అంబేద్కర్ నగర్ ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తదాన దినోత్సవ శిబిరం.

సిరిసిల్ల అంబేద్కర్ నగర్ ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తదాన దినోత్సవ శిబిరం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ 14 సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనైనది. ఈ రక్తదాన శిబిరం ఉద్దేశించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో తో సమానమని, మనం ఇచ్చే రక్తం వేరొకరి నిండు ప్రాణాలను కాపాడాలని సంకల్పంతో రక్తదానం చేస్తున్న రక్తదాతల స్ఫూర్తి ఎంతో గొప్పదని , తెలియజేస్తూ రక్తదానం తో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని గుండె సంబంధిత వ్యాధులు, గొంతు, పెద్ద పేగు క్యాన్సర్లు, సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందని, మన ఆరోగ్య స్థితిని తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత, డాక్టర్ అభినయ్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణీ.

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణీ.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

 

 

కల్వకుర్తి మండలంలోని కుర్మిద్ద తండా గ్రామంలో శనివారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్లని పంపిణీశారు.ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు హనుమంత్ నాయక్,రాము నాయక్, లక్ష్మణ్ నాయక్, పులియ నాయక్, సేవ్య నాయక్, శక్రు నాయక్, కమలమ్మ, శాంతి, సరోజా, శోభా,ఆశ వర్కర్లు,గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను విస్మరించారు.

రాష్ట్రంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను విస్మరించారు

తెలంగాణ విద్యా క్యాలెండర్‌లో జాతీయ విద్యా దినోత్సవాన్ని మర్చిపోయారు, ప్రభుత్వం వెంటనే సమీక్షించాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

2025-26 విద్యా సంవత్సరానికి పాఠశాల విద్యా శాఖ 1 నుండి 10 తరగతుల విద్యా క్యాలెండర్‌ను విడుదల చేసింది. తెలంగాణ వ్యవస్థాపక దినోత్సవం, క్రీడా దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం, హిందీ దివస్, బాలల దినోత్సవం, జాతీయ గణిత దినోత్సవం, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, జాతీయ సైన్స్ దినోత్సవం వంటి అనేక ముఖ్యమైన కార్యక్రమాలు ఈ క్యాలెండర్‌లో చేర్చబడ్డాయి, అయితే స్వాతంత్ర్య సమరయోధుడు మరియు దేశ తొలి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా జరుపుకునే జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకునే నవంబర్ 11ని రాష్ట్ర విద్యా క్యాలెండర్‌లో చేర్చకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వ ఈ నిర్ణయం గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు మరియు దేశ తొలి విద్యా మంత్రి సేవలకు అన్యాయం. గత సంవత్సరం కూడా జాతీయ విద్యా దినోత్సవాన్ని విస్మరించారు, ప్రభుత్వం ఈ విషయంలో విద్యా శాఖకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఉపాధ్యాయ సంస్థల ప్రాతినిధ్యంపై ఈ వేడుకను నామమాత్రంగా జరుపుకున్నారు, కానీ ప్రభుత్వం దీనికి ఎటువంటి నిధులను విడుదల చేయలేదు. రాష్ట్రాన్ని బిజెపి కాదు, కాంగ్రెస్ పాలిస్తోంది, మరియు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూడా మరియు
స్వాతంత్ర్యం తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆయన మొదటి కేంద్ర విద్యా మంత్రి కూడా. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రకటన జారీ చేస్తూ, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మరియు ఇతర వాగ్దానాలను కలిగి ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గిఫ్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కీమ్‌ను ప్రకటించింది. అటువంటి గొప్ప నాయకుడి పేరు మీద ఉన్న జాతీయ విద్యా దినోత్సవాన్ని విస్మరించడం దురదృష్టకరం. ప్రభుత్వం వెంటనే జారీ చేసిన విద్యా క్యాలెండర్‌ను సమీక్షించి, ఈ క్యాలెండర్‌లో జాతీయ విద్యా దినోత్సవాన్ని చేర్చి, రాష్ట్రంలో విద్యా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య సమరయోధులు మరియు దేశ నిర్మాణం మరియు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వివిధ వ్యక్తుల పేర్లతో వివిధ పథకాలను ప్రకటిస్తున్నారు, విశ్వవిద్యాలయాలకు వారి పేర్లు పెడుతున్నారు, పెద్ద అవార్డులను ప్రకటిస్తున్నారు లేదా వారి జ్ఞాపకార్థం పెద్ద స్మారక చిహ్నాలను నిర్మిస్తున్నారు, కానీ దేశ మొదటి విద్యా మంత్రి జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోకుండా నిర్లక్ష్యం చేయడం ముస్లింలలో ఆందోళన మరియు ఆందోళనను కలిగిస్తోంది.

