మోదీ ప్రసంగంపై ఈసీ క్లీన్ చిట్
దిల్లీ, నేటిధాత్రి: కక్ష్యలోని ఉపగ్రహాన్ని క్షిపణితో కూల్చివేసే ఏ శాట్ పరీక్ష విజయంపై దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై ఎన్నికల కమిషన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ విషయంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘన జరగలేదని ఈసీ స్పష్టం చేసింది. ప్రధాని ప్రసంగించే సమయంలో పార్టీ పేరును ప్రస్తావించడం, ఓట్లు అభ్యర్థించడం వంటివి చేయలేదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఉపగ్రహ నిరోధక పరీక్ష విజయంపై గత బుధవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే….