కాంగ్రెస్‌కు కర్రువాతే!

https://epaper.netidhatri.com/

`రేవంత్‌ రూపంలో పాతాలానికి కాంగ్రెస్‌ పతనమే.

`రైతుల మధ్య రేవంత్‌ చిచ్చు!

`మతాల మంటలో చలికాచుకునే కుట్ర?

`హిందూ, ముస్లిం తగవుల కోసం ప్రయత్నం?

`రేవంత్‌ చెప్పేవి పచ్చి అబద్దాలు… మోసపూరిత హామీలు.

`కౌలు రైతుకు సాయం సాధ్యం కాదని తెలుసు.

`ఓట్ల కోసం రైతుల మధ్య పేచీ చీకటికోణం.

`ధరణి తొలగించి ఆంధ్రా పెట్టుబడి దారులకు మేలు చేసే ప్రయత్నం.

`హైదరాబాదు చుట్టుపక్కల ఏ ఒక్క తెలంగాణ వ్యక్తికి భూమి లేదు.

`వారి భూముల కాపలా కోసమే…

`తెలంగాణలో ఆంద్రా భూమూలు కాపాడే ఎత్తు గడ.

`తెలంగాణ లో ఏ రైతు అందుకు ఒప్పుకోడు.

`తెలంగాణలో కొత్త పంచాయతీకి రేవంత్‌ పన్నాగం.

`కాంగ్రెస్‌ వస్తే రైతు బంధుకు రాంరాం.

`కాంగ్రెస్‌ వల్ల కుటుంబాలలో చిచ్చు.

`హిందూ ఆలయాల భూములు అమ్మకం కుదరని పని.

`హిందూ,ముస్లింల మధ్య మళ్లీ దూరానికి పునాది.

`మళ్ళీ కర్ఫూల కాలానికి నాంది.

`మైనారిటీ కోసం నాలుగు వేల కోట్ల కోసం దేవాలయాల భూములే కావాలా?

`పెన్షన్‌ పెంచే ముసుగులో ఏరివేతకు పన్నాగం.

`ఆసరా పెన్షన్ల కోతకు దారి.

`దివ్యాంగుల పెన్షన్లపైనా రేవంత్‌ నజర్‌.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌కు ఇప్పటికే రెండు సార్లు కర్రు కాల్చి వాతలు పెట్టారు. మొదటిసారి తెలంగాణ ఇస్తామని ఆలస్యం చేసినందుకు పెట్టాల్సినంత వాత పెట్టారు. అయినా మారలేదు. మళ్లీ సీమాంద్రను వెంటేసుకొని వచ్చింది. సీమాంద్ర నాయకత్వం మోచేతి నీళ్లే తాగుతామని కలిసి తెలంగాణ ఆత్మగౌరవపార్టీని బిఆర్‌ఎస్‌ దించాలని కుట్ర పన్నింది. దాంతో 2018లో మళ్లీ ప్రజలు మరింత ఎర్రగా కాచ్చిన కర్రుతోనే కాల్చారు. అయినా ఇక కాంగ్రెస్‌ మారదు. మళ్లీ ఒకసారి గతం కన్నా ఎక్కువగా వాత పెడితే గాని మారేట్టులేదు. తెలంగాణ ప్రజలకు రైతుబంధు అన్నది ఏటా అందాల్సిన సమయంలో అందాలి. అందాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్నది. రైతు బంధు అన్నది గత ఐదేళ్లుగా నిరంతరం అందుతున్న పధకం. దానిని ఎన్నికలకు ముడిపెట్టాల్సిన అవసర ంలేదు. దానిని ఎన్నికల నియమావళికి ముడిపెట్టాల్సిన అంశమే కాదు. అయినా ఆ మద్య రైతు బందును అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ కుట్రపన్నింది. అప్పుడే కాంగ్రెస్‌ నిజ స్వరూపం బిఆర్‌ఎస్‌ నాయకులు బైట పెట్టారు. మంత్రి హరీష్‌రావు ఈ విషయంలో కాంగ్రెస్‌ కుటిల నీతిని ఆనాడే ఎండగట్టాడు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమీషన్‌ను విజ్ఞప్తి చేయడంతో రైతు బంధు విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. దాంతో కాంగ్రెస్‌లో ఓటమి గుబులు మొదలైంది. ఎలాగైనా రైతు బంధు ఆపాలని చూసింది. ప్రజలు ప్రభావితమౌతారని చెప్పి, ఎన్నికల కమీషన్‌కు ఉత్తరం రాసి ఆపించింది. నిజంగా ప్రజలు కాంగ్రెస్‌ను కోరుకుంటే ఎవరు ఆపినా ఆగరు. కాని ప్రజలు ప్రభావితమౌతారని వారిని కాంగ్రెస్‌ అవమానించింది. తెలంగాణ రైతాంగం ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్‌ దెబ్బతీసింది. తెలంగాణ రైతులకు రైతు బంధు పడకుండా అడ్డుకున్నది. రైతు బంధు కోసం రైతులను బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎదరుచూసేలా చేయలేదు. కాని కాంగ్రెస్‌ ఎన్నికల నిబంధనలను అడ్డుపెట్టుకొని రైతులను ఇప్పుడే మోసం చేయడం మొదలుపెట్టింది. ఒకవేళ ఇలాంటి కాంగ్రెస్‌ను నమ్మితే రైతు బందు అన్నది ఇక ఆగిపోయినట్లే. ఒక్కసారి రైతు బందు ఆగితే ఇక రావడం కష్టమే. ఎందుకంటే కాంగ్రెస్‌ పొరపాటున అధికారంలోకి వస్తే ముందు రైతు బంధునే సమీక్షిస్తుంది.

రైతు బంధు కొందరి కుదించడం కోసం కొంత కాలం ఆపేస్తుంది.

అసలు రైతు బంధు అందుకుంటున్న భూములపై సర్వేలు అంటూ మొదలుపెడుతుంది. ధరణి పేరుతో అసలుకే రైతుబంధుకు ఎసరు తెస్తుంది. కౌలురైతుల పేరుతో రైతు బంధు పథకానికే తూట్లు పొడుస్తుంది. రైతులకు 24 గంటల కరంటు అవసరం లేదు. 3 గంటలు చాలు..అని చెప్పే కాంగ్రెస్‌ ఒకవేళ అధికారంలోకి వస్తే రైతు బంధు ముందు ముందర కాళ్ల బంధం వేస్తుంది. రేపటి పంటకు ఆటంకం కల్గిస్తుంది. రైతుకు పెట్టుబడి లేకుండా చేస్తుంది. ఇలాంటి కాంగ్రెస్‌ చేసే కుట్రలు అన్నీ ఇన్నీ కావు. కాంగ్రెస్‌ పార్టీకి రైతుల మీద ఏనాడు ప్రేమ లేదు. ఇప్పుడు కొత్తగా వస్తుందన్న నమ్మకం అసలే లేదు. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు ఆపిన కాంగ్రెస్‌పార్టీ రేపు ధరణి తొలిగించి,కొత్తగా పాస్‌బుక్‌లు మళ్లీ మంజూరుచేసి అందులో కౌలు కాలం జేర్చితే …ఇక అంతే..భూ యజమానులు..కౌలు రైతుల మధ్య చిచ్చు మొదలైట్లే. ఇప్పుడు రైతు తాను కౌలుకు ఇవ్వను. అంటే ఇంత కాలం నేను సాగు చేయలేదా? ఇప్పుడెందుకు ఇవ్వవు అనే పంచాయితీ మొదలౌతుంది. తమకు కౌలు పడకండా అడ్డుకుంటారా? మాకు భూమిని కౌలుకు ఇవ్వవా? అన్న కక్షలు పెరుతాయి. ఒకే ఊరిలో వుండే రైతులు ఒకరికొకరు శత్రువులౌతారు. ఇలా లేని పోని చిచ్చుపెట్టి రాజకీయాలు చేద్దామని రేవంత్‌ అనుకుంటున్నాడు. అంతే కాకుండా కౌలు అమలు చేయడంలో ఎవరికి రైతు బంధు, ఇవ్వాలి..ఎవరికి ఇవ్వకూడదన్నదానిపై ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా రేవంత్‌ అన్నారు. అంటే ఒక వేళ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మందు ఆపే పధకం రైతు బంధే అవుతుందని ప్రజలు గమనించాలి.

రేవంత్‌ రాజకీయం మొత్తం భూముల చుట్టే తిప్పుతున్నాడు.

రైతులను ఆగం చేయాలనుకుంటున్నాడు. ప్రశాంతంగా వున్న పల్లెల్లో చిచ్చుపెట్టే ప్రయత్నంచేస్తున్నాడు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మైనార్టీ డిక్లరేషన్‌ అమలకోసం తెలంగాణ ఆలయ భూములను విక్రయిస్తామని చెప్పడం అంటే తెలంగాణలో ప్రశాంతతను దెబ్బతీయడమే అవుతుంది. ఇప్పటి వరకు తెలంగాణలో గంగా జమున తహజీవ్‌ అలా సాగుతోంది. ఎంతో సామర్యపూర్వకమైన వాతావరణం పల్లెలో వుంది. హిందూ ముస్లిం బాయి, బాయి అనుకునేంత అందమైన వాతావరణం వుంది. దాన్ని చెడగొట్టేందుకు రేవంత్‌ కంకణం కట్టుకున్నట్లున్నాడు. ఒక సామాజిక వర్గ అభివృద్దికి ప్రభుత్వం నిధులు కేటాయించడం పరిపాటే. అందుకు బడ్జెట్‌ రూపకల్పనలో నిధులు చేర్చాల్సివుంటుంది. అది వదిలేసి మైనార్టీల డిక్లరేషన్‌ అమలు చేస్తామని, అందుకు ఆలయ భూములు విక్రయిస్తామని చెప్పడం అంత మూర్ఖత్వం ఏమైనా వుంటుందా? రేవంత్‌ చేసిన ఈ ప్రకటనను ముస్లింలు సైతం ఖండిరచారు. రెండురన్న లక్షల బడ్జెట్‌ వున్న తెలంగాణలో ముస్లిం డిక్లరేషన్‌ కోసం కేటాయిస్తామన్న రూ.4వేల కోట్లు లేకపోతాయా? అందుకు ఆలయ భూములు అమ్మాలా? అంటేనే ఇందులో ఏదో మతలబు వుంది. ప్రశాంతంగా వున్న తెలంగాణలో అలజడి రేపడం కోసమే రేవంత్‌ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే మైనార్టీలు కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దుని తీర్మానించాయి.

నిజానికి రేవంత్‌ రెడ్డి చెప్పే మాటలన్నీ అబద్దాలే..నీటి మీద రాతలే.. కౌలు రైతుకు సాయం సాధ్యం కాదని తెలుసు.
అయినా మభ్యపెట్టాలని చూస్తున్నాడు. రైతుల మద్యే చిచ్చుపెట్టాలని ప్రయత్నంచేస్తునాడు. ముస్లిం డిక్లరేషన్‌ పేరుతో హిందువులు, ముస్లిం మధ్య అగాధం పెంచాలని చూస్తున్నాడు. థరణి తొలగించి అటు రైతులకు, ఇటు కైలు రైతులకు మధ్య కొత్త పేచీకి తెరతీయాలని చూస్తున్నాడు. అంతే కాకుండా ఆంధ్రా కబ్జాదారులకు ప్రోత్సాహం కల్పించేందుకు తెరవెనకు కుట్రలకు తెరలేపుతున్నాడు. తెలంగాణ భూములను ఆంధ్రా రియల్టర్లకు,నాయకులకు అప్పగించేకుట్ర చేస్తున్నాడు. ఆంధ్రా ప్రాంతం వారి భూముల రక్షణ కోసమే ధరణి తొలగించాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆంధ్రా పెత్తందారులు కొన్న భూముల విషయంలో ఇబ్బందులు పడాల్సివస్తుంది. ఆ భూముల విషయంలో క్రయవిక్రయాలు ఇబ్బందులౌతాయి. అందుకే కౌలు రైతుల పేరు చెప్పి, ధరణిని రధ్దు చేసి, తెలంగాణ రైతులమీద ప్రేమ వున్నట్లు నటిస్తున్నాడు.
కాంగ్రెస్‌ వస్తే కొత్త పెన్షన్లు దేవుడెరుగు? వున్న పెన్షన్లు పోవడం ఖాయం.
ఎందుకంటే బిఆర్‌ఎస్‌ సానుభూతి పరులకే పెన్షన్లు అందుతున్నాయన్న ఆరోపణ చేసి, వాటిని సమీక్షిస్తామని ప్రకటించి, పెన్షన్లు ఆపేందుకు కాంగ్రెస్‌ పార్టీ వెనుకాడదు. అంతేకాకుండా తెలంగాణలో సుమారు 5లక్షలకు పైగా దివ్యాంగులకు పెన్షన్లు అందుతున్నాయి. అయితే దివ్యాంగుల విషయంలో బిఆర్‌ఎస్‌ కొంత సానుభూతితో 40శాతానికి తక్కువ వున్నా, వారికి పెన్షన్‌ అమలు చేస్తూ వస్తోంది. గతంలో దివ్యాంగులు ఎంత మొత్తుకున్నా పెన్షన్‌ ఇచ్చిన దాఖలాలు లేవు. వారి పెన్షన్‌లను కూడా సమీక్షించే అవకాశం వుందని కాంగ్రెస్‌ నేతలే అంటున్నారు. అందువల్ల కాంగ్రెస్‌ను ఆదరిస్తే, ఆదమర్చిపోయే లోపు చుక్కలు చూపించే ప్రమాదం లేకపోలేదు. రైతు బంధు ఇప్పుడే ఆపినవారు, రేపు ఆపకుండా వుంటారా? అధికారంలోకి రాకుముందే రైతులకు మూడు గంటల కరంటు చాలన్నవారు అంతకన్నా ఎక్కువ ఇస్తారా? మొత్తం మీద రైతాంగం ఆనందంగా వుండడం కాంగ్రెస్‌కు ఇష్టంలేదు. ప్రజలకు ఈ విషయం అర్ధమైంది. మరోసారి కర్రుకాల్చి వాత పెడితేగాని కాంగ్రెస్‌సక్కగ కాదు.

కాంగ్రెసోళ్లతోని కరంటిచ్చుడు కాదు! 

https://epaper.netidhatri.com/

ములుగు బిఆర్‌ఎస్‌ ఇంచార్జ్‌,ఎమ్యెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్ట రాఘవేందర్‌ రావు’’ తో ‘‘చిట్‌ చాట్‌’’

`కాంగ్రెస్‌ కావాలా? కరంటు కావాలా!

`దీపావళి రోజున బెంగుళూరు లో కరంటు లేదు.

`కాంగ్రెసోళ్లు కరంటియ్యలేరు.

`రైతులు సల్లగుంటే కాంగ్రెస్‌ ఓర్వలేదు.

`కాంగ్రెస్‌ వస్తే మోటార్లు కాలిపోవుడు.

`ట్రాన్స్‌ ఫార్మర్లు చెడిపోవుడు.

`పొలాలు ఎండిపోవుడు.

`అర్థరాత్రి కరంటిస్తే రైతుల పానాలు పోవుడు.

`పదేండ్ల కింద కొడంగల్‌ లో ఎకరం భూమి10 వేలు.

`ఇప్పుడు కొడంగల్‌ లో ఎకరం భూమి కోటి రూపాయలు.

`పక్కనే కర్నాటక లో ఎకరం ఐదు లక్షలు.

`కొడంగల్‌ లో కరంటు 24 గంటలు.

`కర్నాటక లో కరంటు 4 గంటలు.

`పదేండ్ల కింద తెలంగాణలో గోసలు.

`కర్నాటక లో ఇప్పటికీ తిప్పలు.

`తెలంగాణ లో వెలుగులు.

`రైతు మోములో కాంతులు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఊహలు వేరు..నిజం వేరు. కాంగ్రెస్‌ కనే పగటి కలలు ఎప్పటికీ నెరవేరవు. ఇదీ జనం అనుకుంటున్న మాట. కాని కాంగ్రెస్‌ పార్టీకి లేని పోని హైప్‌ క్రియేట్‌ చేస్తున్న ఆంధ్రా మీడియా ఛానళ్లలో తప్ప ప్రచారం ఎక్కడా లేదు. జనం ఏమనుకుంటున్నారో ఆ ఛానళ్లకు అక్కర్లేదు. జనం మాట అసలే అక్కర్లేదు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ది ఆ ఛానళ్లకు కనిపించదు. కాని పల్లెల్లో ముచ్చట్లు చెబుతుంటారు. అయితే ఆంధ్రా ఛానళ్లకు కాంగ్రెస్‌ అంటే మోజు కాదు. ప్రేమ కాదు. కేవలం చంద్రబాబు కోసం…చంద్రబాబు పరపతి కోసం..చంద్రబాబు చేసిందేమైనా వుందా? అదీ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పదిహేడు సంవత్సరాలు పాలన చేసింది. కాని తెలంగాణకు నీళ్లిచ్చిందా? ఇవ్వలేదు. కరంటు ఇచ్చిందా? లేదు. 45 ఏళ్లకు పైగా కాంగ్రెస్‌ పరిపాలించింది. కాంగ్రెస్‌ ఏమైనా చేసిందా? అంటే శూన్యం. 2004లో తెలంగాణ వాదంతో ముందుకొచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వచ్చింది. తెలంగాణలో రైతులు బోర్లు వేసుకోకుండా వాల్టా చట్టం తీసుకొచ్చింది. తెలంగాణను నమ్మించి మోసం చేసింది. తెలంగాణలో రైతులు ఇష్టం వచ్చిన రీతిలో బోర్లు వేసుకుంటే భూగర్జ జలాలు పడిపోతాయాని చెప్పి, రైతులపై కేసులు నమోదు చేసింది. అంతటి దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్‌ది. తెలంగాణలో భూగర్జ జలాల మట్టం పడిపోతే పెంచేందుకు మార్గాలు అన్వేషించాల్సిన కాంగ్రెస్‌ పార్టీ రైతులు పొలాలకు నీళ్ల వినియోగంపై ఆంక్షలు పెట్టింది. బోర్లు తవ్వుకోకుండా కేసులు నమోదు చేసింది. తెలంగాణ సాగును ఆగం చేసింది. రైతులకు అర్ధరాత్రులు కరంటు ఇచ్చి, సాగంటే రైతుకు విసుగొచ్చేలా చేసింది. తెలంగాణ సాగును చిద్రం చేసింది. అసలే నీళ్లు లేక సాగు సాగని తెలంగాణలో ఎండాకాలం ఆరంభంలో అకాల వర్షాలు, గడగండ్ల చెడగొట్టు వానలతో రైతులు మరింత మునిగేవారు. నష్టపోయేవారు. అలాంటి రైతలను నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏనాడు ఆదుకున్నది లేదు. అదే సీమాంధ్రలో చినుకు పడి పైరు నేలకొరిగినా నష్టపరిహారం ఇచ్చేది. తెలంగాణ రైతులంటే అంత చిన్న చూపు చూసేది. డిసెంబర్‌ 9 2009న ప్రకటించిన తెలంగాణను కాంగ్రెస్‌ వెనక్కి తీసుకున్నది. సీమాంధ్ర అంటే ప్రేమ కాంగ్రెస్‌కు వుండేది. తెలంగాణ మొత్తానికి చిన్న నీటి పారుదల అనే శాఖను పెట్టి, రూపాయి నిధులు ఇవ్వకుండా తెలంగాణను అపహాస్యం చేసేది. అంతే కాదు తెలంగాణను ఆగం చేస్తూనే మరో వైపు సాగు దండగ అని చంద్రబాబు నాయుడు లాంటి వారు మాట్లాడి రైతుల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతీశారు…

కాంగ్రెస్‌ గాని, తెలుగుదేశం గాని అదికారంలో వున్న నాడు ఏనాడు 24 గంటల విద్యుత్‌ ఇచ్చింది లేదు. 

ఇప్పుడు ఒక వేళ ప్రజలు దయ తలిచి అధికారమిచ్చినా ఇస్తారన్న నమ్మకం లేదు. గతంలో ఏనాడు మాట వరుసకైనా కరంటు 24 గంటలు సరఫరా అయ్యింది లేదు. కాని తెలంగాణ వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ అయిన వెంటనే మూడునెలల్లో కరంటు సమస్య శాశ్వత పరిష్కారం లభించింది. రైతాంగానికి కూడా 24 గంటల కరంటు అందుతోంది. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అక్కడ 24 గంటల కరంటు ఇవ్వలేకపోయాడు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో కరంటు కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. మరి తెలంగాణలో ఎంతటి ఎండాకాలమైనా కరంటు కోతలు అన్న పదం వినపడలేదు. రైతులకు కోత విధించలేదు. ఏనాడు ఎకరం ఎండిరది లేదు. దేశంలోనే రైతుకు సమృద్దిగానీరు, కరంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రైతులు సంతోషంగా వుండడం చంద్రబాబుకు ఇష్టం లేదు. కాంగ్రెస్‌కు అసలే ఇష్టం లేదు. రైతు సంతోషంగా వుంటే చూసి చంద్రబాబు ఓర్వలేడు. అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చి ప్రజల చేత చీకొట్టించుకున్నాడు. అయినా చంద్రబాబు మారలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఇక నీ రాజకీయం చాలని ఏనాడో తరిమేశారు. అక్కడ స్ధానం లేకపోయే సరికి మళ్లీ తెలంగాణ మీద పడ్డాడు. 

 తెలంగాణ రాజకీయాలను కలుషితం చేసే కుట్రలకు తెరతీశాడు.

 సీమాంధ్ర మీడియాను వాడుకుంటున్నాడు. కాంగ్రెస్‌కు లేని హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాడు. సరిగ్గా గత ముందస్తు ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఇదే చేశాడు. తెలంగాణ అంటే పీకల దాకా అక్కసు వున్న ఆంద్రా ఆక్టోపస్‌ లగడపాటి రాజగోపాల్‌ గత ఎన్నికల్లో కేసిఆర్‌ పని అయిపోయిందని ప్రచారం చేశాడు. కాంగ్రెస్‌ గెలుస్తుందని ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయాలని చూశాడు. కాని ఏం జరిగింది. తెలంగాణ సమాజం మొత్తం ముఖ్యమంత్రి కేసిఆర్‌ వైపు నిలిచింది. కాంగ్రెస్‌ను , తెలుగుదేశం పార్టీలను తెలంగాణ తరిమేసింది. ఇప్పుడు సరిగ్గా అదే జరగబోతోంది. బిఆర్‌ఎస్‌ మళ్లీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాబోతోంది. తెలంగాణను అణిచి వేసి, తెలంగాణ చైతన్యాన్ని హేళన చేసిన చంద్రబాబును తెలంగాణ సమజం ఏనాడు నమ్మదు. చంద్రబాబు సాయం తీసుకుంటున్న రేవంత్‌ రెడ్డిని అసలే తెలంగాణ ప్రజలు నమ్మరు. రేవంత్‌రెడ్డి ఎప్పుడైతే చంద్రబాబు ముసుగు తొడుక్కున్నాడో అప్పటి నుంచే ఆయన పతనం మొదలైంది. తెలంగాణ సమాజం చీ కొట్టింది. తెలంగాణ వాదులు వుండే కొడంగల్‌లో ఓడిరచారు. సీమాంధ్రుల ప్రభావం వుండే చోట గెలిచి, ఇప్పుడు అదే రాజకీయం చేయాలని రేవంత్‌ చూస్తున్నాడు. 

పదేళ్ల క్రితం కొడంగల్‌లో ఎకరం భూమి కనీసం పది వేలు కూడా పలకేది కాదు. 

కాని నేడు కొడంగల్‌ నియోజకవర్గంలో ఎకరం కోటి రూపాయలు ధర పలుకుతోంది. ఇరవై నాలుగు గంట కరంటు వస్తోంది.. సాగుకు అవసరమైన నీరు అందుతోంది. ఒకనాడు ఎడారి లాంటి కొడంగల్‌ నేడు నీటితో కళకళలాడుతోంది. ఎక్కడ చూసినా కొడంగల్‌ పచ్చగా మారింది. మరి ఆ పక్కనే వున్న కర్నాటక భూములు ఎండిపోతున్నాయి. అక్కడ కరంటు లేక పంటలు ఎండిపోతున్నాయి. నీళ్లు లేక కర్నాటక భూములు బీళ్లు వారుతున్నాయి. కొడంగల్‌ బాగు పడడం రేవంత్‌కు ఇష్టం లేదు. చంద్రబాబుకు అసలే ఇష్టం లేదు. అందుకే మళ్లీ దొంగలంతా కలిసి వచ్చారు. తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్నారు. నిజం చెప్పాలంటే కరంటు ఇచ్చుడు కాంగ్రెస్‌ వాళ్ల వల్ల కాదు. చంద్రబాబు వల్ల అసలే కాదు. కాలేదు. అందుకే బిఆర్‌ఎస్‌ పార్టీ కరంటు కావాలో..కాంగ్రెస్‌ కావాలో తేల్చుకోమని ప్రజలను కోరితే మాకు కేసిఆరే కావాలి అంటున్నారు. దీపావళి రోజున కర్నాకటలో కరంటు లేదు. బెంగుళూరు చీకట్లో దీపావళి చేసుకున్నది. కాంగ్రెస్‌ కరంటు ఇయ్యలేదని తేలిపోయింది. అసలు తెలంగాణలో ఎన్ని గంటల కరంటు వస్తుందో కర్నాటక రాష్ట్ర నేతలకు తెలిస్తే బాగుండేది. తెలంగాణకు వచ్చి రైతులకు 5 గంటల కరంటు ఇస్తున్నామని చెబుతుంటే, తెలంగాణ రైతులు నవ్వుకున్నారు. కాంగ్రెస్‌నేతల తెలివిని చూసి తిట్టుకున్నారు. కాంగ్రెస్‌ పాలన చూసిన తెలంగాణ ప్రజలకు గుర్తుకువస్తే ఆ పార్టీకి ఓటు కూడా వేయరు. అర్ధరాత్రిళ్లు కరంటు ఇచ్చి, రైతులన అరిగోస పెట్టిన కాంగ్రెస్‌కు తెలంగాణలో చోటు లేదు. ఆదరణ అసలే లేదు. పైకి కనిపిస్తున్న ్పప్రచారమంతా హంబక్‌…ఆంద్రా మీడియా సృష్టిస్తున్న కృత్రిమ హైప్‌…అంతే!

గెలుపు కారుదే! జనం కారు వెంటే.

https://epaper.netidhatri.com/

గులాబీ పరిమళం గుభాలింపే

సారు సర్కారు కావాల్సిందే.

ముచ్చటగా మూడోసారి సిఎం అవుతున్నారంతే.

రైతులంతా కేసిఆర్‌ వైపే.

పింఛన్‌ దారులకు కేసిఆర్‌ పెద్దకొడుకే

అన్ని వర్గాలు కోరుకుంటోంది కేసిఆర్‌ నే.

కోరికోరి కష్టాలు తెచ్చుకోలేమంతే…

కాంగ్రెస్‌ కు పాలన చేత కాదు.

కొట్లాటలకే కాలం సరిపోదంతే.

జనం నాడీ ఇది…కేసిఆర్‌కు జై కొడుతుంది.

సర్వేలన్ని చెబుతున్నది ఇదే…

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బిఆర్‌ఎస్‌ పార్టీయే అధికారంలోకి వస్తుందని తెలుస్తోంది. తెలంగాణలోని ఎవరిని కదలించినా ఇదే మాట..తెలంగాణలో ఎన్నికలపై డిప్యాక్‌. నేటిధాత్రితో సహా కనీసం ఓ యాభై సర్వేలు జరిగి వుంటాయి. వాటన్నింటిలో వచ్చింది..జనం చెప్పింది ఒకటే మాట. ఈసారి కూడా అధికారం బిఆర్‌ఎస్‌దే. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం మీద ప్రజలకు అపారమైన నమ్మకం వుంది. తెలంగాణ కోసం కొట్లాడి సాధించిన నాయకుడు కేసిఆర్‌కు వున్న చిత్తశుద్ది తెలంగాణ మీద ఎవరికీ వుండదన్నది ప్రజలు చెబుతున్న మాట. తెలంగాణ పల్లెల్లో ఏ వ్యక్తిని కదిలించినా చెప్పే మాట ఒకటే పదేళ్ల కింద తెలంగాణ ఎలావుంది? ఇప్పుడు ఎలా వుంది? హైదరాబాద్‌ లాంటి నగరంలో పదేళ్ల క్రితం ఎలా వుంది? ఇప్పుడు ఎలా వుంది? పాత బస్తీలోకూడా ఇదే మాట! పదేళ్ల క్రితం ఎప్పుడూ కర్ఫ్యూ తప్ప, ప్రగతిని చూసింది లేదు. విన్నది లేదని ప్రజలే చెబుతున్నారు. అంతే కాదు బిజేపి మత రాజకీయాలు, కాంగ్రెస్‌ కుటిల రాజకీయాలు చూసిన మైనార్టీ ప్రజలు తమను గౌరవిస్తున్న ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌ అంటున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్ల ఎంతో సంతోషంగా బతుకుతున్నామంటున్నారు. గతంలో ఎక్కడ ఏ అలజడి జరిగినా ముస్లిం మైనార్టీలు బిక్కు బిక్కు మంటూ బతకాల్సివచ్చేది. కాని పదేళ్లుగా కర్ప్యూ వాతావరణం లేని పాతబస్తీలో ప్రశాంతతో బతుకుతున్నామంటున్నారు. ఇంతకన్నా ప్రజలు ఏం కోరుకుంటారు. ఇక పల్లె విషయానికి వస్తే ఒకనాడు పల్లె ఎలా వుందో గుర్తు చేసుకుంటే గుండె ఆవిరౌతుంది. అంతటి కష్టం రైతులు ఎదుర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో బోర్ల రాంరెడ్డి అనే వ్యక్తి వ్యవసాయం మీద వున్న మక్కువతో రైతుగానే బతకాలన్న కోరితో 100 బోర్లు వేసి వ్యవసాయం చేశాడు. కాని చుక్కనీరు రాకపోతే కన్నీటి సాగు చేశాడు. అటువంటి తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లే..కన్నీళ్లకు తావులేని ఊళ్లే…రైతు మోములో సంతోషమే…ఇదంతా కాంగ్రెస్‌ వల్ల సాద్యమయ్యేదా? అసలు కేసిఆర్‌ లేకుంటే తెలంగాణ ఉద్యమం జరిగేదా? ఇంకా వందేళ్లయినా తెలంగాణ రాకపోయేది. కాంగ్రెస్‌ ఇవ్వకపోయేది. తెలంగాణ బాగుపడకపోయేది. ఎడారిగా మారిన తెలంగాణ తప్ప, సస్యశ్యమల తెలంగాణ కనిపించేది కాదు.  

