అల్లమా? అబద్దమా!?

https://epaper.netidhatri.com/

` గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఏం చేయలేదని మీ ఉద్దేశ్యమా?

`పదేళ్లు ప్రెస్‌ అకాడెమీ చైర్మన్‌గా ఏం చేయడానికి అవకాశం రాలేదని చెప్పడం ఆంతర్యమా!

`ఎన్నికల సమయంలో ఒక్క మీట్‌ ది ప్రెస్‌ ఏర్పాటు చేయలేకపోయావా?

`అన్నా..హరీషన్న అంటే ఎంతో మంది జర్నలిస్టులకు కరోనా కాలంలో సాయం చేశారు.

`ఒక్క ట్విట్‌తో కేటిఆర్‌ స్పందించేవారు.

`జర్నలిస్టుల సంక్షేమం కోసం కేసిఆర్‌ వంద కోట్ల నిధులిచ్చారు.

`పదేళ్లలో జర్నలిస్టులకు నేనిది చేశానని ఒక్కటి చెప్పు!

`అప్పటి ప్రభుత్వ పెద్దలు పెద్ద పీట వేస్తేనే చేసిందేమీ లేదు?

`ఇప్పుడు ప్రభుత్వంతో కొట్లాడతావా?

`చెప్పడానికి మీకు లేకపోయినా వినడానికి జర్నలిస్టు సమాజం సిగ్గుపడుతుంది?

`ఇప్పుడు జర్నలిస్టుల కలలు నిజం చేస్తావా?

`ఇంకా నిన్ను జర్నలిస్టులు నమ్ముతారా?

`ఇప్పుడు అసలు ప్రభుత్వ పెద్దలు మెట్లైనా ఎక్కనిస్తారా?

`ఇప్పుడు హెల్త్‌ కార్డులు గుర్తుకొచ్చాయా?

`జర్నలిస్టులకు ఇండ్లు ఇప్పిస్తావా?

`నమ్మినందుకు బిఆర్‌ఎస్‌ను నిండా ముంచావు.

`పదేళ్లలో ఒక్కనాడైనా మీడియా ముందుకు వచ్చావా?

`ఇప్పుడు ఏదో వెలగబెడతావా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అవకాశవాది అవతారం ఎత్తుతున్నావా? అల్లం నారాయణ. అల్లమా! ఇక చాలించు…ఏం చెప్పదల్చుకున్నావ్‌ అల్లం నారాయణ. నేను మంచివాడినే…పోరాట యోధుడినే కానీ మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ నా కాళ్లు, చేతులు కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టాడని చెప్పదల్చుకున్నావా? వద్దు, వద్దంటున్నా పదేళ్లు పదవి ఇచ్చి నా నోరు మూయించాడని చెప్పాలనుకుంటున్నావా? జర్నలిస్టుల సమస్యల మీద ఎన్ని సార్లు మాట్లాడాలని చూసినా అవకాశం ఇవ్వలేదని మధనపడినట్లు నిట్టూర్పు వెల్లడిరచాలని అనుకుంటున్నావా? నా పదవి కోసం మాత్రమే సమయమిచ్చారని, జర్నలిస్టుల సమస్యలు అనగానే వెళ్లగొట్టే వారని చెప్పదల్చుకున్నావా? నాకు మేలు జరిగింది.. కానీ అయ్యో మీకు మేలు చేయలేకపోయానని మొసలి కన్నీరు కార్చేందుకు చూస్తున్నావా? కుర్చీలో కూర్చున్నంత కన్నీళ్లతోనే కాలం గడిపానని మభ్యపెట్టదల్చుకున్నావా? పదవిలో పదేళ్లు వున్నా కడుపు నిండా తిన్నది లేదు, కంటి నిండా నిద్రపోయింది లేదు. జర్నలిస్టుల బాధలు నన్ను నిద్రపోనివ్వలేదని జర్నలిస్టులను పట్టుకొని ఏడవాలనుకుంటున్నావా? ఇంతకీ ఏం చెప్పాలనుకొని మీడియా ముందుకు వచ్చావ్‌…ఎవరని బద్నాం చేద్దామని నిర్ణయించుకున్నావ్‌…నాయకులమని చెప్పుకున్న వారికి తప్ప ఏనాడైనా జర్నలిస్టుల మొహం చూశావా? వారి సమస్యలు విన్నావా? విని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లావా? తిన్నింటి వాసాలు లెక్కబెట్టడానికి బయలుదేరావా? అసలు ఏ జర్నలిస్టైనా నిన్ను నమ్ముతారని అనుకుంటున్నావా? నీ వెంట నడిచేందుకు సిద్దంగా వున్నారనుకుంటున్నావా? ఎలా జర్నలిస్టు నాయకుడిని అనుకుంటున్నావ్‌ నారాయణ. తెలంగాణ పోరాట యోధుడు ఎక్కడైనా మౌనం దాల్చుతాడా? గొంతు వినపడకుండా దాచుకుంటాడా? పదేళ్ల పాటు మూగ నోము పాటిస్తాడా?

గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం జర్నలిస్టులకు ఏం చేయలేదని మీ ఉద్దేశ్యమా?
జర్నలిస్టులకు గత ప్రభుత్వం ఏ ఒక్కరికీ ఇల్లు ఇవ్వలేదని చెప్పడానికి మీడియా ముందుకు వచ్చావా? నిజంగా జర్నలిస్టుల సమస్యలను పేపర్‌ మీద రాసుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దగ్గరకో, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి దగ్గరకు వెళ్లగలవా? ఏ ముఖం పెట్టుకొని వెళ్తావు. పదేళ్లు ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా వుండి ఏం చేశావని వాళ్లు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతావు. పదవి ఇచ్చారుగాని పనులు చేయలేదని చెబుతావా? జర్నలిస్టులకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెబుతావా? మోసం చేసిందని చెప్పగలవా? జర్నలిస్టులకు న్యాయం చేయలేకపోయిన అసమర్థుడిని చెప్పుకుంటావా? నా తప్పేం లేదని తప్పించుకుంటావా? గత ప్రభుత్వం జర్నలిస్టు సమాజానికి ఏం చేయనప్పుడు పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు. జర్నలిస్టుల గొంతక ఎందుకు కాలేదు? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం జీతం తీసుకుంటూ నమస్తే తెలంగాణ లో ఉద్యోగం చేశావు. దానిని కూడా త్యాగంగా చెప్పుకున్నావు. తెలంగాణ వచ్చాక ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా పదవిని అనుభవించావు. మరి జర్నలిస్టు సమాజానికి ఏం చేశావు? చెప్పడానికి ఏమీ లేకపోవడంతో పదేళ్లు ప్రెస్‌ అకాడెమీ చైర్మన్‌గా ఏం చేయడానికి అవకాశం రాలేదని చెప్పడం అసమర్థుని జీవిత యాత్ర అని అనుకుంటున్నావా? నీకు అన్ని రకాల అవకాశాలు నిన్నటి ప్రభుత్వం కల్పించింది. కానీ నీ కాలు ఇల్లు కదలలేదు. జర్నలిస్టులకు మేలు చేయాలన్న సోయి నీకు రాలేదు. జర్నలిస్టుల సంక్షేమానికి నీకు మనసు రాలేదు. మొత్తంగా జర్నలిస్టు సమాజానికి నువ్వేమీ చేయలేదు. ఇదే తెలంగాణలో వున్న వేలాది మంది జర్నలిస్టుల అభిప్రాయం.
అన్నా..హరీషన్న అంటే ఎంతో మంది జర్నలిస్టులకు కరోనా కాలంలో సాయం చేశారు.
మంత్రులుగా ఎంతో బిజీగా వున్న హరీష్‌ రావు లాంటి వారు అనేక సార్లు స్పందించారు. ఇంత పెద్ద తెలంగాణ జర్నలిస్టు సమాజం కరోనా సమయంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా ముందు వరుసలో నిలబడిరది. అలాంటి సమయంలో ఉద్యోగులకు ప్రత్యేక వైద్య సదుపాయాల అందాయి. కానీ జర్నలిస్టులకు ప్రైవేటు ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించే కృషి అల్లం చేయలేదు. ఎంతో మంది జర్నలిస్టులు మృత్యువాత పడ్డారు. వారి కుటుంబాలు వీధినపడ్డాయి. ఎంతో మంది జర్నలిస్టులు కరోనా వైద్యం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకున్నారు. ఇప్పటికీ అనారోగ్యం వెంటాడుతూ, వృత్తికి దూరమైన వాళ్లు వున్నారు. అదే సందర్భంలో ఒక్క ట్విట్‌తో కేటిఆర్‌ స్పందించేవారు. కానీ అల్లం జాడ ఆ సమయంలో ఎవరికీ దొరకలేదు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కేసిఆర్‌ వంద కోట్ల నిధులిచ్చారు. ఆ సమయంలో వాటిని వెచ్చిస్తామని చెబితే కేసిఆర్‌ వద్దనే వారా? ఈ పదేళ్ల కాలంలో గొప్పలు తప్ప, జర్నలిస్టు కొన్ని తరాల వరకు మర్చిపోలేనిది ఏదైనా వుందా? జర్నలిస్టు సమాజం మొత్తం ముక్త కంఠంతో ఒప్పుకునే ఒక్కటి చెప్పు! చెప్పలేవు. ఎందుకంటే నువ్వు చేయలేదన్నది నూరుపైసల నిజం. చెప్పినా ఎవరూ నమ్మరన్నది ముమ్మాటికీ నిజం.
పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరిగినట్లు చేశావు.
గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతో నమ్మకంతో పెద్ద పీట వేస్తేనే చేసిందేమీ లేదు? ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంతో మాట్లాడతావా? రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంతో కొట్లాడతావా? నలుగురు జర్నలిస్టులను తీసుకొని రొడ్డెక్కగలవా? నీ వెంట నడిచేందుకు నలుగురు జర్నలిస్టులు వస్తారనుకుంటున్నావా? చెప్పడానికి మీకు లేకపోయినా వినడానికి జర్నలిస్టు సమాజం సిగ్గుపడుతుంది? ముందు అది తెలుసుకో..పదేళ్ల కల నుంచి ఇప్పుడు మేలుకొని వచ్చినట్లు జర్నలిస్టుల కలలు నిజం చేస్తావా? అది జర్నలిస్టు సమాజం నమ్మమంటావా? ఇంకా నిన్ను జర్నలిస్టులు నమ్ముతారా?అసలు ప్రభుత్వ పెద్దలు మెట్లైనా ఎక్కనిస్తారా? ఇప్పుడు హెల్త్‌ కార్డులు గుర్తుకొచ్చాయా? అంటే గత ప్రభుత్వం జర్నలిస్టుల ఆరోగ్యాలను గాలికి వదిలేసిందని నువ్వు చెబుతున్నట్లేనా? అసలు గత ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్‌ కార్డులు జారీ చేయలేదని చెప్పదల్చుకున్నావా? మరి ఆసుపత్రిలలో జర్నలిస్టుల పేరిట జరిగిన వైద్యమంతా అబద్దమని చెప్పదల్చుకున్నావా? జర్నలిస్టులకు ఇండ్లు ఇప్పిస్తావా? గత పదేళ్ల కాలంలో తెలంగాణలో జర్నలిస్టులకు ఇండ్లు ఇచ్చిన దాఖలాలు లేవని ప్రచారం చేయదల్చుకున్నావా? కొన్ని నియోజకవర్గాలలో, జిల్లాలలో జర్నలిస్టులకు అందిన ఇండ్లు నిజం కాదా? అదంతా అబద్ధమని చెబుతున్నట్లేనా? జర్నలిస్టులకు ఇండ్లు ఇచ్చినట్లు అప్పటి మంత్రులు, ఎమ్మెల్యే చెప్పిన ముచ్చట అంతా తూచ్‌ అని అల్లం నిర్థారణ చేసినట్లేనా? నిన్ను నమ్మినందుకు బిఆర్‌ఎస్‌ను నిండా ముంచావు. అది కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఏదో చేయాలనుకున్నావు. పదవిలో వున్నప్పుడు ఆరోగ్యం సహకరిస్తలేదని అనేక మందితో అన్నట్లు గుర్తు. ఇప్పుడు హటాత్తుగా మీడియా ముందుకు వచ్చేంత పవర్‌ ఒక్కసారిగా ఎలా వచ్చే…పదేళ్లలో ఒక్కనాడైనా మీడియా ముందుకు వచ్చాయా? ఇప్పుడు ఏదో వెలగబెడతావా?
ఎన్నికల ముందు ప్రతి యూనియన్‌ మీట్‌ ది ప్రెస్‌ ఏర్పాటు చేయడం అన్నది ఒక ఆనవాయితీగా మారింది.
దాదాపు అన్ని గుర్తింపు వున్న యూనియన్లు కూడా మీట్‌ ది ప్రెస్‌ ఏర్పాటు చేస్తున్నారు. 2014 నుంచి 2023 వరకు యూనియన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అల్లం నారాయణ ఎందుకు మీట్‌ ది ప్రెస్‌ ఏర్పాటు చేయలేదు. జర్నలిస్టుల సమస్యలపై ఎందుకు పార్టీల వైఖరి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అంతగా ఎన్నికల సమయంలో పొడిచేసే కార్యక్రమాలు వున్నాయి. అంతా డొల్ల. అవకాశవాదం. జర్నలిస్టుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టి, పబ్బం గడుపుకోవడం అలవాటు చేసుకున్నాడన్నది అందరూ అంటున్న మాటే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!