పారు. కాని ఆయన హయాంలో కుదరలేదు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఇవ్వలేదు. ఎవరూ ఇవ్వలేదు. ఆఖరకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ సారధ్యంలో సాగిన పద్నాలుగేళ్ల నిరంతర పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది. దీన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ జీర్ణించుకోవడం లేదు. గతంలో పాత పార్లమెంటులో పలుసార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపట్టారు. ఆఖరుకు ఇటీవల కొత్త పార్లమెంటు తొలి రోజున కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు సంతోషంగా లేరన్నారు. ఇదే ఒక ప్రధాని చేయాల్సిన వ్యాఖ్యలు. అయినా సరే తెలంగాణ ప్రజలు భరిస్తూనే వున్నారు.
ఇక తెలంగాణ ఇస్తే చిమ్మ చీకట్లౌతుందని సీమాంధ్ర నేతలు అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అసలు తెలంగాణ మనుగడే సాధ్యం కాదన్నారు. తెలంగాణ వస్తే ఇక అంధకారమే అంటూ కర్ర పట్టుకొని చీకట్లో నిలబడి కరంటు లెక్కలు చెప్పాడు. ఇప్పుడు ఆ కిరణ్‌కుమార్‌ రెడ్డే తెలంగాణ వెలుగులను చూస్తున్నారు. తెలంగాణ వస్తే కనీసం పెండిరగ్‌ ప్రాజెక్టులు కూడా పూర్తి చేసుకోలేరనాన్నరు. హైదరాబాద్‌లో మత కల్లోలాలు వస్తాయన్నారు. అసలు తెలంగాణ భూములు తొండలు గుడ్లు పెట్టడానికి కూడా పనికిరావన్నారు. ఇలా ఎవరికి ఇష్టమెచ్చినట్లు వాళ్లుమాట్లాడారు. తెలంగాణ పూర్వ చరిత్ర ఏమిటో తెలుసుకోకుండా ఎవరికి తోచించి వారు మాట్లాడారు. కాని తెలంగాణకు ఒక చరిత్ర వుంది. తొలి తెలుగు చరిత్ర మొదలైందే తెలంగాణలో…కరీంనగర్‌ జిల్లాలోని కోటి లింగాలలోనే తొలి శాతవాహన చరిత్రకు శ్రీకారం జరిగింది. ఆ తర్వాతే ధాన్య కటకానికి వెళ్లింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చరిత్రను కనుమరుగు చేశారు. అలా మొదలైన తెలంగాణ ప్రస్తానం కాకతీయ కాలంలో ఉచ్చదశకు చేరుకున్నది. సంపన్న ప్రాంతమై విలసిల్లింది. సుమారు 300 సంవత్సరాలకు పైగా సాగిన కాకతీయ చరిత్రలోనూ తెలంగాణది స్వర్ణయుగమే. ఆ తర్వాత మొగలులపాలనైనా, నిజాం పాలన దాకా తెలంగాణలో కరువు లేదు. ఎందుకంటే నిజం కాలంలో హైదరాబాద్‌ వజ్రాల వ్యాపారానికి పేరెన్నిక కగన్నది. లండన్‌ మహారాణికి అత్యంత విలువైన వజ్రాల హారాన్ని బహూకరించింది నిజాం రాజు. లండన్‌ వీధుల్లో తిరిగే రోల్స్‌ రాయిస్‌ కార్లతో హైదరాబాద్‌ వీధులు ఊడిపించిన చరిత్ర తెలంగాణది. అలాంటి తెలంగాణపై ఎవరు వ్యాఖ్యలు చేసినా వాళ్లే చరిత్ర హీనులయ్యారు.
అలాంటి తెలంగాణను తెచ్చింది కేసిఆర్‌. నిలబెట్టింది కేసిఆర్‌.
పదేళ్లలో తెలంగాణ ప్రగతి రాకెట్‌ కన్నా వేగంగా దూసుకెళ్లింది. అసలు తెలంగాణలో తాగు నీరే దొరకదు. ఇక సాగు నీటి సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. అలాంటి తెలంగాణలో కేంద్రం నుంచి రూపాయి సాయం లేకున్నా,ఎలాంటి సహాకారం లేకున్నా కాళేశ్వరం లాంటి అధ్భుతమైన ప్రాజెక్టును ఎవరూ ఊహించని రీతిలో నిర్మాణం జరిగింది. తెలంగాణ మొత్తం సస్యశ్యామం చేసేందుకు కారణమైంది. అసలు తెలంగాణ సాధించిన మూడేళ్లకే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే మాటలు కాదు. మంత్రి హరీష్‌రావు రాత్రింబవళ్లు పర్యవేక్షణ, ముఖ్యమంత్రి కేసిఆర్‌ పరిశీలన, అంకిత భావం వున్న తెలంగాణ ఇంజనీరింగ్‌ వ్యవస్ధ కలిసి సృష్టించిన భగీరధ నిర్మాణం కాళేశ్వరం. అదే సమయంలో నిర్మాణం మొదలైన పోలవరం అక్కడే ఆగిపోయింది. కాళేశ్వరం పూర్తి చేసుకున్న తర్వాత మొదలు పెట్టిన పాలమూరు..రంగారెడ్డి కూడా పూర్తియ్యింది. దాంతో తెలంగాణ మొత్తం నీటి గంగాలమైంది. వీటి నిర్మాణం సాగుతుండగానే తెలంగాణలోని నలభై ఆరు చెరువులకు పూర్వ వైభవం తేవడం జరిగింది. అనేక రిజర్వాయ్యర్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఎన్నేళ్ల కలగానో మిగిలిపోయిన మానేరు ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయి. ఖమ్మంలో సీతారామా లాంటి ప్రాజెక్టులు కూడా నీళ్లందిస్తున్నాయి. నీటి చుక్కకు కోసం కన్నీళ్లు కార్చిన తెలంగాణ కళ్లలో ఆనందభాష్పాలు చూస్తున్నామంటే అది కేసిఆర్‌. ఆయన సాగునీటి రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ఒక యజ్ఞంగా చేపట్టారు. తెలంగాణ మొత్తం నీరందించి, సస్యశ్యామలం చేశారు. ఇక కరంటు కష్టాలు తెలంగాణ తెచ్చిన మూడు నెలల్లో తీర్చాడు. రైతాంగానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరంటు ఇస్తున్నారు. హైదరాబాద్‌ను పెట్టుబడుల స్వర్గధామం చేశాడు. ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా చేశాడు. ఐటి రంగానికి కేరాఫ్‌ చేశాడు. పార్మా రంగంలో తెలంగాణను అగ్రగామి చేశాడు. హైదరాబాద్‌లో ట్రాపిక్‌ సమస్యకు పరిష్కారం చూపెట్టారు. ఈ పదేళ్ల కాలంలో 37 కొత్త ప్లైఓవర్లు నిర్మాణం చేశారు. కొత్త కొత్త నిర్మాణాలు చేసి, హైదరాబాద్‌ రూపు రేఖలు మార్చేశారు. కొత్త సెక్రటెరియేట్‌, ముప్పై మూడు జిల్లాల్లో కొత్త జిల్లా కలెక్టర్ల సముదాయ భవనాలు. అమర వీరుల స్మృతి వనం. 125 అడుగుల అంబెద్కర్‌ విగ్రహంతో కొత్త హైదరాబాద్‌ను ఆవిష్కరించారు. తెలంగాణను ఆరోగ్యవంతమైన రాష్ట్ర్రంగా తీర్చిదిద్దుతున్నారు. 33 జిల్లాల్లో కొత్తగా వైద్య విద్యాలయాలు ఏర్పాటుచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రం సహాకారం లేకుండా, పైసా సాయం లేకుండా నిలబడిరది తెలంగాణ. దాన్ని రూప శిల్పి ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఆయన పేరే ఒక బ్రాండ్‌. హైదరాబాద్‌ ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌. దటీజ్‌ తెలంగాణ…దిసీజ్‌ ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన. ఎనీ డౌట్‌!

నా చెరువు నాడు…నేడు!

https://epaper.netidhatri.com/

`గణేష్‌ నిమజ్జనాలకు కూడా నీళ్లుండేవి­ కాదు!

`గణేష్‌ నిమజ్జనాల కోసం తెలంగాణ నుంచి విజయవాడ వరకు వెళ్లాల్సివచ్చేది.

`తెలంగాణ పట్టణ పరిసరాల చెరువుల్లో చుక్క నీరుండేది కాదు.

`కాళేశ్వరం ఇసక ఎడారిని తలపించేది.

`సమ్మక్క జాతరలో జంపన్న వాగులో చుక్క నీరుండేది కాదు.

` కేవలం జాతర కోసం నీళ్లు వదిలే వారు.

`ఇప్పుడు నిరంతరం జంపన వాగులో నీటి ప్రవాహం.

`పుష్కరాలప్పుడు ఆంధ్రా వెళ్లాల్సిందే.

`ఇదీ ఆనాటి తెలంగాణ దుస్థితి.

`ఇప్పుడు ప్రతి పల్లె ఒక నీటి గంగాళం.

`ప్రతి చెరువులో నిరంతరం జలం.

`కుల వృత్తులకు ఆదాయ మార్గం.

`పొలాల గొంతు తడుపుతున్న గంగమ్మ ప్రతిరూపం.`

పాడిపంటలందిస్తున్న అష్టలక్ష్మి వైభవం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కళ తప్పిన నా తెలంగాణ చెరువుకు మళ్లీ జీవమొచ్చింది. చెదిరిన చెరువుకు జలజీవమొచ్చింది. చెరువు బాగైంది. అందమైన నీటి బాంఢగారమైంది. మా చెరువుకు పూర్వ వైభవం వచ్చింది. అంతకన్నా సుందరంగా ముస్తాబైంది. జలమంత చెవరుకు జగమంత పండగొచ్చింది. ఊరంతా మురిసింది. ఊరే మెరిసింది. సంబరాలు చేసుకున్నది. కూలి పోయిన కులవృత్తులకు మళ్లీ తెలంగాణ పల్లె ఆలవాలమైంది. చెరువే తెలంగాణ పల్లెకు ఆదెరువు. అది ఉమ్మడి రాష్ట్రంలో చెదిరిపోయింది. చిద్రమైపోయింది. పల్లె బతుకు ఆగమైంది. కులవృత్తులు అంతరించిపోయాయి. మత్స సంపద కానరాకుండాపోయింది. దాని మీద ఆధారపడే మురిరాజ్‌లు నారాజైండ్రు. కొత్త ఉపాధి బాటనెంచుకున్నారు. ఊరు వదిలి పట్టణాలు వలస వెళ్లిండ్రు. బొంబాయి లాంటి ప్రాంతాలలో కూలి పనులు చేసుకున్నారు. తెలంగాణలో మత్స సొసైటీలన్నవి కనుమరుయ్యాయి. చెరువే లేక ముదిరాజ్‌ల జీవనమే ఆగమైంది. ఇలా చెరువు ఎండిపోయి సాగు లేకుండాపోయింది. చెరువులో నీరు లేక పశు సంపద మృగ్యమైంది. మొత్తంగా పల్లెకు గ్రహణం పట్టినంత పనైంది. తెలంగాణ వచ్చింది. తెలంగాణ పల్లెకు మళ్లీ సొగసొచ్చింది. చెరువుకు సోయగమొచ్చింది. తెలంగాణ రాగానే చెరువుకు నీరొచ్చింది. వానా కాలం కాకపోయినా చెరువు నిండిరది. ఏళ్ల తరబడి గొంతెండి పోయిన చెరువు దాహంతీరేదాకా నిండిరది. చెరువు నింపడంతో ఊరంతా పచ్చబడిరది. భూగర్భమంతా నీరు సందడి చేస్తోంది. పల్లెకు పండగొచ్చింది. మళ్లీ సాగు చిగురించింది. ఎండిన బీడులు పొలాలయ్యాయి. గుంట కూడా వదిలిపెట్టకుండా పంట పండుతోంది. ఊరిని సుసంపన్నం చేస్తోంది. చెరువు కుల వృత్తులకు ఆధారమైంది. ఆదాయం సమకూర్చుతోంది. పల్లె జీవితాలను నిలబెట్టింది. ఇదీ తెలంగాణ చెరువుల ఘనత. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణకు అందించిన కలల పంట.
ఒకనాడు నా చెరువులో నీటి చుక్క లేక కొన్ని దశాబ్దాలు ఎండిపోయింది. కాదు..నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఒట్టిపోయింది.
వర్షాకాలంలో కూడా చెరువులోకి నీరు రాకుండాపోయింది. ఓ వైపు కరువు. మరో వైపు పాలకుల దుర్మార్గం. ప్రకృతి పగబట్టినట్లే కొన్ని దశాబ్దాల పాటు తెలంగాణను చినుకు ముద్దాకుండా శాపానికి గురైంది. ఉమ్మడి పాలకుల కోపానికి గురైంది. దాంతో తెలంగాణ చెరువు పూర్తిగా ఎండిపోయింది. తన ఆనవాలు తానేమర్చిపోయింది. ఒక దశలో గణేష్‌ నిమజ్జన సమయంలో విగ్రహాల నిమజ్జనానికి కూడా చుక్క నీరు లేక తెలంగాణ గోసపడిరది. అయ్యో గణనాధా? అంటూ బోరున విలపించింది. భక్తిభావంతో నిలుపుకొని కొలిచిన దేవుడిని నీరు లేని చెరువులో నిమజ్జనం చేయలేక, కొన్ని సార్లు విజయవాడ లాంటి ప్రాంతాలకు కూడా తీసుకెళ్లిన సందర్భాలున్నాయి. ఇక తెలంగాణ పల్లెల్లో కూడా ఎక్కడ ఏ చెరువులో నీరుందో తెలుసుకొని ఎంత దూరమైనా వెళ్లి నిమజ్జనం చేసిన ఘటనలున్నాయి. ఇదీ ఆనాడు తెలంగాణ దీనస్దితి. ఇక తెలంగాణలో ఎంతో గొప్పగా జరుపుకునే ఆది వాసి సమ్మక్క సారక్క జాతర. రెండేళ్లకోసారి ఎంతో వైభవంగా తెలంగాణలోని ములుగు జిల్లాలో ఈ జాతర జరుగుతుంది. తలాపున గోదారి పరుగులుపెడుతుంది. కాని సమ్మక్క సారక్క జాతర ప్రాంతంలో జంపన్న వాగు ఎప్పుడూ ఎండిపోయి వుండేది. జాతర సమయంలో జంపన్న వాగులోకి గోదావరి నదీ జలాలు వదిలేవారు. ఆసియాలోనే అత్యంత గొప్ప జాతరగా గుర్తింపు వున్న మేడారం జాతరలో నీటి కట కట అలా వుండేది. కనీసం భక్తులు స్నానాలు చేసేందుకు కూడా నీరు సమృద్దిగా వుండేది కాదు. మరి ఇప్పుడు నిరంతరం జంపన్న వాగు జీవ నదిలా పారుతోంది. మేడారం వచ్చిన భక్తుల పాపాలను కడిగేస్తూ నిరంతరం సాగిపోతోంది. ఇదీ నా తెలంగాణ. ఇక పుష్కరాల సమయం అంటే చాలు ఆంధ్రాకు పండగ. తెలంగాణలో కూడా కృష్ణా, గోదారి నదులు పారుతున్నా వాటిలో స్నానం చేసేందుకు కూడా ఉమ్మడి పాలకులు అవకాశం కల్పించేవారు కాదు. అసలు తెలంగాణలో పారుతూవున్న గోదారి నీళ్లకన్నా, రాజమండ్రి వెళ్తేనే పుణ్యం అన్నంతగా ప్రచారం చేసేవారు. కృష్ణా నది పుష్కరాల సమయంలో విజయవాడలో స్నానం చేస్తేనే పుణ్య స్నానం పూర్తయినట్లు చెప్పేవారు. దాంతో తెలంగాణలో ఆ నదులున్నా, ఆ ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారు. నీటి గోసకు, నిర్లక్ష్యానికి తెలంగాణను కేరాఫ్‌ అడ్రస్‌ చేశారు. తెలంగాణ ప్రజలు ఆగమౌతుంటే నవ్వుకున్నారు.
నా తెలంగాణ పచ్చబడాలి. పల్లె కళకళలాడాలి. పచ్చ దనం వెల్లివిరియాలి.
పాడి పంట సమృద్ధిగా మారాలి. పల్లెలో కరువును తరిమివేయాలి. పల్లెకు మళ్లీ వెలుగు రావాలి. ఊరంతా పండగ కావాలి. అంటే ముందు చెరువు బాగు పడాలి. చెరువుకు పూర్వ వైభవం తేవాలని ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంకల్పించారు. తెలంగాణలో వున్న నలభై ఆరు వేల చెరువులను మూడేళ్లలలో దశల వారిగా బాగు చేశారు. ముందు కరువు రక్కసితో బాధపడుతున్న ప్రాంతాలను గుర్తించారు. తొలి విడతలో ఆ చెరువుల బాగుకు ప్రణాళికలు తయారు చేశారు. తెలంగాణ వచ్చిన తొలి ఏడాది నుంచే చెరువుల మరమ్మత్తులకు శ్రీకారం చుట్టారు. ముందు చెరువుల్లో పూడిక తీయించారు. చెరువు కట్టలు బాగు చేశారు. వాటిపై తాటి, ఈత చెట్లు పెంచారు. 2015లోనే చెరువులు గోదావరి నీళ్లతో నింపడం మొదలు పెట్టారు. ఒక్కసారిగా తెలంగాణ వాతావరణం మారిపోయింది. కొన్ని దశాబ్దాలుగా చుక్క నీటిని చూడని చెరువులు ఎండకాలంలో మత్తళ్లు పోశాయి. వాగులు వంకలు వానలు లేకున్నా పారాయి. మత్తళ్లు దుంకుతూ పారిన జలాలు గొలుసు కట్టు చెరువుల బాటన ఒక చెరువు నుంచి మరో చెరువు చేరాయి. ఇలా తెలంగాణలో చెరువులన్నీ నిండాయి. ఊళ్లన్నీ పచ్చబడ్డాయి. ఎండిపోయిన బావుల్లో ఊటలు మొదలయ్యాయి. వానాకాలంలో ఎల్లబోసే బావులు ఎండాకాలంలో కూడా ఎల్లబోశాయి. ఎండిన బోర్ల నీళ్లతో నిండాయి. ఇంతలో నిరంతర ఉచిత కరంటు వచ్చింది. రైతులకు వరమైంది. పాడి పంటల పండుగలు మళ్లీ మొదయ్యాయి. ఇలా చెరువులు నీటి గంగాళాలై నిత్యం కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు చెరువు ఆనవాలు వుందా? అన్న అనుమానం వున్న చోట చెరువు లోతుగా వుంది. అంటూ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రతి పల్లెలో నీటి సవ్వడులు వినిపిస్తున్నాయి. తెలంగాణ చెరువులు నిండి మత్స సంపదకు ఆలవాలమైంది. పొలాలు తడిపే గంగమ్మతల్లి ప్రతిరూపమైంది. ఒక రకంగా చెప్పాలంటే పాడిపంటల సంపదనందిస్తూ, అష్టలక్ష్మి వైభవం పల్లె చూస్తోంది. ఇదంతా కేసిఆర్‌ వల్లనే సాధ్యమైంది. అపర భగీరధుడు కలలు గన్న తెలంగాణ ఆవిషృతమైంది. తెలంగాణ సస్యశ్యామలమైంది. ఈ తరానికి చెరువును చూపించడమే కాదు, పాడి పంటలను అందించే వరంగా తీర్చిదిద్దారు. మలి తరానికి బంగారు బాటలు వేశారు. Continue reading నా చెరువు నాడు…నేడు!