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీక ముఖ్యమంత్రి కేసిఆర్‌. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలంగాణ కష్టం కరంటుతో తీరుతుందన గుర్తించారు. తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా సాగు కావాల్సింది కరంటు. ఆ కరంటు కష్టాలే తెలంగాణ రైతును చిద్రం చేశాయి. తెలంగాన సాగును చిన్నాభిన్నం చేశాయి. సీమాంధ్ర పాలకుల దాష్టికానికి తెలంగాణ చెరువులు ఆగమయ్యాయి. వారి నిర్లక్ష్యానికి చెరువులు మామయ్యాయి. మొత్తంగా తెలంగాణ సాగును, రైతును చెరపట్టించారు. అలాంటి కాలం నుంచి బంగారు తెలంగాణ సాధ్యమైందంటే కారణం ముఖ్యమంత్రి కేసిఆర్‌ అన్న భావన ప్రతి తెలంగాణ వ్యక్తిలోనూ వుంది. ఎందుకుంటే ఒకనాడు తెలంగాణలోని ఏ పల్లెకు వెళ్లి బాట లేదు. బాట పక్కన ఒక్క చెట్టు లేదు. చుట్టూ బీడు భూములు. పల్లెర్లు మెలిచిన పొలాలు. ఎటు చూసినా చుక్క నీరు లేదు. బాట సారులకు కూడా మంచినీటికి దిక్కులేదు. కాని ఇప్పుడు దారి మధ్యలో కనిపించే చెరువులన్నీ నిండుగా వుంటున్నాయి. చెరువులు నింపే కాలువలు ఎప్పుడూ నీటితో కళకళలాడుతున్నాయి. రోడ్డు కిరువైపులా పచ్చని పొలాలు, పాడి పంటలు దర్శమిస్తున్నాయి. బాటసారుల దాహర్తిని కూడా బోర్లు తీరుస్తున్నాయి. ఇరవై నాలుగు గంట కరంటుతో ఎటు చూసిన బోర్లనుంచి గంగమ్మ దుంకుతోంది. బంగారు పంటలు పండుతున్నాయి. ఇంతకాన్న సంతోషం ఏముంటుంది? ఇంతకన్నా ఆనందం ఏముంటుంది. సరిగ్గా పదేళ్ల క్రితం రైతు మీద కనికరంలో చినుకు చుక్క ఆకాశం నుంచి జారినా పెట్టుబడి లేక సాగు వదిలేసుకునేవారు. ఒక వేళ ధైర్యం చేసి అప్పు చేసి, సాగు మొదలుపెట్టినా సరైన సమయానికి చినుకు మొహం చాటేస్తే మొలకెత్తని విత్తనాలు పురుగుల పాలౌతుంటే చూసి రైతు వలవల ఏడ్చిన సందర్భాలే ఎక్కువ. విత్తిన నాడు చినుకు కురిసినా మొక్క భూమిని చీల్చుకొని బైటకు వచ్చినా తర్వాత చినుకు జాడ లేకున్నా రైతు పరిస్ధితి ఆగమ్య గోచరమే…ఇలా అడుగడుగు కష్టమే..దిన దిన గండంగా సాగు సాగించిన రైతు కడుపు నిండా ఏనాడు తిన్నది లేదు. కంటినిండా నిద్ర తీసింది లేదు. కడుపారా నవ్వింది లేదు. గుక్కెడు నీటితో దాహం తీర్చుకున్నది. ఎటు చూసినా అప్పుడు..ఆర్తనాదాలు..ఆకలి కేకలు…వేధింపులు…కష్టాలు ఒకదాని వెంటఒకటి పడి తరిమేస్తుంటే ముళ్లె సదురుకొని రాత్రికి రాత్రి దొంగల్లా ఊరు వదిలి వెళ్లిపోయిన రైతులు ఎంతో మంది. కాని ఆనాడు ఊరు విడిచి, ఇల్లు విడిచి వెళ్లిన వాళ్లంతా మళ్లీ తెలంగాణకు వచ్చారు. దర్జాగా వ్యవసాయం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధుతో సాగువాటు సాగిస్తున్నారు. చినుకు కోసం ఎదరుచూడాల్సిన పని లేదు. కాలమౌతుందా? అన్న దిగులు లేదు. ఒక పంట చేతికి రాగానే మరో పంట..ఇలా మొదలుపెడుతున్నాడు. ఏడాదికి ఒక్కొ రైతు మూడు పంటలు కూడా తీస్తున్నాడు. ఇదీ కదా తెలంగాణ…

అందుకే తెలంగాణలో ఈసారి కూడ కారే గెలవాలని, కారునే గెలిపించుకుంటామని ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. తెలంగాణ వచ్చిన తార్వత కనిపిస్తున్న అభివృద్దిని కొనియాడని వారు లేరు. తెలంగాణ ఎంతో అభివృద్ది చెందినా,ఇంకా కొంత జరగాల్సి వుంది. అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ. అది కేసిఆర్‌ వల్లనే సాద్యమౌతుందని తెలంగాణ ప్రజల ప్రగాఢ విశ్వాసం. తెలంగాణ ప్రజలు బిజేపి, కాంగ్రెస్‌ను నమ్మేందుకు సిద్దంగా లేరు. తాజాగా జరిగిన కర్నాకట ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చేస్తున్నదేమిటో ఆ మంత్రులే వచ్చి చెబితే, తెలంగాణ ప్రజలు చీ కొడుతున్నారు. తెలంగాణలో 24గంటల కరంటు ఇస్తుంటే, కర్నాకటలో 5 గంటలే ఇస్తున్నామని చెప్పి, కాంగ్రెస్‌ ఓట్లు అడగాన్ని ప్రజలు చీ కొడుతున్నారు. ఇటీవల పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కూడా తెలంగాణ ప్రభుత్వ పరపతిని పెంచాయనే చెప్పాలి. రోజుకు ఇరవై నాలుగు గంటల కరంటు రైతులకు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎందుకు ఇస్తుందన్నది కూడా కాంగ్రెస్‌ నాయకులు అవగాహన లేదు. తెలంగాణలో సుమారు 30లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లు వున్నాయి. కరంటు రాగానే ఒకే సారి అన్ని పంపు సెట్లు ఏక కాలంలో మోటార్లు మొదలైతే కరంటు ట్రిప్‌ అవుతుంది. పదే పదే కరంటు పోతుంది. నాణ్యమైన కరంటు రైతులకు అందదు. దాని ద్వారా మోటార్లు కాలిపోవడం వంటివి జరుగుతాయి. దాంతో రైతుల మీద అదనపు బారం పడుతుంది. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కష్టాలతో అష్టకష్టాలు పడిన రైతులు ఇంకా కష్టాల పాలు కావొద్దు. ఖర్చుల పాలు కావొద్దు. నాణ్యమైన విద్యుత్‌తో తిప్పలు లేని సాగు చేసుకోవాలి. మోటర్‌ కాలిపోతే దాన్ని బైటకు తీసి, రిపేర్‌కు పంపించి, తిరిగి తెచ్చుకోవడానికి రెండు రోజులు పడుతుంది. రెండు రోజులు నీళ్లు లేకపోతే పొలం ఎండిపోతుంది. తర్వాత నీళ్లు అందనా కష్టమౌతుంది. అదే 24 గంటల కరంటు ఇస్తే, రైతులంతా ఒకేసారి విద్యుత్‌ వినియోగించుకోరు. ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు మోటార్లు ఆన్‌ చేసుకుంటారు. పొలం పారించుకుంటారు. ఇదీ అసలు కధ. ఈ సంగతి ఒక్క కాంగ్రెస్‌ నాయకుడికి కూడా తెలియకపోవడం విడ్డూరం. ఒకవేళ తెలిసినా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఖండిరచకపోవం అన్యాయం. ఇలాంటి కాంగ్రెస్‌ నాయకులను నమ్మి తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని వారి చేతుల్లో పెట్టేందుకు ఏ ఒక్కరూ సిద్దంగా లేదు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసేందుకు సుముఖంగా లేరు.

బిఆర్‌ఎస్‌ కే జై కొట్టిన తెలంగాణ.

https://epaper.netidhatri.com/

` మూడోసారి బిఆర్‌ఎస్‌ అధికారం ఖాయం.

` దక్షిణాదిన హాట్రిక్‌ సిఎం. కేసిఆర్‌.

` బిఆర్‌ఎస్‌ కు 70-74.

` కాంగ్రెస్‌ కు 37-38

`బీజేపీ 3-1

`మజ్లీస్‌ కు 7-6

` ఇతరులు 0-1

` డి.ప్యాక్‌, నేటిధాత్రి సంయుక్త సర్వేలో వెల్లడి.

`కర్ణాటక ఎన్నికలలో కచ్చితమైన లెక్క చెప్పింది డి. ప్యాక్‌ మాత్రమే.

` మహారాష్ట్ర, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌,ఎన్నికలలో కూడా డి.ప్యాక్‌ సర్వేనే నిజమైంది.

`మునుగోడు లో మెజారిటీతో సహా చెప్పింది డి.ప్యాకే.

` రైతులంతా బిఆర్‌ఎస్‌ వైపే.

`కాంగ్రెస్‌ ను రైతులు నమ్మడం లేదు.

`మార్పు కోరుకోవాలని ప్రజలు అనుకోవడం లేదు.

`బిఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలపైనే జనం ఆసక్తి.

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ పరిపాలన మీద మెజారిటీ ప్రజల సంతృప్తి.

` సోషల్‌ మీడియా లో కనిపించేదంతా హంబక్‌…

`పార్టీలు తయారు చేస్తున్న బోగస్‌ వీడియోలు.

`కాంగ్రెస్‌, బిజేపి రెండు, మూడు స్థానాల కోసం కొట్లాట.

హైదరబాద్‌,నేటిధాత్రి :

తెలంగాణ మళ్లీ బిఆర్‌ఎస్‌కే జై కొడుతోంది. ముచ్చటగా మూడోసారి బిఆర్‌ఎస్సే అధికారంలోకి రాబోతోంది. దక్షిణాదిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. మూడోసారి వరుసగా ముఖ్యమంత్రి అయిన వారు దక్షిణాదిలోనే లేరు. తొలిసారి కేసిఆర్‌ వరుసగా మూడోసారి పార్టీని అధికారంలోకి తేనున్నారు. హాట్రిక్‌ సిఎంగా కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టనున్నారు. గత ఎన్నికల్లో ముందస్తుకు వెళ్లి విజయం సాధించారు. అంతకు ముందు దేశంలోనే ఏ నాయకుడు ముందస్తుకు వెళ్లి పార్టీని గెలిపించుకున్న సందర్భం లేదు. అది కేంద్రమైనా, రాష్ట్రమైనా ముందస్తు ఎవరికీ కలిసిరాలేదు. కాని ఒక్క కేసిఆర్‌కు మాత్రమే ముందస్తు కలిసొచ్చింది. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్ర్రంలో ఎన్టీఆర్‌, చంద్రబాబులు ప్రయోగాలు చేశారు. ఓడిపోయారు. తమిళనాడులో జయలలిత ప్రయోగం చేసింది. కాని ఓడపోయింది. కేంద్రంలో వాజ్‌పాయ్‌ కూడా ముందస్తు ప్రయోగం చేశారు. కుదరలేదు. కాని వారికి ఎవరికీ సాధ్యపడని విజయం కేసిఆర్‌ సొంతమైంది. ముందస్తుకు కొత్త చరిత్ర లిఖించారు. ఇప్పుడు మూడోసారి వరుసగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మరో చరిత్ర సృష్టించనున్నారు. తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో మూడోసారి కేసిఆరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అన్నం ఉడికిందా? లేదా? అన్నంత సులువు కాదు. ప్రజాభిప్రాయ సేకరణ. ఇటీవల చాలా సర్వే సంస్ధలు తూతూ మంత్రంగా వివరాలు వెల్లడిస్తున్నాయి. జనం నాడి తెలుసుకోవాలంటే రాత్రికి రాత్రి అయ్యేది కాదు. జనం తమ అభిప్రాయాలను అంత సులువుగా చెప్పరు. కొన్ని యూటూబ్‌ ఛానళ్లు తమ సొంత మనుషులతో చేయించే వీడియోల ద్వారా అధికార పార్టీకి వ్యతిరేక ప్రచారం చేయడం కోసం విడుదల చేస్తున్న సర్వే ఫలితాలు ఒక హంబక్‌. సర్వే సంస్ధలకు గతం తాలూకు అనుభవాలు కూడా కావాలి. నాటి ఫలితాలు కూడా ఇప్పుడు పోల్చుకోవాలి. గతంలో ఎంత కరక్టుగా ఫలితాలు వెల్లడిరచాయన్నది కూడా ఎంతో ముఖ్యం. అంతేకాని ప్రజలను ప్రభావితం చేస్తున్నట్లుగా సర్వే సంస్థలు తమ ఇష్టాను సారం వివరాలు వెల్లడిరచడం వల్ల ప్రజలు మారుతారనుకోవడం కూడా సరైంది కాదు. ప్రజలపై ఎవరి ప్రభావం వుండదు. వారి నిర్ణయాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరు. వారి నిర్ణయం తెలుసుకోవడం కూడా కష్టం. అంతే! సర్వేలంటే రాత్రికి రాత్రి రాసేసే వివరాలు కాదు. తెలంగాణ ప్రజల మనోభావాలు తెలిసిన వారు ఎవరూ కాంగ్రెస్‌ వైపు ప్రజలు చూస్తున్నారన్న లెక్కలు చెప్పలేరు. ఎందుకంటే తెలంగాణ మొత్తం బిఆర్‌ఎస్‌కే జైకొడుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనే మళ్లీ, మళ్లీ కోరుకుంటోంది. తెలంగాణ ఈ రోజు వచ్చిందటే అందుకు కారణం కేసిఆర్‌. తెచ్చిన తెలంగాణను సస్యశ్యామలం చేసింది కేసిఆర్‌. రైతు బంధు ఇచ్చి పేద రైతులను ఆదుకున్నది కేసిఆర్‌. ఇరవై నాలుగు గంటల ఉచిత కరంటు ఇచ్చి రైతులకు అండగా వున్నది కేసిఆర్‌. రూ.200లున్న పించన్‌ను, రూ.2000 చేసి, కుటంబ పెద్దలకు భరోసా ఇచ్చింది కేసిఆర్‌. ఇలా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసింది కేసిఆర్‌. ఇదీ తెలంగాణ క్షేత్రస్ధాయిలో జనం చెప్పే మాట. తెలంగాణ ప్రజలు కేసిఆర్‌ ఎందుకు కోరుకుంటున్నారో తెలియజేసే అంశాలు. అయితే కాంగ్రెస్‌పార్టీకి గత ఎన్నికల కన్నా కొన్ని సీట్లు పెరిగే ఛాన్సు వుంది. గత ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోయింది. కాని ఈసారి బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ అవతరించే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని సీట్లు పెరిగే సూచనలు, అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. కొన్ని సీట్లలో కాంగ్రెస్‌ బలంగా వుండడం కూడా గమనార్హం. అయినా బిఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ ఖాయం.

డిప్యాక్‌ ముంబైకి చెందిన సర్వే సంస్ధ. డిప్యాక్‌తో కలిసి నేటిధాత్రి కొన్ని నెలలుగా తెలంగాణలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది.
సర్వేను ఎంతో పడ్భందీగా నిర్వహించి, తెలంగాణ ప్రజల మనోగతాన్ని ఆవిష్కరిస్తోంది. ఈసారి ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు పూర్తి మెజార్టీ రావడం ఖాయం. బిఆర్‌ఎస్‌కు కచ్చితంగా 70 నుంచి 74 సీట్లు వచ్చే అవకాశం వుంది. కాంగ్రెస్‌కు 37 నుంచి 38 సీట్లకే పరిమితం కానున్నది. బిజేపి 1 నుంచి 3 సీట్లు సాధించే అవకాశం వుంది. ఎంఐఎం. 6 నుంచి 7 సీట్లు గెల్చుకోవచ్చు. ఇతరులకు సీట్లు వచ్చినా అవి కాంగ్రెస్‌ సీట్లు తగ్గొచ్చు. ఇది డిప్యాక్‌ , నేటి ధాత్రి సంయుక్త సర్వే లెక్క. ఇప్పటి వరకు డిప్యాక్‌, నేటిధాత్రి లెక్క ఎప్పుడూ తప్పలేదు. గత ఐదేళ్లుగా డిప్యాక్‌. నేటిధాత్రి సర్వేలు నిజమయ్యాయి. మహరాష్ట్ర ఎన్నికల్లో డిప్యాక్‌ సర్వే ఫలితాలే నిజమయ్యాయి. గుజరాత్‌ ఎన్నికల్లో మళ్లీ బిజేపి వస్తుందని గతం కంటే మెజార్టీ పెగుతుందని లెక్కలతో సహా డిప్యాక్‌ చెప్పింది. అదే రుజువైంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గెలుస్తుందిన డిప్యాక్‌ చెప్పింది. అదే వాస్తవమైంది. ఆ మధ్య జరిగిన కర్నాటక ఎన్నికల్లో నెల రోజుల మందే కర్నాకట ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని చెప్పడమే కాదు ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్న వివరాలు ముందే చెప్పింది. కర్నాటక పలితాలు కాంగ్రెస్‌, బిజేపి, జేడిఎస్‌లకు డిప్యాక్‌. నేటిధాత్రి చెప్పిన సంఖ్యనే వచ్చింది. ఒక్కసీటు కూడా అటూ, ఇటు కాలేదు. అంతలా ప్రజల నాడిని పట్టుకొని చెప్పిన సంస్ధ డిప్యాక్‌. కర్నాటక ఎన్నికల్లో మళ్లీ బిజేపియే అంటూ చాలా సర్వేలు చెప్పాయి. కాంగ్రెస్‌కు తక్కువ మెజార్టీ వస్తుందని కొన్ని చెప్పాయి. కాని డి. ప్యాక్‌ మాత్రం కాంగ్రెస్‌కు 135 సీట్లు వస్తాయని చెప్పింది. సరిగ్గా అదే సంఖ్య వచ్చింది. అలా నిబద్దతకు మారుపేరుగా డిప్యాక్‌ సర్వే సంస్థ పనిచేస్తుంది. ఇక మునుగోడు విషయంలో కూడా బిఆర్‌ఎస్‌ గెలుస్తుందని, మెజార్టీతో సహా చెప్పిన ఏకైక సర్వే సంస్ధ డిప్యాక్‌. మునుగోడులో రాజగోపాల్‌ రెడ్డి ఓడిపోవడం ఖాయమని చెప్పడం జరిగింది. మునుగోడులో బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఖచ్చితంగా 10వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని చెప్పడం జరిగింది. ఇలా నేటిధాత్రి, డిప్యాక్‌ల సర్వేలు సంచలనం సృష్టించాయి. ఈసారి తెలంగాణలో మళ్లీ బిఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కట్టనున్నారు.
తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న పాలన సంక్షేమ పాలన.
అది కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్‌తోనే సాధ్యమౌతుందని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. కాంగ్రెస్‌ రూపంలో వస్తున్న చంద్రబాబు గురించి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి వల్ల కాంగ్రెస్‌ పెరిగిందమీ లేదన్నది కూడా తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి ఎవరు? అన్న ప్రశ్నకు గ్రామీణ ప్రాంతాలలో సమాధానం లేదు. స్వయంగా ఒక దశలో రేవంత్‌రెడ్డి నేనెరో తెలుసా? అంటే తెలియదని ఆయనతోనే ప్రజలు చెప్పారు. అంటే రాజకీయాల్లో పైకి కనిపించినంతగా నాయకులు ప్రజలకు తెలియాలన్నది కూడా ఏమీ లేదు. కాంగ్రెస్‌లో పెద్ద నాయకులు ఎవరు? అని ప్రజలు నుంచి సమాధానం తెలుసుకోవాలనుకుంటే వారి నుంచి ఏమో? అన్న సమాధానాలే వినిపించాయి. బిజేపి విషయంలో కూడా అదే విధమైన స్పందన కనిపించింది. ఇతర ప్రతిపక్షాల విషయంలో ప్రజలకు కనీసం చాలా మంది నేతల పేర్లు కూడా తెలియకపోవడం విశేషం. రోజూ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసే నాయకుల గురించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కనీస అవగాహన లేదు. అంటే వాళ్లు కూడా జనంలోకి వెళ్లలేదన్నది స్పష్టమౌతోంది. బిఆర్‌ఎస్‌ విషయంలోనే ప్రజలు ఒక సిర్ధనిర్ణయంతో వున్నారన్నది మాత్రం స్పష్టమౌతోంది. కాంగ్రెస్‌,బిజేపిలను కేవలం పట్టణ ప్రాంతాల ప్రజలు ఆదరించేలా కనిపిస్తోంది. అయినా అక్కడ కూడా గెలిచేంతగా ప్రజల్లో వారి స్ధానం కనిపించలేదు. పట్టణ ప్రాంతాలలో చిరు వ్యాపారులనుంచి మొదలుపెద్ద పెద్ద వ్యాపార సంస్ధలకు కూడా కరంటు ఎంతో అవసరం. కాంగ్రెస్‌ వస్తే కరంటు కోతలు మొదలైతే అప్పుడు లబోదిబో అనడం కన్నా, ఇరవై నాలుగు గంటల కరంటు ఇస్తున్న కేసిఆర్‌ను దూరం చేసుకోవడం ఎందుకు? అన్న మాటలే వినిపించాయి. రైతుల సంగతి సరేసరి. వాళ్లు ముఖ్యమంత్రికేసిఆర్‌ తప్ప మరెవరినీ అంగీకరించే పరిస్ధితి లేదు. సాగు విషయంలో, కరంటు విషయంలో , పెన్షన్ల విషయంలో బిఆర్‌ఎస్‌కు తిరుగులేదు. కాని యువతలో కొంత అసహనం మాత్రం కనిపించింది. అది బిఆర్‌ఎస్‌కు కొద్ది పాటి మైనస్‌ కావొచ్చు. అందుకే కొన్ని సీట్లు తగ్గొచ్చు. 2018లో మెజార్టీలలో కోత పడొచ్చు. కాని బిఆర్‌ఎస్‌ విజయానికి ఢోకా లేదు.

సిరుల సింగారం..అభివృద్ధి బంగారం.

https://epaper.netidhatri.com/

`సిద్దిపేట ప్రగతి ఒక అధ్బుతం.

`హరీష్‌ నాయకత్వం ఒక వరం.

`ప్రతి ఇంటికీ అందిన సంక్షేమం.

`అవార్డులలో దేశంలోనే సిద్దిపేట మేటి.

`అభివృద్ధి లో సిద్దిపేట కు లేదు సాటి.

`ప్రగతికి సిద్దిపేట ప్రయోగశాల.

`సమాజాభివృద్దికి ఒక పాఠశాల.

`నాడు సిద్దిపేట అభివృద్ధి కలలు.

`ఆ కలలు నేడు నిజాలు.

`కళ్ల ముందు ఆవిష్కరణలు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ALSO READ: https://netidhatri.com/sirisilla-sirulu-ktrs-hard-work-is-a-blessinggiven-employment-to-handloom-workers/

ఊరును పాల వెల్లి చేశాడు. సిద్దిపేటను సిరుల పేట చేశాడు. చెరువును కల్పవల్లి చేశాడు. మిషన్‌ కాకతీయతో తెలంగాణ బంగారు పంటల మయం చేశాడు. తెలంగాణ తల రాత మార్చడు. ఆరోగ్య మంత్రిగా అందిరికీ వైద్యం అందేందుకు వైద్య యజ్ఞం సాగిస్తున్నాడు. సిద్దిపేటకు వైద్య కళాశాల తెచ్చాడు. ఆర్ధిక మంత్రిగా రాష్ట్ర ప్రగతిని నిర్ధేశిస్తున్నాడు. సిద్దిపేట ప్రజల జీవితాలలో నింపిన నాయకుడు మంత్రి హరీష్‌రావు. సిద్దిపేటను అభివృద్ది పథంలో నిలిపాడు. ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు సిద్దిపేట ఎలా వుండేది. ఇప్పుడు ఎలా వుంది. నిజానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌ సిద్దిపేట ఎమ్మెల్యే అయినప్పటినుంచే సిద్ధిపేట అభివృద్దికి బాటలు వేస్తూ వచ్చారు. అయినా ఉమ్మడి పాలకులు పూర్తిగా సహకరించలేదు. తర్వాత తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మంత్రి హరీష్‌రావు ఎమ్మెల్యేగా వున్నారు. నాటి పాలకులు అభివృద్దికి సహకరించకపోయినా శ్రమదానంతో సిద్దిపేటను అభివృద్ది చేసిన స్పూర్తి దాత హరీష్‌రావు. ప్రజలంటే అటు ముఖ్యమంత్రి కేసిఆర్‌కు, ఇటు మంత్రి హరీష్‌రావుకు ఎనలేని ప్రేమ. సిద్దిపేట అంటే ఎనలేని మమకారం. వారి కృషివల్లనే నేడు ఒకప్పటి సిద్దిపేట పట్టణం, నగరంగా మారిపోయింది. ఒకప్పుడు సిద్దిపేటకు గాని, పరిసర ప్రాంతాలకు గాని ఇతర జిల్లానుంచి ఆడపిల్లను ఇవ్వాలంటే భయపడేవారు. అంతటి భయంకరమైన కరువు పరిస్ధితులు వుండేవి. కనీసం తాగేందుకు కూడా మంచినీళ్లు సరిపడేలా వుండేవి కాదు. ఇక పల్లెలో ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని మైళ్ల దూరం వెళ్లి, బావుల దగ్గర నీళ్లు తెచ్చుకునేవారు. దాంతో ఆడబిడ్డల కష్టం చూడలేక చలించిన కేసిఆర్‌ అప్పటి ప్రభుత్వంతో కొట్లాడి సిద్దిపేటకు మంచినీళ్లు తెచ్చాడు. అయినా పల్లెలకు నీటి గోస తప్పలేదు. సాగు నీరు లేక రైతులు విలవిలాడుతుంటే కన్నీళ్లు పెట్టుకున్న కేసిఆర్‌ తెలంగాణ వస్తేగాని బతుకులు బాగుపడవని తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు. ఆ అడుగులో అడుగు వేసుకుంటూ కేసిఆర్‌తో మొదట నడిచింది హరీష్‌రావు.
అభివృద్ది మా జన్మ హక్కు…తెలంగాణ మా ప్రాంత హక్కు.అంటూ హరీష్‌రావు తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించారు.
ఉమ్మడి రాష్ట్ర పాలకులు సహకరించకపోయినా శ్రమదానంతో ఆనాడే ఎన్నో చెరువులు బాగు చేయించారు. అనేక చెరువుల్లో పూడికలు తీసి, రైతులకు అండగా నిలిచారు. ఎండా కాలంలో పశుగ్రాసం లేక మూగ జీవాలు మలమల మాడిపోతుంటే రైతుల కన్నీళ్లు పెట్టుకునేవారు. మూగ జీవాలకు సరైన గడ్డి లేక, తాగేందుకు నీరుకూడా లేకపోయేది. ఆసమయంలో ఆంధ్రా నుంచి పశుగ్రాసం తెప్పించి, ఉచితంగా రైతులకు అందజేసిన మానవతా మూర్తి హరీష్‌రావు. ఇలా తన మానవత్వాన్ని పదర్శిస్తూ, ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న నాయకుడు హరీష్‌రావు. తెలంగాణ సాధించుకున్నాక సిద్దిపేటకు సోయగాలు అద్దారు. అంతకు ముందే వీలైనంత మేర సిద్దిపేటను సుందరంగా మలిచినా, తెలంగాణ వచ్చాక సిద్దిపేటకు అనేక అందాలు అద్ది అందమైన సిద్దిపేటను చేశారు. సిద్దిపేట నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశాడు. ఒకనాడు ఎడారిగా మిగిలిపోయిన సిద్దిపేటను సిరుల మాగాణ చేశాడు. పేద గుండెలకు దగ్గరగా చేరి , వారి గుండె తడిగా మారారు. నియోజవర్గంలోని ప్రతి కుటుంబానికి దగ్గరయ్యాడు. వారి ఇంటిలో పెద్ద కొడుకయ్యాడు. ఆపదలో వున్నవారికి అండగా నిలిస్తూ వచ్చాడు. ప్రతి వ్యక్తికి తోడుగా గుండె ధైర్యమయ్యాడు. అందిరికీ భరోసానిచ్చే ఆప్తుడయ్యాడు. ఆపన్నులకు సేవ చేసే మానవతా మూర్తి అయ్యాడు. ఒక్క సిద్దిపేటలోనే కాదు, తెలంగాణలోని రైతన్న మోములో చిరునవ్వుగా గెలుతున్న నాయకుడు హరీష్‌రావు. పచ్చని పొలాలో సిరివెలుగు హరీష్‌రావు. పల్లెల్లో వెండి వెలుగు హరీష్‌రావు. ప్రతి గుండెలో ఆరని తడి హరీష్‌రావు.

వైద్యవికాసం..సిద్దిపేటకే తలమానికం.

