పెద్ద పాలేరుగా పని చేస్తా!

https://epaper.netidhatri.com/

జనగామ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన విషయాలు.. ఆయన మాటల్లోనే…

`జనగామ నియోజకవర్గ సమస్యలు నెల రోజుల్లో తీరుస్తా!

`ముఖ్యమంత్రి కేసిఆరే వచ్చి భరోసా ఇచ్చారు.

`జనగామను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా!

`సమస్యలు లేని జనగామ ఆవిష్కరిస్తా!

`కాంగ్రెస్‌ కు ఓటు అడిగే నైతికతే లేదు.

`జనగామ ఒకప్పుడు కరువు ప్రాంతం.

`ఇప్పుడు జనగామ జిల్లా అంతా సస్యశ్యామలం.

`ఫ్లోరైడ్‌ సమస్య తీరిపోయింది.

`చెరువులన్నీ ఎప్పుడూ నిండుగా వుంటాయి.

`చేర్యాల రెవెన్యూ డివిజన్‌ చేయిస్తా!

`చేర్యాల ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తా!

`కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అతుకుల బొంత.

`అరవై ఏళ్లు పాలించి చేసిందేమీ లేదు.

`పదేళ్లలో కేసిఆర్‌ పాలన, తెలంగాణ ప్రగతి దేశానికే ఆదర్శమౌతోంది.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

జనగామ ఒకదశలో మోడువారిన ఎడారి. జనగామ అత్యంత కరువు ప్రాంతం. సాగునీటి అవకాశాలు చాలా తక్కువ. తాగు నీటి సమస్య అధికం. పైగా ఫ్లోరైడ్‌ బాధతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సాయుధ రైతాంగ పోరాటానికి పురిటిగడ్డ. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి జీవగడ్డ. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన గొప్ప చరిత్ర జనగామ కు వుంది. అంతటి వీరోచితమైన ఉద్యమ నేపథ్యమే కాదు, సర్థార్‌ సర్వాయి పాపన్న ఏలిన నేల. అలాంటి జనగామ ప్రాంతం నిరంతరం పోరు కాలమే చూసింది. కష్ట కాలమే అనుభవించింది. అరవై సంవత్సరాల ఉమ్మడి రాష్ట్ర పాలకుల వివక్ష పూరిత పాలనలో అడుగడుగునా అవస్థలకు లోనైంది. సమస్యలకు నిలయంగా మారింది. సాగు నీరు లేదు. తాగు నీరు కరువు. అలాంటి జనగామ తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో గొప్పగా అభివృద్ధి చెందింది. గడచిన పదేళ్లలో ఎంతో గొప్పగా ప్రగతిని సాధించింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కు జనగామ అంటే ప్రత్యేకమైన అభిమానం. పైగా జనగామ, చేర్యాల ప్రజా సమస్యలు, ప్రాంత అవస్థలు ఆయన కు తెలుసు. అందుకే మిషన్‌ కాకతీయ తొలి ఫలితాలు జనగామ నియోజకవర్గానికి అందించారు. మొదటి దశలోనే జనగామ జిల్లా, నియోజకవర్గం పరిధిలోని అన్ని చెరువులను ఏక కాలంలో మరమ్మత్తులు చేయించారు. చెరువులు నింపడం జనగామ తోనే మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కు జనగామ ప్రాంతమంటే అంత మమకారం. అలాంటి జనగామ నుంచి ఈసారి బిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో వున్నాను. నన్ను జనగామ ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే గా ఎన్నికైన క్షణం నుంచి పెద్ద పాలేరుగా పని చేస్తా! జనగామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా…అంటున్న పల్లా రాజేశ్వరరెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన విషయాలు..విశేషాలు ఆయన మాటల్లోనే…
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.

ప్రగతి అనేది ఒక దగ్గర ఆగేది కాదు. నిరంతరం నీటి ప్రవాహం లాంటిది. ఇప్పటికే అనేక సమస్యలకు పరిష్కారం జరిగింది. జనగామ జిల్లా కేంద్రమైంది. మెడికల్‌ కాలేజీ వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో అభివృద్ధి జరిగింది. ఇంకా కొన్ని ప్రాధాన్యతా క్రమంలో వెనుకబడి వున్నాయి. వాటిని గుర్తించడం జరిగింది. పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిశీలన జరుగుతోంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని మొదలుపెట్టడం జరుగుతుంది. అలాంటి ఎన్ని సమస్యలు వున్నా జనగామ నియోజకవర్గ సమస్యలు నెల రోజుల్లో పరిష్కరిస్తా! ఈ విషయం ముఖ్యమంత్రి కేసిఆర్‌ తోనే చెప్పించా… ప్రజలకు భరోసా కల్పించాను.
జనగామ ఇప్పటికే అనేక రంగాలలో అభివృద్ధి జరిగింది.
జనగామ కొన్ని దశాబ్దాలుగా గొప్ప విద్యా కేంద్రంగా వెలుగొందుతోంది. హైదరాబాద్‌ కు కూత వేటు దూరంలో వున్నట్లే లెక్క. గతంలో జనగామ నుంచి హైదరాబాద్‌ వెళ్లాలంటే రెండున్నర గంటల సమయం పట్టేది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ వచ్చిన తర్వాత రోడ్డు రవాణా రంగంలో ఎంతో పురోగతి తెచ్చారు. అసలు ఒకప్పటి రహదారులకు ఇప్పుడు మనం చూస్తున్న రోడ్లకు ఎంతో తేడా వుంది. అదే ఉమ్మడి రాష్ట్రంలో వుంటే మన జనగామ గతంలో ఎలా వుందో ఇప్పుడూ అలాగే వుండేది. చుక్క నీరు లేక అల్లాడిపోయేది. కరంటు కోతలతో విలవిలలాడిపోయేది. ఉపాధి కరువై వలసలు వెళ్లేది. మరి ఇప్పుడు జనగామ ప్రాంతంలో ఉపాధి కోసం ఉత్తరాధి నుంచి యువత వస్తున్నారు.

కరువు ప్రాంతం అన్నపూర్ణగా మారి సాగు పనుల కోసం ఇతర రాష్ట్రాలనుండి వచ్చి ఉపాధి పొందుతున్నారు.
సాగు సాగక వేలాది మంది జనగామ చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు హైదరాబాద్‌ పనుల కోసం వెళ్లి వస్తుండే వారు. ఇప్పుడు అలాంటి వాళ్లంతా ఊళ్ళలో హాయిగా వ్యవసాయం చేసుకుంటున్నారు. బంగారు పంటలు పండిస్తున్నారు. అయినా ఇంకా తెలంగాణ అభివృద్ధి జరగాలి. ఆ బాధ్యత నాది. జనగామ నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా! సమస్యలు లేని జనగామ ఆవిష్కరిస్తా! అందుకు అందరి సహకారం అవసరం. కార్యకర్త స్థాయి నుంచి నాయకుల దాకా , ప్రజలందరితో తలలో నాలుకలా వుండేందుకు ప్రయత్నం చేస్తా. ప్రజల్లో మమేకమౌతా. ప్రతి ఇంటికి బంధువునౌతా. అన్ని కుటుంబాలలో సభ్యుడినౌతా. వారి మంచీ, చెడుకు తోడుగా వుంటా. ప్రజలు ఏ సమస్య తో వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో వుంటా. ప్రజలకు సేవ చేస్తా. జనగామ కు కీర్తిని తీసుకొస్తా. జనగామలోనే కాదు, తెలంగాణ లో ఎక్కడా కాంగ్రెస్‌ కు ఓటు అడిగే నైతికతే లేదు. అసలు కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణ అరవై సంవత్సరాల పాటు అష్టకష్టాలు అనుభవించింది. తీరని గోసను ఎల్లవోసింది. తెలంగాణ వచ్చాకనే తెలంగాణ కు కళ వచ్చింది. జనగామ కు కూడా వెలుగొచ్చింది.
చేర్యాల ప్రజల న్యాయ పరమైన డిమాండ్‌ రెవెన్యూ డివిజన్‌.

చేర్యాల ప్రజలు వివిధ పనుల కోసం అటు గజ్వేల్‌, ఇటు హుస్నాబాద్‌, జిల్లా కేంద్రం సిద్దిపేట కు వెళ్లాల్సివస్తోంది. ప్రజలకు ఎంతో ఇబ్బంది ఎదురౌతోది. ప్రజలు పడుతున్న ఇబ్బంది నాకు అర్థమైంది. అందుకే ఎన్నికల వేధిక మీదనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. జనగామ, చేర్యాల ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తా! కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అతుకుల బొంత.
అరవై ఏళ్లు పాలించి చేసిందేమీ లేదు. కనీసం మంచినీళ్లిచ్చింది లేదు.
పదేళ్లలో కేసిఆర్‌ పాలన, తెలంగాణ ప్రగతి దేశానికే ఆదర్శమౌతోంది. జనగామ నియోజకవర్గంలో ఇంకా ఎలాంటి సమస్యలున్నా దయచేసి ప్రజలు నా దృష్టికి తీసుకురాల్సిందిగా కోరుతున్నాను. జనగామ ప్రజాశీర్వాద సభ గొప్పగా జరిగింది. ప్రజలు నన్ను ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో హజరయ్యారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా ఎంతో సంతోషించారు. సభ సక్సెస్‌ వెనుక నాకు తోడ్పాటునందించిన బిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ధన్యవాదాలు. నన్ను కడుపులో పెట్టుకొని దీవించి గెలిపించే ప్రజలను, బిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను నా గుండెల్లో పెట్టుకుంటాను. జై తెలంగాణ. జై జనగామ.

పూర్తిగా తెలుగు దేశంగా మారిన టి. కాంగ్రెస్‌.

https://epaper.netidhatri.com/

`చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం.

`గత రెండేళ్ళుగా రేవంత్‌ స్కెచ్‌ గురించి చెబుతున్న నేటిధాత్రి.

`రేవంత్‌ రెడ్డి అడుగులు ఎలా వుంటాయన్నది చెప్పింది.

`అక్షరాల ఇప్పుడు అదే జరుగుతోంది.

`కాంగ్రెస్‌ నిండా మునిగి…పసుపు రంగు తేలుతోంది.

`కాంగ్రెస్‌ సీనియర్లంతా బైటకు…

`తెలుగు దేశం సీనియర్లంతా కాంగ్రెస్‌ కు

`తెలుగు దేశం బ్యాచ్‌ కు పంపకాలు.

`రేవంత్‌ రెడ్డి అనుచరులందరికీ టిక్కెట్లు.

` కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం.

`అసలు కాంగ్రెస్‌ నేతలకు శఠగోపం.

`కాంగ్రెస్‌ ఆనవాలు లేకుండా చేసే ప్రయత్నం.

`సమైక్యాంధ్ర కోసం పని చేసిన చంద్రబాబు ను తరుముతున్న అక్కడి రాజకీయం.

` తలదాచుకున్న చోట రాజకీయం కోసం చంద్రబాబు ఆరాటం.

`రేవంత్‌ నేతృత్వంలో తెలంగాణ చీకటి మయం.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రేవంత్‌రెడ్డి పక్కా బ్లేమ్‌ గేమ్‌ ఆడుతున్నాడు. తాను మాత్రం సేఫ్‌ రాజకీయాన్ని ఎంచుకున్నాడు. కాంగ్రెస్‌ను బ్లైండ్‌గా మార్చేశాడు. మొత్తం పార్టీని నిండా ముంచేందుకు కంకణం కట్టుకున్నాడు. కాంగ్రెస్‌ పార్టీని ఆఖరు దశకు, అవసాన దశకు తెచ్చేశాడు. రేవంత్‌రెడ్డి ఇలాగే చేస్తాడని సీనియర్లకు ముందే తెలుసు. ముందు నుంచి మొత్తుకుంటూనేవున్నారు. అయినా అదిష్టానం వినిపించుకోలేదు. ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. కర్నాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ బలపడిరదే గాని, రేవంత్‌ మూలంగా కాదన్నది పార్టీ అధిష్టానం గుర్తించలేకపోతోంది. కేవలం రేవంత్‌ రెడ్డి అధ్యక్షుడిగా వుండడం మూలంగా ఆయన ద్వారా చేరికలు జరుగుతున్నాయే కాని ఆయన వల్ల కాదు. పైగా ఆయనకూడా పనగట్టుకొని పాత తరం తెలుగుదేశం నేతలందరినీ కాంగ్రెస్‌లోకి తీసుకురావడం వెనుకు వున్న ఆంతర్యం సీనియర్లందరకీ తెలుసు. ఇప్పుడు వాళ్లపెత్తనమే సాగుతుందన్నది కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయాన్ని నేటిధాత్రి ఎప్పటి నుంచో చెబుతూనే వుంది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పుడే ఆయన అడుగుల గురించి చెప్పింది. ఆ తర్వాత ఆయన ప్రతి అడుగును నిరూపిస్తూ వచ్చింది. ఆయన ఆలోచనలు ఎలా వున్నాయన్నది నాటి నుంచే నేటిధాత్రి చెబుతూనే వస్తుంది? ఖచ్చితంగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను మింగేస్తాడు అన్నది ఇప్పుడు అక్షరాలు నియమయ్యే దశకు దాదాపు వచ్చింది. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ అన్నది లేకుండాపోవడం ఖాయం. ఒక్కసారి కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన మొదటి లిస్టు చూస్తేనే అర్ధమౌతుంది. ఇక తాజగా నిజామాబాద్‌కు చెందిన మండవ వెంకటేశ్వరరావు, ఖమ్మం జిల్లాకు చెందని తమ్మల నాగేశ్వరరావు, వరంగల్‌ జిల్లాకు చెందిన రేవూరి ప్రకాశ్‌రెడ్డిలు, బిఆర్‌ఎస్‌ నుంచి ఈటెలతో వెళ్లిన ఏనురు రవీందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతోనే అసలు రంగు పూర్తిగా బైటపడిరది. కాంగ్రెస్‌ ఆకుపచ్చ రంగు కాస్త పసుపు రంగులోకి మారిన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేదో సినిమాలో పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగ అంటూ చెప్పినట్లే, పూర్తిగా తెలుగుదేశంగా మారిపోయిన కాంగ్రెస్‌ ఇప్పుడు కనిపిస్తోంది. భవష్యత్తులో కాంగ్రెస్‌ తెలంగాణలో కనుమరుగౌతుంది. కాదు..రేవంత్‌ స్చెచ్‌తో అంతరించిపోతుంది. ఇదంతా ఎందుకు జరుగుతోంది? అన్నది కూడా సుస్పష్టమే. తెలంగాణ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌లో కంగ్రెస్‌ను ప్రజలు పది అడుగుల లోతున పాతేశారు. ఇక లేవకుండా చేసేశారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను సమాధి చేసే బాధ్యత రేవంత్‌రెడ్డి తీసుకున్నారు. చంద్రబాబుకు తెలంగాణ రావడం ఏ మాత్రం ఇష్టం లేదు. రెండు కళ్ల సిద్దాంతం, రెండు కొబ్బరి చిప్పల సిద్దాంతం పైకి చెప్పి, సమైక్యాంధ్ర నినాదం వినిపించింది చంద్రబాబు. తెలంగాణ రావడంతోనే తన రాజకీయ జీవితం చీకటిమయమైందన్న భావనలో చంద్రబాబు వున్నారు. ఇక ఆంధ్రాలో తన రాజకీయం చెల్లేలా లేదు. చంద్రబాబు పార్టీకి మనగడ లేదు. అందుకే చంద్రబాబుకు తెలంగాణ రాజకీయం మీద గత ఎన్నికల్లోనే కన్నుపడిరది. గతంలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని అస్ధిరపర్చాలని కుట్ర చేశాడు. భంగపడ్డాడు. తెలంగాణ నుంచి తరిమేయబడ్డాడు. ఆ పగతో రగిలిపోతున్నాడు. చంద్రబాబు ఆదేశించాఉ. రేవంత్‌ ఆచరిస్తున్నాడు. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం రేవంత్‌రెడ్డి ఏదైనాచేస్తాడు. అందుకే ఆ కార్యక్రమం మొదలుపెట్టారు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలను ఒక్కొక్కరిగా సాగనంపుతూ వస్తున్నాడు. పాత తెలుగుదేశం నాయకులందిరనీ కాంగ్రెస్‌లో చేర్చుతూ వస్తున్నాడు. మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీలో తెలుగుదేశం శ్రేణులతో నింపుతున్నాడు. తన మాటే చెల్లుబాటు అయ్యేలా చూసుకుంటున్నాడు. అదను చూసి, అవకాశం చూసి, తన చేతుల్లో పూర్తిగా హస్తం బంధీ చేసుకోవాలనుకుంటున్నాడు.. ఆ తర్వాత చంద్రబాబు చేతుల్లో పెట్టాలని చూస్తున్నాడు. ఇది కూడా కాంగ్రెస్‌ సీనియర్లకు ఎప్పుడో అర్ధమైంది. కాని డిల్లీ పెద్దలకు అర్ధం కావడం లేదు. రేవంత్‌ చేసే ఆర్ధిక పరిహారాలు తప్ప, రేవంత్‌ చేస్తున్న కుట్ర వ్యవహారాలు జాతీయ నాయకులకు పట్టడం లేదు. వాళ్లు పట్టించుకోవడం లేదు. పైగా సీనియర్లంతా కట్టగట్టుకొని వెళ్లి చెప్పినా డిల్లీ పెద్దలు వినిపించుకునేలా లేదు. అలా వారిని కూడా మాయి చేసి, నాపై ఎవరు ఏం చెప్పినా పట్టించుకోవద్దన్న సంగతి ముందే చెప్పి కదిలంచలేని ధ్వజస్థంభమైపోయాడు. సీనియర్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నాడు. వారిని రాజకీయంగా కనుమరుగు చేస్తున్నాడు. అనుకున్నందంతా సాఫీగా సాగితే, గెలిచిన నాయకులంతా ఇప్పటి వరకు ఎలా వలస వెళ్లారో? రేపు అదే విధంగా అందరూ తెలుగుదేశం పేరుతో కొత్త దందా మొదలుపెడతారు. గుండుగుత్తగా వెళ్లి, కాంగ్రెస్‌ను అసెంబ్లీలో లేకుండా చేస్తాడు. గతంలో తెలుగుదేశం పార్టీ ఎల్పీని బిఆర్‌ఎస్‌లో విలీనం చేసినట్లే, కాంగ్రెస్‌ను తెలుగుదేశంలో విలీనం చేయడమే రేవంత్‌రెడ్డి ముందున్న ప్రధానకర్తవ్యం. మళ్లీ చంద్రబాబు నాయకత్వాన్ని తెలంగాణ మీద రుద్దడం. ఇదే జరగాలని రేవంత్‌ కంకణం కట్టుకున్నాడు. అమలు చేస్తున్నాడు. ఆచరణలో అందరిని కలుపుకుంటూ పోతున్నాడు. కాంగ్రెస్‌లో పాత వాసన లేకుండా చూసుకుంటున్నాడు.
పొన్నాల లక్ష్మయ్య లాంటి నాయకుడు కూడా పార్టీ బైటకు వెళ్లాల్సిన పరిస్ధితి ఎందుకొచ్చింది.

గడచిన నలభై సంవత్సరాలుగా ఆయన పార్టీకోసం పనిచేస్తూ వస్తున్నారు. గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లుగా, రేవంత్‌లాగా అంతటి దిగజారిన వ్యాఖ్యలు ఎవరూ చేయలేదు. రాజకీయాల్లో అలాంటి వ్యాఖ్యలు సమర్ధినీయంకాదు. ఆహ్వానించకూడదు. ఎవరైనా ఖండిరచాల్సిందే. అయితే తెలంగాణ తొలి పిసిసి అధ్యక్షుడైన పొన్నాలను కూడా సాగనంపడం అంటేనే రేవంత్‌ రెడ్డి ఎంత పకడ్భంధీగా పథకం రచించిండో అర్ధం చేసుకోవచ్చు. ఇక అదే జనగామ జిల్లాకు జంగా రాఘవరెడ్డి అధ్యక్షుడుగా వుండేవారు. ఆయనను పక్కకు తప్పించి, కొత్తగా కొమ్మూరి ప్రతాపరెడ్డిని తెచ్చిపెట్టారు. మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చుపెట్టారు. ఒకనాడు ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో వెలుగువెలిగిన జంఘారాఘవవరెడ్డి లాంటి వారి రాజకీయం తుంచేసేశాడు. ఇలా చాల మంది నాయకులు రాజకీయ భవితవ్యాన్ని రేవంత్‌రెడ్డి ప్రశ్నార్ధకం చేస్తూ వస్తున్నాడు. ఉప్పల్‌ నియోజకవర్గంలో రాగిడిలక్ష్మారెడ్డి గడచిన ముప్పైఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీకి సేవ చేస్తూ వస్తున్నాడు. ఆయనకే టికెట్‌ అని ముందు మాట ఇచ్చారు.లిస్టులో పేరు లేకుండా మరొకరికి ఇచ్చారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డి మీద రేటెంత రెడ్డి అంటూ విమర్శలు వస్తూనే వున్నాయి. ఎంతో మంది సీనియర్‌ నాయకులకు మొదటి లిస్టులో పేరు లేకుండాపోయింది. ఎంతో మంది దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు కూడా వున్నాయి. అందుకు సాక్ష్యంగా పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి. ఇంత కాలం కాంగ్రెస్‌ పార్టీకి పనిచేసిన వాళ్లను వెర్రివెంగళప్పలను చేసేస్తున్నాడు. ఇక తాజాగా పొన్నాల లక్ష్యయ్యపై రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నాడంటే పార్టీ అదికారంలోకి వస్తే ఆయన వ్యవహరశైలి ఎలా వుంటుందో అన్న భయం మొదలైంది. మొదటి లిస్టులోనే నమ్మిన వారిని మోసం చేసినట్లు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అంతే కాదు సాక్ష్యాత్తు తన సొంత నియోజకవర్గం లోనే తన అనుచరుడుగా వున్న నాయకులు రేవంత్‌ను ఎలా గెలుస్తావో చూస్తా? అంటూ సవాలు విసురుతున్నాడు. ఏది ఏమైనా రేవంత్‌ రాజకీయంలో నిజాయితీ కనిపించడం లేదన్నది చాల మంది అభిప్రాయం. తనకు ముఖ్యమంత్రి కావాలన్న కోరిక వున్నా, చంద్రబాబు కోసం ఎలాంటి త్యాగమైన చేస్తాడని, మళ్లీ తెలంగాణను చంద్రబాబు చేతుల్లో పెట్టడానికి కూడా రేవంత్‌ వెనుకాడడన్న అపవాదు వుంది. ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి.

బీఆర్ఎస్ మేనిఫెస్టో కేసీఆర్ బీమా పేరుతో కొత్త స్కీమ్

విపక్షాల మైండ్ బ్లాక్…

తెలంగాణలో మూడోసారి కూడా అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తన మేనిఫెస్టోను ప్రకటించింది. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. గత ఎన్నికల్లో మాదిరి ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ ప్రజలపై వరాల వర్షం కురిపించారు. రైతు బంధు, దళిత బంధు, కల్యాణ లక్ష్మి వంటి ఇతర పథకాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మరో కొత్త హామీ ఇచ్చారు. రైతు బీమా తరహాలో.. తెల్ల రేషన్‌ కార్డుదారులకు… బీమా అమలు చేస్తామని.. సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఎల్‌ఐసీ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టి… పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటామని కేసీఆర్‌ భరోసా కల్పించారు.

బీఆర్ఎస్‌ పార్టీనే మళ్లీ అధికారంలో వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు కేసీఆర్‌ బీమా చేయిస్తామని.. 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్‌ బీమా ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కేసీఆర్‌ బీమా…ప్రతి ఇంటికి ధీమా అని అభివర్ణించారు. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తామని.. ‘తెలంగాణ అన్నపూర్ణ’ పథకం ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు. మరోవైపు దశల వారీగా ఆసరా పింఛన్ల మొత్తం పెంపు ఉంటుందని చెప్పారు. మొదటి ఏడాది రూ.3 వేలు పెంచి.. ఏటా రూ.5వందల చొప్పున రూ.5వేల వరకు పెంచుతామని వెల్లడించారు.

ఏటా 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయరంగంలోతెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుందని చెప్పారు. తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా పథకాలు తెచ్చామని వివరించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు క్లిష్ట పరిస్థితులు ఉండేవన్న కేసీఆర్.. కరెంట్‌, నీటి సౌకర్యాలు ఉండేవి కావని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పని వాటిని కూడా అమలు చేశామని.. కల్యాణలక్ష్మి పథకం ఎవరూ అడగకపోయినా అమలు చేశామని.. ఎన్నికల ప్రణాళికలో లేనివాటినీ అమలుచేసిన ఘనత బీఆర్ఎస్‌ పార్టీదేనని స్పష్టం చేశారు.