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు.

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారి సమక్షంలో మాజి జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు యాకూబ్ గారి ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణం అల్లీపూర్ లోని ఫయాజ్ నగర్ కాలనీకి చెందిన షేక్ ఇస్మాయిల్ మరియు వారి బృందం కాంగ్రెస్ పార్టీ లో నుండి బిఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాణిక్ రావు వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్తారని,మైనార్టీ లకు మంత్రివర్గం లో చోటు కల్పించకపోవడం మైనారిటీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఎంటో అర్థమైంది అని,రాబోయే ప్రభుత్వం బిఆర్ఎస్ దే అని,రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం అని అన్నారు .ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఇబ్రహీం,మొహమ్మద్ అలి,ఆల్లిపూర్ నాయకులు శంకర్ పటేల్,దీపక్,మోహన్,ప్రవీణ్ మెస్సీ , తదితరులు పాల్గొన్నారు..

దట్టంగా పెరిగిన చెట్ల పొదలు ప్రమాదలకు నిలయంగా మారిన.

దట్టంగా పెరిగిన చెట్ల పొదలు, ప్రమాదలకు నిలయంగా మారిన రహదారులు…

రోడ్డును కమ్మేసిన ముళ్లచెట్లు పట్టించుకోని అధికారులు…

దట్టమైన పొదలు తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు…

నేటి ధాత్రి -గార్ల :-

 

 

 

మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, చిన్నకిష్టపురం గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నకిష్టపురం నుండి సత్యనారాయణపురం రహదారి ఇరుపక్కల ఎపుగా దట్టంగా పెరిగిన చెట్ల పొదలు ప్రమాదలకు నిలయంగా మారాయి. ఎదురేదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం వందల సంఖ్యలో ప్రతిరోజూ ఉదయాన్నే ప్రభుత్వ మరియు ప్రయివేటు ఉద్యోగస్తులు, మహిళలు, విద్యార్థులు, రైతులు, ఈ రహదారి నుండే వెళ్తుండటం గమనార్హం. దట్టమైన మొక్కలు పెరిగిపోయి దానికి తోడు ప్రమాదకరంగా ఉన్న మూలమలుపులతో ప్రయాణం చాలా ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే అనేక సార్లు ఈ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడమే కాకుండా జీవితాంతం అంగవైకల్యం ఏర్పడి కుటుంబానికి తీరని బాధలు మిగిల్చిన సందర్భాలు ఉన్నాయి.రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టాలు సంభవించే ముందు అధికారులు రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరుపక్కల విస్తరించిన ముళ్లచెట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన.

సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ
జహీరాబాద్ మండల, వివిధ గ్రామాలకు చెందిన 6 మంది లబ్ధిదారులకు గాను ₹1,46,000 విలువ గల చెక్కులను పాక్స్ చైర్మన్ మచ్చెందర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ , పార్టీ జనరల్ సెక్రటరీ మోహన్ రెడ్డి,మాజి సర్పంచ్ జగదీష్ గ్రామ పార్టీ అధ్యక్షులు సత్వర్ సయీద్ ,అల్గోల్ చంద్రకాంత్ రెడ్డి, అనెగుంట జగ్గనాథం,నాయకులుస్వామీదాస్,రాజు,వేంకటి,మల్లేష్ ప్రశాంత్ తదితర ముఖ్య నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది.లబ్ధిదారుల వివరాలు.సత్వార్ గ్రామానికి చెందిన మోగులప్ప గారికి ₹.15,000/- అనెగుంట గ్రామానికి చెందిన నిర్మలమ్మ గారికి ₹.55,500/- అల్గొల్ గ్రామానికి చెందిన మీనా గారికి ₹.20,500/- చిరాగ్ పల్లి గ్రామానికి చెందిన జంగలి శ్రీకాంత్ గారికి ₹.29,000/- , బస్వరాజు గారికి ₹.26,000/- ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి , మండల పార్టీ అధ్యక్షులు నారాయణ గారికి ,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు.

