ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో భాగంగా బుధవారం రోజున మహాదేవపూర్ ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం వేడుకలలో భాగంగా ఎంపీడీవో రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ ప్రసాద్, ఏపీవో, సూపర్ ఇండెంట్, శ్రీధర్ బాబు కార్యాలయ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఒకప్పుడు నిమ్ ప్రాజెక్ట్ గురించి కలలు కన్న జహీరాబాద్ ఇప్పుడు నిజమవుతోంది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్స్) మొదటి దశకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఇది కేవలం భూముల వ్యాపారానికే పరిమితం కాకుండా, ఇళ్లు, ప్లాట్ల డిమాండ్ ను కూడా భారీగా పెంచుతోంది. ఆలస్యమైనా సరైన సమయంలో ఇవ్వడంతో పుష్కరకాల నిరీక్షణకు తెరపడింది. నెలరోజుల్లో లేఔట్ పనులు ప్రారంభం కానున్నాయన్న సమాచారం వ్యాపారాలు, రైతులు, స్థానిక సంస్థలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం నింపింది. అందరి దృష్టి ఇప్పుడు జహీరాబాద్ పై పడింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగానికి ఈ ప్రాంతం కేంద్ర బిందువుగా మారింది.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: ఒకప్పుడు నిమ్స్ ప్రాజెక్ట్ గురించి కలలు కన్న జహీరాబాద్ కట ఇప్పుడు నిజమవుతోంది. దశాబ్దా లుగా ఎదురు చూస్తున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్స్) మొదటి దశకు ప్రభు త్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాంతం రియల్ ఎస్టే ట్ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఇది కేవలం భూముల వ్యాపారానికే పరిమితం కాకుండా, ఇళ్లు, ప్లాట్ల డిమాండ్ ను కూడా భారీగా పెంచుతోంది. ఆలస్యమైనా సరైన సమయంలో ప్రభుత్వం నిమ్స్ ఫస్ట్ ఫేజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పుష్కరకాల నిరీక్షణకు తెర పడింది. నెలరోజుల్లో లేఔట్ పనులు ప్రారంభం కానున్నాయన్న సమాచారం వ్యాపారాలు, రైతులు, స్థానిక సంస్థలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం నింపింది. పదేళ్ల కాలపరిమితితో 2012లో మొదలైన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్స్) కల, పుష్కరం పాటు కలగానే ఉండిపోయింది. లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు, భూముల ధరల పెరుగుదల … తదితర అంశాలు ఒకప్పుడు కేవలం చర్చలకే పరిమితమయ్యాయి, కానీ, ఇప్పుడు ఆ నిరీక్షణకు తెర పడింది. నిమ్స్ ప్రాజెక్ట్ మొదటి దశకు గ్రీన్ సిగ్నల్ రావడంతో అందర్ దృష్టి ఇప్పుడు జహీరాబాద్ పై పడింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగానికి ఈ ప్రాంతం కేంద్ర బిందువుగా మారింది.
పుంజుకున్న రియల్ వ్యాపారం..
కొంతకాలంగా మందగించిన భూముల వ్యాపా రం ఒక్కసారిగా వేగం పంజుకుంది. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ముఖ్యంగా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే పెట్టుబడిదా రులు, మళ్ళీ ఆహీరాబాద్ వైపు దృష్టి సారించారు. నిమ్ మొదటి దశ అభివృద్ధి పనులకు నవంబర్ నెలలో లేఔట్ పనులు ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటిం చదంతో, భూముల ధరలు అమాంతం పెరిగాయి. జాతీయ రహదారుల పొడవునా ఉన్న భూముల ధరలు ఏకంగా వికరం రూ.4 కోట్లు దాటగా, ఇతర రహదారు. లపై కూడా రూ. కోటి కంటే ఎక్కువగా పలకుతున్నాయి. నిమ్డ్ ప్రాజెక్ట్ మొత్తం 12.635 ఎకరాల్లో విస్తరించనుం డగా మొదటి దశలో 3.245 ఎకరాలకు అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2369 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు. ఈ పురోగతి వ్యాపారులకు గొప్ప ప్రోత్సాహాన్నిచ్చింది.
దేశం నలుమూలల నుంచి పెట్టుబడులు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపడంతో, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెట్టుబదులు జహీరాబాద్ కు తరలివచ్చు అవకాశం ఉంది. రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు: మొదలైతే, దానికి అనుబంధంగా ఇతర పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి. దీనికి తోడు విమా నాశ్రయాలు అదనపు ఆకర్షణలున్నాయి. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 125. కిలోమీటర్లు, కర్ణాటక రాష్ట్రం బీదర్ విమానాశ్రయం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పెట్టుబడల ఆకర్షలు. ఆర్థిక కార్యకలాపాలు సవ్యంగా జరిగేందుకు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్నాయి. నిమ్స్ మొదటి దశ పనులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో, కేవలం స్థానికులే కాకుండా దేశం నలుమూలల నుంచి పెట్టుబడిదారులు. జహీరాబాద్ వైపు చూస్తున్నారు. భారీ పరిశ్రమలు. మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు మొదలైతే వేలాది ఉద్యోగాలు వస్తాయి. దీంతో నివాస ప్రాంతాల అవసరం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే, చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పుడు భూములతో పాటు ఇళ్లు, అపార్ట్మెంట్ల నిర్మాణంపై దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే అనేక కొత్త వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. ఈ ప్రాంతం రూపురేఖలను పూర్తిగా మార్చేసేందుకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి.
భవిష్యత్తు వైపు చూపు..
నిమ్స్ ప్రాజెక్ట్ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపాదాన్ని మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తుంది. కొత్త పరిశ్రమలు, ఉపాది అవకాశాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు జహీరాబాద్ ను ఒక కీలకమైన పారిశ్రామిక కేంద్రంగా మారు స్తాయి. ఎంతోకాలంగా నిరీక్షించిన ఈ శుభవార్తతో. జహీరాబాద్ భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురించాయి. భూముల వ్యాపారం మళ్లఈ జోరందుకోవడమే కాకుండా, ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధికి ఇదో మైలు: రాయిగా నిలుస్తోంది,
ఘనంగా తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ మహేష్.బిగి.తే
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లాలోని ఈరోజు తెలంగాణ రాష్ట్ర పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే ఐపిఎస్ భారత జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చిన భారతదేశానికి తర్వాత తెలంగాణకు స్వతంత్రం రావడం సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం మరియు ప్రజాపాలన దినోత్సవం గా జరుపుకోవడం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను గుర్తిస్తూ ప్రభుత్వం పట్ల ప్రజలు అధికారులు కలుపుకుంటూ ముందుకు సాగించడం ఎంతో గర్వకారణమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య,సి.ఐ లు,ఆర్.ఐ లు, ఎస్.ఐ లు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సెప్టెంబర్ 17, బుధువారం రోజున న్యాల్కల్ మండలంలోని ముర్తుజాపూర్ గ్రామ పంచాయితీ, పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది.తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేయటం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 17న ఆవిష్కృతమైంది. రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్య ప్రస్థానం ప్రారంభమైంది. ఈ శుభ సందర్భంగా ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు… ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి నరేశ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు శ్రీకాత్ , గ్రామ నాయకులు, అజమ్ పటేల్, సిరాజ్ పటేల్, మోహన్ రెడ్డి, రమేశ్ పటేల్, సాల్మన్, దినకర్,ప్రశాంత్ మరియు పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
`పార్టీ మీద అలిగిన సందర్భం పదేళ్లలో కనిపించింది లేదు
`తెలంగాణ కోసమే బీఆర్‌ఎస్ సైనికుల త్యాగాలు
`తెలంగాణకు శ్రీరామ రక్షగా నిలుస్తున్న వారధులు
