కాంగ్రెస్ ది కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ షాకిర్.

పేదలకు ఇండ్లు నిర్మిస్తున్న ఘనత కాంగ్రెస్ ది కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ షాకిర్.
మెట్ పల్లి జూన్ 20 నేటి దాత్రి:

 

గతంలో పేదవారికి రోటి, మకాన్ అని మాజీ ప్రధాని దివంగత నేత ఇందిరాగాంధీ నినాదించి పేద ప్రజలకు ఉచితంగా బియ్యాన్ని అందించి. ఇండ్లను నిర్మించి ఇచ్చిందని ఇందిరాగాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇందిరమ్మ పేరుతో ఇండ్లను మంజూరు చేస్తుందని. పేదవారికి ఇండ్లు నిర్మించే ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ షాకీర్ సిద్ధికి అన్నారు. శుక్రవారం పట్టణంలోని అర్బన్ కాలనీలో పేద ప్రజలకు మంజూరైన 21 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి షాకీర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు దివ్య, ఏ ఈ లు తిరుపతి, శరత్, ఇంజనీర్ జాకీర్, సోయబ్, కాంగ్రెస్ నాయకులు మురళి, ఇరుగదిండ్ల శ్రీనివాస్, లక్ష్మమ్మ, లడ్డు, రాములు,

ఇంటర్ విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉండాలి.

“ఇంటర్ విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉండాలి”

ఎస్సై లెనిన్.

బాలానగర్ నేటి ధాత్రి

 

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఎస్సై లెనిన్ విద్యార్థులకు కమ్యూనిటీ పోలీసింగ్ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ దశలో విద్యార్థులు అవలంబించాల్సిన పద్ధతులు ప్రవర్తన విధానంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమేష్ లింగం, అధ్యాపకులు అనురాధ, వినోద్, సునీల్, చంద్రకాంత్ విద్యార్థులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాల అవగాహన సదస్సు ఎస్ఐ రేఖ అశోక్.

మత్తు పదార్థాల అవగాహన సదస్సు ఎస్ఐ రేఖ అశోక్

విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దు

చదువుతూనే మీ భవిష్యత్తు

చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదివే మూలధనం

విద్యార్థులకు చదివే నీ గమ్యానికి నిచ్చిన

చదివే జ్ఞానం పెంచుతుంది

గణపురం నేటి ధాత్రి:

 

గణపురం మండల కేంద్రంలో
ఆదర్శ మోడల్ స్కూల్ లో స్థానిక ఎస్ ఐ వారి ఆధ్వర్యంలో మారక ద్రవ్యాల నిర్మూలనకై, ఆన్లైన్ లో జరిగే ఆర్ధిక మోసాల పట్ల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో గణపురం ఎస్ ఐ రేఖ అశోక్ మాట్లాడుతూ మత్తును కలిగించే మారక ద్రవ్యాలను వాడకూడదని వాటిని వినియోగిస్తే కలిగే అనర్థాలు ఎంతో వివరించడం జరిగింది. ఆర్ధిక మోసాలకు కారణమైన అనవసరపు మెసేజ్ లు, వాటి లింకులు ఓపెన్ చేసి రిప్లై ఇస్తే కలిగే ఆర్ధిక నష్టాల పట్ల అవగాహన
కలిగించారు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఈ.తిరుపతి మాట్లాడుతూ
విద్యార్థులు తమ పూర్తి సమయాన్ని చదువుకోసం కేటాయించి గొప్ప ప్రయోజకులు కావాలని అందుకోసం ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. మారక ద్రవ్యాలు వినియోగిస్తే మన శరీరంపై కలిగే దుష్ప్రభావాలను చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో టీచర్స్ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన.

నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన

 

మల్లాపూర్ జూన్ 20 నేటి దాత్రి

 

 

 

మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం:-

వరంగల్ హన్మకొండ నేటిధాత్రి (లీగల్):

 

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రోజున వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో “యోగ మహోత్సవం” ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి వి.బి.నిర్మల గీతాంబ మరియు విశిష్ఠ అతిథిగా హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. కె.పట్టాభి రామారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా గురువు శోభా బృందం ఆధ్వర్యంలో వివిధ ఆసనాలు, శ్వాస పద్ధతులు ప్రదర్శించబడ్డాయి. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మలా గీతాంబ మాట్లాడుతూ – ‘‘యోగా మన మానసిక, శారీరక మరియు ఆధ్యాత్మిక అంశాలలో సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది. యోగా నిత్య ప్రక్రియ వల్ల మనం మన సాధారణ ఆరోగ్యం మరియు శక్తిని మెరుగుపరచుకోవచ్చు అని తెలిపారు.యోగా టీచర్లు శోభ మరియు భాస్కర్ యోగా ప్రాముఖ్యతపై ప్రసంగించి, ఆరోగ్యపూరిత జీవనానికి యోగా అవసరమని స్పష్టం చేశారు.

ఈ యోగా కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమాదేశ్ పాండే, వరంగల్ హనుమకొండ జిల్లాలో ఇతర న్యాయమూర్తులు వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్, జనరల్ సెక్రటరీ డి. రమా కాంత్, వైస్ ప్రెసిడెంట్ మైదం జయపాల్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హాజరయ్యారు.

అనంతరం యోగా గురువులను న్యాయమూర్తులు మరియు వరంగల్ బార్ అసోసియేషన్ వారు శాలువాలతో సన్మానించారు.

ఘనంగా… కొత్త కాపు వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా… కొత్త కాపు వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

 

బాలానగర్ మండల కేంద్రానికి చెందిన కొత్త కాపురం వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హాజరయ్యారు. కేక్ కట్ చేసి పలువురికి పంచారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీ ఆర్ ఎస్ సత్తా చూపి.

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీ ఆర్ ఎస్ సత్తా చూపి

మాజీ సిఎం కె.సి.ఆర్ కు అండగా ఉండాలి

మాజీమంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి నెటిదాత్రి :

 

ఘనపూర్ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు
బి.ఆర్.ఎస్ ఘనపూర్ మండల ముఖ్య నాయకుల సమావేశంలో పార్టీ అధ్యక్షులు రాళ్ళ.కృష్ణయ్య నివాసంలో నిర్వహించారు
ఈ సమావేశం లోముఖ్య అతిథిగా నిరంజన్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశరు ఈ సందర్భంగా.మాజీ మంత్రి మాట్లాడుతూ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పి టిసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలతో టాచ్ లో ఉండాలని సూచించారు మండల బీ ఆర్ ఎస్ నాయకులు గ్రామాలలో పర్యటించి ప్రజలతో కలవాలని 19నెలల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రజల మన్ననలను పొందిన నాయకులను గుర్తించి వారికి అవకాశం ఇవ్వాలని అన్నారుపార్టీ పట్ల నిబద్ధత,నాయకుని పట్ల విశ్వాసం ఉన్న నాయకులకు బీ ఆర్ ఎస్ పార్టీ అవకాశం ఇస్తుందని అన్నారుపార్టీలో ఉంటూ ఇతర పార్టీలకు సహకరించే నమ్మకద్రోహుల పట్ల పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చా రు ప్రజలు స్థిర నిర్ణయానికి వచ్చినారని మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ హయాములో రాష్ట్ర అభివృద్ధి జెరిగింద ని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎట్లా నిర్వీర్యం అయినాయో స్పష్టమైన అవగాహనతో ప్రజల కు తెలుసు నాని అన్నారు ఎప్పటికప్పుడు గ్రామాలలో ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ వారికి అండగా నిలవాలని నిరంజన్ రెడ్డి ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,మాజీ ఎం.పి.పి కృష్ణా నాయక్,మాజీ మార్కెట్ ఛైర్మెన్ లక్ష్మారెడ్డి,మాజీ జేడీపీ టి సి సామ్యా నాయక్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ బాలేశ్వర్ రెడ్డి, ఎస్.టి సెల్ జిల్లా నాయకులు జాతృ నాయక్,మాజీ ప్రజాప్రతినిధులు,వివిధ గ్రామాల అధ్యక్షులు ,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి లయన్స్.!

మెట్ పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి లయన్స్

 

 

 

మెట్ పల్లి జూన్ 20 నేటి దాత్రి

 

 

 

 

మెట్ పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి లయన్స్ క్లబ్ నూతన అధ్యక్ష కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు లయన్స్ సెకండ్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ గుంటుక చంద్ర ప్రకాష్ లయన్ పి డి జి అనంతుల శివప్రసాద్ , రీజనల్ చైర్మన్ గుంటుక సురేష్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగారావు పాల్గొన్నారు.

 

లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా వెల్మల శ్రీనివాసరావు
సెక్రెటరీగా సురకంటి జైపాల్ రెడ్డి ట్రెజరర్ గా వేములవాడ చంద్రశేఖర్
ఈ ప్రమాణ స్వీకారం చేశారు.

