నీళ్లలో నిప్పులు..కేసీఆర్‌ పెట్టిన మంటలు.

అబద్దాలతో అధికారంలోకి, ప్రజల సొమ్ము నీళ్లలో పోసి, కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసిన కేసిఆర్‌ కు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు లేదంటున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.. ఆయన మాటల్లోనే..

`నదుల అనుసంధానం అని మొదలు పెట్టిందే కేసీఆర్‌

`తెలంగాణ నుంచి ఆంద్రాకు నీళ్ల తరలింపు ప్రతిపాదన తెచ్చిందే కేసీఆర్‌

`జగన్‌ను పిలిచి ప్రగతి భవన్‌లో సంప్రదింపులు చేసిందే కేసీఆర్‌

`తమిళనాడులో గుళ్లు గోపురాలకు వెళ్తూ రోజా ఇంటికి వెళ్లిందే కేసీఆర్‌

`రోజా ఇంటిలో రాయలసీమ మీద ప్రేమ ఒలకబోసిందే కేసీఆర్‌

`ఇప్పుడు బనకచర్ల మీద మొసలి కన్నీరు కారుస్తున్నదీ కేసీఆర్‌

`రాయలసీమకు నీళ్లిద్దామని కేసీఆర్‌ అంటే ఆనాడే అడ్డుకున్నది కాంగ్రెస్‌

`పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ 45 క్యూసెక్కులకు జగన్‌ పెంచుతుంటే చూసిందే కేసీఆర్‌

`జగన్‌తో కయ్యం కన్నా నెయ్యం కోరుకున్నదే కేసీఆర్‌

`వైఎస్‌. పావురాల గుట్టలో పాయిరమైపోయిండన్నది కేసీఆర్‌

`అదే వైఎస్‌ కొడుకు జగన్‌తో రాజకీయం నెరిపిందీ కేసీఆర్‌

`అవకాశ వాద రాజకీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అనిపించుకున్నదే కేసీఆర్‌

`ఆంద్రాకు నీళ్లెలా తీసుకెళ్తారనేది కేసిఆరే.

`రాయలసీమకు నీళ్లొద్దా అని అనేది కేసీఆర్‌.

`అవకాశ వాద రాజకీయాలకు కేరాఫ్‌ కేసీఆర్‌

`తన రాజకీయ ప్రయోజనాల కోసం నాలుక మడతపెట్టడం అలవాటే

`ఉద్యమ కాలంలో అందరూ చూసిందే!

`తెలంగాణలో నీళ్ల కోసమని పాదయాత్ర చేసినట్లు నటించడం తెలుసు.

`బీఆర్‌ఎస్‌ విస్తరించాలని ఆంద్రాకు నీళ్లిద్దామని నమ్మించడం తెలుసు.

`ప్రధాని కావాలన్న పగటి కలలు కనడం తెలుసు

`ప్రజలు బండకేసి కొడితే కండ్లు బైర్లు కమ్మి మళ్ళీ కొత్త నాటకం ఆడడం తెలుసు

`మళ్ళీ సెంటిమెంట్‌ రాజేసి రాజకీయాలను ఏలాలనుకుంటున్నాడు

`పూర్వ వైభవం కోసం తహతహలాడుతున్నాడు

`మళ్ళీ నీళ్ల రాజకీయం మొదలుపెట్టి నిప్పులు పోస్తున్నాడు

నాకు తెలిసిందే నిజం..నేను చెప్పిందే వేదం..నాకున్నదే జ్ఞానం.. మిగతా వారిదంతా అజ్ఞానం..నాది రజో గుణం..నేను సృష్టించిందే తపోవనం..అని పగటి కలలుకనడంలో కేసిఆర్‌ ఫస్ట్‌..తెలంగాణ తెచ్చింది నేనే అని అసత్య ప్రచారం చేసి కేసిఆర్‌ అధికారంలోకి వచ్చాడు. అమర వీరుల త్యాగాల పునాదులు, తెలంగాణ వాదుల అలుపెరగని పోరాటంతో వచ్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడే అని మోసం చేసి సిఎం కుర్చీలో కూర్చున్నాడు. అడుగడుగునా తెలంగాణను ఆగం చేస్తూనే వచ్చాడు. ప్రజల సొమ్మంతా నీళ్లలో పోసి పనికి రాని కాళేశ్వరం నిర్మాణం చేశాడు. కమీషన్లను దండుకొని కోట్లు గడిరచాడు. నాసిరకం నిర్మాణం చేసి కాళేశ్వరాన్ని మూడేళ్లకే కూలేశ్వరం చేశాడు. తెలంగాణ ప్రజల సొమ్ము నీళ్లలా ఖర్చు చేసి, ఎందుకూ పనికి రాని పనులు చేసిన కేసిఆర్‌ కు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు లేదంటున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.. ఆయన మాటల్లోనే..