`తెలంగాణ సారధి కేసీఆర్ ఆచరణలకు సాక్ష్యాలు
`కేసీఆర్ పిలుపుకు సింహనాదాలు
`పార్టీ యంత్రాంగం కోసం ఎదురు చూస్తున్న చకోర పక్షులు
`పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆత్మీయులు
`వారి త్యాగాలే పార్టీకి తరతరాలకు నిదర్శనాలు
`ఇప్పటికైనా పార్టీ నిర్మాణం చేయండి
`అధికారంలో వున్నప్పుడు పార్టీ మీద దృష్టి పెట్టలేదు
`కార్యకర్తలందరూ పార్టీని భుజాల మీద మోస్తున్నారు
`పార్టీ పదవులు అప్పగిస్తే మరో వందేళ్లకు పునాదులు వేస్తారు
`తరతరాల తెలంగాణ చరిత్రకు శ్రీకారం చుడతారు
`కేసీఆర్ కీర్తికి కిరీటాలౌతారు
`కేసీఆర్ ను కొలిచే భక్తులుగా పార్టీకి సేవలు చేసుకుంటారు
ఏ పార్టీలోనైనా సరే నాయకులకు ఒక మాట ఎప్పుడూ మాట్లాడుతుంటారు. అదే..నేను పార్టీకి సామాన్య కార్యకర్తను మాత్రమే. అంటారు. అది నిజమా? కాదు..ముమ్మాటికీ కాదు. ఒక నాయకుడు ఒక కార్యకర్తగా మాత్రమే వుండాలని ఎప్పుడూ కోరుకోడు. మరి కార్యకర్త ఎందుకు ఎల్ల కాలం కార్యకర్తగానే వుంటున్నాడు. ఎదుగూబొదుగూ లేని సంసారం అన్నట్లు ఒక కార్యకర్త జీవితాంతం కార్యకర్తగానే మిగిలిపోయే నాయకులు చాలా మంది వున్నారు. అలాంటి కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు. ఒక్క మాటలో చెప్పాలంటే సైనికులు. పార్టీని ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకునే వాళ్లు. పార్టీ కోసం పని చేయాల్సి వస్తే కుటుంబాన్ని కూడా కాదనుకొని పార్టీ కోసం పనిచేస్తారు. సభలు,సమావేశాలున్నాయంటే వ్యక్తిగత పనులు వదిలేసుకుంటారు. పార్టీ కోసం సమయం కేటాయిస్తారు. మరి వారికేం మిగులుతుంది. అదంతే..ఒక తృప్తి. కార్యకర్త అనే సామాన్యుడికి పార్టీ నుంచి వచ్చేదేమీ వుండదు. ప్రభుత్వాల నుంచి ఒరిగేదేమీ వుండదు. ఆ పార్టీల నాయకులంటే అభిమానం మాత్రమే వారికి వుంటుంది. నాకు కాంట్రాక్టులు ఇవ్వమని కోరడు. ప్రభుత్వ పధకాల అమలలో కూడా త్యాగం చేస్తుంటారు. ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందాలని కోరుకుంటాడు. ఎన్నికలు వచ్చాయంటే చాలు. ఇక తన పనులన్నీ పక్కన పెట్టేస్తాడు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీకోసం పనిచేస్తాడు. ఆ నాయకుడిని గెలిపించేందుకు ఎంతో శ్రమిస్తాడు. ఇటు ప్రచారం సాగిస్తుంటాడు. అటు ప్రత్యర్ధుల ఎత్తులు,పైఎత్తులు, వ్యూహాలను అంచనా వేస్తుంటాడు. లేదా తెలుసుకుంటుంటాడు. పార్టీ నాయకులు చేర వేస్తుంటాడు. మొత్తానికి పార్టీని గెలిపించాలన్న తపనతో పనిచేస్తాడు. ఆఖరుకు పార్టీ గెలిచినా, ఓడినా కూరలో కరివేపాకౌతుంటాడు. ఇదీ స్ధూలంగా ఒక కార్యకర్త జీవితం. నాయకులు బాగున్నావా? అని పలకరిస్తేలు చాలు సంబరపడతాడు. బంతిలో పక్కన కూర్చోబెట్టుకుంటే జీవితాంతం సేవ చేస్తుంటాడు. ఇదీ కార్యకర్త చిత్తశుద్ది. అందుకే నాయకులు పార్టీలు మారినా, కార్యకర్తలు మాత్రం పార్టీకి స్ధిరంగా వుంటారు. ఎంత పెద్ద నాయకుడైనా సరే పార్టీ మారుతంటే వారి వెంట వెళ్లేందుకు అసలైన క్యార్యకర్త ఇష్టపడడు. తన జీవితమంతా పార్టీకోసమే పనిచేస్తాడు. అలాంటి కార్యకర్తలు బిఆర్‌ఎస్ పార్టీకి కొన్ని లక్షల మంది వున్నారు. ఇప్పుడుంటే ఆ కార్యకర్తలు రాజకీయాలు చేస్తున్నారు. కాని బిఆర్‌ఎస్ పార్టీ పెట్టినప్పటినుంచి 2014 వరకు అటు ఉద్యమం చేశారు. ఇటు రాజకీయం చేశారు. రెండు రకాల పాత్రలు పోషించిన బిఆర్‌ఎస్ కార్యకర్తలు నిజంగా ధన్యులు. ఉద్యమమంటే సామాన్యమైన ఉద్యమం కాదు. పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నారు. వారంలో నాలుగు రోజులు బైండోవర్ ఎదుర్కొన్నారు. ఉద్యమం సమయంలో అనేక సార్లు జైలుకెళ్లారు. పోలీసుల దెబ్బలు తిన్నారు. అణచివేతకు గురయ్యారు. పోలీసు చేతుల్లో చిత్రహింసలు అనుభవించిన వాళ్లున్నారు. జీవితంలో కోలుకోలేని పరిస్ధితులను కూడా అనుభవిస్తున్నారు. కాళ్లూ చేతులు విరగొట్టుకున్నవాళ్లున్నారు. రాళ్ల దెబ్బలు తిన్న వాళ్లున్నారు. ఇలా బిఆర్‌ఎస్ తొలి నాళ్ల నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్న కార్యకర్తల్లో చాలా మంది ఆస్దులను పోగొట్టున్నారు. భూములు పోగొట్టుకున్నారు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడారు. నిత్యం దీక్షలు చేశారు. రాస్తారోకోలు చేశారు. ధర్నాలు చేశారు. వంటా వార్పులు చేశారు. సభలు, సమావేశాలకు హజరయ్యేవారు. ఇలా నిత్యం ఉద్యమం కోసం, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లున్నారు. వారిని ఆ సమయంలో తిన్నావా? అని అడిగిన వాళ్లు లేరు. అయినా ఏ ఒక్క నాడు మనసు నొచ్చుకున్న వాళ్లు కాదు. అదీ బిఆర్‌ఎస్‌కు చెందిన కార్యకర్తలు. అలాంటి కార్యకర్తలు ఆ తరం నుంచి నవతరానికి వచ్చినా, వయసు పెరుగుతున్నా కార్యకర్తలుగానే వున్నారు. అలాంటి వారిని గుర్తించాల్సిన అవసరం వుంది. వారిని పార్టీ పరంగా ప్రోత్సహకాలు అందించాల్సి వుంది. పదవులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైన వుంది. 2014 నుంచి పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానించారు. తమకు పదవులు దక్కకపోయినా సహించారు. పార్టీ ఎవరికి పదవులు ఇచ్చినా ఓర్చుకున్నారు. ఎన్నికల సమయంలో టిక్కెట్లు ఎవరికిచ్చినా గెలిపించుకున్నారు. చిన్నా చితక పదువులు కూడా అనేకం త్యాగం చేశారు. కొత్త , పాత కలయికతో కలిసి సాగాలంటే ఒప్పుకున్నారు. కొత్తగా వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నా సహించారు. ఇలా ఎన్నో రకాల త్యాగాలు కార్యకర్తల సొంతం. చెరువు నిండితే కప్పలు చేరినట్లు పార్టీ బాగున్నప్పుడు చాల మంది వచ్చారు. పార్టీలో పదవులు పొందారు. పార్టీ ఓడిపోగానే మళ్లీ వారిదారి వారు చూసుకున్న వారు వున్నారు. ఇప్పటికైనా పార్టీ తేరుకోవాలి. నిజానిజాలు గ్రహించాలి. కొత్త నీరు అవసరమే..కాని మురికి నీరు వద్దన్న సంగతి తెలుసుకోవాలి. పార్టీ ఓడిపోగానే పది మంది ఎమ్మెల్యేలు ఎలా జారుకున్నారో చూశాం..వారికి ఎంత ప్రాధ్యాత కల్పించినా పార్టీని వదిలేశారు. కాని కార్యకర్తలు అలా కాదు. పార్టీ కోసమే పనిచేస్తారు. జీవితంలో అవకాశాలు రాకపోతాయా? అన్న ఆశతో రాజకీయలు చేస్తుంటారు. పార్టీని నమ్ముకొని వుంటారు. వారికి ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం వుంది. బిఆర్‌ఎస్ మీద ఇప్పటికే ఓ అపవాదుంది. పార్టీ నిర్మాణం ఆది నుంచి చేపట్టరు అనే వాదన వుంది. దాన్ని చెరిపేయాల్సిన అసవరం వుంది. పార్టీని కాపాకునేందుకు బలంగా పార్టీ నిర్మాణం జరగాలి. క్షేత్ర స్దాయి నుంచి పదవుల పంపకాలు జరగాలి. భవిష్యత్తులో పార్టీ అదికారంలోకి వచ్చినా పార్టీ యంత్రాంగమే పవర్ పుల్ అనే సంకేతాలిచ్చేలా కార్యకర్తలను గౌరవించాలి. ఇంత కాలం పార్టీకి సేవ చేస్తూ వస్తున్న వారిని వెంటనే గుర్తించాలి. వారి చేత పార్టీ నిర్మాణం జరగాలి. అన్ని స్ధాయిల్లోనూ పార్టీ పదవులు పంపకాలు చేపట్టాలి. పదేళ్లపాటు ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన వారికి పార్టీ సలహా మండలిలో స్ధానం కల్పించాలి. ఇప్పటి వరకు ఏ పదువులు అందని వారిని గుర్తించి పదవులు అందించాలి. అప్పుడు పార్టీకి వచ్చే ఊపు అంతా ఇంతా కాదు. పార్టీలో కనిపించే ఉత్సాహం అంచనా వేయడం కష్టం. అంతలా గులాబీ విరబూస్తుంది. కారు జోరునందుకుంటుంది. ప్రత్యర్ధులు మందు దుమ్మురేపుకుంటూ పరుగులు పెడుతుంది. మరో రెండు దశాబ్ధాల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అసవరం లేకుండా రాజకీయం ముందుకు సాగుతుంది. ఒక్కసారి ఆ దిశగా ఆలోచన చేసి చూడండి. పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టండి. ఇప్పటికైనా కార్యకర్తలు చూపే దారిలో పార్టీని నడపండి. పార్టీ ఓడిపోయి కష్టకాలంలో వున్నా కేసిఆర్‌కు నిజమైన నైతిక స్ధైర్యం అందిస్తున్న ఏకైక వర్గం క్యార్యకర్తలే…ఇది ఎప్పుడూ మర్చిపోవద్దు. కేటిఆర్, హరీష్‌రావులు జిల్లాలకు వెళ్తే ఎగేసుకుంటూ వచ్చి, జేజేలు పలుకుతున్నది కేవలం కార్యకర్తలే. తమ నాయకులు వస్తున్నారని ప్రజలను పోగు చేసి ఉత్సాహంగా తీసుకొచ్చి, సభలు విజయవంతం చేస్తున్నది కార్యకర్తలే. నాయకులకు పూలాభిషేకాలు, పాలాబిషేకాలు చేస్తూ జేజేలు పలికేది కార్యకర్తలే.
తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న
◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
Participated in the meeting organized by Revanth Reddy
హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో స్థానిక నాయకత్వం,ఇంచార్జి లతో సమావేశమై… దిశా నిర్దేశం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.నియోజకవర్గ అభివృద్ది,ప్రజలకు ప్రజా ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ కార్యక్రమాల పై ప్రచార ప్రణాళికలు రూపొందించుకోవాలని, గెలుపే లక్ష్యంగా గల్లీ కార్యకర్త నుండి రాష్ట్ర నాయకత్వం వరకు పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,మంత్రులతో కలిసి తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి వారితో పాటు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.
దారుస్సలాంలో మిలాద్ ఉన్ నబీ కార్యక్రమం పాల్గొన్న జహీరాబాద్ అధ్యక్షులు అథర్ అహ్మద్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఏఐఎంఐఎం ప్రధాన కార్యాలయం దారుస్సలాం లో సమావేశంలో, ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, ఏఐఎంఐఎం జహీరాబాద్ అధ్యక్షుడు మహ్మద్ అథర్ అహ్మద్ కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. తన ప్రసంగంలో, మజ్లిస్ జహీరాబాద్ అధ్యక్షుడు గతంలో మజ్లిస్ ప్రాతినిధ్యం వహించిన సమయంలో చేసిన పనులను సమీక్షించారు మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని అసదుద్దీన్ ఒవైసీ ను అభ్యర్థించారు తన అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ కు ధన్యవాదాలు తెలిపారు.
గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ సభ్యులు రాష్ట్ర మంత్రులైన కొండ సురేఖ, ధనసరి సీతక్క హనుమకొండ, వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల శాసనసభ్యులైన నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కె.ఆర్ నాగరాజు లను మర్యాదపూర్వకంగా కలిసి వారిచే బాపుబాట గాంధీజీ లక్ష విగ్రహాల పోస్టర్ ను ఆవిష్కరింపజేశారు. అనంతరం గాంధీ గురించి శాసనసభ్యులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవితకాల సేవలు భారతదేశ స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గాలను ఉపయోగపడ్డాయని, ప్రపంచవ్యాప్తంగా పౌర హక్కులు, స్వేచ్ఛా ఉద్యమాలకు ప్రేరణగా నిలిచాయని అన్నారు. అక్టోబర్ 10 నుండి 14వ తేదీ వరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగబోయే మహాత్మా గాంధీ జాతీయ సుస్థిర విజ్ఞాన సదస్సును విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ గాంధీ, గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, ఏఐసీసీ కోఆర్డినేటర్ పులి అనిల్, రాష్ట్ర కమిటీ సభ్యులు సంజయ్ రెడ్డి, సాయి చంద్, సంతోష్ రెడ్డి, పలు యువజన కమిటీ నాయకులు పాల్గొన్నారు.
ఎనిమిది గ్రాముల చరస్ పట్టివేత జహీరాబాద్ నేటి ధాత్రి;
జహీరాబాద్,తెలంగాణ, కర్ణాటక సరిహద్దు వద్ద గల చిరాగ్ పల్లి చెక్ పోస్ట్ వద్ద 8 గ్రాముల చారస్ ను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. గోవా నుండి కారులో మాదక పదార్థమైన చారస్ ను హైదరాబాదుకు తరలిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేయగా బయటపడింది. ఢిల్లీకి చెందిన డిఎల్10 సిపి 8245 నంబర్ గల జీపులో తరలిస్తుండగా తనిఖీ చేసి పట్టుకున్నారు. మెదక్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్, నవీన్ చంద్ర సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అండ్ పొల్యూషన్ ఆఫీసర్ ఆదేశాల మేరకు సోమ వారం తనిఖీలు నిర్వహించారు. చారస్ తో పాటు జీప్ను స్వాధీనం చేసుకొని నిందితుడు అమర్జిత్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మరి ఇంత సమాచారం కోసం మన నేటిధాత్రి ఛానెల్ ని ఫాలో చేయండి
*డీపీవో, జహీరాబాద్ డి ఎల్ పీ ఓ లపై పంచాయతీరాజ్ కమీషనర్ కు పిర్యాదు*
◆:- తుంకుంట – మోహన్
*జహీరాబాద్ నేటి ధాత్రి:*
పంచాయతీలే పట్టుకొమ్మలు అనీ అందరు అనుకొంటారు. కానీ అవేవి ఈ అధికారులకు పట్టనట్టు వ్య వహరిస్తున్న తీరు పట్ల జిల్లా పంచాయతీ అధికారి మరియు జహీరాబాద్ డివిజనల్ పంచాయతీ అధికారుల పైన రాష్ట్ర పంచాయతీరాజ్ కమీషనర్ కు పిర్యాదు చేయడం జరిగింది.ఇటీవల పెన్ గన్ మరియు అనేక ప్రత్రికలలో వారిపైన వచ్చిన కథనాలను జోడిస్తూ పిర్యాదు చేయడం జరిగింది. అంతేకాక జహీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు వారి పైన జిల్లా కలెక్టర్ కు వారిపై పిర్యాదు చేయడం జరిగింది.. అంతేకాక రాష్ట్ర ఎస్సి డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తమ్ వారిపై చర్యలు తీసుకోవాలని మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
Complaint to the Commissioner
జహీరాబాద్ నియోజకవర్గం లో ఉన్నటువంటి దళిత సంఘాల నాయకులు సైతం ఈ అధికారుల తీరు మార్చుకోవాలని ప్రజావాణి లో పిర్యాదు చేయడం జరిగింది. ఇటీవల సస్పెండ్ అయినా ఒక బిసి కుల పంచాయతీ కార్యదర్శి కి తిరిగి కొన్ని రోజులకే పోస్టింగ్ ఇచ్చి దళిత జాతికి చెందిన పంచాయతీ కార్యదర్శి లు సస్పెండ్ అయి సంవత్సరమ్ గడిచిన నేటికీ వారికీ పోస్టింగ్ ఇవ్వడం లేదంటే ఈ అధికారులు ఎంత వివక్ష చూపితున్నారో అందరికి అర్ధం అవుతుంది.ఏ కారణం చేత అయినా సస్పెండ్ అయితే ఆరు నెలలకే తిరిగి పోస్టింగ్ ఇవ్వాలి అనీ ఆదేశాల ఉన్నప్పటికీ ఈ అధికారులు పాటించకపోవడము అందరికి విస్మయానికి గురిచేస్తుంది.అంతేకాక దళిత పంచాయతీ కార్యదర్శులపైన ఎవరైనా పిర్యాదు చేస్తే ఈ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి అనీ రిపోర్ట్ లు పంపుతున్నారు. అదే బీసి, ఇతర పంచాయతీ కార్యదర్శులపైన పిర్యాదు చేస్తే మాత్రం పట్టింపు చేయకుండా ఉంటున్నారు అనీ కమీషనర్ పిర్యాదు లో పేర్కొనడం జరిగిందనీ తెలిపారు.ఇటీవల తుంకుంట గ్రామంలో జరిగిన ఒక ఫారెస్ట్ భూమీ పంచాయతీ లో కూడా డివిజనల్ పంచాయతీ అధికారి అయినా అమృత దళితులపైన తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనీ పిటిషనర్ లేఖ లో పేర్కొనడం జరిగింది.
Complaint to the Commissioner
దళితులకు రావాల్సిన భూమినీ రాకుండా తప్పుడు రిపోర్ట్ లు ఇచ్చిన డి ఎల్ పీ ఓ మరియు డి పి ఓ పైన చర్యలు చేసుకొని మా తుంకుంట దళితులకు న్యాయం జరిగే వరుకు పోరాడుతనాని తెల్పడము జరిగింది.అంతేకాక జిల్లాలో దళితులపైన జరుగుతున్న వివక్షత పైన రాష్ట్ర ఎస్సి ఎస్టీ కమిషన్ కు కూడా పిర్యాదు చేస్తానాని దళితుల అభ్యునతి కొరకు పాటుపడుతనాని తెల్పడం జరిగింది.జహీరాబాద్ నియోజకవర్గం లో డివిజనల్ పంచాయతీ కార్యాలయం లేక సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారానీ తెలిపారు. వెంటనే డివిజనల్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసి, గ్రామాలలో నెలకొన్న సమస్యలపైన ద్రుష్టి పెట్టి ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండేటట్లు చేయాలనీ పంచాయతీ రాజ్ కమీషనర్ కు తెల్పడం జరిగిందనీ తెలిపారు. ఇప్పటికైనా ఈ అధికారుల తీరు మారకుంటే ముఖ్యమంత్రి కి పిర్యాదు చేస్తానని తెల్పడం జరిగింది.
రామాయంపేట అభివృద్ధి పథంలో “జనహృదయనేత” సుప్రభాత్ రావు పాత్ర..
రామాయంపేట, సెప్టెంబర్16 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా గత పదేళ్లుగా నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు పేరు రామాయంపేట ప్రజల్లో విశేష గుర్తింపు పొందింది. రాజకీయాల్లో సాధారణంగా పదవులు, వర్గ పరమైన లాభాల కోసం కృషి చేసే నాయకులు ఉన్నారనే అభిప్రాయం ప్రజలలో బలపడుతున్న తరుణంలో, అన్ని వర్గాలను కలుపుకుంటూ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే నేతగా సుప్రభాత్ రావు ప్రత్యేక స్థానం సంపాదించారు.
Development
రామాయంపేటకు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల మంజూరులో ఆయన పాత్ర ప్రధానమని స్థానికులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రామాయంపేట అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ని ఒప్పించి కోట్ల రూపాయల నిధులు విడుదల కావడంలో ఆయన కృషి కీలకమైందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ పథకంను రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రామాయంపేటలో ప్రారంభించడంలో సుప్రభాత్ రావు పట్టుదల నిర్ణయాత్మకమైంది . అంతేకాకుండా రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ స్థాపన కోసం ఆయన చేపట్టిన నిరాహార దీక్ష తర్వాతే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటన చేయడం గమనార్హం. రామాయంపేట అభివృద్ధి దిశగా ఆయన సమన్వయంతోనే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు లు నిధుల మంజూరులో ముందడుగు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రోహిత్ రావు గెలుపులో సుప్రభాత్ రావు పోషించిన పాత్రను కాంగ్రెస్ వర్గాలు ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆయన చేసిన శ్రమ ఆ విజయంలో కీలకమైందని చెబుతున్నారు.
