
ప్రతిపక్షాలకు ఓటు అడిగే హక్కు లేదు
-వాళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలి -రైతు బిడ్డను కాబట్టే రైతు విలువ తెలుసు -బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి -చిరుజల్లులలో ఆగని జోరు కారు ప్రచారం #నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని రామన్నకుంట తండా గ్రామపంచాయతీ నుండి మంగళవారం నర్సంపేట బిఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. రామన్నకుంట తండా మీది నుండి అమీన్ పేట, పనికర, దేవుని తండా, దీక్షకుంట, సీతారాంపురం, ముదిగొండ, బంజరపల్లి,…