ఫస్టు వికెట్‌ డౌన్‌..

మధుకు సెక్షన్‌ మార్పు? మెమో జారీ?
క్లర్కును పక్కసెక్షన్‌కు పంపడం కూడా చర్యలేనా?
క్లర్కును మార్చడమంటే తప్పు జరిగినట్లే…మరి మిగతా వారి సంగతేంది?
క్లర్కు ఎరనా?….లేక తిమింగలమా? తేల్చకుండా వదిలేయడం అంటే అర్ధమేమిటి?
సెక్షన్‌ ఇన్‌చార్జి, సూపరెండెంటుకు తెలియకుండానే ఇదంతా జరిగిందా?
కొత్తగా తెరమీదకు వచ్చిన జిరాక్స్‌ ఛలాన బాగోతమేటి?
ఒకటే ఛలాన మీద రెండుసార్లు స్టాంపు పేపర్లు ఎలా ఇచ్చారు?
ఇది పైదాకా వెళ్లిందా? ఇక్కడే క్లోజ్‌ చేశారా?
ఇక్కడ కూడా సబ్బారావు ఆశీస్సులేనా?
కమీషనర్‌గారు ఒక్కసారి లుక్కేయండి?
జిరాక్స్‌ల కథాకమామిషు తేల్చండి?
కాస్త ప్రక్షాళన చేపట్టండి?
సస్పెండ్‌ అయిన వారిపై చర్యలు లేకుండా ఎలా వుండవో చెప్పండి?
నేరాలు చేసి ఎలా మళ్లీ కుర్చీల్లో కూర్చుంటున్నారో చూడండి?
మాటలు మార్చినంత సులువులుగా ఫైళ్లు కూడా మాయం చేయడం ఒక కళేమో! రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కార్యాలయాల్లో కూడా మాటలే కాదు, చేతలు ఇలాగే వుంటాయి. గోల్‌మాల్‌ వ్యవహరాలు సాగుతూనే వుంటాయి. అందులో భాగమే క్లర్క్‌ మధు మాయాజాలం. నేటిధాత్రిలో బుధవారం ప్రచురితమైన ‘స్టాంపు పేపర్లు కిదర్‌ గయా’ అనే వార్తకు అధికారులు కొద్దిగా స్పందించారు. క్లర్కు మధును ఆ స్ధానం నుంచి కదిలించి, మెమో జారీ చేసి, పక్క సెక్షన్‌కు మార్చారు. ఇంతే…ఇది కూడా పనిష్మెంటే అన్నంత గొప్పగా చెప్పుకుంటున్నారు. తప్పు చేసినవారిని ఉపేంక్షిచేంది లేదన్నంతగా మధును మరో సెక్షన్‌కు మార్చేచి చేతులు దులుపుకున్నారు. ఇంతకీ మధు అనే క్లర్క్‌ ఎరనా….లేక తిమింగలమా అన్నది మాత్రం తేల్చలేదు. మధు ఎరే…అయితే అసలు తిమింగలాలు ఎవరు? అన్నది కూడా తేలాలి. మధును మార్చినట్లే ఆయన చేత చేయించిన వారిని కూడా సాగనంపాలి. కాని అది జరగలేదు. ఇంతకీ ఈ వ్యవహారంలో మధు ఎవరికీ తెలియకుండా చేశాడా? చేస్తుంటే సెక్షన్‌ ఇన్‌చార్జి, సూపరెండెంటు కళ్లు మూసుకున్నారా? ఏ ఒక్క స్టాంపు పేపర్‌ బైటకు వెళ్లినా, వారి పర్యవేక్షణ లేకుండా కదలొద్దు. అలాంటిది ఒక్క మధు మాత్రమే నిర్ణయం తీసుకునేంత పెద్దరికం ఆయన చేతిలో వుందా? అన్నది కూడా ఉన్నతాధికారులే చెప్పాలి. అనుమతి లేకుండ ఇంకా ఎన్ని వెళ్లాయో? అన్నది ఎలా తెలియాలి. ఈ వ్యవహారంలో తవ్వినా కొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఏంటంటే?: ప్రభుత్వశాఖలపై వివరాలు బైటకు రావడం సహజం. అలాంటి వార్తలలో అసలు విషయాలు చాలా మరుగునే వుంటాయి. చిన్న చిన్న విషయాలు మాత్రమే బైటకు వస్తుంటాయి. అలాంటి విషయాల్లో ఒకదాని తర్వాత ఒకటి కొన్ని సార్లు వెలుగులోకి వస్తుంటాయి. అందులో మూడేళ్ల క్రితం మూడు లక్షల రూపాయల స్టాంపు పేపర్లుకు ఎలాంటి లెక్కలు లేకుండా రెక్కలొచ్చి వెళ్లిపోయాయి అన్నది ప్రచారం సాగింది. ఈ విషయాన్ని నేటిధాత్రి బైట పెట్టింది. దాంతో ఏం చెప్పాలో అధికారులకు పాలు పోలేదు. దాంతో అసలు విషయం అది కాదంటూ కొత్త కథ అల్లేశారు. అందులో శివకుమార్‌ అనే స్టాంపు వెండర్‌కు స్టాంపు పేపర్లు కార్యాలయ క్లర్కు అందజేశాడని అన్నారు. తర్వాత రూ.50వేలకు చెందిన ఛలానా చెల్లించడం జరిగిందన్నారు. ఇది పొంతన లేని సమాధానం. అసలు జరిగిందెంత? అన్నదానిపై స్పష్టత నివ్వాల్సిన సమయంలో అబ్బే జరిగింది అంత కాదు..ఇంత అని ఒప్పుకోవడం జరిగింది. కాని ఇందులో రసవత్తరమైన సంఘటన జరిగినట్లు మరొక విషయం తెలిసింది. ముందు శివకుమార్‌ అనే స్టాంపు వెండర్‌ డూప్లికేట్‌ ఛలాన సమర్పించి రూ.50వేల స్టాంపు పేపర్లు తీసుకెళ్లాడట…అదే నిజమైతే క్లర్క్‌ చూసుకోకుండా ఇచ్చే అవకాశం లేదు. కాని స్టాంపు వెండర్‌కు స్టాంపు పేపర్లు ఇవ్వడం జరిగింది. ఎందుకూ అంటే…అసలు ఛలాన ఎక్కడో పెట్టాను. మర్చిపోయాను. గుర్తు రావడంలేదు. కాకపోతే దానికి సంబంధించిన జిరాక్స్‌ ఇప్పుడు సమర్పిస్తాను. తర్వాత ఒరిజినల్‌ తెచ్చి ఇస్తానంటే రూ.50వేల స్లాంపు పేపర్లు ఇచ్చారట. ఇది నమ్మశక్యమైన మాటేనా…ఇదే కాదు..మరో ట్విస్టు కూడా వుంది. అదే శివకుమార్‌ తర్వాత మరోసారి అసలు ఛలానా తెచ్చి రూ.50వేల స్టాంపు పేపర్లు తీసుకెళ్లడానికి వచ్చాడట. అప్పుడు ఈ పాత ఛలానతో ఎలా ఇస్తాం…గతంలోనే దీని జిరాక్స్‌ ఇచ్చి, స్టాంపు పేపర్లు తీసుకెళ్లావని క్లర్కు గుర్తు చేస్తే, నేనెప్పుడిచ్చాను…మీరు స్టాంపు పేపర్లు నాకెప్పుడిచ్చారని ప్లేటు పిరాయించాడట. దాంతో అసలు గుట్టు బైట పడుతుందని తేలు కుట్టిన దొంగలా శివ కుమార్‌కు మళ్లీ రూ.50వేల స్టాంపు పేపర్లు ఇచ్చారట. సినిమాలో కూడా ఇన్ని ట్విస్టులు వుండవు. అసలు జిరాక్స్‌ కాపీతో స్టాంపు పేపర్లు ఎలా ఇచ్చారు? తర్వాత అదే స్టాంపు వెండర్‌ ఒరిజినల్‌ ఇస్తే పాతదాన్ని చూపించి కొత్తది ఎందుకు అందులో జత చేయలేదు? మళ్లీ అదే ఛలనాకు స్టాంపు పేపర్లు ఇవ్వడమేమిటి? ఎవరు నిజం చెబుతున్నటు? ఎవరు ఎవరికి భయపడుతున్నట్లు? ఒక స్టాంపు వెండర్‌ ఆఫీస్‌ సిబ్బందిని బెదిరించేంత స్ధితి ఎందుకొచ్చింది? ఎవరు కల్పించారు? అతను అంత గట్టిగా మాట్లాడాడంటే లోపం ఎక్కడుంది? నిజంగా ఒక స్టాంపు వెండర్‌ జిరాక్స్‌ ఛలాన తెచ్చి ఇవ్వడమే తప్పు. దాన్ని ఛలనాగా భావించి స్టాంపు పేపర్లు ఇవ్వడం క్లర్క్‌తో పాటు, కార్యాలయం సిబ్బంది చేసిన నేరం. దాన్ని కప్పిపుచ్చుకోవడమే కాకుండా, మళ్లీ అదే ఛలాన ఒరిజినల్‌ తెచ్చి ఇస్తే, మరోసారి అదే నెంబర్‌ మీద స్టాంపు పేపర్లు ఇవ్వడం అంటే మరో నేరం. ఒకసారి తప్పు చేయడమే పెద్ద తప్పు. దాన్ని కప్పి కప్పుపుచ్చునేందుకు మరోసారి నేరం చేసి కూడా ఏం జరగనట్లు, అదో చిన్న పొరపాటు అన్నట్లు క్లర్కును మరో సెక్షన్‌కు మార్చడమంటేనే ఇందులో ఏదో పెద్ద గూడుపుఠాణీ వున్నట్లే లెక్క. ఆ బొక్కను తవ్వితే గాని, అసలు లెక్కలు బైటకు రావు. కలుగులో దాక్కున్న ఎలుకలను పట్టుకోలేరు.
సానుభూతితో ఉద్యోగం…?: సరే క్లర్కు ఆనార్యోగంతో బాధపడుతున్నప్పుడు ఆయనకు ఇంత పెద్ద పని అప్పగించడం తప్పు కాదా? ఆయనకూడా ఇలాంటి పని కాకుండా ఎలాంటి టెన్ష్‌న్‌ లేని సీటు కోరుకోవచ్చు కదా? ప్రభుత్వానికి చెందిన ప్రతి రూపాయి లెక్క చూపాల్సిన పెద్ద బాధ్యతను ఎందుకు ఎత్తుకున్నట్లు? చిన్న ఉద్యోగి కార్యాలయానికి కారులో వచ్చేంత సీనుంటుందా? ఇలా ప్రభుత్వాదాయానికి కన్నంపెడుతుంటే జీతంతో పనేముంటుంది. ఇక క్లర్కును పక్కన పెడితే సమస్య తీరినట్లేనా….
సుబ్బారావు ఆశీస్సులే ఇంత దూరం తెస్తున్నాయా?: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పనిచేసేవారందరికీ సుబ్బారావు ఆశీస్సులు మెండుగా వుంటాయన్నది అందరూ చెప్పుకునే మాటే…మసి బూసుకున్నా సరే…తుడిచేసేంత పెద్ద చేయి ఆయనదట. అందుకే ఎవరు ఎన్ని చేసినా కూడా…మై హూనా అంటుంటారట. కింది స్ధాయి నుంచి పైకెదిగిన ఉద్యోగికి అన్ని వర్గాల ఉద్యోగులతో సత్సంబంధాలు కామన్‌…అలాగే లొసుగులు కూడా తెలియడం కామన్‌…ఇదే కామన్‌గా అందరికీ సుబ్బారావు కనిపించడం…ఆదుకుంటాడనే నమ్మకం కల్గించడం…ఎవరెవరు ఏమనుకున్నా…సరే…అంతా మా వెనుకు వున్న కొండంత అండ చూసుకుంటాడన్న ధీమా…ఆహా…రాజ్యమేలాంటే కిరీటాలే కావాలా అన్నారట. ఇలా పై స్ధాయి ఆశీస్సులు కూడా వుంటే సరే…కాపాడే సుబ్బారావు లాంటి వారు ఒక్కరుంటే చాలు…ఏదైనా మాఫ్‌…అంతే సేఫ్‌…
కమీషనర్‌గారు…ఒక్కసారి లుక్కేయండి…ఈ బాగోతాలేమిటో చూడండి?: రిజిస్ట్రేషన్ల కమీషనర్‌కు ఆ శాఖలో జరిగే అవినీతిని అంతం చూసేదాకా వదిలిపెట్టరన్న పేరుంది. ఆయన దృష్టికి వచ్చిన ఏ సమస్యను వదిలే సమస్య లేదని అంటారు. ఎక్కడ ఏ మూలన ఏది జరిగినట్లు ఆయన దృష్టికి వచ్చినా సరే క్షణాల్లో స్పందిస్తారు. వారిని తొలగిస్తారు. కాని ఆయన దాకా వెళ్లకుండా మధ్యలోనే సుబ్బారావులు అన్నీ సమకూర్చుతుంటారట. దాంతో పైన కూర్చున్న కమీషనర్‌తో ఏం పని…కాపాడే వారున్నాక అడ్డూ అదుపూ ఏముంది? దాంతో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో సస్పెండ్‌ అయిన ఎంతో మంది ఉద్యోగుల మీద చర్యలు లేవు. వారి ఉద్యోగాలు తొలగించింది లేదు. కేసులు నమోదు చేసి, జైలుకు పంపించింది. ఎంత ఖర్చైనా సరే మళ్లీ ఉద్యోగం ఖాయం…మళ్లీ మళ్లీ వెనకేసుకోవడం తధ్యం…అందుకే ఒక్కసారి కొంత కాలం ఇటు వైపు లుక్కేస్తే ఎంతో మంది దొరికిపోతారు…దొరికిన వారు దారికొస్తారు….లేకుంటే మళ్లీ ఉద్యోగాల్లో చేరుతారు..ఈ సెక్షన్‌ కాకపోతే మరో సెక్షన్‌లో కొంత కాలం దూరిపోతారు…మళ్లీ పాత సీట్లోకొచ్చి కూర్చుంటారు…ఇదే కామన్‌…

దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధం కండి సీఎం కేసీఆర్ పిలుపు

 

*నేటిధాత్రి హైదరాబాద్*
12-1-2022
గ్రామీణ వ్యవసాయ రంగాన్ని, దేశ ఆర్థిక రంగాన్ని చిన్నాభిన్నం చేస్తూ, వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని కూకటివేళ్లతో పెకలించి వేయాలని, వీరిని ఎక్కడికక్కడ నిలదీయాలని దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. కేంద్రం తక్షణమే స్పందించి, పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించకపోతే.. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి కేంద్రప్రభుత్వం మెడలు వంచుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచేలా కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీనిపై తన నిరసన వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాయనున్నారు.
రైతుల ఆదాయాన్ని 2022 నాటికల్లా రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్రప్రభుత్వం, ఎరువుల ధరలు విపరీతంగా పెంచి దేశ రైతాంగం కోలుకోలేకుండా దెబ్బతీసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి మాట తప్పిన కేంద్రం.. ఉల్టా రైతుల పెట్టుబడి ఖర్చులనే రెట్టింపు చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం అని నిర్ధారణ అయిందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయడం, ఎరువుల ధరలను విపరీతంగా పెంచడం, అష్టకష్టాలు పడి రైతులు పండించిన ధాన్యాన్ని కూడా కొనకపోవడం లాంటి రైతు వ్యతిరేక చర్యలతో… నేడు దేశంలో రైతులు బతికి బట్టకట్టలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఒక్కసారిగా ఎత్తివేసి, రైతులను వ్యవసాయం చేయకుండా దూరంచేస్తున్న బీజేపీ పార్టీపై, కేంద్ర ప్రభుత్వంపై దేశ రైతాంగం ఐక్యంగా తిరగబడితే తప్ప, వారికి బుద్ధి రాదన్నారు. కేంద్రం తక్షణమే స్పందించి, పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించకపోతే దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. రాష్ట్ర రైతాంగం కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని, ధరలు తగ్గించే దాకా.. పోరాడాలన్నారు.
ఎనర్జీని వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే వ్యతిరేకిస్తూ, వ్యవసాయాన్ని నెమ్మది నెమ్మదిగా కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టే కుట్రలు చేస్తున్న బిజెపి చర్యలను దేశ రైతాంగం గుర్తించాలన్నారు. రైతుల పొలాల్లో.. రైతులనే కూలీలుగా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఐక్యంగా ఎదుర్కోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

రికాంలేని రిజిస్ట్రార్ల ఆమ్దానీ` ‘2’

` మధుమాయ…స్టాంపు పేపర్లు కిదర్‌ గయా..?
` మూడు లక్షల విలువైన పేపర్ల మూడేళ్ల కింద మాయం?
` జరిగింది నిజమే కాని అంత కాదు…అంటున్న క్లర్కు?
` అంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్లే కదా..?
` అయినా ఇప్పటి వరకు దిక్కూదివానం లేని పర్యవేక్షణ?
` అధికారులు పట్టించుకోరు…విచారణ చేయరు
` లెక్కలు చూసింది లేదు? తేల్చింది లేదు?
` ఇదంతా జరుగుతున్నా శాఖలో ఉలుకు లేదు? పలుకు లేదు??
` అంతా పైవాడు చూసుకుంటాడన్న నమ్మకమా..?
` సుబ్బారావు చెంతనుండగా…చింతెందుకు అనుకుంటున్నారట?
` క్లర్కు కాళ్లు మొక్కిండని అధికారులు వదిలేశారట?
` ప్రజాధనం కొల్లగొట్టి దయాగుణం చూపెట్టిన అధికారులు భలే…భలే…?
హైదరాబాద్‌ , నేటిధాత్రి :
తాడి చెట్టుకిందకు ఎందుకు వెళ్లావంటే దూడ గడ్డి కోసమని ఎవరైనా సమాధనం చెబితే ఎలా వుంటుంది. సరిగ్గా వరంగల్‌ రిజిస్ట్రేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్యాలయ క్లర్కు మధు చెప్పే, చెప్పించే సమాధానాలు సరిగ్గా అలాగే వున్నాయి. మూడేళ్ల క్రితం మీ ఆఫీసులో ఏం జరిగిందని నేటి ధాత్రి ప్రశ్నిస్తే…నాకు గుండె జబ్బు వుందన్న సమాధానం చెప్పించాడు. రెవిన్యూ స్టాంపులు మాయమైనట్లు మాకు సమాచారం వుందని అంటే నా గుండెలో మిషన్‌ ఏర్పాటు చేశారు. సౌండ్‌ బైటకు కూడా వినిపిస్తుంటున్నాడు. అసలు స్టాంపు పేపర్లు ఎలా మాయమయ్యాయని అడుతుంటే అప్పుడు వేరే రిజిస్ట్రార్‌ వుండేవారంటారు…అదేంటి పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. మేం అడుగుతున్నదేమిటి? మీరు చెబుతున్నదేమిటి? అని అంటే శివకుమార్‌ అనే స్టాంపు వెండర్‌ రూ.50వేల రూపాయల చలాన్‌ తర్వాత చెల్లించేశాడని అంటున్నారు. అసలు ఎక్కడైనా ప్రశ్నకు, సమాధానానికి పొంతన వుందా? అందుకే తాడిచెట్టు సామెత చెప్పాల్సివచ్చింది.
ఇంతకీ ఏం జరిగిందంటే సరిగ్గా మూడేళ్ల క్రితం వరంగల్‌ రిజిస్ట్రేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్యాలయం నుంచి రూ.3 లక్షల రూపాయల విలవైన స్టాంపు పేపర్లు మాయం అయ్యాయి. అందుకు కార్యాలయ క్లర్కు మధు కారణం అంటున్నారు. అబ్బే జరిగింది అంత కాదు. కేవలం రూ. 50 వేల స్టాంపు పేపర్లే కాని, ఆ తర్వాత సంబంధిత స్టాంపు వెండర్‌ శివకుమార్‌ ఛలాన చెల్లించేశాడు. కావాలంటే లెక్కలు చూసుకోవచ్చు. ఇదీ క్లర్కు మధు వివరణ. అంటే జరిగింది వాస్తవమే కాని, జరిగింది 3 లక్షలు కాదు…అని ఒప్పుకున్నట్లు కాదా? ఇప్పటికైనా పై అధికారులు పట్టించుకుంటారా లేదా? ఎలా జరిగిందన్నది విచారిస్తారా లేదా? క్లర్కు తన మాటల్లోనే అంత కాదు, ఇంత అనే విషయాన్ని ఒప్పుకున్న విషయం మీకు తెలియంది కాదా? ఆలస్యమైనా సరే…తప్పు చేసిన వారిని ఉపేక్షిస్తారా? దయాగుణం చూపించి వదిలేశారా? లేక ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అని సైలెంటు అయ్యారా? ఇంత కాలం బైటక పొక్కకుండా దాచేశారా?
సహజంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు సంబంధిత సూపరెండెంటు, సెక్షన్‌ ఇన్‌ఛార్జిలు బాధ్యత వహించాలి. చేసింది క్లర్కు అయినా చేయించిన వాళ్లు వెనుక ఎవరున్నారు? అవి ఎవరు ఎవరికివ్వమన్నారు? ఎవరికిచ్చారు? ఎవరు వాటిని వాడేసుకున్నారు? అన్న సంగతి కార్యాలయం మొత్తానికి తెలియకుండా జరుగుతుందా? కాని ఎవరూ కిమ్మనలేదు. ఎవరూ పట్టించుకోలేదు. ఎవరూ ఎలా జరిగిందని ఆరా తీయలేదు. సరికదా…లక్షలాది రూపాయల ప్రజా ధనం వృధా చేసిన వ్యక్తులకు అండగా నిలుస్తున్నారు. అంటే అర్ధమేమిటి? ఆఖరుకు మాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్లర్కు ఉన్నతాధికారుల కాళ్లు మొక్కాడని వదిలేశారట. ఎంత భలేగా వుంది కదా! అధికారులది ఎంత జాలి గుండెనో…ప్రభుత్వ ధనం లూటీ చేసిన వారిని కూడా క్షమించేంత దయా గుణం వారికే సొంతం. పోయింది వారి సొమ్ము కాదు కదా? రాజుల సొమ్ము రాళ్ల పాలు అది గతం. ప్రజల సొమ్ము అధికారులపాలు అని మార్చినట్లున్నారు.
అసలు ప్రభుత్వ కార్యాలయం అంటే ఎలా వుంటుంది? గుండు పిన్ను కొన్నా లెక్కుండాలి. ఒక్క కాగితం వాడినా లెక్కరాయాలి. ఇదీ సర్కారు లెక్కల సంగతి. కాని ఏకంగా మూడు లక్షల రూపాయల స్టాంపు పేపర్లు మాయమైతే లెక్కలు లేవా? రాయలేదా? ప్రజాధనం లూటీ చేశారా? మన్నుతిన్న పాములా సైలెంటుగా వున్నారా? అంటే ఔననే సమాధానం మాత్రం నర్మగర్భంగానే ఊ…అంటూ వస్తూనే…రూ.50వేలు కట్టేశారంటున్నారు. ఇదీ అధికారుల తీరు…ఆఖరుకు క్లర్కు మధు అసలు సంగతిని చెప్పకనే చెప్పేశాడు. అయితే లాజిక్‌ లేని సమాధానం చెబుతున్నానని అనుకోలేదు. రసీదులు లేకుండా రిజిస్ట్రేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్యాలయం నుంచి స్టాంపు పేపర్‌ ఒక్కటి కూడా బైటకు వెళ్లే అవకాశం లేదు. సంబంధితం స్టాంపు వెండర్‌ ఎవరైనా సరే ముందు అవసరమైన మేరకు ఛలనా తీయాలి. దాన్ని అధికారలు డీ పాస్‌ చేయాలి. అప్పుడు గాని వాటిని ఇవ్వడానికి వీలు లేదు. కాని ఏకంగా రూ. 3లక్షల రూపాయల విలువైన పేపర్లు మాయం కావడమేమిటి? వాటికి సంబంధించిన రూ.50వేల ఛాలన్‌ తర్వాత చెల్లించడమేమిటి? అలా నమ్మకంతో కూడా స్టాంపు పేపర్లను ఒక స్టాంపు వెండర్‌కు అందించే అధికారం క్లర్కుకు వుంటుందా? అధికారుల సంతకం లేకుండానే బైటకు వెళ్తాయా? స్టాంపు పేపర్లు అంటే అంత ఆషామాషీ వ్యవహరమైపోయిందా? అంతా గందరగోళంగానే వుంది…
మూడేళ్ల క్రితం స్టాంపు పేపర్లు మాయమైతే ఇప్పటి వరకు చర్యలు లేకపోవడం ఆశ్యర్యమేస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పుడు మంత్రిగా వున్న కృష్ణ యాదవ్‌ను మహరాష్ట్రకు చెందిన పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. కేవలం లక్ష రూపాయల విలువైన నకిలీ స్టాంపు పేపర్ల తయారీ, సరఫరా సహకరించాన్న సమాచారం మేరకు ఆరేళ్లపాటు జైలు జీవితం అనుభవించారు. ఎందుకంటే స్టాంపు పేపర్ల వ్యవహారం అంత సీరియస్‌. క్యాబినేట్‌ మంత్రిగా వున్న వ్యక్తిని కనీసం నాడు స్పీకర్‌కు కూడా చెప్పకుండా, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తెలియకుండా, ఎలాంటి బెయిల్‌ మంజూరు చేయకుండా, ఆరేళ్లపాటు రిమాండ్‌ ఖైదీగానే జైలులో వుంచారు….కాని వరంగల్‌ జిల్లా రిజిస్ట్రేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయంలో 3 లక్షల రూపాయల విలువైన పేపర్లు మాయమైతే ఇంత నిర్లిప్తతా…అసలు నాడు ఆ మంత్రిమీద కేవలం అనుమానం మాత్రమే…ఆ అనుమానంతో ఆరేళ్లపాటు ఎలాంటి బెయిల్‌ ఇవ్వకుండా ఖైదు చేశారు. మూడేళ్లు గడుస్తున్నా…వరంగల్‌లో జరిగిన ఈ విషయాన్ని అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? వాటి మాయం వెనకు ఎవరెవరున్నారన్నరదానిపై రకరకాల చర్చ జరుగుతోంది. అయితే దీనితోపాటు రాష్ట్రంలోని అనేక రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో జరుగుతున్న లీలలు అంతా ఇంతా కాదు. అయితే వారందరినీ కాపాడుతూ వారికి అభయంగా వుంటూ ఓ సుబ్బారావు అనే పెద్ద మనిషి వున్నాడని భహిరంగగానే చెప్పుకుంటున్నారు. ఎంతటి అవినీతి చేసినా సరే…నేను చూసుకుంటానన్నంత భరోసా ఇస్తూ కాపాడుతున్నాడట. అసలు స్టాంపు పేపర్‌ మాయం అన్నది దేశద్రోహానికి చెందినంత కేసు అన్నది తెలిసే చేస్తున్నారా? లేక దొరలేదు కదా? అనుకుంటున్నారా? ప్రభుత్వ రాజముద్రతో కూడుకున్న స్టాంపు డ్యూటీని అధికారులు ఇంత సింపుల్‌గా చేతులు మార్చుతున్నారా? వరంగల్‌ ఘటన ఇందుకు సాక్ష్యం. సహజంగా పుండు అన్నది ఒక్క దగ్గర మొదలైతే దాని చుట్టూ పుళ్లు పడడం కామన్‌. శరీరమైనా, సమాజమైనా ఒక్కటే…ఇలాంటివి ఎక్కడెక్కడ, ఏ కార్యాలయాలలో ఎంతెంత జరుగుతోందన్నదానిపై నేటిధాత్రి తన పరిశోధన చేపట్టింది. విస్తుపోయే నిజాలు తెలిసి ఆశ్చర్యపోయింది. ఈ విషయాలు ప్రజలు తెలియాలి. బాధితులు ఎంత మంది ఎన్ని రకాలుగా నష్టపోతున్నారో ప్రపంచానికి తెలియాలి. ఏ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఎలా మోసాలు జరుగుతున్నాయో ప్రజలకు తెలియాలి. ఇదే మా అక్షర యజ్ఞం…మీ కోసం… సమాజం కోసం…పరిరక్షణ కోసం…మాతో మీరూ కలిసిరండి…బాధితులు మమ్మల్ని సంప్రదించండి. ఇంతకీ ఇప్పటికైనా వరంగల్‌లో జరిగిన సంఘటనపై దర్యాపు జరిపిస్తారో…లేదో చూడాలి.

యుగానికొక్కడు

` జగాన్ని మెలుకొల్పే యుగకర్తలకు మార్గదర్శకుడు
` అనాధలను ఆదరించే ధీనజనబాంధవుడు
` కేసిఆర్‌ ఒక్క ఆలోచన కోట్ల మందికి భరోసా
` అనాధలంతా ప్రభుత్వ బిడ్డలు ఒక విప్లవం
` చరిత్రలో ఈ ఆలోచన ఒక నూతన అధ్యాయం…


` భవిష్యత్‌ తరాలకు సంచలన సందేశం
` అది కేసిఆర్‌కే సాధ్యం…ప్రపంచానికి ఆదర్శం.

` ఇకపై అనాధలన్నవారు తెలంగాణలో కనిపించరు.
` వారికి జీవించే హక్కును కల్పించి..వారి జీవితాల్లో వెలుగులు నింపదమే…
` ఆసరా సగటు జీవన ఆయుః ప్రమాణానికి సూచిక
` కళ్యాణలక్ష్మి ఒక ఆడపిల్ల ధైర్యానికి ప్రతీక
` ఇప్పుడు అనాధలకు చేయూత…వారి జీవితాలకు భరోసా…
హైదరాబాద్‌ , నేటిధాత్రి : రామాయణంలో రాముడు చేయలేదు( త్రేతాయుగం). మహాభారతంలో కృష్ణుడు( ద్వాపర యుగం) చేయలేదు. కలియుగంలో ఇప్పటి వరకు ఎవరూ ఆలోచించలేదు. రాజరికంలో ఏ రాజు చేసినట్లు లేదు. ప్రపంచ దేశాలలో ఆచరించినట్లు ఎక్కడా కనిపించలేదు. మొదటిసారి ఒక్కడే..ఒక్కడు…కేసిఆర్‌ ఆలోచించాడు. అనాధలను అక్కున చేర్చుకునే యజ్ఞం మొదలుపెట్టాడు. రాష్ట్రంలో అనాధలందరూ ప్రభుత్వ బిడ్డలు కావాలని సంకల్పించాడు. అందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు….ఇక రాష్ట్రంలో తాను అనాధను అన్న మాట ఎవరి వెంట వినపడకుండా చేయనున్నాడు….
ఆకలి ఒక నరకం. అనాధ జీవితం ఒక శాపం. కాని యుగానికొక్కడుగా యుగపురుషుడైన ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో ఇక శాపగ్రస్ధులు అనే మాట ఇక వుండదేమో! అనాధ పిల్లలు అంటూ ఎవరూ చెప్పుకోవాల్సిన అవసరం రాదేమో! మాకు ఎవరూ లేరన్న భాధ వారిలో ఒక వుండదేమో… భవిష్యత్తులో అనాధ అన్న పదమే తెలంగాణలో వినిపించదేమో! పసి వయసులోనే అందరూ దూరం చేసుకొని చెత్త కుప్పల్లో బతుకులీడ్చేవారు వుండకపోవచ్చు. భూమ్మీదకొచ్చాక వారికి కూడా జీవించే హక్కు బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవడం అన్నది ఒక వినూత్నం. విప్లవాత్మకం. ప్రపంచం అబ్బుర పడే నిర్ణయం. అనాధ అనే మనో వేధన బతికినంత కాలం వెంటాడే మానసిక శిక్ష ఇక భవిష్యత్తులతో తెలంగాణలో ఏ ఒక్క వ్యక్తికి వుండదు. వారు కూడా బతికేందుకు, అందమైన జీవితం అనుభవించేందుకు కూడా మంచి రోజులు వస్తున్నాయంటే అది తెలంగాణ సంకల్పం. బలమైన నమ్మకం. ఆ నమ్మకం పేరు కేసిఆర్‌.
ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కారణజన్ముడు అని చాలా మంది ఎందుకంటారో …ఈ నిర్ణయాన్ని బట్టి చెప్పొచ్చు. చరిత్రలో సమాజం కోసం, ప్రజల కోసం, వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం జీవిత పర్యంతం ఉద్యమం సాగించిన అతి కొద్ది మంది యుగకర్తలలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ అందరికంటే ముందున్న వ్యక్తి అని చెప్పకతప్పదు. అవరైఏళ్ల తెలంగాణ ఆకాంక్షను తన జీవితం లక్ష్యం చేసుకొని, పద్నాలుగేళ్లపాటు పోరాటం సాగించి, తెలంగాణ సాధించి, కలలు గన్న తెలంగాణ ఆవిష్కరణే కాదు, ప్రపంచం ఆశ్చర్యపోయేలా…అబ్బురపడేలా…ఆదర్శవంతమైన పాలన సాగిస్తున్నారు. ఇది ఏ నాయకుడికి సాధ్యం కాదు. అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ సాధించి చూపిస్తున్నారు. ఆదర్శమూర్తిగా నిలుస్తున్నారు. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని కాలోజీ అన్నారు. ఒక్క మంచి ఆలోచన కొన్ని కోట్ల మంది జీవితాలకు వెలుగులు అని ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిరూపిస్తున్నారు. అవును ఇది చరిత్ర కాదలేని సత్యం. జీవిత సత్యం. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ మదిలో చిగురించిన ఏ ఆలోచన వృధా కాలేదు. అది తెలంగాణ సాధన నుంచి మొదలు, నేటి కాళేశ్వర ప్రాజెక్టుదాకా…ఎండిన బీడ్లనుంచి, జలజల పారే నీటి సవ్వడుల దాకా… ఆడపిల్ల పెళ్లి కష్టం నుంచి, సంతోషంగా కళ్యాణ లక్ష్మి దాకా…వృద్దాప్యంలో ఏ కొడుకు, కోడలు ఆసరా లేకుండా ప్రభుత్వమే ఆసరాగా అందిస్తున్న పింఛన్లు వారి జీవితాలకు ఒక భరోసా నింపుతున్నాయి. వారి జీవన ప్రమాణాలు పెంచుతున్నాయి. ఆత్మగౌరవంతో బతికేందుకు ఉపయోగపడుతున్నాయి. కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర, మనసునిండా ప్రశాంతంత వుంటే ఏ రోగం రాదు. చావు అంత తొందరగా దరిచేదరంటారు. ఇప్పుడు తెలంగాణలోని ఎంతో మంది వయసు మళ్లిన వారిని చూస్తే ఇదే కనిపిస్తుంది. ఇదే నిజమని ప్రపంచం గుర్తించింది. ఏతోడు లేని, నీడలేని పిల్లలుండీ ఆసరా లేని వారందరికీ ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లు తెలంగాణ ప్రజల సగటు జీవిత ఆయుః ప్రమాణం కూడా పెంచుతున్నాయి. ఇక ఇప్పుడు అనాధలకు న్యాయం. వారి జీవితాలను కాపాడే బాధ్యతా ధర్మం ప్రభుత్వం తీసుకోవడం అన్నది ఆషామాషీ నిర్ణయంకాదు.
ఆకలి ఒక పాపమో! శాపమో!! కాని ఎవరికైనా అది నరకమే!!! ఏవరూ లేని వారికి అది నిత్య నరకం. పసిపిల్లల పాటిల శాపం. అది ఆకలని వారికి తెలియదు. కడుపులో మంట జీవితాన్ని దహిస్తుంటే ఏమిటో తెలియదు. ఆ క్షణం ఒక ముద్ద కావాలి. లేకుంటే జీవితం ఆరిపోవాలి. అలా ఆకలిని భరించలేక ఏటా కొన్ని లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. సహజంగా పోషకాహారలోపమే పెద్ద శాపమైతే, అసలే ఆహారం అన్నది అందని జీవితాలను ఏమని చెప్పగలం. వారి బాధ వర్ణణాతీం. దానంత దురదృష్టం మరొకటి వుండకోవచ్చు. మహానగరాల్లో వారి జీవితాలు చూస్తుంటే అసలు మానవజన్మ అన్నది ఎంత నరకమో? వారికే ఎందుకంత వేధనో అని మన కళ్లునిండా నీళ్లు సుడులు తిరగక మానవు. కాని ఆ కన్నీటి చుక్కలే నోటి దాహానికి ఆసరా చుక్కలైతే ఇక వారి జీవితం ఎలా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. కళ్లు తెరవకుండానే ఈ లోకం మీదకు వచ్చి, భూమ్మీద పడి, ఎక్కడున్నామో తెలియని వేధనే ప్రపంచమైపోయే పసి అనాధ హృదయాల జీవితం అరణ్యరోధన. అభం శుభం తెలియని వయసులోనే నా అనేవారు లేక, కన్నవారు కనిపించక, ఎవరికి పుట్టామో తెలియక, ఎవరూ దగ్గరకు రానీయకుండా, చెట్టుకింద జీవితాలు. ఎండకు ఎండి, వానకు నాని, మురిక కాలువల పక్కన, వీధి కుక్కల మధ్యన బతకడం అంటే ఇంతకన్నా శాపగ్రస్ధమేముంటుంది. అసలు తామెవరమో? కూడా తెలియని పసిహృదయాలకు అంత శిక్ష ఎందుకో? అన్న ప్రశ్న అందరిలో ఉత్పన్నమైనా, ఎంత మంది వారిని ఆదుకోగలరు. ఎంత కాలం ఆదుకోగలరు. దైవం చేసిన మోసంతో భూమ్మీదకొచ్చి, కళ్లు తెరవకుండానే కన్న వారిని దూరం చేసుకొని, ఎంగిలి విస్తర్లే ఆహారమై కడుపుకునింపుకొని కోట్ల మంది జీవిస్తున్నారు. అలా నీడలేని వారికి ఆశ్రయం ఇవ్వడం అన్నది సామాన్యమైన విషయం కాదు. వారిని ఏకంగా ప్రభుత్వ బిడ్డలుగా గుర్తించడం అన్నది చరిత్రలో సువర్ణాధ్యాయం. ఏ తోడు లేని అనాధ పిల్లలను ప్రభుత్వమే దరి చేర్చుకోవడం, వారి జీవితాలివ్వడం, వారి భవిష్యత్తు తీర్చిదిద్దడం, భవిష్యత్తులో అలాంటి వారి జీవితాలకు తావులేకుండా చూడడం అన్నది ఒక దైవకార్యం. ఒక జీవన యజ్ఞం. చరిత్రలో ఇలాంటిది విన్నది లేదు. చూసింది లేదు. మొట్టమొదటిసారి ఒక ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ప్రకటించడం విశేషం. విప్లవాత్మకం. ఆదర్శం. అనాధ పిల్లలను అక్కున చేర్చుకోవడం కోసం వారందరినీ ప్రభుత్వ బిడ్డలుగా గుర్తించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిర్ణయానికి నేటిధాత్రి దినపత్రిక ప్రత్యేక అభినందనలు. ఇలాంటి నిర్ణయాలు ఒక్క కేసిఆర్‌తోనే సాధ్యమని మరోసారి నిరూపించారు. పేదల జీవితాలకు కేసిర్‌ అనే ఒక్క పదమే భరోసా అని మరోసారి రుజువు చేస్తున్నారు. యుగపురుషుడుగా చరిత్ర వున్నంత కాలం కేసిఆర్‌ నిలుస్తారు. ఇదే నిత్యం…కేసిఆర్‌ సంక్షేమం సత్యం…యుగయుగాలకు ఆదర్శం…

కేంద్ర రాష్ట్ర-ప్రభుత్వ విధానాలతో రైతాంగానికి తీవ్ర నష్టం

“వరి సాగు విషయంలో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్న ప్రభుత్వాలు జాబితాలో ఉన్న పంటలను పండించలేని దుస్థితి నేడు రైతు బంధు పథకం తో మిగతా పధకాలకు తూట్లు వరి పండే భూములలో వేరే పంట ఎలా వేయాలి సరైన ప్రణాళిక లేని ప్రభుత్వ విధానాలు” – రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు అవినాష్ రెడ్డి
మహబూబాబాద్, నేటిధాత్రి: పంట నష్టపరిహారం అందలేదు గ్రామాలలో రైతులు వారి వారి సమస్యలు సరైన ముందుచూపు లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల ఆరుగాలం కష్టపడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని టిపిసిసి కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అవినాష్ రెడ్డి అన్నారు. రైతాంగ సమస్యలను గ్రామ గ్రామాన తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న టువంటి రచ్చబండ కార్యక్రమం లో మహబూబాద్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో నెంబర్ వార్డు ఈదుల పూస పల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అవినాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన రైతాంగ సమస్యల మీద ఒక బలమైన టువంటి రైతు ఉద్యమాన్ని నిర్మించడం కోసం రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నుండి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నుండి రైతులను కాపాడడం కోసం రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ధరణి కార్యక్రమం వల్ల చాలామంది రైతుల భూములు నష్టపోయారని తెలిపారు. వరి సాగు విషయంలో ప్రజలను అయోమయంలోకి నెడుతున్నారు అని అన్నారు.

ఒకరు ధాన్యం పందించందని అని ఒకరు వద్దని అనడంతో రైతులు అయోమయానికి గురి అవుతున్నారని అని తెలిపారు . జాబితాలో ఉన్నటువంటి పంటలను పండించినా కూడా మద్దతు ధర కల్పించలేని దుస్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. రైతుబంధు సాకుగా చూపి వ్యవసాయ పథకాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు మిల్లర్లు కలిసి రైతులు తీవ్రంగా నష్టపరుస్తున్నారన్నారు. వరి పండే పంట భూములలో వరి తప్ప వేరే పంట సాగు చేయలేని దుస్థితి ఉన్నా కూడా వరి సాగు చేయవద్దు అనడం ఏంటని ప్రశ్నించారు. రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతులకు ఇబ్బందులు కలగకుండా చేస్తుందని అన్నారు.సీనియర్ నాయకులు మురళి నాయక్ మాట్లాడుతూ మిల్లర్లు తరుగు పేరుతో రైతులను తీవ్రంగా నష్ట పరుస్తున్నారని అన్నారు. అలాగే పండించిన పంట డబ్బులు ఎకౌంట్లో పడ్డాక బ్యాంకు వారు రుణాలు ఉన్నాయని డబ్బులను కట్ చేసుకుని మిగతా డబ్బులు చెల్లిస్తున్నారని అన్నారు. దీంతో రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పంట రుణాలు వచ్చేవని కానీ ఇప్పుడు రుణమాఫీ లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాగే ఈ ప్రాంతంలో మిర్చి సాగు ఎక్కువగా ఉన్నందున లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టినా కూడా పంట సరిగా రాలేదన్నారు. ఒక్కొక్క రైతుకు లక్షల్లో నష్టం వాటిల్లిందని తెలిపారు. దీంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాగైనా మిర్చి సాగు చేసిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ లో రైతుల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని తెలిపారు. వెన్ను శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మిర్చి సాగు పంట ఎక్కువ సాగు చేశారని వారు లక్షల్లో నష్టపోయారన్నారు తెలిపారు. మిర్చి సాగు రైతులకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మిర్చి సాగు పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసిసి అధ్యక్షులు భరత్ చంద్ర రెడ్డి , బెల్లయ్య నాయక్,పీసీసీ సభ్యులు దస్రు నాయక్, తండ వెంకటేశ్వర్లు, రజినీకాంత్, నునావత్ రాధ వెన్నం లక్ష్మారెడ్డి, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి మహేందర్ రెడ్డి, కత్తి స్వామి, రమేష్ నాయక్, రమేష్ ముఖ్య నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సినిమా ధియేటర్ యాజమాన్యం

ఘనపూర్ స్టేషన్ (జనగాం) నేటిధాత్రి
ఘనపూర్ మండల కేంద్రం లోని మహాలక్ష్మి ధియేటర్ యాజమాన్యం ఆగడాలకు హద్దే లేదు ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్న యాజమాన్యం, దీనిపై స్పందించిన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక సతీష్ మాట్లాడుతూ థియేటర్ యాజమాన్యం పైన అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ధియేటర్ లో ఏసీ అని చెప్పి కనీసం ఫ్యాన్లు కుడా లేవని గతంలో మొదటి, రెండవ, మూడువ, తరగతలు చొప్పున ధరలు ఉండేవి అలా కాకుండా మొత్తం అన్ని కేటగిరీ కి ఒక్కటే ధర టికెట్ల కు వంద రూపాయలు మాత్రమే అని దాదాపు రెండు సంవత్సరాలనుండి పెట్టారు అలాగే గత రెండు సంవత్సరములు నుండి 100 కంటే ఎక్కువ 150 రూపాయలు ధర పెంచడం జరిగింది. రెండు సంవత్సరాలనుండి వంద రూపాయలు ఉండేది పుష్ప సినిమా నుండి నూట యేబది రూపాయల (150) వరకు తీసుకుంటున్నారు ఇప్పుడు R R R సినిమా నుండి 175 వరకు తీసుకుంటాం అంటున్నారు.

యాజమాన్యం వారిని అడిగితే ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ధరలు పెంచుతున్నామని RRR సినిమాకు నూట డెబ్బది ఐదు రూపాయలు (175) వరకు పెంచుతామని చెబుతున్నారు. ఇది ప్రజలపై పెను భారమే అవుతుందని వారన్నారు. ఒక పక్క కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్న సమయంలో థియేటర్ యాజమాన్యం మరోసారి ప్రజల పై పెనుభారం మోపే విధంగా ప్రయత్నిస్తుంది ప్రజల ఆరోగ్యం పట్ల కువైట్ డెల్టా ప్లస్ ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు ఇస్తుంటే కనీసం శానిటైజర్ గాని సోషల్ డిస్టెన్స్ గాని మాస్కు ధరించి వస్తున్నారా ప్రజలు లేరా అని చూడకుండా ప్రజలు అనారోగ్యం పాలవుతుంటే ధియేటర్ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని ముఖ్యంగా తాగునిరు లేకపోవడం శానిటేషన్ చేయకపోవడం మూత్రశాలలు శుభ్రపరచి కుండా కనీసం చేతులు కడుక్కోవడం కోసం గాని నీటి సదుపాయాలు లేవు ఏసీ కాదు కదా కనీసం ఫ్యాన్లు కుడా లేకపోవడం విడ్డూరంగా ఉందని దోమలు దురవాసన వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే తెరాస ప్రభుత్వం ధియేటర్ యాజమాన్యలకు వంత పడుతుంది ప్రజల ఇబ్బందులు పట్టించుకోవడం లేదు వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి ధియేటర్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని లేకుంటే పై అధికారులకు ఫిర్యాదు చేస్తాము అని అని అవసరమైతే ప్రజల కొరకు ధర్నా ను చేయడానికైనా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని థియేటర్ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తున్నాము, ఈ కార్యక్రమంలో కోటి ఎల్లయ్య, శ్రీనివాస్, రాములు, రాజేష్, రాజు, సంతోష్, రవి తదితరులు పాల్గొన్నారు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న

శేరిలింగంపల్లి ( నేటి ధాత్రి) కొలువులపై టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ గారు మరియు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి .ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలపై మొండి వైఖరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలో, నిరుద్యోగ భృతి హామీ అమలు లో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు.

ఈ తెరాస ప్రభుత్వం నిరుద్యోగులు ఉద్యోగుల భర్తీ గురించి మాట్లాడకుండా, కేంద్రాన్ని ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడటం చాలా సిగ్గుచేటు, ఈ అబద్ధలు మాట్లాడుతూ ప్రజలని మభ్యపెట్టి మోసంచేసే ఈ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు,నిరుద్యోగులే తగినబుద్ధి చెప్తారు అన్ని అన్నారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ కోసం యువత ఆత్మహత్యలు చేసుకుంటే.. ఈనాడు ఉద్యోగాల్లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్ని అన్నారు. ఇకనైనా ఆత్మహత్యలు ఆగాలి. నిరుద్యోగులకు అండగా ఉంటామనే భరోసా కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది అన్ని అన్నారు. లక్ష ఉద్యోగాలంటూ, త్వరలో నోటిఫికేషన్లంటూ ఓట్లు దండుకొని గద్దెనెక్కి జాబ్ నోటిఫికేషన్లు ఇయ్యకుండా గడీల్లో రాక్షసానందం పొందుతున్న తెరాస ప్రభుత్వం అన్ని అన్నారు.

నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నా అవేవి పట్టనట్టు, సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు ,రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సమగ్ర నోటిఫికేషన్ సాధించడం లక్ష్యంగా బండి సంజయ్ గారు నిరుద్యోగ దీక్ష చేపెట్టారు అన్ని అన్నారు . ఈ దీక్షలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ తరుణ్ చుగ్, మాజీ ఎంపీ శ్రీమతి విజయశాంతి,ఎమ్మెల్యే శ్రీ ఈటల రాజేందర్‌, మంత్రి శ్రీనివాస్ , పలువురు సీనియర్ నాయకులు ,రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున తరలివచ్చిన బిజెపి శ్రేణులు, కార్యకర్తలు ,యువకులు, నిరుద్యోగులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఓట్లుంటేనే ఓదార్పులా” “నేటిధాత్రి” కథనానికి “కడియం” స్పందన

*గత ఏడాది తల్లి, పది రోజుల క్రితం తండ్రి…*

*తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయి అనాధలుగా మిగిలిన పసిపిల్లలు*

*అన్ని రకాలుగా పిల్లలను ఆదుకుంటామని కడియం ప్రకటన*

*ఐనవోలు* గ్రామానికి చెందిన చిన్నారులు *ప్రణయ్, నందులపై “నేటిధాత్రి” దినపత్రికలో వచ్చిన కథనానికి తెలంగాణ మాజీ ఉప  ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ “కడియం శ్రీహరి” స్పందించారు*. అనాధలైన పిల్లలను ఆదుకుంటామని చెప్పారు. గత ఏడాది జూన్ లో కన్న తల్లి చనిపోయింది. గత పది రోజుల క్రితం తండ్రి చనిపోవడంతో పిల్లలు అనాధలయ్యారు. జరిగిన *సంఘటన తెలియగానే నేటిధాత్రిలో ఆ పిల్లలుపై ఈ రోజు  ‘ఓట్లుంటేనే ఓదార్పులా” అనే కథనం ప్రచురించడం జరిగింది. ఆ వార్తను చూసిన కడియం శ్రీహరి ఆ పిల్లలకు సంబంధించి అన్ని రకాల సహాయసహారాలు అందించేందుకు ముందుకొచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు.* ఆ పిల్లల విషయంలో మరింత మంది మానవతా హృదయులు ముందుకొస్తే వారి జీవితం తెగిన గాలిపటం కాకుండా వుంటుంది. *నిరుపేదలైన దళిత పిల్లలను ఆదుకోవాల్సిందిగా “నేటిధాత్రి” మనవి.

కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా అన్ని విధాల లాభాలు

నర్సంపేట, నేటిధాత్రి : భూములు లేని పాడి రైతులు, మత్స్యకారులు, గొల్ల కురుములు కూడా రైతులేనని వారికి ఏదోవిధంగా ఆర్ధిక సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో కిసాన్ క్రెడిట్ కార్డులను తీసుకురావడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డు (కేసిసి) అంటే రైతులకు ఏటిఎం లాగా ఉపయోగపడుతుందని అలాగే వాటి వలన అనేక విధాలుగా లాభాలు పొందవచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్, నర్సంపేట రూరల్, మున్సిపాలిటీకి చెందిన మత్స్యకారులకు, గొర్రెలు, మేకల పెంపకందారులకు, పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల (కేసిసి) ప్రాముఖ్యత దరఖాస్తు విధానం నర్సంపేట మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్యాంపెయిన్ లో లబ్దిదారులకు కేసిసి లకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ భూములు లేని పాడి రైతులు, మత్స్యకారులు, గొల్ల కురుములు కూడా రైతులేనని వారికి ఏదోవిధంగా ఆర్ధిక సహాయం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కిసాన్ క్రెడిట్ కార్డులను తీసుకురావడం జరిగింది.

కిసాన్ క్రెడిట్ కార్డు అంటే రైతులకు ఏటీఎం లాగా ఉపయోగపడుతుందని, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 25 వేల నుండి రూ.లక్ష 60 వేల వరకు కేవలం 7 శాతం వడ్డితో బ్యాంకు ఋణం పొందే అవకాశం ఉంది. ఈ 7 శాతం వడ్డీలో సగం అంటే 4 శాతం వడ్డీని మీకు మద్దతుగా గవర్నమెంట్ వారు తిరిగి బ్యాంకర్లకు చెల్లిస్తుంది. అంటే కేవలం 30 పైసల వడ్డీ మాత్రమే లబ్దిదారులపైన పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. వ్యవసాయ భూములపై క్రాప్ లోన్ తీసుకున్న వారికి కేసిసి కార్డ్ వర్తించదని ప్రధానంగా రైతు దరఖాస్తు పెట్టిన 15 రోజుల నుండి 30 రోజులలో బ్యాంక్ లోన్ ఖచ్చితంగా ఇవ్వాలిసిందే తేల్చి చెప్పారు.

అర్హులైన 2500 మంది మత్స్యకారులు, పాడి రైతులకు, గొర్రెల, మేకల కాపారులను సొసైటీల ద్వారా గుర్తించి లబ్దిదారులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ గుర్తింపు కార్డ్ అనేది కిసాన్ క్రెడిట్ కార్డుకు ముఖ్యమైనది అన్నారు. దరఖాస్తులో ఏదైనా లోపం ఉండి నిరాకరించబడితే దానికి సంబందించిన కారణాన్ని మెస్సేజ్ రూపకంలో దరఖాస్తుదారునికి పంపిస్తారని గతంలో బ్యాంక్ ల ద్వారా క్రాప్ అప్పు తీసుకొని సరిగ్గా కట్టని వారి దరఖాస్తులు మాత్రమే తిరస్కరించబడుతాయని, కెసిసి కార్డు పొందిన వ్యక్తికి రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంటుందని తెలుపుతూ, ఎవరెవరూ ఏఏ వృత్తులలో ఉంటారో వారికి ఆ వృత్తిలో పెట్టుబడి కింద ఆర్థిక సహాయం చేయడమే కేసిసి కార్డు ముఖ్య ఉద్దేశం అని ఎమ్మెల్యే వివరించారు. ఆర్థికంగా పేదరికంలో ఉండి వృత్తిని నమ్ముకున్న రైతులకు కేసీసీ కార్డు ఒక వరం లాంటిదని, కార్డును నియోజకవర్గంలోని అర్హులైన రైతులందరూ సద్వినియోగ పరుచుకోవాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపిపిలు, జెడ్పిటిసిలు, ఎమ్మార్వోలు, ఎంపిడివోలు, పశు సంవర్థక శాఖ జెడి, ఏడీలు, యూనియన్ బ్యాంక్ ఎల్దిఎం , జిల్లా మత్స్య శాఖాధికారి, పీఏసిఎస్ చైర్మన్లు, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, అర్ఎస్ఎస్ కన్వీనర్లు, క్లస్టర్ భాద్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా – రాస్తారోకో

చిట్యాల, నేటిధాత్రి: దళితుడిని కులం పేరుతో దూషించి కొట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు నేటి వరకు చేయకపోవడం తో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో చిట్యాల చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది అని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్లయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలని ధర్నా, రాస్తారోకో నిర్వహించడం జరిగిందని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య అన్నారు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం శాంతి నగర్ గ్రామానికి చెందిన పర్లపెల్లి మహేందర్ మాదిగను బిసి యాదవ్ కులానికి చెందిన బొంకూరి రాజయ్య మరియు కుమారుడు కుమార్ తండ్రి కొడుకులు ఇద్దరు కులం పేరుతో దూషించి కొట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలని నవంబరు 14నాడు పిర్యాదు చేసిన నేటి వరకు ఎఫ్ఐర్ నమోదు చేయుటకు జాప్యం చేయడం వల్ల కేసును తప్పు దారి పట్టించి బాధితులకు అన్యాయం జరుగే అవకాశం ఉందని ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య మాట్లాడుతూ శాంతి నగర్ లో జరిగిన సంఘటనపై సరియైన సాక్షాలు ఉన్న ప్రజాప్రతినిధుల మాటలు నమ్మి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయకుండా తప్పు దారి పట్టించి దళితుడికి అన్యాయం చేయాలని చూడటం బాధాకరమన్నారు. ఇట్టి సంఘటనపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గారికి అదనపు జిల్లా ఎస్పీ శ్రీనివాసులు గారికి పిర్యాదు చేసిన, ఎస్సీ ఎస్టీ కమీషనర్ హెల్ప్ లైన్ లో పిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రజాప్రతినిధులకు దళితులంటే ఎందుకు అంత చిన్న చూపు? దళితులు ఎన్నికల్లో మీకు ఓట్లు వేయలేదా అని ప్రశ్నించారు.? సరియైన సాక్షాలు ఉన్న సంబంధించిన పోలీసు అధికారులు ఎఫ్ఐర్ నమోదు ఎందుకు చేయడం లేదని అన్నారు. అందుకే దళిత బహుజనులకు రాజ్యాధికారం ఎంతో అవసరమని అన్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్సై కృష్ణ ప్రసాద్ గారు నేను వచ్చిన తర్వాత సంఘటన జరుగుతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేస్తానని అనడం సరి కాదని ఆయన అన్నారు. భారత రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దళితుడిని కొట్టిన బొంకూరి రాజయ్య భూమి పట్టా దారుడు, భూమికి అతనికి ఎలాంటి సంబంధం లేదని అతనికి సహకరించి అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేస్తామని చెప్పి చేయకుండా దళితుడైన మహేందర్ కు అన్యాయం చేశారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలని, లేనిపక్షంలో భాదితునితో పాటు దళిత సంఘాలము ఆందోళన కార్యక్రమాలు దశల వారీగా భారీ ఎత్తున జిల్లా, రాష్ట్రశశ వ్యాప్తంగా చేపడుతామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు.

కులం పేరుతో దూషించి కొట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసి అరెస్టు చేయాలి దళితుడైన పర్లపెల్లి మహేందర్ కు న్యాయం చేయాలి. పిర్యాదు దారుడు పర్లపెల్లి మహేందర్ పై, సాక్షులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్ఐర్ నమోదు చేసే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సంబంధించిన అధికారులకు తెలియజేయుచున్నాము. మా డిమాండ్లు పరిష్కరించే వరకు ప్రతి రోజు ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని తెలియజేయుచున్నాము.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు పర్లపెల్లి కుమార్ కట్కూరి రాజేందర్ జన్నే నరేష్ శనిగరపు శ్రీనివాస్ పర్లపెల్లి శ్రీ కాంత్ మొలుగూరి రాకేష్ పిర్యాదు దారుడు పర్లపెల్లి మహేందర్ కుటుంబ సభ్యులు పర్లపెల్లి సమ్మయ్య సమ్మక్క బంగారి రాణమ్మ తదితరులు పాల్గొన్నారు.

దళితుల భూ సమస్యపై మంత్రి ఎర్రబెల్లి మౌనం వీడాలి : కేవీపీఎస్

పాలకుర్తి:(జనగామ) నేటిధాత్రి
మండలంలోని మంచుప్పుల గ్రామానికి చెందిన దళితుల భూములు స్ధానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు తెలియకుండానే కబ్జాకు గురై అక్రమ రిజిస్ట్రేషన్ లు అయ్యాయా అని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జాటోత్ ఇందిరలు మండిపడ్డారు. దళితులను ఆదుకుంటామని ఎన్నికల లో మాయ మాటలు చెప్పి దళితుల ఓట్లను వేయించుకోని ఇప్పుడు దళితుల భూములను కబ్జా చేస్తున్న అధికార పార్టీ నాయకులకు అండగా ఉంటూ ఏమీ తెలియనట్టు మౌనంగా ఉండడంలో మతలబేంటో చెప్పాలని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దళిత ద్రోహిఅని అన్నారు. దళితుల భూ సమస్యపై మంత్రి ఎర్రబెల్లి మౌనం వీడాలని డిమాండ్ చేశారు.

దళితుల భూములను కబ్జా దారులకు కట్టబెట్టిన తహశీల్దార్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం పాలకుర్తి మండలకేంద్రములో గత 8 రోజులుగా తమ పట్టా భూములకు రక్షణ కల్పించాలని దీక్షలు చేస్తున్న దళితుల పోరాటానికి సంఘీభావంగా మండల కేంద్రములో కేవీపీఎస్ ఆధ్వర్యములో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహశీల్ధార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి ఇండ్ల స్థలాల పోరాట నాయకులకు పూలదండలు వేసి దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టా కాగితాలు వున్న 52 దళిత కుటుంబాలకుఇండ్ల స్థలాల భూమినికబ్జా కోరులకు కట్టబెట్టిన తహశీల్ధార్ విజయభాస్కర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని దళితుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే జోక్యం చేసుకొని దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 1993 లో ప్రభుత్వం దళితుల 52 కుటుంబాలకు ఇండ్ల స్థలాల కోసం ఆనాటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన భూమిని ప్రస్తుత సర్పంచ్, ఉప సర్పంచ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు తో కుమ్మక్కై కబ్జా చేశారని, తక్షణమే ఆ భూమిని ఇప్పించాలని తహశీల్ధార్ ను డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాల కోసం పట్టాలు పంపిణీ చేసిన భూములను హద్దులు నిర్ణయించి దళితులకు ఇవ్వాలన్నారు.