జలమే బిఆర్‌ఎస్‌ బలం!

https://epaper.netidhatri.com/

 రైతు మద్దతే కారుకు వరం!

`తడారిన తెలంగాణ గొంతు తడిపిందే కేసిఆర్‌.

`నెర్రెలు బారిన నేలకు ఊపిరిలూదిందే బిఆర్‌ఎస్‌.

`తన కంట ఒలికిన కన్నీరు ఏ రైతు కంట ఒలకకుండా చేసిందే కేసిఆర్‌.

`బంజరు భూముల్లో బంగారు పంటలకు కారణం కేసిఆర్‌.

`తెలంగాణ భూ గర్భం సముద్రం చేసింది కేసిఆర్‌.

`బిఆర్‌ఎస్‌ కు రైతులే అండ.

`పేదలకు కేసిఆర్‌ నాయకత్వమే అండా దండ.

`సంక్షేమానికి నిదర్శనమే కేసిఆర్‌ పాలన.

`తెలంగాణలో చీకట్లను తరిమి వెలుగులు పంచిందే కేసిఆర్‌.

`బంగారు పంటల మాగాణ తెలంగాణ చేసిందే కేసిఆర్‌.

`ప్రజల ఆలోచనల్లో ప్రతిపక్షాలు లేవు.

`ప్రత్యామ్నాయ శక్తులు అనే పదానికి తెలంగాణలో చోటు లేదు.

`సమ్మిళిత వృద్దిలో సకలజనులున్నారు.

`ప్రతిపక్షాలలో కూడా ప్రభుత్వ పథకాలు అందుకున్న వారు వున్నారు.

`వాళ్ల మనసులో కూడా వుంది కారే!

`వారి మనసు కోరుకుంటోంది కేసిఆర్‌ నే!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