వీరిచే ముఖ్యఅతిథిగా లయన్స్ సెకండ్ డిస్టిక్ గవర్నర్ గుంటుక చంద్ర ప్రకాష్ లయన్స్ పి డి జి అనంతులశివప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించి మెట్పల్లి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

అనంతరం లయన్స్ గుంటుక చంద్రప్రకాష్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలో ముందుంటుందని ప్రపంచంలో 210 దేశాలకు పైగా లయన్స్ క్లబ్ సేవలు చేస్తున్నారని ఇది పేదలకు ఉచిత కంటి శిబిరాలు వైద్య శిబిరాలు చేస్తూ ఉచిత సహాయాలు అందజేస్తుందని అన్నారు.

పి డి జి అనంతల శివప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలో సేవా భావంతో పనిచేసే సంస్థ మన లయన్స్ క్లబ్ ఇంట్రర్నేషనల్ అని మన తెలంగాణలో మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఉత్తమ సేవ కార్యక్రమంలో ముందుంటుందని ఇది సంతోషకరమైనదని వారు చేస్తున్న సేవకు లయన్స్ క్లబ్ తరఫున నేను వారిని అభినందిస్తున్నానని అన్నారు.

నూతన అధ్యక్షులు వెల్మల శ్రీనివాసరావు మాట్లాడుతూ 17 సంవత్సరాల నుండి లయన్స్ క్లబ్ సేవలు అందిస్తుందని దీనికి ప్రభుత్వ పరంగా స్థలము కేటాయించాలని నర్సింగరావు కు వినతి పత్రం అందించామని దానికి వారు సానుకూల స్పందన తెలియజేశారని అన్నారు.

ముఖ్యఅతిథి జువ్వాడి నర్సింగారావు మాట్లాడుతూ నేను కోరుట్ల మెట్పల్లి నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలు తిరగానని అందులో లయన్స్ క్లబ్ సేవలు బాగున్నాయని చాలామంది చెప్పారని వారి సేవలను పేద ప్రజలు మరవరని ఇటువంటి సేవ చేయడం లయన్స్ క్లబ్ వారికి చెందిందని ఉచిత వైద్య శిబిరాలు ఉచిత కంటి శిబిరాలు పేద విద్యార్థులకు నోట్ బుక్కులు పంపిణీ పేదలకు చలికాలంలో చద్దర్లు పంపిణీ హాస్టల్లో వారి సదుపాయ ఫ్యాన్లు గాని ఇతర సామగ్రిని ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని వారికి నా సహాయం ఎప్పుడు కావాలన్నా అందిస్తానని అన్నారు .

ఈ కార్యక్రమంలో జెడ్ సి గడ్డం శంకర్ రెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్, సెక్రెటరీ గూండా రాకేష్, క్యాషియర్ నాంపల్లి వేణు గోపాల్, 2025-26 జోన్ చైర్మన్ లయన్ పోలీస్ శ్రీనివాస్,పాస్ట్ ప్రెసిడెంట్లు లయన్ డొంతుల ఆంజనేయులు,గంగుల మురళి,పోహార్ తుకారాం పాల్గొన్నారు.

ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ.

ప్రచురణార్ధం
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తప్పదు
-రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
-ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ

మంచిర్యాల జూన్ 19 నేటి ధాత్రి:

 

తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో మరింత జాప్యం చేస్తే రాష్ట్రవ్యాపిత ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు. శుక్రవారం మంచిర్యాలలోని నస్పూర్ సీసీసీ ప్రెస్ క్లబ్ లో టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ ఘనంగా జరిగింది. ఈ మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జర్నలిస్టులకు
అండగా నిలిచి సమస్యలపై పోరాడే ఏకైక యూనియన్
టీడబ్ల్యూజేఎఫ్ అని అన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్న యూనియన్ టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమే అని అన్నారు. అన్ని జిల్లాల్లో టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ బలపడుతుందని, ఈ నేపథ్యంలో అవగాహన లోపంతో ఫెడరేషన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

గత ప్రభుత్వానికి
ఒక యూనియన్ వంతపాడితే.. ప్రస్తుత ప్రభుత్వానికి మరో యూనియన్ వంత పాడుతుందని ఎద్దేవా చేశారు. జిల్లాల్లో టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ బలోపాతానికి చేస్తున్న జిల్లా నాయకులను మామిడి సోమయ్య ఈ సందర్భంగా అభినందించారు.ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ… రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ 20 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ…
జర్నలిస్టులకు గత ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టలేదని, జర్నలిస్టులకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు మొండి చేయి చూపిందని అన్నారు. కనీసానికి వర్కింగ్ జర్నలిస్టులకు కొత్తగా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకుండా మూడు నెలలకోసారి స్టిక్కర్ల పేరుతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల సంక్షేమంపై ఆలోచించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ మహాసభలో సీపీఐ రాష్ట్రదర్శి వర్గ సభ్యుడు శంకర్, ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడు బాపురావు, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు యూసుఫ్, జిల్లా సన్నాహక కమిటీ కన్వీనర్ మిట్టపల్లి మధు, కో- కన్వీనర్లు వెంకట స్వామి గడ్డం సత్యా గౌడ్.

మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.
అధ్యక్షుడుగా మిట్టపల్లి మధు(సూర్య), ఉపాధ్యక్షుడుగా వెంకటస్వామి(ప్రజాపాలన), కార్యదర్శిగా గడ్డం సత్యగౌడ్(నేటిధాత్రి), సంయుక్త కార్యదర్శులుగా నేరెళ్ళ నరేష్ గౌడ్, నరేందర్, సుమన్,రవి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఎంఏ హఫీజ్, ఇప్ప సురేష్, సందలేని నర్సయ్య, సదానందం, శ్రీనివాస్,కోశాధికారి గా సబ్బని భాస్కర్,కార్యవర్గ సభ్యులుగా ఎండీ సుల్తాన్, ఎస్. మల్లేష్
తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటుగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా శానగొండ శ్రీనాథ్ ఎన్నికైనట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రకటించారు.

నూతన కలెక్టర్ ప్రావిణ్యను కలిసిన.

నూతన కలెక్టర్ ప్రావిణ్యను కలిసిన దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి జిల్లాకు ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన నూతన జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య ను గురువారం నాడు దివ్యాంగుల అసోసియేషన్ ముఖ్య ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసీ పూల మొక్క ను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ జిల్లాలో ఎన్ని దివ్యాంగుల సంఘాలు అసోసియేషన్ లు ఉన్నాయి అని అసోసియేషన్ సభ్యులకు అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల అభ్యున్నతికి అవసరమైన సదుపాయాల ఏర్పాటుపై, ప్రభుత్వ పథకాల అమలు, ఉపాధి అవకాశాలు మరియు శిక్షణా కార్యక్రమాలపై స్పందనను కలెక్టర్ కు తెలియజేశారు. కలెక్టర్ సా నుభూతితో సమస్యలు విని అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో సోలార్ సొసైటీ అధ్యక్షురాలు జుబేదా బేగం, తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు,దివ్యాంగుల సంఘం జిల్లా నాయకులు రామ్ శెట్టి, ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి కె నర్సిములు, ఇస్మాయిల్, నాయకురాలు విజయలక్ష్మి,,దివ్యాంగుల సంఘం నాయకులు లక్ష్మణ్ సుశీల వయోవృద్దుల దివ్యంగుల రెస్పాన్స్ అధికారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మానె రామకృష్ణ భద్రాచలం నియోజకవర్గ మాజీ ఇంచార్జ్.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి

మానె రామకృష్ణ భద్రాచలం నియోజకవర్గ మాజీ ఇంచార్జ్

నేటిధాత్రి:

 

చర్ల బిఆర్ఎస్ పార్టీ మండల గ్రామ కమిటీ సమావేశాల్లో బాగంగా నిన్న రాత్రి కుదునూరు గ్రామంలో మండల కన్వీనర్ దొడ్డి తాతారావు అయినవోలు పవన్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఏర్పాటు చేసారు ఈ గ్రామ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా భద్రాచలం డివిజన్ పార్టీ సీనియర్ నాయకులు మానె రామకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు అవుతున్న ఇంతవరకు మహిళలకు తులం బంగారం ఇవ్వలేదు మహిళలకు 2500 ఇవ్వలేదు మహిళలకు స్కూటీలు ఇవ్వలేదు గ్యాస్ ఇవ్వలేదు పెన్షన్లు 4000 ఇవ్వలేదు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వీర కోదండ రామయ్య డివిజన్ యూత్ నాయకులు కాకి అనిల్ మండల యూత్ అద్యక్షులు అంబోజీ సతీష్ పార్టీ సీనియర్ నాయకులు నేతాని రాము అయినవోలు జగదీష్ పంజా రాజు తడికల బుల్లేబ్బాయి ఎడ్ల రాందాస్ కుంజా చంటి కుంజా కమల సిద్ధి సంతోష్ విజయ్ మేడి నరసింహారావు మరియు బిఆర్ఎస్ సైనికులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు

మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల రవి పార్థీవ దేహానికి.

మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల రవి పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన

మాజీ జడ్పిటిసి మోటపోతుల శివ శంకర్ గౌడ్

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల రవి అలియాస్‌ గణేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా మారేడుమిల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటరులో మరణించారు.మృతదేహం ఈరోజు ఉదయం స్వంత గ్రామం వేలిశాలకు రాగా విషయం తెలుసుకున్న గణపురం మండల కేంద్రానికి చెందిన మాజీ జడ్పిటిసి మోట మోటపోతుల శివ శంకర్ గౌడ్ వేలిశాల గ్రామానికి వెళ్లి పార్థీవ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అనంతరం మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ నేత గాజర్ల రవి అలియాస్ గణేష్ సోదరుడు అయినటువంటి మాజీ మావోయిస్టు నేత, ప్రస్తుత పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ ఐతు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని వారిని ఓదార్చారు. వారి వెంట గణపురం మండల కేంద్రానికి చెందిన నాయకులు పాల్గొన్నారు.

తప్పుడుసమాచారం ఇచ్చినందుకు బహిరంగ క్షమాపణ ..!

తప్పుడుసమాచారం ఇచ్చినందుకు బహిరంగ క్షమాపణ ..!

*పగిడి పల్లి రవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

మంగపేట నేటిధాత్రి

 

 

 

 

మంగపేట మండలం బుచ్చంపేట గ్రామం ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మరియు రాజీవ్ యువ వికాసం పథకం విషయం లో వచ్చిన కథనాల్లో ఎలాంటి నిజం లేదని, నేను ఎవరికీ డబ్బుల రూపంలో కానీ ఫోన్ పే ల ద్వారా కానీ ఎలాంటి నగదు చెల్లించలేదని , కాటూరి నాగయ్య, జంగం భానుచందర్, ఎడ్ల నరేష్ ,పల్లె శోభన్ బాబుల పేర్లను ప్రస్తావిస్తూ నేను చేసిన ఆరోపణలు పూర్తి గా అవాస్తవం అని ఆ ఆరోపణలు చేసిన పగిలిపెళ్లి రవి అనే నేను వారికి బహిరంగంగా క్షమాపణ చెపుతున్నాను. ఇట్టి విషయము నా సొంత నిర్ణయాలుతో నేను చేసినది కాదు అని కొన్ని ఒత్తిడిల మరియు పార్టీ మీటింగ్ లకు పిలువ లేదు అనే కారణాలవల్ల వారిపై ద్వేషం తో నేను పత్రిక కు మీడియాకు ఇవ్వాల్సి వచ్చిందని నా తప్పును మన్నించగలరని ఇలాంటి తప్పుడు సమాచారం ఇంక నేను ఎప్పుడూ కూడా ఇవ్వనని మీడియా ద్వారా ప్రజానీకానికి మరియు కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు గ్రామ బుచ్చంపేట కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా పత్రిక ముఖంగా క్షమాపణ కోరుతున్న..

ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించిన ఏడిఏ.

ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించిన ఏడిఏ

నర్సంపేట నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలం వెంకటాపూర్, మల్లంపల్లి గ్రామాలలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రైతు భరోసా కొత్త దరఖాస్తులను నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతీ రైతుకు ఒక యూనిక్ ఐడిని ఇస్తుంది.అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు దీనిని అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు.పీఎం కిసాన్ లబ్ధిదారాలకు తదుపరి విడత లబ్ది పొందుటకు ప్రామాణికoగా ఫార్మర్ రిజిస్ట్రీలొ నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని పేర్కొన్నారు.రైతులందరు ఫార్మర్ రిజిస్ట్రీలో త్వరితగతిన నమోదు చేసుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఓ
మాధవి, ఏఈఓ వైజయంతి,రాజేష్ లు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం

వేలకోట్ల రూపాయలు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా

రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా నిలబెట్టా.

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి.

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.

నల్లబెల్లి, నేటిధాత్రి:

 

 

 

 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బూటకపు వాగ్దానాలు అవినీతి పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ లో మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి మార్పు వస్తుందని ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించగా ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని. 18 నెలలోనే ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకించడం దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి దక్కిందని ఆయన ఎద్దేవ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మండలంలో ప్రతి తండాకు, గ్రామానికి తారు రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించి 40 కిలో మీటర్ల పొడవున కంకర వేసి తారు రోడ్డు వేసే సమయంలో నోటిఫికేషన్ రాగా అట్టి పనులను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే పనులను రద్దు చేయడం విడ్డూరంగా ఉంది. మండలంలో పార్టీలకతీతంగా రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు, పైపులు మోటార్లు ఇవ్వడం జరిగిందని అలాగే అకాల వర్షాలతో రైతులకు పంట నష్టం జరగగా ప్రతి రైతుకు పదివేల చొప్పున నష్టపరిహారం ఇప్పించి మరికొంతమంది కి రాలేదని నా దృష్టికి రావడంతో ప్రత్యేకంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి మరల 3000 మందికి నష్టపరిహారం మంజూరు చేయించి అప్పటి కలెక్టర్ వద్ద మంజూరు నిధులను ఉంచడం జరిగిందని.