ఊరు పాలవెల్లి..చెరువు కల్పవల్లి!

https://epaper.netidhatri.com/

ఊరు పాలవెల్లి..చెరువు కల్పవల్లి!

తెలంగాణ కు నీరే ఆధారం..ఆ నీరు లేక దశాబ్దాల పాటు విలవిల లాడిన జనం గొంతు తెడపడమే, కాదు ఎండిన నేలమ్మ దాహం తీర్చిన అపర భగీరధుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. అంటున్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.. ఆయన మాటల్లోనే

`మిషన్‌ కాకతీయ ఒక విప్లవం.

`ఊరి చెరువులు గ్రామీణ ఆర్థిక వనరులు.

`కుల వృత్తులకు కల్పతరువులు

`సకల సంపదలకు నిలయాలు.

`చెరువులకు పూర్వ వైభవం తెలంగాణకు కల్పవృక్షం.

`చెరువును అక్షయపాత్ర చేసిన దేవుడు కేసిఆర్‌.

`తెలంగాణ ను అన్నపూర్ణ గా మార్చిండు

`ఎడారిని ఒయాసిస్సులా మార్చి బంగారం పండేలా చేసిండు.

`సాగును సుసంపన్నం చేసి దేశానికే అన్నం పెడుతున్నాడు.

హైదరబాద్‌,నేటిధాత్రి:
తెలంగాణ ఊరు పాలవెల్లిలా మారిపోయింది. కాదు మార్చబడిరది. అసాధ్యమనుకున్న పనులను సుసాధ్యం చేయడమే, అనితరసాద్యమైన విజయాలు సాధించడం ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసిర్‌కే సాధ్యం. అసలు తెలంగాణ విషయంలో సాగు నీటి రంగం ఇంతలా పురోభివృద్ధి జరుగుతుందని కలలో కూడా ఎవరూ ఊహించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు అసలు తెలంగాణకు నీళ్లు ఇవ్వడం అన్నది సాధ్యం కాదని తేల్చేశారు. నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ ప్రజల్ని నమ్మించారు. నయ వంచన చేశారు. కాకపోతే ఎత్తి పోతలతో కూడా మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేయొచ్చని గత పాలకులు కూడా ఊహించలేదు. కాని ఎడారి మారిన తెలంగాణను ఒయాసిస్సుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రిది. కేసిఆర్‌ కలల నుంచి, ఆలోచనలనుంచి, ఆశయాల నుంచి, సంకల్పం నుంచి ఎవరూ ఊహించని తెలంగాణ పల్లె ఆవిష్కరింపబడిరది. పల్లె పునరుజ్జీవం పొందింది. పల్లె మళ్లీ కొత్త సొగబులు అద్దుకున్నది. చెదిరిన కలతో , చేదు జ్ఞాపకాలు, పీడ కలలు తప్ప, పండగ మర్చిపోయిన తెలంగాణ నిత్య వసంతరం పచ్చ తోరణంలాగా వెలిగిపోతోంది. కన్నీటిని దిగమింగుకుంటూ, దినదినగండంగా సాగిన తెలంగాణ పల్లె నిత్యపండుగ శోభను సంతరించుకొని కళకళలాడుతోంది. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో కొత్త అందాలు సంతరించుకున్నది. ఎండిన మోడులాంటి తెలంగాణ, పండుటాకులా వాడిపోయిన తెలంగాణ కేసిఆర్‌ పాలనలో పచ్చని మాగాణమైంది. ఊరంతా పచ్చ పైటను సింగారించుకున్నది. చెట్టు, చేమకూడా లేకుండా, నీడకు కూడా ఏడ్చిన తెలంగాణ ఇప్పుడు పచ్చని వనం అల్లుకున్నది. పచ్చని అడవి పల్లెకు నీడనిస్తోంది. చెరువుల పండుగతో తెలంగాణ పల్లె మురిసిపోతోందంటున్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుకు చెప్పిన విషయాలు..ఆయన మాటల్లో..
సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఎటుచూసినా ఎండిపోయిన చెరువలు.
పూడిపోయిన బావులు. ఆనవాలు లేకుండా పోయిన భూగర్భ జలాలు. పూడికలు పూడిపోయి, ఊటలకు దిక్కులేక, చెత్తాచెదారం నిండి మోటబావులు. ఎంత తోడిరచినా చుక్క నీరు కాన రాని రోజులు. చేదబావుల్లో సైతం చుక్కజాడలేక ఆడబిడ్డల కన్నీటి చుక్కలు రాలిన కష్టాలు. కనీసం చెరువు అన్నది కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పల్లెలు. తుమ్ములు మొలిచి తూముల జాడ కరువైన పరిస్ధితులు. ఆక్రమణలకు కూడా గురైన చెరువుశిఖాలు. ఒకప్పుడు నిండు కుండల్లా, గంగాళాల్లా ఎప్పుడూ నీళ్లతో కళకళలాడే పల్లెలు, చెరువులు ఒట్టిపోయాయి. పరాయి పాలకుల నిర్లక్ష్యంతో చెంబెడు మంచినీళ్లు దొరకని కడగండ్లు. తెలంగాణ రాకముందు రోజు వరకు వున్న దుస్దితి. కాని తెలంగాణ వచ్చిన ఏడాదిలోనే తెలంగాణ పల్లెలకు మళ్లీ ప్రాణమెచ్చింది. తెలంగాణ చిగురించడం మొదలుపెట్టింది. పచ్చని పైట కప్పుకునేందుకు తెలంగాణ నేలమ్మ సింగారించుకున్నది. తెలంగాణ వచ్చిన ఏడాదిలోనే తెలంగాణలోని చెరువులకు జలకళ వచ్చింది. అపరభగీరధుడు కేసిఆర్‌ తలుచుకున్నాడు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కట్టించారు. భువినుంచి గంగాదేవి దిగివచ్చి పరుగుపరుగున చెరువుల నిండినట్లే, గోదారి మళ్లించి తెలంగాణ చెరువులు గంగాలం చేశారు. చుక్కనీరు లేక దశాబ్ధాల పాటు మోడులా మారిన చెరువుల్లో మళ్లీ నీటిసుడులు చూస్తున్నాం. చిన్న చిన్న అలలు చూసి మురుస్తున్నాం. ఆ పిల్ల తెంపరలు తెలంగాణ పల్లెలకు అందాలు అద్దాయి. నీటి సవ్వడులు ఎండా కాలంలో సయ్యాటలాడాయి. వాన చుక్క కానరాని వేసవిలో తెలంగాణ చెరువులు మత్తుళ్లు దుంకాయి. ఇది కలా! నిజామా!!అని రైతు ఆశ్యర్యడ్డాడు. మురిసిపోయాడు. ఆ నీటిలో జలకాలాడాడు. కళ్లకు అద్దుకున్నాడు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ను, మంత్రి హరీష్‌రావును రైతు దీవించాడు. ఈ తరం యువత చెరువులు చూడలేదన్న బాధను మరిపించారు. భవిష్యత్తు తరాలలో పల్లెల్లో నీటి కటకట రాకుండా చేశారు. మూడేళ్లపాటు చెరువుల పండగ నిర్వహించారు. తెలంగాణలోని 46 వేల చెరువుల్లో పూడికలు తీశారు. చెరువులన్నీంటిలో గోదారి జిలాలో నింపి, పూజలు చేశారు. నేలమ్మ దీవెనలు, గంగమ్మ వరాలు తెలంగాణ పల్లెలకు అందించారు. కొన్ని దశాబ్దాలుగా చుక్క నీరు చూడని రైతన్న సంబరపడ్డాడు. యువతలో కొత్త ఆశలు చిగురించాయి. సంబరాలు చేసుకున్నారు. తొండలు కూడా గుడ్లుపెట్టని ప్రాంతాలంటూ హేళన చేసిన వారు పచ్చని తెలంగాణ పల్లెలు చూసి ఈర్శ్యపడుతున్నారు. తెలంగాణ పల్లెలకు గోదారి పరవళ్లు రావడంతో, ఏనాడో గతి తప్పిన వాగులు మళ్లీ పరుగులందుకున్నాయి. వంకలన్నీ పాత దారులను వెతుక్కొని కొత్త పరుగులందుకున్నాయి. ఒర్రెలు కూడా నీటిని నింపుకుంటూ, జల ఊటలకు దారులు చూపాయి. తెలంగాణ చెరువులన్నీ పండుగ చేసుకున్నాయి. తెలంగాణలో చెరువుల పండగొచ్చింది. సాగు సల్లగుండాలే..రైతు సంతోషంగా వుండాలి. ఆనందంగా వుండాలి. సుభిక్షంగా వుండాలి. పెదవులుపై చిరునవ్వులు తొనికిసలాడాలి. కాలం కావాలని మొగులు వైపు, కరువు రావొద్దని కాలం వైపు, పంటలెండిపోవద్దని దిగులు పడాల్సిన అవసరంలేదు. సాగు నీటి కటకట లేదు. పల్లె పచ్చగుండాలి. పాడి పంటలతో కళకళలాడాలి. చేనంతా పచ్చని పైట కప్పుకోవాలి. రైతులకు బంగారు సిరులు పండాలి. వృత్తులు పునరుజ్జీవం కావాలి. మావన వనరుల అభివృద్ధికి మళ్లీ జీవం పోయాలి. ప్రభుత్వాలు భరోసా కావాలి. రైతును ఆదుకునే పాలకులు కావాలి. రైతును అడుగడుగనా అండగా నిలిచే కేసిఆర్‌ పాలనే ఎల్లకాలం వుండాలి. రైతు పెట్టుబడి కష్టం రాకుండా చూసుకుంటున్న ఏకైక ప్రభుత్వం. తెలంగాణలో అమలౌతున్న రైతు బంధు దేశమంతా అమలు కావాలి. రైతు ఒకరి సాయం కోసం అర్దించే పరిస్ధితి రావొద్దు. అప్పుల పాలు కావొద్దు. ఈ సాగు మా వల్ల కాదని వ్యవసాయం వదిలేయొద్దు. రైతు ఏడ్చే రోజు అసలే రావొద్దు. ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ లక్ష్యం.
ఇది తెలంగాణలో నెరవేరిన స్వప్నం. అంటే నిజమైన కల.
ఆ కల దేశమంతా కలగా మిగిలిపోకూడదు. తెలంగాణలో రైతు ఎంత సుభిక్షంగా వున్నాడో దేశమంతా అలాగే రైతు ఆనందంగా వుండాలి. గతంలో అంతో ఇంతో రైతు సంక్షేమం మీద కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించేవి. కాని కేంద్రంలో బిజేపి వచ్చిన తర్వాత రైతు గోసలు మరింత పెరిగాయి. ఈ ఏడెనెమిదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టిన పాపాన పోలేదు. తెలంగాణలో కాలం అబ్బురపడేలా, ఇతర రాష్ట్రాలు అసూయ పడేలా మూడేళ్లలో కాలేశ్వరం…ఆరేళ్లలో మల్లన్న సాగర్‌ తోపాటు, అనేక రిజర్వాయర్లు పూర్తి చేసుకున్నాము. తెలంగాణలో నీటి గోస లేకుండా చేసుకున్నాము. తెలంగాణ సాధించుకున్న నాడు ఒట్టిపోయిన చెరువులు, ఎండిపోయి చుక్కలేని చెరువులు, తుమ్మ చెట్లు నిండిపోయిన చెరువులు. ఆక్రమణలకు గురై ఆనవాళ్లులేని చెరువులు. మొత్తంగా తెలంగాణ పల్లెలకు నీరు దిక్కులేని రోజులు చూసిన కన్నీళ్లు పెట్టుకున్న తెలంగాణ ఏ కాలంలోనూ ఎండిపోని బావులు చూస్తున్నది. బోర్లన్నీ ఇరవై నాలుగు గంటలు నీరందిస్తున్నాయి. ఇదంతా తెలంగాణ చేసుకున్న పుణ్యం. మంత్రి హరీష్‌రావు లాంటి నాయకుడి కష్టం. తెలంగాణ ప్రజలు, రైతులు అనుభవిస్తున్న ఆనందం. నీరే మనిషికి ఆధారం. ఆ నీరు సమృద్దిగా వుంటేనే మనిషి మనుగడుకు సాగును వ్యవసాయం. కల చెదిరిన పల్లెలకు, ఊళ్లనొదిలి కడుపు చేత పట్టుకొని వలసలు వెళ్లి, బతకపోయిన రైతులంగా తెలంగాణలోనే మన బతుకు బంగారమని మళ్లీ వచ్చిన సంబురం. ఇదే కదా సర్గసీమకు నిదర్శనం. సాదించుకున్న తెలంగాణ అందుకున్న సాగువిప్లవం…విజయం…సంతోషం…సాగు సంపదకు తెలంగాణ నిలయం.

రంగంలోకి కేసిఆర్‌.

https://epaper.netidhatri.com/

`హుస్నాబాద్‌ తో ఎన్నికల ప్రచారం షురూ…

`కొత్త పథకాలపై సర్వత్రా ఆసక్తి.

`కేసిఆర్‌ సభలంటే మామూలుగా వుండదు.

`ఉద్యమ కాలం నుంచి కొన్ని వందల సభలు.

`గత ఏడాది కొంగరకలాన్‌ తర్వాత మొదటి సభ హుస్నాబాద్‌ లోనే.

`సభ నిర్వహణ అంతా హరీష్‌ రావుదే.

`అభివృద్ధి, సంక్షేమమే అసలైన ఎజెండా!

`చేసిన పనులే ప్రచారాస్ర్రాలు.

` అన్నపూర్ణ తెలంగాణే కళ్లముందు కనిపిస్తోంది.

`రైతు సంక్షేమంలో నెంబర్‌ వన్‌.

`మహిళా సాధికారతలో ఆదర్శం.

`అన్ని రంగాలలో అభివృద్ధి.

`ప్రతి వ్యవస్థ లోనూ ప్రగతి.

`తెలంగాణ అంటేనే వెలుగుల జగతి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఎన్నికల శంఖారావం పూరించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈ నెల 15 నుంచి రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కొన్ని సెంటిమెంట్లు పాటిస్తుంటారు. గత ఎన్నికలలో మొదటి సభ హుస్నాబాద్‌ను ఎంచుకున్నారు. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈసారి కూడా అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకం. నామినేషన్ల వేసే సమయంలో సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడ పూజలు నిర్వహించిన తర్వాతే నామినేషన్‌ వేస్తారు. అలా కొన్ని కొన్ని బలంగా నమ్మే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇక ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టనున్నారు. బిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. గత నెల రోజులుగా వాళ్లు ప్రజల్లో తిరుగుతూనే వున్నారు. ఊరూరు వెళ్లి ప్రచారం చేసుకుంటూనే వున్నారు. వారికి తోడుగా అటు కేటిఆర్‌, ఇటు హరీష్‌రావులు కూడా గత కొంత కాలంగా అనేక సభల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్ధుల తరుపున ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఓ దఫా ఎన్నికల ప్రచారం ముగిసినట్లే అని చెప్పొచు. ప్రతిపక్షాలు ఇంకా అభ్యర్ధుల ఎంపికలోనే తలమునకలై వున్నారు. ప్రతిపక్షలు సీట్లు పంచుకునే లోపు బిఆర్‌ఎస్‌ అభ్యర్ధులు స్వీట్లు పంచుకునే సమయం వస్తుందన్న జోష్‌లో బిఆర్‌ఎస్‌ కార్యకర్తలున్నారు. ఇక ఎన్నికల ప్రచారం ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రారంభంతో పార్టీలో మరింత జోష్‌ నిండుతుంది. కాంగ్రెస్‌ పార్టీ, బిజేపిలు చెబుతున్నమాటలు, వారి వెనుకున్న కుట్రలను ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రజలకు అర్ధమయ్యే యాసలో చెబితే ఇక ఆ పార్టీల సంగతి అంతే సంగతులు అని చెప్పకతప్పదు. అంతే కాకుండా కొత్తగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎలాంటి పధకాలు ప్రకటిస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని వుంది. కాని ప్రజలు ఇప్పటికే వున్న అనేక పధకాలతో ఎంతో సంతృప్తిగా వున్నారు. దివ్యాంగులకు చెందని పెన్షన్లు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. ఆసరా పెన్షన్లు కూడా మరింత పెంచే అవకాశాలున్నట్లు సమాచారం. అయినా ప్రజలు ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో సంతృప్తికరంగా వున్నట్లే వాతావరణం కనిపిస్తోంది. ఈ తొమ్మిదేళ్లకాలంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన పిడికెడుమంది నాయకులు చేసిన హడావుడి, తప్ప ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసింది లేదు. ఇబ్బందులు ఎదుర్కొనట్లు దాఖలాలు లేవు. రోడ్లెక్కి ఉద్యమాలు చేయలేదు. ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్బాలు కూడా లేవు. కారణం తెలంగాణ తొమ్మిదేళ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించిందనేది మెజార్టీ ప్రజల అభిప్రాయం. అందుకే ప్రతిపక్ష నాయకుల్లో కనిపిస్తున్న అసహనం ప్రజల్లో ఎక్కడా లేదు. తెలంగాణ రైతులంతా కేసిఆర్‌ పాలనను పొగుడుతున్న వాళ్లే కాని, తెగిడిన రైతు ఒక్కరు కూడా లేదు. ఇదీ ఒక నాయకుడి పాలనా ప్రతిభకు నిదర్శనం. ఈ తొమ్మిదేళ్లలో మాకు ఇది అందలేదు. అన్న రైతు లేడు. రైతు ఊహించకముందే తెలంగాణ చెరువులకు పూర్వ వైభవం తెచ్చారు. సాగుకు అవసరమైన కరంటు అంతా ఉచితంగా . ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నారు. రైతులు ఆ ఆనందం నుంచి తేరుకునేలోపే చెరువులున్నీ నింపేశారు. రైతులు తమ పొలాలు తడుపుకుంటుంటేనే కాళేశ్వరం పూర్తి చేశారు. ఎప్పుడో ఎండిపోయిన మోడువారిన చెరువు కళకళలాడిరది. ఒట్టిపోయిన బావులన్నీ నీళ్లతో నిండాయి. బోర్లు ఎల్లబోశాయి. ఇదంతా కలా నిజమా? అనుకునేలోపు రైతు బంధు ఇచ్చాడు. పెట్టుబడి సాయం సాగుబాటుకు ముందే అందించారు. ఇలా రెండు పంటలకు ఎకరాకు రూ.5వేల చొప్పున అందించారు. ఇంకేముంది రైతుకు ఇంతకన్నా ఆనందం ఏముంటుందనుకునే సరికి, పండిన పంట కూడా తామే కొంటామని కళ్లాల దగ్గరే కాంటలుపెట్టారు. మార్కెట్‌కు తరలించే కష్టం తొలగించాడు. కూర్చున్న చోటకే రైతుకు ఆదాయం అందించారు. ఇదీ కేసిఆర్‌ దార్శనికతకు నిదర్శనం. ఇలాంటి నాయకుడు దేశం మొత్తంలో ఒక్క కేసిఆర్‌ తప్ప మరకొరు లేరు.
ఇక తెలంగాణలోని కుటుంబాలన్నీంటికి పెద్దన్నయ్యాడు. పెద్దకొడుకుగా కీర్తింపబడుతున్నారు.
ఒకప్పుడు వయసు మళ్లిన వారికి పెన్షన్‌ అంటే ఎంత పెద్ద తతంగమో తెలియంది కాదు. ఆ తర్వాత కొంత కాలానికి ఉమ్మడి రాష్ట్రంలో రూ.200 ఇచ్చి అదే గొప్పగా ప్రచారం చేసుకున్నారు. తెలంగాణ రాగానే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆసరా పెన్షన్లు వెయ్యి, రెండువేలు, మూడు వేలు ఇలా పెంచుకుంటూ పోయారు. వయసు మళ్లీన వారి జీవితాలను గౌరవం తెచ్చారు. వారి ఆకలి తీర్చుతున్నారు. కుటుంబాలలో వారికి మరింత గౌరవం దక్కెలా చేశారు. ఒకప్పుడు వయసు మళ్లిన తల్లిదండ్రులను కొడుకులు చూసుకోవడానికి పంపకాలు చేసుకునేవారు. తండ్రి ఓ కొడుకు ఒక దగ్గర, తల్లి ఓ కొడుకు దగ్గర వుండాల్సివచ్చేది. ఎప్పుడైతే వారికి పెన్షన్‌ వస్తుందో అప్పటినుంచి వాళ్లను పిల్లలు కూడా సంతోషంగా చూసుకుంటున్నారు. అలాంటి వాళ్లంతా కేసిఆర్‌ను పెద్దకొడుకుగా భావించుకుంటున్నారు. మనసుల్లో దేవుడిగా కొలుసుకుంటున్నారు. అంతే కాకుండా కుల వృత్తులకు చెందిన వారికి కూడా నెల నెల పెన్షన్‌ ఇస్తున్నారు. ఒంటరి మహిళలకు పెన్షన్‌ అందిస్తున్నారు. బీడి కార్మికులకు కూడా పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇక ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లి అంటే పేదంటికి ఎంత భారమో తెలియంది కాదు. కేసిఆర్‌ ఒకనాడు చూసి చలించిన సందర్భాన్ని గుర్తు చేసుకొని తెలంగాణ వచ్చిన వెంటనే కళ్యాణ లక్ష్మి పధకం తెచ్చారు. పేదింటి ఆడపిల్లకు మేనమామై పెండ్లిచేస్తున్నాడు.
తెలంగాణలో కుల వృత్తులు అంతరించి పోయి, గ్రామీణ జీవనం అస్తవ్యస్తమైంది. అటు సాగు లేక, ఇటు కుల వృత్తులు చేసుకోలేక, ప్రజలు అల్లాడిన పరిస్ధితి ఎదురైంది.
తెలంగాణ రాగానే కుల వృత్తులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించింది. పాడి కావాలనుకున్న రైతులకు గేదెలను అందించారు. కురుమ, యాదవ కులాల సోదరులకు పెద్దఎత్తున గొర్రెల యూనిట్లు పంపిణీచేశారు. గీత కార్మికుల కోసం పెద్దఎత్తున చెరువు గట్లపై చెట్ల పెంపకంచేపట్టారు. కళ్లు దుకాణాలకు అనుమతులిచ్చారు. నీరా అమ్మకాలను పెంచారు. గీత కార్మికులకు పెన్షన్‌ అందజేస్తున్నారు. ఇక ముదిరాజ్‌సోదరులు ఒకప్పుడు చెరువు, అడవుల మీద ఆధారపడి జీవించేవారు. కాని ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చెరువుల ద్వంసం జరిగింది. అడువులు లేకుండాపోయాయి. తెలంగాణవచ్చిన తర్వాత పెద్దఎత్తున చెట్ల పెంపకం చేపట్టారు. చెరువులను మరమ్మత్తులుచేశారు. తెలంగాణలోని 46వేల చెరువుల్లో ప్రభుత్వం చేపలను పెంచుతోంది. ముదిరాజ్‌ సోదరులకు ఉపాది మార్గం చూపించింది. ఒకప్పుడు తెలంగాణ ప్రజలకు చేపలు ఆంధ్ర ప్రదేశ్‌నుంచి వచ్చేవి. ఇప్పుడు చెరువు చేపలు కావాలంటే ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ నుంచి పంపబడుతోంది. ఇలా కుల వృత్తులను కూడా నిలబెట్టిన ఘనత కేసిఆర్‌కే దక్కింది.
మన దేశ సమాజంలో అట్టడుగు వర్గాలుగా పరిగణింపబడుతున్న ఎస్సీ, ఎస్సీలు ఆర్ధికపరమైన ఇబ్బందులతో జీవితాలు గడుపుతున్నారు.
వారిలో కూడా మిగతా సమాజంతో సమానంగా ఆర్ధిక వృద్ది, పురోగతి కల్పించాలని ఆలోచించి దేశంలో ఎక్కడా లేని విదంగా దళిత బందు, గిరిజన బంధు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు అందిస్తూ, వారి జీవన ప్రమాణాలు పెంచి, వారిని ఆర్ధికంగా నిలబెట్టిన ఏకైక నాయకుడు, పాలకుడు కేసిఆర్‌. అందుకే కేసిఆర్‌ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష. అని ప్రజలు అనుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకుల ప్రచారంలో ఇదే విషయం చెప్పి ప్రజలు దీవెనలు అందిస్తున్నారు. మళ్లీ సారే రావాలి. కారే గెలవాలని ఆశీర్వదిస్తున్నారు.