జలం ఈ పదం వింటేనే తెలంగాణ జనం మనసు పులకరిస్తుంది. తనువు పరవశిస్తుంది. ఎందుకంటే నీటి కోసం తెలంగాణ పడిన గోస అంతా ఇంతా కాదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పల్లెలు నీటి కోసం అల్లాడాయి. ఒకప్పుడు తెలంగాణ గొలుసుకట్టు చెరువులతో కళకళలాడుతూ వుండేది. ఒక్క తెలంగాణ లోనే సుమారు 60వేలకు పైగా చెరువులుండేవి. జలకళలతో కళకళలాడుతూ వుండేవి. నిజాం కాలంలో వ్యవసాయం మీద వచ్చే పన్నుతోనే అప్పటి హైదరాబాదు రాష్ట్రం సిరి సంపదలతో తులతూగుతూ వచ్చేది. ప్రపంచంలోనే నిజాం నవాబు అధిక సంపన్నుడు కావడానికి కారణం తెలంగాణలో సాగు సంపదే కారణం. నిజాం పాలన నుంచి విముక్తి జరిగి, హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటైంది. అలా స్వేచ్చా వాయువులు పీల్చుకున్నదో లేదో, భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో మళ్ళీ తెలంగాణకు కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుతో తెలంగాణ ప్రజల జీవితాలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో విలీనమై సమయంలో మిగులు రాష్ట్రం. తెలంగాణ వనరులు ఆంధ్రప్రదేశ్‌ కు తరలించారు. తెలంగాణ ఆదాయం తో సీమాంధ్ర లో సాగు నీటి ప్రాజెక్టులు నిర్మాణం చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ లతో పాటు పోతిరెడ్డిపాడు ఇలా చెప్పుకుంటూ అనేక ప్రాజెక్టులతో సీమాంధ్ర ను సస్యశ్యామలం చేసుకున్నారు. తెలంగాణ ను ఎండబెట్టారు. అరవై ఏళ్ల పాలనలో తెలంగాణ సాగు రంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. ఎన్నికలు రాగానే శంకుస్థాపనలు. తెలంగాణను అరవై ఏళ్లు మభ్యపెట్టి, మాయ చేసి దోచుకున్నారు. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అంటూ ఆంధ్రా అభివృద్ధి చేసుకున్నారు. తెలంగాణ ను ఎందుకు కాకుండా చేశారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ మరింత విధ్వంసానికి గురైంది. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాల హయాంలో నీటి దోపిడే జరిగేది. తెలుగుదేశం వచ్చాక వనరులు కొల్లగొట్టి, తెలంగాణ ను పీల్చి పిప్పి చేసింది. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తిగా దోచుకున్నారు. తెలంగాణ ఏ మారు మూల ప్రాంతంలో చిన్న ఉద్యోగంలో కూడా ఆంద్రా వాళ్లే…తెలంగాణ సాగు విపరీతమైన విద్వంసం చేశారు. చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా పక్కనపెట్టారు. తెలంగాణ ను నీళ్లిస్తే ఆంధ్రాకు కష్టమవుతుందని ప్రాజెక్టులు పూర్తి పూర్తి చేయలేదు. పైగా నికర జలాలు ఆంద్రాకు తరలించి, వరద జలాలు తెలంగాణ కు అని చెప్పి మోసం చేశారు. అవి కూడా ఇవ్వకుండా తెలంగాణను ఆగం చేశారు. ఒక దశలో తెలంగాణ ప్రాజెక్టుల ఊసెత్తొద్దని కూడా చంద్రబాబు హుకూం జారీ చేశారు. తెలంగాణ కు నీళ్లు ఇవ్వాలంటే ఎత్తిపోతల ప్రభుత్వం వల్ల కాదన్నారు. తెలంగాణ ఊర్లన్ని వలసలు పోతున్నా చూస్తూ ఊరుకున్నారు. సీమాంధ్రులు హైదరాబాదు పరిసర ప్రాంతాల చెరువులన్నీ మాయం చేశారు. తెలంగాణ చెరువుల ఆనవాలు లేకుండా ధ్వంస రచన సాగించారు. ప్రాజెక్టులు కట్టకపోయినా, కనీసం చెరువుల బాగు చేయడానికి కూడా చేతులు రాలేదు. తెలంగాణ ను ఎడారి చేశారు. 

అలాంటి తెలంగాణ లో ఇప్పుడు జలమే జలం…ఎక్కడ చూసినా జలమే…ఏ దిక్కు చూసినా పొలమే…పచ్చదనమే…

మరి సరిగ్గా పదేళ్ల క్రితం ఎక్కడ చూసినా ఎండిన బీడులే. ఒట్టిపోయిన వాగులే…ఆనవాలు కోల్పోయిన వాగులే…జల జాడ లేకుండా పోయింది. భూ గర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయిన స్థితి. కరువు రక్కసి చేతిలో విలవిలలాడిపోయింది. పనికి ఆహార పథకం పనిలో ఏ పూట బియ్యం ఆ పూట తెచ్చుకొని కూలి చేసుకునేంతగా దిగజార్చారు. అలా తెలంగాణను ఏడిపించారు. ఆ వేధన నుంచి, ఆ నిర్వేదం నుంచి, ఆ ఆక్రోశం నుండి వచ్చిందే తెలంగాణ ఉద్యమం…. కేసిఆర్‌ రూపంలో ప్రపంచ ఉద్యమాల చరిత్రకే ఒక గొప్ప పాఠం. అలాంటి నేత చేతిలో తెలంగాణ బంగారమైంది. ప్రాజెక్టులు సాధ్యమే కాదన్న చోట కాళేశ్వరం నిర్మాణం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా కాళేశ్వరం పూర్తి చేసి, ఎండిన తెలంగాణ ను సస్యశ్యామలం చేశారు. నా తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణ చేశారు. అటు కాళేశ్వరం, ఇటు పాలమూరు.. రంగారెడ్డి, మల్లన్న సాగర్‌ వంటి అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. అంతకు ముందే తెలంగాణ ను జలపాతం చేశారు. కాలువలు తీసి చెరువుల నింపారు. చెరువుల్లో పూడిక తీసి, జలాలు నింపి పూర్వ వైభవాన్ని తెచ్చారు. అసలు ఆనవాలు లేని చెరువులకు కూడా కొత్త కళ తెచ్చారు. జలజీవం పోశారు. తెలంగాణను జీవధార చేశారు. అందుకే తెలంగాణ జలమే బిఆర్‌ఎస్‌ బలం!

రైతు మద్దతే కారుకు వరం! అని వేనోళ్ల కొనియాడబడుతోంది. 

తడారిన తెలంగాణ గొంతు తడిపిందే కేసిఆర్‌. నెర్రెలు బారిన నేలకు ఊరిపిలూదిందే బిఆర్‌ఎస్‌. తన కంట ఒలికిన కన్నీరు ఏ రైతు కంట ఒలకకుండా చేసిందే కేసిఆర్‌. బంజరు భూముల్లో బంగారు పంటలకు కారణం కేసిఆర్‌. తెలంగాణ భూ గర్భం సముద్రం చేసింది కేసిఆర్‌.బిఆర్‌ఎస్‌ కు రైతులే అండ.పేదలకు కేసిఆర్‌ నాయకత్వమే అండా దండ. సంక్షేమానికి నిదర్శనమే కేసిఆర్‌ పాలన.తెలంగాణలో చీకట్లను తరిమి వెలుగులు పంచిందే కేసిఆర్‌. బంగారు పంటల మాగాణ తెలంగాణ చేసిందే కేసిఆర్‌.

అలాంటి తెలంగాణ లో ప్రతిపక్షాలా? సమస్యే లేదు. 

 ప్రజల ఆలోచనల్లో ప్రతిపక్షాలు లేవు. ప్రత్యామ్నాయ శక్తులు అనే పదానికి తెలంగాణలో చోటు లేదు. ఎందుకంటే తెలంగాణలో అమలౌతున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదు. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలౌతున్నాయి. ప్రతీ కుటుంబానికి అందుతున్నాయి. పైగా గొప్ప పథకాలు కూడా తెలంగాణ లోనే అమలులో వున్నాయి. కళ్యాణ లక్ష్మి లాంటి పథకం వెనక గొప్ప సామాజిక సృహ దాగి వున్నది. ఒకప్పుడు తెలంగాణ లో అక్కడక్కడ బాల్య వివాహాలు జరిగేవి. ఎప్పడైతే కళ్యాణ లక్ష్మీ అమలులోకి వచ్చిందో అప్పటి నుంచి తెలంగాణ లో బాల్య వివాహాలు లేకుండా పోయాయి. దళిత సమాజం మీద ఎన్నికల సమయంలో ఎన్నో పార్టీలు మొసలి కన్నీరు కార్చినవే. కానీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ మదిలో నుంచి ఆవిషృతమైన దళితబంధు ఆ కుటుంబాలలో వెలుగులు నింపుతోంది. ఆర్థిక స్వావలంబన లో దళితులను భాగస్వామ్యం చేస్తే సమాజంలో అసమానతలు తగ్గిపోతాయి. ఇప్పుడు తెలంగాణ లో అదే జరుగుతోంది. తెలంగాణ సమ్మిళిత వృద్దిలో సకలజనులున్నారు.ప్రతిపక్షాలలో కూడా ప్రభుత్వ పథకాలు అందుకున్న వారు వున్నారు.వాళ్ల మనసులో కూడా వుంది కారే!