నేను రాను బిడ్డో సర్కారు దవఖానకు అన్న పాట తెలంగాణ సమాజం కొన్ని దశాబ్దాల పాటు విన్నది. తెలంగాణ వచ్చిన తర్వాతా ఆ పాట కనుమరుగైంది. నేను వస్త బిడ్డో మన సర్కారు దవఖానకే అని పాడుకోవాల్సివస్తుంది. మంత్రి హరీష్‌రావు చేయి పడితే చాలు ఏ శాఖనైనా గొప్ప ఫలితాలు ఇవ్వాల్సిందే. తెలంగాణ వచ్చిన తర్వాత సాగు నీటి మంత్రిగా చేసి తెలంగాణకు కరువు కష్టం తీర్చాడు. తెలంగాణలో ప్రాజెక్టులు దగ్గరుండి కట్టించాడు. చెరువులు దగ్గరుండి బాగు చేయించాడు. తెలంగాణను నీటి గంగాళం చేశాడు. అపర భగీరథ ప్రయత్నం చేసి, గంగమ్మను తెలంగాణ గడ్డమీదకు తెచ్చాడు. కరువును తెలంగాణ పొలిమేర నుంచి తరిమేశారు. దటీజ్‌ హరీష్‌రావు. ఇప్పుడు తెలంగాణకు వైద్యం చేస్తున్నాడు. సిద్ధిపేట ఆసుపత్రిని ఎవరూ ఊహించనంత గొప్పగా అభివృద్ది చేశాడు. పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందిస్తున్నాడు. సిద్ధిపేట జిల్లా కల నెరవేర్చాడు. సిద్దిపేటకు ప్రభుత్వ వైద్య కళాశాల తెచ్చాడు. ఎక్కడా లేని విధంగా 1500 పడకలతో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం చేయించాడు. వైద్య కళాశాలతోపాటు, నిర్సింగ్‌ కళాశాల కూడాతెచ్చాడు. దానికి తోడు సిద్ధిపేటకు బిఫార్మసీ కాలేజీ కూడా బహుమానంగా ఇచ్చాడు. తన ప్రజల ఆరోగ్యానికి అంత ప్రాధాన్యతనిస్తున్నాడు. భవిష్యత్తులో వైద్యం కోసం సిద్దిపేట నుంచి ఎవరూ హైదరాబాద్‌ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నాడు. తెలంగాణలో వైద్య విప్లవం సృష్టిస్తున్నాడు.
వరంగల్‌లో 2500 పడకల ప్రభుత్వాసుపత్రిని శరవేగంగా నిర్మాణం చేయిస్తున్నాడు.
నిమ్స్‌లో కొత్తగా మరో ఆసుపత్రి నిర్మాణం చేయిస్తున్నాడు. హైదరాబాద్‌కు చుట్టుపక్కల నాలుగు అతి పెద్ద ప్రభుత్వాసు పత్రులు నిర్మాణం పూర్తి కావొస్తున్నాయి. మంత్రి హరీష్‌ సారద్యంలో తెలంగాణలో 33 జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేయించాడు. వైద్యరంగంలోనే తెలంగాణను తలమానికం చేశాడు. వైద్య రంగానికే కొత్త భాష్యం చెప్పాడు. ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూశాడు. తల్లిబిడ్డల క్షేమం ప్రభుత్వమే బాధ్యత తీసుకునేలా చర్యలు చేపట్టారు. ఒకప్పుడు ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు జరిగేవి కాదు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు వున్నా, వాళ్లు తమ ప్రైవేటు ఆసుపత్రులలో డెలివరీ చేసేవారు. ప్రైవేటు ఆసుపత్రులు దోచుకునేవి. కాని తెలంగాణలో ఆ పరిస్ధితులు పోయాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాలు జరడం లేదు. అందరూ ప్రభుత్వాసుపత్రుల్లోనే ప్రసవాలు చేయించుకుంటున్నారు. కేసిఆర్‌ కిట్‌ అందుకుంటున్నారు. ప్రసవానికి ప్రభుత్వమే ఆసుపత్రికి చేర్చి, తల్లీ బిడ్డలను క్షేమంగా ఇంటికి పంపించే బాధ్యత కూడా తీసుకున్నారు. ఇంతటి గొప్ప వైద్యం దేశంలో ఒక్క తెలంగాణలోనే జరుగుతోంది. అది మంత్రి హరీష్‌రావు వచ్చిన తర్వాతే అమలౌతోంది. దేశ చిరిత్రలోనే ఇంతటి మహోన్నతమైన వైద్య సేవలు ఒక్క తెలంగాణలోనే అందుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని హరీష్‌రావు నిజం చేశాడు. తెలంగాణ వైద్యుడుగా కీర్తింపబడుతున్నాడు. అటు సిద్దిపేటను సిరుల పేటగా మార్చడు. తెలంగాణను నీటి గంగాలం చేసి సస్యశ్యామలం చేశాడు. ఎడారి లాంటి తెలంగాణను అన్న పూర్ణగా మార్చాడు. ఆర్ధిక మంత్రిగా తెలంగాణను సరిపడ ఆదాయం సమకూర్చుతున్నాడు. వైద్య మంత్రిగా ఆరోగ్యవంతమైన తెలంగాణను ఆవిష్కరిస్తున్నాడు.

సిరిసిల్ల సిరులు…కేటిఆర్‌ కృషి వరాలు.

https://epaper.netidhatri.com/

`సిరిసిల్లను కోనసీమను మించిన మాగాణ చేసిండు.

`చేనేత కార్మికులకు ఉపాధి కల్పించిండు.

`హాండ్లూమ్‌ క్లస్టర్‌ తో నేతన్నల కష్టాలు తీర్చిండు.

`వలసల సిరిసిల్లను ఉపాధి ఖిల్లాగా మార్చిండు.

`సిరిసిల్ల ను జిల్లా చేసి, అభివృద్ధికి బాటలు వేసిండు.

`ఆకలి కేకలతో అల్లాడిన సిరిసిల్లను అన్నపూర్ణ చేసిండు.

`నేతన్నల జీవితాలలో వెలుగులు నింపిండు.

`మహారాష్ట్ర నుంచి సిరిసిల్లకు వలసలొస్తున్రు.

`ఒకనాడు సిరిసిల్ల ఎడారి…ఇప్పుడు నిండుగా పారే గోదారి.

`ఎటు చూసినా పచ్చదనమే…పాడి పంటల పసిడితనమే.

`కేటిఆర్‌ గెలుపు.. సిరిసిల్లకు మలుపు.

`సిరిసిల్ల వెలుగులు స్థిరం…కేటిఆర్‌ తోనే సమృద్ధి పదిలం.

`కళ్లముందు కనిపిస్తున్న సిరిసిల్ల నిజం.

`కాంగ్రెస్‌ ను నమ్మితే మళ్ళీ ఆగమాగం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

మాటల్లో చాతుర్యం…చేతల్లో కర్తవం చూపించే సవ్యసాచి మంత్రి కేటిఆర్‌. ఉరిసిల్ల లాంటి సిరిసిల్లను సిరుల సిల్ల చేసిన నాయకుడు కేటిఆర్‌. మోమోలు ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో ఆప్యాయత కురిపించే పలకరింపుతో, ఆత్మీయత కురించే నాయకుడు కేటిఆర్‌. పేదల ఆప్తుడు. అన్ని వర్గాల అభ్యున్నతిని కోరుకునే అందరివాడు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన నాయకుడు కేటిఆర్‌. తెలంగాణ ఆర్తిని ప్రపంచం ముందు నిలిపి, పెట్టుబడులు తెచ్చి, పారిశ్రామిక ప్రగతిలో తెలంగాణను నెంబర్‌వన్‌ చేసిన నాయకుడు కేటిఆర్‌. తెలంగాణకు అభివృద్ధి ఫలాలు అందించి, ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నా నాయకుడు కేటిఆర్‌. కేటిఆర్‌ లాంటి నాయకుడు మాకు లేడంటూ చాలా రాష్ట్రాలు ఎదురుచూసేంత స్పూర్తిని నింపిన నాయకుడు. తెలంగాణను అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తున్న మార్గదర్శి కేటిఆర్‌. అందమైన తెలంగాణ నిర్మాణంలో కీలకభూమిక కేటిఆర్‌. హైదరాబాద్‌ను సుందర నగరం చేసిన నాయకుడు కేటిఆర్‌. ట్రాఫిక్‌ సమస్యలు లేని హైదరాబాద్‌ను రూపొందించిన నాయకుడు కేటిఆర్‌. మున్సిపల్‌ శాఖతో అందమైన తెలంగాణ, ఐటి, పరిశ్రమల మంత్రిగా పెట్టుబడుల స్వర్గధామం చేసిన నాయకుడు కేటిఆర్‌? అభివృద్ది రూపశిల్పి కేటిఆర్‌. ప్రపంచస్ధాయి సంస్ధల కేరాఫ్‌ అడ్రస్‌గా హైదరాబాద్‌ను మార్చిన నాయకుడు కేటిఆర్‌. అభివృద్ది వికేంద్రీకరణతో తెలంగాణ అంతటా ఐటిని విస్తరింపజేసిన నాయకుడు కేటిఆర్‌. కేటిఆర్‌ లాంటి డైనమిక్‌ లీడర్‌ దేశంలోనే లేడంటే అతిశయోక్తి కాదు. అనర్గళమైన వాక్చ్యాతుర్యం ఆయన సొంతం. ప్రతి విషయంపై అవగాహన ఆయన నేర్చుకున్న విజ్ఞానం. ప్రజల ఆలోచనలు పసిగట్టేంత నేర్పరితనం ఆయనకు ప్రత్యేకం. యువతకు ఆయన ఐకాన్‌. యువత భవిష్యత్తుకు బాటలు వేయగలిగిన మార్గదర్శనం. అలాంటి నేత మాకు వుంటే బాగుండు అన్నంతగా తెలంగాణ మొత్తం కోరుకుంటున్న సందర్భం. సిరిసిల్ల చేసుకున్న అదృష్టం. ప్రతి క్షణం సిరిసిల్ల గురించే ఆలోచించే ప్రజాప్రతినిధిగా ఆయన గొప్పదనం. ఒకనాడు సిరిసిల్ల అంటే కష్టాలతో సావాసం…కన్ళీళ్లతో జీవితం. పదేళ్ల కింద సాగు లేదు. ఉపాది లేదు. కూలి లేదు. ఎద్దు లేదు. ఎవుసం లేదు. నేతలన్నలకు పనిలేదు. ఉపాది కరువుతో అల్లాడిరది. ఎటు చూసినా సిరిసిల్ల ఎడారే…ఉమ్మడి రాష్ట్రంలో సిరిసిల్ల ప్రజలు ఎంత మందిని నాయకులను చేసినా వాళ్లు చేసిందేమీలేదు. ప్రజల జీవితాల గురించి ఆలోచించింది లేదు. కరువును పారద్రోలే తీరిక లేదు. పదవులు కాపాడుకోవడం తప్ప నాటి కాంగ్రెస్‌ నాయకులకు మరో యావ లేదు. ప్రజల గోస పట్టింది లేదు. ప్రజల కష్టం తీర్చింది లేదు. సరిగ్గా అదే సమయంలో సిరిసిల్లను కాపాడేందుకు మంత్రి కేటిఆర్‌ వచ్చాడు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యాడు. సిరిసిల్ల ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు. సిరిసిల్ల వరాల సిల్ల చేయడం ఆనాటి నుంచే మొదలుపెట్టాడు. అటు తెలంగాన కోసం కొట్లాడాడు. ఇటు సిరిసిల్ల అభివృద్దికి బాటలు వేస్తూ వచ్చాడు. తెలంగాణ వచ్చాక సిరిసిల్ల తలరాతనే మార్చాడు. సిరిసిల్ల రూపురేఖల్లో కొత్త వెలుగులు నింపాడు. సుందరమైన సిరిసిల్ల చేశాడు. అందమైన సిరిసిల్లను ముస్తాబు చేశాడు. సమస్యలను పారద్రోలాడు. ప్రజల కష్టాలను దూరం చేశాడు. నేతన్నలకు అండగా నిలిచాడు.
అది కోనసీమ కాదు..సిరిసిల్ల. మన సిరిసిల్ల పొలాలు. వరిచేలు. మంత్రి కేటిఆర్‌ కృషివరాలు.
అటు నీళ్లు. ఇటు పొలాలు. రైతన్న మోములో ఆనందాలు. సిరిసిల్ల నేతన్నల జీవితాలలో వెలుగులు. ఒకనాడు సిరిసిల్ల కరువు నేల. ఒకనాడు చినుకు కోసం నిత్యం ఆశగా ఆకాశం వైపు చూసిన సిరిసిల్ల రైతన్న ఆకాశాన్ని ఆర్తిగా చూడడం ఏనాడో మానేశాడు. ఒకనాడు పల్లెర్లు మెలిచిన పొలాన్ని చూసి దిగులు చెందుతూ, కన్నీళ్లు కార్చాడు. కాని నేడు ఆ పొలం నిండా నీళ్లుచూస్తున్నాడు. ఆ పక్కనే వుండే ఊరు చెరువును చూసి కళ్ల నిండా నీళ్లు తీసుకున్న రైతన్న నేడు ఆ చెరువు మూడు కాలాలు నీళ్లతో నిండి వుండడాన్ని చూసి మురిసిపోతున్నాడు. ఇది ఒకనాటి సిరిసిల్లనేనా అని ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నాడు. సిరిసిల్లలో కరువు మాయమైంది. ఎటు చూసినా పచ్చని గడ్డి కూడా కనిపించని చోట, పచ్చని పొలాలు కనువిందు చేస్తున్నాయి. రోడ్డు పక్క ఎప్పుడూ వాగులు పరుగులు తీస్తున్నాయి. వానా కాలంలో కూడా పారని వాగులు కాలంతో సంబంధం లేకుండా పరుగులు పెడుతున్నాయి. పరవళ్లు తొక్కుతున్నాయి. ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంకల్పం…మంత్రి కేటిఆర్‌ ఆచరణతోనే ఇదంతా సాధ్యమైంది. ఒకనాడు అన్నమో రామచంద్రా అన్న సిరిసిల్ల… నేడు బంగారు పంటలు పండిస్తున్న మాగాణ. ఒకనాడు ఆకలి కేకల సిరిసిల్ల. నేడు పుష్కలమైన ధాన్యపు రాసుల అన్న పూర్ణ. సిరిసిల్ల అప్పుడు నేతన్నల కష్టాల కొలువు. ఇప్పుడు హాండ్లూమ్‌ క్లస్టర్లతో ఉపాధికి నెలవు. నేతన్న జీవితాలకు వేసిన వెలుగు దారులు. అటు సిరుల సాగు..ఇటు నేతన్నలకు ఉపాధి మార్గాలు చూపిన నాయకుడు కేటిఆర్‌. ఇప్పుడు సిరిసిల్ల ఇంత పచ్చగా వుండడానికి కారణం కేటిఆర్‌. సిరిసిల్లలో సిరుల సాగు సాగుతుండడం, తెలంగాణ నేల తల్లిలో కనిపిస్తున్న పరవశం…బలగం సినిమాల చూస్తున్న వాస్తవ దృష్యం. ప్రపంచమంతా చూసిన బలగం సినిమాలో కనిపించిన పచ్చదనమంతా సిరిసిల్లదే. పసిడి పంటల పొలాలన్నీ సిరిసిల్లవే. ఒకనాడు ఎండిన బిడులు, నోళ్లు తెరిచిన పొలాలు..ఎడారి చిత్రాలు. కాని నేడు కోనసీమను మించిన పచ్చటి అందాలు. కోనసీమల పండే పంటలకు రెట్టింపు పంటలు. కోనసీమలోనైనా కరువొస్తుందేమో! కాని సిరిసిల్లలో ఇక కరువు రాదు. మంత్రి కేటిఆర్‌ సిరిసిల్లకు అండగా వుండగా…కరువు దరి చేరదు. ప్రజలకు ఏ కష్టం సిరిసిల్ల పొలిమేర దాటి రాదు. ఎందుకంటే సిరిసిల్ల లాంటి కరువు నేలన నేడు సిరుల సాగు సాగుతుండడం అంటే మాటల కాదు. ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలంటే పాలకులకు చిత్తశుద్ది వుండాలి. మన ప్రాంతం మీద మమకారం వుండాలి. మన ప్రజల జీవితాలలో మార్పు తీసుకురావాలన్న అంకితభావం వుండాలి. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆలోచన వుండాలి. వారి ఆనందమే పాలకులు సంతోషం కావాలి. అలాంటి నాయకుడే ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఆయన వారసుడైన కేటిఆర్‌ తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల ధాన్యపు భంఢాగారం చేశారు. అందుకే సిరిసిల్ల భూగర్భజాన్ని జలభాండాగారం చేశారు. గత పాలకులకు ఇది సాద్యం కాలేదు. ప్రజల బాధలు వారికి పట్టలేదు. పజల గోస వారు చూడలేదు. ప్రజలు ఏమైపోతే ఏముంది? మాకు పదవులున్నాయా? లేదా? అన్నవే ఆనాడు ఆలోచించారు. ఉమ్మడి పాలకులకు పల్లకిలు మోశారు. తెలంగాణ ప్రజల జీవితాలను గాలికి వదిలేశారు. దాంతో చీకట్లలో మగ్గుతున్న తెలంగాణను వెలుగులోకి తెచ్చిన నాయకుడు కేసిఆర్‌. సిరిసిల్లను వెలుగులు సిల్ల చేసింది కేటిఆర్‌. ఇప్పుడు సిరిసిల్ల ఎంత అందంగా వుందో ఒక్కసారి బలగం సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఆ ప్రకృతి అందాలన్నీ సిరిసిల్లవే. ఆ ప్రకృతి రమణీయంతా సిరిసిల్లదే. ఆయన జలలా సవ్వడి సిరిసిల్లదే. ఆ పచ్చదనమంతా సిరిసిల్లదే. అంత గొప్పగా సిరిసిల్లను తీర్చిదిద్దిన నాయకుడు కేటిఆర్‌. సిరిసిల్లను ఇలా తీర్చిదిద్దిన కేటిఆరే తెలంగాణను అందంగా రూపుదిద్దారు. హైదరాబాద్‌ను మరింత సుందరం చేశాడు. మున్సిపల్‌ మంత్రిగా హైదరాబాద్‌లో సరికొత్త నగరానికి రూపకల్పన చేశాడు. అవి ఒకటో, రెండో అయితే చెప్పొచ్చు. ఈ పదేళ్లలో ఆయన చేసిన అభివృద్దికి అంతులేదు. ఆయన తెచ్చిన పరిశ్రమలకు లెక్కలేదు. ప్రైవేటు రంగంలో పెట్టుబడుల వెల్లువకు హద్దులులేవు. యువత ఉపాధికి కొదువ లేదు. సాప్ట్‌వేర్‌ రంగంలో హైదారాబాద్‌లో అవధులు లేదు. దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రం చేసిన ఘనత కేటిఆర్‌ది. యువతకు మార్గదర్శి కేటిఆర్‌…రేపటి తరానికి ఆదర్శమూర్తి కేటిఆర్‌.

మీరు మీటర్లు పెట్టలే…మేం నిధులియ్యలే!

https://epaper.netidhatri.com/

`ఇంతకాలం కేసిఆర్‌ చెబుతున్నదే నిజమైంది.

`నిర్మలా సీతారామన్‌ మాటలతో తేటతెల్లమైంది.

` రైతులపై కేంద్రం కపట నాటకం బయటపడిరది.

` కేంద్ర ఆర్థిక మంత్రే స్వయంగా చెప్పేసింది.

`మీటర్లు పెడితేనే రుణాలన్నది నిజమే…అని ఒప్పుకున్నది.

`మీటర్లు పెట్డమని తెగేసి చెప్పిన కేసిఆర్‌.

`అప్పులు ఆపిన నరేంద్ర మోడీ సర్కార్‌.

`దేశమంతా మీటర్లు పెట్టింది కనిపించడం లేదా?

`తెలంగాణ ఏమైనా ప్రత్యేకమా?

` నిర్మలా సీతారామన్‌ తెలంగాణపై అక్కసు వ్యాఖ్యలు.

`బిజేపి కథ ఇట్లుంటే కాంగ్రెస్‌ కథ మూడు గంటలు.

`కర్ణాటకలో ఐదు గంటలిస్తున్నాం…తెలంగాణ లో మూడు గంటలు చాలంటరు.

`డిల్లీ పార్టీలను నమ్మితే నిండా ముంచుతరు.

`తెలంగాణ ను గోస పెడతరు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

బిజేపి డొల్లతనమంతా తేటతెల్లమైంది. బిజేపి నేతలు మాటల గారడి బైటపడిరది. ఇంత కాలం ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పిందే నిజమైంది. ప్రజలను మభ్యపెట్టాలని చూసిన రాష్ట్ర బిజేపి నేతల బండారం బైటపడిరది. వ్యవసాయ మీటర్లకు మోటార్లు పెడితేనే రుణాలిస్తామని తెగేసి చెప్పిన కేంద్ర ప్రభుత్వ మోసం ఎట్టకేలకు బైటపడిరది. ఇక ఇదిలా వుంటే దొంగే దొంగ అన్నట్లు కరీంనగర్‌లో బిజేపి అభ్యర్ధి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసున్నారు. కరీంనగర్‌ ప్రచారంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ మళ్లీ కేసిఆర్‌ వస్తే వ్యవసాయ బోర్లకు మీటర్లు పెడతుడు అన్నాడు. ఇంతకన్నా నీతి మాలిన ప్రచారం ఎక్కడైనా వుంటుందా? ఓ వైపు సాక్ష్యాత్తు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ మేం చెప్పినట్లు కేసిఆర్‌ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టలేదని చెబుతున్నారు. అందుకే మేం డబ్బులు ఇవ్వలేదని కూడా తేల్చేశారు. మీ ఇష్టం వచ్చినట్లు రైతులకు ఉచిత కరంటు ఇస్తే ఎలా? సంస్కరణలు ఎలా అమలు జరగాలి? అంటూ నిర్మలా సీతారామన్‌ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ప్రశ్నించింది. అంతే కాదు తెలంగాణ ప్రభుత్వం సాగు మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లనే రుణాలు ఇవ్వలేదని కూడా తేల్చిచెప్పారు. రైతుల బోర్లుకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశించిన వెంటనే దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేశాయి. తెలంగాణ ఏమైనా ప్రత్యేకమా? ఎందుకు మీటర్లు పెట్టలేదని నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. కాని బండి సంజయ్‌ ఎప్పటిలాగే అబద్దాలను నమ్ముకున్నాడు. అబద్దాలు ప్రచారం చేస్తున్నాడు. మళ్లీ బిఆర్‌ఎస్‌ వస్తే రైతులు నష్టపోతారని అనడం అంత దుర్మార్గం ఏమైనా వుంటుందా? కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు పెట్టమని తేగేసి చెప్పడాన్ని కేంద్రం ఒప్పుకోలేదు. అందుకే ఏటా ఇవ్వాల్సిన రుణాలు కేంద్రం ఇవ్వలేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ అనేక సందార్భలలో చెబుతూనే వున్నారు. కేసిఆర్‌ బతికుండగా రైతులకు నష్టం జరగనివ్వని చెప్పారు. ఎట్టిపరిస్ధితుల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. అది కేంద్రానికి నచ్చలేదు. అలాంటి బిజేపి రైతులకు మేలు చేస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? గతంలో నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్న ఒత్తిడిపై ప్రకటన చేశారు. అది ఎంత మాత్రం నిజం కాదని ఎమ్మెల్యే రఘునందన్‌, ఎంపి. అరవింద్‌ చెప్పారు. ఇప్పుడు వాళ్లు తెలంగాణ రైతులకు ఏం సమాధానం చెబుతారో చెప్పాల్సిన అవసరం వుంది. ఇంత జరుగుతున్నా బిజేపి నేతలు తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేయాలనే చూస్తున్నారు. తెలంగాణ ప్రజల మీద ఎలాంటి ప్రేమ రాష్ట్ర నేతలకు కూడా లేదని తేలిపోయింది. పొరపాటున బిజేపికి ఓటు పడితే, రైతులు మోటార్లు పెట్టుకోవడానికి సిద్దమని ఒప్పుకున్నట్లే అని కూడా బిజేపి ప్రచారానికి వెనుకాడదు. సరిగ్గా ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు పెట్టడం లేదని చెప్పినా, బిజేపికీ ఓట్లు వేశారంటే రైతులు మా పక్షానే వున్నారని, మోటార్లు పెట్టాలని కూడ కోరుతారు.
కేవలం వ్యవసాయ కనెక్షన్లకు మోటార్లు ఏర్పాటు చేయలేదన్న కోపంతో కేంద్ర ప్రభుత్వం రూ.35వేల కోట్లు ఆపడం జరిగినట్లు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్‌రావు వెల్లడిరచారు.
అంటే తెలంగాణ మీద బిజేపికి ఎంత కక్ష వుందో అర్దం చేసుకోవచ్చు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం. అరవైఏళ్లు రైతులు గోసపడిన ప్రాంతం. వలసలు పోయి, కుటుంబాలు ఆగమైన ప్రాంతం. చుక్క నీరు లేక ఎండిపోయిన ప్రాంతం ఇప్పుడిప్పుడో కోలుకుంటోంది. తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ కృషి చేస్తుంటే, కేంద్రం సహకరించాల్సిందిపోయి, మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు రైతులను బిజేపి గోస పెట్టాలని చూడడం భావ్యమా? కేంద్రం ఇచ్చే రూ.35వేల కోట్లకన్నా, మాకు 68లక్షల తెలంగాణ రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీటర్లు పెట్టలేదు. అదే పొరుగు రాష్ట్రం ఆంద్రప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు. తమిళనాడులో, కార్నాకట, కేరళ, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌లలో కూడా ఏర్పాటు చేశారు. దేశంలోనే రైతుల కోసం మీటర్లు పెట్టని ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్‌. కేంద్రం ఒత్తిడిని కూడా లెక్క చేయలేదు. కేంద్రం రుణాలు ఆపేసినా పరవాలేదనుకున్నాడు. తమకు తెలంగాణ రైతులు ప్రయోజనాలే ముఖ్యమనుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌.
ఇదిలా వుంటే కాంగ్రెస్‌ కధ మరోలా వుంది.
ఓవైపు తెలంగాణవచ్చిన నాటినుంచి రైతులకు పూర్తి ఉచితంగా నాణ్యమైన 24గంటల కరంటు ఇస్తున్నారు. ఈ సంగతి పొరుగును వున్న కర్నాటక కాంగ్రెస్‌ నాయకులకు తెలియదు. ఎన్నికల ప్రచారం అని ఎగేసుకుంటూ వచ్చి, తెలంగాణలో అధికారంలోకి వస్తే తాము రైతులకు ఐదు గంటల కరంటు ఇస్తామని ప్రకటించగానే రైతాంగం కాంగ్రెస్‌ మీద భగ్గుమన్నది. కర్నాకటలో రైతులకు ఏడు గంటలు ఇస్తామని చెప్పడం జరిగింది. కాని కరువు మూలంగా ఐదు గంటలే ఇస్తున్నాం. ఇక్కడ కూడా అలాగే ఐదుగంటలు ఇస్తామని చెప్పి,కాంగ్రెస్‌ తన పరువును తాను తీసుకున్నది. మరో వైపు రైతులు 10హెచ్‌పి మోటార్లు ఏర్పాటు చేసుకుంటే మూడు గంటల కరంటు చాలని రేవంత్‌రెడ్డి చెబుతున్నాడు. రైతులకు 24గంటల కరంటు అవసరం లేదని బాష్యం చెబుతున్నాడు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో , మేమూ 24 గంటలు ఇస్తామంటూ కొత్త రాగం అందుకున్నారు. తెలంగాణలో గత తొమ్మిదేళ్లుగా 24 గంటల కరంటు చూస్తూనే, రైతులకు మూడు గంటలు కరంటు చాలనే కాంగ్రెస్‌ను ప్రజలు నమ్ముతారా? వారిని ఆదరిస్తారా? కాంగ్రెస్‌, బిజేపిలు రైతుల పట్ల ఎంత చిత్తశుద్దితో వున్నారో తేలిపోయింది. ఆ పార్టీల నిజస్వరూపం తెలిసిపోయింది. రైతుల గురించి ఆలోచించేది కేవలం బిఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమే అన్నది రుజువైంది. రైతులకు అహర్నిషలు మేలు చేసేది కేవలం కేసిఆర్‌ మాత్రమే అన్నది రైతులకు కూడా పూర్తిగా అవగతమైంది.
దేశమంతా విద్యుత్‌ సంస్కరణలు తెచ్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణలో కూడా రైతుల వద్ద విద్యుత్‌ ఫీజులు వసూలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన.
అయితే తెలంగాణ ఆ పనికి గండికొట్టింది. దాంతో కేంద్రం అప్పులు ఇవ్వడం లేదు. పైగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని బిజేపి పెద్దలు ఆరోపిస్తున్నారు. దేశంలో వున్న 28 రాష్ట్రాలలో తెలంగాణ అప్పులు కింది నుంచి ఆరో రాష్ట్రంగా మాత్రమే వుంది. కాని బిజేపి మసిబూసి మారేడు కాయ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేసే అప్పులలో సాగునీటి ప్రాజెక్టులు, రైతులకు ఉచిత విద్యుత్‌, రైతు బంధు వంటి పధకాలు, ఇతర అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తోంది. కాని కేంద్రం పేద ప్రజలకు సేవ చేయాల్సిన అవసరాన్ని వదిలేసి, వ్యాపారులకు పదిలక్షల కోట్ల అప్పులు మాఫీ చేయడం గమనార్హం. ఆ పది లక్షల కోట్లతో దేశంలోని పేదలందరి జీవితాలు మారిపోయేవి. వారికి మౌలిక సదుపాయల కల్పన మరింత జరిగిదే. దేశంలో అందరికీ ఇండ్లు వచ్చేవి. ఇలా చెప్పుకుంటూ పోతే సామాన్యులు కూడా లక్షాధికారులయ్యేవారు. రైతులకు మేలు చేస్తే మరింత పంటల దిగుబుడుల పెరిగేవి. మన వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు కూడా చేరేవి. కాని కేంద్రం ఆ పని చేయలేదు. పేరు మోసిన వ్యాపారులకు వారి అప్పులు మాఫీ చేసింది. దేశానికి అన్నం పెట్టే రైతున్నల నుంబి బిల్లులు వసూలు చేయాలనుకుంటోంది. ఇదీ కేంద్ర ప్రభుత్వానికి, బిజేపి పెద్దలకు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు తేడా…కేసిఆర్‌ పేదల పక్షపాతి. రైతుల సంక్షేమ వాది. రైతులను గుండెల్లో పెట్టుకొని చూసుకునే నాయకుడు, పాలకుడు. మరి బిజేపి… వాళ్లే సమాదానం చెప్పాలి.

రైతు బాంధవుడు కేసీఆర్‌

https://epaper.netidhatri.com/

విజయం ఖాయమైంది మెజారిటీ కోసమే ప్రయత్నం
60 ఏళ్ల అంధకారంపై…అభివృద్ధి సూర్యుడై పొడిచిన పాలకుడు కేసీఆర్‌
ఎడారిగా మారిన తెలంగాణను సిరుల తెలంగాణ గా మార్చిన అధిపతి..రైతు సంక్షేమ వారధి.
రైతు రాజ్యాన…కేసిఆర్‌ నజరాన!

`రైతు వరదాత కేసిఆర్‌…

`రుణ విముక్తి జరిగింది.

` రైతు బాంధువుడు…అపర భగీరధుడు.

స్వతంత్ర భారతాన రైతు కన్నీరు తుడిచిన ఏకైక నాయకుడు ‘‘కేసిఆర్‌’’ అని అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ’’నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న అంశాలు…ఆయన మాటల్లోనే.
`తెలంగాణ రైతులందరి పక్షాన కృతజ్ఞతలు.

`కేసిఆర్‌ మాటంటే మాటే…

`ఎంత కష్టమైనా నెరవేర్చుడే!

`రైతంటే ఎనలేని ప్రేమ వుండేది ఒక్క కేసిఆర్‌ కే!

` రైతు దిగులు తీరె…

`రైతు ఇంట ఆనందమే.

` రంది తీరిన రైతుకు సంబరమే.

`సంక్షేమ తెలంగాణ… పురోగతి గ్రామ, గ్రామాన.

` 31 లక్షల మంది రైతులకు లబ్ధి.

` 19 వేల కోట్ల సర్థుబాటు.

`అనూహ్యమైన నిర్ణయం.

` తెలంగాణ రైతుకు వరాల మూటలు.

` గత పదేళ్లలో రైతు కోసం ఊహకందని పథకాలు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

రైతు మనసు తెలిసిన నాయకుడు పాలకుడౌతే ఆ రాష్ట్రం ఎంత సుభిక్షంగా, ఎంత సుసంపన్నంగా వుంటుందో తెలంగాణను చూస్తే ఎవరికైనా అర్ధమౌతుంది. ఎందుకంటే కేసిఆర్‌ స్వతహాగా రైతు. ఆయనకు రైతు కష్టాలు తెలుసు. రైతు కన్నీళ్లు తెలుసు. సాగు కోసం ఎంత రైతు కష్టడతాడో తెలుసు. ఆరు గాలం శ్రమించినా, ఫలితం దక్కని నాడు రైతు వేదన ఏమిటో తెలుసు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కన్నీళ్లు కార్చే రోజులు ఎలా వుంటాయో తెలుసు. బంగారు పంటలు పండిద్దామనుకుంటే నీళ్లు లేకపోతే ఎంత కన్నీటి పర్యంతమౌతాడో తెలుసు. సాగు చేసేందుకు రొక్కం లేక ఎన్ని అవస్ధలు పడతాడో తెలుసు. అందుకే తెలంగాణ వస్తే గాని రైతు దుఖం తీరదని నిర్ణయం తీసుకున్న గొప్ప దార్శనికుడు కేసిఆర్‌. పట్టుదలకు మారు పేరుగా ఆయన పట్టిన పట్టు విడవలేవు. తెలంగాణ సాధించేదాకా విశ్రమించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రైతు పక్షపాతి. ఆయనకు రైతులంటే వల్లమాలిన ప్రేమ. గౌరవం. రాష్ట్రం సస్యశ్యామలం కావాలని జలయజ్ఞం చేసిన గొప్ప మహర్షి కేసిఆర్‌. ఆయనను వేనోళ్ల పొగిడినా సరిపోదు. దేశమంతా ఆయన పేరు నినాదమైనా సరిపోదు. అంత గొప్ప గుణం వున్న నాయకుడు దేశంలోనే మరొకరు లేదు. కేవలం రైతు కోసం ఆలోచించే ఏకైక నాయకుడు కేసిఆర్‌. పరిస్ధితులు అనుకూలించినప్పుడు ఎవరైనా పనులు చేస్తారు. కాని ప్రజల కోసం ఎంతటి ఇబ్బందులైనా ఎదుర్కొని పనులు పూర్తి చేయడం అన్నది ఎంతో గొప్పది. అందుకోసం కొన్ని దశాబ్ధాలుగా శ్రమ పడడడం అన్నది అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. అది కేవలం ఒక్క కేసిఆర్‌ వల్లనే సాధ్యమైంది. నీటికెడ్చిన తెలంగాణ గోసను చూసి దుఖం తన్నుకొచ్చిన రోజులు చూసిన నాడు నా తెలంగాణ అంటూ కంటి తడిపెట్టుకున్నది కేసిఆర్‌. అసలే అరకొర వ్యవసాయం అనుకుంటే విద్యుత్‌ చార్జీల మోతతో తెలంగాణను ఎడారిగా మార్చే ఉమ్మడి పాలకుల కుట్రను ఎదుర్కొన్నది కేసిఆర్‌. అందుకే తెగించి 2001లో తెలంగాణ కోసం బయలు దేరి తెలంగాణ సాధించేవరకు అలుపెరగని పోరాటంచేశాడు. మాట తప్పలేదు. మడమ తిప్పలేదు. ఎత్తిన పడికిలి దించలేదు. ఇప్పుడు పాలకుడిగాకూడా ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలోనే తీసుకున్న నిర్ణయాలను వరసగా అమలు చేస్తున్నాడు. రైతు లోకం తెలంగాణలో సృష్టిస్తున్నాడు. ఒకనాడు ఎక్కడ చూసినా నెర్రెలు పారి, పడావు పడ్డ భూములు. మరి నేడు ఎక్కడ చూసినా పచ్చని పొలాలు. పండుతున్న బంగారు పంటలు. పదేళ్లలో ఎంత అధ్భుతం. ఎంత ఆశ్చర్యం. ఇలాంటి తెలంగాణ ఆవిష్కణ ఇంత తక్కువ సమయంలో జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అన్ని రకాలుగా తెలంగాణ ప్రగతి పరుగులు ఎవరూ కలగనలేదు. కాని కేసిఆర్‌ మాత్రమే కలగన్నాడు. ఆ కలను నిజం చేసి చూపిస్తున్నాడు. అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , నేటిదాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వెలుబుచ్చిన విషయాలు. ఆయన మాటల్లోనే…
ఎన్నికల సమయంలో రైతు రుణ మాఫీ గురించి ప్రజలకు ఇచ్చిన హమీని ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిలబెట్టుకున్నారు.
తెలంగాణలో రైతు, సాగు గురించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారని మరోసారి నిరూపించారు. రైతు రుణమాఫీ మూలంగా తెలంగాణలోని సుమారు 31లక్షల మంది రైతులకు ఊరట కల్గుతుంది. అందుకోసం అవసరమైన రూ.19వేల కోట్ల రూపాయాలు సర్ధుబాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజునుంచే రుణమాఫీ అమలు చేస్తున్నారు. రైతు రుణ మాఫీ ఎప్పుడో జరిగిపోయేది. కాని మధ్యలో కరోనా కాలంలో రెండేళ్లపాటు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా రైతు బంధు ఆగలేదు. ప్రాజెక్టుల పనులు నిలిచిపోలేదు. అందుకే కొంత కాలయాపన జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే కాకుండా, ఎవరూ ఊహించని అనేక పనులు, పధకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ తలరాతనే మర్చేశాడు. తెలంగాణను బంగారు నేలగా తీర్చిదిద్దారు. తెలంగాణ వస్తే నీళ్లొస్తాయంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు వస్తుందని ఎవరూ ఊహించలేదు. దానితో ముడిపడినటువంటి అనేక రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుందని అనుకోలేదు. తెలంగాణ నిండు కుండలా కరువులొచ్చినా సాగుకు కష్టం రాకుండా నీటి నిల్వలతో కళకళలాడుతుందని కలగనలేదు. చెరువు బాగు గురించి ఎవరికీ అవగాహన కూడా లేదు. కాని అవన్నీ నెరవేరాయి. తెలంగాణలోని సుమారు 46వేల చెరువులు పూర్వకళను సంతరించుకున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఎండిపోయిన చెరువులు మళ్లీ పురుడు పోసుకున్నాయి. నేనున్నానని గుర్తు చేస్తున్నాయి. చెరువే ఊరికి ఆదరువు అని పెద్దలు ఎందుకన్నారో ఇప్పుడు మళ్లీ చూస్తున్నాం. తెలంగాణ పల్లెలో పొలాలకు నీళ్లందిస్తున్నాయి. కుల వృత్తులకు ఆధారంగా నిలుస్తున్నాయి. చెరువులే మత్య్స సంపదకు ఆలవాలంగా మారిపోయాయి. తెలంగాణలో నీలి విప్లవానికి కూడా శ్రీకారం జరిగింది. రైతు బంధుతో రైతుకు భరోసా కలుగుతోంది. పండిన పంటలు పొలం గట్టునే ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. తెలంగాణ రైతు కాలు మీద కాలేసుకొని పాగు చేసుకునే పరిస్ధితి వచ్చింది. తెలంగాణలో ఇప్పుడు ఎకరం భూమి వున్న రైతు జీవితానికి ఢోకా లేదు. ఐదెకరాల రైతు నేడు కోటిశ్వరుడౌతానని కలలో కూడా కలగనలేదు. అలా తెలంగాణ తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు రైతుల పక్షాన వేల వేల ధన్యవాదాలు.
నిన్నటి నా తెలంగాణ గుర్తుచేసుకుంటే కలలో గగుర్భాటు పడుతుంది.
దేశమంతా పచ్చగా తెలంగాణ మాత్రం ఎందుకు ఇలా ఎండిపోతోందని అనుకునేవాళ్లం. మధన పడేవాళ్లం. ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరుకు అనంతపురం లాంటి జిల్లాలో పంటలు పండుతున్న తరుణంలో తెలంగాణలో ఎందుకు పంటలెందుకు లేదు? కనీసం తాగడానికి మంచినీళ్లు ఎందుకు లేవు? అరవై తెలంగాణ గోస పడిరది. నీటి చుక్కకు తండ్లాడిరది. గొంత తడవక తల్లడిల్లింది. సాగు లేక భూమి తల్లి విలవిలలాడిరది. రైతు బతుకు చిద్రమైంది. వానలు పడితే సాగు. అది కూడా ఆకాశం వైపు నిత్యం చూసుకుంటూ కన్నీళ్లతో సాలు తడిపిన కాలం. తొలకరిని చూసి మురిసిపోయి చేసుకునేసాగు. ఆ తర్వాత చినుకు జాడ లేకపోతే ఎండిపోతున్న సాలును కన్నీరొలికే సాగు. నీరు లేక వేసిన విత్తనం పురుగు తింటుంటే మోడు వారిని బతుకు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతు కష్టం పగవాడికి కూడా రాకూడదనంత దుర్భరంగా వుండేది. ప్రజలకు తినడానికి తిండి లేక, చేయడానికి పనులు లేక, దేశాలు పట్టిపోయిన కాలం గుర్తు చేసుకుంటే తెలంగాణను సస్యశ్యామలం చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ యుగపురుషుడుగానే చూడాలి. తెలంగాణ సాగును చూసి ఆయన పాలన స్వర్ణయుగంగా చెప్పుకోవాలి. గతంలో రాజుల కాలంలో గుప్తు కాలం స్వర్ణయుగమని చదువున్నాం. అదెలా వుంటుందో ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో చూస్తున్నాం. బంగారు తెలంగాణలో చూసి తరిస్తున్నాం. మురుస్తున్నాం. రైతు రాజుగా చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తుంటే ఇది నా తెలంగాణ అని సంబరపడుతున్నాం. నా తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ను రైతులోకం కొలుస్తోంది. కేసిఆర్‌ నామస్మరణ చేస్తోంది.

అభివృద్ధి అంటే హైదరాబద్‌

https://epaper.netidhatri.com/

ప్రజలు మెచ్చిన పాలన ప్రగతి పథంలో ముందున్న పాలన కెసిఆర్‌ సుపరిపాలన

పెట్టుబడుల స్వర్గదామం తెలంగాణ!
పదేళ్ల లో తెలంగాణ అభివృద్ధి పై పారిశ్రామిక ప్రగతి గురించిఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు… ఆయన మాటల్లోనే…

` హైదరాబాద్‌ చుట్టూ అద్భుతమైన ప్రగతి.

`తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ.

`ఐటిలో మేటి తెలంగాణ.

`తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగు రెట్లు పెరిగిన ఐటి ఎగుమతులు.

`ఫార్మాహబ్‌ గా తెలంగాణ.

`హైదరాబాద్‌ లో మరిన్ని సొగసులు.

`కొత్త కట్టడాలు.

`మహానగరంగా…విశ్వ నగరంగా

`పేరుమోసిన వ్యాపార సముదాలన్నీ హైదరాబాద్‌ లోనే.

`బిజినెస్‌ సమ్మిట్ల వేధిక.

`ప్రపంచ స్థాయి కంపెనీల మూల సంస్థలు హైదరాబాద్‌ లో..

`రజనీకాంత్‌ లాంటి వారు ఆశ్చర్యపోయామన్నారు.

`లండన్‌ లో వున్నానా అని చెప్పిన సినీ నటి లయ. Continue reading అభివృద్ధి అంటే హైదరాబద్‌

కాంగ్రెస్‌ అంటే కరువు, కష్టం, చీకటి!?

https://epaper.netidhatri.com/

`కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాదు…నిండా ముంచిన పార్టీ.

`తెలంగాణ ను అరిగోస పెట్టిన పార్టీ.

`తెలంగాణను ఆగం చేసిన పార్టీ.

`తెలంగాణ ను ఎడారి చేసిందే కాంగ్రెస్‌.

`పెనం మీద నుంచి పొయ్యిలో వేసిందే కాంగ్రెస్‌.

`భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో కలిపిందే కాంగ్రెస్‌.

కాంగ్రెస్‌ పార్టీ వల్ల తెలంగాణ సమాజం ఎంతో నష్టపోయింది. కొన్ని తరాలు కష్టాలు అనుభించింది. అరవై ఏళ్లు తెలంగాణ చీకట్లలో మగ్గాల్సివచ్చింది. నమ్మితే మళ్ళీ పాత రోజులే అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న విషయాలు.. ఆయన మాటల్లోనే

`ఇప్పుడు ఇచ్చామంటూ మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నది.

`పచ్చి తెలంగాణ వ్యతిరేకి రేవంత్‌.

`తెలంగాణ ఉద్యమకారులను గన్‌ తో బెదిరించిందే రేవంత్‌.

`తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూసిందే రేవంత్‌.

`తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బ తీసిందే రేవంత్‌.

`రేవంత్‌ ను నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేరు.

`తెలంగాణ లో కాంగ్రెస్‌ కు చోటు లేదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, ఆకలిబాధలు, కరువులు, చీకట్లు…కాంగ్రెస్‌ పాలనలో ఇవన్నీ చూసింది తెలంగాణ సమాజం. అన్ని బాధలు అనుభవించింది తెలంగాణ. కాంగ్రెస్‌ పెట్టింది ఒక్క బాధైతే చెప్పుకోవచ్చు. కాని ప్రతి క్షణం బాధలే..ప్రతి రోజు గోసలే… దాని పాలనంతా కష్టాలే..ప్రజలకు నష్టాలే..మిగిలినవి చేదు జ్ఞాపకాలే..ఆకలి కేకలే…ఇక రేవంత్‌న నమ్మితే తెలంగాణకు మరోసారి మోసమే…మళ్లీ ఆగమే…ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ. తెలంగాణ సమాజం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్లీ ఆగం చేయాలని చూసిన దుర్మార్గుడు. తెలంగాణను మళ్లీ పొయ్యిలో తోసేయాలని చూసిన ద్రోహి. ఇప్పటికే ఉమ్మడి పాలనే బాగుందంటున్న ద్రోహిని తెలంగాణ ప్రజలు అసలే క్షమించరు. వందల మంది యువత ప్రాణాలు త్యాగాలు చేసి, తెలంగాణ సాధించుకున్నాం. ఆ సాధించుకున్న తెలంగాణలో అమరవీరుల త్యాగాలను అవమానించిన రేవంత్‌కు మన గడ్డమీద వుండే అర్హత లేదు. తెలంగాణలో రాజకీయాలు చేసే నైతికత లేదు. తెలంగాణలో ఓట్లడిగి రాజకీయం చేసే హక్కేలేదు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి సమజానికి ఒక ప్రత్యేకమైన ఆత్మగౌరవం వుంది. ఆత్మాభిమానం వుంది. సీమాంధ్రకు, తెలంగాణకు కొన్ని వైరుధ్యాలున్నాయి. ఆచార వ్యవహారాలలో తేడాలున్నాయి. బాషలో, యాసలు ప్రత్యేకంగా వున్నాయి. పండుగలు ప్రత్యేకతను సంతరించుకొని వున్నాయి. తెలంగాణ బతుకమ్మ స్వరూపం. తెలంగాణ బతుకమ్మ జీవన విధానం. తెలంగాణ పండగల బతుకమ్మ మన జీవనశైలికి నిదర్శనం. కాని ఆంధ్రుకు బతుకమ్మ లేదు. తెలంగాణ బతుకమ్మను అవరవై ఏళ్లలో సీమాంధ్రులు గౌరవించింది లేదు. పూజించింది లేదు. పూలను కొలిచిందిలేదు. పూలతో ప్రకృతికి దగ్గరైంది లేదు. తెలంగాణకు పూలంటే దైవం. తెలంగాణకు పూలంటే ఒక జీవితం. సమాజాన్ని కాపాడే కల్పతరువుకు సంకేతం. తెలంగాణ బాషలో కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఏ సమాజానికి సంస్కృతే ఆ వ్యవస్ధకు గొప్పది. అలాంటి వ్యవస్ధను ఆ సమాజంలో నివసించే రేవంత్‌ లాంటి వ్యక్తి నాశనం చేయాలని చూస్తే, ఆ ప్రజానికాన్ని మోసం చేయాలని చూస్తే తెలంగాణ గాలి కూడా క్షమించదు. అలాగే తెలంగాణ రేవంత్‌ చేసే రాజకీయాన్ని ఆహ్వానించదు. రేవంత్‌ రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహిని ముందు పెట్టుకొని రాజకీయం చేస్తామంటూ కాంగ్రెస్‌పార్టీని ప్రజలు అసలే క్షమించరు. తెలంగాణ పిసిసి. అధ్యక్షుడయ్యాక ఇప్పటికే తెలంగాణలో అనేక చిచ్చులు పెట్టే ప్రయత్నం రేవంత్‌రెడ్డి చేశాడు. రైతులకు మూడు గంటల కరంటు చాలంటూ మొదలుపెట్టి, ఉమ్మడి పాలనే బాగుందనేదాకా అనేక నీతిమాలిన వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ ఆలయ భూములు అమ్మి, మైనార్టీ డిక్లరేషన్‌ అమలు చేస్తానని చెప్పి, సమజాంలో చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్‌ అంటే హైదరాబాద్‌లో కర్ఫ్యూ. హైదరాబాద్‌లో హిందువులు, ముస్లింలు కలిసి వుంటే కాంగ్రెస్‌ రాజకీయం చెల్లదు. అలా కలిసి వుండడం కాంగ్రెస్‌ నచ్చదు. కొన్ని వందల సంవత్సరాలుగా కలిసి బుతుకుతున్న తెలంగాణ సమాజంలో చిచ్చుపెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ వచ్చిన తర్వాత గడచిన తొమ్మిదేళ్ల కాలంలో మళ్లీ మంచి రోజులను చూస్తున్నాం. తెలంగాణలో హిందూ ముస్లింల సఖ్యతను మళ్లీ కల్లారా చూస్తున్నాం. అలాంటి ప్రశాంతమైన వాతావారణాన్ని చెడగొట్టాలని చూసే రేవంత్‌రెడ్డి లాంటి వ్యక్తిని తెలంగాణ సమాజం తరిమేయాలి. అతన్ని నమ్మిన పార్టీని హుస్సేన్‌సాగర్‌లో ముంచేయాలి. అప్పుడుగాని తెలంగాణకు పట్టిన శనిపోదంటున్న చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్‌, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో కాంగ్రెస్‌ను కడిగిపారేశారు. కాంగ్రెస్‌ అసలు స్వరూపం వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
ఈ తరానికి కాంగ్రెస్‌ అంటే ఏమిటి?
ఆ పార్టీ ఎంత దుర్మార్గమైంది. రేవంత్‌ రెడ్డి లాంటి నాయకుడు తెలంగాణకు ఎంతో మోసకారి అన్నది తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం వుంది. తెలంగాణ ఒకనాడు కోటి తరనాల వీణ. అలాంటి తెలంగాణను చెరపట్టినంత పనిచేసి, ఆంధ్రలో విలీనం చేసిన పార్టీయే కాంగ్రెస్‌పార్టీ. స్వాతంత్య్రం వచ్చిన తర్వత విముక్తికోసం తెలంగాణ సమాజం కోరుకుంటుంటే, దేశంలో విలీనం చేసినట్లే చేసి, ఆంధ్రాలో కలిపేసింది. నిజాం రాజ్యంలో పెనం మీద వున్న తెలంగాణ సమాజాన్ని ఆంధ్రతో కలిపి పొయ్యిలో వేసింది. తెలంగాణను ఆగం చేసింది. పైగా గడుసు పెల్లోడు లాంటి ఆంధ్రా చేతిలో,అమాయక అమ్మాయి తెలంగాణను పెడుతున్నాము. అంటూ సన్నాయి నొక్కులు నొక్కిన నెహ్రో చేసిన తొలి మోసం తెలంగాణకు శాపంగా మారింది. ఆనాటి నుంచి తెలంగాణ సమాజం అరిగోసడిరది. హైదరాబాద్‌ రాష్ట్రంగా వెలుగొందాల్సిన ప్రాంతాన్ని చీల్చి, సాంస్కృతిక విద్వంసం చేసిందే కాంగ్రెస్‌ పార్టీ. ఆంధ్రాతో ఎప్పుడూ తెలంగాణకు జీవన వైవిద్యమే..ఇప్పటికీ మహారాష్ట్రలోని మన పూర్వ ప్రాంతాలు, కర్నాకటలోని కొన్ని జిల్లాలలో తెలంగాణ సంస్కృతి కాపాడబడుతోంది. అక్కడి సమాజం ఇంకా తెలంగాణ యాసను, సంస్కృతిని కాపాడుకుంటున్నారు. కాని అరవైఏళ్లపాటు తెలంగాణతో కలిసిసాగి, తెలంగాణను విధ్వసం చేశారు. అందుకు ముఖ్య కారణం కాంగ్రెస్‌పార్టీ. ఇప్పుడు తగుదునమ్మా అని తెలంగాణ ఇచ్చింది మేమే..అని కొందరు..తెచ్చింది మేమే…అని చెప్పుకోవడానికి కూడా కాంగ్రెస్‌ నేతలు సిగ్గుపడడం లేదు. తెలంగాణ ద్రోహిని పార్టీ అధ్యక్షుడిని చేసుకొని, ఒకనాడు సోనియాగాంధీని అనరాని మాటలు అన్న రేవంత్‌ను నెత్తినపెట్టుకున్న కాంగ్రెస్‌ను ప్రజలు చీ కొడుతున్నారు. బాషా ప్రయుక్త రాష్ట్రాల కుట్రలో తెలంగాణను బలి చేసిందే కాంగ్రెస్‌పార్టీ. ఆంద్ర ప్రాంత నాయకులు తెలంగాణను దోచుకుంటుంటే సహకరించిందే కాంగ్రెస్‌ పార్టీ. కేవలం పదవుల కోసం చేతగాని దద్దమ్మల్లాగా చేతులు కట్టుకొని, పదవుల ఎర కోసం ఎదురుచూసిన తెలంగాణ నాయకులను లెక్కలోకి తీసుకోకుండా, సీమాంధ్రకు దోచిపెట్టినపార్టీయే కాంగ్రెస్‌. ఒకనాడు గొలుసు కట్టు చెరువులతో దేశంలోనే గొప్పగా సాగు సంపదను కలిగి వున్న ప్రాంతం తెలంగాణ. ప్రపంచంలోనే నైజాం ధనవంతుడుగా మారడానికి కూడా తెలంగాణసాగుసంపదే. అలాంటి తెలంగాణను , ఆంధ్రాలో విలీనం చేయడంతో తెలంగాణ సాగు ఆగమైంది. చెరువులు చెల్లాచెదురయ్యాయి. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం తెలంగాణ సాగు చిన్నాభిన్నమైంది. నీటి వసతులు కరువై, తెలంగాణ ఎడారిగా మారింది. దీనంతటికీ కారణం కాంగ్రెస్‌ పార్టీ. ఒక ప్రాంతాన్ని గొప్పగా, మరో ప్రాంతంపై సీత కన్నేసి చెరబట్టినంత పనిచేసింది కాంగ్రెస్‌పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాల విలీనానికి ముందు, మూడుకోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో వున్న తెలంగాణ, రెండు కోట్ల లోటుతో ఏర్పాటైన ఆంధ్రలో కలిపారు. తెలంగాణకు ఆకలి కేకలు చూపించారు.
ఇప్పుడు తెలంగాణ పచ్చి వ్యతిరేకి రేవంత్‌రెడ్డిని ముందు పెట్టుకొని మళ్లీ శిఖండి రాజకీయం చేస్తోంది కాంగ్రెస్‌పార్టీ.
కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. వాళ్ల తెలివి తెల్లారినట్లే వుందని తిట్టుకుంటున్నారు. 24గంటల ఉచిత కరంటు ఇస్తున్న తెలంగాణకు వచ్చి, కర్నాటక కాంగ్రెస్‌ నేతలు ఐదుగంటల కరంటు ఇస్తామంటుంటే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తెల్లమొహం వేయాల్సివస్తోంది. అంటే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నది నిజమే అని నమ్మాల్సి వస్తోంది. తాజాగా నిజామాబాద్‌ లో ప్రచారం చేసిన షబ్బీర్‌ అలీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అంటే ఒక బల్బు, ఒక ప్యాన్‌, ఒక టివి. వుంటేనే ఇస్తామని, అంతకంటే ఎక్కువ వుంటే ఇవ్వమని తేల్చేశారు. ఎన్నికలు కాకముందే ఇన్ని అబద్దాలు ఆడుతున్న కాంగ్రెస్‌ను నమ్మితే నట్టెట ముంచడం ఖాయం. అయినా జాతీయ పార్టీలకు దేశమంతా ఒకే విధానం వుండాలి. కాని పూటకో వేషం వేసినట్లు, రాష్ట్రానికో విధానం అంటేనే కాంగ్రెస్‌ డొల్లతనం ఏమిటో అర్ధమౌతోంది.

కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించి నిండా మునిగిన రైతులు

కరంటు కోతలకు కేరాఫ్‌ కాంగ్రెస్‌..

`సూర్యపేట ఎమ్మెల్యే ,రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన కర్నాటక లో కాంగ్రెస్‌ పరిపాలన వాస్తవ పరిస్థితులు.

`జాలి పడితే మిగిలేవి కన్నీళ్లే!

`తెలంగాణ మళ్లీ యాభై ఏళ్ల వెనక్కే!

`ఇళ్లకు కోతలే…వ్యాపార సంస్థలకు వాతలే!

`ఇష్టాను సారం బిల్లుల మోతలే.

`తెలంగాణ కాంగ్రెస్‌ నేతలవన్నీ ప్రగల్భాలే!

`కష్టాల కర్నాటక… కరంటు కటకట!

`తెలంగాణ లో కరంటు వెలుగులు…

`కర్నాటక లో కాంగ్రెస్‌ పుణ్యమా అని చీకట్లు.

`కరంటు లేమికి సాక్ష్యం కర్నాటక.

`ఆరు నెలల్లో అంతా తారుమారు.

`కాంగ్రెస్‌ ను గెలిపించి నిండా మునిగిన రైతు.

`రైతులు రోడ్డెక్కి ధర్నాలు..నిరసనలు.

` రైతులకు ఐదు గంటలకన్నా కరంటివ్వలేమంటున్న సర్కారు.

`ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ తీరు.

`కాంగ్రెస్‌ చెబుతున్నవన్నీ అబద్దాలే!

`అధికారం కోసం ఆరాటం.