కాళేశ్వరం అద్భుత సృష్టి నాదే అని కేసిఆర్‌ గొప్పలు చెప్పుకున్నాడు. ఇప్పుడు నాకేం సంబంధం లేదంటున్నాడు. బొట్టు బొట్టు రక్తం కరిగించి, కాళేశ్వరం కట్టానన్నాడు. పిల్లర్లు కుంగిపోయి, కూలిపోయే పరిస్థితి వచ్చే సరికి నా తప్పేం లేదంటున్నారు. కాళేశ్వరం నిర్మాణం కేసిఆర్‌ కోసం ప్రయత్నం మొదలు పెట్టినప్పుడే కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. తెలంగాణ మేధావులు, సాగునీటి రంగ నిపుణులు, యూనివర్శిటీల ప్రొఫెసర్లు ఇలా ఎంతో మంది వద్దని వారించారు. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వందల రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు జరిగాయి. ఏ ఒక్కరూ కాళేశ్వరం గురించి పాజిటివ్‌గా మాట్లాడిరది లేదు. అయినా మూర?ంగా కేసిఆర్‌ ముందుకు వెళ్లాడు. నీళ్ల గురించి నాకే చెబుతారా? అని ప్రశ్నించిన వాళ్ళందరినీ ఎగతాళి చేశాడు. అప్పుడు అందరూ చెప్పిందే నిజమైంది. కేసిఆర్‌ చెప్పిన సుద్దులన్నీ నీటి మీద రాతలయ్యాయి. తెలంగాణ ఆగమైంది. తెలంగాణ అప్పుల పాలైంది. కాళేశ్వరం తెల్ల ఎనుగైంది. నదుల అనుసంధానం అని మొదలు పెట్టిందే కేసిఆర్‌. తెలంగాణ నుంచి ఆంద్రాకు నీళ్ల తరలింపు ప్రతిపాదన తెచ్చిందే కేసిఆర్‌. దేశంలోని అన్ని నదుల నుంచి సుమారు30 వేల టిఎంసిల నీరు సముద్రం పాలౌతుందని అన్నాడు. దేశ వ్యాప్తంగా బీడువారిన భూముల్లో బంగారు పంటలు ఉండేందుకు అద్భుతమైన ప్రాజెక్టులు కట్టొచ్చన్నారు. మరి కేసిఆర్‌ కట్టిందేమిటీ! ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు పనులలో భాగంగా కాలువల తవ్వకాలు కూడా 85 శాతం పూర్తి చేశారు. ప్రాజెక్టు నిర్మాణం జరిగితే అటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ సస్యశ్యామలమయ్యేది. ఇదంతా దాదాపు 35 వేల కోట్లతో పూర్తి జరిగేది. అదే సమయంలో తెలంగాణలో వున్న పెండిరగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకునే అవకాశం ఏర్పడేది. అప్పటి వరకు తెలంగాణలో పెండిరగ్‌లో వున్న ప్రాజెక్టుల పూర్తికి సుమారు. రూ .6500 కోట్లతో ఎక్కడిక్కడ సజీవజల తెలంగాణ ఆవిషృతమయ్యేది. కానీ అందుకు విరుద్ధంగా తుమ్మిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని మాయమాటలు చెప్పి కాళేశ్వరం తెరమీదకు తెచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ నిర్మాణం చేయాలో అధ్యయనం చేయడానికే రూ. 6కోట్లు ఖర్చు చేశారు. అంటే తెలంగాణ సంపదను ఎలా నీళ్ళలా ఖర్చు చేయాలనుకున్నారో శాంపిల్‌ చూపించారు. ఆఖరుకు లక్షాఇరవై వేల కోట్లు ఖర్చు చేశారు. అయినా లక్ష్యాన్ని సాధించారా? అంటే అదీ లేదు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మూలంగా వినియోగించుకునే నీరు కేవలం 240 టిఎంసిలు. అందులో 34 టిఎంసిలు పరిశ్రమలకు, మంచినీటి అవసరాలకు కేటాయించారు. మిగిలిన 206 టిఎంసిలు తెలంగాణ మొత్తం ఎలా సస్యశ్యామలమైందో, ఆ లెక్కల మర్మమేమిటో కేసిఆర్‌ కు మాత్రమే తెలియాలి. తెలంగాణ రాక ముందు సుమారు 25 లక్షల పంపుసెట్లు వుండేవి. అందులో పురాతన బావులు, తర్వాత తవ్విన బావులు మొత్తం 7 లక్షలున్నాయి. తెలంగాణలో వున్న మొత్తం సాగుకింద వున్న భూములన్నింటికీ సరిపడ నీరందించేవి. కాళేశ్వరం వచ్చిన తర్వాత భూ గర్భ జలాలు విపరీతంగా పెరిగినట్లైతే బావుల మీద వ్యవసాయానికి అవసరమైన నీరు పుష్కలంగా అందేది. తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాల సాగు భూమి కూడా రియల్‌ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అంటే గతం కన్నా సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. హైదరాబాదు చుట్టు పక్కల ఎటు చూసినా సుమారు 20 కిలోమీటర్ల పరిధిలో సాగు మాయమైంది. సాగు నీటి అవసరం లేకుండా పోయింది. మరి కాళేశ్వరం వల్ల కాలువల ద్వారా, భూ గర్భ జలాల ద్వారా సాగు విస్తీర్ణం ఎలా పెరిగింది? కోటిన్నర ఎకరాలు ఎలా సాగయ్యింది. ఈ లెక్కలలో ఏ ఒక్కదానికి పొంతన లేదు. అంటే కాళేశ్వరం వల్ల పెద్దగా ఒరిగింది లేదు. అందుకే కేసిఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన మరుసటి సంవత్సరమే వరి వేస్తే ఉరే..అని కొత్త రాగం అందుకున్నాడు. రైతులు కొత్త ఆయకట్టు చేపడితే మొదటికే మోసం వస్తుందని గ్రహించి, నదుల అనుసంధానం తెరమీదకు తెచ్చిండు. తెలివిగా కాళేశ్వరం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించాలని చూసిండు. జగన్‌ను పిలిచి ప్రగతి భవన్‌లో సంప్రదింపులు చేసిందే కేసిఆర్‌. అదే సమయంలో తమిళనాడులో గుళ్లు గోపురాలకు వెళ్లి, తెలంగాణ ముడుపులు చెల్లించుకునే పూజలు అని కొత్త డ్రామా మొదలుపెట్టాడు. తాను అనుకున్న సరికొత్త డ్రామాను రక్తి కట్టించేందుకు మాజీ మంత్రి రోజా ఇంటికి వెళ్లాడు. రాయలసీమ మీద ప్రేమ ఒలకబోశాడు. అప్పటికే బిఆర్‌ఎస్‌ ఆలోచనలు కేసిఆర్‌ మదిలో మొదలయ్యాయి. రెండు సార్లు వరుసగా గెలవడంతో భవిష్యత్తులో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే ఆశలు పెట్టుకున్నాడు. నదుల అనుసంధానం తెరమీదకు తెచ్చి కొత్త నాటకం రక్తి కట్టించాడు. కాళేశ్వరం పేరు చెప్పి దేశమంతటా గొప్పగా ప్రచారం చేసుకున్నాడు. డిస్కవరీ ఛానల్‌ లో దేశంలోని అన్ని బాషలలో కాళేశ్వరం మీద డాక్యుమెంటరీ తయారు చేసి ప్రచారం చేసుకున్నాడు. ఇంతలో టిఆర్‌ఎస్‌ ను బిఆర్‌ఎస్‌ గా మార్చుకొని కొత్త రాజకీయం మొదలుపెట్టారు. కానీ అందుకు కాళేశ్వరం సహకరించలేదు. కేసిఆర్‌ కుటిల రాజకీయం కాళేశ్వరమే బైటపెట్టింది. కేసిఆర్‌ ను తెలంగాణ రాజకీయాలకే దూరం చేసింది. ఇప్పుడు మళ్లీ అధికారం కోసం కొత్త నాటకం కేసిఆర్‌ మొదలుపెట్టిండు. ఇప్పుడు బనకచర్ల మీద మొసలి కన్నీరు కారుస్తున్నడు. తన రాజకీయ ప్రయోజనాల కోసం, బిఆర్‌ఎస్‌ విస్తరణ కోసం రాయలసీమ సస్యశ్యామలం చేద్దామని కొత్త పల్లవి అందుకున్నాడు. ఆ సమయంలోనే కేసిఆర్‌ కుటిల రాజకీయం గమనించి కాంగ్రెస్‌ అడ్డుకునే ప్రయత్నం చేసింది. కేసిఆర్‌ నిర్ణయాన్ని తప్పు పట్టింది. ప్రజా క్షేత్రంలో కేసిఆర్‌ రాజకీయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఎండగట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా వరద జలాల పేరుతో నికర జలాలు నిత్యం 11 క్యూసెక్కులు తరలించుకుపోయే వాళ్లు. ఏపిలో జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ 45 క్యూసెక్కులకు జగన్‌ పెంచుతుంటే ఎందుకు మౌనం వహించారు. ఆ సమయంలో జగన్‌తో కయ్యం కాకుండా నెయ్యం ఎందుకు నెరుపుకున్నాడు. అవకాశ వాద రాజకీయాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ కేసిఆర్‌ అన్నది అందరికీ తెలుసు. తెలంగాణ నిధులతో నీళ్లలో నిప్పులు రాజేసి, బనక చర్ల మంటలు రాజేసిందే కేసిఆర్‌. ఉద్యమ సమయంలో ఆంద్రాకు నీళ్లెలా తీసుకెళ్తారన్నది కేసిఆరే. అధికారంలో వున్నప్పుడు రాయలసీమ రైతులు చల్లగా వుండొద్దా! రాయలసీమలో పంటలు పండొద్దా! రాయలసీమ సస్యశ్యామలం కావొద్దా! సముద్రం పాలౌతున్న నీటిని రాయలసీమ వాడుకుంటే తప్పేంటి? రైతులు ఎక్కడైనా రైతులే అంటూ కబుర్లు చెప్పింది కేసిఆరే. ఇప్పుడు మాట మార్చి తెలంగాణకు అన్యాయం జరుగుందని గగ్గోలు పెడుతోంది కేసిఆరే. ఇంతటి ఊసరవెళ్లి లక్షణాలున్న నాయకుడు కేసిఆర్‌ తప్ప ఈ ప్రపంచంలో మరొకరు లేరు. అవకాశ వాద రాజకీయాలకు కేరాఫ్‌ కేసిఆర్‌.

తన రాజకీయ ప్రయోజనాల కోసం నాలుక మడతపెట్టడం అలవాటే. కేసిఆర్‌ అసలు స్వరూపం ఉద్యమ కాలంలో అందరూ చూసిందే! కేసిఆర్‌ రెండు నాలుకల దోరణి బనకచర్ల విషయంలో మరో సారి తేటతెల్లమైంది. తన రాజకీయ స్వప్రయోజనాల కోసం గతంలో ఏం చేసినా చెల్లింది. ఇప్పుడు చెల్లదు. తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. కేసిఆర్‌ వ్యవహార శైలి తెలియంది కాదు. ఇంకా కేసిఆర్‌ను నమ్మేందుకు జనం సిద్ధంగా లేదు. బనకచర్ల మీద రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానం వుంది. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ బనకచర్లను సమర్థించలేదు. ఎక్కడా ఆహ్వానించినట్లు ఎలాంటి ప్రకటన రాలేదు. బిఆర్‌ఎస్‌ నాయకులు గాయ్‌ గాయ్‌ చేసినంత మాత్రాన అబద్దం ఎప్పుడూ నిజం కాదు. కేసిఆర్‌ మాటలు జనం ఇంకా నమ్మడానికి సిద్ధంగా లేరు. పదేళ్లలో కేసిఆర్‌ చేసిన విధ్వంసం చూశారు. కాళేశ్వరం పేరుతో ఎలా దోచుకున్నారో తెలుసుకున్నారు. ఎంత అవినీతికి కేసిఆర్‌ కుటుంబం పాల్పడిరదో కళ్ల ముందు కనిపిస్తూనే వుంది. ఇంకా తిమ్మిని బమ్మి చేసే కేసిఆర్‌ కుటిల రాజకీయాలకు కాలం చెల్లింది. బనకచర్ల మీద బిఆర్‌ఎస్‌ మాట్లాడకుంటేనే మంచిది. గురివింజ తన నలుపునెరగదు అన్నట్లు తప్పుల మీద తప్పులు చేసిన కేసిఆర్‌ను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అవినీతి చక్రవర్తిగా మారి కోట్లు కొల్లగొట్టిన కేసిఆర్‌ ను వదిలించుకున్నారు. నెత్తిన పెట్టుకున్న ప్రజలనే మోసం చేసిన కేసిఆర్‌ను బండకేసి కొట్టిన జనం మళ్లీ ఆదరించే ప్రసక్తి లేదు. కేసిఆర్‌ ఎంత తాపత్రయపడినా లాభం లేదు. జనానికి అన్నీ తెలుసు. ప్రజలకు కేసిఆర్‌ మోసాలన్నీ తెలుసు.

కేతకి సంగమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు..

కేతకి సంగమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: అష్ట తీర్థాల సంగమం, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. బుధవారము అమావాస్య, సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి తెల్లవారు జాము నుంచి చేరుకున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అమావాస్య సందర్భంగా పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ, మేల్కొల్పు సేవ, మహా రుద్రాభిషేకం, మహా మంగళ హారతి నిర్వహించిన అనంతరం రాత్రి 4 :30 నుండి భక్తులకు ప్రవేశాన్ని దర్శనానికి అనుమతించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయింది.

 

Ketaki

 

 

ఓం నమశ్శివాయ పంచాక్షరి నామం తో మార్మోగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో శివ రుద్రప్ప ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. వచ్చిన భక్తులకు అన్నదాన సౌకర్యం కల్పించడం జరిగింది ఝరాసంగం ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రజా సమస్యలపై సమరశీల పోరాటలు నిర్వహించాలి

ప్రజా సమస్యలపై సమరశీల పోరాటలు నిర్వహించాలి- ఇరుగురాల భూమేశ్వర్

పెగడపల్లి, నేటిధాత్రి:

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని శ్రీరాజరాజేశ్వర రెడ్డి ఫంక్షన్ హాల్ లో సిపిఐ తోమ్మిదవ మండల మహాసభ జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇరుగురాల భూమేశ్వర్ హాజరై మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వ కార్యాలయాల ముందు సమరశీల పోరాటాలు ఉద్యమాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులైన పేదలకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. రాజీవ్ యువ వికాసం పథకంలో పారదర్శకతను పాటించాలని, గత ప్రభుత్వాల విధానాలని ఈకాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పటిష్టంగా చొరవ తీసుకోవాలన్నారు. ఒక శతాబ్దం పూర్తి చేసుకున్న పార్టీ నాటి నుండి నేటి వరకు ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందన్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ సిపిఐ పార్టీ అని అన్నారు. అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇళ్ల స్థలాల కోసం భూ పోరాటాలు చేయాలన్నారు. సిపిఐ పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎత్తుపల్లాలను చూసిందని, సమస్యలు ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ప్రజల కోసం పోరాడుతుందన్నారు. ఈసుదీర్ఘ ప్రయాణంలో అనేక పోరాట త్యాగాల గుర్తులు ఉన్నాయని అన్నారు. ఈకార్యక్రమంలో రాచర్ల సురేష్, గుడ్ల శ్రీనివాస్, బొమ్మన శంకర్, బొమ్మన బాబు, దీకొండ రవికుమార్, శ్రీగిరి రాజకుమార్, ఆత్మకూరి రాజేశం, సిపల్లి బాబు, బత్తుల రామకృష్ణ, కోలాపురి హనుమంతు, మల్యాల అంజయ్య, మల్లారపు భూమయ్య, మల్యాల ఎర్రయ్య, నాగవత్ గంగానాయక్, లింగంపల్లి కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా గుజ్జల ప్రేమ్ కుమార్

ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గా గుజ్జల ప్రేమ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆర్మూర్ లో జరిగిన ఏబీవీపీ సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు జాన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు గుజ్జల ప్రేమ్ కుమార్ ని భూపాలపల్లి జిల్లా కన్వీనర్ గా ప్రకటించారు విద్యారంగ సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించి అనేక విద్యార్థుల సమస్యల పరిష్కరించడంలో అనేక కృషి చేశారనిఅన్నారు ఈ సందర్భంగా నూతనంగా జయశంకర్ భూపాలపాలి జిల్లా కన్వీనర్ గా ఎన్నికైన గుజ్జల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు ఈ యొక్క ఈ యొక్క బాధ్యతను ఇచ్చినందున కు రాబోయే రోజులలో అనేక ఉద్యమాలు నిర్వహించి సంస్థాగతంగా జిల్లాలో ఏబీవీపీని బలోపేతం చేసే విద్యార్థి పరిషత్ ను ముందుకు తీసుకెళ్తానని అన్నారు నాకు సహకరించిన ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా జాన్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబుకి ధన్యవాదాలు తెలిపారు నూతనంగా ఎన్నికైన సాయి,బంటీ విఘ్నేష్ తదితరులు అభినందనలు తెలిపారు

జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా చేయాలి

కులాలుగా చైతన్యం కావాలి – సమూహంగా ఏకం కావాలి

ఎమ్మార్పీఎస్ ఉద్యమం అట్టడుగు వర్గాలకు కేంద్రబిందువు

ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు-బెజ్జంకి అనిల్ మాదిగ

గంగాధర, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ మొదలుపెట్టిన ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రభావం అన్ని అణగారిన కులాల్లో సామాజిక చైతన్యానికి రగిలించిందని అన్నారు. ప్రతి కులం తమ అస్తిత్వాన్ని చాటుకోవడానికి సంఘాల ఏర్పాటు చేసుకొని పోరాట బాటలోకి వచ్చాయని అన్నారు.

 

 

 

వారికి కావాల్సినంత ప్రోత్సాహాన్ని సహకారాన్ని మంద కృష్ణ మాదిగ అందించారు. అందువల్ల ఎమ్మార్పీఎస్ ఉద్యమం కేవలం మాదిగల ప్రయోజనాల వరకే పరిమితం కాకుండా అన్ని అణగారిన కులాల సంక్షేమం కోసం కృషి చేసిందని అన్నారు. అందులో బాగానే ఆరోగ్యశ్రీ, ఆసరా పెన్షన్లు, రేషన్ బియ్యం పెంపు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు, మహిళల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మొదలైనవి ఎమ్మార్పీఎస్ పోరాడి సాధించిందని అన్నారు.

 

 

ఈఫలితాలన్ని వర్గాలు పొందుతున్నారని అన్నారు. అందువల్ల సమస్త అణగారిన కులాలకు కేంద్ర బిందువుగా ఎమ్మార్పీఎస్ నిలుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అణగారిన కులాలన్ని ఏకులానికి ఆకులం చైతనమై మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో మహజనులుగా ఏకమై తెలంగాణ రాజకీయల్లో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆదిశగా అన్ని కులాలు ఆలోచించాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం విజయం సాధించిన నేపథ్యంలో జూలై 7న జరుగు ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని అన్ని గ్రామాల్లో అన్ని కులాల సమక్షంలో పెద్ద ఎత్తున జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

 

 

 

ఈకార్యక్రమంలో కొమ్ము శేఖర్ మాదిగ, ఎమ్మెస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ముద్దం నాగేష్, మాజీ ఎంపిటిసి కర్ర బాపురెడ్డి, మాజీ మండల్ పరిషత్ ఉపాధ్యక్షులు సముద్రాల అంజయ్య మాదిగ, కేడిసిసి మాజీ జిల్లా డైరెకట్టర్, దోమకొండ శ్రీనివాస్ మాదిగ, సముద్రాల శివరామకృష్ణ మాదిగ, దోమకొండ నరేష్ మాదిగ, దోమకొండ గోపి మాదిగ, బొడ్డు రాజేందర్ మాదిగ, పర్లపెల్లి అంజయ్య మాదిగ, లంకదాసరి రాజు మాదిగ, దోమకొండ సుధాకర్ మాదిగ, లంకదాసరి మొండయ్య మాదిగ, లంకదాసరి చెంద్రయ్య మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు ఒరిగిందేమీ లేదు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు ఒరిగిందేమీ లేదు.

డిహెచ్పిఎస్ జాతీయ కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్

కరీంనగర్, నేటిధాత్రి:

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు గడిచిన దళితులకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎవరికి అందకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని బోయిని అశోక్ అన్నారు. కరీంనగర్ జిల్లా ముఖ్యుల సమావేశం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని తిరుపతి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈసమావేశంలో అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చి దళిత సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఇండస్ట్రియల్ లోన్, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాస్, చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని అశోక్ అన్నారు. దళిత హక్కుల పోరాట సమితి గ్రామ మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకొని సభ్యత్వాలు చేర్పించు కార్యక్రమాన్ని కొనసాగించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో డిహెచ్పిఎస్ నాయకులు పార్నంది రాజకుమార్, బోయిని పటేల్, మహిళ నాయకురాలు శారద ఎస్ నాంపల్లి, అందే సంపత్, అందే వెంకట్, ఏ.పుల్లయ్య, రాజు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిని అడ్డుకుంటున్న నిషేధిత !

అభివృద్ధిని అడ్డుకుంటున్న నిషేధిత మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు

గుండాల సిఐ రవీందర్,ఎస్సై సైదా రహూఫ్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

గుండాల మండలంలోని శెట్టిపల్లి, కోటగడ్డ, సజ్జలబోడు, చింతలపాడు గ్రామాలలో గుండాల సీఐ రవీందర్,గుండాల ఎస్సై సైదా రహుఫ్,కొమరారం ఎస్సై నాగుల్ మీరా లు బుధవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్ మాట్లాడుతూ మండలంలో ఎవరైన అనుమానితులుగా కొత్త వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం
అందించాలని సమాచారం ఇచ్చిన వారి పేర్లును గోప్యంగా ఉంచుతా
మన్నారు. నిషేదిత మావోయిస్టులకు సహాయ సహకారాలు అందించి
కేసుల కు గురికావద్దని హెచ్చరించారు. మావోయిస్ట్ లు కాలం చెల్లిన సిద్ధాంతాలను నమ్ముకుని తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని జన జీవన స్రవంతిలో కలిస్తే పోలీస్ శాఖ నుంచి ఆపరేషన్ చేయూత ద్వారా ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామని, తమ కుటుంబాలతో ఆనందంగా జీవించవచ్చని తెలిపారు. మావోయిస్టుల మాయమాటలు నమ్మి నిండు జీవితాలను అర్ధంతరం చేసు
కోవద్దని పిలుపునిచ్చారు. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని మావోయిస్టులు తమ ఊబిలోకి దించుతూ వారి స్వలాభం కోసం అమయాకులను బలికొంటున్నారన్నారు. నిరుద్యోగులకు పోలీస్ శాఖ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శెట్టిపల్లి గ్రామంలోని యువతకు గుండాల సిఐ రవీందర్, కొమరారం ఎస్సై నాగుల్ మీరా వాలీబాల్ కిట్టును అందించారు.ఈ కార్యక్రమంలో గుండాల, కొమరారం పిఎస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు

ఉత్తరాదిలో విస్తరణకు కాంగ్రెస్‌కు అడ్డంకులు

`వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు భిన్నం

`కేంద్ర నాయకత్వం బలహీనం

`రాష్ట్రాల్లో సమస్యలను పరిష్కరించలేకపోవడం

`రాజకీయాలు కెరీర్‌గా మారడం

`నిబద్దత కలిగిన నాయకులు కరవు

`క్యాన్సర్‌లా మారిన గ్రూపు తగాదాలు

`వెంటిలేటర్‌పై కాంగ్రెస్‌కు చికిత్స ఫలించేనా?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పార్టీల తలరాతలు మార్చే ఉత్తరప్రదేశ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో నెలకొన్న వివిధ భౌగోళిక రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌ ఎదుగుదలకు అడ్డంకులుగా వున్నాయి. కర్ణుడి చావుకు ఆరు కారణాలన్నట్టు పార్టీని అంపశయ్యమీదనే కొనసాగేలా చేస్తున్నాయి. ఉదాహరణకు హర్యానా, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పరిస్థితిని ఈ క్రింది విధంగా విశ్లేషించవచ్చు.

హర్యానాలో కాంగ్రెస్‌ పార్టీలో భూపేంద్రసింగ్‌ హుడా, కుమారి షెల్జా మధ్య తీవ్రస్థాయిలో వర్గ పోరు కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అ సెంబ్లీలో ప్రతిపక్షనేతను నియమించలేని దుస్థితి నెలకొంది. అధిష్టానం కూడా వీరిద్దరినీ ని యంత్రించలేక మీ తిప్పలు మీరు పడండన్న రీతిలో వ్యవహరిస్తోంది. వీరిద్దరి మధ్య నెలకొన్న వైరమే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలవడానికి ప్రధాన కారణమని పార్టీవర్గాలే బహిరంగంగా చెప్పుకుంటున్నాయి. గత పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ పట్ల సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో, దీన్ని సానుకూలంగా మార్చుకోవడానికి బదులు వీరిద్దరు నాయకులు తమ ప్రాబల్యం నిలుపుకోవడం కోసం నిరంతర పోరు కొనసాగిస్తూ పార్టీ లో బిభేదాలను రావణకాష్టంగా మలుస్తున్నారు. దీని ఫలితంగానే రాష్ట్రంలో పునర్నిర్మాణ ప్రక్రియ కూడా అడుగు ముందుకు పడటంలేదు. రాష్ట్రంలో జిల్లాస్థాయి పార్టీ అధ్యక్షుల నియామకం చేపట్టిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగడం విధాయకం. 45 రోజుల కాలంగా వివిధ జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల నియామకంకోసం జరుగుతున్న ప్రయత్నాల్లో రెండు గ్రూపుల వారు ఆధితప త్యంకోసం అంటే ఎక్కుమంది జిల్లా అధ్యక్షులు తమ గ్రూపువారే వుండాలన్న ఉద్దేశంతో తీవ్రంగా పోటీపడుతున్న నేపథ్యంలో ఈ నియామకాలు ఒక కొలిక్కి రావడంలేదు. ఎవరికివారు అత్య ధికులు తమ వర్గవారిని జిల్లా అధ్యక్షులుగా నియమించేలా చూసుకుంటే, రాష్ట్ర అధ్యక్ష పదవిని తామే కైవసం చేసుకోచ్చన్నది హుడా, శైలజల వ్యూహంగా కనిపిస్తోంది. ఫలితంగా ఈ ఎన్నిక లూ ఒక కొలిక్కి రావడంలేదు. కాంగ్రెస్‌ అంటేనే సమస్యల కొలిమి. ఈ కొలిమిలో చలికాచుకునేది కొందరైతే, చేతులు కాల్చుకునేవారు మరికొందరు. ఇప్పటికే బలీయమైన నాయకత్వం పార్టీని వీడిపోయినప్పటికీ, ఉన్న నాయకత్వం తమ పైతరాల నాయకుల రాజకీయశైలినే అనుసరిస్తూ పార్టీకి నష్టం చేకూరుస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ రెండు ప్రధాన గ్రూపులుగా చీలిపోవ డంతో, పునర్నిర్మాణ ప్రక్రియ ఒక ప్రహసనంగా మారింది. దీంతో ఉన్న నాయకుల్లో కాస్త నిజాయతీగా సమర్థవంతంగా పనిచేసేవారు ఎవరికివారు పక్కకు తప్పుకోవడం పార్టీకి ఆత్మహత్యా సదృశంగా మారింది. కేంద్రంలో బలీయమైన నాయకత్వం లేకపోవడం కూడా ఈ మితిమీరిన స్వే చ్ఛకు, ధిక్కారస్వరానికి ప్రధాన కారణం. కేంద్రనాయకత్వం బలంగా వుంటే రాష్ట్రంలో గ్రూపు రాజకీయాలు ఈ స్థాయికి దిగజారబోవు. అంతేకాదు ఇటువంటి ఫ్యాక్షన్‌ రాజకీయాలు పార్టీకి కొత్తేమీ కానప్పటికీ రావణకాష్టంలా కొనసాగుతుండటం పార్టీ పుట్టిముంచుతోంది. 

మధ్యప్రదేశ్‌

పార్టీలో బీజేపీ ఏజెంట్లు వున్నారంటూ సాక్షాత్తు రాహుల్‌ గాంధీ ప్రకటించడాన్ని బట్టి చూస్తే మధ్యప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి ఎట్లావున్నదీ అర్థమవుతుంది. ముఖ్యంగా కొన్ని జిల్లాల కాంగ్రెస్‌ అధ్య క్షులు బీజేపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారంటూ పార్టీలో చాలామంది నాయకులు ఎప్పటినుంచో ఆరోపిస్తున్న విషయం. కాంగ్రెస్‌ తరపున మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన భైరోసింగ్‌ తనకు రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ుతో ప్రత్యక్ష సంబంధాలున్నాయని చెప్పుకోవడానికి ఎంతమా త్రం సంకోచించలేదు. భాజపాకు అనుకూలంగా పనిచేసే ఇటువంటి జిల్లా నాయకత్వం వల్ల నిజమైన కాంగ్రెస్‌ కార్యకర్తలు తమ వాణిని వినిపించలేకపోతున్నారనేది అభిప్రాయం. ఇటువంటి నాయకత్వం పనితీరు భాజపా విజయానికి దోహదం చేసేదిగా వుంటోంది తప్ప, పార్టీకి మేలు చేయడంలేదని వీరి ప్రధాన ఆరోపణ. వీటికితోడు పార్టీలు మారే సంస్కృతి విపరీతంగా పెరిగిపోవడం కూడా కార్యకర్తల్లో అయోమయాన్ని సృష్టిస్తోంది. ఇప్పుడు రాజకీయాలు సైద్ధాంతికం కంటే కెరీర్‌గా మారిన నేపథ్యంలో అసలు రాజకీయ సంస్కృతే పూర్తిగా మారిపోయింది. పార్టీలతో ప్రమేయం లేకుండా సీటుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడని దశకు రాజకీయాలు చేరుకోవడంవర్తమాన పరిణామం! ఇది మధ్యప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాదు! ఫలితంగా గెలుపు అవకాశాలకంటే, టిక్కెట్‌ ఇచ్చే పార్టీకే నాయకులు ప్రాధాన్యత ఇస్తుండటంతో సిద్ధాంతాలు గాల్లో కలిసిపోయి ఏనాడో అయింది. పార్టీలో ఒక స్థాయిలో వున్న నాయకుడు మరో పార్టీకి ఏజెంట్‌గా మారి పనిచేసే దశకు మధ్యప్రదేశ్‌ రాజకీయాలు పరిణామం చెందాయి. అంటే వుండేది ఒక పార్టీలో పనిచేసేది మరో పార్టీకోసం! వలువలు లేని నైతిక విలువలకు ఇంతకు మించిన గొప్ప ఉదాహరణ అవసరంలేదు. ఇవన్నీ జరిగేది కేవలం ‘కెరీర్‌’లో అభివృద్ధి కోసం తప్ప మరోటి కాదు. ఇది దిగువస్థాయి కార్యకర్తల వరకు ఇంకా చేరుకోకపోవడంతో, పై స్థాయిలో జరిగే రాజకీయ పరిణామాలు వీరికి హృదయశల్యను కలుగజేయడం వర్తమాన పరిణామం. ఈ సంస్కృతి క్షే త్రస్థాయికి పాకితే ఇక పార్టీలు కేవలం ‘ఆశ్రయం’ కల్పించడానికి తప్ప మరెందుకూ పనికిరావు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో చేపట్టిన జిల్లా స్థాయి నాయకత్వాల మార్పుల ప్రక్రియలో బీజేపీ అనుకూల నాయకత్వాన్ని మార్చకపోవడం పార్టీ కేడర్‌ను నిరుత్సాహ పరుస్తోంది. రాబోయే కాలంలో ఇటువంటి నాయకులవల్ల పార్టీకి చెరుపే తప్ప మేలు వుండదనేది కార్యకర్తల ఆవేదన! కాంగ్రెస్‌ మహాసముద్ర ‘హోరు’లో ఇటువంటి ‘వాణు’లు వినే నాధుడే వుండడు! అంపశయ్యపై వున్నా, కాంగ్రెస్‌ను పీడిస్తున్న ఈ విషసంస్కృతి పార్టీని మరింతగా దెబ్బతీస్తోంది. 