 వారి మనసు కోరుకుంటోంది కేసిఆర్‌ నే! ఇది సత్యం.. నిత్యం.. తెలంగాణ ప్రగతికి సోపానం.

మున్నూరు కాపు బలగం విజయవంతం..కో ఆర్డినేటర్ పుప్పాల రజనీకాంత్

ఆదివారం విష్ణుప్రియ గార్డెన్స్ లో హనుమకొండ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జరిగిన మున్నూరు కాపు బలగం ఆత్మీయ సమ్మేళనం విజయవంతం అయ్యింది. మహిళలు, పిల్లలు, పెద్దలు సుమారు 4 వేలకు పైగా ఈ యొక్క సమ్మేళనానికి హాజరు అయ్యారు.ప్లే బ్యాక్ సింగర్, స్వరాభిషేకం ఫేమ్ మాళవిక, ZEE సరిగమప ఫేమ్,సింగర్ సాయి శ్రీ చరణ్ తమ ఆట పాటలతో మున్నూరు కాపు కులబంధువులకు వినోదాన్ని పంచారు.20 శాతం ఉన్న మున్నూరు కాపులకు రాజకీయ పార్టీలు వాళ్ల కమిటీల్లో ముఖ్యమైన పదవులు ఇవ్వాలని,టికెట్ల విషయంలో కూడా 20 శాతం మున్నూరు కాపులకు కేటాయించాలని కోరారు.హనుమకొండ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో త్వరలో వెబ్ సైట్ లాంచ్ చేస్తున్నట్లు పుప్పాల రజనీకాంత్ తెలిపారు.ఈ యొక్క వెబ్ సైట్ మున్నూరు కాపు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఉపయోగపడుతుందని, విదేశాలకు వెళ్లే వారికోసం, పెళ్లిళ్ల కోసం ఈ వెబ్ సైట్ ఉపయోగ పడుతుందని పుప్పాల తెలిపారు.ఇది మున్నూరు కాపుల మీటింగ్ కాదని, ఆత్మీయ సమ్మేళనం కాబట్టి స్పాన్సర్లు,రావు పద్మ, నాయిని రాజేందర్ రెడ్డి,ఎర్రబెల్లి ప్రదీప్ రావు,దాస్యం అభినవ్ భాస్కర్ లను ఆహ్వానించామని, ఇందులో ఎలాంటి రాజకీయ సందేశం ఎవరూ ఇవ్వలేదని, త్వరలో ఏర్పాటు చేసే మీటింగ్ కు ఎలాంటి స్పాన్సర్లను పిలవబోమని పుప్పాల తెలిపారు.

హనుమకొండ జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త దశరథం పటేల్, వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మందా శ్రీనివాస్ పటేల్ ల ఆధ్వర్యంలో జనసమీకరణ జరిగిందని,ఈ కార్యక్రమం విజవంతం కావడంలో కృషి చేసిన మున్నూరు కాపు సంఘం నాయకులు సాయిని రవీందర్, జినుకల లక్ష్మణ్ రావు,కొండ నాగరాజు,జినుకల దేవేందర్ రావు, పుట్ట కిషోర్, గుండ్ల శ్రీనివాస్,తోట సమ్మయ్య, లింగంపల్లి సురేందర్, కోరబోయిన సాంబయ్య, సాయి,సత్యప్రకాశ్ మొదలగు వారిని పుప్పాల అభినందించారు.

కుల సంఘాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.

అన్ని వర్గాలకు సముచిత స్థానం.
కుల సంఘాల భవనాల నిర్మాణానికి స్థలం కేటాయింపు.
మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.

రామయంపేట (మెదక్)నేటి ధాత్రి.

ముఖ్యమంత్రి కేసీఆర్ కుల సంఘాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం రామాయoపేటలో ఆమె విలేకరులతో మాట్లాడారు. చాలా గ్రామాల్లో సంఘం భవనం లేకపోవడం వల్ల ఎక్కడో రోడ్డు పక్కన లేదా చిన్న చిన్న గదుల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. కుల సంఘాలకు స్థలం కేటాయించి భవనాలు నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. దీంతో సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఐక్యతగా ఉండడానికి ఉపయోగపడతాయన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని కుల సంఘాలను సమానంగా చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుల వృత్తులకు మంచి రోజులు వచ్చాయని అన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందని దేశంలోని ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు పి ఎస్ సి ఎస్ చైర్మన్ బాదే చంద్రం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరప్ యాదగిరి కౌన్సిలర్లు

సివిల్ అధికారులు కాంట్రాక్టర్ కు డబ్బులు ఇస్తేనే పని

 

గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలములో రామప్ప కాలనీ లో శ్రీ బాలాజీ ల్యాండ్ లూజర్ అసోసియేషన్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్టివ్ 2001 ప్రకారం సోసైటీ ల్యాండ్ లూజర్ 27 మందితో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మా యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ 599 2022 సంవత్సరంలో చేసుకున్నాము 2023 లో రామప్ప కాలనీకి సివిక్ కాంట్రాక్టు రావడం జరిగింది ప్రస్తుతం ఇందులో కొంతమంది మాత్రమే భూమి కోల్పోయిన వాళ్లు పనిచేస్తున్నారు. మిగతావాళ్లు కాసులు సొసైటీ అధ్యక్షుడికి సివిల్ అధికారులు కు ముట్టిన వెంటనే సొసైటీ అధ్యక్షుడు పనిలోకి తీసుకోవడం జరుగుతున్నాయి ఇటీవల నాలుగు రోజుల కిందట సివిల్ అధికారులు స్వయంగా రామప్ప కాలనీకి వచ్చి వారి పేర్లు రికార్డులు చేర్చి పనులు పెట్టిపోయినారు ఇట్టి విషయం పలుమార్లు సివిల్ అధికారులకు దృష్టికి తీసుకుపోయిన ఫలితం లేదు ఇటీవల తేదీ 26 9 2023న సివిల్ అధికారులు స్వయంగా రామప్ప కాలనీకి వచ్చి వారు తీసుకున్న కాసులు ఎక్కడ బయటపడతాయో అని అనే భయంతో ముందస్తుగా ఇక్కడ పనిచేసే వర్కర్ వద్ద విచారణ చేపట్టి సివిల్ అధికారులు కు వారి ఉద్యోగ భద్రత సివిల్ సంబంధించిన పనులు పక్కనపెట్టి ఈ కుంభకోణం ఏడ బయటపడుతుందని విషయంతో విచారణ చేపట్టడం జరిగింది ఇట్టి విషయంపై కంపెనీలో పని చేసే విజిలెన్స్ డిపార్ట్మెంట్ చేయాలి. కానీ వీరికి ఎంక్వైరీ చేయమన్నారని ఇది వారి తప్పులు బయటపడతాయని భయంతో ఈ పని చేసినారు కావున ఇట్టి విషయంపై మరియు సివిల్ అధికారులపై కార్పొరేటర్ స్థాయి అధికారులు తగు చర్యలు తీసుకొని మా భూమినివస్థితులైన మాకు పనులు కల్పించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాము లేని పక్షాన హైకోర్టులో రిపీట్ వేయడం జరుగుతుంది భూనిర్వాసితులంతా అంటున్నారు