`దుర్మార్గపు కాంగ్రెస్‌ రాజకీయం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ అంటేనే అబద్దాల పుట్ట. కర్నాటకలో అధికారంలోకి వచ్చిందని ఇక పులినిచూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కాంగ్రెస్‌ వ్యవహారం చూస్తే విచిత్రమనిపిస్తుంది. తెలంగాణలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఒక్క శాతం కూడా. ఈ పదేళ్లలో ప్రభుత్వం మీద ప్రజలు ఒక్క రోజు కూడా నిరసన తెలియజేసిన సందర్భం లేదు. అంతగొప్పగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ పరిపాలన సాగుతోంది. అలాంటి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి స్ధానమే లేదు. కాని నిత్యం అబద్దాలు వల్లెవేస్తూ, నిజాలను కప్పిపుచ్చుకుంటూ, కేవలం పదవుల కోసమే రాజకీయాలు చేసే కొందరు స్వార్ధపరులు కాంగ్రెస్‌లో చేరినంత మాత్రాన బపడినట్లు కాదు. కాంగ్రెస్‌కు బలం చేకూరిచనట్లు కాదు. కాంగ్రెస్‌ చెబుతున్న హమీలన్నీ ఇప్పటికే తెలంగాణలో అమలు చేస్తున్నవే. కాంగ్రెస్‌ కొత్తగా చెప్పిందేమిటి? ఇస్తామంటున్నదేమిటి? దేశంలో డెబ్బ్కె ఏళ్ల స్వతంత్య్రంలో ఏనాడు రైతుల గురించి ఆలోచించింది లేదు. ఇంతపెద్ద దేశంలో కేవలం వ్యవసాయం మీద ఆధారపడిన దేశంలో ప్రాజెక్టుల నిర్మాణాల మీద దృష్టిపెట్టలేదు. తెలంగాణలో ప్రాజెక్టులు కాంగ్రెస్‌ కట్టింది లేదు. అరవైఏళ్ల తెలంగాణను గోసపెట్టిన పార్టీయే కాంగ్రెస్‌. ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు కొత్తగా కర్నాటక అంటూ భజన చేస్తున్నారు. ఏముంది కర్నాటకలో కరంటు లేదు. రైతులకు కరంటు ఇవ్వడం లేదు. కేవలం ఐదు గంటలు మాత్రమే ఇవ్వగలమంటూ అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రకటన చూస్తున్నాం. రైతులు రోడ్డెక్కి నిరసలను తెలియజేస్తున్న సందర్భం చూస్తూనే వున్నాం. పంటలు ఎండిపోయే పరిస్దితి ఎదురౌతుందని రైతులు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు. గొప్పగా చెప్పుకునే కర్నాటకలో ఇండ్లకు కూడా సరిగ్గా కరంటు సరఫరా చేయడంలేదు. హోటల్స్‌ బిజినెస్‌ వ్యాపారులు కరంటు కోతలపై నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ఇక దోపిడీకి అంతే లేదు. ఏకంగా అక్కడి నాయకుల పేరుతోనే ట్యాక్స్‌ వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజలు చీదరించుకుంటున్నారన్న సోయి కూడా లేకుండా కర్నాటక గెలిచాం..గ్యారెంటీలు ఇచ్చాం… అని చెప్పుకోవడం కాదు…బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న వాటినే కాపీ కొడుతూ కూని రాగాలు తీస్తే ప్రజలు నమ్మరు. కాంగ్రెస్‌ పార్టీ సభలకు ఎంత మంది వస్తున్నారో చూస్తున్నాం. రాహుల్‌ గాంధీ, ప్రియాంకాగాంధీలు వస్తే తప్ప రాజకీయం నడవని నేతలు రాష్ట్రాన్ని నడిపిస్తారా? ఇలాంటి పరాన్న జీవుల్లాంటి నాయకులను చూసి ప్రజలు ఓట్టేస్తారా? అంటున్న సూర్యపేట ఎమ్మెల్యే ,రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో చెప్పిన కర్నాకట వాస్తవ పరిస్ధితులు, తెలంగాణలో అమలౌతున్న సంక్షేమ పధకాలు ఆయన మాటల్లోనే…
కాంగ్రెస్‌ అంటేనే కరంటు కోతలు.
తెలంగాణ అరవై ఏళ్లపాటు చూసిందే..ఇప్పుడు కర్నాకటలో చూస్తున్నదే. కర్నాకటలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమేమిటో ప్రజలకు తెలుసు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతుల మసిబూసి మారేడు కాయ చేస్తామంటే ఎవరూ నమ్మరు. పైగా ఓటుకు నోటు కేసులో వున్న దొంగను నమ్మి పార్టీ అప్పగించిన కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారా? అసలు కర్నాటకలో ప్రతి పనికి ఓ రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ఆఖరుకు చెత్త సేకరణకు ముందుకొచ్చే ఎజెన్సీలనుంచి కూడా వసూలు చేస్తున్నారంటే కాంగ్రెస్‌ పనితనమేమిటో? ఆ పరిపాలన ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. గత పాలకులు బిజేపి పూర్తిగా అవినీతి మయమైపోవడం వల్ల ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మారు. అదేదో గొప్పగా , తెలంగాణలో కూడా మేమే అంటూ కలలు కంటున్నారు. వాళ్లకు మిలిలేవి కలలే.. ఆ కలల్లోనే వాళ్లు ఊరేగాల్సిందే. తప్ప..తెలంగాణ ప్రజల్లో ఆదరణ ఎప్పటీకి కాంగ్రెస్‌కు వుండదు. ఇప్పటికీ కనీసం టిక్కెట్ల ఖరారుకే దిక్కులేదు. అలాంటి కాంగ్రెస్‌ నాయకుల చేతుల్లో పాలన పెడితే ప్రజల జీవితాలు ఆగమే…అరవైఏళ్లపాటు తెలంగాణ ప్రజలు కొట్లాడిరదే కాంగ్రెస్‌ మీద. తెలంగాణను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్‌. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆంద్రలోకలిపిందే కాంగ్రెస్‌. ఇప్పుడేదో కొత్తగా తెలంగాణ మేమే ఇచ్చామని చెప్పుకోవడానికి కనీసం సిగ్గుపడాలి. ప్రజల మీద ప్రేమతో కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేసిన ఉద్యమంతో అనివార్యమై ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్‌ మీద తిరుగుబాటు చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో పద్నాలుగేళ్లపాటు నిరంతరం ఉద్యమం చేశారు. ఎంతో మంది యువత బలయ్యారు. కేసిఆర్‌ ఆమరణ దీక్షతో దిగివచ్చారు. అప్పడు తెలంగాణ ప్రకటన చేశారు. అంతే కాని అడగగానే చాక్లెట్‌ చేతిలో పెట్టినట్లు ఇచ్చినట్లు ఎంతో సుతారంగా చెబుతున్నారు. అలా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడని తత్వం కాంగ్రెస్‌ నేతలది. తెలంగాణ ప్రజల ఉసురు పోసుకొని ఇక తప్పని పరిస్దితుల్లో తెలంగాణ ఇచ్చారు. ఇవ్వకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని ఇచ్చారు. అంతే గాని తెలంగాణ మీద ప్రేమతో కాదు. ఈ విషయం తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అందుకే తెలంగాణ ప్రజల్లో గుండెల్లో వున్నది కేసిఆర్‌. తెలంగాణ కలలు నెరవేర్చే నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ తెచ్చాడు. ప్రజల కష్టాలు తీర్చాడు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకయ్యాడు. ఆడపిల్లలకు మేమమాయ్యాడు. ఆసరాతో కుటుంబాలను ఆదుకుంటున్నాడు. కళ్యాణ లక్ష్మితో పేదింటి ఆడపిల్లల పెళ్లి చేస్తున్నాడు. తల్లి బిడ్డల క్షేమం చూస్తున్నాడు. అమ్మ కాబోతున్న తల్లులను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. తల్లి గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం దాకా, తల్లి బిడ్డ క్షేమంగా ఆసుపత్రిని నుంచి ఇంటికి చేర్చుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇదీ మన తెలంగాణ గొప్పదనం. మన ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఔదార్యం. ఇంత గొప్ప ప్రభుత్వం వుండగా, ఏనాడు ప్రజల యోగక్షేమాలు పట్టని కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించడం అన్నది కల్ల.
తెలంగాణ అంటేనే ఓ అధ్భుతం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన అంటేనే ఓ స్వర్ణయుగం. ఎందుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా కరంటు కోతలతో తెలంగాణ విలవిలలాడిరది. కాని తెలంగాణ వచ్చిన మూడు నెలల్లో తెలంగాణ వెలుగులతో నిండిరది. ఆరు నెలల్లో అసలు కరంటు సమస్య అన్నది లేకుండాపోయింది. ఇండ్లకు ఇరవై నాలుగు గంట కరంటు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో అరవైఏళ్లలో ఏ ఒక్కనాడు ఇరవై నాలుగు గంటల కరంటు తెలంగాణ ప్రజలు చూసింది లేదు. కాని తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే రెప్పపాటు కూడా పోకుండా కరంటు చూస్తోంది. ఇదీ కేసిఆర్‌ నాయకత్వానికి, పాలనకు నిదర్శనం. మరి దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇరవైనాలుగు గంటల నిర్విరామ కరంటు ఎందుకు సరఫరా కావడంలేదు. సాక్ష్యాత్తు దేశ రాజదానిలో కూడా కరంటుకోతలు చూస్తున్నాం. కాని తెలంగాణలో ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఏనాడు కోత చూసింది లేదు. ప్రజలు ఇబ్బంది పడిరది లేదు. రైతులకు కష్టం కలగలేదు. అర్ధరాత్రులు రైతులు కరంటు కోసం బావుల వద్దకు వెళ్లింది లేదు. అక్కడ నిద్రలు చేసింది లేదు. తెలంగాణలో వున్నది బిఆర్‌ఎస్‌ సంక్షేమ ప్రభుత్వం. ప్రజల ప్రభుత్వం. పేదల ప్రభుత్వం. రైతుల ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వంలో పనిచేస్తున్న గొప్ప పరిపాలనకు నిలయం. అలాంటి తెలంగాణలో మరో పార్టీ అధికారంలో వచ్చే అవకాశమే లేదు. కర్నాకట పేరు చెప్పుకుంటే పడే ఆ కాస్త ఓట్లు కూడా పోతాయి. ముందు కాంగ్రెస్‌ అది తెలుసుకుంటే మేలు..కాంగ్రెస్‌ను ఆదరిస్తే మళ్లీ తెలంగాణను చీకట్లోకి తీసుకెళ్తారు. తెలంగాణను ఆగం చేస్తారు..ప్రజలు బాగా ఆలోచించాల్సిన సమయం. మోసం చేసేవాళ్లు చాలా చెప్తారు. నమ్మించి ఆగం చేస్తారు. బిఆర్‌ఎస్‌ ప్రజలను గుండెల్లో పెట్టుకునేపార్టీ. ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడు ముఖ్యమంత్రికేసిఆర్‌. మూడోసారి కేసిఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం. బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ విజయం తధ్యం.

కాంగ్రెస్‌ ను నమ్మితే సంక్షేమం సమాదే!

ములుగు బిఆర్‌ఎస్‌ ఇంచార్జ్‌,ఎమ్యెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్ట రాఘవేందర్‌ రావు’’ తో ‘‘చిట్‌ చాట్‌’’ ఆయన మాటల్లోనే..

` వ్యవసాయం ఆగమే!

`మళ్ళీ కరంటు కోతలే!

`కరువు కాలం కోరి తెచ్చుకునుడే?

`నిత్యం అధికారం కోసం కొట్లాటే!

`పాలన గాలికే!

`పథకాలన్నీ పక్కకు పెట్టుడే!

`మూడు గంటల కరంటే!

`బావుల కాడ మోటర్లకు మీటర్లు పెట్టుడే!

`తెలంగాణ అల్లకల్లోలమే!

`అంతా కలహాల కుమ్ములాటలే!

`సఖ్యతలేని రాజకీయ కాపురమే!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ను నమ్మితే తెలంగాణ ఆగమే..బతుకులు ఆగమాగమే! తెలంగాణ జీవనం తలకిందులే!! తెలంగాణను ఆదరిస్తే మళ్లీ యాభై ఏళ్లు వెనక్కె..ఎందుకంటే పదేళ్లలో మన తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనతో తెలంగాణ వుందో? కాంగ్రెస్‌, బిజేపి పాలిత రాష్ట్రాలలో పరిస్ధితులు ఎలా వున్నాయో? తెలుసుకోవాలి. కొట్లాడి తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో పదేళ్లలో జరిగిన అభివృద్ది అంతా ఇంతా కాదు. అసలు మనం తెలంగాణలోనే వున్నామా? అన్నంత ఆశ్చర్యం అప్పుడప్పుడూ వేస్తుంది. హైదరాబాద్‌లో తిరుగుతుంటే ఎక్కడున్నామన్న అనుమానం కలుగుతుంది. అంతలా తెలంగాణను, హైదరాబాద్‌ను మార్చివేశారు. ప్రగతిని పరుగులుపెట్టించారు. పదేళ్లలో అద్భుతమైన ప్రణాళికా బద్దమైన సమ్మిళితమైన, సుసంపన్నమైన అభివృద్దిని మన కళ్ల ముందు నిలిపారు. అదీ కేసిఆర్‌ పాలన. కాంగ్రెస్‌ నాయకులు పెద్ద పెద్ద మాటలు చెబుతారు. ఎందుకంటే వాళ్లు మాటలే చెబుతారు. మాటలు కోటలు దాటించి, కాళ్లు తంగెళ్లు కూడా దాటించలేరు. అందుకే గడపలోనే వుంటూ గూడుఫుఠానీ చేస్తుంటారు. మాయామశ్చీంద్ర వేషాలు వేస్తుంటారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎంతకైనా దిగజారుతారు. ఒక్క విషయంలో కాంగ్రెస్‌ నాయకుల దుర్నీతి ఎలాంటిదో సూటిగా చెప్పొచ్చు. కాళేశ్వరం విషయంలో వాళ్లు చెప్పే మాటలు విని ప్రజలే చీ అంటున్నారు. తుమ్మిడి హట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణం చేస్తే సక్కగ నీళ్లన్నీ తెలంగాణ పారేవిఅంటూ అతి తెలివి లెక్కలు చెబుతున్నారు. సరే పదేళ్లు అధికారంలో వుండి ఎందుకు పూర్తి చేయలేదు. కేవలం ఎన్నికల కోసం, జిమ్మిక్కుల కోసం, తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చడం కోసం, ఉత్తర దక్షిణ తెలంగాణ మధ్య చిచ్చుపెట్టడం కోసంకాంగ్రెస్‌ ఆడిన నాటకమని ఎంత మందికి తెలుసు. కాంగ్రెస్‌ దుష్టపన్నాగాలు,కటిల రాజకీయాలు ఇలా వుంటాయి. నిజంగా తెలంగాణకు నీళ్లివ్వాలనే చిత్త శుద్ది కాంగ్రెస్‌కు ఏనాడు లేదు. వుంటే ఏనాడో తెలంగాణ పచ్చబడేది. కాని కాంగ్రెస్‌ పాలనలో ఎండిపోయింది. ఎడారిగా మారింది. సాగులేని కరువుకు కారణమైంది. మంచినీళ్లు కూడా దొరకుండా చేశారు. ప్లోరైడ్‌తో తెలంగాణ ప్రాంతమంతా కాళ్ల నొప్పులు,కీళ్ల నొప్పులు, నడుములు వంగిపోతుంటే చూశారే గాని మంచినీళ్లు కూడా ఇవ్వలేని కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు ఊసరవెళ్లి వేశాలు వేస్తున్నారు. మళ్లీ తెలంగాణను ఎండబెట్టడానికి కొత్త మొసలికన్నీరు కారుస్తున్నారు. ఇలాంటి స్వార్ధ నాయకులు నిండి వున్న కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ నట్టెట మునుడుగే అంటున్న ములుగు బిఆర్‌ఎస్‌ ఇంచార్జ్‌,ఎమ్యెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్ర రావుతొ పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…
పగటి వేషగాళ్ల రూపంలో కాంగ్రెస్‌ నాయకులు రంగులు మార్చి మళ్లీ వస్తున్నారు.
ఎన్నికల సమయం తప్పితే ఎప్పుడూ కనిపించరు. ఎన్నికలనగానే కలుగులో దాని వున్న ఎలుకలు బైటకొచ్చినట్లు వస్తారు. వచ్చి అబద్దాలను రంగులు పులుముతారు. ఈసారి మరీ భరితెగిస్తున్నారు. అలవి కాని హామీలను ముందు పెట్టుకొని నమ్మించి ముంచేందుకు వస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా వుండాల్సిన అసవరం వుంది. వ్యవసాయమే దండగ అన్నంతగా ఒక దశలో మాట్లాడిన వాళ్లు కూడా సాగు గురించి, వ్యవసాయం గురించి, నీళ్ల గురించి సిగ్గూ, ఎగ్గూ లేకుండా మాట్లాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో యాభై ఏళ్లపాటు పాలించి తెలంగాణను అరిగోస పెట్టి, ఇప్పుడు తియ్యని మాటలు చెబితే ప్రజలు నమ్ముతారా? ఆదరిస్తారా? మొన్ననే పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎకరానికి మూడు గంటల కరంటు చాలు అంటూ వెకిలి మాటలు రైతుల చేత చీవాట్లు తిన్నాడు. అసలు తెలంగాణ వ్యవసాయం గురించి ఒక్కముక్క కూడా తెలియని వాళ్లు కాంగ్రెస్‌లో రాజకీయాలు చేస్తున్నారు. ఇదే మన దౌర్భాగ్యం. తెలంగాణలో ఎన్ని రకాల భూములున్నాయి. ఏఏ భూముల్లో ఎలాంటి పంటలు పండుతాయి? ఎంత నీరు అవసరం. ఏ భూమి ఎంత నీటిని తీసుకుంటుంది. అన్నదానిపై కనీసం అవగాహన లేని కాంగ్రెస్‌ నాయకులు మేం పాలిస్తాం. మాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. నిండా ముంచేందుకు రెడీగా వుండండి అన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో ఒక దశలో కరంటు కష్టాలు ఎలా ఎదుర్కొన్నదో ప్రజలందరికీ తెలుసు. పల్లెలనుంచి మొదలుపట్టణాల దాకా ఏ రోజు కూడా పట్టుమని గంట సేపు కరంటు వున్న దాఖలాలు లేవు. ఇక పల్లెల కష్టం చెప్పనలవి కాదు. పగలు పదినిమిషాలు, రాత్రి పదినిమిషాలు అన్నట్లు ఎప్పుడు వచ్చేదో..ఎప్పుడు పోయేదే తెలియనంత చీకటికాలం చూశాం. కాంగ్రెను నమ్మితే మళ్లీ ఆ రోజులు రావడం ఖాయం. యాభై ఏళ్లు పాలించినా కరంటు ఎంత కావాలి? ఎలా తేవాలి? ఎలా సరఫరా చేయాలి? అన్నదానిపై కనీస అవగాహన లేకుండానే పాలించారు. ఇంకా తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లే అంటూ లెక్కలు చెప్పారు. ఏమైంది? ఆంద్ర వెలుగులతో నిండిపోతుంది. తెలంగాణ చీకట్లలో మగ్గిపోతుందని కాంగ్రెస్‌నాయకులు చెప్పిన మాటలు తారుమారయ్యాయి. ఆంద్రలో కరంటు కష్టాలు. తెలంగాణలో కరంటు వెలుగులు చూస్తున్నాం. పొరపాటును కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ తెలంగాణలో కరంటు కష్టాలు కొనుక్కున్నట్లే. ఇక దశలో వ్యవసాయానికి, పరిశ్రమలకు కూడా పవర్‌ హాలిడే ప్రకటించిన రోజులున్నాయి. కాంగ్రెస్‌ను పాపం అంటే చాలు మళ్లీ ఆ రోజులు వస్తాయి. అందుకే తెలంగాణ ప్రజలు, యువత పాత రోజులు ఎలా వుండేవో కూడా తెలుసుకోవాలి.
ఇదిలా వుంటే కాంగ్రెస్‌ను నమ్మితే పాలన గాలికి వదిలేసి, నిత్యం కొట్టుకుంటూ, ప్రజా సమస్యలను వదిలేస్తారు.
వారి వారి రాజకీయ ఆధిపత్యాలను ప్రజల మీద రుద్దుతారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలలో ఎక్కడా అమలు కాని పధకాలు ఒక్క తెలంగాణలోనే అమలు చేస్తామంటే ప్రజలు అంత అమాయకులు కాదు. అసలు కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ సీమాంధ్ర నేతల పెత్తనం కిందనే సాగుతోంది. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి తన గురువు చెప్పినట్లు నడుకుంటాడే గాని, తెలంగాణ ప్రజలకు అనుకూలంగా పనిచేయడు. తెలంగాణ ప్రజలు ఓ వైపు ఉద్యమం సాగిస్తుంటే గన్‌ పట్టుకొని తెలంగాణ వాదులను బెదిరించిన రేవంత్‌రెడ్డి లాంటి వారి నాయకత్వం తెలంగాణ ప్రజలకు శాపమౌతుంది. అసలు తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎలాంటి స్దానం లేదు. కాకపోతే అబద్దాలను పదే పదే చెప్పి నమ్మిస్తే అమాయక ప్రజలు కొన్ని సార్లు నమ్మి మోసపోయే అవకాశం వుంది. మంచి తొందరగా ఎవరికీ ఎక్కడు. చెడు తొందరగా చెవిని చేరుతుంది. అందుకే తెలంగాణను దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో కాంగ్రెస్‌ చెప్పే అబద్దాలను ప్రజలు నమ్మొద్దు. మళ్లీ మోసపోవద్దు. ఎందుకంటే వ్యవసాయం మళ్లీ మొదటికి తెస్తారు. కరంటు కోతలు సృష్టిస్తారు. రైతులను ఆగం చేస్తారు. రైతు బంధులో కోత పెట్టకుండా వుండలేరు. ప్రతిపక్షంలోవున్నప్పుడే కరంటు అంత అవసరం లేదని చెప్పిన వాళ్లకు అధికారమిస్తే మోటర్లుకు మీటర్లు పెట్టకుండా వదలరు. అందుకే ప్రజలు తప్పకుండా అప్రమత్తంగా వుండాలి. తెలంగాణ మళ్లీ చీకటి రోజులను చూడకుండా చూసుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ లాంటి నాయకుడు ప్రపంచంలోనే దొరకడు. అంత గొప్ప నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ ప్రజలు గోసపడుతుంటే కన్నీరు పెట్టుకున్ననాయకుడు కేసిఆర్‌. తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఎప్పుడూ కన్నీటిని జారవిడవకుండా బతకాలని తీర్చిదిద్దిన నాయకుడు కేసిఆర్‌. అలాంటి కేసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా వుంది. సుసంపన్నంగా ముందుకు సాగుతోంది. స్వయం సమృద్దిని సాధించింది. దేశ జిడిపిని మంచి ముందుకు దూసుకెళ్తోంది. చెడగొట్టే కాంగ్రెస్‌, బిజేపిలు కాచుకొని కూర్చున్నాయి. వాటి ఉచ్చులో పడొద్దు. తెలంగాణను చేజేతులా ఆగం చేసుకోవద్దు. ఇదే ప్రజలకు మనవి.

గంగులకు తిరుగు లేదు…బండి గెలిచేది లేదు!?

https://epaper.netidhatri.com/

`కరీంనగర్‌ వెలుగులు గంగులతోనే…

`ప్రగతికి కరీంనగర్‌ చిరునామా చేసింది గంగులనే.

`కరీంనగర్‌ ను సుందరవనం చేసింది గంగులనే…

`ఐటి టవర్‌ తెచ్చింది గంగులే…

`వేలాడే వంతెనతో అందాలు అద్దింది గంగులే..

`రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది గంగులే..

`ఆపన్నులను ఆదుకున్నది గంగులే…

`కరోనా కాలంలో ప్రాణాలు పోసింది గంగులే…

`బండి కనీసం జనంలో తిరిగింది లేదు…

`సమాజాన్ని చీల్చడం తప్ప స్నేహం పంచింది లేదు.

`పార్లమెంటుకు పంపిస్తే బండి నిధులు తెచ్చింది లేదు.

`కరీంనగర్‌ కు మేలు చేసింది లేదు.

`రాజకీయాలు తప్ప, గెలిపించిన ప్రజలకు మేలు చేసింది లేదు.

`ప్రజలకు అందుబాటులో వుండి ఆదుకున్నది లేదు.

`పార్టీకి పనికిరాని బండి..ప్రజలకు పనికొస్తాడా!?

`పార్టీ పక్కన పెట్టిన బండి…ప్రజలకు సేవ చేస్తాడా?

`కరీంనగర్‌ కు చేసిన మేలు ఒక్కటీ లేదు!

`బండి చేసింది గుండుసున్నా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కరీంనగర్‌ నియోకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్‌కు తిరుగులేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. గంగుల కమలాకర్‌ ముందు బిజేపి. అభ్యర్ధి బండి సంజయ్‌కు అంత బలం లేదు. ఎన్నికల్లో గెలిచేది లేదని అంటున్నారు. అయినా సరే కరీంనగర్‌ శాసనసభ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. ముగ్గురు ఒకే సామాజిక వర్గ నేతలు కావడం మరో విశేషం. అయితే వరుసగా మంత్రి గంగుల కమలాకర్‌ చేతిలో ఇప్పటికే బండి సంజయ్‌ రెండు సార్లు వరసగా ఓడిపోయాడు. ఇప్పుడు మూడోసారి ఓడిపోవడానికి సిద్దంగా వున్నడని అంటున్నారు. మొత్తం మీద బండి సంజయ్‌ మీద బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి గంగుల మూడోసారి కరీంనగర్‌ నుంచి పోటీ చేసి హాట్రిక్‌ సాధించనున్నాడని అంటున్నారు. అంతగా గంగుల కమలాకర్‌ కరీంనగర్‌ ప్రజల జీవితాలలో ఆయన రాజకీయ అనుబంధం పెనవేసుకుపోయింది. ముచ్చటగా మూడోసారి గంగుల మీద ఓడిపోవాలని సంజయ్‌కు రాసివుందంటున్నారు. నిజానికి బిజేపి అగ్రనేతలు తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. ముందు బండి సంజయ్‌ కూడా పోటీ చేయకపోవచ్చన్న వార్తలు వినిపించాయి. అయితే బండి సంజయ్‌ భయపడుతున్నాడన్న చర్చ జోరుగా సాగింది. దాంతో పారిపోయిండు అన్న అపవాదు కన్నా, పోరాడి ఓడిపోయిండన్న పేరు వుంటుందని ఎన్నికల బరిలో నిల్చున్నాడు. ఓడిపోతానని ఆయనకు కూడా తెలుసు. అంతే కాదు గత ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయిన బండి సంజయ్‌ అనూహ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో గెలిచాడు. ఇది ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పుతుందని అందరూ అనుకున్నారు. కాని అదే ఆయన రాజకీయ జీవితానికి చరమగీతం పాడుతుందని ఊహించలేదు. పార్లమెంటు సభ్యుడు అయిన కొద్ది కాలానికే బండి సంజయ్‌ తెలంగాణ బిజేపి శాఖకు అద్యక్షుడయ్యాడు. కరీంనగర్‌కు దూరమయ్యాడు. పాదయాత్రలు చేశాడు. కాని కరీంనగర్‌ ప్రజలను కలుసుకోలేకపోయాడు. తెలంగాణ అంతటా తిరిగాడు. కాని కరీంనగర్‌ గల్లీలు తిరిగి ప్రజలకు తోడుగా నిలవలేదు. తెలంగాణ రాజకీయాలలో కీలకమనుకున్నాడు. సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న వేళ పక్కన పెట్టేలా చేసుకున్నాడు. ఇదంతా ఆయన చేసుకున్న స్వయం కృతాపరధామే అని చెప్పాలి. ఇక పార్లమెంటు సభ్యుడినైనా బండి సంజయ్‌ కరీంనగర్‌కు ఏమైనా చేశాడా? అంటే చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు. చూపించుకుందామనుకున్నా ఒక్కటీ లేదు. రైల్లే ఫ్లైఓవర్‌ నేనే తెచ్చాను అంటూ ఇప్పుడు కొత్త కథలు చెబుతున్నాడు. కాని ఆ ప్రతిపాదన యూపిఏ హయాంలో జరిగింది. పొన్నం ప్రభాకర్‌ ఎంపిగా వున్న సమంయలో ప్రతిపాదన వుంది. తర్వాత వినోద్‌కుమార్‌ ఎంపిగా వున్నప్పుడు దానికి అడుగులుపడ్డాయి. అంతే గాని రైల్వే బ్రిడ్జ్‌ సాదనలో బండి సంజయ్‌ పాత్రలేదు. కాకపోతే ఆయన ఎంపిగా వున్న సమయంలో పరిపాలన అనుమతులు రావడం బండి సంజయ్‌ గొప్పదనం కాదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పినట్లు పరాయి వాళ్ల పిల్లలను తమ పిల్లలు అని చెప్పుకుంటారు. ఇక బండి సంజయ్‌ కోతలకు అంతూపొంతు వుండడం లేదు. అబద్దాలకు హద్దూ బద్దూ వుండడం లేదు. కరీంనగర్‌ ప్రజలు బండి సంజయ్‌ పార్లమెంటు సభ్యుడిగా ఒక్క రూపాయి తేలేదని ఆరోపిస్తుంటే, నేను రూ.8వేల కోట్ల రూపాయలు తెచ్చానని పచ్చి అబద్దాలు చెబితే ప్రజలు నమ్ముతారా? బండి సంజయ్‌ పార్లమెంటు సభ్యుడు అయిన కొద్ది కాలానికే కరోనా విపత్తుతో దేశమంతా అల్లకల్లోలమైంది. ప్రపంచమే తలకిందులైంది. ఇప్పటికీ ప్రపంచమేకోలుకోలేకపోతోంది. మరి బండి సంజయ్‌ రూ.8వేల కోట్లు తెచ్చి ఏం పనులు చేశాడా? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నాడు. నిజాలు చెప్పినా ప్రజలు వింటారు. గాని లేని పోని అబద్దాలు చెబితే ప్రజలు ఇక ఎప్పుడూ నమ్మరు. పార్లమెంటు సభ్యుడైన తర్వాత అన్ని నిధులు తెస్తే ఏనాడైనా మీడియా ముఖంగా వెల్లడిరచిన దాఖలాలున్నాయా? ఇలా ఎన్నికల వేళ బండి సంజయ్‌ అబద్దాల మీద అబద్దాలు చెబుతుంటే ప్రజలు ఎక్కడిక్కడ నిలదీశారు. దాంతో తెలంగాణలో జరిగిన అభివృద్ది అంతా కేంద్రమే ఇస్తుందని మాట మార్చారు. లింకు రోడ్లంటాడు. రేషన్‌ బియ్యం కేంద్రానివే అంటాడు. తెలంగాణలో రేషన్‌కార్డులు కొత్తవి ఇవ్వడం లేదంటాడు. రేషన్‌కార్డుల జారీ అనేది కేంద్రం పరిధిలో వుండేదన్న సోయి కూడా లేకుండా మాట్లాడుతుంటాడు. వైకుంఠ దామాల నిర్మాణం కేంద్రం సొమ్మే అంటాడు. రైతు వేధికలు కేంద్రం డబ్బులే అంటాడు. మరి కరీంనగర్‌కు ఏం తెచ్చావంటే అందులో నుంచే కరీంనగర్‌కు పైకమొచ్చిందని చెబుతున్నాడు. దాంతో బండి సంజయ్‌ మాటలను విని ప్రజలు నవ్వుకుంటున్నారు.
పార్టీకే బండి సంజయ్‌ పనితీరు నచ్చలేదు.
ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వంలో గిచ్చి కయ్యం పెట్టుకోవడంతోపాటు, సమాజంలో చిచ్చు పెట్టే ప్రకటనలు చేయడాన్ని కేంద్రం సహించలేదు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఇలా మాట్లాడే పార్టీ నుంచి సాగనంపేలా చేసుకున్నాడు. ప్రతి సందర్భంలోనూ హిందూ ముస్లింల ప్రస్తావన, శవం, శివం అంటూ చెప్పిన లెక్కలు తెలంగాణ సమాజానికి నచ్చలేదు. బిజేపి నాయకులకే బండి సంజయ్‌ మాటలు ఒప్పుకోలేదు. బండి సంజయ్‌ వల్లపార్టీకి ఈమాత్రం వున్న ఇమేజ్‌ కూడా తెలంగాణలో పోయే ప్రమదముందని తేల్చి చెప్పారు. బండిని దించేశారు. నిజానికి ఏపార్టీ అయినా ఎన్నికల ముందు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మార్చే ప్రయత్నం చేయదు. కాని బండి సంజయ్‌ వల్ల రాష్ట్రం రాజకీయాలు కలుషితమౌతాయని ఆ పార్టీ గ్రహించింది. ఆయనను పక్కనపెట్టింది. అయినా ఆయనలో మార్పు కనిపించడం లేదు. ఎన్నికల సమయంలో ఆయన చేస్తున్న విపరీత వ్యాఖ్యలు జనానికి నచ్చడం లేదు. కరీంనగర్‌ యువత గంజాయి మత్తులో తూగుతున్నారంటూ బండి చేస్తున్న వ్యాఖ్యలు మొదటికే మోసం వచ్చేలా వున్నాయి. ఓ వైపు ఆయనపైనే తంబాకు అన్న అపవాదు వుంది. అలాంటి బండి సంజయ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. అంతే కాకుండా బాధ్యత కల్గిన ఎంపి తన ఇలాఖాలో గంజాయి అమ్మకాలు సాగుతుంటే ఇంత కాలం ఏం చేసినట్లు? స్వయంగా ఆయన కూడా పట్టింపజేయొచ్చు. పోలీసులకు సమచారమందించి వారిని పట్టుకునేలా చేయొచ్చు. కాని ఇప్పటి వరకు ఏనాడు అలాంటి విషయాలు చెప్పకుండా, కరీంనగర్‌ యువతను మత్తుకు బానిసలు అని అనడం వారి మనోభావాలను దెబ్బతీయడం కాదా? వారి ఆత్మగౌరవానికి చేటు కాదా? ముందూ వెనుక ఆలోచించకుండా మాట్లాడడం బండికి అలావాటు. అబాసుపాలు కావడం బండికికొత్త కాదు.
కరీంనగర్‌ అభివృద్ది విషయంలో గంగుల కమలాకర్‌ చూపిన చొరవ అంతా అంతా ఇంతా కాదు.
వరసుగా 2009, 2014,2018 ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. హాట్రిక్‌విజయాన్ని అందుకున్నారు. బండి సంజయ్‌ను ఇప్పటికే రెండు సార్లు ఓడిరచాడు. మూడోసారి కూడా బండి మీద గెలిచి అలా కూడా హాట్రిక్‌ కొట్టాలని గంగుల కమలాకర్‌ చూస్తున్నాడు. మంత్రిగా కరీంనగర్‌ అభివృద్దికి గంగుల ఎంతో కృషి చేశారు. ఆయన ఎమ్మెల్యేగా కరీంనగర్‌ అభివృద్దిలో తనదైన ముద్ర వేస్తూనే వస్తున్నారు. మంత్రిగా అంతకు రెట్టింపు ప్రగతిని కరీంనగర్‌లో చూపించారు. కరీంనగర్‌ను అందమైన నరగరంగా తీర్చిదిద్దారు. మానేరు డ్యాం ముందు నగరంలోనే సుందరమైన వనం ఏర్పాటు చేశాడు. కరీంనగర్‌కు కొత్త అందాలను తెచ్చాడు. ప్రకృతి రమణీయతను పెంచాడు. పచ్చదనం వెల్లివిరిసేలా చేశాడు. కరీంనగర్‌కు వేలాడే వంతెన తెచ్చి, కరీంనగర్‌కే కొత్త అందాలు అద్దిన ఘణన సాధించాడు. ఐటి టవర్‌ తెచ్చి, కరీంనగర్‌ యువతకు స్దానికంగానే ఉద్యోగ, ఉపాధి కల్పనతో వారి జీవితాలలో వెలుగులు నింపాడు. ఆపన్నులను ఆదుకోవడంలో గంగుల ముందుంటారు. కరోనా కాలంలో కరీంనగర్‌ ప్రజలకు ఎనలేని సేవ చేశాడు. కరోనా బారిన పడిన ప్రజలకు ఇతోదిక సాయం చేశాడు. వారికి వైద్యం అందించాడు. కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడాడు. అలా కరీంనగర్‌ ప్రజలకు సేవలందించిన గంగులను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలిపించుకుంటామని చెబుతున్నారు.