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసిడింగ్ కాఫీలను అందజేత.

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసిడింగ్ కాఫీలను అందజేత.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం నేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పట్ల నర్సంపేట మండలం రాజేశ్వరరావుపల్లి గ్రామంలో పంచాయితీ కార్యదర్శి ఎండి రజియా స్థానిక కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బొజ్జ కృష్ణంరాజు తో కలిసి ప్రోసిడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు.బొజ్జ కృష్ణంరాజు మాట్లాడుతూ శాసనసభ్యులు మాధవరెడ్డి ఆదేశాల మేరకు లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రోసడింగ్ పత్రాలను అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ నాయకులు ఐలయ్య,రంజిత్, సురేష్
తదితరులు పాల్గొన్నారు.

చే గువేరా ఆశయాలను కొనసాగించాలి.

చే గువేరా ఆశయాలను కొనసాగించాలి

భూపాలపల్లి నేటిధాత్రి:

జిల్లా కేంద్రంలో చేగువేరా జయంతి వేడుకలను కామ్రేడ్ చంద్రగిరి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
చే గువేరా జయంతిని ప్రతి సంవత్సరం జూన్ 14న జరుపుకుంటారు. ఈ రోజున అర్జెంటీనా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత గెరిల్లా నాయకుడైన ఎర్నెస్టో “చే” గువేరా జ్ఞాపకార్థం గుర్తు చేసుకుంటారు. ఆయన 1928 జూన్ 14న జన్మించారు.
చే గువేరా 33 ఏళ్ల వయస్సులో క్యూబా పరిశ్రమల శాఖ మంత్రి అయ్యారు. ఆ తర్వాత విప్లవాన్ని విస్తరించేందుకు ఆయన ఆ పదవిని వదులుకున్నారు.
అర్జెంటీనా రాజధాని బ్యూనెస్ అయిరెస్ కళాశాలలో డాక్టర్ చదువు పూర్తి చేసిన చే గువేరా సుఖంగా జీవితం గడపాలని అనుకున్నారు.
కానీ, తన చుట్టూ పెరుగుతున్న పేదరికం, జరుగుతున్న దోపిడీలను చూసి చలించిపోయి పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ తర్వాత దక్షిణ అమెరికాలో పెరుగుతున్న సమస్యలకు సాయుధ ఉద్యమమే మార్గమని నమ్మి ఉద్యమాలు నడిపించారు.
1955లో ఆయన తన 27 ఏళ్ల వయసులో క్యూబా విప్లవ నాయకుడైన ఫిడెల్ కాస్ట్రోతో కలిశారు. ఆ తర్వాతి క్రమంలో పలు ఉద్యమాలలో పాల్గొన్న ఫలితంగా యువ విప్లవకారుడిగా ఆయన పేరు నలు దిశలా మార్మోగింది. ఆయన అన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందజేయాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందజేయాలి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

 

గత సీజయన్ లో రైతు భరోసా ఇవ్వని రైతులకు వెంటనే రైతు బరోసా డబ్భులు ఇవ్వాలని బిఆర్ఎస్ నర్సంపేట మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో అధ్యక్షుడు నామాల సత్యనారాయణ మాట్లాడుతూ గతకాలం సీజన్ లో రైతులకు రైతు భరోసా కేవలం 3 ఎకరాలలోపు ఉన్న కొందరు రైతులకు మాత్రమే రైతు భరోసా వేశారని ఇప్పుడు వానాకాలం సీజన్ మొదలు అవుతుందని అన్నారు.గౌరవ తెలంగాణ తోలి ముఖ్యమంత్రి కేసిఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో రైతు బందును సమయానికి రైతుల ఖాతాలో వేసి రైతులకు అదుకున్నారని పేర్కొన్నారు. నేడు ముఖ్యమంత్రి ఓక సీజన్ రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశాడని ఆరోపించారు.ఎలాంటి అంక్షలు లేకుండా రైతు భరోసా బాకి ఉన్న రైతులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరాములు,మోతే జైపాల్ రెడ్డి,మోతే పద్మనాభ రెడ్డి,కోమల్ల గోపాల్ రెడ్డి,బండారి రమేష్,మోటూరి రవి,కోడారి రవి,తాల్లపెల్లి రాం ప్రసాద్,భూక్య వీరన్న,కడారి కుమారస్వామి,పెద్ది శ్రీనివాస్ రెడ్డి,వళ్ళల కర్ణకార్,అల్లి రవి,మర్ద నవీన్,సంగెం శ్రీకాంత్,చిప్పు రాజు తదితరులు ఉన్నారు.