Development
రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలను ముందు ఉంచే నాయకుడిగా, *“జనహృదయనేత”*గా సుప్రభాత్ రావు పేరు రామాయంపేట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. అభివృద్ధి మార్గంలో రామాయంపేటను తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆయన తరచూ చెప్పడం, ప్రజలు ఆయనను ఆశాకిరణంగా భావించడానికి ప్రధాన కారణమవుతోంది. అంతే కాకుండా రామాయంపేట పట్టణ ప్రజలు కలలో కూడా ఊహించని భారీ వరదలు వినాయక చవితి పండుగ రోజున అర్ధరాత్రి పట్టణాన్ని చుట్టుముడితే ప్రజలందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు అధికారులను అప్రమత్తం చేసి తనే స్వయంగా ముందుకు వచ్చి అధికారులకు ధైర్యాన్నిస్టు , ఎమ్మెల్యే కి, ఉన్నతాధికారులకు, ఎప్పటికి అప్పుడు సమాచారం అందిస్తూ ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా.300మంది గిరిజన డిగ్రీ కళాశాల పిల్లలను కాపాడటం పట్ల పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
కంప్యూటర్ ఆపరేటర్ మృతికి సంతాపం తెలిపిన ఎంపీడీఓ ఆపీస్ సిబ్బంది
జహీరాబాద్ నేటి ధాత్రి:
కీర్తిశేషులు ఏలేటి సోమిరెడ్డి తుంగతుర్తి మండలం కంప్యూటర్ ఆపరేటర్ మరణించటం తో అయన చిత్రపటానికి సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎంపీడీవో మంజుల, కార్యాలయంలో ఎంపీడీవో జూనియర్ అసి స్టెంట్ శాస్త్రము, పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ సిబ్బంది పూలమాల వేసి నివాళుఅర్పించి మౌనంపాటించి సంతాపం తెలిప్యారు.
కిడ్నీ రోగుల్లో డయాలసిస్ భయాలు.. అసలు వాస్తవాలు ఇవే..
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రస్తుతం కాలంలో ఒత్తడి, లైఫ్ స్టైల్ కారణంగా కిడ్నీలు ప్రభావితం అవుతున్నాయి. అయితే కొన్నాళ్ల వరకు పెద్ద వయసు ఉండే వారిలో మాత్రమే కిడ్నీలు ఫెయిల్ అవుతాయి అప్పుడే డయాలసిస్ అవసరం అవుతుందని చాలా మంది అనుకునే వారు, కానీ ఇప్పుడు యుక్త వయస్సులో కూడా కిడ్నీల సమస్యలు ఎదురవుతున్నాయి. కిడ్నీల వైఫల్యం ఎదురయితే కిడ్నీ మార్పిడి, డయాలసిస్ విధానమే మార్గం అయితే చాలా మందిలో డయాలసిస్ అంటే చాలా భయాలు నెలకొని ఉంటాయి. లేనిపోని అపోహలకు గురి అవుతుంటారు. అయితే డయాలసిస్ లో అపోహలు, వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవల ఓ అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మరణాలకు దారితీసే మొదటి 10 కారణాల్లో దీర్ఘకాలిక మూత్రపిండా వ్యాధి ఒకటి. ఏడాదికి 10,00,000 మంది రోగులు మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. దీర్ఘకాలికంగా డయాలసిస్ అవసరం అయ్యే రోగుల సంఖ్య 1.75 లక్షలుగా ఉంది. బీపీ, షుగర్, ఇతర జన్యుపరమైన కారణాలు కిడ్నీ ఫెయిల్యూర్ కి కారణం అవుతున్నాయి. ఇది ఏ వయసులో అయినా ఎవరికైనా పురుషులు, మహిళలు, పిల్లలకు రావచ్చు. డయాలసిస్ విధానంలో కిడ్నీలు చేసే పనిని ఓ యంత్రం చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను పిల్టర్ చేయడం ద్వారా మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అయితే డయాలసిస్ వల్ల ఆరోగ్యం క్షీణిస్తుందనే ఆపోహలు ఉన్నాయి. కానీ ఇవన్నీ నిజాలు కాదని నెఫ్రాలజిస్టులు చెబుతున్నారు.
1) డయాలసిస్ అనేది మరణశిక్ష అనేది వాస్తవం కాదు..
డయాలసిస్ అనేది మరణిశిక్ష అని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇది మూత్రపిండాలు పాడయితే మనిషి జీవించేందుకు రెండో అవకాశం లాంటిది. చాలా మంది ప్రజలు దశాబ్ధాలుగా డయాలసిస్ పై జీవిస్తున్నారు. డయాలిసిస్ అనేది సాధారణ విషయం గత 15 ఏళ్లలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న భారతీయుల సంఖ్య రెట్టింపు అయింది. ప్రస్తుతం ప్రతి వంద మందిలో 17 మంది పౌరులు ఏదో ఒక రూపంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు నివేదించారు. భారతదేశంలో డయాలసిస్ చేయించుకుంటున్న రోగుల సంఖ్య ప్రతి సంవత్సరం 10-15% పెరుగుతుంది. ఇందులో ప్రధానంగా పిల్లలు ఉన్నారు.
2) డయాలసిస్ ఉంటే ప్రయాణం చేయకూడదనేది అపోహ మాత్రమే..
డయాలసిస్ ఉన్నవారు ఇంటికే పరిమితం కావాలనేది చాలా మంది భయపెడుతుంటారు. ఆకస్మికంగా, ఇంటికి దూరంగా ప్రయాణం చేయడం కష్టం. అయితే ప్రయాణ స్థలంలో డయాలసిస్ సెంటర్ ను కనుక్కున్నట్లు అయితే ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు వెళ్లిన ప్రాంతంలో కూడా డయాలసిస్ చేయించుకునే అవకాశం ఉంటుంది.
3) ఆహారానికి దూరం కావాలనేది అబద్ధం
కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారు అన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలనేది ఓ అపోహా మాత్రమే. సరిగ్గా డైటీషియన్ చెప్పిన దాని ప్రకారం అన్ని రకాల సంతులిత ఆహారాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. తక్కువ ఉప్పు తీసుకోవడం, నియంత్రిత పొటాషియం, ఫాస్పరస్ ఆహారం, ఎక్కువ ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. కిడ్నీ ఫ్రెండ్లీ ఆహారాన్ని తీసుకోవాలి. దీని తగ్గట్లుగా మీ డాక్టర్, డైటీషియన్ సహాయం చేయగలరు.
4) డయాలసిస్ పై జీవితాన్ని ఎదుర్కోవడం అసాధ్యం కాదు..
డయాలసిస్ తో చాలా ఏళ్లు బతుకుతున్నవారు ఉన్నారు. ముందుగా తమ భయాలను అధిగమించాలి. డయాలసిస్ విధానం గురించి సరైన అవగాహన కలిగి ఉంటే జీవితాంతం ఎలాంటి సమస్యలు లేకుండా బతకవచ్చు. మానసిక ఆరోగ్యనిపుణులు, డాక్టర్లు ఈ విధానం గురించి మీకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయగలరు.
5) క్రీడలు, వ్యాయామంలో పాల్గొనొచ్చు..
డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్లు వ్యాయామం, ఆటలకు దూరంగా ఉండాలనేది అబద్ధం. వ్యాయామం మీ శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. నడక, స్విమ్మింగ్, సైక్లింగ్ (ఇండోర్ లేదా అవుట్), స్కీయింగ్, ఏరోబిక్ డ్యాన్స్, మజిల్స్ కు సంబంధించిన వ్యాయామాలు చేయవచ్చు. అయితే ఏదైనా వ్యాయామాలు ప్రారంభించే ముందు ముందుగా మీ డాక్టర్ని ఒకసారి సంప్రదిస్తే మంచిది. మీ శారీరక ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా నిర్వహించడం మంచిది. ఆరోగ్యంగా, దృఢంగా ఉండటం అనేది డయాలసిస్ ఒత్తిడిని సులభంగా ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది. చక్కని పోషకాహారం తీసుకుంటూ, వ్యాయామం చేయండి. ఆరోగ్యంగా ఉండటానికి మీ రక్తపోటును, రక్త స్థాయిలను పర్యవేక్షించండి.
*2010కి ముందు రిక్రూట్ అయిన టీచర్లకు టెట్ పరీక్ష.*
పంతుళ్లకు కొత్త పరీక్ష!
టెట్ పాస్ కాక ఉద్యోగం ఊస్ట్
సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లలో ఆందోళన.
తమిళనాడులో తప్పని సరి చేస్తే ఒక్క శాతం పాస్ అయ్యారు.
ఏపిలో 50శాతం కూడా పాస్ కాలేదు.
తెలంగాణలో అమలు చేస్తే అంతే సంగతులు!
*ఆ పరీక్ష పెడితే నేను కూడా పాస్ కాకపోవచ్చు. అంటు ఉపాధ్యాయ సంఘ నాయకుడు శ్రీపాల్ ప్రకటన.*
*అప్పీలుకు వెళ్తామని ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం.*
తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి.
