వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యేక పథకాలు.

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యేక పథకాలు.

యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ గంటి.కమలాకర్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యేక రుణ పథకాలు అందజేయనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ గంటి. కమలాకర్ తెలిపారు.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ రంగ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని “అగ్రికల్చర్ రైజ్” పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా వరి మిల్లులు, తడి మరియు పొడి ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్‌లు, గ్రేడింగ్, ప్యాకింగ్ మరియు ఇతర వ్యవసాయ ఆధారిత చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తక్కువ వడ్డీ రేటుతో ప్రత్యేక రుణాలు మంజూరు చేయబోతున్నది. ఈ నేపథ్యంలో నర్సంపేట యూనియన్ బ్యాంకు మేనేజర్ జీ బాలాజీ ఆధ్వర్యంలో మిల్లర్ల సంఘ భాద్యులతో, వర్తక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా యూనియన్ బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ “వ్యవసాయ రంగానికి విలువ జోడించే పరిశ్రమల ప్రోత్సాహంతో రైతులకు మెరుగైన ధరలూ, ఉపాధి అవకాశాలూ అందుతాయన్నారు. ఈ క్రమంలోనే రుణాల ప్రక్రియను వేగవంతం చేసి, సులభంగా రుణాలు అందుబాటులోకి తెస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రీజినల్ హెడ్ గంటి. కమలాకర్, డిప్యూటీ రీజినల్ హెడ్ మహేష్, బ్రాంచ్ మేనేజర్ జీ.బాలాజీ, ఫీల్డ్ ఆఫీసర్ శుశాంత్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు గోనెల రవీందర్, ఇరుకు కొటేశ్వర్, కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు దాసరి నర్సింహ రెడ్డి,బ్యాంక్ మిత్ర అడ్డగట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి..

సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఈ నెల 23న ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తిస్థాయి ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గురువారం జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేశ్కుమార్ షెట్కార్, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, శాసనసభ్యులు సంజీవరెడ్డితో కలిసి మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్, సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్న బసవేశ్వర విగ్రహం, నిమ్ రోడ్డు, కేంద్రీయ విద్యాలయ భవనం, సభా స్థలం తదితర ప్రాంతాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హెలిప్యాడ్ పనులు, ప్రజా వేదిక, వీఐపీ గ్యాలరీ, మీడియా గ్యాలరీ, వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, స్టేజి అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, టాయిలెట్స్ వంటి అన్ని పనులు పూర్తయ్యాయని చెప్పారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎస్పీ పంకజ్ పరితోష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇల్లంతకుంట శ్రీరాములవారిని దర్శించుకున్న.

ఇల్లంతకుంట శ్రీరాములవారిని దర్శించుకున్న దుర్గం సురేష్ గౌడ్ దంపతులు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు..తెలంగాణ పత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్..డి ఎస్ న్యూస్ ఛానల్ సీఈవో దుర్గం సురేష్ గౌడ్-త్రివేణి దంపతులు గురువారం వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంట శ్రీ రాములవారి దేవాలయాన్ని సందర్శించి మొక్కులను సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని జర్నలిస్టులు ఆ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ జంట కలకాలం నిండు నూరేళ్లు పిల్లాపాపలతో, అష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో కలకాలం వర్ధిల్లాలని కాంక్షించారు.

కార్మికోద్యమ నేత కామ్రేడ్ పర్సా సత్యనారాయణ.

*కార్మికోద్యమ నేత కామ్రేడ్ పర్సా సత్యనారాయణ
వర్ధంతి నివాళులు*

సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణం లో ఈరోజు మే 22 కార్మిక ఉద్యమ నేత , అమరజీవి కామ్రేడ్. పర్స సత్యనారాయణ 10 వ. వర్ధంతి సందర్భంగా బి.వై. నగర్ లోని కామ్రేడ్. అమృతలాల్ శుక్లా కార్మిక భవన్ లో CITU ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి కార్మికుల సమస్యలు , హక్కుల కోసం అలుపెరుగని పోరాటాలు చేసిన గొప్ప కార్మిక నాయకుడు కామ్రేడ్.. పర్సా సత్యనారాయణ ని కొనియాడారు.కామ్రేడ్.. పర్స సత్యనారాయణ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అన్ని వర్గాల కార్మికులందరిపై ఉందని వారి పోరాట స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై , కార్మిక చట్టాల , హక్కుల పరిరక్షణ కొరకు ప్రతి ఒక్క కార్మికుడు పోరాటాలలో భాగస్వామ్యం అయ్యి హక్కులను సాధించుకోవడమే ఆయనకు ఇచ్చే ఘన నివాళులు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సూరం పద్మ , బెజుగం సురేష్ , జిందం కమలాకర్ , బింగి సంపత్ , సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కు ఘన సన్మానం.

ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కు ఘన సన్మానం

మెట్ పల్లి మే 22 నేటి ధాత్రి

 

 

ఉత్తమ ఎస్ హెచ్ ఓ గా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ,డి జి పి నుండి ప్రశంస పత్రం అందుకున్న ఎస్ ఐ అనిల్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.
తెలంగాణ రాష్ట్రంలో 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లో ఎస్ హెచ్ ఓ లుగా ఎంపిక కాగ అందులో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ఉత్తమ ఎస్ హెచ్ ఓ గా ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ ఎంపిక కావడం గర్వకారణం అన్నారు.. క్యూఆర్ కోడ్, సిటిజన్ ఫీడ్ బ్యాక్ లో ఉత్తమ ప్రతిభ కనబరచి తెలంగాణ డిజిపి డాక్టర్ జితేందర్ చేతుల మీదుగా బుధవారం ఇబ్రహీంపట్నం ఎస్ ఐ అనిల్ బెస్ట్ ఎస్ హెచ్ ఓ గా అవార్డును, క్యాష్ రివార్డును డిజిపి చేతుల మీదుగా హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో అందుకోవడం గొప్ప విషయం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి మాజీ పట్టణ అధ్యక్షులు ఖుతుబోద్దిన్ పాషా, కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కొడిమ్యాల దీపక్ రాజ్ , యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నల్లూరి సాగర్,ఎన్ఎస్ యుఐ కార్యదర్శి చీమల రాజు,మాజీ ఎంపీటీసీ తిమ్మని రాములు, కనుక దినేష్ ,హరిదాసు, కోరే రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కాలనీవాసులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న.

*కాలనీవాసులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎమ్మెల్యే సంజయ్ మల్లాపూర్

మే 22 నేటి ధాత్రి

 

:- గెలిచిన మొదటి పర్యటనలో మార్నింగ్ వాక్ చేసి కాలనీ సమస్యలు తెలుసుకున్న సంజయ్.
ఇచ్చిన మాట ప్రకారం కాలనీకి ప్రత్యేక నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే సంజయ్.
మల్లాపూర్ మండల కేంద్రంలోని దుర్గమ్మ కాలనీలో ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయల విలువగల సిసి రోడ్ డ్రైనేజ్ పనులు ప్రారంభమయ్యాయి. దీనిని స్తానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారము పరిశీలించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ నూతనంగా గెలుపొందిన తర్వాత మార్నింగ్ వాక్ లో భాగంగా మల్లాపూర్ మండల కేంద్రంలోని దుర్గమ్మ కాలనీలో మొదట మార్నింగ్ ప్రారంభించి కాలనీలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం సిసి రోడ్డు, డ్రైనేజీ పనులు, ఎమ్మెల్యేగా గెలిచిన 16 నెలల్లోనే మంజూరు చేసారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అధికారం ఉన్న లేకున్నా ప్రజల సమస్యలే ఎజెండగా కల్వకుంట్ల సంజయ్ అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తూ తనదైన శైలిలో ప్రజల బాగోగులు సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఏమి అవసరమో అవి గుర్తించి సమస్యలను పరిష్కరించడమే ఎమ్మెల్యే సంజయ్ లక్ష్యమని అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదని ప్రజల సమస్యని ప్రధాన ఎజెండగా ప్రజల్లో నిత్యం తిరుగుతూ సమస్యల పరిష్కరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, మల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు లింగస్వామి గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దిరెడ్డి లక్ష్మణ్, నాయకులు బద్దినపల్లి ప్రేమ్, డబ్బా రమేష్ రెడ్డి, కొమ్ముల జీవన్ రెడ్డి, కోడూరి బిక్షపతి, నల్ల రాజేశ్వర్, దళిత రాజు, బిట్టు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

నేటి ధాత్రి లో ప్రచురితమైన వార్తకు స్పందన.

నేటి ధాత్రి లో ప్రచురితమైన వార్తకు స్పందన
• కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో

నిజాంపేట: నేటి ధాత్రి

 

కష్టించిన పంట వానపాలు
ప్రచురితమైన వార్తకు రెవెన్యూ అధికారులు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో కొనుగోలు అయినప్పటికీ లారీలు రావడం లేదని రైతులు ఆరోపించడంతో బుధవారం వార్త నేటి దాత్రిలో ప్రచురితమైంది. ఈ మేరకు నిజాంపేట మండల తాసిల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి లు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు నిర్వాహకులకు కొనుగోలు వేగవంతం చేయాలని సూచించడం జరిగిందన్నారు. అలాగే రైస్ మిల్ నిర్వాహకులకు లారీలను త్వరితగతిన అన్లోడ్ చేయాలని సూచించడం జరిగిందన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు టార్పాలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించడం జరిగిందన్నారు.

నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలి.

నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలి.