జంగాలపల్లి MPPS పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం.

జంగాలపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం

ప్రభుత్వ బడులలో పిల్లలను చదివిద్దాం బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం

నేటి ధాత్రి చర్ల

 

 

 

 

 

చర్ల మండల కేంద్రంలోని ఎంపీపీస్ జంగాలపల్లి పాఠశాలలో శుక్రవారం నాడు బడిబాట కార్యక్రమంలో భాగంగా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించి చిన్నారుల భవిష్యత్తును వెలుగులతో నింపాలని ఉపాధ్యాయులు కోరారు ప్రభుత్వ బడిలో చదువుకుంటాం కానీ ప్రైవేట్ బడిలో డబ్బుతో చదువును కొంటాం డబ్బులు ఎవరికీ ఊరికే రావు ప్రభుత్వ బడిలో విలువలతో కూడిన చదువుకొని మంచి ఉన్నత చదువులు చదివి అనుభవమున్న ఉపాధ్యాయులు ఉంటారు విశాలమైన తరగతి గదులు మధ్యాహ్న భోజనం వారానికి 3 గుడ్లు మూడు రోజులు రాగి జావ ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచితంగా దుస్తులు ఇవ్వబడతాయి అని ఉపాధ్యాయులు గ్రామాల్లోని పిల్లల తల్లిదండ్రులకు వివరించారు ఇకనైనా ప్రైవేటు స్కూళ్లపై మక్కువ మాని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే రామలక్ష్మి ఉపాధ్యాయులు సకినం బాలకృష్ణ అంగన్వాడీ టీచర్ పద్మ పిల్లల తల్లితండ్రులు గ్రామస్తులు  పాల్గొన్నారు

ఉత్తమ చిత్రానికి రూ. 10 లక్షలు.

ఉత్తమ చిత్రానికి రూ. 10 లక్షలు

 

గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవానికి హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ఈ వేడుకను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది.

 

 

 

 

 

 

  • ప్రత్యేక అవార్డుకు రూ. 10 లక్షల నగదు బహుమతి
  • ఉత్తమ ద్వితీయ, తృతీయ చిత్రాలకు రూ. 7, 5 లక్షలు
  • ఉత్తమ నటుడికి, ఉత్తమ నటికి చెరో రూ. 5 లక్షలు
  • నేడు గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వేడుక

గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవానికి హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ఈ వేడుకను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డుల విజేతలకు అందజేసే నగదు బహుమతిని భారీగా పెంచింది.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు సహా పలువురు చిత్ర ప్రముఖులు పాల్గొననున్నారు.
కాగా, గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల జాబితాను ఇటీవలె ప్రకటించారు.
2014 నుంచి 2023 వరకు ప్రతి ఉత్తమ చిత్రానికి హీరో, హీరోయిన్‌, దర్శకుడు, నిర్మాతలకు కలిపి నాలుగు అవార్డులను ప్రదానం చేస్తారు.
ఇలా ప్రతి ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలకు అందజేస్తారు. 2024వ సంవత్సరానికి ప్రకటించిన అన్ని అవార్డులను కూడా బహూకరిస్తారు.
వీటితోపాటు 2024వ సంవత్సరం నుంచి రఘుపతి వెంకయ్య, బీఎన్‌ రెడ్డి, ఎన్టీఆర్‌, పైడి జైరాజ్‌, కాంతారావు, చక్రపాణి పేర్లతో ప్రత్యేక అవార్డులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది.
ఈ ఆరు ప్రత్యేక అవార్డుల్లో ఒక్కో అవార్డుకు రూ.పది లక్షల చొప్పున, మూడు ఉత్తమ చిత్రాలకు వరుసగా రూ. 10, 7, 5 లక్షల చొప్పున అందజేయనుంది.
అదేవిధంగా ఉత్తమ నటుడు, ఉత్తమ నటికి రూ.5 లక్షల చొప్పున అందజేయనున్నారు. 14 సంవత్సరాల విరామం తర్వాత సినిమా నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సహించే సంప్రదాయానికి తెలంగాణ ప్రభుత్వం తిరిగి శ్రీకారం చుట్టడం పట్ల అవార్డుల గ్రహీతలు, సినిమా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, విజేతలకు సీఎం రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు.
తెలంగాణ కళారంగంలో వేగుచుక్కలాంటి గద్దర్‌ పేరిట వివిధ విభాగాల్లో సినిమా కళాకారులకు అవార్డులు అందించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

థగ్‌లైఫ్‌ మూవీ బ్యాన్‌ కోర్టులో విచారణ.

 థగ్‌లైఫ్‌ మూవీ బ్యాన్‌ కోర్టులో విచారణ…

కర్ణాటకలో థగ్‌లైఫ్‌ సినిమా విడుదలకు సంబంధించి నమోదైన పిటిషన్‌లు సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టులో శుక్రవారం ఒకే రోజు విచారణకు వచ్చాయి.

థగ్‌లైఫ్‌ హీరో కమల్‌ హాసన్‌ బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో.

కర్ణాటకలో థగ్‌లైఫ్‌ సినిమా విడుదలకు సంబంధించి నమోదైన పిటిషన్‌లు సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టులో శుక్రవారం ఒకే రోజు విచారణకు వచ్చాయి.
థగ్‌లైఫ్‌ హీరో కమల్‌ హాసన్‌ బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.
కమల్‌ క్షమాపణ చెప్పకపోతే థగ్‌లైఫ్‌ సినిమాను రాష్ట్రంలో విడుదల చేయనివ్వబోమని కన్నడ సంఘాలు హెచ్చరించాయి.
కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలి కూడా ఈ మేరకు తీర్మానం చేసింది.
దీన్ని ప్రశ్నిస్తూ, సినిమా నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ మన్మోహన్‌ ధర్మాసనం విచారించింది.
సినిమా విడుదలకు అభ్యంతరాలు తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

ప్రియాంకను అనుకున్నారు రకుల్‌ను తీసుకున్నారు.

ప్రియాంకను అనుకున్నారు.. రకుల్‌ను తీసుకున్నారు

 

భారతీయ చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘రామాయణ’. రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నితిశ్‌ తివారి భక్తిశ్రద్ధలతో రూపొందిస్తున్నారు.

 

భారతీయ చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘రామాయణ’. రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నితిశ్‌ తివారి భక్తిశ్రద్ధలతో రూపొందిస్తున్నారు. వివాదాలకు తావు లేకుండా, విజువల్‌ వండర్‌గా ‘రామాయణ’ చిత్రాన్ని రూపొందించడానికి కృషి చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ చాలా కాలం క్రితమే మొదలైనా గత ఏడాది నవంబర్‌ నెలలో అధికారికంగా వివరాలు వెల్లడించారు. సాయిపల్లవి సీతగా, రావణుడిగా కన్నడ హీరో యశ్‌, సన్నీ డియోల్‌ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణునిగా, కాజల్‌ అగర్వాల్‌ మండోదరిగా, లారా దత్తా కైకేయిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంతో జరుగుతోంది. ఇక ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర శూర్పణఖ. రామ, రావణ యుద్ధం జరగడానికి కారణమైన ఈ పాత్రను రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పోషించనున్నారు. ఆమె కంటే ముందు ఆ పాత్ర కోసం ఎవరిని సంప్రదించారో తెలుసా? పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ప్రియాంక చోప్రాను. ఆమె శూర్పణఖ పాత్ర పోషిస్తే అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ‘రామాయణ’ చిత్రానికి అదనపు ఆకర్షణ అవుతుందని దర్శకనిర్మాతలు భావించారు. అయితే తనకున్న ఇతర కమిట్‌మెంట్స్‌ వల్ల ఆ పాత్ర చేయలేనని ప్రియాంక చెప్పడంతో అప్పుడు రకుల్‌ను ఈ అవకాశం వరించింది. ప్రియాంక చోప్రా ఇప్పుడు మహేశ్‌, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా రామాయణగాథ స్ఫూర్తితో రూపొందుతుండడం విశేషంగా పేర్కొనాలి.