*టెట్ పరీక్ష వల్ల 50 వేల మంది ఉపాధ్యాయుల కొలువులు పోవొచ్చు.*
హైదరాబాద్, నేటిధాత్రి:
తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా పంతుళ్ల గొంతులో పచ్చి వెలక్కాయ పడినంత పనైంది. త్వరలో పంతుళ్లకు కొలువుగండం రానున్నది. తెలంగాణలో కనీసం ఓ 50వేల మంది ఉపాద్యాయులు కొలువులు పోయే పరిస్దితి తరుముకొస్తోంది. తాజాగా సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఎంతోమంది ఉపాద్యాయులు కొలువులు రాంరాం కానున్నాయి. సుప్రింకోర్టు తీర్పుతో ఒక్కసారిగా టీచర్లు అయోమయానికి గురౌతున్నారు. ఉక్కిరిబిక్కిరౌతున్నారు. ఇప్పుడేం చేయాలన్నదానిపై సంఘర్షణ పడుతున్నారు. సుప్రింకోర్టే తీర్పు ఇచ్చిన తర్వాత తిరుగేముంటుంది. ఒక వేళ రివ్యూ పిటీషన్ వేసి మళ్లీ సుప్రింకోర్టు తలుపు తట్టినా, అదే తీర్పు రాదన్న గ్యారెంటీ ఏముంది? సహజంగా సుప్రింకోర్టు తీర్పులలో రివ్యూ పిటీషన్లు వీగిపోవడమే జరుగుతుంది. కోర్టుకు వెళ్లి మరోసారి చీవాట్లు తినడంకన్నా, కోర్టు ఆదేశాలను పాటించడమే మేలనుకునే సంఘాలు కూడా వున్నాయి. 2010కి ముందు టీచర్లుగా రిక్రూట్ అయిన వారు తప్పనిసరిగా టెట్ (టీచర్స్ టాలెంట్ టెస్ట్) పరీక్ష రాయాలి. అందులో పాస్ కావాలి. ఈ టెట్ కూడా రెండు రకాలుగా వుంటుంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఒకటి, ప్రైమరీ టీచర్ పోస్టులకు మరోకటి నిర్వహిస్తారు. అలాంటి పరీక్షను ఇప్పుడు 2010 కి ముందు ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు రాయాలి. ఇదీ స్ధూలంగా సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు. గతంలో ఉపాద్యాయ అర్హత పరీక్షకు టెట్ అనేది వుండేది కాదు. కాని 2010 తర్వాత కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున చర్చలు జరిగిన తర్వాతే ఈ నిర్ణయం కేంద్రం ప్రకటించింది. అయితే అప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారి గురించి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. వారిపై నిర్ణయం తీసుకోలేదు. కాని కొత్తగా డిఎస్సీలు రాయాల్సిన ప్రతి అభ్యర్ధి టెట్ రాయడం తప్పని సరి చేసింది. దాంతో క్వాలీటీ టీచర్లు వస్తున్నారన్నది గుర్తించారు. గతంలో కేవలం డిఎస్సీ(డిస్టిక్ట్ సెలక్షన్) జరిగేది. ఇందులో కూడా మరో మతలబు వుండేది. ఏ జిల్లా ఉపాద్యాయులను ఆ జిల్లా పరిషత్ రిక్రూట్ చేసుకునేది. తర్వాత కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో డిఎస్సీ పరీక్ష నిర్వహిస్తున్నారు. అయినా ఆ పేరు ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. ఇప్పుడు టెట్ రాయడం ఉపాధ్యాయులకు సాధ్యమా? అంటే సాద్యం కాకపోవచ్చు? ఎప్పుడో చదువుకున్న పాఠాలను ఇప్పుడు మళ్లీ చదువుకొని పరీక్షలు రాయడం అనేది సాధ్యం కాకపోవచ్చు? అనేదే ఎక్కువగా వినిపిస్తున్న మాట. అయితే టీచర్లు తప్పించుకోవడానికే ఈ పన్నాగం పన్నుతున్నారనేది కొంత మంది వాదన. డిఎస్సీ రాసిన సమయంలో అన్ని రకాల సబ్జెక్టులు చదివి, పరీక్షలు రాశారు. డిఎస్సీ సెలక్టయ్యారు. ఇప్పుడు కూడా ప్రైమరీ,అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో టీచర్లకు ప్రత్యేక సబ్జెక్టు అనేది ఏదీ లేదు. వుండదు. అన్ని రకాల సబ్జెక్టులు చెప్పడానికి సిద్దంగా వుండాలి. చెప్పాలి. కాని ఇప్పుడు పరీక్షలు మేం రాయలేమని టీచర్లు చెప్పడం విడ్డూరంగా వుంది. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు సబ్జెక్టులు చెప్పే టీచర్లలో ప్రత్యేకంగా డీఎస్సీలో ఎంపిక చేసుకున్న సబ్జెక్టులు పాసైన తర్వాతే ఉద్యోగాలు వచ్చాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష రాసే అధ్యాపక అభ్యర్ధులు సైన్‌ను ఎంపిక చేసుకుంటే అందులో మూడు రకాల విభాగాలు వుంటాయి. మ్యాథ్స్ సబ్జెక్టు వారికి ప్రత్యేకంగానే వుంటాయి. సోషల్‌లో కూడా భూగోళశాత్రం, చరిత్ర, పౌరశాస్త్రం, ఆర్ధశాస్త్రం వేరువేరుగానే వుంటాయి. ఈ సబ్జెక్టులు చెప్పగలిగిన టీచర్లు పరీక్షలు ఎందుకు రాయలేరన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. నిజానికి 2010 తర్వాత ప్రతి టీచర్ టెట్ రాయాల్సి వుండేది. కాని ప్రభుత్వాలు అలసత్వం చేశాయి. ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తులను మన్నించాయి. వారికి సహకరించాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రమోషన్లలోకూడా టెట్‌తో పని లేకుండానే వచ్చాయి. ఇప్పుడు అవే గుదిబండగా మారాయి. ఆ సమయంలో ప్రైమరీ స్కూల్ టీచర్ నుంచి ప్రమోషన్ పొందిన వారిలో ఎక్కువ శాతం టీచర్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి బిఈడీలు చేయలేదు. ఆ సమయంలో ఉద్యోగాలు పొందిన వారిలో సింహభాగం టీచర్లు అలగప్పా, అన్నామలై యూనివర్సిటీల నుంచి బీఈడీ చేసిన వారే. అందులోనూ అవి దూరవిద్య బిఈడీలు. అంటే ఆ బీఈడీలు చేసిన ఏ ఒక్క అభ్యర్ధి కాలేజీకి వెళ్లింది లేదు. చదవుకున్నది లేదు. ఇక్కడ మరో విచిత్రమేమిటంటే ఆ యూనివర్సిటీల బీఈడీ చేసిన వాళ్లంతా ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాశారు. కాని ఇప్పటికీ ఆ టీచర్లలలో ఎవరికీ ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదు. కాని ప్రమోషన్లు సంపాదించి ఇంగ్లీష్ బోధిస్తున్నారు. ఇతర సబ్జెక్టులు బోధిస్తున్నారు. అసలు ఆ రోజుల్లో ఇంగ్లీష్‌లో పాస్ కావడమే గొప్ప. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారు తెలుగు మీడియం చదువుకొని, ఇంగ్లీష్‌లో అన్నామలై, అలగప్పా యూనివర్సిటీల దూరవిద్య సర్టిఫికెట్లు పొందారు. అదృష్టం కలిసొచ్చి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అలాంటి వారు చెప్పే చదువుల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధుల భవిష్యత్తు ఎలా వుంటుందో అర్దం చేసుకోవచ్చు. అందుకే మన విద్యా వ్యవస్ధ ఇలా తగలబడిపోయిందని చెప్పడంతో సందేహం లేదు. తర్వాత కాలంలో దూర విద్య బీఈడీలను ఉమ్మడి రాష్ట్రంలో అనుమతించలేదు. దాంతో ఎంతో కొంత నాణ్యమైన చదువును చదువుకున్న ఉపాధ్యాయులు ఆ తర్వాత వచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను నిలబెడుతున్నారు. కాని అలగప్పా, అన్నామలై యూనివర్సిటీల బిఈడీలు చేసిన వారి వల్ల విద్యా వ్యవస్ధ భ్రష్టుపట్టిపోయింది. ఇప్పుడు టీచర్ల యూనియన్లలో నాయకులుగా వున్నవారు ఎక్కువ ఆ బాపతు టీచర్లే అని అంటుంటారు. ందుకంటే వాళ్లు చదువులు చెప్పలేరు. మాటలు చెప్పి పొద్దు పుచ్చుకోగలరు. కాలయాపన చేసి కాలం వెల్లబుచ్చగలరు. నిజం చెప్పాలంటే ఆ తరం అదృష్టవంతులు. వారు చదవు చెప్పలేకపోయిన అడిగిన వారు లేదు. తర్వాత రాజకీయాల్లో దూరి ప్రజలను ప్రభావితం చేసినా పట్టించుకున్న వారు లేదు. అప్పుడే పెరిగిన రియలెస్టేట్ వ్యాపారాలు సాగించి కోట్లు సంపాదించడంతో వారిని చూసి ఇతర టీచర్లు భయపడం మొదలైంది. ఫైనాన్స్ కంపనీలు, చిట్ ఫండ్ వ్యాపారాలు మొదలు పెట్టారు. పిల్లలకు చదువులు చెప్పడం తప్ప అన్నీ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఫలంగా వారికి టెట్ పరీక్ష అంటే ఇబ్బంది పడుతున్నారు. అయితే సుప్రింకోర్టు కూడా ఒక్క వెసులుబాటు కల్పించింది. రిటైర్ మెంటుకు 5 గడువు వున్న ఉపాధ్యాయులను మినహాయించింది. లేకుంటే ఇంకా ఎంత మంది టీచర్లు కొలువులు కోల్పోయేవారు. తమిళనాడు రాష్ట్రంలో టెట్ పరీక్షను రాస్తే అందులో ఒక్క శాతం ఉపాద్యాయులు కూడా ఉత్తీర్ణత సంపాదించలేదని తెలుస్తోంది. ఏపిలో కూడా టెట్ పరీక్ష నిర్వహిస్తే కనీసం సగం మంది ఉపాద్యాయులు పాస్ కాలేదని సమాచారం. ఇప్పుడు తెలంగాణలో టెట్ పరీక్షను ఆ తరం ఉపాధ్యాయులకు నిర్వహిస్తే ఎంత శాతం మంది పాస్ అవుతారో అని దిగులు పడుతున్నారు. అయితే టెట్ పాసైన వారికే ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుందని కూడా సుప్రింకోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఇటీవల ప్రమోషన్లను ప్రకటించినా, ఆ తరం ఉపాద్యాయులు సైలెంటుగా వున్నారు. ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందని గొంతెత్తితే మొదటికే మోసం వస్తుందన్న భయపడ్డారు. గొంతు సవరించుకోవడానికి కూడా ఇష్టపడలేదు. వారికంటే జూనియర్లకు ప్రమోషన్లు వస్తుంటే చూస్తూ వుండిపోయారు. అదే గతంలో అయితే సీనియర్లకు అన్యాయం జరుగుతుందని రోడ్డెక్కేవారు. ప్రమోషన్లు ఎలాగూ పోయాయి. తర్వాత ఉద్యోగాలే పోయే పరిసి ్ధతి వస్తుందా? అని దిగులు చెందుతున్నారు. కాకపోతే కొంత గడువిచ్చి రెండుసార్లు అవకాశం కల్పించాలని కొంత మంది ఉపాద్యాయులు కోరుతున్నారు. కొంత మంది దీనిపై మళ్లీ రివ్యూ పిటీషన్‌కు వెళ్తున్నారు. మరి కొంత మంది ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేని ఈ తిరకాసులు మాకే ఎందుకొని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇది ఎటు దారి తీస్తుందో అని కూడా అనుకుంటున్నారు. ఏది ఏమైనా అన్ని శాఖలు వేరు. విద్యా శాఖ వేరు. రేపటి తరాన్ని తయారు చేసే వ్యవస్ధలో లోప భూయిష్టంగా వుండొద్దు. నాణ్యమైన విద్య అందాలంటే టాలెంటెడ్ ఉపాద్యాయులు తప్పని సరి కావాలి. అందరూ కోరుకునేది ఇదే..!