ఉత్తరప్రదేశ్‌

ఉత్తరప్రదేశ్‌లో జిల్లాస్థాయి నాయకత్వాన్ని నియమించడంలో బీజేపీకంటే కాంగ్రెస్‌ ఎంతో ముందుంది. ఇటీవల విజయవంతంగా ఈ ప్రక్రియ పూర్తిచేయడం దిగుస్థాయి కేడర్‌లో ఆనందోత్సాహాలు నింపుతున్న మాట వాస్తవం. ముఖ్యంగా 2027 అసెంబ్లీ ఎన్నికల నాటికి సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్‌ కూటమి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నియామక ప్రక్రియ పూర్తికావడం గమ నార్హం. అయితే బూత్‌, మండల, బ్లాక్‌ స్థాయిల్లో ఇంకా పార్టీ నాయకులను ఎన్నిక ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఇదిలావుండగా పార్టీ ప్రక్షాళన నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీతో సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలనేది పార్టీ కేడర్‌ ప్రధానంగా కోరుతున్న అంశం. ఈ పొత్తువల్ల వున్న ఓటుబ్యాంక్‌ను నష్టపోవడమే కాదు, సమాజ్‌వాదీ పార్టీ తాము కోరుకున్న, తగినన్ని సీట్లు కేటాయించకపోవడం పార్టీ అభివృద్ధికి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నదని వారు గట్టిగా విశ్వసిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా యు.పి. పార్టీ అధ్యక్షుడు అజయ్‌ రాయ్‌, కాంగ్రెస్‌ సొంతంగా పోటీచేయాలని గట్టిగా కోరారు. కానీ అధిష్టానం ఆయన సలహాను పట్టించుకోలేదు. అయితే ఎస్‌.పి.తో జట్టుకట్టడం వల్ల పార్టీ ఆరు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించగలిగింది. 2014 నుంచి ఇది పార్టీకి మంచి స్కోరుగానే చెప్పాలి. ఇక 2024 ఉపఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా, తానే అన్ని స్థానాలకు పోటీచేసింది. ఈ ఎన్నికల్లో తాను మునగడమే కాదు, కాంగ్రెస్‌కు అవకాశం లేకుండా చేసింది. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌లో ప్రక్షాళన కార్యక్రమం చేపట్టాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పార్టీకి ఒక రూపు ఏర్పడుతున్న సమయంలో, కాంగ్రెస్‌ అధినాయకత్వం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించవచ్చు. కానీ ఎస్‌.పి. ఎంతవరకు దీన్ని పడనిస్తుందనేది ప్ర స్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఎస్‌.పి. సైంధవ పాత్ర పోషిస్తే, కాంగ్రెస్‌ పరిస్థితి మ రింత దయనీయంగా మారగలదు. ఎందుకంటే ఇప్పుడు చేపట్టిన ప్రక్షాళన ప్రక్రియ వ్యర్థం కావడమే ఇందుకు కారణం. సంఘటన్‌ శ్రీజన్‌ అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) పేరుతో పార్టీ ప్రక్షాళన ప్రక్రియను వివిధ రాష్ట్రాల్లో చేపట్టినప్పటికీ, ఆయా రాష్ట్రాల భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఇది ముందుకు పోవడంలేదు. గుజారాత్‌లో బీజేపీ బలీయంగా వేళ్లూనుకొనిపోవడం, మధ్య ప్రదేశ్‌లో పార్టీలకి చొరబాట్లు, హర్యానాలో గ్రూపు తగాదాలు, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఆధిపత్యం వెరసి కాంగ్రెస్‌ అభివృద్ధిని పూర్తిగా నిరోధిస్తున్నాయనే చెప్పాలి.

జూబ్లిహిల్స్‌ రోహిన్‌ రెడ్డికే!

గెలిచేది రోహిన్‌ రెడ్డే!!

`జూబ్లీ హిల్స్‌ గెలవడం కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిష్టాత్మకం.

`పార్టీ ఇన్చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ కు జూబ్లీహిల్స్‌ ఎన్నిక ఒక సవాల్‌.

`పిసిసి. అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ ఎదుర్కొంటున్న తొలి పరీక్ష.

`జూబ్లీహిల్స్‌ గెలిస్తే హైదరాబాదు కు మంత్రివర్గంలో చోటుకు స్థానం.

`‘‘నేటిధాత్రి’’ ప్రాథమిక సర్వేలో కూడా రోహిన్‌ రెడ్డి కావాలంటున్న ప్రజలు.

`ఇప్పటికైతే జూబ్లీ హిల్స్‌ లో జనం పల్స్‌ కాంగ్రెస్‌ వైపే..

`అందరి చూపు రోహిన్‌ రెడ్డి కోసమే!

`ప్రతిపక్షాలను ఓడిస్తేనే జిహెచ్‌ఎంసి కైవసం సులభం.

`అధిలార పార్టీ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజల నమ్మకం.

`జూబ్లిహిల్స్‌ నియోజకవర్గం మీద రోహిన్‌ రెడ్డికి పట్టు!

`రోహిన్‌ రెడ్డి నివాసం ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోనే.

`ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఒకప్పుడు జూబ్లీ హిల్స్‌ భాగం.

`అప్పటి నుంచి రోహిన్‌ రెడ్డికి జూబ్లీ హిల్స్‌ మీద కూడా పూర్తి పట్టు.

`నిజానికి గత ఎన్నికలలో రోహిన్‌ రెడ్డికి ఖైరతాబాద్‌ టికెట్‌ ఇస్తే సునాయాసంగా గెలిచేవారు.

`అంబర్‌ పేట్‌ నుంచి బరిలోకి దిగినా స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు.

`ఉప ఎన్నికలో జూబ్లీ హిల్స్‌ నుంచి రోహిన్‌ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే.

`రోహిన్‌ రెడ్డి కి పట్టున్న ప్రాంతం..

`అధికారంలో వున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.

`రెండు అంశాలు రోహిన్‌ రెడ్డికి సానుకూలంగా మారే అవకాశాలు.

`జూబ్లీ హిల్స్‌ లో సానుభూతి పని చేయొద్దనుకుంటే రోహిన్‌ రెడ్డి సరైన అభ్యర్థి.

`పైగా సీఎం. రేవంత్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో జూబ్లీ హిల్స్‌ అభివృద్ధి చెందే అవకాశం.

`సీఎంను ఒప్పించి నిధులు తెచ్చి అభివృద్ధి చేయడానికి మార్గం.

`సీఎం తో పట్టుబట్టి నిధులు తీసుకురాగల సాన్నిహిత్యం.

`జూబ్లీ హిల్స్‌ తో పాటు జిహెచ్‌ఎంసి గెలుచుకోవడం రోహిన్‌ రెడ్డి తోనే సాధ్యం.

`కనిపిస్తున్న ఆశావహులెవరూ హైదరాబాదుపై పట్టున్న నాయకులు కాదు.

`వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్ఠలో రోహిన్‌ రెడ్డి దరిదాపుల్లో ఎవరూ లేరు.

-బీఆర్‌ఎస్‌ను మరో సారి లేవకుండా చేయాలంటే జూబ్లీ హిల్స్‌ హస్తగతం కావాలి.

-పార్టీ అధిష్టానం కూడా రోహిన్‌ రెడ్డి ఎంపికపైనే దృష్టి.

-రోహిన్‌ రెడ్డి ని గ్రౌండ్‌ వర్క్‌ చేసుకొమ్మని చెప్పే ఆ .

