lekinpu kendralanu parishilinchina collector, లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ నర్సంపేట డివిజన్‌లోని అన్ని మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాలను వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ ఎం.హరిత పరిశీలించారు. లెక్కింపు కేంద్రాలలో లెక్కింపు జరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. తొలుతగా ఎంపిటిసి, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టి సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. జనరల్‌ ఎన్నికల అబ్జర్వర్‌ పరిశీలన …. జనరల్‌ ఎలక్షన్‌ అబ్జర్వర్‌ బి.శ్రీనివాస్‌ జడ్పీటిసి ఓట్ల లెక్కింపు జరుగుతున్న సందర్భంలో లెక్కింపు…

Read More

greaterlo dongala gang, గ్రేటర్‌లో దొంగల గ్యాంగ్‌

గ్రేటర్‌లో దొంగల గ్యాంగ్‌ గ్రేటర్‌ నగరంలో దొంగల గ్యాంగ్‌ భయపెడుతోంది. 8మంది సభ్యులున్న ఈ గ్యాంగ్‌ తాళం వేసి ఉన్న, ఒంటరిగా ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండురోజుల క్రితం కాజీపేట చైతన్యపురి ప్రాంతంలో అర్థరాత్రి ఓ ఇంటి కిటికి ఊచలు కట్‌ చేస్తుండగా అప్రమత్తమైన ఇంటి యజమానులు గట్టిగా అరవడంతో దొంగలు పారిపోయినట్లు సమాచారం. వెంటనే తేరుకున్న ఇంటి యజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్న ఈలోపే…

Read More

dieo officelo padakagada…siggu…siggu, డిఐఈవో ఆఫీసులో పడకగదా…సిగ్గు..సిగ్గు

డిఐఈవో ఆఫీసులో పడకగదా…సిగ్గు..సిగ్గు వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో కొందరు రాత్రి వేళలో కార్యాలయాన్ని పడకగదిగా మార్చుకొని ఉంటున్న విషయాన్ని ‘నేటిధాత్రి’ ప్రభుత్వకార్యాలయమా..? పడకగదా..? అనే శీర్శికతో పాఠకుల ముందుకు తీసుకువచ్చింది. రాత్రి వేళలో కార్యాలయాన్ని పడకగదిలా మార్చుకొని ఉంటుండడాన్ని ప్రజలు, ఉద్యోగ సంఘాల నేతలు, విధ్యార్థి నాయకులు, ప్రజాసంఘాల బాధ్యులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బాధ్యతగా, హుందాగా వ్వవహరించాల్సిన డిఐఈవో ఈ విదంగా కార్యాలయానికి చెడ్డ పేరు తేవడంతో కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం కార్యాలయానికి వెళ్లాలంటేనే…

Read More

ముదురుతున్న సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు

ముదురుతున్న సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు గ్రేటర్‌ వరంగల్‌ నగరంతో సహా వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌ల హవా కొనసాగుతుంది. సమస్య ఏదైనా అందులో తలదూర్చి సెటిల్‌మెంట్‌ చేస్తామని చెప్పడం ఈ గ్యాంగ్‌ల ప్రత్యేకత. సమస్య ఏదిలేకున్న వీరే తమ సొంత తెలివితేటలతో సమస్యలను సృష్టించి ఆ సెటిల్‌మెంట్‌ వీరివల్లే అయ్యేవిధంగా చేసి పరిష్కారం చేస్తామని చెప్పి డబ్బులు దండుకోవడం వీరు అలవాటు చేసుకున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వీరి బాధితులు అధికసంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది సమస్య…

Read More

jailashaka incharge igga b.saidaiah, జైళ్లశాఖ ఇంఛార్జి ఐజీగా బి.సైదయ్య

జైళ్లశాఖ ఇంఛార్జి ఐజీగా బి.సైదయ్య తెలంగాణ రాష్ట్ర జైళ్లశాఖ ఐజీ ఆకుల నర్సింహ మే 30న పదవి విరమణ పొందడంతో ఇంచార్జి ఐజీగా బి.సైదయ్యను నియమిస్తూ జైళ్లశాఖ డీజీ ఎం.వినయ్‌కుమార్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సైదయ్య ప్రస్తుతం హైదరాబాద్‌ రేంజ్‌ జైళ్ల శాఖ డిఐజిగా విధులు నిర్వహిస్తున్నారు. 2018లో రాష్ట్రపతి అవార్డు ఎంపిక అయిన ఇతనికి జైళ్ల శాఖలో మంచి గుర్తింపు ఉంది.