 

BRS

 

ఇప్పుడున్న ఎమ్మెల్యే దానిపై ఎందుకు దృష్టి పెడుతలేరని దానితోనే రైతులపై మాధవరెడ్డికి ఎంత ప్రేమ ఉందో రైతన్నలు గమనించాలని అన్నారు. ఒకప్పుడు రాజకీయ కక్షలకు నిలయంగా మారిన నర్సంపేట నియోజకవర్గం వర్గాన్ని శాంతియుతంగా అన్ని రాజకీయ పార్టీలు, కులాల మతాలకు అతీతంగా ఎలాంటి గొడవలుకు తావు లేకుండా శాంతి సామరస్యాన్ని నెలకొల్పితే మళ్లీ దురదృష్టవస్తు ఒక దుర్మార్గున్ని గెలిపించుకోగా ఊర్లలో రౌడీ రాజకీయం మళ్ళీ మొదలైంది ఇలాంటి వాటికి చరమగీతం పాడాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త చెమటోర్చి కసిగా పనిచేస్తేనే విజయం దిశగా పరుగులు తీస్తారని ఆయన కార్యకర్తలకు సూచన చేశారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజ్ఞానంతో తెలిసి తెలియక ప్రాజెక్టులపై మాట్లాడడం విడ్డూరంగా ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియని అజ్ఞాన వ్యక్తి రేవంత్ రెడ్డి. దేవదుల ప్రాజెక్టు గోదావరి నదిపై ఉన్నదా లేదా కృష్ణా నదిపై ఉన్నదా తెలియక పోయినా ప్రాజెక్టులపై మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను ప్రభుత్వం ఏర్పడిన నుండి ప్రతి పైసా ప్రజలకు అందే విధంగా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసే దిశగా బిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, పిఎసిఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ జెడ్పిటిసి హరినాథ్ సింగ్, మాజీ వైస్ ఎంపీపీ పాలెపు రాజేశ్వరరావు, క్లస్టర్ ఇన్చార్జిలు గందె శ్రీనివాస్ గుప్తా, మామిళ్ళ మోహన్ రెడ్డి, ఇంగ్లీ శివాజీ, వైనాల వీరస్వామి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ తక్కలపల్లి మోహన్ రావు, మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నాన బోయిన రాజారాం యాదవ్, మండల మహిళా అధ్యక్షురాలు గోనె శ్రీదేవి, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఖ్యాతం శ్రీనివాస్, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పాలస్తీనా ఇరాన్లపై యుద్దదాడులు అమెరికా కుట్రలో భాగమే.

పాలస్తీనా ఇరాన్లపై యుద్దదాడులు అమెరికా కుట్రలో భాగమే

ప్రజా సమస్యలపై పోరాటాలను ఉదృతం చేయాలి

యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

నర్సంపేట నేటిధాత్రి:

యుద్దోన్మాదంతో సామాన్య ప్రజలను బలికొంటూ ఆర్థిక వ్యవస్థను చిన్నబిన్నం చేస్తు ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్న అమెరికా తగిన మూల్యం చెల్లించక తప్పదని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. అమెరికా ట్రంప్ విధానాలకు వత్తాసు పలికే బిజెపి మోడీ పద్ధతులను మార్చుకోవాలని లేకపోతే ప్రజా వ్యతిరేకతను చెవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
యంసిపిఐ(యు) వరంగల్ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం నర్సంపేట పార్టీ ఆఫీస్ లో కామ్రేడ్ కుసుంబ బాబురావుఅధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గాదగోని రవి మాట్లాడుతూ నేడు ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాదం – పెట్టుబడి దారీ విధానం సంక్షోభం లో చిక్కు కొని ఆ విధానం అనుసరిస్తున్న అమెరికా అనేక ఆర్థిక సమస్యలతో అంతరంగిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక దేశాల పై ఆర్థిక సుంకాలు, ట్యాక్సీలు విధిస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆంతరంగిక సమస్యలను ఎగదోసి, సరిహద్దు దేశాలతో సమస్యలను ఎగదోసి సామ్రాజ్య వాద, పెట్టుబడి దారీ దేశాలు యుద్ధ వాతావరణం కల్పించి యుద్దాలు చేస్తున్న
తీరు భారత దేశం – పాకిస్తాన్ సమస్య, ఉక్రెయిన్ – రష్యా యుద్ధం
ఇజ్రాయిల్ – పాలస్తీనా గాజా యుద్ధ సమస్య, నేడు ఇజ్రాయెల్ ఇరాన్ పై సాగిస్తున్న యుద్ధ దాడులు యావత్ సామ్రాజ్య వాద, పెట్టుబడి దారీ దేశాలు పేద, వర్తమాన అభివృద్ధి చెందుతున్న దేశాలలో దోపిడీ ని పెంచి పోషిస్తున్న తీరు అంతర్గత సమస్యలను పోషించి నేడు పతనం చెందుతున్న తీరు తో యుద్ధాలను ఎగదోయటం జరుగుతుంది అని ఆ క్రమంలోనే నేడు ప్రపంచంలో వివిధ దేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు దెబ్బ తింటున్న సామ్రాజ్యవాదం – పెట్టుబడి దారీ వ్యవస్థ ను తేటతెల్లం చేస్తుంది అని దీనికి ప్రత్యామ్నాయం సోషలిస్టు వ్యవస్తె తప్ప ఈ పెట్టుబడి దారీ, సామ్రాజ్య వాద వ్యవస్థ కాదని అందుకు అనుగుణంగా ప్రపంచ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి అని, ప్రజలు ప్రజా ఉద్యమాల ద్వారా ఈ దోపిడీ పెట్టుబడి దారీ వ్యవస్థ ను కూల్చాలని పిలుపు నిచ్చారు.దేశంలో బిజెపి గత పదకొండు సంవత్సరాల పాలనలో దేశాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పని చేయకుండా విద్వేష రాజకీయాలను, మతోన్మాద రాజకీయాలను చేస్తున్న తీరు తో ప్రపంచం ముందు తలవంపుల పాలు కావడం జరుగుతుంది అని దీనికి వ్యతిరేకంగా పీడిత ప్రజా ఉద్యమాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ యంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాలలో బాగంగా జూన్ 20 నుంచి జిల్లా వ్యాప్తంగా పౌరహక్కుల పరిరక్షణ – ఓంకార్ పాత్ర అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలు నిర్వహించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై అనుసరిస్తున్న సాచివేత విధానాలకు వ్యతిరేకంగా గ్రామ, వార్డు స్తాయి లో ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కన్నం వెంకన్న, వంగల రాగసుధ, కనకం సంధ్య తదితరులు పాల్గొన్నారు.

సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి.

సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి

జైపూర్ నేటి ధాత్రి:

 

వరంగల్ హైవే కు టేకుమట్ల గ్రామానికి సౌకర్యవంతంగా సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని శుక్రవారం మాజీ సర్పంచ్ గొనె సుమలత నర్సయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో కార్మిక,గనుల శాఖ మంత్రి డాక్టర్.వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం అందజేశారు.టేకుమట్ల నుండి వరంగల్ వైపు వెళ్తున్న ప్రధాన హైవే విషయమై ప్రతినిధి బృందం కలిసి వివరణ ఇవ్వడం జరిగింది.హైవేకు ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణం చేపడితే,స్థానిక రైతులు,ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయని వారు తెలిపారు.
అలాగే స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వేగవంతంగా జరుగడంతోపాటు,రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని సర్వే చేపట్టిన బృందం వివరించింది.ఈ విషయాన్ని గమనించిన మంత్రివర్యులు,సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రైతన్నలు ఆకాశం వైపు ఎదురుచూపు.

ఎటూ పోయావు వానమ్మా…

రైతన్నలు ఆకాశం వైపు ఎదురుచూపు

శాయంపేట నేటిధాత్రి:

జూన్ మాసం వచ్చి 20 రోజులు గడిచిన తొలకరి పలకరించలేదు ఎన్నో ఆశలతో సాగుకు సిద్ధమైన రైతు వర్షం రోజు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. మేఘాలు వర్షం రావడం కరుణించకపోవడంతో వానకాలం పంట సీజన్ ఆరంభంలో నిరాశ చెందు తున్నారు. ప్రకృతి విపత్తుల నేపథ్యంలో పంటలు దెబ్బ తినడంతో రైతులు నష్ట పోవలసిన పరిస్థితి వస్తుంది ఒక నెల ముందుగానేప్రారంభిం చాలని దిశ నిర్దేశం చేసింది. చినుకులు లేకపోవడంతో విత్తనాలు విత్తకుంటే అధిక దిగులు వస్తాయని రైతులు ఆలోచించారు ఎప్పటిలాగే రైతులు వానాకాలంలో వ్యవసాయ పనులు చేసుకునే పరిస్థితి కూడా లేకపోయింది. మేఘాలు మొఖం చాటేసుకోవ డంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అమ్ముకోవా లని నానా కష్టాలు పడి అమ్ముకుంటే జూన్ నెలలో విత్తనాలు వేసుకుంటే రైతన్నలకు వాన కాలంలో అనావృష్టి వెంటాడుతుంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించాకే నల్లరేగడిలో 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. మండలంలో పలు గ్రామాల్లో రైతులు వర్షం వస్తుందని నమ్మకంతో పత్తి విత్తనాలు నాటి ఎదురు చూస్తున్నారు ఈసారి ఎండ తీవ్రత విపరీతంగా ఉండడం తో మండలంలోని చెరువులు కుంటాను నీళ్లు లేక విలవిల బోతున్నాయి ఆయకట్టు వనరులు ఉన్న ప్రాంతాల్లో ఆయకట్టు వనరులు ఉన్న ప్రాంతాలలో ఆయకట్టు రైతులు కూడా వరుణుడు దీవెనలు కోసం ఎదురుచూ డాల్సిన పరిస్థితి నెలకొంది.

