పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ ని పరామర్శించిన పెద్ది
నడికూడ,నేటిధాత్రి: తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె బోయిన అశోక్ ముదిరాజ్ మాతృ మూర్తి పల్లెబోయిన ఉపేంద్ర మరణ వార్త తెలుసుకొని నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామానికి వెళ్లి పరామర్శించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి.వారి వెంట తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఎన్నారై విభాగం రాష్ట్ర కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్,బిఆర్ఎస్ మండల నాయకులు సూధాటి వేంకటేశ్వర్ రావు,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్తూరు గోవర్ధన్,మామిడి దేవేందర్, గుడికందుల శివ,తదితరులు పాల్గొన్నారు.