రెవిన్యూ అధికారులు వైఫల్యం వల్ల దళితులకు అన్యాయం జరిగిందన్నారు తహశీల్ధార్ నలుగురికి అక్రమ పట్టాలు చేయడం శోచనీయమన్నారు ఫలితంగా భూమి కబ్జా అయిందని అన్నారు. ఇప్పుడు అధికారులు కబ్జా దారులకు అనుకూలంగా మాట్లాడటం ఆందోళన కరం అన్నారు. ఈ భూమి లో సగం డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఇచ్చిందన్నారు నిర్మాణం అయిన తర్వాత ఆ ఇండ్లు బిసి లకు ఇస్తాం, ఎస్సీ లకి ఇవ్వమని అధికారులు అనడం కులవివక్ష ను అమలు చేయడమే అన్నారు. పట్టాలు వున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇండ్లు ఇవ్వమని చెప్పడం అట్టుడుకు పేదలను మోసం చేయడమే అన్నారు.

ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు తూటి దేవదానం,బొట్ల శేఖర్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు పల్లెర్ల లలిత, టిడీపీ మండల అధ్యక్షులు గజ్జెల్లి వెంకన్న, జిల్లానాయకులు యాదగిరి, బహుజన కులాల ఐక్య వేదిక వ్యస్థాపక అధ్యక్షులు గుమ్మడిరాజుల సాంబయ్య,ద్రవిడ బహుజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు చేరిపల్లి ఆనంద్,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న, ఘనపురం ఎల్లయ్య,పసలాది ఉపేందర్,భూపోరాట నాయకులు రమేష్ బాబు, వెంకన్న,ఎల్లమ్మ,యాకమ్మ, లచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు

టీఎస్ఎంఎస్ఐడీసీ ఛైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎర్రోళ్ల శ్రీనివాస్

*కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు..*

ఉమ్మడి మెదక్ జిల్లాకు ఈ అవకాశం ఇవ్వడం సంతోషకరం..

ఇంతకు మునుపు తన దైన శైలిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా అద్భుతంగా పని చేశారు. ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించారు.


అదే రీతిలో ఇప్పుడు వైద్య సదుపాయాలు కల్పించే కీలకమైన సంస్థ టీఎస్ ఎం ఎస్ ఐడీసీ. అలాంటి సంస్థకు ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న ఎర్రోళ్ల శ్రీను కు నా అభినందనలు.
సాధారణంగా మనకు ప్రభుత్వ ఆస్పత్రులలో బిల్డింగ్ లు, మెడికల్ డివైసెస్, ఎక్స్ రేలు, టెస్టింగ్ ల్యాబ్ లు, ఇంజక్షన్లు, బెడ్లు మాత్రమే ఆస్పత్రుల్లో కనిపిస్తాయి. కాని అవి సమకూరడానికి శ్రమించేది, సమకూర్చేది టీఎస్ఎంఎస్ఐడీసీ సంస్థనే.

ఆస్పత్రుల భవన నిర్మాణా పనులు, అవసరమైన ఫర్నిచర్, మందులు, సర్జికల్ ఎక్విప్మెంట్, వైద్యానికి అవసరమైన కాటన్, డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్స్, మెడికల్ ఎక్విప్మెంట్ నిర్వహణ, శానిటైజెషన్, ఆస్పత్రుల భద్రతకు అవసరమైన సెక్యూరిటీ ఏర్పాట్లు, వైద్యో ఆరోగ్య శాఖకు అవసమరైన అన్ని సదుపాయాలు కల్పించేది ఈ సంస్థ ద్వారానే. ఒక్క మాటలో చెప్పాలంటే సూది నుండి సీటీ స్కాన్ మిషన్ వరకు సమకూర్చేది ఈ సంస్థే.

మహబూబ్ నగర్,సిద్దిపేట జిల్లాల్లో మెడికల్ కాలేజీలు టీఎస్ఎంఎస్ఐడీసీ నిర్మించింది.
సిరిసిల్లలో నర్సింగ్ కాలేజీని నిర్మించింది. ఎం.ఎన్. జే క్యాన్సర్ ఆసుపత్రిలో మాడ్యులర్ ధియెటర్ నిర్మాణ పనులు ఈసంస్థ ద్వారానే జరుగుతున్నాయి.

తెలంగాణ వైద్య విధాన పరిషత్తు కు సంబంధించిన 14 ఆస్పత్రుల అప్ గ్రేడేషన్, 83 ఆస్పత్రులను బలోపేతం చేయడం లో ఈ టీఎస్ఎంఎస్ఐడీసీ కీలకంగా పని చేసింది.
19 హబ్ అండ్ స్పోక్ మోడల్ డయాగ్నోస్టిక్ సేవలు అందించే కేంద్రాలు, 8 మినీ హబ్ లను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది.

ఇక కరోనా సమయంలో దేశంలోనే కరోనా టెస్ట్ కిట్స్, పీపీఈ కిట్స్, ఆక్సిజన్ , కరోనా మందులు, రెమిడెసివర్ తీవ్రంగా ఉన్నప్పటికీ టీఎస్ఎంఎస్ ఐడీసీ సంస్థ ఎంతో చాకచక్యంగా వాటిని సేకరించి ఎంతో మంది కరోనా బాధితుల ప్రాణాలు కాపాడడంలో కీలకంగా వ్యవహరించింది. బ్లాక్ ఫంగస్ కి కూడా మనం మందులు సరఫరా చేశాం. ఎంతో మంది వ్యాధిగ్రస్థులకు సేవలందించి కాపాడుకున్నాం.
ఆసుప‌త్రుల్లో అత్యాధునిక వైద్య ప‌రిక‌రాల‌ను ప్ర‌భుత్వం స‌మ‌కూర్చుతున్న‌ది. మొత్తం రూ. 150 కోట్ల‌తో వివిధ ఆసుప‌త్రుల్లో అత్యాధునిక సిటీ, ఎంఆర్ఐ, పిఇటి స్కాన్ మిష‌న్ల‌ను ఏర్పాటు చేసింది.
గుండె స‌మ‌స్య‌లున్న వారిని కాపాడుకునేందుకు గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌, ఎంజీఎంల‌లో, ఖ‌మ్మం, ఆదిలాబాద్ ఆసుప‌త్రుల్లో విలువైన క్యాథ్ ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేసుకుంటున్నాం. టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా వీట‌న్నింటిని స‌మ‌కూర్చుకుంటున్నాం.

ఆరోగ్య తెలంగాణ గా తెలంగాణ రాష్ట్రం మారాలన్నది సీఎం కేసీఆర్ గారి కల. పేషంట్లకు త్వరిత గతిన ఆరోగ్య పరీక్షలు, మందులు అందించే ఒక గొప్ప బాధ్యత ఇప్పుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ మీద ఉంది. తను చురుకుగా ఉండి, తన సంస్థను మరింత ముందుకు సమర్థవంతంగా నడుపుతూ, వందకు వంద శాతం తన బాధ్యతలను నిర్వర్తించి కేసీఆర్ గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను.

మున్సిపల్ లో నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు

జమ్మికుంట, (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ మెజార్టీ పాలకవర్గ సభ్యులు మున్సిపల్ ఉన్నతాధికారులకు మరియు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జమ్మికుంటలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎక్కడ చూసినా అదే చర్చ జోరుగా జరుగుతోంది. గత కొంత కాలంగా మున్సిపల్ చైర్మన్ కు పాలకవర్గ సభ్యులకు మధ్య పాలనలో వారిలో ఉన్నటువంటి బేధాభిప్రాయాలు ఒక్కసారిగా బయటికి వస్తున్న క్రమంలో ఉప ఎన్నిక నేపథ్యమాఅని వాటినీ బయటకి పొక్కకుండా ఇన్ని రోజులు కాపాడినటువంటి పాలకవర్గ సభ్యులు. ఉప-ఎన్నిక పూర్తికాగానే ఈ నెల 16న పాలకవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పొందుపరచిన ఎజెండా అంశాలు చూసిన పాలకవర్గ సభ్యులు ఒక్కసారిగా విస్మయానికి గురి అయినట్లు చెప్పారు. పలు అభివృద్ధి పనుల పేరుతో పాలకవర్గ సభ్యుల అనుమతి లేకుండానే 90 శాతం ముందస్తుగా బిల్లులు చెల్లించారని.

అభివృద్ధి పేరుతో నిధుల దుర్వినియోగం జరిగిందని. సదరు పనుల పై పూర్తి విచారణ చేపట్టాలని 17 మంది కౌన్సిల్ సభ్యులతో కూడిన ఫిర్యాదు కాపీ మున్సిపల్ ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో 30 కౌన్సిల్ స్థానాలు ఉండగా… కేవలం ఒక్క కౌన్సిల్ మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండగా.. మిగతా 29 మంది కౌన్సిలర్లు తెరాస మద్దతుదారులే అయినప్పటికీ…. వారిలోపనే 17 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో జరుగుతున్నటువంటి పొందుపరచిన ఎజెండా అంశాలను తప్పుబడుతూ…. వాటిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ… కలెక్టర్ తోపాటు మున్సిపల్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం చూస్తుంటే.. ఏ స్థాయిలో మున్సిపల్ కార్యాలయంలో అవినీతి జరుగుతుందో అర్థమవుతుంది. ఏకఛత్రాధిపత్యంగా మున్సిపల్ చైర్మన్ అన్ని తానై వ్యవహరించడం చూస్తుంటే అసలు పాలన సజావుగా జరుగుతుందా… ఒక వ్యక్తే కేంద్రీకృతమై పాలన జరుగుతుందా అనేఅటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో మీడియాకు సమావేశాలు జరిగినప్పుడు పాల్గొనేందుకు అవకాశం ఉండగా.. ఉన్నతాధికారుల నుంచోలి ఆదేశాలు లేవ్వంటు సమావేశాల్లో మీడియాను అనుమతించకుండా తూతూ మంత్రంగా వాళ్ల సమావేశాలు నిర్వహించుకోవడం పరిపాటిగా మారింది. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కౌన్సిలర్ల సమన్వయంతో దృష్టి సారించాల్సిన చైర్మన్. ఏకపక్ష నిర్ణయాలతో జమ్మికుంట మున్సిపల్ పాలన గాడి తప్పుతుంది. దీని పై ప్రశ్నించే నాథుడే లేకపోవడంతో నేనేం చేసినా అడిగే వారు లేరనే ధైర్యంతో ఏకపక్షంగా మున్సిపల్ చైర్మన్ వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజలు కట్టే పన్నుల డబ్బుతో పాలన జరుగుతుందనే విషయాన్ని పాలకవర్గం మర్చిపోయి తమ ఇష్టానుసారం పరిపాలన చేయడమనేది సరైన విధానం కాదని. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి పైసా ప్రజలకు తెలియాల్సిందేనని. ఆ విషయాన్ని జమ్మికుంట పురపాలక సంఘం చైర్మన్, అధికారులు విస్మరించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏది ఏమైనా ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు పని చేస్తున్న పాలకవర్గం ఆ దిశలో పూర్తి స్థాయిలో సరైనటువంటి పాలన అందించేందుకు దృష్టిసారించాలని పట్టణ ప్రజలు సైతం కోరుకుంటున్నారు. మున్సిపల్ లో జరిగిన నిధుల దుర్వినియోగం పై మెజార్టీ పాలకవర్గం సభ్యులే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం పట్ల పట్టణంలో ఎక్కడ చూసినా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక ముందు కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రజా ధనాన్ని కాపాడేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని మేధావి వర్గాలు సైతం కోరుతున్నాయి.

విధినిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..: కలెక్టర్ గోపి

  • పాఠశాల పని తీరుపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్.
  • మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి.
  • పెద్ది స్వప్న చొరవతో కదిలిన జిల్లా అధికార యంత్రాంగం.       

నల్లబెల్లి – నేటి ధాత్రి :ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో మండలంలోని మూడు చెక్కల పల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల లో నెలకొన్న సమస్యలపై జడ్పీ సమావేశంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ప్రస్తావించి నివేదికను కలెక్టర్ మరియు సంబంధిత అధికారులకు అందజేయగా స్పందించిన జిల్లా కలెక్టర్ గోపి, జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి మంగళవారం జిల్లా యంత్రాంగంతో గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసినారు ఈ సందర్భంగా కలెక్టర్ అక్కడ నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులను మందలించారు.
పాఠశాలలో త్రాగు నీటి సమస్య, వాటర్ పైప్ లీకేజెస్, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడాన్ని గుర్తించి తక్షణమే పరిస్థితులను చక్కదిద్దాలని అధికారులను ఆదేశించారు.

 పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తా. గండ్ర జ్యోతి

జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని మెనూ ప్రకారం అందించాలని, పచ్చదనం పరిశుభ్రతను పాటిస్తూ పిల్లలకు మెరుగైన విద్యను అందించి వారి భవిష్యత్తుకు దోహదపడాలని ఆమె అన్నారు అలాగే పాఠశాలలోని వంటగది, డార్మెటరీ, టాయ్ లెట్స్, వాటర్ ప్లాంట్స్ ను పరిశీలించి రిపేర్స్ ఉన్న చోట్ల యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టాలని, మౌలిక వసతులు కల్పనపై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులు రెగ్యులర్ గా పాఠశాలను విజిట్ చేస్తూ మానిటరింగ్ చెయ్యాలని లేనియెడల చర్యలు తప్పవని అధికారులను ఆమె ఆదేశించారు.

 విద్యార్థులతో మాటామంతి

పాఠశాలలోని విద్యార్థినులతో కలెక్టర్, జెడ్పి చైర్ పర్సన్ స్వయంగా మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధన, తరగతుల నిర్వహణ సక్రమంగా నిర్వహిస్తున్నార అని అడిగి తెలుసుకున్నారు త్వరలోనే పాఠశాలలో పూర్తిస్థాయిలో సిబ్బందిని భర్తీ చేస్తామని వారన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ , జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న , ఎంపీపీ ఉడుగుల సునీత ప్రవీణ్ గౌడ్ , డి టి డి ఓ జహీరుద్దీన్, జె డి ఎ ఉషా దయాల్,ఆర్ డి ఓ పవన్, ఏ డి ఏ తోట శ్రీనివాసరావు ,తాసిల్దార్ ప్రవీణ్ కుమార్ , ఎం పీ ఓ కూచన ప్రకాష్, ఏవో పరమేశ్వర్, సర్పంచ్ పూల్ సింగ్, ఎంపీటీసీ దేవ్ నాయక్, వివిధ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇసుక క్వారీలను వెంటనే నిలిపి వేయకుంటే కోర్టును ఆశ్రయిస్తాం : జడ్పిటిసి నామ కరంచంద్ గాంధీ

ములుగు, నేటి ధాత్రి : ములుగు జిల్లా ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఇసుకాసురులు దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంపై కన్నాయిగూడెం జడ్పిటిసి నామ కరంచంద్ గాంధీ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. ప్రజలకు నయానో భయానో ఎంతో కొంత ముట్టజెప్పి వారి పట్టా భూములను లీజుకు తీసుకొని ఇసుక దొంగలు అధికార పార్టీ నాయకుల అండదండలతో అధికారులను మచ్చిక చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఇసుక క్వారీలకు అనుమతులు పొంది ఇసుకను ఏజెన్సీ గ్రామీణ అటవీ ప్రాంతాల నుండి వరంగల్ హైదరాబాద్ లాంటి నగరాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటు అందినకాడికి దోచుకుని కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో పది కిలోమీటర్ల మేర పర్యావరణ పరిరక్షణ హద్దులు కలిగి ఉంటాయి ఎక్కువ సెన్సిటివ్ జోన్ పరిధిలో పర్యావరణానికి వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వీలు లదు. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన నిబంధనలు కలిగి ఉన్నాయి అని జెడ్ పి టి సి నామ కరంచంద్ గాంధీ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పర్యావరణానికి హాని కలిగించే ప్రయత్నం ఎవరు కూడా చేయవద్దు కానీ బుట్టాయిగూడెం, చింతగూడెం ఏటూర్ నాగారం ప్రాంతాలలో ఇసుక క్వారీలు ఏర్పాటు చేసి పూర్తిగా నిబంధనలు తుంగలో తొక్కి తూట్లు పొడుస్తున్నారని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు ఎవరైనా లాలూచీ పడితే అధికారులపై కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెం చింతగూడెం గ్రామంలో ఇసుక క్వారీ పెట్టడానికి ముందు ఏర్పాటుచేసిన డి ఎల్ సి పై పరిపాలన అధికారి జిల్లా కలెక్టర్ కి భూగర్భ జల వనరుల అధికారులు ఇతర అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చే కలెక్టర్ ని తప్పుదోవ పట్టించారని వాపోయారు. గ్రామాలను పర్యావరణ రహితంగా మార్చి అడ్డగోలుగా ఖనిజ సంపదను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. పర్యావరణ పరిరక్షణ గురించి జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో శ్రద్ధ తీసుకోవాలని ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

నదీ గర్భంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఉన్నారని ఇది సరైంది కాదని ఆయన తెలిపారు.
వాగులో రోడ్లు వేసి గోదావరి కి అనుసంధానం చేసి రాత్రి పూట ఇసుక అక్రమ తవ్వకాలు నదీ గర్భంలో చేపడుతున్నారు. ఇసుక ఖనిజ సంపదలను ఇసుక వ్యాపారులు కొల్ల కొడుతున్నారని ఆయన ఆవేదన చెందారు. టి ఎస్ ఏం డి సి పి ఓ న స్వయంగా అదనపు బకెట్ దందా కి పూర్తి సహకారం అందిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయని అదనపు బకెట్ దందా కి టి ఎస్ ఎన్ డి సి పి ఓ అనుమతి ఇవ్వడం జరిగిందని వ్యవహారం లో వచ్చిన వాటాలో గుత్తేదారులు అధికారులు వాటాలు పంచుకున్నట్లు ఆరోపించారు. మైనింగ్ అధికారులు రెండు బకెట్ లకు మాత్రమే అనుమతి ఇచ్చారని చెప్పుకుంటూ గుత్తేదారులు అదనంగా ఐదు బకెట్లో వరకు ఒక్కొక్క బడ్జెట్ కు రెండు వేల చొప్పున వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. బుట్టాయిగూడెం, చింతగూడెం ఇసుక క్వారీల నుండి ప్రతి లారీ ఓవర్లోడ్ తో పోతూ రోడ్లను ధ్వంసం చేస్తున్నారనీ ఇసుక నిబంధన మేరకు తీయకుండా ఇష్టానుసారంగా తీయడంతో నది భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని జెడ్ పి టి సి అన్నారు. రైతులు పూర్తిస్థాయిలో తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని, నది గర్భంలోనే మట్టి రోడ్లు చేశారని ఆయన పేర్కొన్నారు.

కన్నాయిగూడెం మండలంలో 52 కోట్లతో నిర్మించిన రోడ్డు ప్రస్తుతం ఇసుక లారీల వల్ల ధ్వంసం అవు తుందని కన్నాయిగూడెం ప్రజలందరికీ కొద్ది సంవత్సరాల క్రితమే రోడ్డు అందుబాటులోకి వచ్చింది రూ 52 కోట్లతో నిర్మించిన రోడ్డు ప్రస్తుతం ఇసుక లారీలు ఓవర్ లోడ్ తో వెళ్లడం ద్వారా రోడ్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని అన్నారు. దీని వెనుక పాత్ర సూత్రధారులు మొత్తం టి ఎస్ ఏం డి సి అధికారులే అధికారులు పూర్తిగా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు 52 కోట్లతో నిర్మించిన రోడ్డు ధ్వంసం అవుతున్న భూగర్భజలాలు అడుగంటి పోతున్న ఎవరి ప్రయోజనం కోసం గుత్తేదారులకు సంపాదించి పెట్టడానికి ఇసుక క్వారీలు ఏర్పాటు చేసుకొని సంపాదన ధ్యేయంగా ఇసుకను తోడేస్తున్నారనీ తెలిపారు.

అటవీ శాఖ జిల్లా విజిలెన్స్ అధికారులు గత శనివారం ఆకస్మాత్తుగా క్వారీలలో తనిఖీలు నిర్వహించారనీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఇసుక క్వారీల నిర్వాహకులు అధికార పార్టీ నాయకులు కొంతమంది అధికారులను మభ్యపెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారనే విమర్శలు వెల్లు వెతుతున్నాయని తెలిపారు.

అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న అంతసేపు వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం ఎటురు నాగారం ఆయా మండలాల్లోని పట్టా ల్యాండ్స్ సొసైటీ ఇసుక క్వారీల నుండి లారీలు నిలిపివేశారని ఆయన అన్నారు. నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్నాయని నిబంధనలు తుంగలో తొక్కి ప్రభుత్వాన్ని అధికారులను మోసం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా క్వారీలను ఆపకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి, ప్రజల పక్షాన పోరాటం చేయక తప్పదని జడ్పిటిసి నామ కరంచంద్ గాంధీ హెచ్చరించారు.

ఘనపురం స్టేషన్ లో నిరసనల వెల్లువ , పలుచోట్ల పాల్గొన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

ఘనపురం మండల కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలు కలిగించిన కేంద్ర ప్రభుత్వం బీజేపీ పై నిరసన శవ యాత్రలు చేపట్టడం జరిగింది ర్యాలీగా శవాన్ని ఊరేగింపు చేశారు ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ రోజున ఘనపూర్ స్టేషన్ నియోజక వర్గంలో అన్ని గ్రామాలలో ఈ నిరసనలు చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తుందని ప్రతిదీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ రైతాంగాన్ని రైతులు పండిస్తున్న పంటలను ధాన్యాన్ని కొనకుండా ఇబ్బంది పాలు చేస్తుందని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం యొక్క ఒంటెద్దు పొకడ వల్ల అలాగే రైతుల వ్యతిరేక చట్టాల వల్ల రైతులు అయోమయ పరిస్థితి లో పడ వేస్తున్నారని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిర్ణయాలు మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే నిరసనలు చేపడతామని వారు హెచ్చరించారు.
ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతాంగం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనుల వల్ల రిజర్వాయర్లు కాలువల ద్వారా వస్తున్నా సాగునీటితో రైతులు పంటలు పండించి సంతోషంగా ఉంటున్నారు ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను తప్పుదోవ పట్టిస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నామని అన్నారు

ఘనపూర్ స్టేషన్ మండలం కొత్తపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కోసం చావు డప్పుతో శవయాత్ర ద్వారా గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం లో పాల్గొన్నా తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గోవిందు ఆనందం,
స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారుపాక రవి, కూడా డైరెక్టర్ ఆకుల కుమార్ గన్ పూర్ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, సింగపూర్ ఎంపీపీ కందుల రేఖ-గట్టయ్య, ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు

ఘనపూర్ స్టేషన్ మండల కేంద్రంలోని తానేదార్ పల్లి గ్రామంలో బుధవారం రోజున గ్రామ శాఖ అధ్యక్షుడు కాంసాని రాజు రెడ్డి, ముఖ్యఅతిథి మార్కెట్ వైస్ చైర్మన్ చల్ల చందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను డబ్బులతో గ్రామమంతా ఊరేగింపు చేసి గ్రామ చౌరస్తా సెంటర్ లో దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ యూత్ అధ్యక్షుడు గుండె రంజిత్, మండల్ ఎస్సీ సెల్ ఉఫాద్యాక్షడు గాదె పురుషోత్తం, గ్రామ శాఖ బీసీ సెల్ కార్యదర్శి రాచర్ల శీను, మండల నాయకులు చల్ల అనిల్ రెడ్డి, ఉరుమొడ్ల పద్మా రెడ్డి, కొలిపాక కొంరయ్య, కొలిపాక చంద్రు, గ్రామ శాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు మాచర్ల విమల, మండల మహిళా ఉపాధ్యక్షురాలు మాచర్ల నీల, గ్రామ శాఖ మహిళా కార్యదర్శి బాస్కుల వెంకటమ్మ, చింత జయ, చుక్క కౌసల్య, డప్పు కళాకారులు బాస్కుల చిన్న ఎల్లయ్య, బాస్కుల ఉప్పలయ్య, బాస్కుల ఏలియా, చింత ప్రభాకర్, బొమ్మగళ్ళ చంద్రయ్య, మంద అశోక్ అశోక్, గుండె క్రిష్టయ్య, గాదె ముత్తయ్య, పెండ్లి ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలో తమ్మడ పల్లి గ్రామంలో మోడీ దిష్టిబొమ్మను చావు డప్పులతో ఊరేగింపుగా చేసి బిజేపి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు చిలువేరు శివయ్య
గ్రామశాఖ అధ్యక్షుడు మారపల్లి కుమార్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు రాపర్తి
రాజ్ కుమార్, గ్రామ రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ గద్ద కొమురయ్య, పిఏసిఎస్ డైరెక్టర్ లోకిని భిక్షపమ్మసాయిలు, మండల పార్టీ రైతు విభాగం మాజీ అధ్యక్షుడు పులిగిళ్ళ కుమార్,
వేల్పుల కొమురమ్మ,మహమ్మద్ బషీర్, వేల్పుల సతీష్, మహమ్మద్ రియాజ్, రైతులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

నేతకాని రాష్ట్ర సదస్సును విజయవంతం చెయ్యాలి : దుర్గం ప్రేమ్ కుమార్

“చలో కరీంనగర్ విజయవంతం చేయాలని” భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతకాని సంఘం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు దుర్గం ప్రేమ్ కుమార్ అన్నారు

భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి: కరకగూడెం మండల పరిధిలోని విలేకర్ల సమావేశంలో ఈనెల 19/12/2021 కరీంనగర్ లోని సాయి మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగే రాష్ట్ర విద్యార్థి సమస్యలపై జరిగే సదస్సును విజయవంతం చేయాలి నేతకాని విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు దుర్గం ప్రేమ్ కుమార్ అన్నారు.