ఎంపీ వద్దిరాజు ఇల్లందులో ప్రెస్ మీట్

 

మనమందరం కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేద్దాం: గులాబీ శ్రేణులు,ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎంపీ రవిచంద్ర

మంత్రి సత్యవతి, లోకసభ సభ్యురాలు కవిత,ఎమ్మెల్యే హరిప్రియలతో కలిసి ఇల్లందులో ప్రెస్ మీట్ పెట్టిన ఎంపీ రవిచంద్ర


ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నవంబర్ 1వ తేదీన ఇల్లందు “ప్రజా ఆశీర్వాద సభ”కు హాజరై ప్రసంగించనున్న భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గులాబీ శ్రేణులు,ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సభ జరుగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న ఎంపీ రవిచంద్ర శుక్రవారం ఇల్లందులో పర్యటించారు.ఎంపీ రవిచంద్ర మొదట ఈ సభకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్ క్యాంపు కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్, లోకసభ సభ్యురాలు మాలోతు కవిత, మహబూబాబాద్ జెడ్పీ ఛైర్మన్ అంగోతు బిందులతో కలిసి సమీక్ష జరిపారు.ఆ తర్వాత
ఆత్మీయ విందులో పాల్గొని,వారితో కలిసి విలేకరులతో మాట్లాడారు.అహింసా మార్గంలో మహోద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించడమే కాక,దాన్ని అన్ని రంగాలలో ప్రగతిపథాన పరుగులు పెట్టిస్తున్న మహానేత కేసీఆర్ హాజరయ్యే సభకు పెద్ద సంఖ్యలో స్వచ్చంధంగా తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా గులాబీ శ్రేణులు,ప్రజలను ఎంపీ వద్దిరాజు కోరారు.ఈ ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరిప్రియ భారీ ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఎంపీ రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు.విలేకరుల సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు మునిసిపల్ ఛైర్మన్ ధమ్మాలపాటి వెంకటేశ్వరరావు(డీవీ), పార్టీ ప్రముఖులు మూల మధుకర్ రెడ్డి, మూడ్ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కర్నాటక లో కరంటు కష్టాలు!

https://epaper.netidhatri.com/

` మరో సారి బైట పడుతున్న కాంగ్రెస్‌ మోసాలు.

` తెలంగాణలో కాంగ్రెస్‌ చెబుతున్న కట్టు కథలు.

` కర్నాటక లో గుట్టు రట్టవౌతున్న అబద్దాల హామీలు.

`వ్యవసాయానికి ఇస్తున్న కరంటు రెండు గంటలు.

`కాంగ్రెస్‌ అంటేనే మోసాలకు, దారుణాలకు, అబద్దాలకు కేరాఫ్‌ అడ్రస్‌. అలాంటి కాంగ్రెస్‌ ను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ

నమ్మరంటున్న రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు కు చెప్పిన వివరాలు… ఆయన మాటల్లోనే..

`రోడ్డెక్కి రైతుల ధర్నాలు.. వంటా వార్పులు

`పరిశ్రమలకు కూడా కోతలే.

`ఇండ్లకు కూడా గంటల గంటలు పవర్‌ కట్లే.

`కాంగ్రెస్‌ వస్తే తెలంగాణ లో జరిగేది కూడా అదే!

`కాంగ్రెస్‌ ను కోరుకుంటే పాత రోజులే.

`నిత్యం కరంటు కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ పార్టీ చెప్పే మాటలు తేనె పూసిన కత్తికన్నా ప్రమాదకరం. ఆ మాటల వెనుక మర్మం, మాయా లోకం కన్నా దుర్మార్గం. తెలంగాణ ప్రజలను అరవై ఏళ్లు గోస పుచ్చుకొని, ఎన్నికలు రాగానే అరచేతిలో వైకుంఠం చూపించి, ఓట్లేయించుకొని తెలంగాణ కు తీరని అన్యాయం చేసిన చరిత్ర నే కాంగ్రెస్‌ పార్టీ ది. అలాంటి కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు మొసలి కన్నీరు కార్చుతుంటే ఆ నాటకం తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు. సరిగ్గా పదేళ్ల క్రితం దాకా తెలంగాణను చూస్తే దుఖం ఆగకపోయేది. ఏ పల్లెను చూసినా ఆగమే…ఏ ఇంటిని చూసినా కష్టమే…కనిపించేదంతా బీడు భూములే…ఇల్లూ వాకిలి వదిలి, చిన్న పిల్లలను సైతం ముసలి వాళ్లకు అప్పగించి బతుకపోయిన కష్ట కాలం తెలంగాణది. ఇప్పటికీ ఆ నాటి పరిస్థితులు గుర్తుకొస్తే కళ్లలో నీటి సుడులు తిరుగుతాయి. గొంత జీరబోతుంది. అంతటి దుఖం ఎల్లబోసింది నా తెలంగాణ. తెలంగాణ ప్రజల కళ్ల నుంచి రాలుతున్న కన్నీళ్లను చూడలేక, తన కంటి చెమ్మను తట్టుకోలేక తెలంగాణ సాధనకు కదిలిన కేసిఆర్‌, తెలంగాణ సాధించి, బంగారు తెలంగాణ ఆవిష్కరించారు. ఈ కష్టం వెనుక ఏ ఒక్క కాంగ్రెస్‌ నాయకుడి సహాకారమైనా దాగి వుందా? కనీసం కనిపించిందా? తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోతిరి. మంత్రి పదవులు వదులుకొమ్మంటే వదులుకోకపోతిరి. కనీసం తెలంగాణ ప్రజల కష్టం గ్రహించకపోతిరి. తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేల మీదనే పోటీ చేస్తిరి. తెలంగాణ వాదం లేదని చెప్పే వాళ్ల చంకలో చేరితిరి. తెలంగాణకు తీరని అన్యాయం చేస్తిరి. ఏనాడైనా తెలంగాణ రాదని గొంతు చించుకున్న ఆంద్రా నేతలను కనీసం నిలదీశారా? తెలంగాణ అంతా దుఖం ఎల్లబోస్తుంటే, అప్పటి ఆంద్రా నేతలతో చెట్టా పట్టాలేసుకొని తిరిగితిరి. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతారు? అసలు కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు ఓట్లడిగే నైతికత వుందా? అంటున్న రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే…
కాంగ్రెస్‌ చేసే మోసాలు, దారుణాలు చూసి భరించలేక, ప్రజల కష్టాలు చూసి చలించి, అలుపెరగని పద్నాలుగేళ్లు ఉద్యమం సాగింది, కాంగ్రెస్‌ మెడలు వంచి, తెలంగాణ తెచ్చి, ఎండిన పొలాలు తడిపి, ఇంటింటికీ మంచి నీళ్లిచ్చి ప్రజల కన్నీళ్లు తుడిచిన మనసున్న మానవత్వానికి ప్రతి రూపమైన నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌.
తెలంగాణ ఆత్మ గౌరవం నిలబెట్టిన యోధుడు కేసిఆర్‌. అలాంటి గొప్ప నాయకుడి పాలనలో తెలంగాణ ఎంతో సుభిక్షంగా వుంది. వేరు పడిన సంసారమే కోలుకోవాలంటే కొన్నేళ్లు పడుతుంది. అలాంటిది తెచ్చుకున్న తెలంగాణ సుసంపన్నం కావాలంటే ఎంత కష్ట పడాలి. నిర్మాణం కన్నా పునర్నిర్మాణం ఎంతో క్లిష్టమైనది. అయినా తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే కరంటు కష్టాలు తీర్చిన పాలకుడు కేసిఆర్‌. అసలు ప్రపంచంలోనే ఇలా వెలుగులు తెచ్చిన నాయకుడు మరొకరు లేరు. ఏడాదిలో చెదిరిపోయిన చెరువులకు పూర్వవైభవాన్ని తెచ్చిన నాయకుడు బహుశా మన దేశంలో ఒక్క కేసిఆర్‌ తప్ప మరొకరు లేరు. ఎండా కాలంలో చెరువులు మత్తళ్లు పోయడం అనేది తెలంగాణ చరిత్రలోనే కేసిఆర్‌ హయాంలో తప్ప ఎప్పుడూ చూసి వుండకపోవచ్చు. మూడేళ్ళలో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మించేంత పట్టుదల, అంకిత భావం వున్న నాయకుడు చరిత్ర మొత్తం తిరగేసినా ఒక్క కేసిఆర్‌ తప్ప మరొకరు కనిపించరు. అంత గొప్ప నాయకుడి నీడన తెలంగాణ సమాజం సుసంపన్నమైంది. సుభిక్షమైన కాలం చూస్తోంది. కాలు మీద కాలేసుకొని రైతు సాగు చేసుకునే రోజులు వచ్చాయి. కన్నీటికి, కష్టానికి బలై,బతకులీడ్చిన తెలంగాణ రైతన్న ఇప్పుడు పుట్లకొద్ది పంటలు చూస్తున్నాడు. ఒకనాడు మెతుకు కోసం ఏడ్చిన తెలంగాణ రైతు పంట రాశులు చూసి మురుసుకుంటూ ఉబికి వస్తున్న ఆనంద బాష్పాలతో సంబురపడుతున్నారు. కరంటు కోతలు, బిల్లుల మోతలు వాతలు చూసిన తెలంగాణ రైతు నిరంతర ఉచిత కరంటు చూస్తున్నాడు. ఎండిన పొలం తప్ప ఎప్పుడూ చుక్క నీరు లేని చోట, ఎప్పుడూ నిండి వుంటున్న పొలం చూస్తున్నాడు. పచ్చని చెలుకలో చెట్టు నీడన హాయిగా నిద్రిస్తున్నాడు. పాడి పంటను కన్నుల నిండా చూసుకుంటున్నాడు. ఇదీ రైతు ఆనందంతో నవ్వులు పండుతున్న తెలంగాణ. సంతోషాలు నిండిన తెలంగాణ.
కర్నాటక లో కరంటు కష్టాలను ఓసారి చూస్తే కాంగ్రెస్‌ పార్టీ పాలన ఎలా వుంటుందో తెలుస్తుంది.
కర్నాటకలో ఎన్నో ఎన్నెన్నో చెప్పారు. ఏమైంది. కనీసం కరంటు కూడా ఇవ్వలేకపోతున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్‌ నాయకులు మాత్రం కోతల మీద కోతలు కోస్తున్నారు. కర్నాటక లో కరంటు కోతలున్నాయని తెలిస్తే కాంగ్రెస్‌ వాళ్లకు ప్రజలే వాతలు పెడతారు. ఇప్పటికీ వాళ్ళలో మార్పు రాదు. ఎప్పుడూ మార్పు రాదు. ఎందుకంటే అది కాంగ్రెస్‌ పార్టీ.అవకాశవాద పార్టీ. అదికారం కోసం ఏదైనా చెబుతుంది. ఎంతైనా మోసం చేస్తుంది. 1994 అధికారం కోల్పోయి, పదేళ్లు ప్రతిపక్షం చూసింది. ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలంగాణ ఇస్తామని బిఆర్‌ఎస్‌ తో పొత్తు పెట్టుకొని గెలిచి పదేళ్లు గోస పెట్టింది. తెలంగాణ యువత పిట్టల్లా రాలిపోతున్న కాంగ్రెస్‌ కనికరించలేదు. కాంగ్రెస్‌ నేతల మనసు కరగలేదు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఉమ్మడి పాలకులు కావాలని తెలంగాణకు కరంటు కష్టాలు సృష్టించినా మాట్లాడలేదు. ఒక్క చిత్తూరు జిల్లా మంచి నీటి కోసం రూ. 8 వేల కోట్లు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేటాయించుకుంటే చప్పట్లు కొట్టింది తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు కాదా? అదేక్కడి అన్యాయం తెలంగాణ మంచి నీటి అవసరాలు తీర్చాలని స్వయంగా నేనే డిమాండ్‌ చేస్తే రూపాయి కూడా ఇవ్వం..ఏం చేసుకుంటారో చేసుకోండని కిరణ్‌ కుమార్‌ రెడ్డి అంటే కనీసం స్పందించారా? ఆంధ్రా ఎమ్మెల్యేలతో పాటు, తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లు బల్లలు చర్చి తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బ తీసింది నిజం కాదా? సొంత ప్రాంతానికి అన్యాయం చేసే ఇలాంటి నాయకులు ఇప్పుడు నంగనాచి మాటలు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటారని కూడా లేదు. అయినా తెలంగాణను చీకట్లోకి నెట్టేసి, సకల కష్టాలకు కారణమే కాంగ్రెస్‌ పార్టీ. ముందు కర్నాటక లో కరంటు కటకట బాగు చేసుకోండి. తెలంగాణ లో రెప్ప పాటు కరంటు పోదు. పైగా నాణ్యమైన కరంటు ఇరవై నాలుగు గంటలు సరఫరా జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌ హయాంలో జనరేటర్లు, ఇన్వర్టర్లు లేకుండా జిరాక్స్‌ సెంటర్లు కూడా నడిచేవి కాదు. పగలంతా కరంటు కోతలే…రాత్రి పూట కూడ పగబట్టినట్లే ఉక్కపోతల్లో బతకాల్సి వచ్చేది. ఆ నరకం గురించి తెలిసిన తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ ను చీదరించుకుంటుందే గాని, ఆదరించే సమస్యే లేదు. ఒక్కొక్కటిగా మరో సారి బైట పడుతున్న కాంగ్రెస్‌ మోసాలు. అయినా తెలంగాణలో కర్నాటక కట్టు కథలు చెప్పి మోసం చేయాలని చూస్తున్నారు. కర్నాటక లో గుట్టు రట్టవౌతున్న అబద్దాల హామీలు కాంగ్రెస్‌ పాలిట శాపాలౌతున్నాయి.
కర్నాటక లో వ్యవసాయానికి కరంటు రెండు గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. కర్నాటక మొత్తం రోడ్డెక్కి రైతుల ధర్నాలు చేస్తున్నారు.. వంటా వార్పులు చేస్తున్నారు. అక్కడ పరిశ్రమలకు కూడా కోతలే విధిస్తున్నారు. ఇండ్లకు కూడా గంటల గంటలు పవర్‌ కట్ల కటకటే. కాంగ్రెస్‌ ను పొరపాటున నమ్మితే తెలంగాణ లో కూడా జరిగేది కూడా అదే! అన్నది ప్రజలు గమనించాలి.
కాంగ్రెస్‌ ను కోరుకుంటే పాత రోజులే వస్తాయన్నది నేటి తరానికి గుర్తు చేయాలి. కాంగ్రెస్‌ చూపించిన చీకటి రోజుల గురించి నేటి యువతకు పెద్దలు చెప్పాలి.

బిఆర్‌ఎస్‌ అమ్ముల పొదిలో అస్త్రాలు

https://epaper.netidhatri.com/

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న ప్రచార కార్యక్రమాలు… పార్టీ పరమైన అంశాలు…ఆయన మాటల్లోనే.

`ఈనెల 15 న ప్రకటించనున్న కేసిఆర్‌.

`ఇప్పటికే ప్రచారంలో ముందంజ!

`అటు కేటిఆర్‌… ఇటు హరీష్‌ రావు.

`మూడు నెలలుగా విసృత ప్రచారం.

`అభ్యర్థులు నెల రోజులుగా ప్రజల్లోనే.

`త్వరలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రచారం ప్రారంభం.

`ప్రతిపక్షాల కుయుక్తులకు చెక్‌.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ అంటే ఒక బ్రాండ్‌. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటే ఒక స్ట్రాంగ్‌ లీడర్‌. తెలంగాణ ఒక ఆదర్శవంతమైన రాష్ట్రం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిర్మాణాత్మకమైన నాయకుడు. తెలంగాణ కోసం ఉద్యమం నిర్మాణం చేశాడు. పద్నాలుగేళ్ల పాటు నిరంతరం పోరాటం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను కూడగట్టారు. నాయకుల చేత సంతకాలు చేయించారు. ఏ ఒక్కరు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడకుండా చూసుకున్నాడు. అన్ని రాష్ట్రాలు తిరిగి తెలంగాణ ప్రజల గోస గురించి వివరించారు. అంతిమంగా తెలంగాణ తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ తలరాతే మర్చేసిన గొప్ప దార్శనికుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. తెలంగాణ వస్తే ఇంత అభివృద్ధి సాధ్యమైందా? అని ఆశ్చర్యపోక తప్పదు. తెలంగాణ వస్తే ఏం జరుగుతుందో చూడిరడి..అని ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెబుతుంటే ఎవరూ నమ్మలేదు. ఒకప్పుడు హైదరాబాద్‌లోనే నిత్యం కరంటు కోతులువుండేవి. వ్యాపారం రంగం మొత్తం కుదేలైపోయింది. ఒక దశలో నగర పరిసరాల్లో వున్న పరిశ్రమలన్నీ తరలిపోతాయా? అన్న అనుమానం కలిగిన రోజులున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతరం కరంటు కావాలంటూ ఇందిరాపార్క్‌ దగ్గర పారిశ్రామిక వేత్తలంతా ధర్నాలు చేసిన రోజలున్నాయి. కొన్ని తరలిపోయిన పరిశ్రమలు కూడా వున్నాయి. కాని నేడు ప్రపంచ దేశాలు కూడా హైదరాబాద్‌ చూస్తున్నాయి. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌ది. జిఎస్టీ పేరుతో దేశంలో అనేక పరిశ్రమల మూతకు కేంద్ర ప్రభుత్వం కారణమైతే, తెలంగాణలో అధ్భుతమైన పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ కారణమయ్యారు. అంటే ఎవరు గొప్ప నాయకుడు ప్రజలే అర్ధం చేసుకోవాలి. హైదరాబాద్‌లో ఐటి, నగరం చుట్టూ ఫార్మా రంగం విస్తరించిన తీరును దేశంలోని మిగతా రాష్ట్రాల ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌నుంచి పెద్దఎత్తున యువత ఉపాధి పనుల కోసం, చదువకున్న వాళ్లు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు. కాని నేడు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి తెలంగాణకు ఏటా లక్షలాది మంది వస్తున్నారు. తెలంగాణలో ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎండిన ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేసి, అన్నపూర్ణగా తీర్చిదిద్దారు. తెలంగాణలో వ్యవసాయ పనులు చేసేందుకు మహరాష్ట్ర, కర్నాకటలనుంచే కాకుండా బీహార్‌, మధ్య ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌లనుంచి యువత వస్తున్నారు. తెలంగాణ రైస్‌ మిల్లులలో పనులు చేస్తున్నారు. నిర్మాణ రంగంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు పనిచేస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల్లో కూడా ఇతర రాష్ట్రాలకు చెందని వ్యక్తులు పనిచేసి, ఉపాధి పొందారంటే తెలంగాణ ఎలా నీడనిచ్చే, బతుకునిచ్చే చెట్టుగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. ఒకప్పుడు వలసల తెలంగాణను నేడు ఉపాధి తెలంగాణగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌కే దక్కింది. కేసిఆర్‌ లాంటి నాయకుడు యుగానికొక్కడే కనిపిస్తాడు అంటున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాందీ, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న హైదరాబాద్‌ అభివృద్ధి విశేషాలు…ఆయన మాటల్లోనే..
మొత్తం తెలంగాణ గురించి చెప్పుకున్నా, ఒక్క హైదరాబాద్‌ గురించి చెప్పుకున్నా ఇక్కడ జరిగిన అభివృద్ధి దేశంలో మరెక్కడా జరగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ సెక్రెటరియేట్‌ వద్ద వున్న ఫ్లైవోర్‌ ఉమ్మడి రాష్ట్రంలో 13 సంవత్సరాలు గడిస్తే తప్ప పూర్తి చేయలేదు. ఇలా అప్పట్లో అక్కడక్కడ నిర్మాణం చేసిన నాలుగు ఫ్లైవోర్లు పదిహేనేళ్లపాటు సాగాయి. కాని తెలంగాణలో దేశంలోనే భృహత్తరమైన, బహుళార్ధక ప్రాజెక్టును మించిన నిర్మాణం కాళేశ్వరం కేవలం మూడు సంవత్సరాలలో నిర్మాణం జరగడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిత్యం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల కళ్లముందు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఒక్క ఫ్లైఓవరే పదమూడు సంవత్సరాలకు గాని పూర్తి కాలేదు. అంతే కాదు హైదరాబాద్‌లోని మెట్రో రైల్‌ నిర్మాణం ఉమ్మడి రాష్ట్రంలో మొదలైనా, తొమ్మిదేళ్లపాటు నత్తనకడన సాగింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ జోక్యంతో చకచకా పూర్తయి ప్రజలకు సేవలందిస్తోంది. ఇదీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ గొప్పదనం. హైదరాబాద్‌లో తొంబైవదశకం నుంచి తెలంగాణ వచ్చే దాకా పట్టుమని పది ప్లైఓవర్లు కూడా నిర్మాణం చేయలేదు. ట్రాపిక్‌ సమస్యను గాలికొదిలేశారు. హైదారాబాద్‌ అభివృద్దిని పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంకల్పం, మంత్రి కేటిఆర్‌ పట్టుదలకు నిదర్శనంగా 37 ప్లైఓవర్లు కేవలం తొమ్మిదేళ్లలో పూర్తి చేసి, నగరంలో ట్రాఫిక్‌ సమస్యను పూర్తిగా తొలగించారు. ఒకప్పుడు హైదరాబాద్‌ నగరంలో ప్రయాణం ఒక నరకం. కాని నేడు ఎంతో సులభం. ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ దాటి విద్యానగర్‌ చేరాలంటే మూడు కిలోమీటర్ల దూరం కనీసం గంటన్నర సమయం పట్టేది. ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేసిన ఫ్లైఓవర్‌ మూలంగా ఐదు నిమిషాలలో ఎలాంటి ఆటకంకం లేకుండా వెళ్తున్నారు. ఇక మాదాపూర్‌లో ట్రాపిక్‌ సమస్య కోసం కొత్త చెరువు మీద వేలాడే వంతెన ఏర్పాటు చేసి, నగరాన్ని అందంగా ముస్తాబు చేయడమే కాకుండా, ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నొ, ఎన్నెన్నో విజయాలు వున్నాయి. ఒకప్పుడు ఎల్‌బినగర్‌ లో ట్రాఫిక్‌ కష్టాలు కథకథలుగా చెప్పుకునేవారు. ఇప్పుడు స్టీల్‌ వంతెన నిర్మాణం ఏర్పాటు చేసి, ఆ ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పించడం జరిగింది. దేశంలోనే తొలిసారి సైక్లింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేసిన ఘనత కూడా మంత్రి కేటిఆర్‌కే దక్కుతుంది. ఈ తొమ్మిదేళ్లకాలంలో నగరం విస్తరించిన తీరును చూసి ఎవరైనా అబ్బురపడాల్సిందే. ఒకప్పుడు కూకట్‌ పల్లి దాటితే నగర శివారు అనే పరిస్ధితి వుండేది. ఇప్పుడు చందానగర్‌ ప్రాంతం మరో నగరాన్ని తలపించేంత గొప్పగా ఆవిషృతమైంది. తెలంగాణ రాకముందు ఐటి సెక్టార్‌ అనేది కొంత వరకు మాత్రమే పరిమితమై వుండేది. తెలంగాణకుముందు ఐటి ఎగుమతులు కేవలం 50వేలకోట్లు. కాని ఇప్పుడు రెండున్నర లక్షల కోట్ల ఎగుమతులతో దేశంలోనే రెండో స్ధానంలో నిలిచింది. త్వరలో మొదటి స్ధానానికి చేరుకుంటుంది. హైదరాబాద్‌ నగరంలో మంచినీటి కటకట అంటే తెలియని వాళ్లు లేరు. వారంలో రెండు రోజుల పాటు వచ్చే మంచినీటి సమస్యతో ప్రజలు ఎంతో సతమతమైన పరిస్దితి. ఉమ్మడి రాష్ట్రంలో ఆ నీటికి కూడా మీటర్‌ పెట్టి మరీ బిల్లులు వసూలు చేసిన రోజులు. అప్పార్టుమెంట్లు నిత్యం వాటర్‌ ట్యాంకర్లు కొంటేగాని పూట గడవని పరిస్దితి. మరి ఇప్పుడు నిత్యం మంచినీరు అందుబాటులోకి తేవడం జరిగింది.
ఈ తొమ్మిదేళ్లలోచెప్పుకోవడానికి కొన్నివందల అభివృద్ధి పనులు మన కళ్లముందు కనిపిస్తున్నాయి. వందల సంక్షేమపథకాలు అమలులో వున్నాయి. మరి బిజేపి ఏం చెప్పుకుంటుంది? దేశం బైట వున్న నల్లధనం తెస్తామని తెచ్చిందా? నోట్లరద్దుతో దేశాన్నిమొత్తం రోడ్ల మీద నిలబెట్టింది. జిఎస్టీతో పారిశ్రామిక రంగాన్ని కుదేలు చేసింది. ధరలు పెంచింది. సామాన్యుల నడ్డి విరిచింది. కేంద్ర ప్రభుత్వం ఈ పదేళ్లకాలంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టైనా నిర్మాణం చేసిందా? పారిశ్రామిక వేత్తలకు లక్షల కోట్లు దారాధత్తం చేసింది. వారికి రుణమాఫీలు చేసింది. కాని సామాన్యులకు ఏం చేసింది. అందుకే ప్రజలు ప్రతిపక్ష పార్టీలను పట్టించుకునే పరిస్ధితి లేదు. అంతే కాదు త్వరలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ దేశమే అబ్బురపడేంత గొప్ప పథకాలు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రచారం మొదలు పెట్టిన తర్వాత తెలంగాణ రాజకీయం మరొక లెక్క..అంతే… బిఆర్‌ఎస్‌కు తిరుగులేదు. బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గెలుపును ఎవరూ ఆపలేరు. ఎందుకంటే ప్రజల గుండెల్లో వున్నదే మేము..! మేం చేసిన అభివృద్ది పనులే మమ్మల్ని గెలిపిస్తాయి. బిఆర్‌ఎస్‌ 90స్ధానాలు గెవడం పక్కా!

https://youtube.com/shorts/adGjxOiLdeE

రేపటి పౌరుల భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం!

https://epaper.netidhatri.com/

బావిబడి జీవితం బంగారుమయం

బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి. వినోద్‌ కుమార్‌,

నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న విషయాలు..ఆయన మాటల్లోనే..