కాంగ్రెస్‌కు మూడోసారి భంగపాటు తప్పదు

`కాంగ్రెస్‌ కు మిగిలేవి పగటి కలలే

`కాంగ్రెస్‌ వన్నీ కోతలే! హస్తమంతా రిక్తమే!!

`రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్‌ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చిట్‌ చాట్‌..ఆయన మాటల్లోనే…

`కర్నాటక పేరు చెప్పి పబ్బం గడుపుకోవడమే!

`బిఆర్‌ఎస్‌ పథకాలే కాంగ్రెస్‌ కాపీ!

`నిన్నటి దాకా అప్పుల రాష్ట్రం అన్నారు.

`ఇప్పుడు నోటికొచ్చిన హామీలిస్తున్నారు.

`ప్రజలు నమ్మరని కాంగ్రెస్‌ కు తెలుసు.

`గెలిచేది లేదన్నది నాయకులకు తెలుసు.

`టిక్కెట్ల పేరుతో సొమ్ము చేసుకోవడం తప్ప ఏమీ వుండదు.

`బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ ఖాయం.

`తెలంగాణలో అమలౌతున్న పథకాలకు ఎదురులేదు.

`ప్రజా సంక్షేమం కేసిఆర్‌ కు తెలిసినంత మరెవరికీ తెలియదు.

`జనం నమ్మడానికి కాంగ్రెస్‌ లో నాయకులే లేరు.

`ఓటుకు నోటు దొంగను నమ్మి ఓట్లేయరు.

` కాంగ్రెస్‌ కు అధికార యావ తప్ప, తెలంగాణ మీద ప్రేమే లేదు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ పార్టీని చూస్తే జాలేస్తోంది. రేవంత్‌ ను నమ్ముకున్న కాంగ్రెస్‌ కు దక్కేది రెవడే..మిగిలేవి పగటి కలలే. తెలంగాణ ఆత్మాభిమానంపై కాంగ్రెస్‌ ఏనాడో దెబ్బ కొట్టింది. ఇచ్చింది మేమే అంటున్న కాంగ్రెస్సే తెలంగాణ ను ముంచింది. తెలంగాణ ఉద్యమానికి కనీసం సంబంధం లేని వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిని చేసుకొని అధికారంలోకి వస్తామనుకోవడం అంటేనే ఆ పార్టీ నిజ స్వరూపం అర్థమౌతోంది. అంతే కాదు ఇక్కడ తెలంగాణ ప్రజలకు కొన్ని సత్యాలు తెలియాల్సి వుంది. 2014 ఎన్నికలలో ఆంద్రప్రదేశ్‌ లో ప్రచారం చేసిన రాహుల్‌ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటనలు చేశారు. తెలంగాణకొచ్చి రాష్ట్రం ఇచ్చాం కాబట్టి కృతజ్ఞత తీర్చుకోండి అన్నట్లు మాట్లాడాడు. అంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతోనే మా పని అయిపొయింది. తెలంగాణ కు ఏమీ ఇవ్వాల్సిన పని లేదని తేల్చేసిన కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మడం అన్నది ఇక ఎప్పుడూ జరగదు. ఆంద్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినప్పుడు తెలంగాణ ఏం పాపం చేసింది? తెలంగాణ కు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని ఎందుకు చెప్పలేదు? ఇప్పటికీ కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మరు క్షణం ప్రత్యేక హోదా ఇస్తామనే కాంగ్రెస్‌ చెబుతోంది. అసలు అరవై ఏళ్లపాటు గోస పడిరదే తెలంగాణ. బాగుపడిరదే ఆంద్రప్రదేశ్‌. తెలంగాణ వస్తే అంధకారమౌతుంది. అడుక్కుతినే పరిస్థితి వస్తుంది. మేం లేకుండా ఒక్క రోజు కూడా బతకలేరు. అసలు తెలంగాణ నాయకులకు పాలన చేయడం కూడా రాదు. తొండలు గుడ్లు పెట్టేందుకు కూడా పనికి రాని తెలంగాణ భూములని ఎగతాళి చేశారు. తెలంగాణ కు అన్నం పెడుతున్నదే మేమన్నారు. విడిపోయి తెలంగాణ నష్టపోకూడదనే చెబుతున్నామని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఇప్పుడేమో విడిపోయి నష్టపోయామంటున్నారు. వాళ్ల మాటలు నమ్మి ఆంద్రాకు ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచించలేని కాంగ్రెస్‌ ను ప్రజలు నమ్మతారని ఎలా అనుకుంటున్నారు. పగటి కలలు ఎందుకు కంటున్నారు. ముందు తెలంగాణ ను ప్రేమించడం కాంగ్రెస్‌ నేతలు నేర్చుకోవాలొలి. కేవలం అదికార యావ తప్ప తెలంగాణ మీద కాంగ్రెస్‌ కు ఎలాంటి మమకారం లేదు. తెలంగాణ ఇచ్చామన్న కృతజ్ఞత తీర్చుకోవాలన్న అహంకారంతో కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నారు. అంతే కాదు తెలంగాణ లో కాంగ్రెస్‌ కు అధికారం ఇవ్వకుంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మరు క్షణం రెండు రాష్ట్రాలు కలుపుతామని కాంగ్రెస్‌ నాయకులు అన్న మాటలు ప్రజలు అప్పుడే మర్చిపోలేదు. కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మితే నిండా మునిగినట్లే అన్న సంగతి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అందుకే పదేళ్లయినా ప్రజలు కాంగ్రెస్‌ ను నమ్మేందుకు సిద్దంగా లేదు. కాంగ్రెస్‌ పథకాల ప్రచారం అంతా పెద్ద డ్రామా… అంటున్న రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్‌ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో కాంగ్రెస్‌ మోసాలు ఎలా వుంటాయో వివరించారు… ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
తెలంగాణ లో అధికారంలోకి రావాలన్న తపన మాత్రమే కనిపిస్తోంది.
తెలంగాణ వచ్చిన తర్వాత రేవంత్‌ రెడ్డి ఓ సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్‌ లో అధికారంలోకి రావడం కోసం 2014 లో చంద్రబాబు చెప్పివన్నీ అబద్దాలే అన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో అబద్దాలు చెప్పి నమ్మించడం తప్ప ప్రజలను నిజాలతో నమ్మించలేమని స్వయంగా రేవంత్‌ రెడ్డే అన్నారు. కావాలంటే ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో రేవంత్‌ రెడ్డి చెప్పిన వీడియో వుంది. అందుకే ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న కోరిక కాంగ్రెస్‌ కన్నా రేవంత్‌ కు ఎక్కువ ఆశగా వుంది. అసలు తెలంగాణ లో ప్రజలు కాంగ్రెస్‌ నే నమ్మడం లేదు. అలాంటిది రేవంత్‌ ను నమ్మి ఓట్లు వేయడం అన్నది కల. కలగంటే కూడా తీరని కోరిక. గత ఏడాది క్రితం వరకు కాంగ్రెస్‌ లో వున్న వాళ్లే కాంగ్రెస్‌ పని అయిపోయింది అని చెప్పిన సందర్భం వుంది. కేవలం కర్నాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్‌ ఊపుకొచ్చిందన్న ఊహల్లో విహరిస్తున్నారు. అసలు విషయం దాచి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. కర్నాటక లో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయి పదిహేను సంవత్సరాలౌతుంది. రెండు సార్లు బిజేపి స్వంత మెజారిటీతో కర్నాటక లో అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ జేడీఎస్‌ కూడమి మెజారిటీ సీట్లు సాధించింది. కానీ బిజేపి కాంగ్రెస్‌ ను చీల్చి మూడోసారి అధికారంలోకి రావడం జరిగింది. పైగా బిజేపి పార్టీ పైకి చెప్పేదొకటి చేసేది ఒకటి అని ప్రజలకు తెలిసిపోయింది. దాంతో గత ఎన్నికలలో కాంగ్రెస్‌ ను మోసం చేయడంతో పాటు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు బాగా ప్రభావం చూపాయి. బిజేపి కర్నాటక ఆత్మ గౌరవంతో ఆడుకున్నది. ఎలాగైనా గుజరాత్‌ కు అమూల్‌ పెరుగును కర్నాటక ప్రజల మీద రుద్దాలనుకున్నారు. కర్నాటక లో పేరు మోసిన పెరుగు కంపనీని అమూల్‌ లో విలీనం చేయాలనుకున్నారు. దానికి తోడు పెరుగు పేర కన్నడం లో కాకుండా కేవలం హిందీలో రాయాలని కేంద్రం నిర్ణయం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పెరుగు ప్యాకెట్ల మీద హిందీ బాషను మాత్రమే ప్రింట్‌ చేయాలని ఒత్తిడి ని దేశ ప్రజలతో పాటు కర్నాటక ప్రజలు కూడా తిరస్కరించారు. బలవంతంగా హిందిని దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దడమే అవుతుందని కర్నాటక బిజేపి మీద కన్నెర్ర చేసింది. బిజేపిని కాదని, కాంగ్రెస్‌ కు కర్నాటక ప్రజలు అధికారం కట్టబెట్టారు. అయితే కాంగ్రెస్‌ కొన్ని అలవికానీ హామీలను గుప్పించడం కూడా సీట్లు పెరగడానికి కారణమైంది. అంతే తప్ప కాంగ్రెస్‌ ప్రకటించిన పథకాలే కర్నాటక లో అధికారం సిద్దించలేదు. కర్నాటక లో బిజేపి ఓటమికి ఇన్ని కారణాలున్నాయి. పైగా బిజేపి మళ్ళీ అధికారంలోకి తెచ్చినా తనకు పెద్ద ప్రాధాన్యత లభించకపోవచ్చని యడ్యూరప్ప సైలెంట్‌ గా వుండడం కూడా బిజేపి కి మైనస్‌ అయ్యింది. కాంగ్రెస్‌ కు అది కూడా కొంత కలిసి వచ్చింది. ఇదీ అసలు ముచ్చట.
కాంగ్రెస్‌ వన్నీ కోతలే! కాంగ్రెస్‌ చెప్పే విషయాలు నమ్మశక్యమైనవి కాదు.
గతంలో ఇలాంటి పథకాలు అమలు చేసింది లేదు. కాంగ్రెస్‌ పార్టీ అంటే జాతీయ పార్టీ. ఆ పార్టీలో ఏదైనా ఒక విధానం తీసుకుంటే అది అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలి. తెలంగాణ తో పాటు త్వరలో ఎన్నికలు జరగబోతున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాలలో కూడా ఇదే మేనిఫెస్టో అమలు చేస్తారా? అన్నది చెప్పాలి. ఇప్పటికే అధికారంలో వున్న చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ లలో ఈ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదు. తెలంగాణలో అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటున్నారు. అధికారంలో వున్న రాష్ట్రాలలో అమలు చేయకుండా ఎందుకున్నారు.
హస్తమంతా రిక్తమే!! అంతే అంతా ఉత్తదే. కర్నాటక పేరు చెప్పి పబ్బం గడుపుకోవడమే!
కర్నాటక లో ప్రకటించిన ఏ ఒక్కటి ఇంకా అమలుకు నోచుకోలేదు. కర్నాటక లో అధికారంలోకి వచ్చి ఇంత కాలమైనా అక్కడ సిలిండర్‌ రూ. 500కు సిలిండర్‌ ఇచ్చింది లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రకటిస్తున్న హెల్త్‌ స్కీమ్‌ లేదు. ఇందిరమ్మ ఇండ్లు కర్నాటక లో లేదు. జాగాలున్న వారికి రూ. 5 లక్షల పథకం లేనే లేదు. రైతులకు రైతుబందు లేదు. కళ్యాణ లక్ష్మి లేదు. కానీ తెలంగాణ లో మాత్రమే ఇస్తారట. నిన్నటి దాకా తెలంగాణ అప్పుల రాష్ట్రం అన్నారు. జీతాలకే పైసలు లేవన్నారు. ఇవన్నీ ఎలా అమలు చేస్తారు. రాజకీయ పార్టీ అన్న తర్వాత నిజాయితీ వుండాలి. ఇంత కాలం తెలంగాణ సంపన్న రాష్ట్రం అని ఒక్కసారైనా అని వుంటే బాగుండేది. పూరి గుడిసెలో ఏసి ఫిట్‌ చేస్తామని చెబితే ఎవరైనా నమ్ముతారా? కాంగ్రెస్‌ చెప్పింది అలాగే వుంది. తెలంగాణ లో ఆదాయం అప్పలకే సరిపోతుందన్న వాళ్లు సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటే జనం నమ్ముతారా?
బిఆర్‌ఎస్‌ పథకాలే కాంగ్రెస్‌ కాపీ! కాంగ్రెస్‌ పార్టీ ప్రకటిస్తున్న పథకాలు నిశితంగా పరిశీలిస్తే కొత్తగా వాళ్లు చెబుతున్నది ఏమీ లేదు?
ఎందుకంటే వాళ్లు వచ్చేది లేదు. ఇచ్చేది లేదు. అందుకే నోటికొచ్చిన హామీలిస్తున్నారు.ప్రజలు నమ్మరని కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు బాగా తెలుసు. గెలిచేది లేదన్నది సీనియర్‌ నేతలందరికీ నాయకులకు తెలుసు. ఓ వైపు టిక్కెట్లు అమ్ముకుంటున్నారన్న వార్తలు నిత్యం వినిపిస్తున్నవే. కేవలం డబ్బులు వున్న వారికే టిక్కెట్లు ఇస్తున్నారని చెప్పుకుంటున్న మాటలే. టిక్కెట్ల పేరుతో రేవంత్‌ రెడ్డి సొమ్ము చేసుకోవడం తప్ప ఏమీ వుండదు. ఇది తెలిసే సీనియర్లు గుర్రుగా వున్నారు. పైగా బైట నుంచి ఎవరొస్తారా? టిక్కెట్లు అమ్ముకుందామా? దుకాణం నడుస్తోంది. బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ ఖాయం. ముచ్చట మూడో సారి కేసిఆర్‌ ముఖ్యమంత్రి కావడం తధ్యం. తెలంగాణలో అమలౌతున్న పథకాలకు ఎదురులేదు.ప్రజా సంక్షేమం కేసిఆర్‌ కు తెలిసినంత మరెవరికీ తెలియదు. జనం నమ్మడానికి కాంగ్రెస్‌ లో నాయకులే లేరు. ఓటుకు నోటు దొంగను నమ్మి ఓట్లేయరు. మూడోసారి భంగపాటు తప్పదు. కాంగ్రెస్‌ కు అధికార యావ తప్ప, తెలంగాణ మీద ప్రేమే లేదు. కేవలం తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్‌ లో చేరిన రేవంత్‌ రెడ్డి ని కాంగ్రెస్‌ పార్టీ నాయకులే నమ్మడం లేదు. తెలంగాణ కోసం ప్రజలు ముఖ్యమంత్రి కేసిఆర్‌ తో కలిసి పద్నాలుగేళ్లు కొట్లాడి సాధిస్తే, తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలని చూసిన రేవంత్‌ ను కాంగ్రెస్‌ నేతలు నమ్మినా ప్రజలు జీవితంలో నమ్మరు. రేవంత్‌ రెడ్డి వున్న కాంగ్రెస్‌ కు ఓటు కూడా వేయరు. రేవంత్‌ సృష్టిస్తున్న అబద్దాల మాయా మశ్చీంద్రను జనం అసలే నమ్మరు. తన సొంత నియోజకవర్గ ప్రజలే తెలంగాణ విషయంలో రేవంత్‌ చేసిన పాడు పనికి చీ కొట్టి ఓడిరచారు. ఇక తెలంగాణ ప్రజలు నమ్మడం అనే కల్ల. కాంగ్రెస్‌ పథకాలన్నీ డొల్ల.

విముక్తి విధాత…ప్రగతి ప్రధాత!

https://epaper.netidhatri.com/

` అరవై ఏళ్ల అమావాస్య చీకటిని పారద్రోలాడు.

` తెలంగాణ కు వెలుగులు పంచిన సూర్యుడు.

 

`సమైక్య పాలకులు ఎడారి చేస్తే, తెలంగాణ తెచ్చి సస్యశ్యామలం చేశాడు.

`పచ్చదనం లేని తెలంగాణను వన రాష్ట్రం చేశాడు.

` తెలంగాణను హరితహారంతో పచ్చని పందిరి చేశాడు.

`తొండల గుడ్లు తప్ప పంటలా? అన్న చోటును మాగాణం చేశాడు.

`తెలంగాణ కు నీళ్లు తెచ్చి పాడి పంటల సిరులు కురిపించాడు.

`నిత్యం చీకట్లలో గడిపిన తెలంగాణ కు కరంటు జిలుగులు తెచ్చాడు.

`పగలంతా, రేయంతా వెలుగులు నింపాడు.

`రైతుకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరంటు ఇస్తున్నాడు.

`ఆసరా ఫెన్షన్లతో పెద్దకొడుకయ్యాడు.

`కళ్యాణ లక్ష్మి తో మామయ్యగా మారాడు.

`తెలంగాణ తెచ్చి తెలంగాణ పితగా కీర్తి నందుకున్నారు.

`మా సారు అని వేనోళ్ల కొనియాడబడుతున్నాడు.

` కేసిఆర్‌ చేతిలోనే తెలంగాణ పదిలమని ప్రజలు నమ్ముతున్నారు.

`మరో సారి కూడా మన సారునే గెలిపించుకుంటామంటున్నారు.

`సారు సర్కారే కావాలనుకుంటున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

చీకటోళ్ల లోకంలో కొత్త పొద్దు పొడుపురా! అమావాస్య చీకటిలో దీపావళి జాతరా!! అంటూ ఓ కవి రాసిన జీవనచిత్రం సరిగ్గా తెలంగాణ పడిన గోసను తెలియజేస్తుంది. అయితే తెలంగాణకు చీకట్లు సహజంగా రాలేదు. తెలంగాణ చీకటోళ్ల లోకం ఒట్టిగనే కాలేదు. పరాయి పాలకులు పగబట్టి చేశారు. తెలంగాణ జీవితాలను చీకటి చేశారు. బతుకులు ఆగంచేశారు. ఒకనాడు ఎటు చూసినా ఏమున్నది నా తెలంగాణ. ఊర్లన్నీ వలసపోయి, ఇళ్లన్నీ కూలిపోయి, చేతివృత్తులు మాయమైపోయి, దిక్కులేని బతుకుల కాలం చూసి గొడగొడ ఏడ్చిన తెలంగాణ. ఎటు చూసినా బీడువారి నోర్లు తెరిచి నీటి చుక్క కోసం ఎదురుచూసిన తెలంగాణ. దుబ్బలుగా మారి, పంటలకు పనికి రాకుండాపోయిన తెలంగాణ. ఏ చెలక చూసినా ఎడారే…ఏ చెరువు చూసినా మొలిచిన తుమ్మలే…పల్లెల్లో నీటి కటకటలే… సగటు తెలంగాణ వాది కడుపు రగిలినా, ఆకలి ముందు కోపం దిగమింగుకొని బతికిన రోజులవి. నేడు నీటి జాడలకు కొత్త నడకలు నేర్పిన తెలంగాణ. నీటి పరవళ్ల తెలంగాణ. పంటల పరవశంలో తెలంగాణ. కరువు పారిపోయిన తెలంగాణ. బీడుకానరాని తెలంగాణ. చెరువులు బాగు పడ్డ తెలంగాణ. చెరువులు గంగాళాలైన తెలంగాణ. కాళేశ్వరం నీరు కాలువల్లో పరుగులు పెడుతున్న తెలంగాణ. సాగు సస్యశ్యామల తెలంగాణ. పడావు బడ్డ భూముల్లో పుష్కలమైన పంటల తెలంగాణ. పల్లె మురుస్తున్న తెలంగాణ. పచ్చదనం వెల్లివిరిసిన తెలంగాణ. అరవైఏళ్ల గోసను తెలంగాణ పొలిమేరలకు తరిమిన తెలంగాణ. సంక్షేమ తెలంగాణ. సాధికారిత సాధించిన తెలంగాణ. చేతి వృత్తులకు మళ్లీ జీవమైన తెలంగాణ. పల్లెబతుకుల్లో వెలుగులు నిండిన తెలంగాణ. పల్లె మరుస్తున్న తెలంగాణ. పట్నం ప్రగతి తెలంగాణ. పల్లెల్లో వెలుగుల తెలంగాణ. వేకువలో వెండి వెన్నెల తెలంగాణ. ప్రగతి తెలంగాణ. బంగారు తెలంగాణ. పదేళ్లలో దార్శనికుడు కేసిఆర్‌ ఆవిష్కరించిన బంగారు తెలంగాణ. బాగు పడిన తెలంగాణ. బంగారు మాగాణం నా తెలంగాణ. పాడ పంటల తెలంగాణ. పచ్చదనంతో మురుస్తున్న తెలంగాణ.

సమైక్య పాలకుల దాష్టికానికి కకావికలమైన తెలంగాణ కేసిఆర్‌ రూపంలో తిరిగి వెలుగులు నింపుకున్నది.

ఆగమైన చెరువులు నీళ్లునింపుకున్నవి. . ఆనవాలు లేకుండాపోయిన చెరువులు గంగాళాలైనవి. రూపు చెదిరిపోయిన పల్లెలు పండగ చేసుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పరాయి బతుకులైన తెలంగాణ జీవితాలు ఆత్మ గౌరవాన్ని నిలుపుకున్నాయి. పరాయి పాలనలో బిక్కుబిక్కు జీవితాలు వెలుగులు నింపుకున్నాయి. మన రాష్ట్ర్రం మన తెలంగాణ అని తలెత్తుకున్నాయి. నాడు విద్య లేదు.విలువ లేదు. నేడు తెలంగాణ వ్యాప్తంగా 1000 గురుకులాలు. నాడు ఉపాధి లేదు. నేడు తెలంగాణ యువతుక ఐటి కొలువులు. నాడు పంటలకు దిక్కులేదు. నేడు కరువుకు తెలంగాణలో చోటు లేదు. నాడు ఆకలి తీరింది లేదు. నేడు దేశానికి అన్నం పెడుతున్నాం. నాడు కరువు కాటుకు బతికింది లేదు. నేడు కరువునే కాటేసేంత అన్నపూర్ణ అయ్యింది. నాడు కొట్లాడినా లాభం లేదు. పల్లెల్లో ఎండుటాకుల అలజడి…పట్టణాల్లో కానరాని ప్రగతి. ఇదీ నాటి తెలంగాణ దుస్దితి. సమైక్య పాలనలో తెలంగాణ పల్లెల్లో కరంటు లేక, రాక, సాగుకు ఎప్పుడొస్తుందో తెలియక, ఎండుతున్న పంటలను చూసిన విలవిలలాడిన తెలంగాణ.
ఉమ్మడి పాలకుల చీకటి నుంచి తెలంగాణ విముక్తి చెందింది.
కేసిఆర్‌ పట్టుదల ముందు, పంతం ముందు, ఆత్మగౌరవ నినాదం ముందు ముందు, ఉద్యమం ముందు, పోరాటం తట్టుకోలేక సమైక్య పాలన విరగడైంది. తెలంగాణ రాష్ట్రం సిద్దించింది. పారే ఏరు ఎండిపోయి వెక్కిరిస్తుంటే తెలంగాణ గుండె పగిలిపోయింది. ఒట్టిపోయి వాగు చుక్క నీరు మోసుకుపోలేక పోతే కేసిఆర్‌ కంట తడినుంచి కన్నీరొలికింది. ఆ క్షణం జై తెలంగాణ అని ఆ కన్నీరు నినదించింది. కేసిఆర్‌ గొంతులో నుంచి ప్రపంచానికి వినిపించింది. కేసిఆర్‌ కంటి నుంచి జారి పడిన కన్నీటి చుక్క పోరాటం మొదలు పెట్టింది.

ఆ చుక్కే తెలంగాణ భూమిని తడిపేందుకు మొదటి చినుకైంది.

ఆ నాడు ఎత్తిన పిడికిలి కేసిఆర్‌ తెలంగాణ తెచ్చేదాకా విప్పలేదు. ఎత్తిన జెండా దించలేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా చలించలేదు. బెదిరింపులకు అదరలేదు. కేసులకు బెదరలేదు. ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. తెలంగాణ సాదనే జీవిత పరమావధి చేసుకున్నాడు. తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చి వీరుడయ్యాడు. తెలంగాణ తల రాత మార్చిన విధాతయ్యాడు. పట్టిన పట్టు విడవకుండా, ఒక్కడుగా మొదలై, ఒక్కటే అడుగై, ఒకరినొకరు ఆయనలో అడుగులో అడుగై, లక్షల మంది కేసిఆర్‌లను తయారు చేసిండు. పద్నాలుగేళ్ల నిరంతర పోటారం చేశాడు. రక్తపు చుక్క చిందించకుండా తెలంగాణ సాధించాడు. అరవై ఏళ్ల తెలంగాణ కల నెరవేర్చాడు. తెచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ చేశాడు. సాగుకు ఇరవైనాలుగు గంటల కరంటు ఇచ్చి రైతన్నను రాజునే చేశాడు. నా తెలంగాణ కోటిన్నర సాగు మాగాణ చేశాడు. మిషన్‌ కాకతీయతో 46వేల చెరువులకు మళ్లీ జీవం పోశాడు. కాకతీయుల కాలం కళ్ల ముందుకు తెచ్చాడు. చెరువులన్నీ నిండగ, ఎండాకాలంలో మత్తళ్లు దుంకంగ, వాగులు ఒర్రెలు గోదారి జలాలు పారంగ, జలజలగలగలలు కళ్ల ముందు కదలాడంగా తెలంగాణ నిజప్రపంచమైంది. సంక్షేమంలో మేటిగా అడుగులేస్తోంది. ప్రగతిలో పరుగులు పెడుతోంది.

ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కారమైంది.

మిషన్‌ భగీరధతో తెలంగాణ పల్లెల్లోకి గోదారి పరవళ్లు పరుగులు తీసి, ఆడ పడుచుల కాళ్లు కడుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ చరిత్రను పదిలం చేసి, పది కాలాలపాటు తెలంగాణకు నీటి గోస తీరింది. సస్యశ్యామల తెలంగాణలో బంగారు సిరులు పండుతున్నాయి. స్వపరిపాలనతో ఆత్మ గౌరవం వెల్లివిరిస్తోంది. నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించిన వారు కూడా అబ్బుర పడేలా తెలంగాణ తలెత్తుకొని నిలబడిరది. పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలు. పల్లె వికాసమే దేశ వికామని నాయకులు నమ్మితే చాలు…పల్లె సింగారించుకుంటుంది. పచ్చదనంతో సిరులారబోసుకుంటుంది. పసిడి పంటలకు నెలవౌతుంది. పాడి పంటలకు కొదువ లేకుండాపోతుంది. దేశానికి అన్నం పెట్టే ధైర్యం రైతన్నలో కనిపిస్తుంది. వారి మోములో ఎప్పుడూ చిరునవ్వు తొనికిసలాడుతుంది. సాగు అనగానే పులకించేంది…తరించేది రైతే…ఆ రైతు మేలు కోరిన రాజ్యాలు కళకళలాడాయి.
పల్లె కష్టం, పాడి కష్టం, ఆకలి వేధనలు, ఆక్రందనలు తెలిసిన నాయకుడు పాలకుడైతే కరువు పారిపోతుంది.
కష్టం పొలిమేర దాటి రావాలంటే భయపడుతుంది. సంతోషం ఇంటింటా వెల్లివిరిస్తుంది. అది మన తెలంగాణలా వుంటుంది. పల్లె శోభితమై మురుస్తోంది. పంటల రాశులు చూసి పరవశిస్తుంది. పారుతున్న నీళ్లు, పచ్చని చేలు, సంబురపడుతుంది. పాడి పంటలతో తెలంగాణ కళకళలాడుతోంది. తన కన్నీటి పొరల్లో నాలుగు దశాబ్దాల పాటు దాచుకున్న తెలంగాణ స్వప్నం నిజంచేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌, సువర్ణ పాలనతో స్వర్ణయుగం తెచ్చాడు. బీడు వారిన భూములను సస్యశ్యామం చేశాడు. తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేసిన భూములకు కోట్ల ధరలు పలికేలా చేశాడు. అటు సాగు, ఇటు నీరు, కరంటు, ఉపాధి, సంక్షేమ, ప్రగతి రంగాలన్నీ ఏకకాలంలోనే సాక్ష్యాత్కరించాడు. ఒక్క తెలంగాణలోనే…పచ్చని ప్రకృతిలో తెలంగాణ పుడమి పులకించుతోందిజ తెలంగాణ జాతి సగర్వంగా బతుకుతన్నది. కేసిఆర్‌ చేతుల్లోనే తెలంగాణ పదిలంగా వుంటానని పాఠం నేర్పిస్తోంది.