ఎయిరిండియాలోనే మంచు లక్ష్మీ ప్రయాణం ఆమె ఏమన్నారంటే.

ఎయిరిండియాలోనే మంచు లక్ష్మీ ప్రయాణం ఆమె ఏమన్నారంటే…

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలిన రోజే మంచు లక్ష్మీ ఎయిరిండియా విమానంలో లండన్‌కు వెళ్లారు.

అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా (Air india Plain) విమానం కుప్పకూలిన రోజే మంచు లక్ష్మీ (manchu lakshmi Prasanna) ఎయిరిండియా విమానంలో లండన్‌కు వెళ్లారు. దీంతో ఆమె ఎలా ఉన్నారో ఆరా తీశారు అభిమానులు. మెసేజ్‌లు చేశారు.  అయితే తాను క్షేమంగా ఉన్నానంటూ మంచు లక్ష్మి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు.  ‘‘ఫ్లైట్‌ దిగిన తర్వాత ప్రమాదం గురించి తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యాను. నేను ఎలా ఉన్నానో కనుక్కోవడం కోసం ఎన్నో ఫోన్లు, మెేసజ్‌లు వస్తూనే ఉన్నాయి. నేను, మా అమ్మాయి అదేరోజు ముంబయి నుంచి లండన్‌కు ఎయిరిండియా విమానంలో ప్రయాణం చేశాము. దేవుడి దయ వల్ల మేము సేఫ్‌గా చేరుకున్నాం. అక్కడికి వెళ్లిన వెంటనే ఈ ప్రమాదం గురించి తెలిసి ఉలిక్కిపడ్డాను.
ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం. విద్యార్థులు కూడా మృతి చెందారని తెలిసి నా హృదయం ముక్కలైంది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మన ప్రాణాలు క్షణంలో ముగిసిపోతాయనడానికి ఈ ప్రమాదం ఒక ఉదాహరణ. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని మంచు వీడియోలో పేర్కొన్నారు. ఈ నెల 12న జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా ఆస్పత్రి, నివాస సముదాయం లోని ప్రజలు కొంత మంది మరణించినట్లు చెప్పారు.

బాసిల్‌కు బన్నీ గ్రీన్‌సిగ్నల్‌.

 బాసిల్‌కు బన్నీ గ్రీన్‌సిగ్నల్‌…

 

పుష్ప అంటే ఇంటర్నేషనల్‌’ అంటూ పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌లానే ఇప్పుడు ఆయన ఇమేజ్‌ కూడా ఇంటర్నేషనల్‌ లెవల్‌కు వెళ్లింది. దాంతో ఆయనతో సినిమాలు చేయబోయే దర్శకులు.

పుష్ప అంటే ఇంటర్నేషనల్‌’ అంటూ పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌లానే ఇప్పుడు ఆయన ఇమేజ్‌ కూడా ఇంటర్నేషనల్‌ లెవల్‌కు వెళ్లింది. దాంతో ఆయనతో సినిమాలు చేయబోయే దర్శకులు అంటూ రోజుకో పేరు తెరపైకి తెస్తున్నాయి సోషల్‌ మీడియా వర్గాలు. తాజాగా అల్లు అర్జున్‌ను డైరెక్ట్‌ చేయబోతున్న దర్శకుల జాబితాలో మలయాళ డైరెక్టర్‌ బాసిల్‌ జోసెఫ్‌ పేరు చేరింది. ఆయనతో ఓ సినిమా చేసేందుకు బన్నీ ఎస్‌ చెప్పారంటూ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బాసిల్‌ చెప్పిన కథ అల్లు అర్జున్‌కు బాగా నచ్చిందని, త్వరలోనే వీరి కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వస్తుందనేది ఆ వార్తల సారాంశం. బాసిల్‌ జోసఫ్‌ నటుడిగా, దర్శకుడిగా మలయాళ పరిశ్రమలో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అయితే అవేవీ అల్లు అర్జున్‌ స్థాయికి తూగేవి మాత్రం కావు. కాబట్టి ఈ ప్రచారంలో నిజానిజాలేమిటో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అల్లు అర్జున్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.