తెలంగాణలో విద్యా విప్లవం.

`ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టం.

`త్వరలో ప్రాధమికోన్నత పాఠశాలకు మహార్థశ.

`పిల్లల నోటికాడి ముద్ద లాగేస్తారా?

 

`ఇదేనా ప్రతిపక్షాలు విధానం!

`బడి పిల్లల ఉపాహారం మీద విమర్శలా?

`గురుకుల విద్యార్థులకు చేపల కూరతో భోజనం పెట్టడాన్ని ఎన్నికలకు ముడిపెడతారా?

 

`ఎన్నికల స్టంట్‌ అని వ్యాఖ్యలా!

`బీఆర్‌ఎస్‌ ను విమర్శించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి?

`కేంద్రం 2020లో దేశ వ్యాప్తంగా బడి పిల్లలకు అల్పాహారం ప్రకటించారు?

`ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదు?

`పిల్లలకు ఉపాహారం పెట్టేందుకు కేంద్రం వద్ద నిధులు లేవా?

`పిల్లలంటే ప్రతిపక్షాలకు ఎంత చులకనో అర్థమౌతోంది!

`ప్రధాని మోడీ పసుపు బోర్డు ఇప్పుడెందుకు ప్రకటించారు?

`ఐదేళ్లనుంచి ఎందుకు చేయలేదు?

`పసుపు బోర్డు కన్నా మంచిది ఇచ్చామని అప్పుడెందుకు చెప్పారు?

`వరంగల్‌ స్పైసీ బోర్డు నుంచి ఒక వింగ్‌ నిజామాబాదు కు తరలించి గొప్పలు చెప్పుకున్నారు.

`అబద్దాల పునాదుల మీద బిజేపి నాయకులు రాజకీయాలు చేస్తున్నారు.

`రాజస్థాన్‌ లో కాంగ్రెస్‌ సిలిండర్‌ ధర ఇప్పుడే ఎందుకు తగ్గించింది?

`అది ఎన్నికల జిమ్మిక్కు కాదా?

`పిల్లలకు అన్నం పెట్టేందుకు వెనుకాడిన బిజేపికి బిఆర్‌ఎస్‌ ను విమర్శించే అర్హత వుందా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఎన్నికలంటే బిఆర్‌ఎస్‌ కు ఒక పవిత్ర యజ్ఞం. ప్రజల జీవితాలలో గొప్ప మార్పుకు సంకేతం. ఆ యజ్ఞంతోనే తెలంగాణ సాధించుకున్నాం. అదే కంకణ బద్దంగా తెలంగాణ అభివృద్ధికి బాటలు చేసుకున్నాం. ప్రపంచంలోనే ఇంత వేగమైన అభివృద్ధి ఎక్కడా జరిగింది లేదు. తొమ్మిదేళ్లలలో జరిగిన అభివృద్ధి అద్భుతం. కాదన్నారంటే వారి కుత్సిత, కుటిల మనస్తత్వాలకు నిదర్శనం. రాజకీయాలలో కాంగ్రెస్‌, బిజేపి నాయకులు అబద్దాలు మాట్లాడడం బాగా అలవాటు చేసున్నారు. తెలంగాణ లో అభివృద్ధి, ప్రగతి అంటే ఏమిటో అర్థం కూడా తెలియని వాళ్లకు పదవీ కాంక్షలు ఎక్కువైపోయింది. బిఆర్‌ఎస్‌ ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నామ్‌ చేయాలని తెలంగాణ వచ్చిన మరు క్షణం నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే వున్నారు. వారి అతి తేటలను, కుటిల మనస్తత్వాలను, దుర్నీతిని ప్రజలు ఎప్పకప్పుడు గమనిస్తూనే వున్నారు. అందుకే తెలంగాణ రాజకీయాలలో ఆ పార్టీలను ప్రజలు ఎప్పుడో దూరం పెట్టారు. అభివృద్ధి నిరోధకులుగా వాళ్లను ప్రజలు గుర్తించారు. రాజకీయాలకు మాత్రమే వారు పరిమితం. తెలంగాణ అభివృద్ధి కాంక్ష ప్రతిపక్షాలలో ఇసుమంతైనా లేదు. ఎంత సేపు అధికార యావ మాత్రమే కనిపిస్తున్నాయి. ఎంత దుర్మార్గమంటే పరీక్షలు రాసే విద్యార్థులను పుస్తకాలు వదిలిపెట్టమని పిలుపునిస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయమని ప్రోత్సాహిస్తున్నారు. ఇంత దుర్మార్గపు రాజకీయాలు ఎక్కడైనా వుంటాయా? రైతులకు ఇరవై నాలుగు గంటల కరంటు అవసరం లేదని ఒకరంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిపక్షాల దిగజారుడు తనం పరాకాష్టకు చేరింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉదయం అల్పాహారం పెట్టడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. బడి పిల్లలకు ఇంత మంచి పథకాన్ని ప్రభుత్వం తీసుకురావడాన్ని ప్రశంసించాలి. విజ్ఞులైతే అభినందించాలి. రాజకీయాలకు అతీతంగా స్పందించాలి. విద్యార్థులకు మేలు చేసే కార్యక్రమాలపై సూచనలు, సలహాలు ఇవ్వాలి. కానీ ప్రతిపక్షాలకు చెందిన నేతలకు విద్యార్థులకు మేలు చేయడం కూడా ఇష్టం లేదు. ఇక గురుకులాల విద్యార్థులకు చేపల కూరను కూడా మెనులో చేర్చడం జరిగింది. అది కూడా తప్పే అన్నట్లు రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాల వైఖరిని ప్రజలు బాగా గమనిస్తున్నారు. వారికి తప్పకుండా ప్రజలు మళ్ళీ గుణపాఠం చెబుతారు. అసలు ప్రజల్లో లేని పార్టీలు తమ ఉనికి కోసం పడే ఆరాటంలో ఆగమాగమౌతున్నారు. ఏం మాట్లాడుతున్నారో కూడా సోయిలేకుండా కూతలు కూస్తున్నారు. ఈసారి తెలంగాణ లో విద్యా విప్లవం ఎలా వస్తుందో అతి తొందరలోనే చూస్తామంటున్న మాజీ పార్లమెంటు సభ్యుడు ,రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి. బినోద్‌ కుమార్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న విషయాలు… ఆయన మాటల్లోనే…
రానున్న రోజుల్లో తెలంగాణలో విద్యా విప్లవం రానున్నది.
ఇప్పటికే తెలంగాణలో వెయ్యికి పైగా సంక్షేమ గురుకుల పాఠశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా స్కూళ్లలో పేద విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతులు, ఉత్తమ భోధన, భద్రత కల్పన జరుగుతోంది. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు కేజి టు పిజి విద్య అందుతోంది. దాంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత పటిష్టమైంది. తెలంగాణ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అనేక ప్రశంసలు అందుకుంటోంది. కానీ అవి మన రాష్ట్ర ప్రతిపక్షాలకు కనిపించవు. దేశాలోనే స్వచ్చ సర్వేక్షన్‌ అవార్డులు తెలంగాణ కు సింహ భాగం ఏటా వస్తున్నాయి. బిజేపి పెద్దలు డిల్లీలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తారు. తెలంగాణ కు వచ్చి ఏవేవో మాట్లాడి పోతుంటారు. అందుకే ఎవరెన్ని మాట్లాడినా తెలంగాణ అభివృద్ధి అన్నది ఒక్క బిఆర్‌ఎస్‌ మాత్రమే చేయగలదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ మాత్రమే తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అందుకే రేపటి పౌరుల భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధమౌతున్నాయి. త్వరలో ప్రాధమికోన్నత పాఠశాలకు త్వరలో మహార్థశ రానున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ భోదన తెలంగాణలో చూస్తున్నాం. రానున్న రోజుల్లో మన విద్యా వ్యవస్థలో అనేక గొప్ప ఆవిష్కరణలు చూడనున్నాం. అయితే గ్రామీణ ప్రాంతాలలో ఇంకా చాలా మంది పిల్లలు స్కూల్‌ కు రావడం లేదు. పల్లెల్లో ప్రైవేటు స్కూళ్లకు ఆస్కారం లేదు. కాస్తో, కూస్తో పిల్లల చదువుల కోసం కొంత వెచ్చించుకోగలం అనుకునే వారు ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నారు. అది కూడా ఆగిపోవాలి. ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ప్రభుత్వ ఉపాధ్యాయుల ద్వారా విద్యా బోధన జరుగుతుంది. ప్రైవేటు స్కూళ్లలో పని చేసే ఉపాధ్యాయులకు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు చాలా తేడా వుంటుంది. అందుకే అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడమే ఉత్తమం. ఇక పల్లెల్లో ఇప్పటికీ తమ పిల్లలను స్కూల్‌ కు పంపకుండా వుండే వారు చాలా మంది వున్నారు. అలాంటి పిల్లలకు పౌష్టికాహారం కూడా అవసరం. ఆ పిల్లలకు ఉదయం ఉపాహారం అందించడం వలన మధ్యాహ్నం వరకు ఆకలి లేకుండా శ్రద్ధగా చదువుకునే అవకాశం వుంది. అది విద్యా పరంగా ఆరోగ్య పరంగా ఎంతో మంచిది. మధ్యాహ్నం మిడ్‌ డే మీల్‌ అందుతుంది. తెలంగాణ ఇరవై లక్షలకు పైగా విద్యార్థుల ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకొని అల్పాహారం అందించాలని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అన్ని విధాల సౌకర్యాల కల్పన చేసి, ప్రారంభించుకోవడం జరిగింది. దానిని ప్రతిపక్షాలు స్వాగతించాలి. అంతే కాని పిల్లల నోటికాడి ముద్ద లాగేసేలా వ్యవహరించొద్దు. స్కూల్‌ పిల్లలకు ఆహారం అందించడాన్ని కూడా రాజకీయం చేసే బిజేపి, కాంగ్రెస్‌ పార్టీలు తిరస్కరిస్తున్నాయి. 2020లో కేంద్ర ప్రభుత్వం ఓట్ల కోసం దేశం మొత్తం స్కూళ్లలో పిల్లలకు అల్పాహారం అందిస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు దాని విధి విధానాలు కూడా ఖరారు చేయలేకపోయింది. దేశం మొత్తం మీద వున్న స్కూళ్లలో అల్పాహారం అందించడానికి మూడు వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం వుంది. 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ లో విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు మూడు వేల కోట్లు ఖర్చు చేయాలంటే వారికి చేతులు రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేస్తోంది. కనీసం అభినందించాలన్న సోయి కూడా బిజేపికి లేకుండా పోయింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్టానికి వచ్చి సభలు ఏర్పాటు చేసి నిజామాబాదు లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. మంచిదే…కానీ ఈ ఐదేళ్లు ఎందుకు చేయలేదు. తెలంగాణ లో పసుపు బోర్డు ఏర్పాటు కుదరని కూడా చెప్పిన సందర్భాలు కూడా వున్నాయి. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి రావడం మొదలవడంతో అంతకు మించిమ స్పైసీ బోర్డు తెచ్చామని ప్రజల్ని నమ్మించారు. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలోనే వరంగల్‌ లో వున్న స్పైసీ బోర్డు నుంచి ఒక వింగ్‌ నిజామాబాదు లో ఏర్పాటు చేసి మమ అనిపించారు. ప్రజలకు బిజేపి అసలు రంగు అర్థమైంది. దాంతో మళ్ళీ ప్రధాని మోడీ పసుపు బోర్డు ప్రస్తావించారు. ఇస్తామన్నారు. అంతే ఎప్పుడు ఇస్తామన్నది చెప్పలేదు. తర్వాత ఇస్తారా? లేదా అన్నది కూడా చెప్పలేం. బిజేపి అబద్దాల రాజకీయాలు అలా వుంటాయి. ఇక కాంగ్రెస్‌ ఇస్తున్న హామీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజస్థాన్‌ లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వుంది. కానీ ఐదేళ్లుగా రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ అందించడం లేదు. ఎన్నికల ముందు హడావుడిగా ప్రకటించింది. చత్తీస్‌గఢ్‌ లో కూడా కాంగ్రెస్‌ పార్టీ యే అధికారంలో వుంది. అక్కడ మాత్రం సిలిండర్‌ అందించే కార్యక్రమం లేదు. కర్నాటక లో ప్రకటించి ఆరు నెలలౌతున్నా ఇంత వరకు అమలు చేస్తున్నది లేదు. ఇలాంటి ప్రతిపక్షాలు తెలంగాణ లో రాజకీయాలు చేయడం మన దౌర్భాగ్యం. ఇలాంటి పార్టీలు తెలంగాణ లో అధికారం కోసం అర్రులు చాచడం తప్ప అభివృద్ధి చేయడానికి పనికి రావు. ప్రజలకు కూడా ఈ విషయం బాగా తెలుసు. ఈ ఎన్నికలలో కూడా లేనివి వున్నట్లు, వున్నవి లేనట్లు ప్రచారం చేసి ప్రజలను గందరగోళ పర్చాలని చూస్తున్నారు. ప్రజలు వాళ్ల మాటలు వినరని మరో సారి రుజువౌతుంది. బిఆర్‌ఎస్‌ కచ్చితంగా 90కి పైగా సీట్లు గెల్చుకుంటుంది.

కాంగ్రెస్‌ ను నమ్మితే ఖతమే! బతుకులు తలకిందులే!!

https://epaper.netidhatri.com/

Continue reading కాంగ్రెస్‌ ను నమ్మితే ఖతమే! బతుకులు తలకిందులే!!

కాంగ్రెస్‌ కు మిగిలేవి పగటి కలలే

https://epaper.netidhatri.com/

కాంగ్రెస్‌ వన్నీ కోతలే! హస్తమంతా రిక్తమే!!

`భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చిట్‌ చాట్‌..ఆయన మాటల్లోనే…

`కర్నాటక పేరు చెప్పి పబ్బం గడుపుకోవడమే!

`బిఆర్‌ఎస్‌ పథకాలే కాంగ్రెస్‌ కాపీ!

`నిన్నటి దాకా అప్పుల రాష్ట్రం అన్నారు.

`ఇప్పుడు నోటికొచ్చిన హామీలిస్తున్నారు.

`ప్రజలు నమ్మరని కాంగ్రెస్‌ కు తెలుసు.

`గెలిచేది లేదన్నది నాయకులకు తెలుసు.

`టిక్కెట్ల పేరుతో సొమ్ము చేసుకోవడం తప్ప ఏమీ వుండదు.

`బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ ఖాయం.

`తెలంగాణలో అమలౌతున్న పథకాలకు ఎదురులేదు.

`ప్రజా సంక్షేమం కేసిఆర్‌ కు తెలిసినంత మరెవరికీ తెలియదు.
`జనం నమ్మడానికి కాంగ్రెస్‌ లో నాయకులే లేరు.

`ఓటుకు నోటు దొంగను నమ్మి ఓట్లేయరు.

`మూడోసారి భంగపాటు తప్పదు.

` కాంగ్రెస్‌ కు అధికార యావ తప్ప, తెలంగాణ మీద ప్రేమే లేదు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ పార్టీని చూస్తే జాలేస్తోంది. రేవంత్‌ ను నమ్ముకున్న కాంగ్రెస్‌ కు దక్కేది రెవడే..మిగిలేవి పగటి కలలే. తెలంగాణ ఆత్మాభిమానంపై కాంగ్రెస్‌ ఏనాడో దెబ్బ కొట్టింది. ఇచ్చింది మేమే అంటున్న కాంగ్రెస్సే తెలంగాణ ను ముంచింది. తెలంగాణ ఉద్యమానికి కనీసం సంబంధం లేని వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిని చేసుకొని అధికారంలోకి వస్తామనుకోవడం అంటేనే ఆ పార్టీ నిజ స్వరూపం అర్థమౌతోంది. అంతే కాదు ఇక్కడ తెలంగాణ ప్రజలకు కొన్ని సత్యాలు తెలియాల్సి వుంది. 2014 ఎన్నికలలో ఆంద్రప్రదేశ్‌ లో ప్రచారం చేసిన రాహుల్‌ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటనలు చేశారు. తెలంగాణకొచ్చి రాష్ట్రం ఇచ్చాం కాబట్టి కృతజ్ఞత తీర్చుకోండి అన్నట్లు మాట్లాడాడు. అంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతోనే మా పని అయిపొయింది. తెలంగాణ కు ఏమీ ఇవ్వాల్సిన పని లేదని తేల్చేసిన కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మడం అన్నది ఇక ఎప్పుడూ జరగదు. ఆంద్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినప్పుడు తెలంగాణ ఏం పాపం చేసింది? తెలంగాణ కు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని ఎందుకు చెప్పలేదు? ఇప్పటికీ కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మరు క్షణం ప్రత్యేక హోదా ఇస్తామనే కాంగ్రెస్‌ చెబుతోంది. అసలు అరవై ఏళ్లపాటు గోస పడిరదే తెలంగాణ. బాగుపడిరదే ఆంద్రప్రదేశ్‌. తెలంగాణ వస్తే అంధకారమౌతుంది. అడుక్కుతినే పరిస్థితి వస్తుంది. మేం లేకుండా ఒక్క రోజు కూడా బతకలేరు. అసలు తెలంగాణ నాయకులకు పాలన చేయడం కూడా రాదు. తొండలు గుడ్లు పెట్టేందుకు కూడా పనికి రాని తెలంగాణ భూములని ఎగతాళి చేశారు. తెలంగాణ కు అన్నం పెడుతున్నదే మేమన్నారు. విడిపోయి తెలంగాణ నష్టపోకూడదనే చెబుతున్నామని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఇప్పుడేమో విడిపోయి నష్టపోయామంటున్నారు. వాళ్ల మాటలు నమ్మి ఆంద్రాకు ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచించలేని కాంగ్రెస్‌ ను ప్రజలు నమ్మతారని ఎలా అనుకుంటున్నారు. పగటి కలలు ఎందుకు కంటున్నారు. ముందు తెలంగాణ ను ప్రేమించడం కాంగ్రెస్‌ నేతలు నేర్చుకోవాలొలి. కేవలం అదికార యావ తప్ప తెలంగాణ మీద కాంగ్రెస్‌ కు ఎలాంటి మమకారం లేదు. తెలంగాణ ఇచ్చామన్న కృతజ్ఞత తీర్చుకోవాలన్న అహంకారంతో కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నారు. అంతే కాదు తెలంగాణ లో కాంగ్రెస్‌ కు అధికారం ఇవ్వకుంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మరు క్షణం రెండు రాష్ట్రాలు కలుపుతామని కాంగ్రెస్‌ నాయకులు అన్న మాటలు ప్రజలు అప్పుడే మర్చిపోలేదు. కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మితే నిండా మునిగినట్లే అన్న సంగతి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అందుకే పదేళ్లయినా ప్రజలు కాంగ్రెస్‌ ను నమ్మేందుకు సిద్దంగా లేదు. కాంగ్రెస్‌ పథకాల ప్రచారం అంతా పెద్ద డ్రామా… అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో కాంగ్రెస్‌ మోసాలు ఎలా వుంటాయో వివరించారు… ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