`ఒంటరిగా పోటీ కాంగ్రెస్‌కు ఎప్పటికైనా లాభం! `సాగిలపడినంత కాలం ఇదే ఫలితం.
`సీట్లు కాంగ్రెస్ అడుక్కోవడం దురదృష్టకరం. `ప్రాంతీయ పార్టీలు ఎదురు తిరిగి మొదటకే మోసం.
`‘‘ఆప్’’ చేతిలో ఇప్పటికే మోసపోయింది. `‘‘మహారాష్ట్ర’’లో పరువు పోగొట్డుకున్నది. `ఉత్తరప్రదేశ్’’ లో ‘‘ఎస్పీ’’ ఇచ్చిన సీట్లు తీసుకున్నది. `‘‘హర్యానా’’లో ‘‘ఆప్’’ మూలంగా ఆగమైపోయింది. `‘‘డిల్లీ’’లో దిక్కు లేకుండా పోయింది. `ఇప్పుడు ‘‘బీహార్’’ లో ‘‘ఆర్జేడీ’’ కూడా ‘‘కాంగ్రెస్’’ ను బెదిరిస్తోంది. `ఒంటరిగా పోటీ చేయడానికి కాంగ్రెస్ భయపడుతోంది. `ఉత్తరాధిలో బలపడకపోతే భవిష్యత్తు ఆగమ్యగోచరం. `ఇప్పటికైనా మేలుకోకపోతే మరో పదేళ్లయినా కోలుకోవడం కష్టం. `‘‘130 ఏళ్ల చరిత్ర’’ పార్టీకి వుంటే సరిపోదు. `అవకాశాలు అందివచ్చినప్పుడు అందుకోకపోతే వెనుకబాటు తప్పదు. `ప్రత్యర్థి బలంగా వున్నప్పుడు జనం ఏది చెప్పినా వినరు. `మూస వాదాలను నుంచి కాంగ్రెస్ బైటకు రాకపోతే జనం గెలిపించరు. `నిజాలు మాత్రమే జనం నమ్మడం లేదు. `నమ్మించగల శక్తి వున్ననాయకులనే నమ్ముతున్నారు. `ప్రాంతీయ పార్టీలకు బలమవుతున్నారు. `దేశ వ్యాప్తంగా బలహీనపడిపోయారు. `జాతీయ పార్టీ పొత్తుల కోసం వెంపర్లాడితే గెలవదు. `ప్రాంతీయ పార్టీల చేతిలో పావుగా మారక తప్పదు.
హైదరాబాద్, నేటిధాత్రి: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతోంది. పార్టీ అన్ని రాష్ట్రాలలో పుంజుకుంటోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గ్రాఫ్ బాగా పెరుగుతోంది. రాహుల్ చెప్పే మాటలను జనం బాగా నమ్ముతున్నారు. ఆయన కోసం జనం సభలకు, ర్యాలీలకు విపరీతంగా వస్తున్నా రు. అయినా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రాంతీయ పార్టీలను ఎందుకు నమ్ముకుంటోంది? ప్రాంతీయ పార్టీల దయా దాక్షిణ్యాల మీద ఎందుకు ఆదారపడుతోంది? ఏ వామపక్షాలనైనతే కాంగ్రెస్‌బలంగా నమ్మిందో ఆ వామపక్షాలు కాంగ్రెస్‌ను నిండా ముంచాయి? యూపిఏ వన్‌లో వామపక్షాలకు కాంగ్రెస్ ఎంతో ప్రాధాన్యత కల్పించింది. అయినా వామపక్షాలు కాంగ్రెస్‌ను నమ్మలేదు. రెండోసారి యూపిఏలో వామపక్షాలు అడుగడుగునా కాంగ్రెస్‌ను మోసం చేస్తూ వచ్చాయి. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాయి. కాంగ్రెస్ అండతో గెలిచిన వామపక్షాలు కాంగ్రెస్‌ను ఒక రకంగా అల్లాడిరచాయి. దేశంలో కాంగ్రెస్ ఈ పరిస్దితి రావడానికి కారణం వామపక్షాలు. ప్రాంతీయ పార్టీలు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడుతారన్నట్లు కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టిన వాపక్షాలు కూడా కనుమరుగై పోయాయి. ఒకప్పుడు దేశంలో కీలకపాత్ర పోషిచిన వామపక్షాలు కాంగ్రెస్ మీద కత్తి దూసి ఆఖరుకు అడ్రస్ లేకుండాపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే బిజేపి ఇంతలా పుంజుకోవడానికి వామ పక్షాలే పరోక్ష కారణం. కాంగ్రెస్ పార్టీ ఉదారతను అలుసుగా తీసుకొని ఆపార్టీని నిర్వీర్యం చేస్తే తాము బలపడతామని వామపక్షాలు భావించాయి. కాని కాంగ్రెస్‌ను ఇబ్బందుల పాలు చేస్తే బిజేపి బలం పెరుగుతుందని ఆలోచించలేకపోయాయి. ఆ తర్వాత దేశంలోనే వామపక్షాలకు ఉనికి లేకుండా పోతాయని కూడా ఊహించలేదు. కాంగ్రెస్ అధికారం లోవున్నంత కాలం ప్రభుత్వం మీద నిరసనలు, ధర్నాలు, బంధులు చేపట్టేవి. మరి ఇప్పుడు పదకొండేళ్లుగా నోరు విప్పడానికి కూడా వామపక్షాలు ధైర్యం చేయలేకపో తున్నాయి. కూర్చున్న చెట్టు కొమ్మ నరు క్కున్న వామపక్షాల పుణ్యమా? అని కాంగ్రెస్ గడ్డు రోజలు తెచ్చుకున్నది. ఇప్పటికైనా కాంగ్రె స్‌పార్టీ తేరుకోవాల్సిన అవసరం వుంది. 130 సంవత్సరాల చరిత్ర వుందని చెప్పుకోవడం కాదు? అప్పటి రాజకీయాలను చూపించే శక్తి తెచ్చుకోవాలి. రాజులైనా, రాజ్యాలైనా పట్టాభిషేకమే కీలకం. రాజకీ యాలైనా, నాయకులైనా పదవులే ముఖ్యం. ఈ విషయం రాహుల్‌గాందీ పదే పదే మర్చిపో తున్నాడు. ఘజనీ లాగా ఎన్నిసార్లు దండయాత్ర చేశాడన్నది ఆదర్శం ఎప్పుడూ కాదు. విఫల ప్రయత్నాలు ఎన్ని సార్లు చేసినా ఉపయోగం లేదు. అవకాశాలను అందిపుచ్చులేని వారు నాయకులుగా పనికిరారు. ప్రజాసేవ అనేది పదవుల్లో వున్నప్పుడే ఎక్కువ చేయగలరు. విసృతమైన సేవ చేయగలరు. నిజం చెప్పాలంటే రాహుల్ గాంధీ 2009లోనే తప్పటడుగు వేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సోనియాగాంధీ ప్రదాని కావాలనుకున్నారు. కాలేకపో యారు. 2009లో కూడా ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశమిచ్చారు. రాహుల్ గాందీ చేజేతులా దానిని జార విడుచుకున్నారు. ఆనాడు ప్రధానిగా పనిచేసి ఐదేళ్లు పాలన చేసి, తర్వాత ఓడిపోయినా మాజీ ప్రదాని అనే గౌరవం వుండేది. కష్టపడకుండానే అన్నీ అవకాశాలు అందినప్పుడు జార విచుకోవడమంత మూర్ఖత్వం మరొకటి లేదు. మంత్రి పదవి వద్దన్న రాహుల్ గాంధీ ఈ పదకొండు సంవత్సరాలలో ఏం సాధించారు. రాజకీయాలు ఏం అవగాహన చేసుకున్నారు. తాను ప్రధాని అయితే ప్రజలకు ఏంచేయలగలను అనేది కూడా ఆయన ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం కోసం అనవసర వృధా ప్రయత్నాలు చేస్తున్నా రు. చరిత్రో పోరాటం చేసి గెలిచిన వారున్నారు. అందివచ్చిన అవకాశాలతో పదవులు అందుకున్నవారున్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించిన వారు కూడా వున్నారు. రాజకీయాల్లో వ్యూహాలకన్నా మిన్నవైనవి ఏమీ వుండవు. వ్యూహాలు లేకపోతే రాజకీయాల్లో ఎప్పటికీ రాణించలేరు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా చేసినంత కాలం పగ్గాలు ఆయన చేతిలో పెట్టలేదు. పగ్గాలు రాహుల్ గాందీ అందుకోలేదు. రాహుల్ గాందీ స్ధానంలో మరే నాయకుడు వున్నా, కాంగ్రెస్‌ను అదికారంలోకి తీసుకొచ్చేవారు. పార్టీ అధ్యక్షుడి పదవే మోయలేని రాహుల్ గాంధీ దేశ బాద్యతను ఎలా నిర్వర్తిస్తారో అర్దం కావడం లేదు. ఎందుకంటే ఆయన నాయకత్వమంతా ఫెయిల్యూర్‌తోనే మొదలౌతోంది. ఫెయిల్యూర్ కాంగ్రెస్ మూట గట్టుకుంటోంది. పదేళ్ల కాలంలో కాంగ్రెస్ గెలిచింది వుందా? కాంగ్రెస్‌ను రాహుల్ గెలిపించాడన్న భావన పార్టీలో వుందా? ఆయన వ్యూహాలన్నీ అపజయాలుగానే మిగిలిపోతున్నాయి. ఇంకా నాలుగేళ్ల తర్వాత రాజకీయాలు ఎలా వుంటాయో తెలియవు. ఈసారి కూడా రాహుల్ గాంధీ తన పంథాను మార్చుకోలే కపోతే దేశంలో కాంగ్రెస్ ప్రజలకు మరింత దూరమవడం ఖాయం. దేశంలో ప్రజలు బిజేపిని గెలిపిస్తున్నారంటే, మరో ప్రజలకుమరో ప్రత్యా మ్నాయం కనిపించడం లేదు. రాహుల్ గాందీ మీద ప్రజలకు నమ్మకం కుదరడం లేదు. ఇప్పటికీ రాహుల్ విషయంలో చిన్న పిల్లల చేష్టలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది మానుకోవాలి. హుందాగా రాజకీయాలు చేయడం అలవర్చుకోవాలి. ముఖ్యంగా ఇప్పటికైనా సరే ప్రాంతీయ పార్టీలకు దూరంగా వుండాలి. ఎన్నికల తర్వాత పొత్తులకు పోవాలే తప్ప, ఎన్నికలుముందు పొత్తులే కాంగ్రెస్‌ను నిండా ముంచేస్తున్నాయి. ఒక్కసారి గత ఐదారేళ్లుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తుంటే, ప్రాంతీయ పార్టీలను నమ్మి బొక్కా బోర్లా పడుతూ వస్తోంది. తన కాళ్ల మీద తాను కాంగ్రెస్ పార్టీ నిలబడలేకపోతోంది. ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ ఇచ్చే సీట్ల మీద ఆదారపడి రాజకీయం చేయడం కాంగ్రెస్ దురదృష్టకరం. 80 లోకసభ సీట్లులో 15 సీట్లు ఇస్తే చాలనుకుంటే కాంగ్రెస్ నాయకులు ఏం కావాలి. వారి రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి. పార్టీలు చీలితే బిజేపి బాగు పడుతుందన్న భ్రమ నుంచి కాంగ్రెస్ బైటకు రావాలి. కాంగ్రెస్‌ను బలోపేతం చేసుకోవాలి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ఫ్రధాన కారణం ఆప్. అదే ఆప్‌తో సక్యత వల్ల కాంగ్రెస్‌కు మరింత నష్టమే మిగిలింది తప్ప లాభం జరగలేదు. నిజానికి 2013లో ఆప్‌కు డిల్లీలో మద్దతు ఉపసహంరించుకోవడం కాంగ్రెస్ చేసిన మొదటి తప్పు. తర్వాత ఆప్ కోసం చేతులు చాప డం కాంగ్రెస్ చేసిన రెండో తప్పు. అక్కడితో ఆగకుండా పదేపదే ఆప్ కోసం తన రాజకీయాన్ని కాంగ్రెస్ కోల్పోతూ వచ్చింది. హర్యానాలో గెలవాల్సిన కాంగ్రెస్‌ఎందుకు ఓడిపోయింది. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేని కారణంగానే అదికార బిజేపి విజయాలు సొంతం చేసు కుంటోంది. ప్రతిపక్షాల మధ్య లుక లుకలు ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టు కొస్తున్నాయి. డిల్లీ మాజీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైలు కు పంపించినప్పుడు ఆయనకు మద్ద తుగా కాంగ్రెస్ నిలిచింది. తర్వాత హర్యానా ఎన్నికలకు ముందు ఆప్‌తో కలిసి బిజేపికి వ్యతిరేకంగా ప్రచా రం సాగించింది. ఆఖరుకు ఎన్ని కలు దగ్గర పడి టికెట్ల పంపకాలలో తేడా వచ్చింది. ఆప్ జెల్లకొట్టి కాంగ్రెస్‌కు హాండ్ ఇచ్చింది. దాంతో మళ్లీ హర్యానాలో మూడోసారి బిజేపి గెలిచింది. హాట్రిక్ సాధిం చింది. అదే సమయంలో కాంగ్రెస్, ఆప్‌లు సర్ధుకుపోతే అధికారం దక్కేది. కాని కలిసి సాగలేదు. అది డిల్లీలో కూడా బిజేపి అదికా రంలోకి రావడానికి కారణ మైంది. ప్రతి చోట కాంగ్రెస్ మీద ఇతర ప్రాంతీ య పార్టీలు ఆదిపత్యం వహించా లనే చూస్తున్నాయి. తాజాగా బిహార్ లో నిన్నటి వరకు మహాగట్‌బం దన్‌లో భాగంగా ఆర్జేడీ కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రచారం చేస్తూ వచ్చిం ది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అక్కడ దృష్టిపెట్టింది. ఎలాగైనా సరే బిజేపిని, జేడీయూకు అధికారానికి చరమగీతం పాడాలని రాహు ల్ గాందీ ఎంతో కృషి చేస్తూ వస్తున్నారు. అందులో భాగం గా ఓట్ చోరీ అనే విషయాన్ని పెద్దఎత్తున జనంలోకి తీసుకెళ్లారు. బీహార్ సాక్షిగా ఎన్నికల సంఘం మీద పెద్దఎ త్తున ఆరోపణలు చేశారు. 65లక్షల ఓట్ల గల్లంతుపై న్యాయం పోరాటం చేస్తున్నా రు. ప్రజల్లో వుంటూ చైతన్యా న్ని రగిలిస్తున్నారు. తీరా ఎన్ని కల తేదీ ప్రకటన దగ్గరకు వచ్చేసరికి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ అన్ని సీట్లలో పోటీ చేస్తామంటూ బాంబు పేల్చారు. ఇలా ప్రాంతీయ పార్టీలను నమ్ముకొని పదేళ్లుగా రాజకీయం చేసినా ఎదు గూ బొదులేదు. ఇలా తమ శ్రమను ప్రాంతీయపార్టీలకు వృదా చేయడం కన్నా, పార్టీని బలోపేతం చేసుకోవడం ఎంతైనా అవసరం. బిజేపిని ఓడిరచాలన్న లక్ష్యంతో ప్రాంతీయ పార్టీలను పెంచి పోషిస్తున్నారు. అయినా కాంగ్రెస్ మీద ఆ పార్టీలకు కృతజ్ఞత వుండడం లేదు. అందుకే ఇక నుంచైనా ఒంటరి పోరు మీద దృష్టిపెట్టండి. అదే పార్టీని గట్టెక్కిస్తుంది.
గత ఏడాది కంటే రూ.472 కోట్లు అధికంగా బ్యాంకుల బడ్జెట్.
ఇందులో పంట రుణాలకు రూ. 1140 కోట్లు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.
జడ్చర్ల/ నేటి ధాత్రి.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని రైతులకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2148 కోట్ల రుణాలను బ్యాంకుల ద్వారా ఇవ్వనున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. ఈ మొత్తం రుణాలలో రూ.1140 కోట్లను పంట రుణాలకు కేటాయించగా.. మిగిలిన రూ.1008 కోట్లను వ్యవసాయ సంబంధిత రంగాలకు ఇస్తారని వివరించారు. నియోజకవర్గంలో గత ఏడాది వానాకాలంలో కంటే ఈ ఏడాది ఖరీఫ్ లో పంటల సాగు పెరిగిందని, దాని ప్రకారంగా యూరియా వాడకం కూడా పెరిగిందని చెప్పారు. వర్షాలు బాగా కురిసి, రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేసిన నేపథ్యంలో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా బ్యాంకుల ద్వారా పంట రుణాలను సరళీకృత విధానంలో అందించాలని అధికారులను కోరామని సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అనిరుధ్ రెడ్డి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2024-25 లో నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన రైతులకు రూ. 1290 కోట్లను పంట రుణాలుగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, వివిధ కారణాలతో ఈ లక్ష్యంలో రూ. 867 కోట్లను మాత్రమే రైతులకు పంపిణీ చేసారని చెప్పారు. అయితే ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైతులకు రుణాలను సరళీకృత విధానంలో అందించాలని, పంట రుణాలతో పాటుగా వ్యవసాయ సంబంధిత రంగాలకు, వ్యవసాయ యాంత్రీకరణకు మరింత అధికంగా రుణాలను ఇవ్వాలని కోరామని అన్నారు. గత ఏడాదిలో పంట రుణాలతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకులు రూ.1676 కోట్ల రుపాయల బడ్జెట్ ను కేటాయించగా ఈ ఏడాది దానికంటే రూ.472 కోట్లు అధికంగా రూ.2148 కోట్ల బడ్జెట్ ను కేటాయించారని వెల్లడించారు. ఈ మొత్తం బడ్జెట్లో జడ్చర్ల మండలానికి రూ.1024 కోట్లు, మిడ్జిల్ మండలానికి రూ.283 కోట్లు, నవాబుపేట మండలానికి రూ.361 కోట్లు, బాలానగర్ మండలానికి రూ.190 కోట్లు, ఊర్కొండ మండలానికి రూ.186 కోట్లు, రాజాపూర్ మండలానికి రూ.102 కోట్లు చొప్పున బ్యాంకుల బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగిందని అనిరుధ్ రెడ్డి వివరించారు. అలాగే ఈ ఏడాది పంట రుణాల కోసం నియోజకవర్గం మొత్తానికి రూ.1140 కోట్లను కేటాయించగా వీటిలో జడ్చర్ల మండలానికి రూ.482 కోట్లు, మిడ్జిల్ మండలానికి రూ.166 కోట్లు, నవాబుపేట మండలానికి రూ.235 కోట్లు, బాలానగర్ మండలానికి రూ.104 కోట్లు, ఊర్కొండ మండలానికి రూ.108 కోట్లు, రాజాపూర్ మండలానికి రూ.43 కోట్లు చొప్పున ఇవ్వనున్నట్లు విపులీకరించారు.