Read More

raitheraju ninadanne nijam chestunna modi, రైతేరాజు నినాదాన్ని నిజం చేస్తున్న మోడీ

రైతేరాజు నినాదాన్ని నిజం చేస్తున్న మోడీ రైతే రాజు అనే నినాదాన్ని నరేంద్ర మోడీ నిజం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. నరేంద్ర మోడీ రెండోవసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా రైతులకు భరోసా కల్పిస్తూ ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పధకం ద్వారా 5ఎకరాల రైతులకు మాత్రమే కాకుండా ప్రతి రైతుకి కుడా వర్తించేలా నిర్ణయం తీసుకున్న సందర్బంగా బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కిసాన్‌ మోర్చా…

Read More

pranadathaga maruthunna rajkumar, ప్రాణదాతగా మారుతున్న రాజకుమార్‌

ప్రాణదాతగా మారుతున్న రాజకుమార్‌ అన్ని దానాలకన్నా రక్తదానం మిన్న, రక్తదానం చేయండి ఒక జీవితానికి ప్రాణదాతలు కండి అంటూ ఎందరో మహానుభావులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇందుకు అనుకుంగానే 20సార్లు రక్తదానం చేసి ప్రాణదాతలు నిలుస్తున్నాడు దుగ్గొండి మహిళా సమాఖ్యలో ఎపిఎంగా విధులు నిర్వహిస్తున్నారు డాక్టర్‌ గుజ్జుల రాజ్‌కుమార్‌. ఈ సందర్భంగా ‘నేటిధాత్రి’తో రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని సోమవారం వరంగల్‌ డిఆర్‌డిఎ ఆధ్యర్యంలో వరంగల్‌ రోవర్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో…

Read More

telangana rashtra avatharana dinostava vedukalu, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు హసన్‌పర్తి మండలంలోని వివిధ గ్రామాలలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వార్డుసభ్యులు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారుతెలంగాణగా అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపిటిసి, వార్డుసభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Read More

vithanthuvula manobavalanu gouravinchali, వితంతువుల మనోభావాలను గౌరవించాలి

వితంతువుల మనోభావాలను గౌరవించాలి వితంతువుల మనోభావాలను సమాజంలోని ప్రతి ఒక్కరు గౌరవించాలని జయగిరి గ్రామ సర్పంచ్‌ బొల్లవేణి రాణి అన్నారు. ఆదివారం మండలంలోని జయగిరి గ్రామంలో గ్రామపంచాయితీ కార్యాలయంలో బాలవికాస ఆధ్వర్యంలో గ్రామాభివృద్ది కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ రాణి హాజరై మాట్లాడారు. గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు సహకరించాలని అన్నారు. అదేవిధంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల సమస్య నేడు అధికంగా ఉందని, దాని నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. అనంతరం ఈనెల…

Read More

vronu nirbandinchina gramastulu, విఆర్‌ఓను నిర్బంధించిన గ్రామస్తులు

విఆర్‌ఓను నిర్బంధించిన గ్రామస్తులు జయశంకర్‌ జిల్లా చిట్యాల మండలం నవాబుపేట గ్రామస్తులు విఆర్వోను నిర్భంధించారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడంలో విఫలమయ్యాడని నిరసిస్తూ గ్రామ విఆర్వో ఆదినారాయణను గ్రామపంచాయతీ భవనంలో గ్రామస్తులు నిర్బంధించారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్‌ గ్రామస్తులతో మాట్లాడి అందరికీ పట్టా పాస్‌పుస్తకాలు ఇస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించి విఆర్వోను వదిలిపెట్టారు.