తెలంగాణ లో అధికారంలోకి రావాలన్న తపన మాత్రమే కనిపిస్తోంది.
తెలంగాణ వచ్చిన తర్వాత రేవంత్‌ రెడ్డి ఓ సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్‌ లో అధికారంలోకి రావడం కోసం 2014 లో చంద్రబాబు చెప్పివన్నీ అబద్దాలే అన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో అబద్దాలు చెప్పి నమ్మించడం తప్ప ప్రజలను నిజాలతో నమ్మించలేమని స్వయంగా రేవంత్‌ రెడ్డే అన్నారు. కావాలంటే ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో రేవంత్‌ రెడ్డి చెప్పిన వీడియో వుంది. అందుకే ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కోరిక కాంగ్రెస్‌ కన్నా రేవంత్‌ కు ఎక్కువ ఆశగా వుంది. అసలు తెలంగాణ లో ప్రజలు కాంగ్రెస్‌ నే నమ్మడం లేదు. అలాంటిది రేవంత్‌ ను నమ్మి ఓట్లు వేయడం అన్నది కల. కలగంటే కూడా తీరని కోరిక. గత ఏడాది క్రితం వరకు కాంగ్రెస్‌ లో వున్న వాళ్లే కాంగ్రెస్‌ పని అయిపోయింది అని చెప్పిన సందర్భం వుంది. కేవలం కర్నాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌ ఊపుకొచ్చిందన్న ఊహల్లో విహరిస్తున్నారు. అసలు విషయం దాచి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. కర్నాటక లో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయి పదిహేను సంవత్సరాలౌతుంది. రెండు సార్లు బిజేపి స్వంత మెజారిటీతో కర్నాటక లో అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ జేడీఎస్‌ కూడమి మెజారిటీ సీట్లు సాధించింది. కానీ బిజేపి కాంగ్రెస్‌ ను చీల్చి మూడోసారి అధికారంలోకి రావడం జరిగింది. పైగా బిజేపి పార్టీ పైకి చెప్పేదొకటి చేసేది ఒకటి అని ప్రజలకు తెలిసిపోయింది. దాంతో గత ఎన్నికలలో కాంగ్రెస్‌ ను మోసం చేయడంతో పాటు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు బాగా ప్రభావం చూపాయి. బిజేపి కర్నాటక ఆత్మ గౌరవంతో ఆడుకున్నది. ఎలాగైనా గుజరాత్‌ కు అమూల్‌ పెరుగును కర్నాటక ప్రజల మీద రుద్దాలనుకున్నారు. కర్నాటక లో పేరు మోసిన పెరుగు కంపనీని అమూల్‌ లో విలీనం చేయాలనుకున్నారు. దానికి తోడు పెరుగు పేర కన్నడం లో కాకుండా కేవలం హిందీలో రాయాలని కేంద్రం నిర్ణయం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పెరుగు ప్యాకెట్ల మీద హిందీ బాషను మాత్రమే ప్రింట్‌ చేయాలని ఒత్తిడి ని దేశ ప్రజలతో పాటు కర్నాటక ప్రజలు కూడా తిరస్కరించారు. బలవంతంగా హిందిని దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దడమే అవుతుందని కర్నాటక బిజేపి మీద కన్నెర్ర చేసింది. బిజేపిని కాదని, కాంగ్రెస్‌ కు కర్నాటక ప్రజలు అధికారం కట్టబెట్టారు. అయితే కాంగ్రెస్‌ కొన్ని అలవికానీ హామీలను గుప్పించడం కూడా సీట్లు పెరగడానికి కారణమైంది. అంతే తప్ప కాంగ్రెస్‌ ప్రకటించిన పథకాలే కర్నాటక లో అధికారం సిద్దించలేదు. కర్నాటక లో బిజేపి ఓటమికి ఇన్ని కారణాలున్నాయి. పైగా బిజేపి మళ్ళీ అధికారంలోకి తెచ్చినా తనకు పెద్ద ప్రాధాన్యత లభించకపోవచ్చని యడ్యూరప్ప సైలెంట్‌ గా వుండడం కూడా బిజేపి కి మైనస్‌ అయ్యింది. కాంగ్రెస్‌ కు అది కూడా కొంత కలిసి వచ్చింది. ఇదీ అసలు ముచ్చట.
కాంగ్రెస్‌ వన్నీ కోతలే! కాంగ్రెస్‌ చెప్పే విషయాలు నమ్మశక్యమైనవి కాదు.
గతంలో ఇలాంటి పథకాలు అమలు చేసింది లేదు. కాంగ్రెస్‌ పార్టీ అంటే జాతీయ పార్టీ. ఆ పార్టీలో ఏదైనా ఒక విధానం తీసుకుంటే అది అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలి. తెలంగాణ తో పాటు త్వరలో ఎన్నికలు జరగబోతున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాలలో కూడా ఇదే మేనిఫెస్టో అమలు చేస్తారా? అన్నది చెప్పాలి. ఇప్పటికే అధికారంలో వున్న చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ లలో ఈ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు. తెలంగాణలో అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటున్నారు. అధికారంలో వున్న రాష్ట్రాలలో అమలు చేయకుండా ఎందుకున్నారు.
హస్తమంతా రిక్తమే!! అంతే అంతా ఉత్తదే. కర్నాటక పేరు చెప్పి పబ్బం గడుపుకోవడమే!
కర్నాటక లో ప్రకటించిన ఏ ఒక్కటి ఇంకా అమలుకు నోచుకోలేదు. కర్నాటక లో అధికారంలోకి వచ్చి ఇంత కాలమైనా అక్కడ సిలిండర్‌ రూ. 500కు సిలిండర్‌ ఇచ్చింది లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రకటిస్తున్న హెల్త్‌ స్కీమ్‌ లేదు. ఇందిరమ్మ ఇండ్లు కర్నాటక లో లేదు. జాగాలున్న వారికి రూ. 5 లక్షల పథకం లేనే లేదు. రైతులకు రైతుబందు లేదు. కళ్యాణ లక్ష్మి లేదు. కానీ తెలంగాణ లో మాత్రమే ఇస్తారట. నిన్నటి దాకా తెలంగాణ అప్పుల రాష్ట్రం అన్నారు. జీతాలకే పైసలు లేవన్నారు. ఇవన్నీ ఎలా అమలు చేస్తారు. రాజకీయ పార్టీ అన్న తర్వాత నిజాయితీ వుండాలి. ఇంత కాలం తెలంగాణ సంపన్న రాష్ట్రం అని ఒక్కసారైనా అని వుంటే బాగుండేది. పూరి గుడిసెలో ఏసి ఫిట్‌ చేస్తామని చెబితే ఎవరైనా నమ్ముతారా? కాంగ్రెస్‌ చెప్పింది అలాగే వుంది. తెలంగాణ లో ఆదాయం అప్పలకే సరిపోతుందన్న వాళ్లు సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటే జనం నమ్ముతారా?
బిఆర్‌ఎస్‌ పథకాలే కాంగ్రెస్‌ కాపీ! కాంగ్రెస్‌ పార్టీ ప్రకటిస్తున్న పథకాలు నిశితంగా పరిశీలిస్తే కొత్తగా వాళ్లు చెబుతున్నది ఏమీ లేదు?
ఎందుకంటే వాళ్లు వచ్చేది లేదు. ఇచ్చేది లేదు. అందుకే నోటికొచ్చిన హామీలిస్తున్నారు.ప్రజలు నమ్మరని కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు బాగా తెలుసు. గెలిచేది లేదన్నది సీనియర్‌ నేతలందరికీ నాయకులకు తెలుసు. ఓ వైపు టిక్కెట్లు అమ్ముకుంటున్నారన్న వార్తలు నిత్యం వినిపిస్తున్నవే. కేవలం డబ్బులు వున్న వారికే టిక్కెట్లు ఇస్తున్నారని చెప్పుకుంటున్న మాటలే. టిక్కెట్ల పేరుతో రేవంత్‌ రెడ్డి సొమ్ము చేసుకోవడం తప్ప ఏమీ వుండదు. ఇది తెలిసే సీనియర్లు గుర్రుగా వున్నారు. పైగా బైట నుంచి ఎవరొస్తారా? టిక్కెట్లు అమ్ముకుందామా? దుకాణం నడుస్తోంది. బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ ఖాయం. ముచ్చట మూడో సారి కేసిఆర్‌ ముఖ్యమంత్రి కావడం తధ్యం. తెలంగాణలో అమలౌతున్న పథకాలకు ఎదురులేదు.ప్రజా సంక్షేమం కేసిఆర్‌ కు తెలిసినంత మరెవరికీ తెలియదు. జనం నమ్మడానికి కాంగ్రెస్‌ లో నాయకులే లేరు. ఓటుకు నోటు దొంగను నమ్మి ఓట్లేయరు. మూడోసారి భంగపాటు తప్పదు. కాంగ్రెస్‌ కు అధికార యావ తప్ప, తెలంగాణ మీద ప్రేమే లేదు. కేవలం తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్‌ లో చేరిన రేవంత్‌ రెడ్డి ని కాంగ్రెస్‌ పార్టీ నాయకులే నమ్మడం లేదు. తెలంగాణ కోసం ప్రజలు ముఖ్యమంత్రి కేసిఆర్‌ తో కలిసి పద్నాలుగేళ్లు కొట్లాడి సాధిస్తే, తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూసిన రేవంత్‌ ను కాంగ్రెస్‌ నేతలు నమ్మినా ప్రజలు జీవితంలో నమ్మరు. రేవంత్‌ రెడ్డి వున్న కాంగ్రెస్‌ కు ఓటు కూడా వేయరు. రేవంత్‌ సృష్టిస్తున్న అబద్దాల మాయా మశ్చీంద్రను జనం అసలే నమ్మరు. తన సొంత నియోజకవర్గ ప్రజలే తెలంగాణ విషయంలో రేవంత్‌ చేసిన పాడు పనికి చీ కొట్టి ఓడిరచారు. ఇక తెలంగాణ ప్రజలు నమ్మడం అనే కల్ల. కాంగ్రెస్‌ పథకాలన్నీ డొల్ల.

పెట్టుబడుల స్వర్గదామం తెలంగాణ!

https://epaper.netidhatri.com/

పదేళ్ల లో తెలంగాణ పురోగతిపై పారిశ్రామిక ప్రగతి గురించి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ‘‘దాస్యం వినయ్‌ భాస్కర్‌’’ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు… ఆయన మాటల్లోనే…

` హైదరాబాద్‌ చుట్టూ అద్భుతమైన ప్రగతి.

`తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ.

`ఐటిలో మేటి తెలంగాణ.

`తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు రెట్లు పెరిగిన ఐటి ఎగుమతులు.

`ఫార్మాహబ్‌ గా తెలంగాణ.

`హైదరాబాద్‌ లో మరిన్ని సొగసులు.

`కొత్త కట్టడాలు.

`మహానగరంగా…విశ్వ నగరంగా

`పేరుమోసిన వ్యాపార సముదాలన్నీ హైదరాబాద్‌ లోనే.

`బిజినెస్‌ సమ్మిట్ల వేధిక.

`ప్రపంచ స్థాయి కంపెనీల మూల సంస్థలు హైదరాబాద్‌ లో..

`రజనీకాంత్‌ లాంటి వారు ఆశ్చర్యపోయామన్నారు.

`లండన్‌ లో వున్నానా అని చెప్పిన సినీ నటి లయ.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఒక్కసారి కళ్లు మూసుకొని గతంలోకి తొంగిచూసి, కళ్లు తెరిస్తే చాలు మన తెలంగాణ ఒక అందమైన ప్రపంచాన్ని తలపిస్తుంది. నాటి రోజులు, నేటి రోజులు బేరీజు వేసుకుంటే అందమైన ప్రపంచమే మన కళ్లముందు ఆవిషృతమౌతుంది. అంతలా తెలంగాణ మారిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్‌ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పదేళ్ల క్రితం తెలంగాణ చూసిన వాళ్లు మళ్లీ హైదరాబాద్‌ వస్తే ఆశ్చర్యపోక తప్పదు. అసలు ట్యాంక్‌ బండ్‌ను కొన్ని దశాబ్దాల పాటు చూసిన వాళ్లు, మళ్లీ ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం వక్తం చేస్తారు. అటు కొత్త సెక్రెటరియేట్‌, ఇటు అంబెద్కర్‌ విగ్రహం, ఆ పక్కన అమర వీరుల స్మృతి వనం, ముందు హుస్సేన్‌ సాగర్‌ , మధ్యలో గౌతమ బుద్దుడు. చెప్పుకుంటుంటూనే ఒక అందమైన లోకంలో విహరించినట్లు అనిపిస్తుంంది. చూసేవారికి సుందర లోకం కనిపిస్తుంది. ఇద మన తెలంగాణ అని గర్వంగా చెప్పుకునేంతగా ఎదగింది. దీనంతకీ కారణం ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఆయన పాలనలో తెలంగాణే పెట్టుబడులకు స్వర్గదామంగా మారిపోయింది. పదేళ్ల క్రితం తెలంగాణ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఏముందో వింటే మనసు కలిచివేస్తుంది. కన్నీళ్ల దుఖం తన్నుకొస్తుంది. ఆ గోసులు కళ్లముందు కదలాడుతుంటాయి. ఉపాధిలేక, వ్యవసాయం సాగక, చేతినిండా పని లేక, పస్తులతో కాలం వెల్లదీసింది తెలంగాణ. తెలంగాణ పల్లెల నిండా సమస్యలే..ఆకలి బాధలే…అరణ్య రోధనలే…ఇంటి ముందు కనీసం పాడి కూడా లేకుండా, పశువులను కూడా సాదుకోలేని దుస్ధితి తెలంగానది. అలాంటి తెలంగాణను విముక్తి చేయాలని, తెలంగాణ వస్తే తప్ప బతుకులు బాడపడవని, ఉమ్మడి రాష్ట్రంలో ఇక ఊపిరి కూడా తీసుకోలేమని ముఖ్యమంత్రి కేసిఆర్‌ పద్నాలుగేళ్ల సుధీర్ఘ పోరాటం చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను ఏకం చేశాడు. ఉద్యమ బాట పట్టించాడు. తెలంగాణ వెతలు తీరాలంటే తెలంగాణ రావాల్సిందే అని ప్రజల్లో చైతన్యం నింపాడు. దేశానికి అవసరమైతే ఇంటికో సైనికుడు ఎలా తయారు కావాలో..తెలంగాణ కోసం కూడా ఇంటికొకరు కదలాలని చెబితే మొత్తం తెలంగాణ సమాజామే కదిలింది. కేసిఆర్‌ వెంట నడిచింది. తెలంగాణ సాధన కోసం అహర్నిషలు కొట్లాడి కేసిఆర్‌ తెలంగాణ సాధించారు. తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేశారు. తెలంగాణ జీవితాల్లో వెలుగులు నింపారు. తెలంగాణ యువత కోసం మరో లోకం నిర్మించారు. హైదరాబాద్‌లో అధ్భుతమైన అవకాశాల కల్పన వేదికను చేశారు. తెలంగాణనే పెట్టుబడుడుల స్వర్గదామం చేశారు. అందుకోసం మంత్రి కేటిఆర్‌ చేసిన కృషి అంతా ఇంతా కాదు. తెలంగాణ ఈ పదేళ్ల కాలంలో అన్ని రంగాల పురోగతి సాధించడం అన్నది సామాన్య విషయంకాదు. అందరి వల్ల అయ్యేది కాదు. ఇలా ఏక కాలంలో సమ్మిలిత వృద్ధి సాధించడం అన్నది చాలా గొప్ప విషయం. ఒకప్పుడు అమెరికా లాంటి దేశాలు తిరిగి వచ్చిన వారు ఆ దేశాల గొప్పదనం చెబుతుండేవారు. ఇప్పుడు అమెరికాలాంటి దేశాల నుంచి వచ్చిన వారు హైదరాబాద్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. అంతే కాదు అమెరికాలో కొన్ని వందల ఎకరాలు స్ధలాలుండి, ఆస్ధులు సంపాదించిన వాళ్లు కూడా ఇప్పుడు హైదరాబాద్‌లో ఎకరం స్ధలం కొనాలంటే మా స్దోమత సరిపోదని చెబుతున్నారు. అంటే తెలంగాణలో భూముల విలువ ఎంత పెరిగిందో, తెలంగాణ సగటు వ్యక్తి ఎంత ఎదిగాడో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా కోకాపేటలో ఎకరం వంద కోట్లు పలికిందంటే హైదరాబాద్‌లో ఎంత అభివృద్ధి చెందిందో అర్ధం చేసుకోవచ్చు. ఆ మధ్య తమిళ సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ హైదరాబాద్‌లో తిరుగి, నేను అమెరికాలో వున్నానా..లండన్‌లో వున్నానా? అన్న అనుమానం కలిగిందని కితాబిచ్చారు. సీని నటి లయ లండన్‌ నుంచి వచ్చినా లండన్‌లో వున్నట్లే అనిపిస్తందని చెప్పింది. అంటే హైదరాబాద్‌ ఎంతలా అభివృద్ధి చెందిందో అర్ధం చేసుకోవచ్చు. అనితర సాధ్యమైన పనిని, సాధించి తెలంగాణ ప్రజలకు బహుమానంగా అందించడం అంటే మాటలు కాదు. అలాంటి అభివృద్ధి యజ్ఞంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచనలకు, ఆచర రూపం కల్పించి తెలంగాణను పారిశ్రామిక రంగంలో నెంబర్‌ వన్‌ చేశారు. తెలంగాణలో మంత్రి కేటిఆర్‌ పారిశ్రామిక విప్లవం సృష్టించారు. అంటున్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ హన్మకొండ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్‌ , నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…
తెలంగాణ రాకు ముందు ఐటి ఎగుమతులు రూ.50వేల కోట్లు. కాని నేడు అంతకు నాలుగురెట్లు పెరిగింది.
ప్రస్తుతం రెండున్నర లక్షల కోట్ల ఐటి ఎగుమతులు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఐటి అంటే బెంగుళూరు గురించి చెప్పుకునేవారు. ఆ తర్వాత చెన్నై అనేవారు. కాని నేడు ఎక్కడ విన్నా హైదరాబాద్‌ గురించె మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం మూలంగా పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. తెలంగాణ వస్తే చిమ్మ చీకట్ల మయమౌతుందని భయపెట్టారు. తెలంగాణరాష్ట్రం సాధించుకున్నా ముఖ్యమంత్రికేసిఆర్‌ విజన్‌ చూసి ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ వెలుగులు చూసి నిజమా..కలా అనుకుంటున్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్దగా ముందుకు వచ్చేవారు. అప్పటి ప్రభుత్వాలు ఎంత ఆహ్వానించినా వచ్చేవారు కాదు. కారణం కరంటు. ఒక దశలో పరిశ్రమలు కూడా పవర్‌ హాలిడే ప్రకటించుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడిరది. అంతే కాదు చంద్రబాబు ముఖ్యమంత్రి వున్న సమయంలో క్రాప్‌ హాలిడే కూడా ప్రకటించడం చూశాం. అసలు తెలంగాణలో సాగే లేదంటే క్రాప్‌ హలిడే ప్రకటించి తెలంగాణను అంధకారం చేశారు. అలాంటి కాలం నుంచి తెలంగాణ నేడు వెలుగు కాలం చూస్తోంది. రెప్పపాటు కూడా పోని కరంటును చూస్తోంది. దేశంలో ఎక్కడా ఇంతగా విద్యుత్‌ సౌకర్యం లేదు. బెంగుళూరు వంటి నగరాల్లో కూడా ప్రస్తుతం కరంటు కోతలు వున్న సంగతి తెలిసిందే. కాని తెలంగాణలో ఒక్క గృహ అవసరాలకే కాదు, రైతాంగానికి ఉచితంగా 24 గంటల కరంటు ఇవ్వడం జరుగుతోంది. పరిశ్రమలకు పవర్‌ హాలీడే అన్నది ఎప్పుడూ లేదు. తెలంగాణలో ఐటి పరిశ్రమతోపాటు ఫార్మా రంగం కూడా విస్తరించింది. ప్రభుత్వం తీసుకున్న చొరవతో పెద్దఎత్తున ఫార్మాకంపనీలు తెలంగాణలో తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. ఈ సందర్భంగా హెటిరో సంస్ధ పార్ధసారధిరెడ్డి చెప్పిన విషయం గుర్తు చేయాలి. గతంలో తమ ప్లాంటుకు నిత్యం కొన్ని వందల వాటర్‌ ట్యాంకులు కొని తెచ్చుకునే వాళ్లం. విదేశాల ప్రతినిధులు ఓ ఫార్మా తయారీ కోసం తమ సంస్ధను ఎంచుకొని అగ్రిమెంట్లు జరిగే సమయంలో వాటర్‌ ట్యాంకులను చూసి ఆ ఒప్పందం ఆగిపోయింది. ఓసారి ముఖ్యమంత్రి కేసిఆర్‌ తమ సంస్ధను సందర్శించినప్పుడు అదే సీన్‌ చూశారు. మాకు నీటి కొరత వుందని ఒక్క మాట చెప్పగానే వారం రోజుల్లో నీటి సౌకర్యం కల్పించారని చెప్పారు. అంటే తెలంగాణ పారిశ్రామిక రంగం వృద్ధి మీద ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఎంత చిత్త శుద్ది వుందో ఈ ఒక్క సంఘటనతోనే తెలుసుకోవచ్చు. తెలంగాణలో వైద్య విప్లవం కొనసాగుతోంది. తెలంగాణలో గ్లోబల్‌ సెంటర్ల ఏర్పాటు పెరుగుతోంది. గతంలో బెంగుళూరును ఎంచుకునేవారు. కాని ఇప్పుడు ప్రపంచ దేశాలు సైతం హైదరాబాద్‌ వైపు చూస్తున్నాయి. హైదరాబాద్‌లో తమ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 2020లో 5 సెంటర్లతో మొదలై గ్లోబల్‌ సెంటర్ల ఏర్పాటు ఈ ఏడాది ఏకంగా 33 సెంటర్లు ఏర్పాటు చేశారంటే హైదరాబాద్‌ బ్రాండ్‌ గొప్పదనం తెలుస్తోంది. ఇలా తెలంగాణ అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్తోంది. ఏ రంగం చూసినా తెలంగాణే కనిపిస్తోంది. సంక్షేమ రంగంలో తెలంగాణను మించిన రాష్ట్రం మరొకటి లేదు. అభివృద్ధి విషయంలో తెలంగాణతో పోటీ పడే రాష్ట్రం లేదు. పారిశ్రామిక ప్రగతి పరుగులో తెలంగాణే ముందుంది. చివరికి తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేసిన నేలల్లోనే బంగారు పంటలు పండుతున్నాయి. వ్యవసాయం రంగంలోనూ నెంబర్‌ వన్‌గా వెలుగొందుతోంది. అదీ కేసిఆర్‌ పాలనకు నిదర్శనం. తెలంగాణ ప్రగతికి సంకేతం. పారిశ్రామికాభివృ ద్ధికి నిదర్శనం.

తెలంగాణ స్వాభిమాన పతాక

https://epaper.netidhatri.com/

`స్వావలంబన అభిమాన గీతిక.

`తెలంగాణ ప్రగతి ఆత్మ గౌరవ ప్రతీక.

` కేంద్ర సాయం మీద ఆధారపడకుండా నిలిచిన వేధిక.

`విభజన హామీలు అమల కోసం ఎదురు చూడకుండా ఎదిగిన అభివృద్ధి నమూన.

` కేసిఆర్‌ నిరంతర శ్రమ..అహర్నిశలు పడిన తపన.

`ఇంత వేగవంతమైన అభివృద్ధి ఒక్క కేసిఆర్‌ తోనే సాధ్యమైంది.

`ఉమ్మడి పాలకులు పీల్చి పిప్పి చేశారు.

`పదేళ్లలో కేసిఆర్‌ నిలబెట్టి చూపించారు.

`తెలంగాణ బాగు పడడం గిట్టని వాళ్ల కళ్లు కుళ్లుకుంటున్నాయి.

`తెలంగాణను దోచుకోవాలని చూస్తున్నాయి.

`తెలంగాణకు మళ్ళీ పాత రోజులు తేవాలని చూస్తున్నాయి.