పెరిగిన పంటల సాగు..యూరియా వాడకం:
జడ్చర్ల నియోజక వర్గంలో గత ఖరీఫ్ సీజన్ లో కంటే ఈ ఖరీఫ్ సీజన్లో పంటల సాగు బాగా పెరిగిందని, ముఖ్యంగా వరి, మొక్కజొన్న పంటల సాగు గణణీయంగా పెరిగిందని అనిరుధ్ రెడ్డి తెలిపారు. గత సంవత్సరం వానాకాలంలో 24,773 ఎకరాల విస్తీర్ణం లో మొక్క జొన్న పంట సాగు చేయటం జరిగిందని, అయితే ఈ సంవత్సరం 41,160 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేయటం జరిగిందని చెప్పారు. అదే విధంగా గత సంవత్సరం వరి పంట 61,708 ఎకరాల్లో సాగు చేయగా ఈ సంవత్సరం ఇప్పటివరకు 68,069 ఎకరాలలో నాట్లు వేయటం జరిగిందన్నారు. మొక్కజొన్న, వరి పంటల్లో యూరియా వాడకం అదికంగా ఉండటంతో నియోజకవర్గంలో యూరియాకు డిమాండ్ పెరిగిందని, పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా యూరియాను సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్ మొత్తానికి 9 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరిపోయిందని, అయితే ప్రస్తుతం 14 వ తేదీ నాటికే 9,134 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించగలిగామని వివరించారు. నియోజకవర్గ రైతులకు అవసరమైన యూరియాను పూర్తి స్థాయిలో కేటాయించేలా అధికారులతో సమన్వయం చేసుకొని, జిల్లాకు యూరియా రేక్ వచ్చినప్పుడల్లా జడ్చర్లకు ఎక్కువ యూరియాను తీసుకురావడానికి కృషి చేస్తున్నానని అనిరుధ్ రెడ్డి తెలిపారు.
ఆలయాన్ని సందర్శించే ఆసుపత్రిని మర్చిపాయె??? మర్రి చెట్టుకున్న విలువ మనుషుల ప్రాణాలకు లేకపాయే??? పక్కనుండే వెళ్లిపోయినా ప్రజలు ఇక్కట్లను గుర్తు చేయని కోటరీ.. బురద నీటితో ఉన్న ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడకపోవటంలో ఆంతర్యం ఏమిటీ సమయం లేకనా.. సమాచార లోపమా????
నేటి ధాత్రి అయినవోలు :-
అయినవోలు మండల కేంద్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఐలోని మల్లికార్జున స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన శివాలమర్రి గా పేరుపొందిన 200ఏళ్ల నాటి మర్రిచెట్టు నేలకొరిగింది. ఇదే విషయంపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను మరియు దేవాదాయ శాఖ అధికారుల సమాచారం మేరకు ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు హుటాహుటిన టెక్సబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు తో కలిసి అట్టి శివాల మర్రి స్థలాన్ని సందర్శించారు. అన్ని శాఖల సమన్వయంతో నేలకొరిగిన ప్రతిష్టాత్మకమైన శివాలమర్రి ని మళ్లీ పున ప్రతిష్టాపన చేస్తామని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే అదే అయినవోలు మండలంలో కురుస్తున్న గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా వర్షం నీరు రెండు గేట్ల వద్దనే నిలిచిపోయి లోపలికి వెళ్లేందుకు రోగులు ఇబ్బందులు పడుతున్నారని పత్రికల్లో కథనాలు ప్రచురితం అవుతున్న కూడా ఎమ్మెల్యే పట్టించుకోకుండా వెళ్లిపోవడం విమర్శలకు తావిస్తోంది. మర్రిచెట్టు నేలకొరిగింది అనగానే హుటాహుటిన బయలుదేరి వచ్చిన ఎమ్మెల్యే అదే మండల కేంద్రంలో ప్రజల ఆరోగ్యాలను కాపాడే ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే రోగులకు ఇబ్బందులు పడుతున్నారు. ఇట్టి విషయాన్ని స్థానిక నేతలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడంలో విఫలమయ్యారా. అంటే రోగులకు ఇక్కట్లు తలెత్తుతున్నాయన్నా కూడా ఎమ్మెల్యే అటువైపు కన్నెత్తి చూడలేదు అంటే ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారనే చెప్పాలి.ఏది ఏమైనా ఒక చెట్టుకు ఇచ్చిన విలువ మనుషుల ప్రాణాలను కాపాడే ఒక ఆసుపత్రికి ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అక్టోబర్ 16,17,18 తేదీలలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే 5 వ ఓపెన్ అండర్ 23 అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా అథ్లెటిక్స్ కాంపిటీషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి,స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శ్రీ శివసేన రెడ్డి,రాష్ట్ర అథ్లెటిక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి వరద రాజేశ్వర్ రావు,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్,జిల్లా క్రీడా శాఖ అధికారి అశోక్ , జాయింట్ సెక్రటరీ సారంగం తదితరులు ఉన్నారు.
మాజీ మునిసిపల్ కౌన్సిలర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన
◆:- మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్:సోమవారం నాడు, పట్టణంలోని వార్డ్ నెంబర్ 2, వాస్తవ్యులు మాజీ మునిసిపల్ కౌన్సిలర్ శ్రీమతి.తహెరా బేగం గారు పరమపదించారన్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డా౹౹ఏ.చంద్రశేఖర్ జహీరాబాద్ పట్టణంలోని ఈద్గా వద్ద నిర్వహించిన అంతఃక్రియలలో పాల్గొని వారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు,హన్మంత్ రావు పాటిల్ మాక్సూద్ అహ్మద్ పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు,కాంగ్రెస్ నాయకులు ఖాజా భాయ్ నాయీమ్ గౌసోద్దీన్ పాండురంగ రెడ్డి ,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పెన్షన్ల పెంపు కోసం రామడుగు మండలం తహశీల్దార్ కార్యాలయం ముట్టడించిన విహెచ్పిఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు
రామడుగు, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వికలాంగుల పెన్షన్ నాలుగు వేల నుండి ఆరువేలకు పెంచాలని, వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు నేత, గీత, బీడీ కార్మికులతో పాటు మిగితా పెన్షన్ దారుల పెన్షన్ రెండు వేల నుండి నాలుగు వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వికలాంగుల హక్కుల పోరాట సమితి (విహెచ్పిఎస్) మరియు చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి (సిపిహెచ్పిఎస్) ఆద్వర్యంలో రామడుగు మండల తాహశీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మహాధర్నాను చేపట్టడం జరిగింది. ఈసందర్భంగా విహెచ్పిఎస్ నాయకులు మర్రి కుమార్ చిమ్మల్ల శ్రీనివాస్, జనార్దన్ లు మాట్లాడుతూ పెన్షన్ దారులకు ఇచ్చిన మాటకు కట్టుబడిలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులు రుణమాఫీ, భూస్వాములకు రైతుబంధు ఇచ్చిన రేవంత్ నిస్సహాయ స్థితిలో ఉన్న పెన్షన్ దారుల పెన్షన్లు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. దొరలు, భూస్వాములు, సంపన్నుల పక్షాననే రేవంత్ ఉన్నారు తప్ప పేద వర్గాల పక్షాన లేడు అనేది పెన్షన్ దారుల విషయంలో రుజువైందన్నారు. నాలుగు వేల పెన్షన్లు సరిపోక వికలాంగులు, రెండు వేల పెన్షన్లు సరిపోక వృద్దులు వితంతువులు మరియు ఇతర చేయూత పెన్షన్ దారులు గోస పడుతుంటే రేవంత్ రెడ్డిలో కనీసం చలనం లేదన్నారు . ఏదిక్కు లేని పెన్షన్ దారులకు న్యాయం చేయలేని రేవంత్ రెడ్డికి తెలంగాణను పరిపాలించే అర్హత లేదన్నారు. మాట ఇచ్చి ఇరవై రెండు నెలలు దాటినా ఇంకా నిలబెట్టుకోక పోవడం రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి నిదర్శనమని, ఇకనైనా తీరు మార్చుకొని తక్షణమే అన్ని రకాల పెన్షన్లు పెంచాలని, నూతన పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ దారుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈనెల 21 నుండి 26 వరకు అన్ని గ్రామ పంచాయితీల వద్ద దీక్షలు చేపడతామని హెచ్చరించారు. పెన్షన్లు పెంచుడో లేదా రేవంత్ దిగిపోవుడో ఏదో ఒకటి తేల్చుకుంటామని హేచ్చరించారు. ధర్నా అనంతరం తహశీల్దార్ రాజేశ్వరికి వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో బెజ్జంకి అనిల్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు, కొత్తూరి రాజన్న మాదిగ, ఎమ్ఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు బత్తిని అంజయ్య, విహెచ్పిఎస్ నాయకులు జట్టిపల్లి రామవ్వ, అమీనా బేగం కవిత జరీనా, శ్రీపాద మహేష్ చారి, జోగిని రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.