ఎదురులేని నాయకత్వం. తిరుగులేని ప్రభంజనం.

https://epaper.netidhatri.com/

`లక్షన్నర మెజారిటీ దిశగా…

`పేదల గుండెలకు దగ్గరగా…

`ప్రతి కుటుంబానికి తోడుగా…

`ఆపదలో వున్న వారికి అండగా…

`ప్రతి వ్యక్తికి తోడుగా…

`తానే పెద్ద దిక్కుగా…

`అందరికీ భరోసాగా…

`ఆపన్నులకు చేయూతగా…

`రైతన్న మోములో చిరునవ్వుగా…

`పచ్చని పొలాలో సిరి వెలుగులా…

`పల్లెల్లో వెండి వెలుగులా…

`ప్రతి గుండెలో ఆరని తడిగా…

` ‘‘హరీష్‌ అన్న’’..పదమే ఒక ధైర్యం గా…

హైదరాబాద్‌,నేటిధాత్రి:
నాయకుడికి ప్రజలంటే ప్రేమ కావాలి. ప్రజల మీద మమకారం వుండాలి. అవి రెండు నిండుగా వున్న మనసున్న నాయకుడు మంత్రి హరీష్‌రావు. ఎదురులేని రాజకీయం. బెదురులేని ఉద్యమ ప్రాస్దనం…తెగించి పోరాడే తత్వం…నిరంతరం అభివృద్ది మంత్రం…సిద్దిపేటలను తీర్చిదిద్దిన వైనం…హరీష్‌రావు మార్క్‌ ప్రగతి ప్రయాణం..తెలంగాణకే తలమానికం…నాయకులకు ఆదర్శం…ప్రజలకు ఎంతో సంతోషం. ఈ రోజ సిద్దిపేట ఇంత అందంగా ముస్తాబైందంటే కారణం మంత్రి హరీష్‌రావు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసిఆరే సిద్దిపేటను నేను కూడా ఇంత అభివృద్ది చేయకయపోదునేమో! అన్నారంటే హరీష్‌రావు చిత్తశుద్ది ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. తన ప్రాంతం మీద ఆయనకు వున్న ఇష్టం, అభిమానం సిద్దిపేటను సుందరవనంగా తీర్చిదిద్దేలా చేసింది. సిద్దిపేటలో అడుగడుగునా హరీష్‌రావు మార్కు అభివృద్ది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈసారి ఎన్నికల్లో మెజార్టీ ఎంత అన్నదానిపై ప్రజల్లో రకరకాల చర్చలున్నాయి. ఎన్ని వున్నా అందరూ మాట్లాడుకునే మాట మాత్రం లక్షన్నర…మెజార్టీ అన్నదే ఎక్కువగా ఫోకస్‌ అవుతోంది. అలా సిద్దిపేటన తీర్చిదిద్దడం వల్లనే ఇలాంటి చర్చ జరుగుతోంది.

ALSO WATCH:

https://youtube.com/shorts/4GqrRz04x3w?si=Wk-1OCwOo7JedICf

ప్రజల గుండెలకు దగ్గరైన నాయకుల్లో హరీష్‌రావు ఒకరు.
దేశంలో ఇలాంటి నేతలు చాలా అరుదు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో కూడా ఇలాంటి నాయకుడు మరొకరు లేరు. ఎన్నికల సమయం వచ్చిందంటే ఆయనపై పోటీకి నిలిచే నాయకుడికి గురించి ప్రజలు ఎవరూ ఆలోచించరు. అలా ప్రజల గుండెల్లో గూడు కట్టుకొన్న నాయకుడు హరీష్‌రావు. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ఏదో రకంగా ఏదో ఒక ప్రభుత్వ సాయం అందించిన నాయకుడు హరీష్‌రావు. ప్రభుత్వ సంక్షేమ ఫథకాలు, సింఎం. రిలీఫ్‌ ఫండ్లు, ఎల్‌వోసిలు, ఆసుపత్రుల్లో వైద్యాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యోగ అవకాశాలు, ప్రైవేటు కంపనీలలో కూడా ఉద్యోగాలు. ఏదో ఒక మేలు ప్రతి కుటుంబానికి జరిగింది. లబ్ధిదారుల ఓట్లే ఆయన మెజార్టీని పెంచుతూ పోతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆపదలో వున్న వారికి అండగా నిలవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో వుంటూ రోజుకు కనీసం పది మందికైనా ఏదో రకమైన సేవ అందించాలన్న ఆలోచనతోనే దినచర్య ప్రారంభించే నేత బహషా ఒక్క హరీష్‌రావే కావొచ్చు. ఎందుకంటే రాజకీయ నాయకులంటే ఎలా వుంటున్నారో..ఇటీవల కాలంలో చూస్తూనే వున్నాం. కాని వాళ్లందరికీ భిన్నమైన నాయకుడు హరీష్‌రావు. తాను ఉద్యమ నేపధ్యం నుంచి వచ్చిన నాయకుడు. ప్రజల కష్టాలు తెలుసు. కన్నీళ్లు తెలుసు. అందకు ప్రజలకు దగ్గరగా వుండాలని ఎప్పుడూ కోరుకుంటాడు. ప్రజలను మేలు చేసే పనులు మాత్రమే చేపడుతుంటాడు. తన నియోకజవర్గంలో ప్రతి వ్యక్తికి ఉపయోగపడే పనులు చేయాలనుకుంటాడు. ప్రతి కుటుంబానికి పెద్దదిక్కుగా మారిపోయాడు. నియోజకవర్గంలో ఏ వ్యక్తికి ఏ సమస్య వచ్చినా ముందు తలుపు తట్టేది హరీష్‌రావు ఇంటినే…ఆయన ఇల్లు నిత్యం ఉదయమే జన సందోహంతో నిండిపోతుంది. ఎంత మంది వచ్చినా ఎంతోఓపికతో వారి సమస్యలు వింటారు. వారి సమస్యలు అక్కడిక్కడే పరిష్కరిస్తారు. వారికి మేలు చేస్తుంటారు. తన వద్దకు వచ్చినవారందరిలో భరోసా నింపి పంపిస్తుంటారు. మళ్లీ,, మళ్లీ తిరగాల్సిన పరిస్ధితి రానివ్వరు. ఆపన్నులకు చేయూతనిందిస్తారు.

హరీష్‌రావు మంత్రి అయ్యాకే ప్రజలకు సేవ చేయడం లేదు.

ఆయన ఉద్యమ నాయకుడిగా, ఎమ్మెల్యేగా వున్న సమయం నుంచే విశేషమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యమ కాలంలో ఓ వైపు రాష్ట్రమంతా తిరుగుతూనే, నియోజకవర్గ బాగోగులు చూసుకుంటుంటేవారు. నిత్యం తన ప్రజలకు అందుబాటులో వుంటుండేవారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పటి ప్రభుత్వంతో కొట్లాడి కూడా అనేక నిధులు తెచ్చి, సిద్దిపేటను తీర్చిదిద్దారు.ఇదీ ఆయన అంకితభావానికి నిదర్శనమని చెప్పాలి. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రాంతపరిస్దితి ఎలా వుండేదో ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. ఎటు చూసినా ఏడారిని తలపించేది. ఎక్కడా నీటి చుక్క జాడ వుండేది కాదు. నీడ కూడా కానరాని పరిస్ధితి. బాట సారులే కాదు, కనీసం పశువులకు కూడా నీడ లేకుండాపోయిన రోజులను తెలంగాణ చూసింది. సాగు లేక, పాడి లేక తెలంగాణ పల్లెలు చిద్రమైన కాలంలో సిద్దిపేట నియోజకవర్గ రైతులను ఆదుకున్న ఏకైక నాయకుడు హరీష్‌రావు. అప్పటి ప్రభుత్వం తెలంగాణను నిర్లక్ష్యం చేసినా, ఎమ్మెల్యేగా హరీష్‌రావు దగ్గరుండి ఎన్నో చెరువులను ప్రజల బాగస్వామ్యంతో శ్రమదానం చేసి బాగు చేయించాడు. తాను పలుగు పట్టి తవ్వి,పార పట్టి మట్టిని తట్టలో వేసి, ఆ తట్ట మట్టిని ట్రాక్టర్లో పోసి శ్రమ విలువ తెలిసిన నాయకుడు హరీష్‌రావు. సహజంగా ఇలాంటి కార్యక్రమాల్లో ఫోటోలకు ఫోజులిచ్చే నాయకులను చూస్తుంటాం. కాని రోజంతా చెరువు పనులు చేసిన నాయకుడు ఒక్క హరీష్‌రావు మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యమ కాలంలో కూడ ఆయన ప్రజలకు చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఒక దశలో కరవు విలయతాండవం చేసి, కనీసం పశువులకు గడ్డి కూడా లేని కాలం చూసింది తెలంగాణ. ఆ సమయంలో కోన సీమ పచ్చగా, ఆంద్ర అంత నిండుగా వుంది. అక్కడి నుంచి తన సొంత ఖర్చులతో పశుగ్రాసం తెప్పించి, తన నియోకజవర్గ రైతులకు అందించిన నాయకుడు హరీష్‌రావు.

ఎడారిలా ఒకనాడు జీవం కోల్పోయిన తెలంగాణ నేల ఇప్పుడు సస్యశ్యామలమైంది.

కాలువల నిండా నీళ్లు. మిషన్‌ కాకతీయతో చేసిన చెరువుల అభివృ ద్దితో ప్రతిపల్లె ఒక గంగాళం. ప్రతి బావి నిండుగా, ప్రతి బోరు ఎల్లబోసేంత నీటితో తెలంగాణ జలకళ సంతరించుకున్నది. సిద్దిపేట కూడా సాగు, తాగు నీటిని నింపుకొని, రైతుకు మేలు చేస్తోంది. ఆడబిడ్డలకు మంచినీళ్లందిస్తోంది. ఒకప్పుడు సిద్దిపేట ప్రాంతంలో మంచినీటికి కూడా ఎంతో కటకట. ఎన్ని గజాల చేదబావులైనా నీళ్లు వుండేవి కాదు. ఎన్ని వందల ఫీట్లు బోర్లు వేసినా చుక్క నీరొచ్చేది కాదు. కాని సిద్దిపేట ప్రాంతలో భూ గర్భ జాలలు విపరీతంగా పెరిగాయి. ఫ్లోరైడ్‌ సమస్య పూర్తిగా పోయింది. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంతో సమృద్దిగా నీటి సంపదను పెంచుకున్నట్లైంది. ఇదంతా హరీష్‌రావు వల్లనే సాధ్యమైంది. ఎందుకంటే ఆయన భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా చేసిన కృషి అమోఘం. అందుకే ఆయనను మాజీ గవర్నర్‌ నర్సింహన్‌ మంత్రి హరీష్‌రావును కాళేశ్వరరావు అంటూ కీర్తించారు. తెలంగాణకే తలమానికమైన కాళేశ్వరం ప్రాజెక్టును దగ్గరుండి నిర్మాణం చేయించాడు. రాత్రి పగలు అక్కడే నిద్ర చేసి, ప్రాజెక్టు పూర్తి చేయించారు. అంతలా తెలంగాణ మీద మమకారం ఆయనకు వుంది. అందుకే ఆయన భారీ నీటిపారుదల మంత్రిగా కాళేశ్వరమేకాదు, మల్లన్న సాగర్‌తోపాటు అనేక రిజర్వాయర్ల నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షించి తెలంగాణనే నీటి గంగాళం చేసిన నాయకుడు హరీష్‌రావు. అటు రాష్ట్ర సమస్యలు,ఇటు తన నియోకవర్గ వర్గ సమస్యలు తీర్చుకుంటూ, నాయకుడిగా అందిరికీ ఆదర్శమయ్యాడు. జాతీయస్దాయిలో ఏ అవార్డు వచ్చినా అందులో సిద్దిపేట వుంటుంది. తన నియోజకవర్గాన్నే ప్రగతి నమూనాగా తీర్చిదిద్డారు. మోడల్‌ అభివృద్ది అంటే ఏమిటో చూపించారు. అందుకే దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రజా ప్రతినిధులు, ఉన్నతాదికారులు, సిద్దిపేటను సందర్శిస్తునే వుంటారు. ఇక్కడి అభివృద్ధి ఫలాలు తమ రాష్ట్రాలలో అమలు చేసేందుకు అధ్యయనం చేస్తూ వుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే సిద్దిపేట అభివృద్దికి ఒక ప్రయోగశాలగా మార్చి, ప్రగతికి చిరునామా చేసిన నాయకుడు హరీష్‌రావు.

ఛీ..ఛీ…రేవంత్‌ అని ఛీ..కొడుతున్న జనం?

https://epaper.netidhatri.com/

` రేవంత్‌ రెడ్డి మతి లేని మాటలు.

`కరంటు మీద అవగాహన లేని లెక్కలు.

`సాగు మీద సంబంధం లేని సాకులు.

`ఆలయాల భూములమ్మి మైనారిటీలకు సాయపడతాడట.

`సమైక్య పాలనే బాగుందన్న రేవంత్‌.

`నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ట్యాగ్‌ లైన్‌ కాదట.

`సమైక్య పాలనలో నీళ్లిచ్చారట.

`అప్పుడే ఉద్యోగాలు బాగా ఇచ్చారట!

` తెలంగాణ నిధులతో హైదరాబాదు అభివృద్ధి చేశారట.

`ఉద్యమ ద్రోహి రేవంత్‌ నోట పచ్చి అబద్దాలు.

` అమరవీరుల త్యాగాలను అవమానించిన రేవంత్‌.

`తెలంగాణ ఉద్యమాన్నే తప్పు పడుతున్న రేవంత్‌.

`సమైక్య పాలకులు నీళ్లిస్తే పాలమూరు ఎందుకు ఎడారైంది?

`వలసల జిల్లాగా పాలమూరు ఎందుకు మిగిలింది.

`నమ్మితే తెలంగాణను ఆగం చేస్తాడు.

`చంద్రబాబు చేతిలో తెలంగాణ పెట్టి సమైక్య నినాదం వినిపిస్తాడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 రాష్ట్ర రాజకీయాలను రేవంత్‌రెడ్డి పూర్తిగా కలుషితం చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్‌ వ్యవహారాన్ని అటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇటు ప్రజలు చీ..అంటున్నారు. ఛీ..ఛీ..అంటున్నారు. అయినా రేవంత్‌కు అర్ధం కావడం లేదు. ఎంత గుడ్డెద్దు చేలోపడినట్లు వుంది ఆయన వ్యహారం. ఈ మధ్య నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నాడు. లాజిక్‌ లేని లెక్కలు చెబుతున్నాడు. అసలు లెక్కలు తప్పుతున్నాడు. జనాన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాడు. కాంగ్రెస్‌ పార్టీని వీదినపడేస్తున్నాడు. తాను మాత్రమే కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత గొప్పనాయకుడిని అన్న అపోహకు వచ్చేశాడు. అందుకే సీనియర్లను పక్కన పెట్టేశాడు. కాంగ్రెస్‌నిండా తెలుగుదేశం నింపేశాడు. ఇక ఆడిరది ఆట, పాడిరది పాట అనుకుంటున్నాడు. అన్నీ తప్పులే చేస్తున్నాడు. స్దాయికి మించి మాట్లాడుతున్నాడు. తాను పిసిసి అద్యక్షుడిని అన్న సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. తన మాటల వల్ల పార్టీకి ఎంత నష్టం వస్తుందన్నది ఆలోచించడం లేదు. వ్యక్తిగతంగా తన ఇమేజ్‌ పెరుగుతుందన్న భ్రమలో వుంటున్నాడు. అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద ఎలా పడితే అలా విపరీత వ్యాఖ్యలు చేస్తున్నాడు. విరుచుకుపడుతున్నాన్న భ్రమ పడుతున్నాడు. మంత్రి కేటిఆర్‌ మీద ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. పైగా తనకు ఆ మాటలు కేసిఆరే నేర్పారంటూ పిచ్చి సూక్తులు చెబుతున్నాడు. సరే రాజకీయంగా ప్రత్యర్ధుల మీద మాటలు రాజకీయాలే అనుకుందాం..కాని ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నామన్న సోయి కూడా లేకుండా రేవంత్‌ మాట్లాడుతున్నాడు. 

 అమెరికాలో ఎకరాకు మూడు గంటల కరంటు చాలంటూ సోది చెప్పిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు దానికి బాష్యం చెబుతున్నాడు. 

ప్రతి రైతు 10హెచ్‌పి మోటార్‌ వాడితే ఎకరం పొలం మూడు గంటల్లో పారకమైపోతందంటున్నాడు. మెడ మీద తలకాయ వున్నవారెవరూ ఇలాంటి విధంగా ఆలోచన చేయరు. ఎందుకంటే తెలంగాణ కమతాలన్నీ చిన్న కమతాలు. ఆ కమతాలలో బావులకు సగం భూమి పోవడాన్ని ఎవరూ కోరుకోరు. గుంట స్ధలం కూడా వృధా పోకూడదని ఏ రైతైనా కోరుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు నిర్లక్ష్యం, కరువు పరిస్దితులు ఏర్పడడంతో భూగర్భ జలాలు పడిపోవడంతో బావులు ఎప్పుడో ఎండిపోయాయి. దాంతో చాల మంది రైతులు బావులను ఎంత పూడిక తీసుకున్నా నీటి జాడలు కనిపించలేదు. దాంతో రైతులు ఆర్ధికంగా నష్టపోయి, అప్పులపాలై వలసలు పోయిన సందర్బాలున్నాయి. ఆ అప్పులు తీర్చుకొని, మళ్లీ అప్పులు చేసి బోర్లు వేయించుకున్నారు. గత రెండు దశాబ్ధాలుగా తెలంగాణలో బోర్లమీదే వ్యవసాయం ఎక్కువ శాతం సాగుతోంది. బావులు ఎప్పుడో పూడుకుపోయాయి. చాల బావులు రైతులే పూడ్చేశారు. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 26లక్షల బోర్ల కింద వ్యవసాయం సాగుతోంది. ఈ విషయం రేవంత్‌కు తెలిసినట్లు లేదు. 10 హెచ్‌పి మోటార్లు దేనికి అనుసందానం చేయాలో రేవంతే చెప్పాలి. అంతే కాదు బోర్లలో ఇంకా అంతటి సబ్‌ మెర్సిబుల్‌ మోటార్లు రాలేదు. వచ్చినా బోర్లు అందుకు సహకరించవు. ఈ మాత్రం పరిజ్ఞానం రేవంత్‌కు లేకపోవడం విడ్డూరం. కాదు దౌర్భాగ్యం. రేవంత్‌కు సాగు మీద కనీస అవగాహన లేదని తేలిపోయింది. తన అజ్ఞానం ఎంత గొప్పగా వుందో ఆయనే తెలియజేశాడు. 

ఇక ఉమ్మడి రాష్ట్రంలోనే పాలన బాగుందని రేవంత్‌రెడ్డి కితాబిస్తున్నాడు.  

నిజంగా రేవంత్‌రెడ్డికి ధైర్యం వుంటే తాను సమైక్యవాదిని అని ప్రకటించాలి. అవకాశవాదిగా ఎందుకున్నట్లు? ఇప్పటికీ తాను సమైక వాదానికి కట్టుబడి వున్నానని చెప్పదల్చుకున్నావా? అదైనా సూటిగా చెప్పు? ప్రజలే తేల్చుకుంటారు? తెలంగాణలో ఉమ్మడి పాలకుల పాలనే బాగుంటే పాలమూరు ఎందుకు ఎండిపోయింది? పాలమూరు ఇప్పుడు పచ్చబడిరదో కళ్లుండే చూస్తున్నావా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వలస జిల్లా అంటే ఉమ్మడి పాలమూరే అన్న సంగతైనా రేవంత్‌కు తెలుసా? రేవంత్‌ది అదే జిల్లానా? పాలమూరు మీద కవులు కొన్నివేల పాటలు రాశారు. కొన్ని వందల మంది గాయకులు పాలమూరు గాయాలు పాడి వినిపించారు. కొన్ని వందల మంది రచయితలు పాలమూరు కరువు మీద పుస్తకాలే రాశారు. ఇక జర్నలిస్టులు కొన్ని వేల వార్తలు రాశారు. పాలమూరు నుంచి పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లే బస్సులు ప్రచురించేవారు. అంతేందుకు పాలమూరు కరువు పారద్రోలుతానని చెప్పి,చంద్రబాబు దత్తతు తీసుకున్నాడు. కనీసం రేవంత్‌కు ఆ సందర్భమైనా గుర్తుందా? చంద్రబాబు దత్తత తీసుకొని ఏం బాగు చేశాడో రేవంత్‌ రెడ్డి చెప్పగలరా? తెలంగాణ గురించి మాట్లాడే ముందు రేవంత్‌ ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి. నిజంగానే ఉమ్మడి పాలకుల పాలన బాగుంటే తెలంగాణలో ఆది నుంచి ఎందుకు ఉద్యమాలు జరిగాయి. 1969లో ఉద్యమం ఎందుకు జరిగింది. తెలంగాన ప్రజలు తిన్నది అరక్క ఉద్యమం చేశారని రేవంత్‌ చెప్పదల్చుకున్నారా? ఉమ్మడి రాష్ట్రంలో ఎంత మందికి తెలంగాణ నాయకులకు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం వచ్చింది? వచ్చినా వాళ్లు ఎందుకు పదవులు పోగొట్టుకోవాల్సివచ్చిందన్నది? రేవంత్‌కు తెలిసే మాట్లాడుతున్నాడా? దేశంలోనే గొప్ప పార్లమెంటేరియన్‌గా పేరు గాంచిన రేవంత్‌కు బంధువైనా జయపాల్‌రెడ్డి లాంటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు? సమాధానం రేవంత్‌ చెప్పాల్సిన అవసరం వుంది. 

ఉమ్మడి పాలకులు నీళ్లిచ్చారా?

 అదే నిజమైతే కోనసీమ ఎందుకు పచ్చగా వుండేది. తెలంగాణ ఎందుకు ఎండిపోయేది? ఇప్పుడు కోససీమ కన్నా, తెలంగానలో ఎందుకు బంగారు పంటలు పండుతున్నాయి? ఉమ్యడి రాష్ట్రంలో తెలంగాణకు మంచినీళ్లు ఇవ్వని ఉమ్మడి పాలకులు పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు నిర్మించి, కాలువ ద్వారా మద్రాసుకు మంచినీళ్లు తీసుకెళ్లారన్న సంగతైనా రేవంత్‌కు తెలుసా? శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణకు వాటా ఎంత? ఆంద్రకు వాటా ఎంత? అన్నది రేవంత్‌ తెలుసుకున్నాడా? శ్రీశైలం కేవలం విద్యుత్‌ ఉత్పాదన కోసం కట్టిన ప్రాజెక్టే అన్నది తెలుసా? తెలంగాణకు శ్రీశైలం నుంచి వరద జలాలు మాత్రమే వినియోగం అన్న లెక్కలు చెప్పిన పాలకుల లెక్కలు రేవంత్‌ విన్నాడా? నాగార్జున సాగర్‌ ఎక్కడ నిర్మాణం చేయలి? ఎక్కుడ చేశారు? అన్నది రేవంత్‌కు తెలుసా? నాగార్జున సాగర్‌ నిర్మాణం చేసి, తెలంగాణకు ఖనిజ సంపద కూడా ఉపయోగపడకుండా కుట్ర చేసిన సందర్భం తెలుసా? కేవలం తెలంగాణను ముంచి, నీళ్లను తరలించుకుపోయేందుకు నాగార్జునసాగర్‌లో ఉమ్మడి పాలకులు చేసిన కుట్ర తెలుసా? ముందు ప్రకటించిన ప్రాంతం నుంచి తరలించి, వేరే ప్రాంతంలో నిర్మాణం చేశారని ఉద్యమంలో పాల్గొన్న ప్రతి తెలంగాణ వాదికి తెలుసు. రేవంత్‌రెడ్డి తెలంగాణ ఉద్యమం చేస్తే ఈ విషయం తెలిసేది. 

మైనార్టీ డిక్లరేషన్‌ కోసం ఆలయభూములు అమ్మకానికి పెడతావా?

తెలంగాణలో కొన్ని శతాబ్దాల నుంచి ముస్లింలు, హిందువులు బాయి, బాయి అనుకుంటూ జీవిస్తున్నారు. రెండు మతాల సంస్కృతిలో మిలితమై బతుకుతున్నారు. ఒకరి పండుగలకు ఒకరు గౌరవించుకుంటూ సాగుతున్నారు. భాద్రాద్రి రామయ్యకు ముత్యాల వహరాలు నిజాం రాజు పంపించాడు. గంగాజమున తహజీవ్‌ కొనసాగుతోంది. పాతబస్తీలో బోనాల జాతర ఎంతో ఆనందోత్సహాలతో జరుగుతుంది. రంజాన్‌ నాడు హిందువులు, ముస్లింలు ఎంతో కలిసి వేడుక చేసుకుంటారు. అలాంటి వాతావరణాన్ని చెడగొట్టేందుకేనా సున్నితమైన విషయాలను రేవంత్‌ లేవనెత్తుతున్నాడా? ఇలా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసి, ఓట్లు చీల్చి ముస్లింఓట్లతో గద్దెనెక్కాలన్న రేవంత్‌ ఆలోచనను ఎవరూ సమర్థించరు. మైనార్టీలు కూడా ఇలాంటి రాజకీయాన్ని అసలే స్వాగతించరు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనంతా కూర్యూలే! ఏ ఒక్కనాడు కర్ఫ్యూ లేకుండా వున్నదిలేదు. కాని ఈ తొమ్మిదేళ్లు ఎంతో ప్రశాంతంగా వుంది. కర్ఫ్యూ అన్న పదమే తెలంగాణ మర్చిపోయింది. ఆ ప్రశాంతతన చెడగొట్టేందుకు రేవంత్‌ కుట్ర పన్నుతున్నాడా? గతంలో కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో కరువు, నగరంలో కర్ఫ్యూ ఇవే కదా? నిత్యం విన్నవి. చూసినవి. రేవంత్‌ను నమ్మితే భవిష్యత్తులో కూడా మళ్లీ ఇవే చూడాల్సివస్తుందేమో! ప్రజలు బాగా ఆలోచించుకోవాల్సిన అసవరం వుంది.

మూడోసారి కూడా సారు, కారు సర్కారే?

https://epaper.netidhatri.com/

`హాట్రిక్‌ విజయం తధ్యమే!

`మెజారిటీ సీట్లు ఖాయమే

`తెలంగాణ అంతటా మళ్ళీ గులాబీ పరిమళమే.

`ప్రజల మద్దతంతా కారు పార్టీకే.

`ఉద్యమ పార్టీ బిఆర్‌ఎస్‌ మరో సారి ప్రభంజనమే.

`పల్లెలు, పాడి పంటలు పరవశమే…

`పట్నంలో ప్రగతి పరుగులే.

`తెలంగాణ అన్ని వర్గాల అభ్యున్నతే…

`కాంగ్రెస్‌ పాపపుకాలం పాయే…

`బీఆర్‌ఎస్‌ తో పుణ్య కాలమొచ్చె.

`పదేళ్లలో తెలంగాణ మెరిసే…`ప్రజలంతా మురిసే.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి కూడా కారు, సారు,సర్కారు అనే నిదాదమే వినిపిస్తోంది. ప్రచారంలో కారు దూసుకుపోతోంది. ఎక్కడ విన్నా సారు పేరే వినిపిస్తోంది. తెలంగాణ సర్కారుకు ఎదరులేదని తెలుస్తోంది. కంగ్రెస్‌ ఎంత దుష్ట్రప్రచారం చేయాలని చూసినా,ప్రజలు నమ్మడం లేదు. రేవంత్‌ను అసలే నమ్మే పరిస్ధితి లేదు. ఎందుకంటే పూటకో మాట మాట్లాడడంతో రేవంత్‌ ఆరి తేరిపోయాడు. ఓవైపు సీనియర్లను సాగనంపి, దశాబ్ధాలుగా కాంగ్రెస్‌ను కాపాడుకుంటూ వస్తున్న వారిని తరిమేసి కాంగ్రెస్‌ నిండా తన అనుచర వర్గాన్ని నింపుకున్న రేవంత్‌ ఎన్నటికైనా కాంగ్రెస్‌ ముంచేస్తాడని భయపడుతున్నారు. ఎందుకంటే రేవంత్‌రెడ్డి నిత్యం జపం చేసేది ఆంధ్రాబాబు చంద్రబాబు పేరే. అందుకే రేవంత్‌ను నమ్మడం అంటే ప్రశాంతంగా వున్న తెలంగాణలో ప్రజలే అల్లకల్లోలం రేపుకోవడం అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్‌ అంటేనే కరువు. కాంగ్రెస్‌ అంటేనే జనాలకు బరువు. ఆది నుంచి ఓసారి చూస్తే దేశం మొత్తం కాంగ్రెస్‌ పాలించిన డెబ్బైవ దశకం దాకా దేశం మంతా కరువే. ఆనాడు కరువులో దేశంలో కొన్ని వేల మంది మరణించినట్లు కూడ లెక్కలున్నాయి. కరువు పరిస్ధితుల దృష్ట్యా నాలుగో పంచ వర్ష ప్రణాళికలను కూడా నిలిపిసేసిన చరిత్ర కాంగ్రెస్‌ది. దేశమంతా కరువు నెలకొని వున్నా ఎలాంటి కరువు నివారణ చర్యలు చేపట్టకపోవడంతోపాటు, రాజకీయ అస్ధిరత దేశంలో ఎమర్జెన్సీలను పెట్టి, వేధించడంతోనే ప్రజలు కాంగ్రెస్‌ను దూరం పెట్టారు. ఇదీ కాంగ్రెస్‌ చరిత్ర. అంత దాకా ఎందుకు కర్నాకటలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అక్కడ కరువు మొదలైంది. ఆ ప్రభావం తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా పడిరది. చలికాలంలో కూడా రాజమండ్రి లాంటి ప్రాంతాలలో చినుకు లేక ఉక్కపోతను తట్టుకోలేక పోతున్నారని సమాచారం. అలాగే తెలంగాణలో కూడా ఈ మధ్య వాన చినుకు కరవైంది.

గడచిన తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణలో కరువు ఛాయలు లేవు. 

