
వినాయక విగ్రహ ఏర్పాట్లలో తగు నియమాలు పాటించాలి
కేసముద్రం ఎస్సై కోగిల తిరుపతి కేసముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి: కేసముద్రం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు,వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు ఎవరైతే ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహాలు పెట్టాలని అనుకున్న వారు తప్పనిసరిగా వారు విగ్రహం పెట్టే స్థలం యొక్క యజమాని తో పర్మిషన్ పొందాలని కేసముద్రం ఎస్సై కోగిల తిరుపతి ఉత్సవ కమిటీ నిర్వాహకులకు తెలిపారు.అలాగే విద్యుత్ శాఖా,పోలీస్ శాఖా వారి అనుమతి కూడా పొందవలసి ఉంటుందనీ అన్నారు.కావున వినాయక ఉత్సవ కమిటీ…