-ఆ దిశగా అడుగులేయడానికి రోహిన్‌ రెడ్డి సిద్ధం.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక త్వరలో జరగనున్నది. ఆగష్టులో జరగనున్న బిహార్‌ ఎన్నికలతో నిర్వహించే అవకాశం కూడా లేకపోలేదు. దాంతో ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు అభ్యర్ధుల ఎంపిక, ప్రకటన విషయంలో సీరియస్‌గా వున్నారు. అదికార కాంగ్రెస్‌పార్టీలో కూడా చాల మంది ఆశావహులున్నారు. కాని అదిష్టానం మదిలో సీనియర్‌ నాయకుడు రోహిన్‌ రెడ్డి పేరు పరిశీలనతో వుందని విశ్వసనీయ సమాచారం. పార్టీ కోసం రోహిన్‌రెడ్డి పడుతున్న శ్రమను అదిష్టానం గుర్తించింది. గత ఎన్నికల్లో రోహిన్‌రెడ్డికి ఖైరతాబాద్‌ టికెట్‌ ఆశించారు. కాని ఆఖరు నిమిషంలో రోహిన్‌రెడ్డికి అంబర్‌ పేటను కేటాయించారు. అయినా ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఒక వేళ రోహిన్‌ రెడ్డికి ఖైరతాబాద్‌ టికెట్‌ ఇస్తే ఖచ్చితంగా గెలిచేవారు. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక వస్తోంది. పాత ఖైరతాబాద్‌ నియోజకవర్గంపై కాంగ్రెస్‌లో పూర్తి పట్టున్న ఏకైక నాయకుడు రోహిన్‌రెడ్డి. ఖైరతాబాద్‌లో జూబ్లీహిల్స్‌ కూడా వుండేది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జూబ్లీహిల్స్‌ ప్రత్యేక నియోజకవర్గమైంది. అయినా రోహిన్‌రెడ్డికి జూబ్లీహిల్స్‌లో పట్టుంది. అందుకే రోహిన్‌రెడ్డికే ఈ సీటు కేటాయించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. ఆయనకు కాకుండా మరెవరికీ ఇచ్చినా, గెలవాల్సిన సీటు కోల్పోతుందన్న అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే కంటోన్‌ మెంటు ఉప ఎన్నికతో కాంగ్రెస్‌కు ఓ సీటు కలిసి వచ్చింది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌ను కూడా హస్తగతం చేసుకోవాల్సిన అవసరం వుంది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ బలంగానేవుంది. సోషల్‌మీడియా ప్రచారంలో జరుతున్నదంతా నిజంకాదు. జూబ్లీహిల్స్‌లో మైనార్టీ ఓట్లు ఎక్కువగా వున్నప్పటికీ అవి కాంగ్రెస్‌కే చెందుతాయి. అందులోనూ సీమాంద్రకు చెందిన ప్రజల ఓట్లు కూడా మేజర్‌ రోల్‌ పోషిస్తాయి. ఇక్కడ బిఆర్‌ఎస్‌ను, బిజేపిని తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఆ రెండు పార్టీలు కూడా బలంగానే వున్నాయి. ఎంఐఎంకూడా ప్రభావిత రోల్‌ పోషించే అవకాశం లేకపోలేదు. సినీ రంగానికి చెందిన వాళ్లు కూడా కీలకపాత్ర పోషిస్తారు. అందవల్ల తెలుగుదేశం, జనసేన కూడా ఓట్లు వుంటాయన్నది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. అందువల్ల ఇక్కగ గెలుపు గుర్రాలను నిలబెడితే తప్ప గెలుపు అన్ని పార్టీలకు అంత సునాయం కాదు. పైగా జరగబోయేది ఉప ఎన్నిక. సాదారణ ఎన్నికలు వేరు. ఉప ఎన్నికలు వేరు. సాదారణ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు రాష్ట్ర మొత్తం మీద దృష్టిపెట్టుకోవాల్సివుంటుంది. కాని ఉప ఎన్నికల్లో అన్ని పార్టీల యంత్రాంగమంతా అక్కడే తిష్ట వేసి వుంటుంది. రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు, నాయకులు, కార్యకర్తలు కూడా కీలకభూమిక పోషిస్తూ వుంటారు. ప్రచారం జోరుగా నిర్వహిస్తుంటారు. ఏ పార్టీ వెనక్కి తగ్గాలని అనుకోదు. అలా బిఆర్‌ఎస్‌, బిజేపిలు తమ అస్త్రశస్త్రాలు వినియోగిస్తాయి. బిఆర్‌ఎస్‌ సానుభూతి మీద ఆదారపడ రాజకీయం చేస్తుంది. ఆ పార్టీ యంత్రాంగమంతా కేంద్రీకృతమై ప్రచారం నిర్వహిస్తుంది. అలాగే బిజేపి జాతీయ నాయకులను కూడా ప్రచారానికి వినియోగించే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల కాంగ్రెస్‌ పార్టీ కీలకమైన ప్రచార అస్త్రాలను ఉపయోగించాల్సి వుంటుంది. అంతకు ముందు బలమైన నాయకుడిని అభ్యర్ధిగా ప్రకటించాల్సి వుంటుంది. అభ్యర్ధుల ఎంపికలో ఏ మాత్రం అటూ ఇటు అయినా మొదటికే మోసం వస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అదికారంలో వుంది. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకం. పిసిసి. అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తన నేతృత్వంలో ఎదుర్కోబోతున్న మొదటి ఎన్నిక. ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్ధిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఎక్కువగా వుంటుంది. అంతే కాకుండా రాష్ట్ర వ్యవహారల ఇన్‌చార్జి నటరాజన్‌కు కూడా ఇది ప్రతిష్టాత్మక ఎన్నిక. వీరితోపాటు ఈ ఉప ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎంతో కీలకం. అలాంటి సమయంలో అన్ని వర్గాలకు, అన్ని రకాల నాయకత్వాలకు అనుకూలమైన నాయకుడిని ఎంపిక చేయాల్సి వుంటుంది. అందులో రోహిన్‌ రెడ్డి ఎంపిక గురించే చర్చ జరుగుతోంది. రోహిన్‌ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడనే పేరుంది. అందువల్ల రోహిన్‌ రెడ్డికి టికెట్‌ ఇస్తే నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి ప్రచారం చేసి, గెలిపించే అవకాశం వుంది. లేకుంటే నాయకుల మధ్య వున్న విభేదాలు పార్టీ ఓటమికి కారణం కావొచ్చు. రోహిన్‌ రెడ్డి అందిరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు. పైగా జూబ్లీహిల్స్‌లో బాగా పట్టున్న నాయకుడు. ప్రజలతో సత్సంబందాలు వున్న బలమైన నాయకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్‌లో పార్టీని గట్టెక్కించగలిగే నాయకుడు కాంగ్రెస్‌కు లేరు. గతంలో వున్నంత బలంగా ఇప్పుడు హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ లేదనే చెప్పాలి. ఒకప్పుడు ఒంటిచేత్తో హైదరాబాద్‌ను ఏలిన నాయకులు కాంగ్రెస్‌లో వుండేవారు. ఈ తరంలో అంతటి బలమైన నాయకుడు ఎవరని వెతికితే ఒక్క రోహిన్‌ రెడ్డి తప్ప మరొకరు కనిపించడంలేదు. ఇక్కడ కీలకమైన అంశం మరొకటి ముడిపడి వుంది. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ గెలవడం అనివార్యం. తప్పనిసరిగా గెలిచి తీరాల్సిన నియోకజవర్గం. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక తర్వాత డిసెంబర్‌ , జనవరిలో జిహెచ్‌ఎంసి ఎన్నికలు జరిగే అవకాశం వుంది. గతంలో ఎలాగూ కాంగ్రెస్‌ పార్టీకి ప్రాతినిద్యం లేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వుంది. 2004కు ముందు బిఆర్‌ఎస్‌ జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పోటీ చేయాలంటే కూడా భయపడిన రోజులన్నాయి. ఎన్నికల నుంచి తప్పించుకున్న కాలం కూడా వుంది. కాని కాంగ్రెస్‌ ఎప్పుడూ అలా పారిపోలేదు. పోరాట పటిమ కాంగ్రెస్‌కు మించి ఏ పార్టీకి వుండదు. గత రెండు దఫాలుగా జిహెచ్‌ఎంసిపై జెండా ఎగురవేయని కాంగ్రెస్‌ అధికారంలో వుండి కూడా గెలవకపోతే తప్పుడు సంకేతాలువెళ్తాయి. అందువల్ల ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఆరు నూరైనా గెలవాలి. అందులో రోహిన్‌రెడ్డి మాత్రమే గెలిచే అవకాశాలున్నాయి. ఈ విషయంలో నేటి ధాత్రి గత కొంత కాలంగా ప్రాధమిక సర్వే నిర్వహించింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి అభ్యర్ధి ఎవరైతే బాగుంటుందన్న దానిపై సర్వే నిర్వహించడం జరిగింది. ప్రజలకు కొన్ని పేర్లు సూచిస్తే మెజార్టీ ప్రజలు రోహిన్‌ రెడ్డి పేరునే సూచించారు. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా రోహిన్‌ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రజాభిప్రాయం మేరకు పార్టీ అభ్యర్ధిగా రోహిన్‌రెడ్డిని ఎంపిక చేస్తే గెలుపు నల్లెరు మీద నడకే అవుతుందంటున్నారు. హైదరాబాద్‌ నుంచి ఇప్పటి వరకు మంత్రి వర్గంలో ఎవరూ ప్రాతినిద్యం వహించడం లేదు. ఈ సారి ఉప ఎన్నికల్లో గెలిచే కాంగ్రెస్‌ అభ్యర్ధికి మంత్రి పదవి ఖాయం. హైదరాబాద్‌కు మంత్రి వర్గంలో చోటు అత్యవసరం. జిహెచ్‌ఎంసి ఎన్నికలకు ముందే మంత్రి వర్గంలో హైదరాబాద్‌ ఎమ్మెల్యేకి చోటు కల్పించాల్సిన అవసరం వుంటుంది. అందుకే ప్రయోగాలు చేయకుండా, లేని పోనివివాదాలకు కాంగ్రెస్‌ కేంద్ర బిందువు కాకుండా వుండాలి. ఏ ఇతర సభ్యులను పరిగణలోకి తీసుకున్నా కాంగ్రెస్‌లో వివాదాలు ముసిరే అవకాశం వుంది. అవి ప్రతిపక్షాలకు అనుకూలమయ్యే ప్రమాదం కూడా వుంది. అటు ప్రతిపక్షాలను కట్టడి చేస్తూ, ఇటు ప్రజల విశ్వాసం చూరగొంటూ ఎన్నికల్లో ముందుకు సాగాల్సిన అవసరం వుంది. ఇక్కడ ప్రజలు కూడా బాగా ఆలోచించే అంశాలు కూడా కొన్ని వున్నాయి. రోహిన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. అప్పుడు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం మరింత అభివృద్ది చెందేందుకు దారులు పడతాయి. ఇప్పటి వరకు పెండిరగ్‌లో వున్న అన్ని రకాల సమస్యలు తీరుతాయి. మంత్రి కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో వుండే పరిస్ధితి వుంటుంది. నగరంలో కాంగ్రెస్‌ బలోపేతానికి అడుగులు పడుతుంటాయి. ఒక్క జూబ్లీహిల్స్‌ నియోజకవర్గమే కాకుండా, హైదరాబాద్‌ లోని అన్ని నియోజకవర్గాలు మరింత అభివృద్ది చెందేందుకు అవకాశాలుంటాయి. నగర అభివృద్ది కోసం మరిన్ని నిధులను తెచ్చే అవకాశం వుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అంత్యంత సన్నిహితుడు కావడం వల్ల ఎమ్మెల్యేగా రోహిన్‌ రెడ్డి గెలిస్తే ఇతోదిక నిధులు తెచ్చి, అటు తన సొంతనియోజవర్గంతోపాటు, హైదరాబాద్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఏర్పడుంది.