తెలంగాణ పోరాటి సాధించుకున్న ఆత్మ గౌరవ పతాక. స్వాభిమాన వీచిక. గుండె ధైర్యం నిండిన విజయ వేధిక. ఉద్యమమే నినాదమైన, తెలంగాణ పదమే వేదమైన కరదీపిక. దేశానికే వెలుగు రేఖ. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వావలంబన గీతిక. ఇంత గొప్పది నా తెలంగాణ. ఆ తెలంగాణ రావడానికి, నేడు బంగారు తెలంగాణ నిర్మాణం జరిగింది ఒక్కరితోనే. ఆ ఒక్కరే ముఖ్యమంత్రి కేసిఆర్‌. అసలు తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఆత్మాభిమాన ఉద్యమ బాట. తెలంగాణకు పోరాటం కొత్త కాదు. గెలవడం కొత్త కాదు. సమస్యలు కొత్త కాదు. వాటిని అధిగమించడం కొత్త కాదు. గెలిచి నిలబడిన చరిత్ర కొత్త కాదు. ఎప్పుడూ ఏదో ఒక చరిత్ర సృష్టించడమే తెలంగాణ గొప్పదనం. ప్రపంచ దేశాలకే పోరాట విలువలు నేర్పిన ఏకైక ప్రాంతం తెలంగాణ. నిజాం కాలంలో రైతంగా సాయధ పోరాటమైనా, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమమైనా వ్యవస్ధలకు పట్టుదలను రుచి చూపించిన నిఘంటువు నా తెలంగాణ. భూమికోసం , భుక్తి కోసం, బానిస సంకెళ్ల విముక్తికోసం పోరాటాలు ఎన్ని జరిపినా అలసిపోలేదు. అలాగే అభివృద్దిలోనూ ఆగిపోలేదు. పోరాటమైనా, ప్రగతి దారైనా ముందుకే. తెలంగాణ ఎవరి సహాకారం కోరదు. తెలంగాణ ఎవరి మీద ఆధారపడదు. ఇది నిరూపించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌.
తెలంగాణ రాక ముందు ఉద్యమ సమయంలో సీమాంధ్ర నేతలు ఎన్ని మాటలు అన్నారో విన్నాం.
తెలంగాణ వచ్చిన తర్వాత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత పదేళ్లుగా తెలంగాణ గురించి మాట్లాడుతున్న మాటలు వింటున్నాం. అయినా ఎక్కడా వెరవలేదు. ఆగిపోలేదు. అలసిపోలేదు. దేశంలో అన్ని రాష్ట్రాలను దాటకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏనాడో గుజరాత్‌ను వెనక్కి నెట్టేశాం. ఇదే బిజేపికి నచ్చని విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును బిజేపి సహకరించిందన్న మాట మినహా…2014 నుంచి తెలంగాణ కోసం కేంద్రం ఏ సహాయం చేయలేదన్నది తెలుసుకోవాలి. 2014 ఎన్నికల్లో సాక్ష్యాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి కొండ కింద ప్రధాని మోడీ మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని అన్నారు. ఆ తర్వాత ఆ మాటను అనేక మార్లు ఉటంకించారు. అవకాశం దొరికనప్పుడల్లా తెలంగాణ మీద విషం కక్కారు. తెలంగాణ ఏర్పాటు కావడం తనకు ఇష్టం లేదన్నంతగా పరక్ష వ్యాఖ్యలు చేశారు. 1998లో కాకినాడలో జరిగిన బిజేపి పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ తీర్మాణం చేసి, ఉత్తరాధిన మూడు రాష్ట్రాలు ఇచ్చింది. కాని తెలంగాణను వదిలేసింది. నిజానికి బిజేపి ప్రభుత్వ హాయంలో ఇచ్చిన మూడు రాష్ట్రాలకన్నా ముందు నుంచి సాగుతున్న ఉద్యమం తెలంగాణది. 1956లోనే నాటి ప్రధాని నెహ్రూ తెలంగాణ ప్రజలు వద్దనుకున్న నాడు ప్రత్యేకమైపోవచ్చు. అని కూడా చెప్పారు. కాని ఆయన హయాంలో కుదరలేదు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఇవ్వలేదు. ఎవరూ ఇవ్వలేదు. ఆఖరకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ సారధ్యంలో సాగిన పద్నాలుగేళ్ల నిరంతర పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది. దీన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ జీర్ణించుకోవడం లేదు. గతంలో పాత పార్లమెంటులో పలుసార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుపట్టారు. ఆఖరుకు ఇటీవల కొత్త పార్లమెంటు తొలి రోజున కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు సంతోషంగా లేరన్నారు. ఇదే ఒక ప్రధాని చేయాల్సిన వ్యాఖ్యలు. అయినా సరే తెలంగాణ ప్రజలు భరిస్తూనే వున్నారు.
ఇక తెలంగాణ ఇస్తే చిమ్మ చీకట్లౌతుందని సీమాంధ్ర నేతలు అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అసలు తెలంగాణ మనుగడే సాధ్యం కాదన్నారు. తెలంగాణ వస్తే ఇక అంధకారమే అంటూ కర్ర పట్టుకొని చీకట్లో నిలబడి కరంటు లెక్కలు చెప్పాడు. ఇప్పుడు ఆ కిరణ్‌కుమార్‌ రెడ్డే తెలంగాణ వెలుగులను చూస్తున్నారు. తెలంగాణ వస్తే కనీసం పెండిరగ్‌ ప్రాజెక్టులు కూడా పూర్తి చేసుకోలేరనాన్నరు. హైదరాబాద్‌లో మత కల్లోలాలు వస్తాయన్నారు. అసలు తెలంగాణ భూములు తొండలు గుడ్లు పెట్టడానికి కూడా పనికిరావన్నారు. ఇలా ఎవరికి ఇష్టమెచ్చినట్లు వాళ్లుమాట్లాడారు. తెలంగాణ పూర్వ చరిత్ర ఏమిటో తెలుసుకోకుండా ఎవరికి తోచించి వారు మాట్లాడారు. కాని తెలంగాణకు ఒక చరిత్ర వుంది. తొలి తెలుగు చరిత్ర మొదలైందే తెలంగాణలో…కరీంనగర్‌ జిల్లాలోని కోటి లింగాలలోనే తొలి శాతవాహన చరిత్రకు శ్రీకారం జరిగింది. ఆ తర్వాతే ధాన్య కటకానికి వెళ్లింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చరిత్రను కనుమరుగు చేశారు. అలా మొదలైన తెలంగాణ ప్రస్తానం కాకతీయ కాలంలో ఉచ్చదశకు చేరుకున్నది. సంపన్న ప్రాంతమై విలసిల్లింది. సుమారు 300 సంవత్సరాలకు పైగా సాగిన కాకతీయ చరిత్రలోనూ తెలంగాణది స్వర్ణయుగమే. ఆ తర్వాత మొగలులపాలనైనా, నిజాం పాలన దాకా తెలంగాణలో కరువు లేదు. ఎందుకంటే నిజం కాలంలో హైదరాబాద్‌ వజ్రాల వ్యాపారానికి పేరెన్నిక కగన్నది. లండన్‌ మహారాణికి అత్యంత విలువైన వజ్రాల హారాన్ని బహూకరించింది నిజాం రాజు. లండన్‌ వీధుల్లో తిరిగే రోల్స్‌ రాయిస్‌ కార్లతో హైదరాబాద్‌ వీధులు ఊడిపించిన చరిత్ర తెలంగాణది. అలాంటి తెలంగాణపై ఎవరు వ్యాఖ్యలు చేసినా వాళ్లే చరిత్ర హీనులయ్యారు.
అలాంటి తెలంగాణను తెచ్చింది కేసిఆర్‌. నిలబెట్టింది కేసిఆర్‌.
పదేళ్లలో తెలంగాణ ప్రగతి రాకెట్‌ కన్నా వేగంగా దూసుకెళ్లింది. అసలు తెలంగాణలో తాగు నీరే దొరకదు. ఇక సాగు నీటి సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. అలాంటి తెలంగాణలో కేంద్రం నుంచి రూపాయి సాయం లేకున్నా,ఎలాంటి సహాకారం లేకున్నా కాళేశ్వరం లాంటి అధ్భుతమైన ప్రాజెక్టును ఎవరూ ఊహించని రీతిలో నిర్మాణం జరిగింది. తెలంగాణ మొత్తం సస్యశ్యామం చేసేందుకు కారణమైంది. అసలు తెలంగాణ సాధించిన మూడేళ్లకే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే మాటలు కాదు. మంత్రి హరీష్‌రావు రాత్రింబవళ్లు పర్యవేక్షణ, ముఖ్యమంత్రి కేసిఆర్‌ పరిశీలన, అంకిత భావం వున్న తెలంగాణ ఇంజనీరింగ్‌ వ్యవస్ధ కలిసి సృష్టించిన భగీరధ నిర్మాణం కాళేశ్వరం. అదే సమయంలో నిర్మాణం మొదలైన పోలవరం అక్కడే ఆగిపోయింది. కాళేశ్వరం పూర్తి చేసుకున్న తర్వాత మొదలు పెట్టిన పాలమూరు..రంగారెడ్డి కూడా పూర్తియ్యింది. దాంతో తెలంగాణ మొత్తం నీటి గంగాలమైంది. వీటి నిర్మాణం సాగుతుండగానే తెలంగాణలోని నలభై ఆరు చెరువులకు పూర్వ వైభవం తేవడం జరిగింది. అనేక రిజర్వాయ్యర్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఎన్నేళ్ల కలగానో మిగిలిపోయిన మానేరు ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయి. ఖమ్మంలో సీతారామా లాంటి ప్రాజెక్టులు కూడా నీళ్లందిస్తున్నాయి. నీటి చుక్కకు కోసం కన్నీళ్లు కార్చిన తెలంగాణ కళ్లలో ఆనందభాష్పాలు చూస్తున్నామంటే అది కేసిఆర్‌. ఆయన సాగునీటి రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ఒక యజ్ఞంగా చేపట్టారు. తెలంగాణ మొత్తం నీరందించి, సస్యశ్యామలం చేశారు. ఇక కరంటు కష్టాలు తెలంగాణ తెచ్చిన మూడు నెలల్లో తీర్చాడు. రైతాంగానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరంటు ఇస్తున్నారు. హైదరాబాద్‌ను పెట్టుబడుల స్వర్గధామం చేశాడు. ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా చేశాడు. ఐటి రంగానికి కేరాఫ్‌ చేశాడు. పార్మా రంగంలో తెలంగాణను అగ్రగామి చేశాడు. హైదరాబాద్‌లో ట్రాపిక్‌ సమస్యకు పరిష్కారం చూపెట్టారు. ఈ పదేళ్ల కాలంలో 37 కొత్త ప్లైఓవర్లు నిర్మాణం చేశారు. కొత్త కొత్త నిర్మాణాలు చేసి, హైదరాబాద్‌ రూపు రేఖలు మార్చేశారు. కొత్త సెక్రటెరియేట్‌, ముప్పై మూడు జిల్లాల్లో కొత్త జిల్లా కలెక్టర్ల సముదాయ భవనాలు. అమర వీరుల స్మృతి వనం. 125 అడుగుల అంబెద్కర్‌ విగ్రహంతో కొత్త హైదరాబాద్‌ను ఆవిష్కరించారు. తెలంగాణను ఆరోగ్యవంతమైన రాష్ట్ర్రంగా తీర్చిదిద్దుతున్నారు. 33 జిల్లాల్లో కొత్తగా వైద్య విద్యాలయాలు ఏర్పాటుచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రం సహాకారం లేకుండా, పైసా సాయం లేకుండా నిలబడిరది తెలంగాణ. దాన్ని రూప శిల్పి ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఆయన పేరే ఒక బ్రాండ్‌. హైదరాబాద్‌ ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌. దటీజ్‌ తెలంగాణ…దిసీజ్‌ ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన. ఎనీ డౌట్‌!

నా చెరువు నాడు…నేడు!

https://epaper.netidhatri.com/

`గణేష్‌ నిమజ్జనాలకు కూడా నీళ్లుండేవి­ కాదు!

`గణేష్‌ నిమజ్జనాల కోసం తెలంగాణ నుంచి విజయవాడ వరకు వెళ్లాల్సివచ్చేది.

`తెలంగాణ పట్టణ పరిసరాల చెరువుల్లో చుక్క నీరుండేది కాదు.

`కాళేశ్వరం ఇసక ఎడారిని తలపించేది.

`సమ్మక్క జాతరలో జంపన్న వాగులో చుక్క నీరుండేది కాదు.

` కేవలం జాతర కోసం నీళ్లు వదిలే వారు.

`ఇప్పుడు నిరంతరం జంపన వాగులో నీటి ప్రవాహం.

`పుష్కరాలప్పుడు ఆంధ్రా వెళ్లాల్సిందే.

`ఇదీ ఆనాటి తెలంగాణ దుస్థితి.

`ఇప్పుడు ప్రతి పల్లె ఒక నీటి గంగాళం.

`ప్రతి చెరువులో నిరంతరం జలం.

`కుల వృత్తులకు ఆదాయ మార్గం.

`పొలాల గొంతు తడుపుతున్న గంగమ్మ ప్రతిరూపం.`

పాడిపంటలందిస్తున్న అష్టలక్ష్మి వైభవం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కళ తప్పిన నా తెలంగాణ చెరువుకు మళ్లీ జీవమొచ్చింది. చెదిరిన చెరువుకు జలజీవమొచ్చింది. చెరువు బాగైంది. అందమైన నీటి బాంఢగారమైంది. మా చెరువుకు పూర్వ వైభవం వచ్చింది. అంతకన్నా సుందరంగా ముస్తాబైంది. జలమంత చెవరుకు జగమంత పండగొచ్చింది. ఊరంతా మురిసింది. ఊరే మెరిసింది. సంబరాలు చేసుకున్నది. కూలి పోయిన కులవృత్తులకు మళ్లీ తెలంగాణ పల్లె ఆలవాలమైంది. చెరువే తెలంగాణ పల్లెకు ఆదెరువు. అది ఉమ్మడి రాష్ట్రంలో చెదిరిపోయింది. చిద్రమైపోయింది. పల్లె బతుకు ఆగమైంది. కులవృత్తులు అంతరించిపోయాయి. మత్స సంపద కానరాకుండాపోయింది. దాని మీద ఆధారపడే మురిరాజ్‌లు నారాజైండ్రు. కొత్త ఉపాధి బాటనెంచుకున్నారు. ఊరు వదిలి పట్టణాలు వలస వెళ్లిండ్రు. బొంబాయి లాంటి ప్రాంతాలలో కూలి పనులు చేసుకున్నారు. తెలంగాణలో మత్స సొసైటీలన్నవి కనుమరుయ్యాయి. చెరువే లేక ముదిరాజ్‌ల జీవనమే ఆగమైంది. ఇలా చెరువు ఎండిపోయి సాగు లేకుండాపోయింది. చెరువులో నీరు లేక పశు సంపద మృగ్యమైంది. మొత్తంగా పల్లెకు గ్రహణం పట్టినంత పనైంది. తెలంగాణ వచ్చింది. తెలంగాణ పల్లెకు మళ్లీ సొగసొచ్చింది. చెరువుకు సోయగమొచ్చింది. తెలంగాణ రాగానే చెరువుకు నీరొచ్చింది. వానా కాలం కాకపోయినా చెరువు నిండిరది. ఏళ్ల తరబడి గొంతెండి పోయిన చెరువు దాహంతీరేదాకా నిండిరది. చెరువు నింపడంతో ఊరంతా పచ్చబడిరది. భూగర్భమంతా నీరు సందడి చేస్తోంది. పల్లెకు పండగొచ్చింది. మళ్లీ సాగు చిగురించింది. ఎండిన బీడులు పొలాలయ్యాయి. గుంట కూడా వదిలిపెట్టకుండా పంట పండుతోంది. ఊరిని సుసంపన్నం చేస్తోంది. చెరువు కుల వృత్తులకు ఆధారమైంది. ఆదాయం సమకూర్చుతోంది. పల్లె జీవితాలను నిలబెట్టింది. ఇదీ తెలంగాణ చెరువుల ఘనత. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణకు అందించిన కలల పంట.
ఒకనాడు నా చెరువులో నీటి చుక్క లేక కొన్ని దశాబ్దాలు ఎండిపోయింది. కాదు..నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఒట్టిపోయింది.
వర్షాకాలంలో కూడా చెరువులోకి నీరు రాకుండాపోయింది. ఓ వైపు కరువు. మరో వైపు పాలకుల దుర్మార్గం. ప్రకృతి పగబట్టినట్లే కొన్ని దశాబ్దాల పాటు తెలంగాణను చినుకు ముద్దాకుండా శాపానికి గురైంది. ఉమ్మడి పాలకుల కోపానికి గురైంది. దాంతో తెలంగాణ చెరువు పూర్తిగా ఎండిపోయింది. తన ఆనవాలు తానేమర్చిపోయింది. ఒక దశలో గణేష్‌ నిమజ్జన సమయంలో విగ్రహాల నిమజ్జనానికి కూడా చుక్క నీరు లేక తెలంగాణ గోసపడిరది. అయ్యో గణనాధా? అంటూ బోరున విలపించింది. భక్తిభావంతో నిలుపుకొని కొలిచిన దేవుడిని నీరు లేని చెరువులో నిమజ్జనం చేయలేక, కొన్ని సార్లు విజయవాడ లాంటి ప్రాంతాలకు కూడా తీసుకెళ్లిన సందర్భాలున్నాయి. ఇక తెలంగాణ పల్లెల్లో కూడా ఎక్కడ ఏ చెరువులో నీరుందో తెలుసుకొని ఎంత దూరమైనా వెళ్లి నిమజ్జనం చేసిన ఘటనలున్నాయి. ఇదీ ఆనాడు తెలంగాణ దీనస్దితి. ఇక తెలంగాణలో ఎంతో గొప్పగా జరుపుకునే ఆది వాసి సమ్మక్క సారక్క జాతర. రెండేళ్లకోసారి ఎంతో వైభవంగా తెలంగాణలోని ములుగు జిల్లాలో ఈ జాతర జరుగుతుంది. తలాపున గోదారి పరుగులుపెడుతుంది. కాని సమ్మక్క సారక్క జాతర ప్రాంతంలో జంపన్న వాగు ఎప్పుడూ ఎండిపోయి వుండేది. జాతర సమయంలో జంపన్న వాగులోకి గోదావరి నదీ జలాలు వదిలేవారు. ఆసియాలోనే అత్యంత గొప్ప జాతరగా గుర్తింపు వున్న మేడారం జాతరలో నీటి కట కట అలా వుండేది. కనీసం భక్తులు స్నానాలు చేసేందుకు కూడా నీరు సమృద్దిగా వుండేది కాదు. మరి ఇప్పుడు నిరంతరం జంపన్న వాగు జీవ నదిలా పారుతోంది. మేడారం వచ్చిన భక్తుల పాపాలను కడిగేస్తూ నిరంతరం సాగిపోతోంది. ఇదీ నా తెలంగాణ. ఇక పుష్కరాల సమయం అంటే చాలు ఆంధ్రాకు పండగ. తెలంగాణలో కూడా కృష్ణా, గోదారి నదులు పారుతున్నా వాటిలో స్నానం చేసేందుకు కూడా ఉమ్మడి పాలకులు అవకాశం కల్పించేవారు కాదు. అసలు తెలంగాణలో పారుతూవున్న గోదారి నీళ్లకన్నా, రాజమండ్రి వెళ్తేనే పుణ్యం అన్నంతగా ప్రచారం చేసేవారు. కృష్ణా నది పుష్కరాల సమయంలో విజయవాడలో స్నానం చేస్తేనే పుణ్య స్నానం పూర్తయినట్లు చెప్పేవారు. దాంతో తెలంగాణలో ఆ నదులున్నా, ఆ ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారు. నీటి గోసకు, నిర్లక్ష్యానికి తెలంగాణను కేరాఫ్‌ అడ్రస్‌ చేశారు. తెలంగాణ ప్రజలు ఆగమౌతుంటే నవ్వుకున్నారు.
నా తెలంగాణ పచ్చబడాలి. పల్లె కళకళలాడాలి. పచ్చ దనం వెల్లివిరియాలి.
పాడి పంట సమృద్ధిగా మారాలి. పల్లెలో కరువును తరిమివేయాలి. పల్లెకు మళ్లీ వెలుగు రావాలి. ఊరంతా పండగ కావాలి. అంటే ముందు చెరువు బాగు పడాలి. చెరువుకు పూర్వ వైభవం తేవాలని ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంకల్పించారు. తెలంగాణలో వున్న నలభై ఆరు వేల చెరువులను మూడేళ్లలలో దశల వారిగా బాగు చేశారు. ముందు కరువు రక్కసితో బాధపడుతున్న ప్రాంతాలను గుర్తించారు. తొలి విడతలో ఆ చెరువుల బాగుకు ప్రణాళికలు తయారు చేశారు. తెలంగాణ వచ్చిన తొలి ఏడాది నుంచే చెరువుల మరమ్మత్తులకు శ్రీకారం చుట్టారు. ముందు చెరువుల్లో పూడిక తీయించారు. చెరువు కట్టలు బాగు చేశారు. వాటిపై తాటి, ఈత చెట్లు పెంచారు. 2015లోనే చెరువులు గోదావరి నీళ్లతో నింపడం మొదలు పెట్టారు. ఒక్కసారిగా తెలంగాణ వాతావరణం మారిపోయింది. కొన్ని దశాబ్దాలుగా చుక్క నీటిని చూడని చెరువులు ఎండకాలంలో మత్తళ్లు పోశాయి. వాగులు వంకలు వానలు లేకున్నా పారాయి. మత్తళ్లు దుంకుతూ పారిన జలాలు గొలుసు కట్టు చెరువుల బాటన ఒక చెరువు నుంచి మరో చెరువు చేరాయి. ఇలా తెలంగాణలో చెరువులన్నీ నిండాయి. ఊళ్లన్నీ పచ్చబడ్డాయి. ఎండిపోయిన బావుల్లో ఊటలు మొదలయ్యాయి. వానాకాలంలో ఎల్లబోసే బావులు ఎండాకాలంలో కూడా ఎల్లబోశాయి. ఎండిన బోర్ల నీళ్లతో నిండాయి. ఇంతలో నిరంతర ఉచిత కరంటు వచ్చింది. రైతులకు వరమైంది. పాడి పంటల పండుగలు మళ్లీ మొదయ్యాయి. ఇలా చెరువులు నీటి గంగాళాలై నిత్యం కళకళలాడుతున్నాయి. ఒకప్పుడు చెరువు ఆనవాలు వుందా? అన్న అనుమానం వున్న చోట చెరువు లోతుగా వుంది. అంటూ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రతి పల్లెలో నీటి సవ్వడులు వినిపిస్తున్నాయి. తెలంగాణ చెరువులు నిండి మత్స సంపదకు ఆలవాలమైంది. పొలాలు తడిపే గంగమ్మతల్లి ప్రతిరూపమైంది. ఒక రకంగా చెప్పాలంటే పాడిపంటల సంపదనందిస్తూ, అష్టలక్ష్మి వైభవం పల్లె చూస్తోంది. ఇదంతా కేసిఆర్‌ వల్లనే సాధ్యమైంది. అపర భగీరధుడు కలలు గన్న తెలంగాణ ఆవిషృతమైంది. తెలంగాణ సస్యశ్యామలమైంది. ఈ తరానికి చెరువును చూపించడమే కాదు, పాడి పంటలను అందించే వరంగా తీర్చిదిద్దారు. మలి తరానికి బంగారు బాటలు వేశారు. Continue reading నా చెరువు నాడు…నేడు!

జలమే బిఆర్‌ఎస్‌ బలం!

https://epaper.netidhatri.com/

 రైతు మద్దతే కారుకు వరం!

`తడారిన తెలంగాణ గొంతు తడిపిందే కేసిఆర్‌.

`నెర్రెలు బారిన నేలకు ఊపిరిలూదిందే బిఆర్‌ఎస్‌.

`తన కంట ఒలికిన కన్నీరు ఏ రైతు కంట ఒలకకుండా చేసిందే కేసిఆర్‌.

`బంజరు భూముల్లో బంగారు పంటలకు కారణం కేసిఆర్‌.

`తెలంగాణ భూ గర్భం సముద్రం చేసింది కేసిఆర్‌.

`బిఆర్‌ఎస్‌ కు రైతులే అండ.

`పేదలకు కేసిఆర్‌ నాయకత్వమే అండా దండ.

`సంక్షేమానికి నిదర్శనమే కేసిఆర్‌ పాలన.

`తెలంగాణలో చీకట్లను తరిమి వెలుగులు పంచిందే కేసిఆర్‌.

`బంగారు పంటల మాగాణ తెలంగాణ చేసిందే కేసిఆర్‌.

`ప్రజల ఆలోచనల్లో ప్రతిపక్షాలు లేవు.

`ప్రత్యామ్నాయ శక్తులు అనే పదానికి తెలంగాణలో చోటు లేదు.

`సమ్మిళిత వృద్దిలో సకలజనులున్నారు.

`ప్రతిపక్షాలలో కూడా ప్రభుత్వ పథకాలు అందుకున్న వారు వున్నారు.

`వాళ్ల మనసులో కూడా వుంది కారే!

`వారి మనసు కోరుకుంటోంది కేసిఆర్‌ నే!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

జలం ఈ పదం వింటేనే తెలంగాణ జనం మనసు పులకరిస్తుంది. తనువు పరవశిస్తుంది. ఎందుకంటే నీటి కోసం తెలంగాణ పడిన గోస అంతా ఇంతా కాదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పల్లెలు నీటి కోసం అల్లాడాయి. ఒకప్పుడు తెలంగాణ గొలుసుకట్టు చెరువులతో కళకళలాడుతూ వుండేది. ఒక్క తెలంగాణ లోనే సుమారు 60వేలకు పైగా చెరువులుండేవి. జలకళలతో కళకళలాడుతూ వుండేవి. నిజాం కాలంలో వ్యవసాయం మీద వచ్చే పన్నుతోనే అప్పటి హైదరాబాదు రాష్ట్రం సిరి సంపదలతో తులతూగుతూ వచ్చేది. ప్రపంచంలోనే నిజాం నవాబు అధిక సంపన్నుడు కావడానికి కారణం తెలంగాణలో సాగు సంపదే కారణం. నిజాం పాలన నుంచి విముక్తి జరిగి, హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటైంది. అలా స్వేచ్చా వాయువులు పీల్చుకున్నదో లేదో, భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో మళ్ళీ తెలంగాణకు కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుతో తెలంగాణ ప్రజల జీవితాలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో విలీనమై సమయంలో మిగులు రాష్ట్రం. తెలంగాణ వనరులు ఆంధ్రప్రదేశ్‌ కు తరలించారు. తెలంగాణ ఆదాయం తో సీమాంధ్ర లో సాగు నీటి ప్రాజెక్టులు నిర్మాణం చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ లతో పాటు పోతిరెడ్డిపాడు ఇలా చెప్పుకుంటూ అనేక ప్రాజెక్టులతో సీమాంధ్ర ను సస్యశ్యామలం చేసుకున్నారు. తెలంగాణ ను ఎండబెట్టారు. అరవై ఏళ్ల పాలనలో తెలంగాణ సాగు రంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. ఎన్నికలు రాగానే శంకుస్థాపనలు. తెలంగాణను అరవై ఏళ్లు మభ్యపెట్టి, మాయ చేసి దోచుకున్నారు. తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అంటూ ఆంధ్రా అభివృద్ధి చేసుకున్నారు. తెలంగాణ ను ఎందుకు కాకుండా చేశారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ మరింత విధ్వంసానికి గురైంది. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాల హయాంలో నీటి దోపిడే జరిగేది. తెలుగుదేశం వచ్చాక వనరులు కొల్లగొట్టి, తెలంగాణ ను పీల్చి పిప్పి చేసింది. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తిగా దోచుకున్నారు. తెలంగాణ ఏ మారు మూల ప్రాంతంలో చిన్న ఉద్యోగంలో కూడా ఆంద్రా వాళ్లే…తెలంగాణ సాగు విపరీతమైన విద్వంసం చేశారు. చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా పక్కనపెట్టారు. తెలంగాణ ను నీళ్లిస్తే ఆంధ్రాకు కష్టమవుతుందని ప్రాజెక్టులు పూర్తి పూర్తి చేయలేదు. పైగా నికర జలాలు ఆంద్రాకు తరలించి, వరద జలాలు తెలంగాణ కు అని చెప్పి మోసం చేశారు. అవి కూడా ఇవ్వకుండా తెలంగాణను ఆగం చేశారు. ఒక దశలో తెలంగాణ ప్రాజెక్టుల ఊసెత్తొద్దని కూడా చంద్రబాబు హుకూం జారీ చేశారు. తెలంగాణ కు నీళ్లు ఇవ్వాలంటే ఎత్తిపోతల ప్రభుత్వం వల్ల కాదన్నారు. తెలంగాణ ఊర్లన్ని వలసలు పోతున్నా చూస్తూ ఊరుకున్నారు. సీమాంధ్రులు హైదరాబాదు పరిసర ప్రాంతాల చెరువులన్నీ మాయం చేశారు. తెలంగాణ చెరువుల ఆనవాలు లేకుండా ధ్వంస రచన సాగించారు. ప్రాజెక్టులు కట్టకపోయినా, కనీసం చెరువుల బాగు చేయడానికి కూడా చేతులు రాలేదు. తెలంగాణ ను ఎడారి చేశారు. 

