పదే పదే చెప్పినా వినకపోతిరి…పక్కన పెట్టేదాకా తెచ్చుకుంటిరి?

నలభై మందికి పైగా టిక్కెట్టు కట్‌? గత ఏడాది నుంచే హెచ్చరిస్తున్న నేటిధాత్రి…!   పార్టీమీద సానుభూతి వున్నా, ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత? పధకాల మీద నమ్మకం…ఎమ్మెల్యేలపై ప్రతికూల ప్రభావం? ప్రతి ఇంటికీ ఏదో ఒక పధకం… ఎమ్మెల్యేల తీరుపై నిర్వేదం…? చెప్పంగ విననోడిని చెడంగ చూడాలని పెద్దలు ఊరికే అనలేదు. అసలు తెలంగాణ అన్న పదంలోనే ఒక వైబ్రేషన్‌ వుంది. అందులో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులంటే ప్రజల్లో ఒకరకంగా చెప్పాలంటే ఆరాధన భావం వుండేది….

Read More

నవతరం రాజకీయ యుగం…ఇది కేసిఆర్‌ శకం…

కొత్త జాతీయ పార్టీ కేసిఆర్‌తోనే సాధ్యం… ఏ పార్టీ వేలు పట్టకొని ఎదగలేదు…. ఎవరి కోసమో రాజకీయం చేయలేదు… జనం కోసం రాజకీయం చేసిన నాయకుడు కేసిఆర్‌…. తెలంగాణ ఎజెండా రాజకీయ దిశ మార్చుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌… జనం ఆకాంక్ష కోసమే రాజకీయమైన ఉద్యమ కారుడు…. తెలంగాణ సాధనలో త్యాగధనుడు…. అరవై ఏళ్ల తెలంగాణ కార్యసాధకుడు… తెలంగాణ విముక్తి ప్రధాతయ్యాడు…. ఇప్పుడు దేశానికి అవసరమౌతున్నాడు… దేశ ప్రగతి కోసం ముందుకు సాగుతున్నాడు… జాతీయ పార్టీ ఏర్పాటు…

Read More

పల్లె ప్రగతి పనులను పరిశీలించిన

అడిషనల్ కలెక్టర్ దీపక్ కుమార్ ముత్తారం :-నేటి ధాత్రి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లోని దరియపూర్ గ్రామం లో పల్లెపగతి ఐదో విడత కార్యక్రమం అడిషనల్ కలెక్టర్ దీపక్ కుమార్ కొత్తగా నిర్మిస్తున్న క్రీడ ప్రాంగణం వైకుంఠ ధామం పల్లె ప్రకృతి వనం నర్సరీ ని తనిఖీ చేశారు విధుల్లో తిరుగుతూ పారిశుధ్యం పనులను మరియు డ్రింకింగ్ వాటర్ బాగా చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ శ్రీనివాస్ ఎంపీఓ వేణుమాధవ్ సర్పంచ్…

Read More

గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల పై లాఠీచార్జి జరగలేదు

పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత భీమదేవరపల్లి నేటిదాత్రి గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల పై లాఠీచార్జి జరిగిందని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత వెంటనే స్పందించి, ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకోవడం వల్ల పోలీసులకు నిర్వాసితులకు మధ్య తోపులాట మాత్రమే జరిగింది, ఎలాంటి లాఠీచార్జ్ జరగలేదని పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు. భూ నిర్వాసితులు సమన్వయం పాటించాలని సూచించారు. పై అధికారులతో మాట్లాడి…

Read More

ప్రజా ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్లజిల్లా ప్రతినిధి నేటిదాత్రి 13, జూన్  ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు నుండి స్వీకరించిన ఫిర్యాదులు, సమస్యలపై అధికారులు స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, సత్వర…

Read More

పెంచిన విద్యార్థి బస్ పాస్ లను వెంటనే తగ్గించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా

భూపాలపల్లి నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రంలో పెంచిన విద్యార్థి బస్ పాస్ లను,బస్సు ఛార్జీలను తగ్గించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్ డిపో ముందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల.ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు నేరెళ్ళ.జోసఫ్ లు మాట్లాడుతూ తెలంగాణలో విద్యార్థి బస్సు చార్జీలను 135 శాతం పెంచడం , 195 రూపాలు బస్ పాస్ ను 450 రూపాయలు చేయడం సిగ్గుచేటని,భూపాలపల్లి…

Read More

పెండింగ్ కేసులు తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి

పోలీస్ శాఖ అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టీకల్స్ సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలి జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ఐ.పి.ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ   ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…   పెండింగ్ కేసులను త్వరగతిన పరిష్కరించి పెండింగ్ కేసులను తగ్గించే విధంగా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.అవసరమైతే సంబంధింత న్యాయమూర్తులను స్వయంగా కలసి కేసుల పరిష్కరానికి…

