
ముమ్మరంగా కోవిడ్ స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం- పర్యవేక్షించిన జిల్లా అడిషనల్ కలెక్టర్
కాటారం నేటిదాత్రి జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు కాటారం మండలములోని కొత్తపల్లి,అంకుశాపూర్ , చిదినేపళ్లి , రేగులగూడెం, కాటారం గ్రామ పంచాయతీ పరిధిలోని గారేపల్లి స్పెషల్ కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపులను అడిషనల్ కలెక్టర్ దివాకరన్ సందర్శించారు. కరోనా వ్యాక్సిన్ కేంద్రాలు మంచిగా నడిపిస్తున్నందుకు ఎంపీడీవో పెద్ద ఆంజనేయులు, కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రామారావులను అడిషనల్ కలెక్టర్ అభినందించారు.శనివారం పన్నెండు వందల డబ్భై తొమ్మిది మందికి ఫస్ట్, సెకండ్ దోషులు వేసినట్లు డాక్టర్ రామారావు తెలిపారు….