అలాంటి తెలంగాణ లో ఇప్పుడు జలమే జలం…ఎక్కడ చూసినా జలమే…ఏ దిక్కు చూసినా పొలమే…పచ్చదనమే…

మరి సరిగ్గా పదేళ్ల క్రితం ఎక్కడ చూసినా ఎండిన బీడులే. ఒట్టిపోయిన వాగులే…ఆనవాలు కోల్పోయిన వాగులే…జల జాడ లేకుండా పోయింది. భూ గర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయిన స్థితి. కరువు రక్కసి చేతిలో విలవిలలాడిపోయింది. పనికి ఆహార పథకం పనిలో ఏ పూట బియ్యం ఆ పూట తెచ్చుకొని కూలి చేసుకునేంతగా దిగజార్చారు. అలా తెలంగాణను ఏడిపించారు. ఆ వేధన నుంచి, ఆ నిర్వేదం నుంచి, ఆ ఆక్రోశం నుండి వచ్చిందే తెలంగాణ ఉద్యమం…. కేసిఆర్‌ రూపంలో ప్రపంచ ఉద్యమాల చరిత్రకే ఒక గొప్ప పాఠం. అలాంటి నేత చేతిలో తెలంగాణ బంగారమైంది. ప్రాజెక్టులు సాధ్యమే కాదన్న చోట కాళేశ్వరం నిర్మాణం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా కాళేశ్వరం పూర్తి చేసి, ఎండిన తెలంగాణ ను సస్యశ్యామలం చేశారు. నా తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణ చేశారు. అటు కాళేశ్వరం, ఇటు పాలమూరు.. రంగారెడ్డి, మల్లన్న సాగర్‌ వంటి అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. అంతకు ముందే తెలంగాణ ను జలపాతం చేశారు. కాలువలు తీసి చెరువుల నింపారు. చెరువుల్లో పూడిక తీసి, జలాలు నింపి పూర్వ వైభవాన్ని తెచ్చారు. అసలు ఆనవాలు లేని చెరువులకు కూడా కొత్త కళ తెచ్చారు. జలజీవం పోశారు. తెలంగాణను జీవధార చేశారు. అందుకే తెలంగాణ జలమే బిఆర్‌ఎస్‌ బలం!

రైతు మద్దతే కారుకు వరం! అని వేనోళ్ల కొనియాడబడుతోంది. 

తడారిన తెలంగాణ గొంతు తడిపిందే కేసిఆర్‌. నెర్రెలు బారిన నేలకు ఊరిపిలూదిందే బిఆర్‌ఎస్‌. తన కంట ఒలికిన కన్నీరు ఏ రైతు కంట ఒలకకుండా చేసిందే కేసిఆర్‌. బంజరు భూముల్లో బంగారు పంటలకు కారణం కేసిఆర్‌. తెలంగాణ భూ గర్భం సముద్రం చేసింది కేసిఆర్‌.బిఆర్‌ఎస్‌ కు రైతులే అండ.పేదలకు కేసిఆర్‌ నాయకత్వమే అండా దండ. సంక్షేమానికి నిదర్శనమే కేసిఆర్‌ పాలన.తెలంగాణలో చీకట్లను తరిమి వెలుగులు పంచిందే కేసిఆర్‌. బంగారు పంటల మాగాణ తెలంగాణ చేసిందే కేసిఆర్‌.

అలాంటి తెలంగాణ లో ప్రతిపక్షాలా? సమస్యే లేదు. 

 ప్రజల ఆలోచనల్లో ప్రతిపక్షాలు లేవు. ప్రత్యామ్నాయ శక్తులు అనే పదానికి తెలంగాణలో చోటు లేదు. ఎందుకంటే తెలంగాణలో అమలౌతున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదు. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలౌతున్నాయి. ప్రతీ కుటుంబానికి అందుతున్నాయి. పైగా గొప్ప పథకాలు కూడా తెలంగాణ లోనే అమలులో వున్నాయి. కళ్యాణ లక్ష్మి లాంటి పథకం వెనక గొప్ప సామాజిక సృహ దాగి వున్నది. ఒకప్పుడు తెలంగాణ లో అక్కడక్కడ బాల్య వివాహాలు జరిగేవి. ఎప్పడైతే కళ్యాణ లక్ష్మీ అమలులోకి వచ్చిందో అప్పటి నుంచి తెలంగాణ లో బాల్య వివాహాలు లేకుండా పోయాయి. దళిత సమాజం మీద ఎన్నికల సమయంలో ఎన్నో పార్టీలు మొసలి కన్నీరు కార్చినవే. కానీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ మదిలో నుంచి ఆవిషృతమైన దళితబంధు ఆ కుటుంబాలలో వెలుగులు నింపుతోంది. ఆర్థిక స్వావలంబన లో దళితులను భాగస్వామ్యం చేస్తే సమాజంలో అసమానతలు తగ్గిపోతాయి. ఇప్పుడు తెలంగాణ లో అదే జరుగుతోంది. తెలంగాణ సమ్మిళిత వృద్దిలో సకలజనులున్నారు.ప్రతిపక్షాలలో కూడా ప్రభుత్వ పథకాలు అందుకున్న వారు వున్నారు.వాళ్ల మనసులో కూడా వుంది కారే!

 వారి మనసు కోరుకుంటోంది కేసిఆర్‌ నే! ఇది సత్యం.. నిత్యం.. తెలంగాణ ప్రగతికి సోపానం.

డబ్బులు ఊరికే రావు!

https://epaper.netidhatri.com/

`గిట్టుబాటు కావాల్సిందే!

పెట్టుబడి రాబట్టాల్సిందే!!

`గాంధీ భవన్‌ కు వేసిన సున్నాలతో సహా ఖర్చు వసూలు చేసుకోవాల్సిందే?

`పిసిసి పదవే రేవంత్‌ రూ. 50 కోట్లకు కొనుక్కున్నాడని అప్పట్లో వెంకట రెడ్డి అన్నదే…

`ఆ ఖర్చు ఇలా జమచేసుకోవాల్సిందే!

`ఆయారాం…గయారాం!?

`కాంగ్రెస్‌ లో అంతా గందరగోళం!

 

`వచ్చే వాళ్లు ఎందుకు వస్తున్నారో క్లారిటీ లేదు?

` గెలుస్తామన్న నమ్మకం ఎంతుందో తెలియదు?

` కాంగ్రెస్‌ గాలి వుందో లేదో అర్థం కావడం లేదు?

` బిజేపి పని అయిపోయిందని, కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు?

`వచ్చే వాళ్లంతా గాలి వాటం నాయకులే?

`ఒకవేళ వచ్చిన వాళ్లు గెలిచినా, పార్టీ అధికారంలోకి రాకుంటే హాండ్‌ ఇవ్వరన్న గ్యారంటీ లేదు?

`మంచి మంచి నాయకులే కాంగ్రెస్‌ ను వీడారు?

`గర్‌ వాపసీ అని వచ్చే వాళ్లు మళ్ళీ గడప దాటరా?

`టిక్కెట్ల లొల్లి ఆగలేదు?

`టికెట్ల అమ్మకం గోల ఆగడం లేదు?

`కర్ణాటకలో బలమైన నేతలున్నారు…అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత తోడైంది.

`తెలంగాణ లో ప్రభుత్వ వ్యతిరేకత లేదు.

`కాంగ్రెస్‌ మీద ప్రజలకు సానుభూతి లేదు.

`తెలంగాణలో సీనియర్లున్నారు…బలమైన నాయకులు లేరు?

`వాళ్ల గెలుపుపై వాళ్లకే ఆశలు అంతంత మాత్రం.

`వాళ్లు నలుగురిని గెలిపించడం కష్టం.

`కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం గాలిలో దీపం!

హైదరబాద్‌,నేటిధాత్రి:

రాజకీయంలో కాంగ్రెస్‌ను ఎవరూ ఓడిరచాల్సిన పనిలేదని ఊరికే అనరు. తనను తాను బతికించుకోవాల్సిన తరుణమైనా సరే, మునిగిపోతున్నా సరే ఓడిరచుకునే విషయంలో వున్నంత పట్టుదల గెలుపులో చూపించుకోరు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ఆవిర్భావం వరకు రాజకీయంగా ఎదురులేని సమయంలో గెలుస్తూ వచ్చింది. కాని ఎప్పుడైతే దేశ రాజకీయాల్లో కొత్త రాజకీయ శక్తుల ఆవిర్భావంతో కాంగ్రెస్‌ చతికిల పడడం, లేవడం పరిపాటిగా మారినా, ఇకపై బతికి బట్టకుడుతుందా? లేదా? అన్నది అందరికీ అనుమానమే. అందుకే కాంగ్రెస్‌లో ఎవరు ఎప్పుడు నాయకులౌతారో? అన్నది తెలియకుండాపోయింది. ఎవరు కాంగ్రెస్‌ను కాపాడతారో? అన్న ఎదురుచూపులు మిగులుతున్నాయి. ఇదే అదునుగా కాంగ్రెస్‌ రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకున్న రేవంత్‌ రెడ్డి ఆడిరది ఆట పాడిరది పాటౌతుంది. రేవంత్‌కు రాజకీయం ఆట విడుపుగా మారితే, సీనియర్లకు రాజకీయ సంకటం మొదలైంది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లు ఆ మాత్రం మిగిలి వున్న కాంగ్రెస్‌ను రేవంత్‌ పూర్తిగా మింగేయడం ఖాయమని అందరూ చెబుతున్నమాటే. రేవంత్‌ చేరిన నాటి నుంచి అదే మాట చెబుతున్నారు. అదే బాటలో కాంగ్రెస్‌ సాగుతోంది. పాత కాపులు నిలబెట్టింది లేదు. కొత్త కాపు ఉద్దరిచ్చింది లేదు? అన్న సామెతలాగా కాంగ్రెస్‌ పరిసి ్ధతి మారిపోయింది. రేవంత్‌ను ముందు పెట్టి అధిష్టానం ఆట ఆడుతోంది. రేవంత్‌ను విమర్శిస్తూ సీనియర్లు గోల చేస్తున్నారు. ఇక్కడ దేనికీ సింక్‌ కావడం లేదు. అధిష్టానం రేవంత్‌ను ఎందుకు ఎందుకు అంత గడ్డిగా నమ్ముతుందన్నదానిపై ఎవరికీ సష్టత లేదు. సీనియర్ల మాట ఎందుకు కాదంటున్నారన్నదానిపై ఎక్కడా వివరణ లేదు. కాని పాము, ముంగీస ఆటలు సాగుతున్నాయి. ఎవరి బలం ఎంత అన్నది మాత్రం తెలియకుండాపోయినా రేవంత్‌ పెత్తనం మాత్రమే పైకి కనిపిస్తోంది. గత ఆరు నెలల కాలంగా రేవంత్‌రెడ్డి అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ షురూ చేసిండన్న సంగతి అందరికీ తెలుసు. ఒక్కొ నియోజకవర్గంలో ఒకరిద్దరికి పైగా అశావహులను లైన్లో పెట్టిండని తెలుసు. ఆనాడు మాత్రం ఏ సీనియర్‌ మాట్లాడలేదు. ఇప్పుడు టిక్కెట్లు అమ్ముకుంటుండు అన్న ప్రచారం సాగిస్తున్నారు. అంతే తమకంటే పరోక్షంగా రేవంత్‌ అతి బలవంతుడని ఒప్పుకున్నట్లౌతుందన్నది తెలుసుకోలేకపోతున్నారు.
రేవంత్‌ రెడ్డి ఎలా పిసిసి. అధ్యక్షుడు అయ్యారన్నదానిపై ఎవరి లెక్కలు వారికి వున్నాయి.
ఎందుకంటే స్వతాహాగా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌వాది కాదు. పచ్చి కాంగ్రెస్‌ వ్యతిరేకి. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దగ్గర నుంచి రాష్ట్ర స్ధాయి నేతలను ఎవరినీ వదిలిపెట్టకుండా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నాయకుడు. అలాంటి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడమే ఆశ్చర్యకరమైన విషయం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరు అనేది నానుడే అయినా, తిట్టిన కాంగ్రెస్‌లో నాయకుడు కావడం వేరు. కాంగ్రెస్‌కే నాయకుడు కావడం వేరు. కాని రేవంత్‌రెడ్డి ఏకంగా పెద్ద కుర్చీ వేసుకొని కూర్చుకున్నాడు. రేవంత్‌ తిట్టిన తిట్లు విన్న నేతలు ఇప్పుడు ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. ఇదే రాజకీయం అంటే ఇంత వరకు బాగానే వుంది. ఇప్పుడు రేవంత్‌ టిక్కెట్టకు పెద్దఎత్తున డబ్బులు తీసుకుంటున్నాడని అంటున్న కాంగ్రెస్‌ నేతులు గతంలో రేవంత్‌ రెడ్డి కోట్లు పెట్టి పిసిసి. పదవి కొనుక్కున్నాడంటూ ఆరోపణలు చేశారు. అంటే కాంగ్రెస్‌లో పదవులు కావాలంటే అడిగినంత సమర్పించుకోవాల్సిందే అన్నది సీనియర్లే నేర్పినట్లైంది. కోమటి రెడ్డి వెంకటరెడ్డి గతంలో రేవంత్‌ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి పిసిసి. అధ్యక్షుడు అయ్యాడు అన్న మాటలు చెప్పిందే…తెలంగాణ ప్రజలు విన్నదే…ఇప్పుడు రేవంత్‌రెడ్డి టిక్కెట్టు అమ్ముకుంటున్నాడన్న మాట మాట్లాడే అర్హత వారికి వుందా? డబ్బులు ఊరికే ఎవరికీ రావు..ఆనాడు పెట్టిన డబ్బు రేవంత్‌ తిరిగి ఎలా సంపాదించుకోవాలన్నదానిపై లెక్కలుండవా? మిగతా నాయకుల డబ్బులు మాత్రమే , డబ్బులా? రేవంత్‌ పెట్టిన ఖర్చుకు లెక్కుండొద్దా? పదేళ్లు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వున్నా గాంధీ భవన్‌ బాగు చేసుకోలేకపోయారు? కొత్త గాంధీభవన్‌ కట్టుకోలేకపోయారు? కొన్నేళ్ల తర్వాత గాంధీభవన్‌ కు కొత్త కళ తెచ్చింది రేవంత్‌రెడ్డి కాదా? ఆయన పిసిసి. అధ్యక్షుడు అయ్యాకే కొత్త కొత్త రంగులు వేయలేదా? లోపల అంతా ముస్తాబు చేయలేదా? అందుకు రేవంత్‌కు ఖర్చు కాలేదా? అదంతా తిరిగి రాబట్టుకోవద్దా? గాంధీ భవన్‌కు వేసిన సున్నాల సొమ్ముతో సహా పెట్టిందంతా రాబట్టుకోవాల్సిందే….ఆ ఖర్చు జమా ఖర్చులో వేసుకోవాల్సిందే…కాదనే అధికారం..అర్హత ఎవరికీ లేదు. కాంగ్రెస్‌ చేసుకునే స్వయంకృతాపరధాంలో ఎప్పుడూ సెల్ప్‌ గోల్‌ చేసుకోవడం అలవాటే…
నిజంగా కాంగ్రెస్‌కు చిత్త శుద్ది వుంటే రేవంత్‌ను మించిన నాయకుడే కాంగ్రెస్‌లో దొరకలేదా?
అంటే ఔననే సమాధానం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ వస్తే నేనే సిఎం. అన్న నాయకులు అనేక మంది. ఇప్పటికీ ఒక వేళ పార్టీ అధికారంలోకి వస్తే నేనే సిఎం అంటూ ఇంకా కలలు కంటున్నవాళ్లు ఏం తక్కువ లేరు. కాని పార్టీని కాపాడుదాం..నిలబెడదాం…ముందుండి నడుద్దాం…పార్టీని రక్షించుకుందా…కష్టపడి అధికారంలోకి తీసుకొద్దామన్న ఆలోచన వున్న నాయకులు ఎంత మంది వున్నారు. తెలంగాణ రాగానే నాకు పిసిసి కావాలంటూ కోరి మరీ అధ్యక్షుడు అయిన పొన్నాల లక్ష్మయ్య ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీని నడపడం నావల్ల కాదని వదిలేశాడు. నేను వుండలేనంటూ పార్టీకి మొరపెట్టుకున్నాడు. ఆ తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిపిసి. అధ్యక్షుడయ్యాడు. కాని ఏం లాభం? అతి బలవంతంగా పిపిసి. అధ్యక్షుడిగా కొనసాగాడు. ఆఖరుకు ఇక నా వల్లకాదంటూ ఆయనకూడా కుర్చీ దిగిపోయాడు. ఆ తర్వాత పిసిసి. నాకే కావాలని కొట్లాడిన వారు లేరు. ఇస్తే తప్ప తీసుకోము అన్నట్లు మాట్లాడినవారే ఎక్కువ. సీనియర్లు బలంగా వుంటే రేవంత్‌ ఎందుకు పోటీకి వచ్చేవారు…పిసిసి. సీటు ఎలా సాధించేవారు? అయినా కాంగ్రెస్‌నాయకుల్లో ఐక్యత లేదు. రాదు…వస్తుందన్ననమ్మకం ఇప్పటికీ లేదు. సీనియర్లలలోనే తలోదారి నడిచేవారే ఎక్కువ. అందుకే రేవంత్‌రెడ్డిది ఆడిరది ఆట పాడిరది పాటగా మారింది. నిజానికి పొన్నాల లక్ష్మయ్య పిసిసి. అధ్యక్షుడుగా వున్న సమయంలో కాంగ్రెస్‌ అంతో ఇంతో బలంగా వున్నది. కాని పైకి ఎంతో వీక్‌గా కనిపించింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిసిసి. అధ్యక్షుడు వున్న సమయంలో కూడా కాంగ్రెస్‌ ఊపు మీదేవుంది. కాని లోన ఏదో వెలితిగా వుండేది. రేవంత్‌ రెడ్డి రాకతో ఎంతో జోష్‌ నిండిరది. లోన మాత్రం అంతా ఖాళీగానే వుంది. రేవంత్‌ పిసిసి. కాకముందు ఉప ఎన్నికల్లో కనీసం ఎంతో కొంత ప్రభావం చూపుతూ వచ్చింది కాంగ్రెస్‌. కాని రేవంత్‌ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఉప ఎన్నికలో కూడా కనీసం డిపాజిట్‌కూడా రాకుండాపోయాయి. ఇదీ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌కు పైకి పెంచినట్లు కనిపించినా, గ్రౌండ్‌కు దిగిజార్చిన గ్రాఫ్‌.
ఇదిలా వుంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌లో జోష్‌ నింపినట్లు చేసిన రేవంత్‌స్కెచ్‌ మాత్రం ఆయనకు కాసుల పంట పండిస్తోందని అంటున్నారు.
ఎందుకంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కర్నాటకలో బిజేపి మీద వ్యతిరేకతతో కాంగ్రెస్‌ గెలిస్తే, తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు ఊపు రావడం అంటేనే మమ్ములను చూసి ముంత ఒలకబోసుకోవడం…దాన్ని చూసి ఇతర పార్టీలనేతలు కాంగ్రెస్‌కు క్యూకట్టడం..అది రేవంత్‌రెడ్డికి అనుకూలంగా మారడం…ఒక రకంగా సీనియర్లు చెబుతున్నట్లు ఆదాయవనరుగా మారడం…! ఇంత వరకే రాజకీయం… ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడదు..కాంగ్రెస్‌ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది లేదు. రేవంత్‌ జేబులు నిండడం తప్ప మరోకటి లేదు…ఈ మాటలంటున్నది ఎవరో కాదు… సాక్ష్యాత్తు కాంగ్రెస్‌ నేతలు..కరిమింగిన వెలగపండు గదరా…రేవంత్‌ తీరు..అంటున్నారు సీనియర్లు…

దేవుడి పేరుతో భజన కబ్జా

సామాన్యులతో ఖమ్మం ఎండోమెంట్‌ ఎట‘కారం’

కమీషన్‌లకు కక్కుర్తి పడుతున్న అసిస్టెంట్‌ కమిషనర్‌

ఆలోచన లేని సులోచన…

ప్రైవేట్‌ భూములపై పెత్తనం

సమాచార హక్కు చట్టానికి సమాధి.. 

రౌడీ మూకతో దాడులు చేయిస్తున్న కేడీగాళ్లెవరు ?

కళ్యాణ్‌ రావు కళ్లెంతో కళ్లు మూసుకున్న కంత్రీగాళ్లు

ఖమ్మం నగరంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అవినీతి లీలలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. చట్టానికి తూట్లు పొడిచి తన పబ్బం గడుపుకోవడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. కమీషన్‌లకు కక్కుర్తి పడ్డారో లేక రౌడీ మూకల బెదిరింపులకు భయపడ్డారో, అసిస్టెంట్‌ కమిషనర్‌ సులోచన వైఖరి అనుమానాస్పదంగా మారింది. ఖమ్మం నగరానికి నడిబొడ్డున ఉన్న ఓ భూ వివాదం విషయంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఎండోమెంట్‌ సులోచన వైఖరి వివాదాస్పదంగా మారింది. ఇది రౌడీ మూకలకు అంది వచ్చిన వరంలా మారింది. ఇది ఇలా ఉండగా దేవుడి పేరుతో భజన సంఘాల ముసుగులో జరుగుతున్న వెరైటీ భూకబ్జా కథనం ఇది.

 

*_అసలేం జరిగింది..?_*

ఖమ్మం నగర శివారులో శ్రీ శ్రీ సర్కిల్‌ వద్ద గల సర్వే నంబర్‌ 504లో మూడు ఎకరాల భూమి కన్సాలాల్‌ సింగ్‌ వారసులకు, ఎండోమెంట్‌కు మధ్య వివాదం నడుస్తుంది. ఈ భూమికి తూర్పున గల ప్రైవేట్‌ భూమి కలదు. అయితే ఎండోమెంట్‌ నీడన దాగిన ఓ రౌడీ ముఠా ఈ భూమని కాజేయాలను కుతంత్రాలు పన్నారు. వీళ్లకు నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఓ రింగు మాస్టర్‌ తోడయ్యాడు. వాస్తవానికి ఎండోమెంట్‌ తమ ఆధీనంలో ఉంది అని చెబుతున్న భూమికి, ఈ చెక్క భజన సంఘాలకు ఉన్న లింకు ఏంటో ఖమ్మం నగర ప్రజలకు అర్ధం కాని చిక్కు ప్రశ్న. ఈ వివాదంలో అదే సర్వే నంబర్‌లో ఉన్న ప్రైవేట్‌ వ్యక్తులు ఇబ్బంది పడుతున్నా చీమ కుట్టినట్టు కూడా లేదు సదరు ఎండోమెంట్‌ అధికారులకు. ఎందుకంటే దీన్ని రౌడీ మూకలకు అప్పజెప్పి తమ షేర్‌ తాము దక్కించుకునే ఎత్తుగడలో ఉంది అసిస్టెంట్‌ కమిషనర్‌. జరిగిన తంతు చూస్తే ఈ విషయం వాస్తవం అని రుజువు అవుతుంది.

 

*_సమాచార హక్కు చట్టాన్ని సమాధి చేసిన అసిస్టెంట్‌ కమిషనర్‌_*

పై వివాదంలో ఉన్న భూమి ఎండోమెంట్‌కు ఎలా సంక్రమించిందో సమాచారం ఇవ్వమని జర్నలిస్టులు, ప్రజాసంఘాల వారు ఎన్ని దరఖాస్తులు పెట్టినా బుట్టదాఖలు చేయడం ఎండోమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ సులోచనకు అలవాటుగా, ఆనవాయితీగా మారింది. సాక్ష్యాత్తూ పట్టాదారు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసి రెండు నెలలు దాటి, రెండు చెప్పుల జోళ్లు అరిగేలా తిరిగినా సమాచారం నేటికీ ఇవ్వలేదు. ఒక్క పట్టాదారుకే కాదు, ఈ కార్యాలయంలో సమాచారం పొందటం అంటే ఎండమావుల్లో ఎండ్రకాయలు పట్టడమే. 

 

*_డార్మెంటరీ డార్కు రూంలో ఆక్షన్‌… రౌడీలు చెప్పినట్టు యాక్షన్‌_*

ఎండొమెంట్‌ తమదిగా చెప్పుకుంటున్న భూమికి ఈ మధ్య వేలంపాట నిర్వహించినట్టు, ఫలానా చౌక భేరానికి దాన్ని కేటాయించినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ విషయమై ఎండొమెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ను విలేకరులు సంప్రదించగా, వేలం వేసిన మాట వాస్తవమే అన్నారు. అయితే వేలం పాటకు సంబంధించి పబ్లిక్‌ నోటీస్‌ ఎక్కడ ప్రచురించారు, ఎక్కడ అంటించారు అన్న ప్రశ్నకు సమాధానం లేదు. అప్పటికే ఆ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టిన చెక్క భజన బృందానికి చెందిన ఓ వ్యక్తికి వేలంలో ఈ భూమి కేటాయించినట్టు పత్రికా ప్రకటన ఇవ్వడం వెనుక భారీగానే ముడుపులు చేతులు మారినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వేలానికి సంబంధించిన సమాచారం ఇవ్వమని సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన దరఖాస్తును యధావిధిగా బుట్టదాఖలు చేయడంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆరితేరారు.