ప్రతి విత్తన అమ్మకంపై రసీదు తప్పనిసరిగా ఇవ్వాలి.

అధిక ధరలకు విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ తప్పదు.

పలు విత్తన దుకాణాలను తనిఖీ చేసిన ఏడిఏ దామోదర్ రెడ్డి.

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి సంబంధిత డీలర్ లైసెన్సును శాశ్వతంగా రద్దు చేయబడుతుందని నర్సంపేట ఏడిఏ కే దామోదర్ రెడ్డి పేర్కొన్నారు గురువారం మండల కేంద్రంలోని పలు విత్తన దుకాణాలను తనిఖీ చేపట్టి. పలు కంపెనీలకు చెందిన విత్తన ప్యాకెట్లను పరిశీలించి కంపెనీకి సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన ఆమోదిత పత్రాలు పరిశీలించారు అదేవిధంగా విత్తన షాపులలో స్టాక్ రిజిస్టర్ లను, స్టాక్ బోర్డులను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆమోదిత పొందిన విత్తన ప్యాకెట్లను రైతులకు అంది ఇవ్వాలని అందించే క్రమంలో తప్పనిసరిగా ప్రతి రైతుకు రసీదు ఇవ్వాలని.

seeds

ప్రతిరోజు విక్రయించిన విత్తనాలను ప్రత్యేకంగా రిజిస్టర్ లో రైతుల పేర్లతో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని. విడిగా విత్తనాలు అమ్మకూడదని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విత్తన ప్యాకెట్లను రైతులకు విక్రయించాలి అధిక ధరలకు విత్తన ప్యాకెట్లను విక్రయించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పలువురు విత్తన డీలర్లను ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ అధికారులు కృష్ణ, గోపాల్ రెడ్డి, ఎస్సై వి గోవర్ధన్, మండల వ్యవసాయ అధికారి రజిత, ఏఈఓ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు తనిఖీల్లో పాల్గొన్నారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలి.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఇండియన్ రెడ్ క్రాస్ సేవలు, ఎన్నికలు, సభ్యత్వాల నమోదు తదితర అంశాలపై సమీక్ష

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలని జిల్లా రెడ్ క్రాస్ కమిటీ చైర్మన్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐ.ఆర్.సీ.ఎస్) సేవలు, ఎన్నికల నిర్వహణ ,సభ్యత్వాల నమోదు తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించగా, కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అందించిన సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఇతర అంశాలపై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ సేవలు అందింస్తున్న సొసైటీ సభ్యులను అభినందించారు.
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ గడువు తేదీ 8.5.2025 నాటికి ముగిసిన నేపథ్యంలో నూతన కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. వేములవాడ లోని ఏరియా హాస్పిటల్ ఆవరణలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కోసం స్థలం కేటాయించామని తెలిపారు. భవన నిర్మాణానికి నిధులు దాతల నుంచి సేకరించాలని, ఐఆర్సీఎస్ రాష్ట్ర చైర్మన్ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. అలాగే నూతన సభ్యత్వాలు చేయించాలని పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు, ఉపాధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రాయకరరావు వేణు కుమార్.
ప్రధాన కార్యదర్శి తాటిపాముల శివప్రసాద్. కోశాధికారి బుడిమె శివప్రసాద్. కమిటీ సభ్యులు సంగీతం శ్రీనివాస్. యెల్ల లక్ష్మీనారాయణ. దేవులపల్లి రాజమల్లు. చిదుర నాగ శంకర్. కమటాల రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

 ప్రభుత్వ బడులు బాగు చెయకపొతే పేదలకు విద్య.

 ప్రభుత్వ బడులు బాగు చెయకపొతే పేదలకు విద్య దూరమయ్యె ప్రమాదం
 రాష్ట్ర విద్యా కమిషన్ సలహదారు ఆర్.వెంకట్ రెడ్డి

నిజాంపేట నేటి ధాత్రి:

ప్రభుత్వ బడులను బాగుచేయకపొతె పేదలు,దళిత బహుజనులకు విద్య దూరమయ్యే ప్రమాదం పొంచి వున్నదని రాష్ట్ర విద్యా కమిషన్ సలహదారులు,యంవిఎఫ్ జాతీయ కార్యదర్శి ఆర్.వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దళిత బహుజన ఫ్రంట్ ( డిబిఎఫ్) ఆధ్వర్యంలో నిజాంపేట మండల కేంద్రంలో గురువారంనాడు భారత రాజ్యాంగం హక్కులు,చట్టాలు,సామాజిక,ఆర్ధిక రాజకీయ పరిస్థితులు నాయకత్వ లక్షణాల పై శిక్షణ శిబిరం నిర్వహించారు. విద్యా హక్కులు అమలు పరిస్థితి సవాళ్ళు పరిష్కారాలు అనే అంశం పై రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారులు ఆర్.వెంకట్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్న ప్రభుత్వానికి మా భర్తలు తాగె మద్యం ద్వారా వచ్చె ఆదాయం తో ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలని మహిళలు సూచిస్తున్నారని తెలిపారు.ప్రభుత్వ విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలి ప్రభుత్వానికి విద్యా కమిషన్ ద్వారా సూచించామని తెలిపారు. ప్రవేట్ పాఠశాలకుదీటుగా ప్రతి మండలం నాలుగు ఆధునిక పాఠశాలలను నిర్మించాలని,ప్రభుత్వ బడులకు వెళ్ళే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని,ప్రవేట్ పాఠశాల ఫిజుల దొపిడిని ఆరికట్టాలని కొరమని చెప్పారు.ప్రభుత్వ విద్య పరిరక్షణకు ప్రభుత్వం చట్టబద్ద బాధ్యత చెపట్టాలన్నారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చెయాలని,ప్రవెట్ పాఠశాలలో 25 శాతం రిజర్వేషన్ లను కల్పించాలన్నారు.రాజకీయ నాయకుల,డబ్బులు వున్న వారి ధనవంతుల,పేదల పిల్లలకు సమాన విద్య ను అందించాలన్నారు.ప్రభుత్వ, ప్రవెట్ పాఠశాలలో చదువుతున్న 50 శాతం పిల్లలకు బడికి పొయిన చదువు రావడం లేదన్నారు 1960 సంవత్సరం నాటికి అందరికి విద్యను అందించాలి డాక్టర్ అంబేద్కర్ చెప్పాడని గుర్తు చేశారు.ప్రభుత్వ విద్య రక్షణకు విద్య యుద్దం ఉద్యమం చేపట్టాలన్నారు. డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ నాయకత్వ లక్షణాల పై మాట్లాడుతూ బుద్దుడు పూలే అంబేడ్కర్‌ సిద్దాంతం వెలుగులు నాయకులు త్యాగన్ని అలవర్చుకొవాలన్నారు.నాయకులకు వినె లక్షణం వుండాలన్నారు.ఓర్పు,సహనం,నిస్వార్థాలను అలవర్చుకొవాలన్నారు. ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా వుండాలన్నారు.మానవత్వాన్ని పెంపొందించుకొని సమాజ మార్పు కొసం అంకిత భావంతో పని చెసె చిత్తశుద్ధి కలిగిన నాయకులుగా ఎదగలన్నారు. సమాచార హక్కు చట్టం పై డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ఆయుధం లాంటి దన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొవాలన్నారు.ఉపాధి,భూమి,విద్య తదితర పధకాల అమలు పై సమాచారాన్ని తెలుసుకొవచ్చాన్నారు.ఈ శిక్షణ శిబిరాన్ని డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజివ్ సమన్వయం చేయగా, రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొమ్ముల కర్ణాకర్,సిద్దిపేట జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు,కామారెడ్డి జిల్లా నాయకులు ప్రభాకర్, బి ప్రభాకర్,మహిళ కార్యకర్త ,నిజాంపేట మండల డిబిఎఫ్ అధ్యక్షులు బ్యాగరి చంద్రం, బ్యాగరి రాజు, నాయకులు యాదుల్, నర్సింలు,రామస్వామి, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ శిక్షణ శిబిరంలో ఆటలు,పాటలు గ్రూపుల వారిగా పలు అంశాల పై చర్చించారు.

వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభం….

వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభం….

న్యూ భారత్, న్యూ వరంగల్ రైల్వే స్టేషన్..

అమృత్ భారత్ స్టేషన్ పథకంలో బాగంగా పునరాభివృద్ది చేయబడిన వరంగల్ రైల్వే స్టేషన్,

నూతన హంగులతో, అత్యాధునిక సదుపాయాలతో వరంగల్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభం

వరంగల్, నేటిధాత్రి.

 

 

దేశ వ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అభివృధి చేసిన దాదాపు 103 రైల్వే స్టేషన్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గురువారం వర్చువల్ గా ప్రారంభించారు. అందులో భాగంగా అమృత్ భారత్ స్టేషన్‌ పథకంలో రూ.25.41 కోట్లతో పునరాభివృద్ధి చేసిన వరంగల్ రైల్వే స్టేషన్ ను కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు.

Railway Station.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డి కే అరుణ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, రాష్ట్ర రెవెన్యూ, పౌర సరఫరా, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.

కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ…

Railway Station.

 

భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి తీవ్ర కృషి చేస్తున్నారు అని, అందులో భాగంగా రైల్వే శాఖను అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు రైల్వే స్టేషన్లను నూతన హంగులతో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసాం అని అన్నారు. రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం ద్వారా సామాన్యులందరీకి అన్ని సదుపాయాలని కల్పించే విధంగా రైల్వే స్టేషన్ పునరుద్ధరించారు.

Railway Station.

