మరి కాసేపట్లో TSPSC పై కేసీఆర్ సంచలన నిర్ణయం?
నేటిధాత్రి హైదరాబాద్ TSPSC పేపర్ లీకేజ్ ఘటనపై CM KCR సీరియస్ అయ్యారు.బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డిని ప్రగతి భవన్ కు రావాలని ఆదేశించారు. *ఇప్పటికే ఈ విషయంపై ప్రగతి భవన్ లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో ఆయన భేటీ అయ్యారు.* పరీక్షల రద్దు, పేపర్ లీక్ పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం. జనార్దన్ రెడ్డితో భేటీ అనంతరం *TSPSC బోర్డును రద్దు చేయాలని సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.*