Read More

rajastanlo policelapia dadi avastavam, రాజస్థాన్‌లో పోలీసులపై దాడి అవాస్తవం

రాజస్థాన్‌లో పోలీసులపై దాడి అవాస్తవం వరంగల్‌ క్రైం, నేటిధాత్రి : వరంగల్‌ జిల్లాలో దొంగతనాలకు పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన దొంగల ముఠాను పట్టుకునేందుకు వరంగల్‌ జిల్లా సీసీఎస్‌ పోలీసులు రాజస్థాన్‌కు వెళ్లడం జరిగిందని సీసీఎస్‌ పోలీసులు తెలిపారు. దొంగల ముఠా కోసం గాలిస్తుండగా దొంగల ఆచూకి రాజస్థాన్‌లోని బిల్వాడా జిల్లా హెర్నియా గ్రామంలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తుండగా గ్రామస్తులు పోలీసులను…

Read More

mla gari muddula alludu, ఎమ్మెల్యే గారి ముద్దుల అల్లుడు

ఎమ్మెల్యే గారి ముద్దుల అల్లుడు – వరంగల్‌ పశ్చిమలో ఆడింది ఆట…పాడింది పాట – మామ కంటే ఎక్కువ అధికారాన్ని ఉపయోగించేది అల్లుడే – ఒక్కసారి సర్పంచ్‌గా గెలిచి జనానికి చుక్కలు చూపించాడట… – భూకబ్జాలు,పైసల వసూళ్ళలో ఇతగాడిదే ప్రధాన పాత్ర..? – ఇద్దరు రియల్టర్ల మధ్య దూరి పంచాయితీ పరిష్కారం చేసే ప్రయత్నం – అరవైలక్షలకు ఐదు ఇస్తాడని భాదితుడికి బెదిరింపులు – పోలీసులు తాను చెప్పిందే వినాలని హుకుం, సమస్య పరిష్కారం కాకుండా కాలయాపన…

Read More

prabuthva karyalama…padaka gada…?,ప్రభుత్వ కార్యాలయమా…పడక గదా…?

ప్రభుత్వ కార్యాలయమా…పడక గదా…? వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌జిల్లా ప్రదాన కార్యాలయంలో పగలంతా సిబ్బంది తమ విధులు ముగించుకొని వెళ్లగానే, కార్యాలయంలోకి రాత్రివేళలో ఓ ఇద్దరు వస్తున్నారని వారు అక్కడే మకాం పెడుతున్నారని, ఆ ఇద్దరు ఎవరై ఉంటారు? వారు రాత్రి అవగానే ఎందుకు వస్తున్నారు..కార్యాలయంలో ఉన్న ఆ రెండు పరుపులు ఎవరివి అయ ఉంటాయ..ఆ రెండు పరుపులు వారిద్దరు పడుకోవడానికే తెచ్చుకొని ఆఫీస్‌లో పెట్టుకున్నారా? ఆఫీస్‌ను తమ వ్యక్తిగత అవసరాల కోసం ఏమైనా వాడుకుంటున్నారా? ఇంటర్మీడియట్‌ వ్వవస్థకు…

Read More

jayagirilo swachbharath, జయగిరిలో స్వచ్చభారత్‌

జయగిరిలో స్వచ్చభారత్‌ మండలంలోని జయగిరి గ్రామంలో బాలవికాస ఆదర్శ గ్రామ కమిటీల ఆద్వర్యంలో స్వచ్చ గ్రామం నిర్వహించామని బాలవికాస ప్రతినిధులు బాబురావు, రాజ్‌కుమార్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. దీంతో ఎలాంటి అంటువ్యాధులు దరి చెరవని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలవికాస కమిటీ అధ్యక్షుడు అయిల కొమురమ్మ, జ్యోతి, లలిత, అయిలయ్య, కొంరయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More

modaliana prapancha paryavarana dinostava ustavalu, మొదలైన ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఉత్సవాలు

మొదలైన ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఉత్సవాలు ఈనెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ప్రారంభం చేసినట్లు జిల్లా అటవీశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం నుండి ఈనెల 5వ తేదీ వరకు జరిగే ఉత్సవాలను ఉత్సవాలు వరంగల్‌ రూరల్‌ జిల్లా అటవీశాఖ, జన విజ్ఞాన వేదిక, వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ, వన సేవా సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మొదటిరోజున హైదరాబాద్‌ బర్డింగ్‌ ఫాల్స్‌ సొసైటీ బాధ్యులు…

Read More

arthikame neramaothunda…?, ఆర్థికమే ‘నేర’మౌతుందా…?

ఆర్థికమే ‘నేర’మౌతుందా…? ఆర్థిక సమస్యలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. అవసరానికి తీసుకున్న డబ్బులు అప్పుల ఊబిలోకి నెట్టివేస్తే అవే ఆర్థిక అవసరాలు నేరానికి పురిగొల్పుతున్నాయి. అధికవడ్డీలతో చుక్కలు చూస్తూ అవి కట్టలేక కొందరు నేరగాళ్లుగా మారితే, ఇచ్చిన డబ్బులను అధిక వడ్డీతో సహా రాబట్టేందుకు కొందరు ప్రైవేట్‌ ఫైనాన్సర్స్‌ నేరగాళ్లుగా మారుతున్నారు. ఇంకొందరైతే వ్యాపారాలు పెట్టే తమతో ఉన్న భాగస్వాములను నమ్మి లక్షల్లో పెట్టుబడి పెట్టి లెక్కలు తేలక భాగస్వామి చేతిలో మోసపోయి దిక్కుతోచని స్థితిలో పగతో…

Read More

sankethika vyavasthalapia purthi parignanam undali, సాంకేతిక వ్యవస్థలపై పూర్తి పరిజ్ఞానం ఉండాలి

సాంకేతిక వ్యవస్థలపై పూర్తి పరిజ్ఞానం ఉండాలి జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌లలో విధులు నిర్వహించే కానిస్టేబుల్‌, సిసి టిఎన్‌ఎస్‌ రైటర్లు, రిసెప్షనిస్టులకు సాంకేతిక వ్యవస్థలపై పూర్తి పరిజ్ఞానం ఉండాలని సిరిసిల్ల రాజన్న జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్‌స్టేషన్‌లలోని సిబ్బందికి ఒకరోజు శిక్షణా శిబిరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిసిటిఎన్‌ఎస్‌ రైటర్లు, రిసెప్షనిస్టులకు, పోలీస్‌స్టేషన్‌ టెక్‌ టీమ్‌ సిబ్బందికి సిసిటిఎన్‌ఎస్‌, టెక్‌ డాటమ్‌, రిసెప్షన్‌ సెంటర్‌, 07 ఇంటిగ్రేటెడ్‌ ఫార్మ్స్‌ ఎంట్రీ,…

Read More

rashtra avatharana dinostava reharsals, రాష్ట్ర అవతరణ దినోత్సవ రిహార్సల్స్‌

రాష్ట్ర అవతరణ దినోత్సవ రిహార్సల్స్‌ ఈనెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ రిహార్సల్స్‌ కళాశాల మైదానంలో శనివారం జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే పర్యవేక్షణలో జరిగాయి. రేపటి కవాతు రిహార్సల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…యూనిఫార్మ్‌ ధరించి చూపరులను ఆకట్టుకునేలా కవాతు నిర్వహించాలని చెప్పారు. నేడు చేసిన రిహర్సల్స్‌ చాలా బాగున్నాయని, వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉందని తెలిపారు. కళాశాల మైదానంలో…

Read More

pranam thisina selfie sarda, ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా సెల్ఫీ సరదా ప్రాణాలను మింగేసింది. సరదాగా సెల్ఫీ కోసం చెరువులో దిగి బావ, ఇద్దరు మరదళ్లు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మాపూర్‌ రిజర్వాయర్‌ వద్ద చోటుచేసుకుంది. బొమ్మాపూర్‌ జలాశయంలో పడి ముగ్గురు మృతిచెందారు. మతులు అవినాశ్‌ (32), సంగీత (19), సుమలత (18)లను రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామస్థులుగా గుర్తించారు. ఫొటోలు తీసుకుంటూ ప్రమాదవశాత్తూ ముగ్గురూ జలాశయంలో పడిపోవడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.

Read More

thimmapurlo padakesina parishudyam, తిమ్మాపూర్‌లో పడకేసిన పారిశుద్ధ్యం

తిమ్మాపూర్‌లో పడకేసిన పారిశుద్ధ్యం వరంగల్‌ గ్రేటర్‌ మహానగరంలోని ఆరో డివిజన్‌ తిమ్మాపూర్‌ పేరుకే మహానగరంగా పిలువబడుతోంది. తిమ్మాపూర్‌లో పారిశుద్ధ్యం పడకేసింది. డ్రైనేజీల్లో ఎక్కడికి అక్కడ మురుగునీరు నిలిచి కంపు కొడుతున్నాయి. కాలనీలలో ఎక్కడి చెత్త అక్కడే ఉంటుందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీలో విలీనమై ఏళ్లు గడుస్తున్నా స్థానిక కార్పొరేటర్‌, స్థానిక మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా స్థానిక కార్పొరేటర్‌, మున్సిపాలిటీ అధికారులు స్పందించాలని తిమ్మాపూర్‌వాసులు వేడుకుంటున్నారు.

Read More