పాత…కొత్త కలయికలో మోడీ క్యాబినెట్ : మోడీ కొలువులో కొత్త ముఖాలు
ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ తన క్యాబినెట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతంలో తనతోపాటు మంత్రివర్గంలో పనిచేసిన వారిని కొనసాగించేందుకే మొగ్గుచూపిన మోడీ దాదాపు అందరికి బెర్త్ ఖాయం చేశారు. స్మృతి ఇరానీ, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, పీయుష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్, ముక్తర్ అబ్బాస్ నఖ్వీ, కిరణ్‌రిజు, రామ్‌దాస్ అక్‌పాలే గతంలో మంత్రివర్గంలో కొనసాగిన వారే. ప్రమాణస్వీకారానికి సిద్ధంగా ఉండాలని పిఎంఓ నుంచి ఫోన్‌కాల్ అందుకున్న…