 

*_రౌడీ మూకల హల్చల్:_*

ఎండోమెంట్‌ వివాదంలో ఉన్నదని ప్రచారంలో ఉన్న భూమి పక్కన భూమిని తేల్చి ఇచ్చేందుకు పట్టాదారు సర్వే కొరకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ భూమి పక్కన ఉన్న ప్రైవేట్‌ వ్యక్తులకు ఏడీ సర్వేయర్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు అందుకున్న వెంకటరమణ కుటుంబ సభ్యులు తమ భూమి వద్దకు చేరుకున్నారు. ఎండోమెంట్‌ బోర్డు నీడన జోగుతున్న ప్రైవేట్‌ ముఠా రంగంలోకి దిగి పక్కన ఉన్న భూమి యజమాని ఆనంచిన్ని వెంకట రమణ భర్త సీనియర్‌ జర్నలిస్టు వెంకట రమణపై విచక్షణా రహితంగా దాడి చేసింది. ఫోన్‌ లాక్కొని కిడ్నాప్‌ చేసి, బలవంతంగా సంతకాలు పెట్టించుకునేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న వ్యక్తులు 100 కి డయల్‌ చేయగా పోలీసులు వచ్చి వెంకటరమణ కుటుంబ సభ్యులను కాపాడారు.

 

 

*_అసిస్టెంట్‌ కమిషనర్‌ అబద్దాల ప్రకటనలు…._*

నెత్తుటి ఏరులు పారేలా నటనలు

అడ్డంగా దొరికి పోయిన అసిస్టెంట్‌ కమిషనర్‌

గతంలో ఇదే స్థల వివాదం పత్రికల్లో రావడంతో తనను కలిసిన పాత్రికేయులతో ఈ అసిస్టెంట్‌ కమిషనర్‌ తాము ఎండోమెంట్‌ బోర్డు సర్వేయర్‌కు ల్యాండ్‌ సర్వే కోసం దరఖాస్తు పెట్టామని, సిబ్బంది కొరత వల్ల సర్వేకు సమయం పడుతుందని, త్వరలోనే రెక్వెస్ట్‌ చేసి సర్వే చేయించి అద్దులు నిర్ణయించి వేలం పాట పాడిన వ్యక్తికి స్థలం కేటాయిస్తామని మీడియాతో స్పష్టంగా వివరించింది. భజన సంఘాలకు, బద్మాష్‌ సంఘాలకు ఆ భూమితో సంబంధం లేదని తేల్చి చెప్పింది. కాగా పట్టాదారు సర్వేకోసం దరఖాస్తు చేయగా సర్వే జరిపే రోజు యుద్ద ప్రాతిపదికన ఆ సర్వేని తాము వ్యతిరేకిస్తున్నామని, సర్వేని నిలిపివేయమని అధికారికంగా ఆర్‌సీ నం. డీ/2587/2023. ద్వారా డిప్యుటీ ఇన్‌స్టెక్టర్‌ కి లేఖ పంపారు. ఈ లేఖలోనే భజన సంఘాల చేతుల్లో బొమ్మగా మారిందన్న విషయం తేట తెల్లం అవుతోంది. 

 

 

*_అసిస్టెంట్‌ కమిషనర్‌కు అవగాహన లేదా ? లేదా కళ్యాణం కళ్లెంతో కళ్లు మూసుకుందా ?_*

 

డిప్యుటీ ఇన్‌స్పెక్టర్‌ ఆప్‌ సర్వే కి అసిస్టెంట్‌ కమిషనర్‌ ఇచ్చిన లేఖలో ఎండోమెంట్‌ కు సంబందం లేని కేసులను ఉదహరించడంతో ప్రైవేట్‌ వ్యక్తులతో కుమ్మక్కైన విషయం తేటతెల్ల అయింది. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఇచ్చిన లేఖలో ఓ.ఎస్‌ నం. 1688/2023 కేసు వెంకటరమణ వర్సెస్‌ మందడపు సాయి మనోహర్‌ మధ్య భూ వివాదం. ఇందులో తమని పార్టీలుగా చేర్చమని భూమికి సంబంధం లేని భజన సంఘం వేసిన పిటీషన్‌ పై కోర్టు నిర్ణయం పెండిరగ్‌లో ఉంది. తన లేఖలో పేర్కొన్న మరో కేసు ఓ.ఎస్‌ నం. 595/2023. బండి ధర్మాసింగ్‌కు భజన సంఘానికి చెందిన వ్యక్తిగా చెప్పుకుంటున్న వాకదాని రామనారాయణకు మధ్య వివాదం. ఈ వివాదానికి ఎండోమెంట్‌ బోర్డుకు ఏం సంబంధం అనేది అసిస్టెంట్‌ కమిషనర్‌ సులోచన ఆలోచించి అవగాహనతో చెప్పాలి. అసలు ఈ లేఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ రాసారా లేక చెక్క భజన సంఘానికి భజన చేస్తూ కళ్లెం వేసిన వాళ్లు రాసిచ్చిన లెటర్‌ పై ఆర్‌.సీ నంబర్‌ వేసి సంతకం పెట్టారా అనే అనుమానం రాక మానదు. ఎందుకంటే ఈ ఓ.ఎస్‌ నంబర్లకు సంబంధించిన సమాచారం ఎండోమెంట్‌కు చేరే అవకాశమే లేదు. వారు పార్టీ కాని కేసుల వివరాలు, వారికి నోటీలు వెళ్లని వివరాలు వారికి తెలిసే అవకాశమే లేదు. అంటే దీన్ని బట్టి భజన సంఘం వేస్తున్న తాళానికి అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆడుతుందనేది బహిరంగ రహస్యం.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న అసిస్టెంట్‌ కమిషనర్‌

ఎండోమెంట్‌ గూటిలో కూర్చొని సామాన్య ప్రజల భూ సమస్యల పై నిమ్మకు నీళ్లు చల్లినట్టు వ్యవహరిస్తున్న అసిస్టెంట్‌ కమిషనర్‌ సులోచన ఈ భూమి విషయంలో అతిగా స్పందించడం వెనుక అంతరార్ధం ఏమిటనేది అక్షర జ్ఞానం లేని వాళ్లు కూడా అర్ధం చేసుకోగలరు. అటు ట్రిబ్యునల్‌ కేసుల్లో, సివిల్‌ కేసుల్లో నలుగుతుందనే విషయాన్ని తానే చట్ట బద్దంగా ఒప్పుకున్న కమిషనర్‌, తమకు అనుకూలంగా తీర్పు రాక ముందే ఎలా వేలం పాట నిర్వహిచారనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కనీసం పట్టాదారులు ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందనే కనీస విచక్షణ లేకుండా వ్యవహరించడం వివాదాలకు ఆజ్యం పోసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం అవుతుంది.

 

*_చిక్కరు దొరకరు… ఫోన్‌ ఎత్తరు_*

ప్రజలకు అందుబాటులో ఉంది సమస్యలు పరిష్కరించాల్సిన అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫీసులో అందుబాటులో ఉన్న దాఖలాలు లేవు. నెలలో కనీసం రెండు సార్లు కూడా కార్యాలయంలో కుర్దుగా ఉన్న సందర్భాలు అరుదు. మేడం గారు ఎక్కడా అంటే టూర్‌లో ఉన్నారని టక్కున సమాధానం చెప్పడం సిబ్బందికి అలవాటుగా మారింది. ఏ టూర్‌ అంటే మాత్రం అలా చెప్పకూడదు సార్‌ అనడం కూడా ఆనవాయితీగా మారింది. ఇప్పటికైనా అసిస్టెంట్‌ కమిషనర్‌ తన వైఖరిని మార్చుకోకుంటే రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. బాధితులంతా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి తమ గోడు వెళ్లబుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

మేపుడు మా వళ్ల కాదు!

https://epaper.netidhatri.com/

`కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల వేడుకోలు.

`సీనియర్లు కూడా ఇదే మాట అంటున్నారు.

`ఇప్పుడే టికెట్లు ప్రకటించొద్దు.

`ఆశావహులుగానే ఖర్చు తట్టుకోలేకపోతున్నాం.

`ఇప్పటికే తడిసి మోపెడౌతుంది.

`టికెట్లు ప్రకటిస్తే హారతి కర్పూరమే.

`ఊపిరి కూడా సలపనంత తలనొప్పి వచ్చుడే!

`ఇది రేవంత్‌ కు అనుకూలంగా మారింది.

`ఆశావహులతో బేరంతో మరింత లాభమే!

`టికెట్‌ వస్తుందో రాదో అనుకునే వారు ప్రకటిస్తే బాగుండంటున్నారు.

`కచ్చితంగా వస్తుందనుకునే వారు ఇప్పుడే ప్రకటించొద్దంటున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

మేపుడు మా వల్ల కాదు…ఈ మాటలు అంటుంది ఎవరో కాదు? సాక్ష్యాత్తు రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్ధులు. మా జీవితం కార్యకర్తల కోసమే…మా రాజకీయం కార్యకర్తల కోసమే..మా పదవులు ప్రజల కోసమే..మా కార్యకర్తలంటే మాకు ప్రాణం. వాళ్లంతా మా కుటుంబ సభ్యులతో సమానం. వాళ్లు లేకుంటే మేము లేనే లేము. వాళ్ల త్యాగమే మా రాజకీయ జీవితం. మమ్ములను కంటికి రెప్పలా కాపాడుకునే కార్యకర్తలను మేం గుండెల్లో పెట్టుకుంటాం. వారిని ఆదుకుంటాం. వారికి చేయూత నిస్తాం. వారి కోసం ఏదైనా చేస్తాం..ఎంత దూరమైన వెళ్తాం..ఇలాంటి మాటలు వినీ వినీ నమ్మీ. నమ్మీ ఊడిగం చేసే కార్యకర్తలు ఒక్కసారి నాయకుల మనసులో మాటలు కూడా తెలుసుకోండి. మీ ముందు ఏం చెబుతున్నారో…మీరు లేనప్పుడు ఏం చెబుతున్నారో… ముఖస్తుతి కోసం మీమ్మల్ని ఎలా మాయ చేస్తున్నారో…మీరు పక్కకు జరిగిన తర్వాత ఎలా తిడుతున్నారో కూడ తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడే వుంది. పార్టీలు కావాలి. పార్టీలో పదువులు కావాలి. ప్రజాప్రతినిధులు కావాలి. కార్యకర్తలందరూ తనవైపే వుండాలి. గ్రూపులు వుండడానికి వీలు లేదు. అందరూ నాకే జై కొట్టాలి. నేను ఇంట్లో నుంచి బైట అడుగు పెట్టింది మొదలు, మళ్లీ ఇంటికి చేరుకునే దాకా జై కొట్టాలి. నోరు నొప్పి పెట్టినా సరే జిందాబాద్‌లు కొట్టాలి. ఆకలి గురించి ఆలోచించకూడదు. దాహమౌతుందని చెప్పకూడదు. కాని రోజంతా ఊడిగం చేయాలి. నాయకుడు ఇంటికి చేరుకునేదాకా ఆయన వెంట తిరగాలి. ఆ రాత్రి ఇంటికి వెళ్లి వున్నదో లేనిదో తినాలి. లేకుంటే పస్తులుండాలి. కంటిమీద సరిగ్గా కునుకురాకుండాచూసుకోవాలి. తెల్లారకముందే మళ్లీ నాయకుడి ఇంటి ముందు వాలిపోవాలి. ఇదేనా కార్యకర్త అంటే.. వారికి జీవితం లేదా? వాళ్లవి జీవితాలు కావా? వారికి కుటుంబాలుండవా? వాళ్లు అసలు మనుషులే కారా? వారికి ఆకలి దప్పులు వుండవా? వారి సమస్యలు నాయకులకు పట్టవా? అవును పట్టవు. ఎందుకంటే కార్యకర్త వున్నది కేవలం జిందాబాద్‌లు కొట్టడానికి మాత్రమే..నాయకుడు వస్తున్నాడంటే చాలు ఆయన కోసం రోజంతా ఊడిగం చేయడానికే…ఇదే నేటి రాజకీయాలలో కార్యకర్తల పరిస్ధితి..దుస్తితి.
మాకు ఎన్నికల్లో టికెట్‌ కావాలి.
ఎంతైనా ఖర్చు చేస్తాం..శక్తికి మించైనా ఖర్చు చేస్తాం..కాని ఇప్పుడే టిక్కెట్లు ప్రకటించొద్దు..ఇదీ కాంగ్రెస్‌,బిజేపి పార్టీలో నాయకులు అంటున్న మాట…మొన్నటిదాకా అసలు టికెట్లకోసం పోటీ వుంటుందో లేదో అనుకున్నారు. అది బిజేపిలో కనిపిస్తోంది. కాంగ్రెస్‌లో కొద్దో గొప్పొ పోటీ కనిపిస్తోంది. కాని టికెట్లు ఇప్పుడే ప్రకటించడం మాత్రం వద్దన్న సూచనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్నేళ్లుగా కార్యకర్తలను మేపుతున్నాం. ప్రజలకు ఏదో ఒక సాయం చేస్తూనే వున్నాం. ఊరూరు తిరుగుతున్నాం. గడపగడపకు చేరుకుంటున్నాం. పార్టీలు సభలు ఏర్పాటు చేస్తే ప్రజలను , కార్యకర్తలను తీసుకొస్తున్నాం. లక్షలకు లక్షలు ఖర్చు చేస్తూనే వున్నాం. అయితే ఇప్పటికిప్పుడు టికెట్లు ప్రకటిస్తే మాత్రం ఇక రోజూ జరగాల్సిన జాతరను భరించలేం. ముఖ్యంగా కార్యకర్తలను మేపడం మా వల్ల కాదు. ఇదీ కాంగ్రెస్‌కు చెందిన సీనియర్లు కూడా చెబుతున్న మాట. ఇంత కాలం పదవులు వెలగబెట్టిన వాళ్లు, మంత్రులుగాపనిచేసిన వాళ్లు, మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్లు కూడా ఇ దే మాట మాట్లాడడం అంటే విడ్డూరం. ఎమ్మెల్యే కావాలన్న ఆశ వున్నకొత్త నాయకులు ఎన్నికల దాక ఖర్చులను వాయిదా వేసుకోవాలన్న ఆలోచనతో చెబుతున్నారంటే ఒక అర్ధముంది. కాని సీనియర్‌ నాయకులు కూడా ఇదే మాట చెప్పడం అంటే కార్యకర్తలకు ఆయా పార్టీలలో ఎంత విలువుందో అర్ధం చేసుకోవచ్చు.
కార్యకర్తలంటే నాయకులకు మరీ అంత చులకన భావమా?
కార్యకర్తలు తమ జీవితాలు త్యాగం చేసేదే నాయకుల కోసం. వాళ్లు ఏం పని చేస్తారో తెలియదు. వున్నకాడికి వ్యవసాయం చేసుకొని మిగతా సమయమంతా నాయకుల కోసమే కేటాయిస్తారు. కుటుంబంలో ఏదైనా అత్యవసరమైన పనులున్నా సరే నాయకులు వస్తున్నారంటే వెళ్తారు. నాయకులు రమ్మంటే వెళ్తారు. అలాంటి కార్యకర్తలు లేకుండా ఎన్నికల ప్రచారం అన్నది జరిగే సమస్యే లేదు. కాని ఆ కార్యకర్తలచేత పని కావాలి. అసలు నాయకులు కార్యకర్తలకు చేసేదెంత? వచ్చిన వారికి రెండు పూటల భోజనం తప్ప మరేం వుండదు. అడపా దడపా దావత్‌ల పేరుతో కొంత ఖర్చు. ఒక వ్యక్తి ఒక రోజు ఏదైనా పని చేసుకున్నా ఎంతో కొంత సంపాదించుకుంటాడు. కాని ఒక కార్యకర్త నాయకుడి వెంట తిరిగి తన జేబులోనుంచే నాలుగు రూపాయలు ఖర్చు చేసుకుంటాడు. ఎక్కడైనా అనుకోకుండా ఖర్చు చేయాల్సి వస్తే కార్యకర్తే తన జేబులోనుంచి ఖర్చు చేస్తుంటాడు. నియోజకవర్గంలోని ఏదైనా గ్రామంలో ఎవరినైనా ఆదుకోవాల్సి వస్తే నాయకుడు ఫలాన వ్యక్తికి వెళ్లి సాయం చేయమని చెబుతాడు. చేతులు దులుపుకుంటారు.. ఇలాంటి నాయకులు కూడా వున్నారు. పేరు పెరుమళ్‌ది..ఆరగంపు అయ్యవారిది అన్నట్లు పేరు మాత్రం నాయకుడిది. జేబుకు చిల్లు మాత్రం కార్యకర్తది. ఇలాంటి పరిస్ధితులు ఎదుర్కొన్న కార్యకర్తలు కొన్ని వేల మంది వున్నారు. నాయకుడు ఏనాడైనా ఆదుకోకపోతాడా? ఏదైనా పదవి ఇప్పించకపోతాడా? రాజకీయంగా ఎదగకపోతామా? అన్న కోరిక కార్యకర్త జీవితాన్ని చిద్రం చేస్తుంది. పార్టీజెండా మోస్తూ, నాయకుడి పల్లకి మోస్తూ, ఏదైనా నామినేటెడ్‌ పదవి అయినా దక్కకపోతుందా? అనుకొని దశాబ్ధాల తరబడి ఊడిగం చేస్తే వారికి ఇచ్చే పదవి కేవలం రెండేళ్లు. అది కూడ ఎంత మందికి వస్తుంది? అది కూడా ఆ పార్టీ అధికారంలోకి వస్తేనే…అధికారంలోకి వచ్చిన పార్టీలు అలాగే వున్నాయి…రాని పార్టీలు అవే గతంలో అనుసరించాయి. కార్యకర్తలుగా మిగిలిపోతూ, కనీసం సానుభూతికి కూడా నోచుకొని ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.
కనీసం ఎన్నికల సమయంలోనైనా మాకేంటి? అని అడగండి?
రాజకీయం అన్నదానికి సేవ అన్న పర్యాయ పదం ఏనాడో కనుమరుగైంది. ఇప్పుడు రాజకీయం అంటేనే వ్యాపారం. అంతే కాదు వారసత్వ సంపదగా మారుతున్న వైనం. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలే మర్చిపోతున్నారు. బాండ్‌ పేపర్లు రాసిచ్చి మరీ తూచ్‌ అంటున్నారు. ఇలాంటి తరుణంలో ఎన్నికల సమయంలోనైనా కార్యకర్తలందరూ ఏకతాటి మీద వుండండి. విభజించి పాలించే నేతలు చెప్పే చెప్పుడు మాటలు నమ్మకండి. వారి వలలో చిక్కకండి. ఇప్పుడేం చేస్తావు? గెలిస్తే ఏంచేస్తావు? అన్నదానిని ముందే అడగండి. ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకంటే కార్యకర్తలను నాయకులు మనుషులుగా కూడా చూడడం లేదు. ముందు అది తెలుసుకోండి. పశువులను మేపంలేం అన్నంత సులువుగా, కార్యకర్తలను మేపలేమని నాయకులు మాట్లాడుతున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే మా దాన సంగతి ఏమిటన్నదానిపై నిలదీయండి? అప్పుడుగాని కార్యకర్తలంటే నాయకులకు భయం రాదు…లేకుంటే మీ ఊడిగం జీవితాంతం ఆగదు…

రేషన్ బియ్యం @ నూకల దందాపై నేటిధాత్రి చెప్పిందే నిజమైంది..

# నూకల పేరుతో రేషన్ బియ్యం వినూత్న దందా..
# రేషన్ షాపు నుండి నేరుగా లబ్దిదారుల నుండి రేషన్ బియ్యం కొనుగోళ్లు
# నూకల పేరుతో రేషన్ బియ్యం దందా కథనం గతంలో ప్రచురణ..

నర్సంపేట, నేటిధాత్రి :

నర్సంపేట డివిజన్ లో రేషన్ బియ్యం అక్రమ దందా నయా రూపంలో అవతారమెత్తింది. అక్రమ సంపాదనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు గ్రామాలలో ఏజెంట్లు ఏర్పాటు
చేసుకొని రేషన్ బియ్యం కొనుగోలు చేస్తూ ఆ బియ్యం రూపురేఖలనే మార్చేస్తున్నారు. అక్రమంగా కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సులువుగా
ఉండేందుకు నూకలుగా మార్చుతూ నయా దందాకు తెరలేపుతున్నారు. ఈ అక్రమ నయా దందా పట్ల నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా కొందరు రైస్ మిల్ వ్యాపారులు రేషన్ బియ్యాన్ని గ్రామాల్లో ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేస్తూ ఈ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు.కాగా నేటిధాత్రి దినపత్రిక ఈ అక్రమ దందా పట్ల ముందే తెలుపగా నేడు అదే నిజం అయ్యింది.నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామానికి చెందిన గోలి నర్సింగం,గోలి రవి లకు చెందిన రైస్ మిల్ లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని నూకలుగా మారుస్తున్నారు.గ్రామస్థుల సమాచారం మేరకు నేటిధాత్రి ప్రతినిధి పరిశీలించగా నిజాలు బయటపడ్డాయి.ఈక్రమంలో మేము రేషన్ బియ్యం దందా ఇలాగే చేస్తాం.. పోలీసులు,టాక్స్ ఫోర్స్ అధికారులు,విలేకరులు వస్తారు వారికి మామూళ్లు ఇస్తాం వెళ్ళిపోతారు
.మీకు ఏమి కావాలి చెప్పండి అంటూ రైస్ మిల్లు
యజమాని కొందరు అనుకూల ప్రజలతో నేటిధాత్రి ప్రతినిధిపై బెదిరింపులకు పాల్పడ్డాడు.రేషన్ బియ్యం దందా డైరెక్టుగా చేయలేక నూకల పేరుతో అక్రమంగా కొనుగోళ్లు చేస్తూ నయా దందాకు తెరలేపుతున్నారని డివిజన్ వ్యాప్తంగా చర్చలు జోరుగా విన్పిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ లో నూకల బియ్యం రేటు రూ.20 నుండి 25 రూపాయలకు పలకడంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఒక మాఫియాల అక్రమ వ్యాపారానికి
తెరలేపుతున్నారు.నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామంలో ఉన్న రైస్ మిల్లులో రేషన్ బియ్యాన్ని నూకలుగా మారుస్తూ దందా జరుపుతుండడం పట్ల కొందరు
అధికారుల వద్ద సమాచారం ఉన్నప్పటికీ తెలిసి తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు నిజమే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

# రేషన్ షాపు నుండి నేరుగా లబ్దిదారుల నుండి రేషన్ బియ్యం కొనుగోళ్లు….

ప్రభుత్వం పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని లబ్ధిదారుల చేతుల్లోకి రాగానే సదరు రైస్ మిల్లు యజమాని లబ్ధిదారుల వద్ద నుండి కొనుగోళ్లు చేస్తూ ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ బియ్యాన్ని నూకలుగా మారుస్తూ దందా సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు, సంబంధిత సివిల్ సప్లై అధికారులు స్పందించి దాడులు నిర్వహించి అక్రమ దందాపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది విచిచూడాల్సిందే..

నేటి ధాత్రి కథనానికి స్పందించిన సామాన్య పౌరుడు.

#అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో గుంతలమైన రోడ్డును మరమ్మతు చేయించిన వ్యాపారి.

#నేటి ధాత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసిన వాహన చోదకులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి: గత కొద్ది రోజుల క్రితం నల్లబెల్లి మండల కేంద్రం నుండి నందిగామ గ్రామంకు వెళ్లే రహదారి ధ్వంసమై పలువురు ప్రమాదాలకు గురవుతున్నారని నేటి ధాత్రిలోప్రచురించగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవరు స్పందించక పోవడంతో లెంకలపల్లి గ్రామానికి చెందిన ఇటుకలవ్యాపారి పుల్లూరి శివప్రసాద్ తన సొంత ఖర్చులతో గుంతల మయమైన రోడ్డును డస్టుతో పూడ్చడంతో వచ్చిపోయే వాహనదారులు, పాదాచారులు సమీప గ్రామ ప్రజలు శివ ప్రసాద్ ను అభినందించారు అలాగే రోడ్డు దీనస్థితిని వార్త కథనం రూపంలో వెలుగులోకి తీసుకువచ్చిన నేటి ధాత్రి యాజమాన్యానికి సమీప గ్రామ ప్రజలతోపాటు వాహన చోదకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version