 

2014కు ముందు రైల్వే బడ్జెట్కు కేటాయించిన బడ్జెట్ కంటే ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ చాలా ఎక్కువ అని, కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి వైపు నడిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు నాయకత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఇక్కడి నాయకులతో కలిసి పనిచేసిన బంధం, అనుభవం నాకుందని కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. వరంగల్ ప్రజలకు రైల్వే స్టేషన్ పునః ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

పార్లమెంట్ సభ్యులు డి.కె. అరుణ, ఈటల రాజేందర్ మాట్లాడుతూ..

Railway Station.

 

 

నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో దానికి సజీవ సాక్ష్యం ఈరోజు పునఃప్రారంభమైన మన వరంగల్ రైల్వే స్టేషన్ అని అన్నారు. ఎయిర్పోర్టులను తలపించే పద్ధతిలో రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతున్నాయి అని, స్వతంత్రం వచ్చినప్పుడు నుండి 2014 వరకు ఎంత అభివృద్ధి జరిగిందో ఈ పది సంవత్సరాల కాలంలో అంతకంటే వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి సజీవ సాక్ష్యం ఈరోజు పునఃప్రారంభమైన బేగంపేట్, కరీంనగర్, వరంగల్ ఇలా 103 రైల్వే స్టేషన్లు అని వారు అన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది.

Railway Station.

 

 

రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏవైనా ఉండొచ్చు కానీ అన్ని రాష్ట్రాలు సమగ్రంగా అభివృద్ధి చెందితే దేశం బాగుపడుతుందని చెప్పి మోడీ భావిస్తున్నారు అని తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్ ను ప్రజలకు అంకితం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Railway Station.

 

ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి, మున్సిపల్ కమిషనర్ అశ్వినీ తానజీ, సౌత్ జోన్ రైల్వే జిఎం, స్థానిక కార్పొరేటర్ అనిల్, వరంగల్ ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, వరంగల్ తహశీల్దార్ ఇక్బాల్, ఖిలా వరంగల్ తహసిల్దార్ నాగేశ్వర్ రావు, రైల్వే అధికారులు, రైల్వే టెక్నికల్ సిబ్బంది, వీరితో పాటు .

Railway Station.

 

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు రాష్ట్ర క్రమశిక్షణ సంఘ చైర్మన్ మార్తినేని ధర్మారావు, మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీర సీతారాం నాయక్, వన్నాల శ్రీరాములు, డాక్టర్ టి రాజేశ్వరరావు, వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంటా రవి కుమార్, బీజేపీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Railway Station.

 

వనపర్తి లో రోడ్ల విస్తరణ పూర్తి చేయాలి.

వనపర్తి లో రోడ్ల విస్తరణ పూర్తి చేయాలి

రోడ్డు కు అడ్డంగా ఉన్న భవనాలను కూల్చి వేయాలి

కలెక్టర్ అధికారులకు అదేశాలు

వనపర్తి నేటిధాత్రి:

 

9+వనపర్తి జిల్లాలో రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టర్ తన ఛాంబర్ లో వనపర్తి పట్టణం లో పాన్గల్ రోడ్ , కొత్తకోట, పెబ్బేరు రోడ్డు విస్తరణ పై అటవీ శాఖ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉన్న షాపింగ్ యజమానులు, ఇళ్ల యజమానులకు నోటీస్ లు జారీ చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. నోటీస్ లు జారీ చేసిన వారికి ఖాళీ చేసేందుకు కొంత సమయం ఇచ్చి భవనాల కూల్చివేతలు ప్రారంభించాలని సూచించారు. రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని రెవెన్యూ, రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించిన పెబ్బేరు రోడ్డు, ఈకో పార్కు, ఔటర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ స్కూల్ కు సంబంధించిన అటవీ భూముల విషయంలో అటవీ శాఖ అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈ సమావేశంలో డి.ఎఫ్ ఒ ప్రసాద్ రెడ్డి, ఆర్.ఎఫ్. ఒ అరవింద్ రెడ్డి, ఆర్డీఓ సుబ్రమణ్యం, స్థానిక తహసీల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, వెంకటేశ్వర్లు, రోడ్లు భవనాల శాఖ, మున్సిపల్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మంజూరు పట్ల సింగిల్ విండో వ్యవస్థకు శ్రీకారం.

హెచ్ టి సర్వీసుల మంజూరు పట్ల సింగిల్ విండో వ్యవస్థకు శ్రీకారం.