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

మందమర్రి, నేటిధాత్రి:-

జాతీయ రహదారి నిర్మాణ పనుల భాగంగా పట్టణంలోని యాపల్ ప్రాంతంలో రోడ్డుకి ఇరువైపుల ఉన్న బస్ స్టాప్ లను తొలగించి, రహదారి నిర్మాణం చేపట్టడంతో పాటు ప్రజలు రోడ్డు దాటేందుకు వీలు లేకుండా స్టీల్ రేళ్లను వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ప్రజలు ఇబ్బందులు కలకుండా చూడాలని యాపల్ ప్రాంత వాసులు ఎండి అబ్బాస్, డాక్టర్ వేముల నరసయ్య, నోముల శ్రీధర్ లు కోరారు. ఈ మేరకు శుక్రవారం జాతీయ రహదారి ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇంచార్జ్ సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, యాపల్ ప్రాంతంలో ఇరువైపులా బస్ స్టాప్ లు ఏర్పాటు చేసి, బస్ షెల్టర్లను నిర్మించి, రహదారి మధ్యలో ఉన్న స్టీలు రేళ్లను తొలగించి, ప్రజలకు సౌకర్యంగా ఉండేటట్లు చూడాలని కోరారు. ఈ విషయంపై ప్రాజెక్ట్ అధికారి సానుకూలంగా స్పందించి, యాపల్ వాసులకు శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్ కు ఘన స్వాగతం పలకాలి

 

మందమర్రి, నేటిధాత్రి:-

సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో పర్యటించనున్న రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కోల్ బెల్ట్ ప్రాంత వాసులు ఘనస్వాగతం పలకాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టిబిజికెఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య పిలుపునిచ్చారు. పట్టణంలోని టిబిజికెఎస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాలలో ఆదివారం రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా పట్టణంలో నిర్వహిస్తున్న రోడ్ షోను, అదేవిధంగా రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు కార్మిక వర్గం, తెలంగాణ వాదులు ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో హాజరై, విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టిందన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా కార్మికులకు లాభాల వాటా 32శాతం ప్రకటించి, దసరా పండుగ లోపు కార్మికులకు లాభాల వాటా సుమారు 711 కోట్లు చెల్లించడం జరుగుతుందని, ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ తగినదని తెలిపారు. సమైక్య ప్రభుత్వాలు సింగరేణి కార్మికులకు అరాకొర లాభాల వాటా చెల్లించడం జరిగిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ మొత్తంగా 32 శాతం లాభాల వాటా చెల్లించడం జరుగుతుందని వివరించారు. అదేవిధంగా ఇటీవలే సింగరేణి కార్మికులకు 11వ వేతనానికి సంబంధించిన 23 నెలల ఏరియార్స్ బకాయిలను ఒకే దఫా చెల్లించి, కార్మికుల్లో సంతోషాన్ని కలిగించింది తెలిపారు. సింగరేణి కార్మికులకు అనేక ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంతోపాటు అనేక హక్కులు కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని కొనియాడారు. బిజెపి ప్రభుత్వం నిర్వహిస్తున్న బొగ్గు క్షేత్రాల వేలంపాటకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిలో మూడు రోజులు సమ్మె చేసి, వేలంపాటను అడ్డుకున్నారని గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమను ప్రైవేట్ పరం చేయకపోవడానికి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడమే కారణమని, బిఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు కార్మిక వర్గం రుణపడి ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో అభివృద్ధి యజ్ఞంలా కొనసాగుతుందని, మారుమూల ప్రాంతాల్లో సైతం నేడు గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని, 50 ఏళ్లులో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతుందన్నారు. ఆదివారం కేటీఆర్ రోడ్ షోకు, బహిరంగ సభకు కార్మిక వర్గం, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జే రవీందర్, నాయకులు బడికెల సంపత్ కుమార్, ఓ రాజశేఖర్, ఏరియా నాయకులు, అన్ని గనుల ఫిట్ కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆధార్ అవస్థలు సమీకరణకు తిప్పలు

వేములవాడ నేటి దాత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డుల నిమిత్తం ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింకు తప్పనిసరి దీంతో గత వారం రోజుల నుండి ఆధార్ సేవ కేంద్రాలకు తాకిడి ఎక్కువ అయింది వేములవాడ మండల కేంద్రం లో శనివారం వివిధ గ్రామాల నుండి జనాల తాకిడి ఎక్కువ కావడంతో ఆధార్ సేవా కేంద్రల ముందర జనాలు బారులు తీరారు ఈనెల 30తో గడువు తీయడంతో జనాలు అవస్థలు పడుతున్నారు
ప్రస్తుత తరుణంలో అన్నిటికీ ఆధార్ ఆధారమైంది ఆధార్ దిగి పదేళ్లు దాటిన వారు సమీకరించుకోవాలని అధికారులు సూచించారు దీంతో ప్రజలంతా ఆధార్ కార్డు సమీకరణకై దృష్టి సారించారు భుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ఆధార్ కార్డు కీలకము పింఛన్లు రేషన్ కార్డులు బ్యాంకు ఖాతాలకి సీఎం సహాయ నిధికి రైతుబంధు వంటి పథకాలకు ఆధార్ తప్పనిసరి చాలామంది చిరునామా ఫోన్ నెంబర్లు వంటి వివరాలను అప్డేట్ చేయించుకోలేదు పింఛన్లు రేషన్ రానివారు వేలిముద్రలను ఫోన్ నెంబర్లను సమీకరించుకునేందుకు ఆధార్ కేంద్రాలకు వరుస కడుతున్నారు ముఖ్యంగా పల్లెల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున మండల కేంద్రాలకి బారులు తీరుతున్నారు ఆయా కేంద్రాల వద్ద కనీస వసతులు లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు

సర్వర్ పేరుతో సతాయిస్తుండ్రు

వివిధ అవసరాలు ఆధార్ సవరణల కోసం ప్రజలు ఆధార్ నమోదు కేంద్రాల వద్ద వరుస కడుతున్నారు సర్వర్ రావడంలేదని పనిచేయడం లేదు అని వచ్చినవారు సమీకరణ కోసం పడి కాపులు తప్పడం లేదు వేములవాడ మండల కేంద్రంలోదాదాపు 10 మీసేవ కేంద్రాలు ఉన్న తిప్పలు మాత్రం తప్పడం లేదు ఆధార్ కేంద్రాల వద్ద పరిస్థితి మరి దారుణంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

కళ్యాణాలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే చల్లా

ప్రజల క్షేమమే కేసీఆర్ లక్ష్యం-చల్లా ధర్మారెడ్డి

పరకాల నేటిధాత్రి(టౌన్)
తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ అండగా నిలిచేది,వారి శ్రేయస్సు కోరేది ఒక్క కేసీఆర్, గులాబీ జెండా మాత్రమేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.పరకాల పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పరకాల మున్సిపాలిటీ,పరకాల, నడికుడ మలాలల్లోని వివిధ గ్రామాలకు చెందిన 133 మంది కల్యాణలక్ష్మి,శాధిముబారక్ లబ్ధిదారులకు గాను రూ.1 కోటి 33 లక్షల 15 వేలకు పైగా విలువచేసే చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని,తెలంగాణ ప్రజల సంక్షేమమే కేసీఆర్ అసలు అజెండా అని అన్నారు. కాంగ్రెస్,బీజేపీలది ఓట్ల ఆరాటమైతే కేసీఆర్‌ది తెలంగాణ ప్రజల బతుకుదెరువు,అభివృద్ది ఆరాటమన్నారు.కాంగ్రెస్ ప్రజలను గోస పెట్టే పార్టీ అయితే,బీజేపీ ప్రజలను మోసం చేసే పార్టీ అని దుయ్యబట్టారు.వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని యువతకు సూచించారు.గతంలో కాంగ్రెస్ పార్టీ,ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణ రాష్ట్రానికి,ప్రజలకు చేసిందేమిలేదని అన్నారు.
మన రాష్ట్రంలో బి.ఆర్.ఎస్.ప్రభుత్వం అమచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏర్పాష్ట్రంలో లేవని తెలిపారు.ప్రతి సంక్షేమ పథకం పార్టీలకు అతీతంగా పారదర్శకంగా ప్రజలకు నేరుగా చేరవేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సొసైటీ, మార్కెట్ చైర్మన్లు, కమిటీ సభ్యులు,బి.ఆర్.ఎస్.నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