 రాజాసాబ్‌కు కష్టం టీమ్‌ హెచ్చరిక.

 రాజాసాబ్‌కు కష్టం టీమ్‌ హెచ్చరిక…

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’. ఇప్పుడీ చిత్రానికి  లీకుల కష్టం మొదలైంది. టీజర్‌లోని కొన్ని విజువల్స్‌ను నెట్టింట లీక్‌ చేశారు. దీనిపై టీమ్‌ స్పందించింది.

ప్రభాస్‌ (Prabhas) హీరోగా మారుతి (Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’. (The raja saab) జూన్‌ 16న ఈ సినిమా టీజర్‌ విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇప్పుడీ చిత్రానికి  లీకుల కష్టం మొదలైంది. టీజర్‌లోని కొన్ని విజువల్స్‌ను నెట్టింట లీక్‌ చేశారు. దీనిపై టీమ్‌ స్పందించింది.
లీక్‌ కంటెంట్‌ను షేర్‌ చేసే వాళ్లపై  కఠిన చర్యలు తీసుకుంటామని టీమ్‌ హెచ్చరించింది. ఎవరైనా ‘రాజాసాబ్‌’ కంటెంట్‌కు సంబంధించిన అనధికారక వీడియోలు, ఫొటోలు, షేర్‌ చేస్తే వారి సోషల్‌ మీడియా అకౌంట్‌ను తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సినిమాటిక్‌ అనుభూతి అందించేందుకు చిత్రబృందం ఎంతో కష్టపడుతోందని దానికి అందరూ సహకరించాలని కోరింది.
ప్రభాస్‌ నటిస్తున్న తొలి హారర్‌ చిత్రమిది. దీంతో అందరి దృష్టి ఈ చిత్రంపై ఉంది. డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. టీజర్‌ను ఈ నెల 16న విడుదల చేయనున్నట్లు టీమ్‌ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్‌లో ఈవెంట్‌ చేయాలను కుంటున్నారని తెలిసింది. మాళవిక మోహనన్‌, నిధీ అగర్వాల్‌, రిద్థికుమార్‌ కథానాయికలు. సంజయ్‌దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

ఖరీఫ్ సాగులో రైతులు బిజీ బిజీ.

ఖరీఫ్ సాగులో రైతులు బిజీ బిజీ

వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు

సేద్యం పనుల్లో రైతులు బిజీ బిజీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

గుకోసం రైతులు సేద్యం పనుల్లో బిజీబిజీగా మారారు. మండ లంలో రెండు వేల హెక్టార్లకు పైగా సాగు విస్తీర్ణం ఉందని వ్యవసాయాధి కారులు పేర్కొంటున్నారు జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్ ఝరాసంగం మొగుడంపల్లి కోహిర్ న్యాల్కల్ మండలంలో నాలుగు రోజులుగా వర్షాలు కురు స్తుండటంతో వ్యవసాయ పొలాల్లో ట్రాక్టర్ల సాయంతో దుక్కిళ్లు చేస్తున్నారు. పొలాల్లో, గట్టుపై పెరిగిన పిచ్చిమొక్కలు, రాళ్లు తొలగించడంలో రైతులు నిమగ్నమయ్యారు. ఈ యేడాది ముందస్తు వర్షాలు కురవడంతో వేరుశనగ పంట సాగుచేసేందుకు మండలంలోని రైతులు ఆసక్తి చూపుతున్నారు.

గోదాం లవద్ద సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి.