ఇలాంటి పరిస్ధితుల్లో కర్నాటక రైతులకు కరంటు ఇవ్వలేకపోతోంది. కాని మన తెలంగాణలో వర్షాలు లేకపోయినా తెలంగాన పల్లెలో సమృద్ధిగా నీరుంది. చెరువులు నిండుగా వున్నాయి. రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. తెలంగాణలో మూడేళ్లపాటు వాన చినుకు లేకుండా కరువు రాకుండా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముందు చూపుతో చినుకును ఒడిసిపట్టి, రిజర్వాయర్లు నింపేశాడు. ఇదీ విజన్‌ ఉన్న నాయకుడి పాలనకు నిదర్శనం. ఒకప్పుడు తెలంగాణ కరువు రక్కసి బారిన పడి విలవిలలాడిరది. కారణం కాంగ్రెస్‌ పార్టీ. ఇప్పుడు మళ్లీ నేనున్నా, తెలంగాణ ప్రజలను పీక్కు తింటాను..కరువును తెస్తాను… జనాన్ని విలవిలాడిస్తాను అన్నట్లు కాంగ్రెస్‌ నేతల ప్రచారం వుంది. ఎందుకంటే పది హెచ్‌పిల మోటార్‌తో ఎకరం మడి మూడు గంటల్లో పారుతుందని రేవంత్‌ రెడ్డి అంటున్నాడు. అసలు బోర్లలో 10 హెచ్‌ పి మోటర్‌ వేసే అవకాశం వుంటుందా? అసలు తెలంగాణలో ఎన్ని బోర్లు వున్నాయో లెక్కలు కూడ తెలియని రేవంత్‌రెడ్డి మోటర్ల గురించి మాట్లాడితే రైతులు నవ్వుకుంటున్నారు. తెలంగాన రాకముందు 17 లక్షల బోర్లు వుండగా, ఇప్పుడు 26లక్షల బోర్లు సాగుకు నీరందిస్తున్నాయి. తెలంగాణలో భూగ్భజలాలు విపరీంతా పెరిగాయి. 10హెచ్‌ పి మోటార్లు కేవలం బావులకే పరిమితం. కాంగ్రెస్‌ పాలకుల పుణ్యమా అని తెలంగాణలో చాలా బావులు ఎప్పుడో కనుమరుగయ్యాయి. పూడికలు నిండిపోయాయి. వాటిని తీయడానికి రైతుకు లక్షల్లో ఖర్చవుతుంది. అందుకు అంత ఖర్చు చేయలేక, బోర్లను నమ్ముకొని తెలంగాణ రైతు వ్యవసాయం సాగిస్తున్నారు. అందుకే 24 గంటల కరంటు తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. సాగు మీద కనీస అవగాహన లేని రేవంత్‌ మాటలు నమ్ముకొని రైతు నిండా మునిగేందుకు సిద్దంగా లేడు. కాంగ్రెస్‌ ఓటేస్తానని రైతు ఎక్కడా చెప్పడంలేదు. కాని కాంగ్రెస్‌ అసత్య ప్రచారం మొదలుపెట్టి, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని పగటి కలలు కంటున్నారు. యాభై ఏళ్లు కష్టాలు, నస్టాలు, గోసలు చూసిన పల్లె జనం ఇంకా కాంగ్రెస్‌ నమ్ముతారని అనుకోవడం భ్రమ. అందులోనూ రేవంత్‌ నాయత్వం అంటే అది కాంగ్రెస్‌ కాదు. తెలుగుదేశం. తెలంగాణను మరింత గోస పెట్టిన పార్టీ తెలుగుదేశం. తెలంగాణను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు, పాలమూరును దత్తత తీసుకుంటున్నానని నమ్మించి, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఒక్క చెరువులో పూడిక తీయలేదు. ఒక్క పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. అలాంటి దుర్మార్గపు పాలన తెలంగాణకు రుచిచూపించిన నాయకుడిని ఆదర్శంగా తీసుకొని రాజకీయం చేస్తున్న రేవంత్‌రెడ్డి తెలంగాణ కోసం ఆలోచిస్తాడని అనుకుంటే పొరపాటు. తెలంగాణ ఉద్యమకారులను తుపాకితో బెదిరించిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతాడా? తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ఏర్పాటును విఫల ప్రయత్నంగా చిత్రీకరించే కుట్ర చేసిన రేవంత్‌ తెలంగాణ ప్రయోజనాలు చూస్తాడా? యాభై లక్షలతో అడ్డంగా దొరికిన ఓటుకు నోటు కేసులో నిందితుడు రేవంత్‌రెడ్డి. అలాంటి రేవంత్‌రెడ్డిని నమ్మితే నిండా ముంచకుండా వుంటాడా? ఇరవై నాలుగు గంటల కరంటును మూడు గంటలు చేసి రైతులను గోస పెట్టకుండా ఊరుకుంటాడా?

ఇవన్నీ తెలంగాణ ప్రజలకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు.

 తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. తెలంగాణలో మరోసారి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రానున్నది. వెల్లివిరిసిన చైతన్యంతో తెలంగాన సాధించుకున్న ప్రజలకు ఏ పార్టీని గెలిపించుకోవాలన్న దానిపై ఎవరి ప్రభావం వుండదు. మూడోసారే కాదు, ఎన్ని సార్లైనా తెలంగాణ కోసం పోరాటం చేసిన ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌నే ఆదరిస్తారు. కేసిఆర్‌నే మరోసారి ముఖ్యమంత్రిని చేస్తారు. హాట్రిక్‌ విజయం ఖాయమన్నది జనం చెబుతున్న మాట. ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌తో పనిచేసినా, తర్వాత ఆయనకు దూరమైన ఉద్యమకారులంతా కాంగ్రెస్‌, బిజేపిల కోసం పనిచేశారు. అయినా ఆ పార్టీల అసలు స్వరూపం తెలిసి, మళ్లీ ఉద్యమకారులంతా బిఆర్‌ఎస్‌వైపు వస్తున్నారంటే ఉద్యమ పార్టీకి వున్న ప్రాదాన్యత, ముఖ్యమర్రతి కేసిఆర్‌మీద వున్న నమ్మకం ఎంత బలమైందో అర్ధం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు వెలుగు వెలిగిన నాగం జనార్ధన్‌ రెడ్డి ఆనాడే బిఆర్‌ఎస్‌లోకి వస్తే ఎంతో గొప్పగా వుండేది. ఆలస్యమైనా ఏ చెట్టు పక్షులు ఆ గూటికే చేరుతాయన్నట్లు ఉద్యమ కారులంతా మళ్లీ బిఆర్‌ఎస్‌కు చేరుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వమంటూ ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అంటున్నప్పుడు ఆందోళన వ్యక్తం చేసిన ఏకైక కాంగ్రెస్‌ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య. ఇప్పుడు ఆయన కూడా బిఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన చెరుకు సుధాకర్‌ గౌడ్‌, గాయకుడు ఏపూరి సోమన్న దాకా ఉద్యమ కారులంతా బిఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు తుల ఉమ కూడా బిఆర్‌ఎస్‌లో చేరారు. ఇలా ఉద్యమ కారులంతా కేసిఆర్‌ వైపు వచ్చారంటేనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిబద్దత ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో ప్రజలు ప్రతిపక్షాల వైపు చూస్తారని అనుకోవడం వారి భ్రమే అవుతుంది. తెలంగాణ సమాజం ఎటు వైపు వుంటుందో బిఆర్‌ఎస్‌ అక్కడ వుంటుంది. బిఆర్‌ఎస్‌ ఎక్కడ వుంటుందో అక్కడ ఇతర పార్టీలకు చోటు వుండదు. ఇది ఉద్యమ పార్టీ బిఆర్‌ఎస్‌కు, తెలంగాణ సమాజానికి వున్న అవినాభావ సంబంధం. దాన్ని ఎవరూ చెరిపేయలేరు. తెలంగాణ జనం గుండెల్లోనుంచి బిఆర్‌ఎస్‌ను తప్పించలేరు. తెలంగాణ సాదన, సంక్షేమపాలన చూపిన ఏకైక నాయకుడు కేసిఆర్‌.

ప్రజా దీవెన పల్లాకే!

https://epaper.netidhatri.com/

జనగామ లో గెలుపు నాదే అంటున్న బిఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న ప్రచార విశేషాలు…ఆయన మాటల్లోనే.

`జనగామలో వార్‌ వన్‌ సైడే.

`పల్లాకు పెరుగుతున్న మద్దతు.

` కుల సంఘాల తీర్మానాలు

` అడుగడుగునా పల్లా కు ఆదరణ.

` పెద్ద ఎత్తున పల్లా కు అనుకూలంగా తీర్మానాలు.

`గ్రామాలలో ప్రభుత్వ పథకాలపై విసృత ప్రచారం.

`నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం.

`ప్రచారంలో కనిపించని కొమ్మూరి.

`కాంగ్రెస్‌ ప్రభావం అంతంత మాత్రం.

`బిఆర్‌ఎస్‌ శ్రేణుల విసృత ప్రచారం.

బిఆర్‌ఎస్‌ పటిష్టంగా వున్న నియోజకవర్గాలలో జనగామ ఒకటి. ఇక్కడ ఉద్యమ నేపధ్యం వున్న పార్టీలకు కొంత ఆదరణ ఎక్కువ. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో అప్పటి నుంచి జనగామలో బిఆర్‌ఎస్‌కు కంచుకోటగా మారింది. తెలంగాణ ఉద్యమానికి పూర్తి స్ధాయిలో మద్దతు తెలిపిన ప్రాంతాలలో జనగామ ముందు వరుసలోవుంటుంది. ఇప్పుడే కాదు జనగామ అంటేనే పోరాటాల ఖిల్లా. అందుకు ఇక్కడ పోరాట వీరులకు ఆదరణ ఎక్కువ. తెలంగాణ కోసం పోరాటం చేసిన బిఆర్‌ఎస్‌కు జనగామలో మరింత ఆదరణ. అలాగే ఆసారి ఎన్నికల్లో కూడా అదే పరంపర కొనసాగనున్నది. గత కొంత కాలంగా జనగామాలో బిఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలున్నాయంటూ కొన్ని పార్టీలు, సంస్ధలు పనిగట్టుకొని ప్రచారం సాగించాయి. కాని బిఆర్‌ఎస్‌కు తప్ప, జనగామలో మరోపార్టీకి బలం లేదు. పట్టులేదు. ప్రజల ఆదరణ లేదని తేలిపోతోంది. జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీకావు. ఇది కూడా ప్రజల్లో కాంగ్రెస్‌ అంటే చులకన భావమేకాదు, హేహ్య భావం కూడా కలిగేలా చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి అసలు రాజకీయం తెలసిన తర్వాత కాంగ్రెస్‌ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకుంటే ప్రతాప్‌ రెడ్డి రాజకీయాల్లో వుండాలనుకుంటాడు. కాని ప్రజలకు దూరంగా వుంటుంటాడు. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రోత్సాహంతో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి చేర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యాడు. కాని ఆయన ఏనాడు ప్రజల్లో లేరు. జనంతో కలిసిపోలేదు. ఉద్యమంలో కూడా ఆయన కనిపించడం అంటే వేదికల మీద తప్ప రోడ్ల మీద కొట్లాడిరది లేదు. పైగా ఆయన చేర్యాల పట్టణంలో కూడా కారు అద్దాలు ( అప్పుడు కార్లకు నల్లటి ఫిల్ములు వుండేవి) పైకెక్చించుకొనే వుండేవారు. ప్రజలకు అభివాదం చేయడం ఆయనకు ఇష్టం వుండదు. కనీసం పట్టణంలో తిరుగుతున్నప్పుడైనా ప్రజలతో కలివిడిగా వుండేవారు కాదు అన్న ఆరోపణలున్నాయి. ప్రజలు నమస్కారం అంటే కూడా కనీసం ప్రతిగా మర్యాదను కూడా చూపించేవారు కాదని ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డికి దళితులంటే చిన్న చూపు అని గతం నుంచి చెప్పుకుంటారు. ఆయన గతంలో ప్రచారానికి వెళ్లినా, ఎమ్మెల్యేగా అభివృద్ధి పనుల మీద గ్రామలకు వెళ్లినా ఉన్నత వర్గాల కుటుంబాలలోనే మంచి నీరు తాగేవారు. వాళ్ల ఇళ్లలోనే కాసేపు సేద తీరేవారు. ఏనాడు ఆయన కనీసం బిసి నాయకులు ఇండ్లలో మంచినీళ్లు తాగ లేదని అంటుంటారు. అంతే కాదు ప్రచారం సమయాల్లో కూడా ఏనాడు ఆయన దళిత నాయకులను వెంట తీసుకెళ్లలేదని అంటుంటారు. దళిత వాడల్లో ప్రచారాలు కూడా చేయలేదని చేర్యాల మండలంలో చెబుతుంటారు. అదే ఇప్పుడు ఆయన కుమారుడు కూడ అనుసరిస్తున్నాడని అంటున్నారు. తాజాగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కుమారుడు చేర్యాల మండలంపరిధిలోని ఓ గ్రామ మాజీ దళిత సర్పంచ్‌ను బూతులు తిట్టడమే కాకుండా చేయి, చేయి చేసుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఆ మాజీ సర్పంచ్‌కు మద్దతుగా జనగామ నియోజకవర్గంలోని దళితులంతా కొమ్మూరికి వ్యతిరేకంగా మారారని, గ్రామాలలో తీర్మాణాలు చేసినట్లు కూడా సమాచారం. దాంతో కాంగ్రెస్‌కు కాస్తో కూస్తో మిగిలిన కొద్దిపాటి ఆదరణ కూడా లేకుండాపోయిందని కాంగ్రెస్‌ శ్రేణులో మధపడుతున్నాయి. ఇదిలా వుంటే బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి పల్లా రాజేశ్వరరెడ్డి ప్రజల్లో కలుస్తున్న విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. తీరికలేకుండా ఆయన గ్రామాలను చుట్టేస్తున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా విసృతంగా ప్రచారం చేస్తున్నారు. తన గెలుపుపై పూర్తి ధీమాతో వున్న బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు తనదే అంటున్నారు. ప్రజాశీర్వాదం తనకే అంటున్నారు. ప్రచారంలో ప్రజలు ఇస్తున్న ధైర్యం చూస్తుంటే మంచి మెజార్టీ తో గెలుస్తానన్న ధీమా మరింత బలపడుతోందంటున్నారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో చెప్పిన ప్రచార విశేషాలు ఆయన మాటల్లోనే…
జనగామ నియోజకవర్గ ప్రజలు ఎంతో విజ్ఞులు.
ఎంతో చైతన్య వంతులు. ఎవరు ఎలాంటి వారు అన్నదానిపై పూర్తి అవగాహన, స్పష్టత వున్న వాళ్లు. ముఖ్యమంత్రి కేసిర్‌ అంటే ఎనలేని అభిమానం వుంది. ఏ ఊరికి వెళ్లినా, ఏ ఇంటి తలుపు తట్టినా కేసిఆర్‌ నాయకత్వమే కావాలని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు. నన్ను ఆశీర్వదిస్తున్నారు. ప్రజల అభిమానం , ఆదరణ ప్రత్యక్షంగా చూస్తున్నాను. గతంలో పట్టభద్రుల ఎన్నికలు చూశాను. అప్పుడు గెలిపించారు..అయితే ఆ ఎన్నికలు వేరు… అసెంబ్లీ ఎన్నికలు వేరు. ఎమ్మెల్యే ఎన్నికలు అంటేనే ఓ అద్భుతమైన భావన నాకు కలిగింది. ప్రజలకు దగ్గరగా వుండే జీవితం అంటే ఎంత గొప్పగా వుంటుందో, ప్రజల మధ్య జీవితం ఎంత గౌరవంగా వుంటుందో తెలిసింది. ప్రజలకు సేవ చేయడం అన్నది పూర్వ జన్మ సుకృతం. ప్రజలతో కలిసి సాగడం అన్నది గొప్ప అనుభవం. ప్రజల ఆదరణ చూస్తే ఒక్కొసారి తెలియకుండానే నా కళ్లలో ఆనందబాష్పాలు సడులు తిరుగుతున్నాయి. నన్ను ప్రజలు ఆశీర్వదిస్తుంటే ఎంతో గొప్ప అనుభూతిని పొందుతున్నాను. వారి ఆదరణ చూస్తుంటే జీవితాంతం వారికి ఎంత సేవ చేసినా తక్కువే అనిపిస్తోంది. నా జీవితాంతం జనగామ ప్రజలకు సేవ చేస్తాను. వారి సేవలోనే తరిస్తాను. జనగామను అన్ని రంగాలలో అభివృద్ది కోసం శక్తి వంచన లేకుండా కృషిచేస్తాను. గ్రామాలను మరింత తీర్చిదిద్దుతాను. జనగామ నుంచి, చుట్టు పక్కల గ్రామాల నుంచి ఇప్పటీకీ వేలాది మంది హైదరాబాద్‌ కు ఉపాది అవకాశాల కోసం వెళ్తుంటారు. వారికి జనగామలోనే ఉపాది అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాను. జనగామకు కూడా ఐటిని తీసుకొస్తాను. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో వున్న జనగామ గొప్ప విద్యాకేంద్రం. ప్రభుత్వం ఎలాగూ ఉద్యోగ కల్పన చేపడుతూనే వుంటుంది. దానికి తోడు నిరుద్యోగ యువతలో వారి వారి స్కిల్‌ ను బట్టి కూడా ఉపాది కల్పన జరగాల్సిన అవసరం వుంది. అందుకోసం ఐటి కంపనీలు, ఫార్మా కంపనీలు, ఇతర ఇండస్ట్రీలు కూడా తెచ్చి, జనగామను ఉపాధికి కేంద్రంగా చేస్తాను. స్ధానిక యువత జీవితాల్లో వెలుగులు నింపుతాను. ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రతి ఇంటికి అందించే వారధిగా వుంటాను.
ప్రతిపక్షాలకు జనగాంలో చేటు లేదు.
ఎందుకంటే జనగామ చాల వరకు ఎంతో ప్రగతిని సాధించింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ జనగామకు అ వసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. జనగామ జిల్లాకోసం జరిగిన ఉద్యమాన్ని గౌరవించి జిల్లా ఏర్పాటు చేశారు. జనగామ చెరువులను మొదటి దఫాలోనే పునరుద్దరణ చేసి, ఒకనాడు చుక్క నీటికి కటకటలాడిన జనగామను సస్యశ్యామలం చేశారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. జనగామ ప్రాంతం మీద ఆధారపడి చుట్టూ కొన్ని వందల గ్రామాలు అధారపడి వుంటాయి. నిత్యం ఏ చిన్న అవసరం వున్నా, ప్రజలు జనగామకు వస్తుంటారు. అలాంటి జనగామను మరింత అభివృద్దిచేయాల్సిన అవసరం వుంది. నేను గెలిచిన మరుక్షణం నుంచి జనగామ అభివృద్దికోసం నిరంతర శ్రమిస్తాను. ఈనెల 18న చేర్యాలలో కూడా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రజాశీర్వాద సభ వుంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు చేర్యాల ప్రాంతంతో ఎంతో అనుబంధం వుంది. చేర్యాల సిద్దిపేట జిల్లాలో బాగంగా వుంది. అక్కడి ప్రజలు చేర్యాల రెవిన్యూ డివిజన్‌ కావాలని కోరుతున్నారు. చేర్యాల ప్రాంత ప్రజలు కోరుకుంటున్న ప్రతి దానిని నెరవేరుస్తాను. వారి కళ్లలో ఆనందం నింపుతాను. చేర్యాలలో ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారు. నన్ను ఆశీర్వదిస్తున్నారు. వారి రుణం తీర్చుకోలేనిది. నా జీవితాంతం వారికి సేవ చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తాను.

కారే రావాలి. సారే కావాలి!

https://epaper.netidhatri.com/

`సామాన్యల మదిలో ఇదే మాట.

`ప్రతిపక్షాలు ఎంత మభ్యపెట్టినా జనం చెబుతున్నది అదే మాట.

`పల్లె, పట్నం ఒకటే మాట.

`కేసిఆర్‌ తో తెలంగాణ అంతా..

` కేసిఆర్‌ వెంటే జనమంట.

`అభివృద్ధి ప్రధాతతోనే ప్రయాణమంట.

`గోస పెట్డిన కాంగ్రెస్‌ మాకొద్దంట.

`మాట తప్పడం కాంగ్రెస్‌ కు అలవాటేనంట.

`అరవై ఏండ్ల గోస పోగొట్డిన కేసిఆరే మాకు అండ.

`తెలంగాణ మరిన్ని వెలుగులు చూడాలంటే కేసిఆరే రావాలంట.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్న ఏకైక మాట. తెలంగాణలోని ఏ ప్రాంత ప్రజలను కదిలించినా చెబుతున్న మాట ఇదే. ఎందుకంటే పదేళ్ల క్రితం తెలంగాణ. ఇప్పుడున్న తెలంగాణను ప్రజలు చూస్తున్నారు. నాటి గోసలు గుర్తు చేసుకుంటున్నారు. అరవై ఏళ్లు తెలంగాణ ప్రజలు గోస పడుతుంటే అయ్యో..అని బాధ పడిన నాయకుడు ఒక్కరైనా ఆనాడు కాంగ్రెస్‌లో వున్నాడా? ఆ సమయంలో ఒక వేళ ఎవరైనా జై తెలంగాణ అన్నా అది వారి రాజకీయ స్వార్ధం కోసమే అని అనేక సందర్భాలలో తేలిపోయింది. 1669లో విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యమం చేస్తే అందులో దూరిన కాంగ్రెస్‌ రాజకీయ నాయకులు ఏం చేశారు. విద్యార్ధి ఉద్యమాలను హైజాక్‌ చేసి, చెన్నారెడ్డి లాంటి వారు ఉద్యమాన్ని వారి గుప్పిట్లోకి తీసుకొని, తెలంగాణ ప్రజా సమితి పేరు మీద గెలిచి, కాంగ్రెస్‌లో కలిపేశారు. తెలంగాణ ఉద్యమాన్ని చిదిమేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ప్రజల మనోభావాలతో ఆడుకున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం మీద దెబ్బకొట్టారు. కాంగ్రెస్‌ నాయకులు ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని పదవులు పొందారు. నాయకులుగా చెలామణి అయ్యారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి గవర్నర్‌ అయ్యాడు. కేంద్ర మంత్రి పదవులు వెలగబెట్టారు. ఆయన బాటలోనే చాలా మంది నడిచారు. ఆస్ధులు కూడబెట్టుకున్నారు. తెలంగాణ ప్రజలను వంచించారు. 2004 ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి రాజకీయ స్వార్ధం కోసం తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఉపయోగపడ్డారు… రాజశేఖరరెడ్డి రాజకీయ అవకాశాలకు నిచ్చెనలేశారు. అడుగడుగునా తెలంగాణను అవమానాలకు గురి చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సీమాంధ్ర నేతలు దెబ్బతీస్తుంటే గుడ్లప్పగించి చూశారు. ఇది మన కళ్లముందు వున్న జరిగిన చరిత్ర.
1994లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ పదేళ్లు ప్రతిపక్షంలో వుంది.
2004లో కూడా అధికారంలోకి రాకపోతే ఇక కాంగ్రెస్‌ ఖతమే అన్నంతదాకా వెళ్లింది. దాంతో అధికార దాహంతో వున్న సీమాంధ్ర నాయకులు, తెలంగాణ నాయకుల చేత కృత్రిమంగా జై తెలంగాణ నినాదాలు వినిపించారు. నిజంగా కాంగ్రెస్‌ నాయకులకు చిత్త శుద్ది వుంటే… చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్ని వాడేందుకు ఊడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వణికిపోయారు. కాని కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమ శంఖాన్ని పూరించాడు.. అసెంబ్లీలో తెలంగాణ అన్న పదం వినిపించకుండా చేసిన కట్టడిని కేసిఆర్‌ ఎదిరించాడు… ఎవరూ తెలంగాణ అన్న పదం వాడొద్దని చంద్రబాబు ఆనాడు సభలో తీర్మాణం చేయించాడు. కేసిఆర్‌ తిరగబడ్డాడు. నిలదీశాడు. తెలంగాణ ప్రజలు అంగీకరించని ప్రపంచానికి వినిపించాడు. నా ప్రాంతం అరి గోస పడుతుంటే, నా ప్రాంతాన్ని పేరు పెట్టి పిలవకుండా కట్టడి చేస్తానంటే నేను ఊరుకునే ప్రసక్తి లేదని దిక్కరించిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. ఆనాడు చంద్రబాబుకు భయపడి సభ సంప్రదాయాలకు కట్టుబడి వుండాలన్న సాకుకు చెప్పి, ఏ ఒక్క కాంగ్రెస్‌ నాయకుడు కూడా తెలంగాణ అన్న పదం వాడడానికి ముందుకు రాలేదు. ఏ ఒక్క సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకుడు కూడా ఇదేం పద్దతి తెలంగాణకు అనూకూలంగా మట్లాడిరదిలేదు. ఆనాటి ప్రభుత్వాన్ని ఏ కాంగ్రెస్‌ నాయకుడు ప్రశ్నించలేదు. ఏ ఒక్క తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుడు సభలో నిరసన తెలుపలేదు. కాని 2004 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాత్రం ఇక కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్దితి కనిపించడం లేదని తెలిసి జై తెలంగాణ అనండని రాజశేఖరెడ్డి చెబితే గాని గొంతు పెగలలేదు. కనీసం అప్పుడైనా అసెంబ్లీలో జై తెలంగాణ అని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అన్నారా? అంటే అదీ లేదు. ముఖ్యమంత్రి కావాలనుకున్న రాజశేఖరెడ్డికి తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు అండగా వుండడం కోసం బైట అన్నారే గాని, సభలో అనలేదు. తన రాజకీయ స్వార్ధం కోసం తెలంగాణ నాయకులను ఉసిగొల్పిన రాజశేఖరెడ్డి ఒక్కనాడైనా మా పార్టీ తెలంగాణకు అనుకూలం అని చెప్పాడా? అంటే అదీ లేదు. ప్రతిపక్ష నేతగా 1999 నుంచి 2004 దాకా వున్న వైఎస్‌. రాజశేఖరెడ్డి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఏనాడైనా ప్రశ్నించాడా? అంటే లేదు. అలాంటి కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది మేమే…అంటూ అవేవో వేదాలు వల్లించినట్లు చెబుతున్నారు.
నిజాం రాజ్యంతో కొన్ని దశాబ్ధాల పాటు పోరాటం చేసి, విముక్తి చెందిన తెలంగాణ ఊపిరి తీసుకోకముందే, బాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్రతో కలిపేశారు.
రెండు ప్రాంతాల నాయకులతో పెద్ద మనుషులు ఒప్పందం చేయించినట్లే చెయించి, డిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చేలోపే రాష్ట్రం పేరు మార్చిన ఘనత కాంగ్రెస్‌ నాయకులది. డిల్లీ పెద్దల దగ్గర తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్‌ అన్న పేరును ప్రతిపాదించి, హైదరాబాద్‌లో దిగగానే ఆంధ్రప్రదేశ్‌ అని నామకరణం చేస్తే చేష్టలుడిగి, పదవుల కోసం ఆశపడిరది తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు. ఆనాటి నుంచి తెలంగాణను పీక్కు తినడానికి తప్ప తెలంగాణకు మేలు చేసిన కాంగ్రెస్‌ నాయకుడు లేడు. తెలంగాణను ఆంధ్రలో కలిపి కుంపటి పెట్టిందే కాంగ్రెస్‌ నాయకులు. ఆనాడు ఆంధ్రలో కలిపేయకపోతే తెలంగాణ ఆనాడు బాగుపడేది. ఆత్మగౌరవంతో అస్ధిత్వంతో బాగుపడేది. అరవై ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సి వచ్చేదా? తెలంగాణ మిగులు మూడు కోట్లు ఏమయ్యాయని ప్రశ్నిస్తే, మా ఇంట్ల మాసిపోయి గోడకేసి వున్నాయి..తెచ్చియ్యమంటే తెచ్చిస్తాను అని తెలంగాణను అవమానించిన నాయకులు కాంగ్రెస్‌ నాయకులు కాదా? ఇప్పుడు తెలంగాణ మేమిచ్చామంటూ చిలకపలుకులు పలుకుతున్నారు. తెలంగాణలో 1969లో సమారు 375 మంది, తర్వాత 2004నుంచి 2014 దాకా 1200 మందికి పైగా యువత ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్‌ నాయకులు కారణం కాదా? వీటికి కాంగ్రెస్‌ నాయకుల దగ్గర సమాధానం లేదు. సీమాంధ్ర నాయకుల ముందు మాట్లాడడానికి ఇప్పటికీ నోట్ల నాలుక లేని, వారి ముందు కూర్చునేందుకు వెన్నెముక లేని నాయకులు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, ప్రజల ఆత్మగౌరవం నిలుపుతారా? హైదరాబాద్‌లో సెటిల్‌ అయిన సీమాంధ్ర ప్రజల ఓట్ల కోసం ఆశపడుతూ, వారి ఆశీస్సులతో అధకారం కోరుకుంటున్న కాంగ్రెస్‌ నాయకులు మరోసారి ఆ ప్రాంత ప్రజల ప్రయోజనాలే కోరుకుంటున్నారు. కాని తెలంగాణ కోసం కాదన్నది ఇక్కడే స్పష్టమౌతోంది. అందుకే ఎక్కడికెళ్లినా తెలంగాణ ప్రజలు కేసిఆర్‌ ఎందుకు కావాలో స్పష్టంగానే చెబుతున్నారు.
కారే రావాలి…మళ్లీ కేసిఆరే ముఖ్యమంత్రి కావాలి.
బిఆర్‌ఎస్‌ పార్టీయే అధికారంలోకి రావాలి. అని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతిపక్షాలు ఎంత మభ్య పెట్టాలని చూసినా, ప్రజలు నమ్మేందుకు సిద్దంగా లేరు. పల్లెనుంచి పట్నందాక ఒకటే మాట. ముఖ్యమంత్రి కేసిఆర్‌నే తమ ప్రయాణం అని ప్రజలే స్పష్టం చేస్తున్నారు. రెండు వేలు పించన్‌ ఇచ్చి మమ్మల్ని సాదుతున్న పెద్ద కొడుకు కేసిఆర్‌ అని తెలంగాణ సమాజం అంటోంది. కేసిఆర్‌తోనే తెలంగాణ వచ్చింది. అభివృద్ధి జరిగింది అన్నది జనం మదిలో గూడుకుట్టుకున్న మాట. అది నిజం కూడా…తెలంగాణలో నిత్య నరకం అనుభవిస్తున్న రైతును చూసి చలించి, సామాన్యుల వెతలు చూసి కన్నీళ్లు పెట్టుకొని, పిడికిలెత్త జై తెలంగాణ అని దిక్కులు పిక్కటిల్లేలా నినదించింది ఒక్క కేసిఆరే… అందుకే ఆయనతోనే మేము..మా కోసమే కేసిఆర్‌ అని ప్రజలు బలంగా నమ్ముతున్నాడు. మూడోసారి కేసిఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెబుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version