సిఐటియు మండల కార్యదర్శి జల్లే జయరాజు

కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి:

శనివారం కేసముద్రం మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలను సి ఐ టి యు మండల కార్యదర్శి జల్లే జయరాజ్ సందర్శించారు.మిడ్ డే మీల్స్ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్ తగ్గించడంలో మధ్యాహ్న భోజన కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు.కానీ మధ్యాహ్న భోజన కార్మికులు మధ్యాహ్న భోజన కార్యక్రమం విజయవంతం చేయడంలో బయట అప్పులు తెచ్చి నెలల తరబడి బిల్లులు రాక తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం మిడ్ డే మీల్స్ కార్మికులకు నెలకు రూ. 3,000 వేల వేతనం ఇస్తామని చెప్పి జీవో 8 జారీ చేసి సంవత్సరం కావస్తున్నా కార్మికులకు వేతనాలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనీ ఆరోపించారు.వారానికి మెనూ ప్రకటించిన విద్యాశాఖ మంత్రి బిల్లులు చెల్లించడంలో జాప్యం ఎందుకు జరుగుతుందనీ ప్రశ్నించారు.ఇప్పటికైనా అధికారులు రాష్ట్ర,ప్రభుత్వం స్పందించి తక్షణమే వేతనాలు,కోడిగుడ్ల బిల్లులు ఇతర సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా వంట గదులు లేని చోట వంట గదులు నిర్మించాలని,బిల్లులు పెండింగ్లో ఉండకుండా చూడాలని కోరారు.లేనియెడల మిడ్ డే మీల్స్, జిల్లా కమిటీ పిలుపు మేరకు సమ్మెకు వెళ్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్లే,శోభ ఘనపరపు,శ్రీలత ,ఏం.శోభ,సుగుణ,నీలక్క భాగ్యలక్ష్మి ,శోభా,జి.లలిత, కే.లలిత,విజయ,శీలం జ్యోతి,మెంతుల ఉపేంద్ర,దారావతు లక్ష్మి ,లలిత,స్వరూప తదితరులు పాల్గొన్నారు.

తాహసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన మధ్యాహ్న భోజన వర్కర్ల సంఘం

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేటిధాత్రి…

మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించేల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు కొమరం కాంతారావు డిమాండ్ చేశారు మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మధ్యాహ్న భోజన కార్మికులకు 3000 రూపాయలు జీతం ఇస్తామని జీవొ విడుదల చేశారని అవి జీవోలు గాని మిగులుతున్నాయని అవి ఇంతవరకూ జమ చేయలేదని వారన్నారు గత రెండు సంవత్సరాలుగా జీతం పెంచుతున్నామని ఊరిస్తున్నారు తప్ప అవి జమైన దాఖలాలు లేవని మధ్యాహ్న కార్మికులు ఆకలితో అలమటిస్తుంటే పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా, పెంచిన జీతాలు ఇవ్వకుండా కొత్తగా మెనూ అమలు చేయాలని చెప్పటం ఎంతవరకు సమంజసం అని ఉదయం పూట టిఫిన్, రాగి జావా మధ్యాహ్నం భోజనం లతో పని భారం పెరుగుతుందే తప్ప తమ జీతాలు, బిల్లులపై ప్రభుత్వం పట్టించుకున్నది లేదని తక్షణమే పెండింగ్ విడుదల చేసి పెరిగిన ధరలు కనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని, పెంచిన జీతం ఏరియర్స్ తో సహా చెల్లించాలని, కోడిగుడ్లను ప్రభుత్వమే టెండర్ విధానం ద్వారా సరఫరా చేయాలని, యూనిఫామ్, వంట పాత్రలు ప్రభుత్వం సరఫరా చేయాలని సమస్యలతో కూడిన వినతి పత్రం స్థానిక తాసిల్దార్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో బోండ్ల రమాదేవి, కొమరం మల్లమ్మ,గొగ్గల సావిత్రీ,ఆవుదొడ్డీ మంగమ్మ,కాలం వెంకట నరసమ్మ, గొంది ఈశ్వరి, ఢిల్లీ లక్ష్మీబాయి , పాయం శాంత,కోరగట్ల జయలలిత తదితరులు పాల్గొన్నారు

ఉర్సు ఉత్సవాలకు 5వేల ఆర్థిక సహాయం అందజేత

 సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి

ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి

హిమాం హలీ హంజ దర్గా ఉత్సవం సందర్భంగా ప్రతి ఏటా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాపయ్య పటేల్ బంగ్లా సమీపంలో ఉన్న దర్గాలో ఉర్సు ఉత్సవం నిర్వహిస్తుంటారు. ఉర్సు ఉత్సవానికి సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి 5వేల ఆర్థిక సహాయాన్ని శనివారం తన నివాసంలో అందజేశారు. వేడుకను ఘనంగా నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షులు రఫిక్, అలీమ్, లాల్ మహమ్మద్, ఎండి రషీద్, ఎండి బాబా తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఆర్ పి ఐ ఆవిర్భావ వేడుకలు

మంచిర్యాల/ప్రతినిధి నేటిదాత్రి:

మంచిర్యాల పట్టణంలో
స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ) 67 వ ఆవిర్భావ దినోత్సవాన్ని
మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కారుకూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా
జిల్లా అధ్యక్షులు కారుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ. నిరుపేదల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్. పి.ఐ)
అని పార్టీ ద్వారా అనేక ఉద్యమాలు నిరుపేదల కోసం చేస్తున్నామని తెలిపారు మంచిర్యాల పట్టణంలో కార్మికుల దోపిడీ జరుగుతుందని
ఇక్కడ కార్మిక శాఖ అధికారులు అవినీతి నిద్రమత్తులో ఉన్నారని అన్నారు
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ)
ప్రజా. కార్మిక సమస్యలపై ఉద్యమం చేస్తుందని అతి తక్కువ రేటుతో కార్మికులతో పని చేయించుకుంటు బడా వ్యాపారులు కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ)
కార్మిక. ప్రజా సమస్యలపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేయడానికి ముందుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ)
పార్టీ మహిళ విభాగం
జిల్లా అధ్యక్షురాలు జగదాంబల లలిత. జిల్లా ఉపాధ్యక్షురాలు మొగురం మిరియా. సీనియర్ దళిత రాష్ట్ర నాయకురాలు సుశీల. పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

దుర్గదేవి ఉత్సవకమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

 

ఖానాపూర్ నేటిధాత్రి

ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ దబ్బిరి పేట రోడ్డు ఇందిరా కాలనీ లో దుర్గ దేవి ఉత్సవ నిర్వహణ కమిటీ గౌరవ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.నూతన కమిటీ అధ్యక్షులు చేర్పు మునేందర్, ప్రధాన కార్యదర్శి పెనక వెంకన్న, ఉపాధ్యక్షులు ధనసరి శివ, వట్టం సతీష్, కోశాధికారి జక్కుల భాను, క్యాష్ రికవరీ సందీప్, శివాజీ, సాయి కుమార్, మధు, వెంకటేష్, స్టేజ్ ఇంచార్జి, యువరాజు, సాయి, సాయిరాం సభ్యులు గౌరవ సభ్యులు, సభ్యులు ఈ సందర్బంగా అధ్యక్షులు మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరలుగా దుర్గ దేవి ని అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించిడం జరిగుతుంది.అని చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.