వరంగల్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ కె.గౌతమ్ రెడ్డి

నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

 

 

 

విని5యోగదారుల హెచ్ టి. 11 కెవి , 33 కెవి ఆపై వోల్టేజి సర్వీసుల మంజూరు వేగవంతం చేయడానికి సింగిల్ విండో వ్యవస్థను ప్రవేశపెట్టామని వరంగల్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ కె.గౌతమ్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ టి. 11 కెవి,33 కెవి, ఆపై వోల్టేజి సర్వీసుల మంజూరుకు మరింత సరళీకృతం చేయడానికి హెచ్ టి మానిటర్ సెల్ ను సర్కిల్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఇందులో భాగంగా 11 కెవి వోల్టేజి దరఖాస్తులను సర్కిల్ ఆఫీస్ ఏ.డి. ఈ కమర్షియల్ అధికారి మానిటర్ చేస్తారని,అలాగే 33 కెవి వోల్టేజి, ఆపై వోల్టేజి దరఖాస్తులను ఏ.డి. ఈ కమర్షియల్ కార్పొరేట్ ఆఫీస్ అధికారి మానిటర్ చేస్తారన్నారు.ఈ సింగిల్ విండో కొత్త విధానం వలన మొదట వినియోగదారులు టీజీఎంపీటీసీఎల్ పోర్టల్‌లో అవసరమైన పత్రాలతో హెచ్డి దరఖాస్తులు(టీ.జీ ఐపాస్ లో నమోదు కానటువంటివి)నమోదు చేసుకున్న తర్వాత కొత్త అప్లికేషన్ నంబర్ (యుఐడి) ఉత్పన్నమవుతుందని అలా వచ్చిన కొత్త దరఖాస్తులు టీజీఎంపీటీసీఎల్ యొక్క సంబంధిత సర్కిల్‌లలో డాష్ బోర్డులో కనిపిస్తుందన్నారు. ప్రతిరోజూ ఏడిఈ/కమర్షియల్‌లు అధికారులు డాష్ బోర్డుని మానిటర్ చేస్తుంటారని పేర్కొన్నారు.దరఖాస్తు నమోదు చేసుకున్న తర్వాత 11కెవి,33 కెవి ఆ పై వోల్టేజి దరఖాస్తులు సంబంధిత అధికారులకు ఎస్టిమేట్ల కొరకు పంపించబడుతుందని ఎడిఈ/కమర్షియల్ సర్కిల్ ఆఫీస్ ఫీల్డ్ స్టాఫ్ ఫీజిబిలిటీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కోసం లొకేషన్‌ను సందర్శిస్తారని చెప్పారు.33 కెవి, ఆపై వోల్టేజి ఎస్టిమేట్లను కార్పొరేట్ ఆఫీస్ అధికారులు అనుమతులు ఇస్తారని
ఇక 33 కే.వి ఆ పై వోల్టేజి దరఖాస్తులు ఐతే,ఆన్‌లైన్‌లో సంబంధిత సిఈ/కమర్షియల్ మరియు ఆర్ఎసి/టీజీ డిఆర్ఏఎన్ఎస్ సీఈవో కు ఫీజిబిలిటీ కోసం పంపించబడుతుందని తెలియజేశారు.
11కెవి వోల్టేజి దరఖాస్తులు పరిశీలించి ఫీజిబిలిటీ ఉంటె రెండు రోజుల్లో అప్‌లోడ్ చేయబడుతుందని వివిధ కారణాల వల్ల సాధ్యపడకపోతే, 2 రోజులలోపు రిమార్క్‌లు వినియోగదారునికి ఎస్ఎంఎస్ రూపేణా పంపబడుతుందని పేర్కొన్నారు.అలాగే 33 కెవి, ఆపై వోల్టేజి దరఖాస్తులు పరిశీలించి వాటికీ కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటుకు పొందుపరచిన సమయానుగుణంగా మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
సింగిల్ విండో వ్యవస్థ వలన త్వరితగతిన సర్వీసులు మంజూరు అవుతాయని,ప్రతి సారి ఆఫీసులకు రాకుండా ట్రాక్ చేసుకునే సౌకర్యం ఉందని అన్నారు.దీని వలన అత్యంత పారదర్శకత పెరుగుతుందని, వినియోగదారులు దరఖాస్తుల స్థితి గతులను ఎప్పటి కప్పుడు సెల్ ఫోన్ కు ఎస్ఎంఎస్ రూపేణా సమాచారం పంపబడుతుందని సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ కె.గౌతమ్ రెడ్డి వివరించారు.

ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన శ్రీకృష్ణవేణి హై స్కూల్.

ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన శ్రీకృష్ణవేణి హై స్కూల్

నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం విద్యానగర్ కాలనీలోని శ్రీకృష్ణవేణి హైస్కూల్ లో ఉచిత సమ్మర్ క్యాంపు ప్రారంభోత్సవం చేస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు బత్తిని దేవన్న తెలిపారు.15 సంవత్సరాల వయస్సు కలిగిన విద్యార్థుల కోసం మే 22వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రత్యేక ఉచిత సమ్మర్ క్యాంపు నిర్వహించబోతున్నమన్నారు.
ఈ సమ్మర్ క్యాంపులో కరాటే, యోగా,పబ్లిక్ స్పీకింగ్, కంప్యూటర్ నాలెడ్జ్,క్లే పోటరీ వంటి పాఠ్యేతర కార్యకలాపాలు ప్రతిరోజూ ఉదయం 7:00నుండి 9:00 గంటల వరకు శిక్షణ ఇస్తామన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు బత్తిని దేవన్న మాట్లాడుతూ..ఈ రోజులలో విద్యార్థుల అభివృద్ధి పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా వారిలో స్వీయనమ్మకం,ఏకాగ్రత, ఆత్మనియంత్రణ,వ్యక్తిత్వ వికాసం వంటి లక్షణాలను పెంపొందించాల్సిన అవసరం ఉంది.కరాటే మరియు యోగా శారీరక ధైర్యం,మానసిక ఓర్పు పెంచుతాయి.ఇవి విద్యార్థులకు బౌద్ధిక స్థితి సమతుల్యతను అందిస్తూ, వారి ఒత్తిడిని అధిగమించేలా చేయగలవు.

క్యాంపు సమన్వయకర్త, సబ్జెక్టు నిపుణులు బత్తిని రాకేష్

సమ్మర్ క్యాంప్ ఏర్పాటుచేసిన సందర్భంగా మాట్లాడుతూ..ఈ క్యాంపు ద్వారా విద్యార్థులు తమ లోకజ్ఞానం, ఆత్మవిశ్వాసం మరియు సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవచ్చు.అలాగే ఈ తరహా కార్యక్రమాలు వచ్చే విద్యాసంవత్సరంలోనూ శ్రీకృష్ణవేణి హై స్కూల్ తరఫున కొనసాగించబడతాయని వారు తెలిపారు.ఈ ఉచిత సమ్మర్ క్యాంపు కోసం నమోదు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకొని తమ పిల్లల భావి ప్రగతికి బలమైన పునాది వేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు.

శిశువుకు ఆరు నెలల వరకు తల్లిపాలు పట్టించాలి.

శిశువుకు ఆరు నెలల వరకు తల్లిపాలు పట్టించాలి.

చిట్యాల నేటి ధాత్రి :

 

 

 

చిట్యాల మండలం లోని చల్లగిరిగే నాలుగు 5వ కేంద్రం తనిఖీ చేసి ఏడవ నెల నుండి మూడు సంవత్సరాల పిల్లలకు ఇవ్వవలసిన అదనపు ఆహారము వ్యాధినిరోధక టీకాలు వ్యక్తిగత శుభ్రత పిల్లలకి ఇవ్వాల్సిన మంచినీరు బయట తినుబండారాలు తినిపించరాదని తల్లులకు వారి అత్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి బరువులు తీసి వయసులవారిగా ఉండాల్సిన బరువు ఎత్తు గురించి వివరించి రెండు నెలల బాలింత ఇంటికి గృహ సందర్శన చేసి బాలింతకు ఇవ్వాల్సిన ఆహారము శుభ్రత పాపకు కేవలం తల్లి పాలు తాగించాలని ఇతర పానీయాలు తాగించవద్దని కాటన్ బట్టలు ధరించాలని బాలింత మొబైల్ వాడకుండా ఎటువంటి టెన్షన్ లేకుండా సమతల హారము భుజిస్తూ ఆరు నెలల వరకు తల్లి పాలే తాగించాలని కుటుంబ సభ్యులందరికీ అవగాహన కల్పించనైనది అంగన్వాడీ టీచర్సు కరుణ కవిత ఆయా హాజరైనారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన తిరుపతి.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన తిరుపతి ఎల్బీనగర్ కు చెందిన అరవ కీర్తన ఆలైవ్.

తిరుపతి(నేటి ధాత్రి)మే22:

హలెల్ మ్యూజిక్ స్కూల్ ఫౌండర్ ఆగష్టిన్ ఆధ్వర్యంలో 2024 డిసెంబర్ 1న నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో దాదాపు 18 దేశములలో నుండి 1500 మంది విద్యార్థులు పాల్గొని ఒక గంట పాటు కీబోర్డ్ ప్లే చేయడం జరిగినది. అందులో తిరుపతి జిల్లా ఎల్బీనగర్ కు చెందిన విజయబాబు శైలజ కుమార్తె 6వ తరగతి చదువు తున్న అరవ కీర్తన ఆలివ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించినది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన తిరుపతి ఎల్బీనగర్ కు చెందిన అరవ కీర్తన ఆలైవ్.
హలెల్ మ్యూజిక్ స్కూల్ ఫౌండర్ ఆగష్టిన్ ఆధ్వర్యంలో 2024 డిసెంబర్ 1న నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో దాదాపు18 దేశములలో నుండి 1500 మంది విద్యార్థులు పాల్గొని ఒక గంట పాటు కీబోర్డ్ ప్లే చేయడం జరిగినది. అందులో తిరుపతి జిల్లా ఎల్బీనగర్ కు చెందిన విజయబాబు శైలజ కుమార్తె 6వ తరగతి చదువు తున్న అరవ కీర్తన ఆలివ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించినది..