గోదాం లవద్ద సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి

బురదమయం అవ్వడంతో బస్తాలు దింపడంలో ఇబ్బదులను ఎదుర్కొంటున్నాం

ఏఐటియూసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంకదాసరి అశోక్

పరకాల నేటిధాత్రి

 

 

 

 

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లోగల గోదాంల వద్ద సీసీ రోడ్లను వేయించాలని ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంకదాసరి అశోక్ అన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ 2014-15వ సంవత్సరంలో పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో 5000 మెట్రిక్ టన్నుల గోదాంను నాబార్డ్ వారి సహకారంతో 3,00,00 లక్షలతో నిర్మించడం జరిగిందని గోదాంలో సరైన సౌకర్యాలు లేక కొన్ని సంవత్సరములు ఖాళీగా ఉన్న గోదాంను కార్మికులామంతా కలిసి సివిల్ సప్లై డిఎం,ఆర్ఎం లకు కలిసి గోదాంలు కాలిగా ఉంటున్నాయని వాటిలో పీడీఎస్ బియ్యాన్ని దింపినటైతే మాకు కూలి దొరుకుతుందని మా పరిస్థితిని వెళ్ళబుచ్చగా 2025లో జనవరి మాసంలో వాళ్లతో అగ్రిమెంట్ ఒప్పందం చేసుకొని 5,000 మెట్రిక్ టన్నుల గోదాంలో బియ్యం దింపడం జరిగింది.

కార్మికుల కష్టాలు తీరుతున్నాయానుకునే సమయంలో వర్షాకాలం సమీపిస్తున్న వేల అసలైన సమస్య ఎదురైందని గోదాం చుట్టూ సీసీ రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నామన్నారు.

గతంలో వర్షాకాలంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందని గోదాం చుట్టూ లోతట్టు ప్రాంతం అవ్వడంతో నీరు నిల్వవుండి బురద మయంగా మారిందని పిడిఎస్ బియ్యంతో వచ్చే లారీలు దిగబడుతున్నాయని, బస్తాలు మోయాలంటే కష్టంగా ఉన్నదని,బియ్యం బస్తాలు దూరం మోయవలసి వస్తుందని దానివల్ల మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నామన్నారు.

 

CC roads

 

 

గోదాం చుట్టూ సీసీ ఏర్పాటు చేసి మా కార్మికుల కష్టాలను తీర్చాలని ప్రభుత్వాన్ని అధికారులను కార్మిక సంఘం తరుపున కోరుతున్నామని తెలిపారు.

కార్మిక నాయకులు ప్రధాన కార్యదర్శి నాగేళ్లి శంకర్,కోగిల శంకరయ్య,రేణిగుంట్ల రాజయ్య,కోడపాక ఐలయ్య,కోట యాదగిరి,బొట్ల భద్రయ్య,కోడపాక చిరంజీవి,శ్రీపతి రాజయ్య, శ్రీపతి కుమార్,కోగిల కైలాసం,జన్ను పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించిన.

అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ప్రాథమిక పాఠశాల న్యాల్కల్ మండల రేజింతల్ గ్రామంలో ప్రధానోపాధ్యాయులు సఫియా సుల్తానా అధ్యక్షతన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నూతనంగా 1 వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సఫియా సుల్తానా ఉపాధ్యాయులు జ్యోతి, మానస, ఏ ఏ పి సి చైర్మన్ రామేశ్వరీ, మాజీ ఎంపీటీసీ నల్లవల్లి మల్లిక, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఆమ్మదాబాద్ విమానం ప్రమాదం లో మృతులకు.

ఆమ్మదాబాద్ విమానం ప్రమాదం లో మృతులకు నివాళులు అర్పించిన గణేష్ వాకింగ్ టీమ్

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమానము ప్రమాదంలో మృతి చెందిన ప్రజలు గుజరాత్ మాజీ సీఎం మృతి చెందిడము పట్ల వనపర్తి గణేష్ వాకింగ్ గ్రూప్ సబ్యుల అధ్యర్య ములో రాజవారి బంగ్లాలో నివాళులర్పించామని అధ్యక్షులు గోనూర్ వెంకటయ్య ఒక ప్రకటనలో తెలిపారు రాజాపేట సుదర్శన్ రెడ్డి దొంత అశోక్ వాకింగ్ టీము సబ్యులు నివాళులర్పించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version