ఎదురుచూస్తున్నాం..

మండలం రైతు ముసికే అశోక్

వర్షాల కోసం ఎదురుచూపులు చూస్తున్నాం సీజన్ లో వర్షాలు రాకుండా కష్టపడి పండించిన తర్వాత లేదా పంటలు చేతకొచ్చే సమయంలో వర్షాలు వచ్చి మమ్మల్ని నష్టం పరుస్తుంది ఈ వర్షాకాలంలో మొదట్లోనే వర్షాలు రాక కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రచురణార్ధం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన.

ప్రచురణార్ధం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తప్పదు
రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య
ఘనంగా టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ

మంచిర్యాల జూన్ 19 నేటి ధాత్రి:తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో మరింత జాప్యం చేస్తే రాష్ట్రవ్యాపిత ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు. శుక్రవారం మంచిర్యాలలోని నస్పూర్ సీసీసీ ప్రెస్ క్లబ్ లో టీడబ్ల్యూజేఎఫ్ మంచిర్యాల జిల్లా తృతీయ మహాసభ ఘనంగా జరిగింది. ఈ మహాసభలో రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జర్నలిస్టులకు
అండగా నిలిచి సమస్యలపై పోరాడే ఏకైక యూనియన్
టీడబ్ల్యూజేఎఫ్ అని అన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్న యూనియన్ టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమే అని అన్నారు. అన్ని జిల్లాల్లో టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ బలపడుతుందని, ఈ నేపథ్యంలో అవగాహన లోపంతో ఫెడరేషన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వానికి
ఒక యూనియన్ వంతపాడితే.. ప్రస్తుత ప్రభుత్వానికి మరో యూనియన్ వంత పాడుతుందని ఎద్దేవా చేశారు. జిల్లాల్లో టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ బలోపాతానికి చేస్తున్న జిల్లా నాయకులను మామిడి సోమయ్య ఈ సందర్భంగా అభినందించారు.ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ… రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ 20 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ…
జర్నలిస్టులకు గత ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టలేదని, జర్నలిస్టులకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు మొండి చేయి చూపిందని అన్నారు. కనీసానికి వర్కింగ్ జర్నలిస్టులకు కొత్తగా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకుండా మూడు నెలలకోసారి స్టిక్కర్ల పేరుతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా జర్నలిస్టుల సంక్షేమంపై ఆలోచించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ మహాసభలో సీపీఐ రాష్ట్రదర్శి వర్గ సభ్యుడు శంకర్, ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడు బాపురావు, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు యూసుఫ్, జిల్లా సన్నాహక కమిటీ కన్వీనర్ మిట్టపల్లి మధు, కో- కన్వీనర్లు వెంకట స్వామి గడ్డం సత్యా గౌడ్
మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.
అధ్యక్షుడుగా మిట్టపల్లి మధు(సూర్య), ఉపాధ్యక్షుడుగా వెంకటస్వామి(ప్రజాపాలన), కార్యదర్శిగా గడ్డం సత్యగౌడ్(నేటిధాత్రి), సంయుక్త కార్యదర్శులుగా నేరెళ్ళ నరేష్ గౌడ్, నరేందర్, సుమన్,రవి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా ఎంఏ హఫీజ్, ఇప్ప సురేష్, సందలేని నర్సయ్య, సదానందం, శ్రీనివాస్,కోశాధికారి గా సబ్బని భాస్కర్,కార్యవర్గ సభ్యులుగా ఎండీ సుల్తాన్, ఎస్. మల్లేష్
తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటుగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా శానగొండ శ్రీనాథ్ ఎన్నికైనట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య ప్రకటించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version