మోకుదెబ్బ మండల అధ్యక్షులుగా గంగాధర్ గౌడ్ ఎన్నిక

ఖానాపురం నేటిధాత్రి

ఖానాపురం మండలం గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ అధ్యక్షులుగా మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్ మెర్గు గంగాదర్ గౌడ్ నియామకం మయ్యారు శనివారం ఖానాపురం గౌడ సంఘ భవనం ఆవరణలో మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మోకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల సమస్యల కొరకు కృషి చేస్తున్న గంగాధర్ గౌడ్ ను అధ్యక్షులుగా నియామకం చేశామన్నారు.ఈసందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ మండల కమిటిని రమేష్ గౌడ్ ప్రకటించారు. మోకు దెబ్బ అధ్యక్షులు గా మేర్గు గంగాధర్ గౌడ్ ,ప్రధానకార్యదర్శి రంగు కుమార్ గౌడ్ , ఉపాధ్యక్షులు  మక్కా వెంకన్నగౌడ్ , ఆకుల ఉపెందర్ గౌడ్ ,నేరేళ్ళ విష్ణుగౌడ్ , సహాయకార్యదర్శులు బొమ్మగాని నవీన్ గౌడ్ ,బందారపు శ్రీనివాస్ గౌడ్ , గుడిసె సూరయ్యగౌడ్ , శొంఠిలక్ష్మణ్ గౌడ్ , కొశాధికారి గుండ్లపెల్లి సదానందంగౌడ్ , అధికార ప్రతినిధి ముంజాల సంజీవగౌడ్ ,గౌరవ సలహాదారులు మాచర్ల కొమ్మాలుగౌడ్ ,కార్యవర్గ సబ్యులు బుడిగె మనోహార్ గౌడ్ ,మచ్చిక సదానందంగౌడ్ ,మల్లంరమేష్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో గౌడజనహక్కుల పోరాట సమితి మోకుదెబ్బ  వరంగల్ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకన్న గౌడ్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు  ముంజాల రాజేందర్ గౌడ్ ,ఉపాధ్యక్షులు మారగాని లింగన్న గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి బుడిగే మల్లేశం గౌడ్, తండ రమేష్ గౌడ్, కల్లెపు వెంకట్ గౌడ్, ఖానాపురం గౌడ సంఘం అధ్యక్షులు గంగారపు రమేష్ గౌడ్ ,క్యాషీయర్ బుడిగె మనోహార్ గౌడ్ ,గుండ్లపల్లి రాజ్ కుమార్ గౌడ్, మేర్గు రవీందర్ గౌడ్ , గుండ్లపెల్లి విజయ్ గౌడ్ ,గంగాపురం రాజుగౌడ్ , ఎరుకొండ నరేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిపెడ డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ లెక్చరర్ శ్రీనివాస్ కు డాక్టరేట్

మరిపెడ నేటి దాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్ గా పనిచేస్తున్న కె శ్రీనివాసుకు స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణా విధానములో ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ డిజిటల్ యూనివర్సిటీ, యూ ఎస్ వారి డాక్టరేట్ ను పొందారని కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ ప్రేమలత తెలియజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత శ్రీనివాసును కళాశాలలో సన్మానించారు. ప్రిన్సిపాల్ ప్రేమలత మాట్లాడుతూ, మన పరిధిలోని పనిని నిజాయితీగా, నిరంతరంగా చేసుకుంటూ పోతే ఇలాంటి అవార్డులు వరిస్తాయని, మనం చేసిన పనికి గుర్తింపు పొందడం సంతృప్తినిస్తుందని తెలిపారు. ఈ అవార్డును ప్రోత్సాహకంగా తీసుకుని మరింత బాధ్యతగా పనిచేయాలని శ్రీనివాసుకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు డాక్టర్ ఎ కవిత,ఎ జె రామారావు, టి. వెంకన్న,జి.లక్ష్మణ్, యం. నాగలక్ష్మి,యం వీరన్న,టి కేదారి,జి వెంకట్ రెడ్డి,ఆఫీస్ సిబ్బంది యస్ కె యాకూబ్, యం రమ,జె కొమురయ్య, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

దోమల నివారణకు చర్యలు చేపట్టాలి

కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి:

కేసముద్రం మండలం వ్యవసాయ మార్కెట్ సెంటర్లో ఎం సి పి ఐ యు, ఏఐసిటియు ఆధ్వర్యంలో కేసముద్రం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో దోమల మందు పిచికారి చేయాలని ప్లకార్డులను ప్రదర్శించడం జరిగింది.ఈ సందర్భంగా ఎం సి పి ఐ యు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న,ఏఐకేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు జాటోత్ బిచ్చ నాయక్ లు మాట్లాడుతూ ప్రజలు దోమల బారినపడి అనేక రకాల వ్యాధులకు గురిఅవుతున్నా ప్రభుత్వ అధికారులు పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తున్నారని ఇది సమంజసం కాదని వారు అన్నారు.ఇప్పటికైనా మండలంలోని అన్ని గ్రామాలలో దోమల నివారణ మందును పిచికారి చేయించాలని వారు అన్నారు.లేనియెడల దశల వారి పోరాటాలు చేపడతామని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బానోత్ ఈసు,బానోత్ శీను,పత్తి బాల వెంకటేష్,బానోత్ సూర్య నాయక్,బి.రాజు తదితరులు పాల్గొన్నారు.

మొగుళ్ళపల్లి అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

మొగుళ్లపల్లి మండల కేంద్రంలో రూ.25లక్షలతో నిర్మించిన రైతు వేదిక, రూ.20లక్షలతో గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి, రూ.9.90లక్షలతో యాదవ సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ సందర్భంగా రైతు వేదికలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ దేశంలో ఎక్కడ కూడా రైతు ఒక వేదిక లేదు.దేశంలో ఎక్కడలేని విధంగ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను సంఘటితం చేస్తూ రైతు వేదికలను నిర్మించుకున్నాము.రైతు వేధికలలో రైతు తమ వ్యవసాయ అవసరాల కోసం చర్చలు జరుపుకునే అవకాశం కల్పించారు. మొగుళ్ళపల్లి మండలంలో మొత్తం 5 రైతు వేదికలు నిర్మించుకోవడం జరిగింది. దాదాపు రూ.25లక్షలతో రైతు వేడుకల్ని నిర్మించిన ఏకైక ప్రభుత్వం. ప్రతి 5వేల ఎకరాలు ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి ,ఒక వ్యవసాయ అధికారిని నిర్మించుకున్నాము. రైతు లను రైతు బంధు,రైతు భీమా కల్పించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ తప్ప మరొకటి లేదు. గతంలో రైతులకు ఎరువుల కోసం బారులు తీరిన సంఘటనలు మొత్తం సమూలంగా ప్రక్షాళన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పండించిన ప్రతి దాన్యాన్ని కేంద్రం సహకారం లేకున్నా వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన రైతు పక్షపాతిగా నిలిచిన ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి జోరిక సదయ్య ఎం పి పి యార సుజాత సంజీవ రెడ్డి బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బలుగురి తిరుపతి రావు ప్యాక్స్ చైర్మన్, క్లస్టర్ ప్రజా ప్రతినిధులు, మండల ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version