కురివి మండల కేంద్రంలోని రైతు వేదికలలో.

కురివి మండల కేంద్రంలోని రైతు వేదికలలో రైతు భరోసా సంబురాలు

మరిపెడ/కూరవి నేటిధాత్రి.

 

 

 

రైతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖా-ముఖీ కార్యక్రమం లో భాగంగా డోర్నకల్ నియోజకవర్గ లో ని కూరవి మండల రైతు వేదిక లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రునాయక్, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతుల తో కలిసి సమావేశం లో పాల్గొని మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో ప్రజల్లో కి తీసుకెళ్ళి ప్రజా పాలన, ప్రభుత్వo అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు, నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం, రైతు భరోసా ప్రతి ఎకరాకు 6000 రు చొప్పున లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో కొరవి మండల పార్టీ అధ్యక్షులు,మాజీ జడ్పీటీసీ అంబటి వీరభద్రం గౌడ్,కొరవి దేవస్థానం చైర్మన్ కొర్ని రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బండి వెంకటరెడ్డి, మరియు ప్రజా ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ.

కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ
ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయం పండుగలా సాగుతుంది
*వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహ్మద్ రఫీ
మొగుళ్ళపల్లి నేటిధాత్రి:

 

తెలంగాణలో వ్యవసాయం దండగ కాదు పండగ చేయాలన్న ఆలోచన మేరకు 9 రోజుల్లో పెట్టుబడి సాయం దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం నిధులు విడుదల చేసిన ప్రజా ప్రభుత్వం
వానాకాలం సీజన్లోపంటకు పెట్టుబడి రైతు భరోసా పథకం కింద 9 రోజుల్లో పూర్తిచేసి ప్రజా ప్రభుత్వంలో రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని చిట్యాల వ్యవసాయం మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ అన్నారు .ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజులో 9 వేలకోట్ల రూపాయలు కోట్లరూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి వర్గానికి
అందరికి ధన్యవాదాలు తెలిపారు.గతంలో ఎకరాకు పది వేల రూపాయలు ఇవ్వగా ఇప్పుడు మన ప్రభుత్వం ఎకరాకు 12 వేల చొప్పున అన్ని వ్యవసాయ భూములకు అందించామని నిధుల విడుదల  చేశామన్నారు

మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేద్దాం ఎక్సైజ్ ఎస్సై రబ్బాని.

మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేద్దాం ఎక్సైజ్ ఎస్సై రబ్బాని

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేద్దామని భూపాలపల్లి ఎక్సైజ్ ఎస్సై రబ్బాని అన్నారు.పట్టణ భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎక్సైజ్ ఎస్సై రబ్బాని హాజరై పలు సూచనలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలు నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని,గంజాయి, డ్రగ్స్ తదితర మాదకద్రవ్యలను వినియోగించిన,సరఫరా చేసిన, నిల్వ ఉంచిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మాదకద్రవ్యలను వినియోగించడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి అన్నారు.మాదకద్రవ్యలను సరఫరా చేసిన నేరంగా పరిగణించి కేసు చేపడుతమని విద్యార్థులకు చెప్పారు. మాదకద్రవ్యలకు దూరంగా ఉండాలని,విద్యార్థులు చదువు పై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఎవరైనా మాదకద్రవ్యాలు వాడుతున్నాట్టు మీ దృష్టికి వచ్చినట్లయితే వెంటనే పోలీసులకు, మీ గురువులకు చెప్పి మాదకద్రవ్యాల నిరోధానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎక్సైజ్ ఎస్సై రబ్బానీ & సిబ్బంది,
జంగేడు ఉన్నత పాఠశాల హెచ్ఎం అశోక్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆకలి తీర్చే అన్నదాతకు ఆర్థిక ధైర్యం ఇచ్చే ప్రజాపాలన.

ఆకలి తీర్చే అన్నదాతకు ఆర్థిక ధైర్యం ఇచ్చే ప్రజాపాలన

నడికూడ నేటిధాత్రి:

 

మండల కేంద్రం లో రైతు భరోసా సంబురాలు.
కాంగ్రెస్ పార్టీ ఆగ్రనేతలా చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని విశ్వసించిన ప్రజా ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలో 1 కోటి 49 లక్షల ఎకరాలకు తొమ్మిది రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతులు ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా సంబరాలు నిర్వహించింది. అందులోనే భాగంగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రైతు భరోసా సంబరాలు నిర్వహించారు,నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,రైతులు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏఐసీసీ అధ్యక్షులు మల్లి కార్జున్ ఖర్గే, సోనియాగాంధీ గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రి వర్గానికి, ఎమ్మెల్యే కు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ గడచిన 18 నెలలో రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం 1.04 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని పేర్కొన్నారు.గత ప్రభుత్వం పది సవంత్సరాల కాలంలో18 వేల కోట్లు రైతుబందు ఖర్చుపెడితే కేవలం18 నెలలోనే 21వేలకోట్లు రైతు భరోసా కింద ప్రజా ప్రభుత్వం ఖర్చు పెట్టిందని అన్నారు.ఇది రైతు ప్రభుత్వం మని వెల్లడించారు
ఈ కార్యక్రమం లో మండల ప్రధానకార్యదర్శి మాలహల్ రావు,మాజీ జడ్పీటీసీ పాడి కల్పనా ప్రతాప్ రెడ్డి,పరకాల బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల చిన్ని,మండల సమన్వయ కమిటీ సభ్యులు పర్నెం తిరుపతి రెడ్డి,పెద్ద బోయిన రవీందర్ యాదవ్, మాజీ ఎంపీటీసీ పర్నెం మల్లారెడ్డి,రైతులు,వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం.

ప్రజా ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం

– సకాలంలో రైతులకు చేయూత.

– ప్రజాహిత సంక్షేమాలతో ప్రజలు సంతోషం.

– డిప్యూటీ స్పీకర్ డా. రామచంద్రనాయక్

– మరిపెడ పట్టణ కేంద్రంలో సీఎం, డిప్యూటీ సీఎం, వ్యవసాయ మంత్రి, ప్రభుత్వ విప్ చిత్రపటాలకు పాలాభిషేకం.

మరిపెడ:నేటిధాత్రి.

 

 

 

 

 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రజాహిత సంక్షేమాలు అమలు చేస్తూ ప్రజాపాలన కొనసాగిస్తుందని, కాంగ్రెస్ రైతుల పక్షపాతి అని రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రామచంద్రునాయక్ అన్నారు. సాగుకు యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోస సకాలంలో వేసిన సందర్భంగా కృతజ్ఞత తెలుపుతూ ఆర్ అండ్ బి అతిధి గృహం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ప్రజాహిత సంక్షేమాలు ప్రవేశపెట్టి నిరుపేదలకు ఆసరాగా నిలుస్తోందన్నారు. మండలంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి ఉచిత కరెంటు, ఉచిత బస్సు, రూ. 500 సిలిండర్, 21లక్షల మంది రైతుల రుణ మాఫీ చేసింది, సన్న వడ్లు కు బోనస్, భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం, అర్హులైన రైతులకు ఎకరాకు రూ.6వేల రైతు భరోసా లబ్ధిదారులకు అందించిందన్నారు. తాజాగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు మొదటి విడతగా 4000వేల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందించి ప్రజా ప్రభుత్వంగా ప్రజల మన్ననలు పొందుతోందన్నారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్ని విధాల బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పానుగోతు రామ్ లాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి నాయక్, నాయకులు బోర గంగయ్య, కొండం దశరథ, గుండగాని వెంకన్న, సురబోయిన ఉప్పలయ్య, కుడితి నరసింహారెడ్డి, కారంపుడి ఉపేందర్, రవికాంత్, దూగుంట్ల వెంకన్న, బోడ రమేష్, తొట్టిగౌతం, యాకుబ్ పాషా, బోడ రవి, వల్లేపు లింగయ్య, గంధసిరి సోమన్న, గౌస్, సోమ చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్…

నేటి ధాత్రి మహబూబాబాద్:

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి వేగంగా వైద్యం అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు.మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ,ఆసుపత్రిలోని మెడికల్,ఫీవర్,క్యాజువాలిటీ, ఐసీయూ, మెడికల్ కేర్, పిరియాడిటిక్ , జనరల్ సర్జికల్ వార్డు, మెడికల్ స్టోర్, డయాలసిస్, తదితర వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులను పలకరించారు.ఆలన కేంద్రం లో క్యాన్సర్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్, హోమ్ కేర్ లు తదితరులతో మాట్లాడుతూ,వారికి అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలో కావలసిన అన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం సానిటేషన్ నిర్వహించాలని ఆదేశించారు.నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ స్థితిగతులను తెలుసుకున్నారు.పనులను వేగంగా పూర్తి చేయాలని అందుకు ప్రతినిత్యం కాంట్రాక్టర్లు సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని అన్నారు.రోగులకు నిత్యం వైద్య సేవలు అందిస్తూ షిఫ్టులవారీగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వైద్య సేవలలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని సూచించారు.కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు.

పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు

రామేశ్వర యాత్రలో శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలం ధర్మారావుపేట గ్రామ శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి సభ్యులు భారత దేశం లోని తమిళనాడు రాష్ట్రము లోని ప్రసిద్ధి గాంచినా పరమ పవిత్ర మైన రామేశ్వర క్షేత్ర విహార యాత్రలో శ్రీ ఉమా మహేశ్వర సేవ సమితి సభ్యులు ప్రతి సంవత్సరం దేశం నలుమూలల దేవాలయాలు సందర్శించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం దక్షిణ భారత దేశం పుణ్యక్షేత్రలు అనంత పద్మనాభ స్వామి మధుర మీనాక్సీ శ్రీరంగం తిరుచనూరు కన్యాకుమారి జంబూకేశ్వర్ తాంజవుర్ లాంటి దేవాలయాలు దర్శించినట్టుగా సేవ సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ పాత్రికేయలకు తెలిపారు.ఈ యాత్రలో ఆకుల రవీందర్ దామోదర్ బెనికి రాజు సింగం రాజవిరు పనికెలా శివకృష్ణ మొగిలి బండి రాజు ఆకుల సుజాత స్వర్ణలత లావణ్య సులోచన సారలక్ష్మి బెనికి స్వాతి వసంత అన్నపూర్ణ సంధ్య తదితరులు పాల్గొన్నారు

బిజెపి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం.

బిజెపి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం.

ఆమనగల్ నేటి ధాత్రి :

కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్ మండలం మంగళ పల్లి గ్రామంలో బీజేపీ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ కండె హరిప్రసాద్ కల్వకుర్తి నియోజకవర్గంలోని రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం మంగళ పల్లి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీ ఎర్రవోలు శ్రీనివాస్ (కేకె), బూత్ అధ్యక్షులు, కొప్పు నర్సింహ, M. శ్రీశైలం యాదవ్ అధ్యక్షతన బీజేపీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జడ్పీటీసీ, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ కండె హరిప్రసాద్ హాజరై పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు…ఈ సందర్భంగా కండె హరిప్రసాద్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోంది. గత 11 ఏళ్లలో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి సామాన్యుడి జీవితంలో మార్పు తీసుకొచ్చాయి,అని వివరించారు.
స్వచ్ఛ భారత్, పీఎం కిసాన్, ఉజ్వలా యోజన, జనధన్ యోజన, ముద్రా లొన్లు, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాల వల్ల గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన అభివృద్ధి చోటుచేసుకుందన్నారు. ఈ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యతగా భావించాలన్నారు.

రచ్చబండ కార్యక్రమంలో కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ శ్రీ గోరటి నర్సింహ, ఆమనగల్ మండల అధ్యక్షుడు శ్రీ ఎర్రవోలు శ్రీనివాస్ (కేకె) గార్లు ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై, వారి స్థానిక సమస్యలు, అభివృద్ధి అవసరాలను సూటిగా వినిపించుకునే ప్రయత్నం చేశారు…

తాగునీరు, రోడ్లు, ఉపాధి అవకాశాలపై వచ్చిన అంశాలపై స్పందించి, వీటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే చర్యలు తీసుకుంటామని తెలిపారు…

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు ప్రతి నెలా 5 కిలోల నాణ్యమైన సన్న బియ్యం అందుతున్న విషయాన్ని గుర్తుచేశారు…

అనంతరం అమ్మ పేరు మీద మొక్కలను నాటడం జరిగింది…

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, Bjym మండల అధ్యక్షుడు వరికుప్పల శ్రీనివాస్, బిసి మోర్చ కల్వకుర్తి ఇంచార్జ్ వరికుప్పల చంద్రమౌళి, కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు శాంపూరి భగవాన్ రెడ్డి, బీసీ మోర్చ మండల అధ్యక్షుడు వరికుప్పల శ్రీనివాస్, ఎస్సీ మోర్చా రంగారెడ్డి జిల్లా నాయకులు కొప్పు పుల్లయ్య, మాజీ బూత్ అధ్యక్షుడు గండి కోట జంగయ్య, మాజీ వార్డు సభ్యులు ఆర్ ప్రభు లింగం, నల్ల కొమురయ్య, తిప్పిరెడ్డి సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకుడు మందా రాంరెడ్డి, వరికుప్పల రాఘవేందర్, మండల్ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎరగమౌని రాములు, సీనియర్ నాయకులు కొప్పు నర్సింహ అలియాస్ బొంబాయి, కార్ మెకానిక్ శేఖర్, వరికుప్పల శ్రీకాంత్, బండ్ల శివ, వరికుప్పల అశోక్ గార్లు గ్రామంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు… ఉచిత రేషన్ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు ప్రతి నెలా 5 కిలోల నాణ్యమైన సన్న బియ్యం అందుతున్న విషయాన్ని గుర్తుచేశారు…

ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి…

ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి…

మావోయిస్టులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి…

జూన్ 25న చలో వరంగల్ రాష్ట్ర స్థాయి సదస్సును జయప్రదం చేయండి…

నేటి ధాత్రి- గార్ల:-

 

 

 

ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి మావోయిస్టులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని సిపిఐ ఎమ్ -ఎల్ న్యూడెమోక్రసీ గార్ల మండల కార్యదర్శి జి. సక్రు డిమాండ్ చేశారు. మంగళవారం సత్యనారాయణపురం లో ఈ నెల 25న వరంగల్ లో తలపెట్టిన రాష్ట్ర సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సక్రు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టేందుకు పూనుకుందని పేర్కొన్నారు. ఆదివాసి, గిరిజన ప్రజలను అటవీ సంపదకు దూరం చేసే చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.మావోయిస్టుల పేరుతో దేశవ్యాప్తంగా సాగుతున్న ఎన్కౌంటర్లు,హత్యాకాండ పతాక స్థాయికి చేరి ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా ఎవరినైనా కాల్చి చంపి ఎన్ కౌంటర్గా ప్రకటించే ఆనవాయితీని అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని అన్నారు.2004లో వైయస్సార్ ప్రభుత్వానికి పీపుల్స్ వార్ పార్టీకి మధ్య శాంతి చర్చలు జరిగాయి కానీ ఆ చర్చల్లో కీలక భూమిక పోషించిన భూమి విషయం వచ్చేసరికి రెండవ దప చర్చల్లో పరిష్కరించుకుందామని మొదటిదప చర్చలను ముగించడం జరిగిందని రెండవ దప చర్చలేమో కానీ మళ్ళీ నల్లమల్ల అంతా రక్తం ఏరులై పారి చర్చల వాతావరణమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసి గిరిజన ప్రజలను అటవీ సంపదకు దూరం చేసే చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.తక్షణమే మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు.ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు వెంకటేశ్వరరావు, బొమ్మగంటి రాధా,దబ్బేటి శారద,మంకిడి భారతి, లక్ష్మయ్య,సుమన్, సక్రు, రామదాసు,రమేష్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల భరోసాగా రైతు భరోసా.

ఎన్నికల భరోసాగా రైతు భరోసా.

విజయోత్సవాల పేరుతో గత సీజన్ రైతు భరోసా,వడ్లకు బోనస్ ఎగనామం..

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే పెద్ది ఫైర్..

నర్సంపేట నేటిధాత్రి:

గత సీజన్ లో రైతు భరోసా, అలాగే వడ్లకు ప్రకటించిన బోనస్ లను ఎగనామం పెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా చేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి గత19 నెలల కాలంలో రైతులను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని పెద్ది డిమాండ్ చేశారు.ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి 12 వేలకు పరిమితం చేయడం అలాగే గత వానకాలం,యాసంగిలో రైతు భరోసా ఎగ్గొట్టి ఓట్ల కోసం ఇప్పుడు విజయోత్సవాల పేరిట సంబరాలు జరపుకోవడం రైతులను మోసం చేయడం కాదా అని ప్రశ్నిస్తూ,రైతులకు ఏం చేశావని సంబరాలు చేస్తున్నారంటూ ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో ఒక్క చెక్ డ్యాం కట్టలేదని ఆరోపించారు.2022 మే 6 న వరంగల్ లో జరిపిన రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ,సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ,ఆనాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది ప్రశ్నించారు.కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల బతుకులు సంక్షోభంలో కూరుకుపోయాయని అవేదన వ్యక్తం చేశారు.గత పదేండ్ల బిఆర్ఎస్ పాలన రైతు సంక్షేమ ప్రభుత్వమైతే నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రైతు సంక్షోభ ప్రభుత్వంగా పెరుపొందుతున్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమం.

రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమం

ఘనంగా రైతు భరోసా సంబరాలు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లను అందజేసిన ఎమ్మెల్యే

శాయంపేట నేటి ధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం ప్రారంభోత్సవ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని పాలాభిషేకం చేసి, ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారు లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల్లో 9000 వేల కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ కావడం ఎంతో సంతోషకరం.ఈ కార్య క్రమంలో అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, మహి ళలు, ప్రజలు, రైతులు అధిక మొత్తంలో పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version