మందమర్రిలోఎలక్ట్రిసిటీ పోల్స్ స్ట్రీట్ లైట్లు పరిశీలించిన.

మందమర్రిలోఎలక్ట్రిసిటీ పోల్స్ స్ట్రీట్ లైట్లు పరిశీలించిన

మందమర్రి నేటిధాత్రి

 

 

మందమర్రి పట్టణం
శ్రీపతి నగర్ 15 వ వార్డ్
ఎలక్ట్రిసిటీ పోల్స్ స్ట్రీట్ లైట్లు పరిశీలించిన ఏఈ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
గౌరవ చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గత రెండు రోజుల క్రితం శ్రీపతి నగర్ లో పర్యటించిన సందర్భంగా వార్డు ప్రజలు కరెంట్ ఫోల్స్ – వీడి దీపాలు- కరెంటు – సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.
వెంటనే వివేక్ స్పందించి ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాస్ నీ ఆదేశించిన సందర్భంలో
ఈ రోజు శ్రీపతి నగర్ లో ఏఈ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ వార్డు బాధ్యులు పైడిమల్ల నర్సింగ్ శ్రీపతి నగర్ లో పర్యటించి ప్రజల వద్దకు వెళ్లి కరెంట్ సమస్యలను ఎన్ని ఫోన్స్ అవసరం ఉంటాయి. స్ట్రీట్ లైట్లు ఎన్ని అవసరం ఉంటాయి. ఎన్ని సార్లు కరెంటు పోతుందని. తెలుసుకొని ఎమ్మెల్యే వివేక్ గారి సహకారంతో తొందరలోనే ప్రజల కరెంటు కష్టాలు తీరుస్తామని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో
ఏఈ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు.
మంద తిరుమలరెడ్డి.
ఎద్దు వెంకటాద్రి.
భోగి వెంకటేశ్వర్లు.
రామస్వామి సోమయ్య. సురేందర్..
కుండే రామకృష్ణ.
శనిగారపు చంద్రయ్య తో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు పాల్గొన్నారు

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

నేటిధాత్రి చర్ల:

చర్ల మండలంలోని ఎమ్మార్వో ఆఫీస్ వద్ద 29 కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మండలంలోని 29 కుటుంబాలకు 33 లక్షల 64 వేల రూపాయలను కళ్యాణ లక్ష్మి చెక్కులను మండల అధికారులు మరియు మండల నాయకులు సమన్వయంతో లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది.

Lakshmi

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాస్ డిప్యూటీ తాసిల్దార్ ముద్దరాజు చర్ల ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పరుచూరి రవి చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలిన లంకరాజు చీమలమర్రి మురళి మరియు సీనియర్ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

మనస్థాపం తో వ్యక్తి ఆత్మహత్య.

— మనస్థాపం తో వ్యక్తి ఆత్మహత్య

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

ఆర్థిక భారం తో మనస్థాపనికి గురై ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘన నిజాంపేట మండలం చల్మెడ లో చోటుచేసుకుంది. పోలీస్ ల వివరాలు.. గ్రామానికి చెందిన కంపే పరుశురాములు (34) అను వ్యక్తి ట్రాక్టర్ కొని దానికి కిస్తీలు బాకీ పడి మనస్తాపంతో ఇంట్లోనే దులానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజాంపేట ఇంచార్జ్ ఎస్సై సృజన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కాలానికి అనుగుణంగా వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి.

కాలానికి అనుగుణంగా వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి

ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన ఎంపిడిఓ

పరకాల నేటిధాత్రి

 

 

మండల విద్యాశాఖ అధికారి రమాదేవి అధ్యక్షతన చైతన్య మోడల్ స్కూల్ లో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు సందర్శించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ “మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాలు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని,ఆధునిక విద్యా విధానాలను పాటిస్తూ విద్యార్థులకు భోదించాలని అన్నారు.ప్రభుత్వం ఉచిత పుస్తకాలు,దుస్తులు, రుచికరమైన మధ్యాహ్న భోజనం,నోటు బుక్స్ తో పాటు అన్ని రకాల సౌకర్యాలను విద్యార్థులకు కల్పిస్తుందని ఉపాధ్యాయులు ఈ విషయాలు ప్రచారం చేసి పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు విధ్యాభోదనలో నూతన మెలకువల పై స్టేట్ రిసోర్స్ పర్సన్ శ్రీధర్,యం.ఆర్.పి లు బిక్షపతి,రామన్న,మోహన్, ఆజాం,బాబు,లత,కీరవాణి తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version