Read More

శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయం

మంగపేట – నేటి ధాత్రి మంగపేట మండలంలోని వాడగూడెం గ్రామానికి చెందిన తుమ్మల.వెంకటేశ్వరరావు గత కొంతకాలంగా రాజుపేట లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఇటీవల రోజువారి కూలీ పనికి వెల్లగా కాలికి దెబ్బ తగిలింది. గాయం తీవ్రం కావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది ఆస్పత్రిలో చూపించే అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్థానికులు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ వారికి తెలియజేయడంతో సోమవారం వెంకటేశ్వర రావు ను కలిసి వైద్య ఖర్చుల నిమిత్తం 2000/- రూపాయిల…

Read More

చెవులు కుట్టు వేడుకకు హాజరై చిన్నారులను ఆశీర్వాదించిన టిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ,PACS చైర్మన్ తోట రమేష్

ఈరోజు మంగపేట మండలం కొత్తమల్లూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మండల మాజీ యూత్ అధ్యక్షులు గుండారపు రమేష్-యమున దంపతుల కుమార్తెలైన రూపశ్రీ,గాగణ చిన్నారులకు చెవులు కుట్టు కార్యక్రమం ముక్కుడుపోచమ్మ దేవాలయం లో నిర్వహించిగా చెవులు కుట్టు కార్యక్రమానికి హాజరై చిన్నారులను ఆశీర్వాదించిన *టిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, PACS చైర్మన్ తోట రమేష్* ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె…

Read More

ఎండాకాలంలో ప్రజల దాహాన్ని తీర్చేది మట్టి కుండ….

గతంలో మట్టి కుండలోనే పెరుగు , సల్ల చేసేవాళ్ళు…. ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన మట్టికుండలు…. స్టీల్ వైపే ప్రజల మొగ్గు….  కొల్చారం , ( మెదక్ ) నేటి ధాత్రి : మట్టితో మానవుడిది విడదీయలేని అనుబంధం. అందుకే మట్టి పాత్రల పై మళ్ళీ ఆసక్తి చూపుతున్నాడు. మన పూర్వీకులు మట్టితోనే ఎన్నో రకాల పాత్రల్ని తయారు చేసి వాటి వినియోగంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో అల్యూమినియం, స్టీల్ ఇతరత్రా కెమికల్స్తో…

Read More

బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే ఇకపై….. నేరమే

చెత్తలో లభించిన ఆధారాలతో గుర్తింపు జరిమానా విధింపు   *సిద్దిపేట నేటి ధాత్రి* మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి అదేశాలమేరకు పట్టణంలోని బహిరంగ ప్రదేశాలలో,ఖాళీ ప్రదేశాలలో అపరిచితులు చెత్త పడవేసి అపరిశుభ్రతకు పాల్పడి, పట్టణ ప్రజల అనారోగ్యానికి కారకులు అయిన వారిని చెత్తలో దొరికిన ఆధారాలతో గుర్తించి జరిమానా విధించి తగిన అవగాహన కల్పించి అప్పటికి కూడా అదేవిధంగా మరల చెత్త బహిరంగ ప్రదేశాలలో పడవేసినట్లైతే మున్సిపల్ చట్టప్రకారం శిక్షార్హులను చేయవలసిందిగా ఆదేశించారు.ఇట్టి క్రమంలో సోమవారం శుభోదయ…

Read More

సిద్దిపేట నూతన కలెక్టర్ గా ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట నేటి ధాత్రి  ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అందించే లక్ష్యంగా విధులు నిర్వహిస్థానని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వంచే నూతనంగా జిల్లా కలెక్టర్ గా నిర్మించబడిన ప్రశాంత్ జీవన్ పాటిల్ సోమవారం ఉదయం 10:30 కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగా జిల్లా అదనపు కలెక్టర్ లు ముజామిల్ ఖాన్, శ్రీనివాస రెడ్డిలు పుష్ప గుచ్చం అందించి వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య పూర్ణకుంభంతో స్వాగతం…

Read More

ప్రధాని 8 ఏళ్ల పాలనలో ఎన్నో అద్భుతాలు.

ప్రధాని 8 ఏళ్ల పాలనలో ఎన్నో అద్భుతాలు. .. కరోన సమయంలో 190 కోట్లు వ్యాక్సిన్లు పంపిణీ. .. దేశవ్యాప్తంగా 200 మెడికల్ కాలేజీలు మంజూరు.   రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.   … రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బందికి సన్మానం. .. బిజెపి పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్. భారత ప్రధాని నరేంద్ర మోడీ 8 ఏళ్ల పాలనలో దేశంలో ఎన్నో అద్భుతాలు సాధించి ప్రజల మన్ననలు పొందాలని రామాయంపేట బిజెపి పట్టణ అధ్యక్షుడు శంకర్…

Read More

పెంచిన బస్సుపాస్ చార్జీలు వెంటనే తగ్గించాలి.

కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్. రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల బస్సులపై చార్జీలు పెంచడం ఎంత వరకు సమంజసమని రామాయంపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ చాలామంది నిరుపేదలే బస్సులపై ప్రయాణం చేస్తూ చదువుకుంటున్నారు అని పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో బస్ పాస్టర్ పై అమాంతం చార్జీలు పెంచడం వల్ల నిరుపేద విద్యార్థులకు అనేక ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు….

Read More

వివేకానంద లో యోగ ప్రచార తరగతులు యోగ డే పురస్కరించుకొని యోగా అవగాహన.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి. ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాను విద్యార్థులకు ప్రచారం నిర్వహించడానికి స్థానిక ,,యువ జ్యోతి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ,,సోమవారం నుంచి ప్రత్యేక యోగ ప్రచార తరగతులు నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ సత్యనారాయణ తెలిపారు .ఈ సందర్భంగా స్థానిక వివేకానంద విద్యాలయం లో విద్యార్థులకు యోగాపై అవగాహన ప్రత్యేక తరగతులు నిర్వహించారు. పతాంజలి మహర్షి రచించిన యోగ శాస్త్రం గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది .అష్టాంగ యోగం లైన యమ. నియమ. ఆసన. ప్రాణాయామ. ప్రత్యాహార…

Read More

ఘనంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి. రామాయంపేట మున్సిపాలిటీ చైర్మన్ గౌరవ పల్లె జితేందర్ గౌడ్ జన్మదిన వేడుకలను సోమవారం రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకు కట్ చేసి జన్మదిన కార్యాలయంలో లో పాల్గొన్న వారు మాట్లాడుతూ కరోనా సమయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిత్యవసర సరుకులు పంపిణీ రోజుకు రెండువేల మంది చొప్పున రెండు నెలలు దాతల తోటి బాటచారులు కు భోజనాలు పెట్టించిన ఘనత చైర్మన్ కు దక్కింది అన్నారు. ఎంతోమందికి…

Read More

అంగన్వాడీ కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం

కొడకండ్ల ,(జనగామ) ,నేటిధాత్రి : మండలంలోని పెద్ద బాయి తండా గ్రామం లోని అంగన్వాడి కేంద్రంలో సర్పంచ్ సునీత రమేష్ ఆధ్వర్యంలో సోమవారం పిల్లలకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సునీత రమేష్ మాట్లాడుతూ అంగన్వాడీ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సోమేశ్, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ అనిల్, మమత, అంగన్వాడీ టీచర్లు జి. సునీత, రజిత, ఆశ కార్యకర్త,ఆయాలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Read More

కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం కోనేటి లోకి మురుగు నీటి ప్రవాహం

కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం దేవాలయమైన కోనేటి లోకి నిరంతరంగా మురుగు నీటి ప్రవాహం జరుగుతున్నది పరిసర గృహాల నుండి వాడకం నీరు పరిసర ప్రాంతాల నుండి మురుగునీరు దేవాలయ పుష్కరిణిలోకి ప్రవహిస్తున్నది ఆ మార్గం గుండా వెళ్లే భక్తులకు మురుగునీరు దర్శనమిస్తుంది దీని నివారణ గురించి దేవాలయ అధికారులను గాని గ్రామపంచాయతీ సిబ్బంది వారు ఇరువురు బాగు చేయాలని ఒకరిపై ఒకరు నెట్టివేస్తూ సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు తమ దృష్టికి…

Read More

రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటుదాం.

రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.   జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్ సింగ్ ఆదేశాల మేరకు రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని నాలుగు వీధుల రోడ్లు సిద్దిపేట రోడ్డు,మెదక్ రోడ్డు, కామారెడ్డి రోడ్డు. రోడ్డుకిరువైపులా రెండు వరసల మొక్కలు నాటుదాం అని రామాయంపేట మున్సిపల్ అధికారులు తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ ఆదేశాల మేరకు మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్తో పాటు మేనేజర్ శ్రీనివాస్, యుగంధర్, ప్రసాద్,…

Read More

రైతుబంధు వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలి సిపిఎం

నేటిదాత్రి కొమురవెల్లి     కొమురవెల్లి మండలం లో ఎమ్మార్వో కార్యాలయంలో రైతుల పక్షాన కొమురవెల్లి మండల సిపిఎం కార్యదర్శి సత్తిరెడ్డి గారు ఎమ్మార్వో గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది రైతుబంధు వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలని బ్యాంకు రుణాలు వెంటనే మాఫీ చేసి కొత్తగా రుణాలు ఇవ్వాలని రైతులకు నాణ్యమైన విత్తనాలు మందు బస్తాలు సబ్సిడీపై అందించాలని కొమురవెల్లి ఎమ్మార్వో గారి కార్యాలయంలో శ్రీనివాస్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది…

Read More
error: Content is protected !!