గత కొన్ని ఏళ్లుగా నేతకానీలు ఎదుర్కొంటున్న సమస్యల పైన మరియు ఏజెన్సీ గోదావరి పరివాహక ప్రాంతాల నేతకాని లు ఆదివాసీల ప్రజలతోనే మమేకమై నివసిస్తున్నప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఎలాంటి హక్కులు,చట్టాలు వర్తించక పోవడం వలన అభివృద్ధికి గత 50 సంవత్సరాల వెనకబాటు తనం లో ఉన్నారు. నేతకాని లు విద్య వైద్యం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డారు. ఇప్పటికైనా నేతకాని కులస్తులు అందరూ ఏకంగా పోరాడాలని కోరుకుంటున్నాను. కాబట్టి నేతకాని కుల బంధువులందరూ మన యొక్క హక్కులను సంపాదించుకో గలము. మన కులస్తులు అందరూ రాష్ట్ర సదస్సును విద్యార్థులు యువకులు పెద్ద సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయగలరు.

దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఆర్థికంగా రాజకీయంగా ఉపాధి పరంగా విద్య పరంగా ఉద్యోగపరంగా మనకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మనకు జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణలోని నేతకాని విద్యార్థి కులస్తుల అందరం ఏకమై ప్రభుత్వంపై మన హక్కుల సాధన కోసం మనకు జరుగుతున్న అన్యాయం గురించి బహిరంగంగా ఉధ్యామాలకు సిద్ధం అవుదాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జాడి నాగరాజు, రామటేంకి మోహన్ రావు, చప్పిడి వెంకటేశ్వర్లు, జాడి సంజీవ, జిల్లా నాయకులు దుర్గం సందీప్‌, ప్రకాష్, గాందర్ల సతీష్,గాందర్ల ధనంజయ, కొండ గొర్ల కోటేశ్వరరావు, బాడిస సమ్మయ్య, బాడిస సుభాష్, జనగం సుమన్, జాడి దినేష్, దుర్గం శరత్ బాబు, దుర్గ ప్రసాద్, జాడి రవి కుమార్,జిమ్మిడి విజయ్,గోగు విజయ్,జాడి విజయ్,దుర్గం ప్రవీణ్, రామటేంకి వంశీ, జాడి అర్జున్, జాడి వంశీ,గాందార్ల లోకేష్,దుర్గం కిరణ్,జిమ్మిడి మనోరంజన్,దుర్గం సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

మండలకేంద్రానికి చేరుకున్న జ్ఞాన యుద్ధ యాత్ర..

26 నవంబర్ 2021న యాదాద్రి… నుండి ..భువనగిరి జిల్లా కేంద్రం.అంబేద్కర్ విగ్రహం 14 ఏప్రిల్ 2022 వరకు ….
పల్లె నుండి ఢిల్లీ వరకు { సి ఏ పి ఎస్ ఎస్ } జాతీయ కమిటీ అధ్యక్షుడు జేరిపోతుల పరుశరము . జ్ఞాన యుద్ధ యాత్ర ను ప్రారంభించారు
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి డిసెంబర్15 ఇల్లంతకుంట మండలకేంద్రంలో రావడంతో వారికి మండల అంబేద్కర్ నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికి తరువాత అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మండలకేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ మండల అధ్యక్షుడు తడ్కపల్లి భూమయ్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసినారు . సి ఏ పీ ఓ ఎస్ ఎస్ జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరుశరములు మాట్లాడుతూ ..మా యొక్క ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే మన్న దేశంలో కరెన్సీ నోట్ల పై. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్ర పాఠాన్ని ముద్రించాలని.అలాగే .స్వతంత్ర దినోత్సవం రోజున .గణతంత్ర దినోత్సవం రోజున అందరి చిత్రపటలతో పాటు అంబేద్కర్ చిత్ర పాఠాన్ని పెట్టాలని కోరారు.దేశంలో ఈరోజు ఇలా అందరూ ఉన్నారు అంటే ముఖ్య కారణం. భారత రాజ్యాంగం వ్రాసినది ఒక్క అంబేద్కర్ ఆని. దాంతో పాటు జాతీయ జెండాను కూడా అశోక చక్రాన్ని కూడా పెట్టింది కూడా ఆ మహాత్ముడు అని ఇలా స్వతంత్ర వచ్చిన నాటినుండి భారత దేశంలో నోట్ల ముద్రణలో చాలా రకాల వ్యవసాయ నికి సంభవించింది. ముద్రించారు .అలాగే జాతీయ మహాత్మా గాంధీ చిత్ర పాఠాన్ని కూడా కరెన్సీ నోట్లు పై ముద్రించారు .మాకు గాంధీ అంటే వేరు కాదని వారు మా నాయకుల ని ..కానీ మాకు ఇప్పుడైనా ఇన్ని కార్యక్రమంలో సహాయం చేసిన అంబేద్కర్ చిత్రాన్ని ఎందుకు కరెన్సీ పై ముద్రించారు అని ఈరోజు ఈ యాత్ర చేస్తున్నామని .మరియు దేశంలో చాలా విగ్రహాలు ఉన్నాయి అంటే అవి అంబేద్కర్ వని .కానీ చాలా గ్రామలో పట్టణాల్లో విగ్రహాల పరిస్థితి చూస్తే వ.చేతులు. కన్ను.లేకుంటే మొండిగా పెడుతున్నారు అని వాటికి గ్రామంలో కానీ పట్టణాల్లో కానీ సీసీ కెమెరాల ను ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మాకు సహకారాన్ని అందించిన .అంబేద్కర్ మండల అధ్యక్షుడు తడ్కపల్లి భూమయ్య.అలాగే మండల అంబెడ్కర్ నాయకులు .గుండ్రేడ్డి రాజు.దేవదాసు.మామిడి సంజీవ్.పసుల బాలరాజు.శంకర్.తడుకపల్లి రాములు.బాలయ్య.తో పాటు తదితరులు పాల్గొన్నారు

కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి బీసీ మేధోమథన సదస్సు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో జాతీయ బీసీ విద్యార్థి సంఘం అధ్వర్యంలో బీసీ మేధోమథన సదస్సు నిర్వహించడం జరిగింది,
రెండు రోజుల పర్యటన లో భాగంగా బీసీ, ఎస్సీ విద్యార్థి వసతి గృహాలు సందర్శించి విద్యార్థులతో ముఖ ముఖి నిర్వహించడం జరిగింది, శాతవాహన విశ్వ విద్యాలయంలో సందర్శించి విశ్వ విద్యాలయ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని తెలిపారు,

అనంతరం రాష్ట్ర స్థాయి బీసీ మేధోమథన సదస్సు నిర్వహించడం జరింగింది.
ఈ కార్యక్రమంలో అల్ ఇండియా ఓబీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాయకులు జి కిరణ్ కుమార్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్ లు ముఖ్య అతిధులుగా హాజరై మాట్లాడారు.

కింది డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
1. 2021 జనాభా లెక్కలలో కుల గణన చేపట్టాలి.

2. చట్ట సభల్లో బీసీలకు 53% రిజర్వేషన్లు కల్పించాలి.

3. పెండింగ్ లో ఉన్న పూలే ఓవర్సీస్, అంబెడ్కర్ ఓవర్సీస్ (విదేశీ విద్య), స్కాలర్షిప్, రియంబర్స్మెంట్, హాస్టల్ మెస్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి.

4. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో నూతన పోస్ట్ మెట్రిక్ వసతిగృహాలు నెలకొల్పాలి.

5. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో 1000 మంది సమర్థంగల ఓబిసి వసతి గృహాలు ఏర్పాటు చేయాలి.

6. వసతి గృహాలకు, గురుకులకు పక్క భవనాలు నిర్మించాలి.

7. రాష్ర్టంలో ఉద్యోగాల క్యాలెండర్ ను అమలు పరచాలి, నోటిికేషన్లు విడుదల చేయాలి.

8. కరీంనగర్ లో మెడికల్ కళాశాల, సైన్స్ సెంటర్ ను వెంటనే నిర్మించాలి.

9. ఫీజుల రీయింబర్స్మెంట్ పథకం ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ, పిజి, డిప్లొమా కోర్సులకు పూర్తి స్థాయి ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలి.

10. పెరిగిన ధరలకు అనుగుణంగా వసతి గృహాలలో, గురుకులలో, మెస్ చార్జీలు పెంచాలి.

11. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో విద్యా రంగానికి ప్రాధాన్యత కల్పించాలి.

పై డిమాండ్లను పరిష్కరించాలని, వాటి సాధన కోసం నిరంతరం ఉద్యమిస్తామని తెలిపారు, అణగారిన వర్గాలపై వివక్ష దోరణి మార్చుకోవాలని సూచించారు లేని పక్షంలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అల్ ఇండియా ఓబీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు జి. కిరణ్ కుమార్, జాతీయ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్, జాతీయ సహలదారులు మండే అంజి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓ. కొండల్, ముక్తిష్వర్, పవన్ నాయక్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు లెంకల అనిల్, ఎర్ర బాలకృష్ణ, బోయినపల్లి సాయి చంద్, బీర్పుర్ వివేక్, కల్వ అజయ్, దుబాసి ప్రణీత్,
తదితరులు.

పబ్లిక్ గార్డెన్ లో స్వచ్ఛ సర్వేక్షన్-స్వచ్ఛ భారత్.

నేటిదాత్రి, హనుమకొండ : పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ హన్మకొండ ప్రెసిడెంట్ వల్లాల జగన్ గౌడ్ అధ్వర్యంలో ప్రదానమంత్రి స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా మన వరంగల్ నగర మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు హెల్త్ ఆఫీసర్ రాజా రెడ్డి పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పబ్లిక్ గార్డెన్ లోని అన్ని పరిసర ప్రాంతాలలో స్వచ్ఛ భారత్ మరియు క్లినింగ్ చేసి స్వచ్ఛ గార్డెన్ కార్యక్రమం చేపట్టారు. బుధవారం జరిగిన ఈ కా ర్యక్రమాన్ని ఉద్దేశించి పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ హన్మకొండ అధ్యక్షులు వల్లాల జగన్ గౌడ్ మాట్లాడుతు జాతీపిత మహత్మ గాంధీ కలలు కన్న పరిశుద్ద భారతదేశ ఆకాంక్షలను, భారత ప్రధాని నరేంద్ర మోడి గారు స్వీకరించి 2014సంవత్సంరంలో 5సంవత్సరాలలో పరిశుభ్ర భారతవని తయారుచేయడం కోసం స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ రాజారెడ్డి మట్లాడుతు ప్లాస్టిక్ నివారించాలని,పొడిచెత్తను తడిచెత్త వేరు చేసి మున్సిపాలిటీల కు సహకరించాలని మన చుట్టుపక్కలున్న ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని అన్నారు.

గౌరవ అధ్యక్షులు దేవానందం, వైస్ ప్రెసిడెంట్స్ గిరిజ, అన్నపూర్ణ,కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కోషాదికారి రాజ్ కుమార్, కిరణ్ రాజ్, ఉపేందర్, ప్రసూనరెడ్డి,అన్వర్,రిపోర్టర్ శ్రీనివాస్, రాంబాబు, కృష్ణ,సంతోష్,రవీందర్,అనిల్,వెంకన్న,చంద్రకళ,ప్రమీల,శానిటరీఇన్స్పెక్టర్స్,అనిల్,గోల్కొండ శ్రీను,మరియు వందల సంఖ్యలో వాకర్స్ పరిశుద్ద కార్మికులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version