రవికే వరంగల్‌ సీటు.

https://epaper.netidhatri.com/

`హరికోట్ల వైపే అధిష్టానం మొగ్గు.

`పుష్కలంగా మంత్రి పొంగులేటి ఆశీస్సులు.

`విద్యార్థి దశలోనే కాంగ్రెస్‌ లో క్రియాశీలకం.

`సామాజిక సేవ రవికి ఎంతో ఇష్టం.

`సమాజ చైతన్యానికి రవి ప్రాధాన్యం.

`తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకం.

`ప్రజాసేవ కోసం ఉద్యోగం వదులుకోవడానికి సిద్ధం.

`ఉమ్మడి వరంగల్‌ ప్రజలకు సుపరిచితం.

`ఉద్యోగ సంఘాల సహకారం.

`పేదల అభ్యున్నతి కోసం రవి ఆరాటం.

`అట్టడుగు వర్గాల సంక్షేమం రవి లక్ష్యం.

`వరంగల్‌ అభివృద్ధి కోసం రవి రాజకీయం.

`గతంలోనే ఓసారి అవకాశం.

`ఈసారి కలిసి రానున్న కాలం.

హైదరబాద్‌,నేటిధాత్రి:

అవకాశాలు ఎవరికీ చెప్పి రావు. కొన్ని సార్లు వెతుక్కుంటూ వస్తాయి. అని మనకు తెలుస్తుంటాయి. ఆ అవకాశాలను ఒడిసిపట్టుకున్న వారు విజేతలుగా నిలుస్తుంటారు. అలా అని అందరికీ అవకాశాలు రావు. కేవలం కొందరికే అవి సొంతమౌతాయి. సమాజం మీద ప్రేమ, పేదల అభ్యున్నతి కోసం పాటపడాలన్న సుగుణాలున్న వారిని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సామాజిక సేవ కోసం పరితపించేవారి కోసం కదలి వస్తాయి. అవకాశాలు కలిసొచ్చినా కొన్ని సార్లు కాలం కలిసి రాకపోవచ్చు. కాలం కలిసి వచ్చినా సరైన అవకాశాలు ఎదురుకాకపోవచ్చు. కాని ఏక కాలంలో రెండూ కలసి వచ్చే వారు కొందరే వుంటుంటారు. వారే ప్రజల్లో త్వరగా గుర్తింపు పొందుతారు. ఉన్నత స్ధానాలకు చేరుకుంటుంటారు. పేదల జీవితాలలో వెలుగులు నిండాలని, నింపాలని తపన పడే హరికోట్ల రవి లాంటి వారికి కోసం అన్నీ కలిసివస్తాయి. ఎందుకంటే పేదల జీవితాలలో వెలుగు నింపే హరికోట్ల ‘రవి’ అవుతారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరంగల్‌లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులపై సర్వత్రా ఆసక్తి నెలకొన్ని వుంది. ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నా, ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన జిల్లా రిజిస్ట్రార్‌ హరికృష్ణ కోట్ల ముందజలో వున్నట్లు తెలుస్తోంది. ఆయనకు అధిష్టానం ఆశీస్సులు మెండుగా వున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా ఆయనకు జిల్లాలో మంచిపేరున్నది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి మంచి అనుబంధం కూడా వుంది. అందువల్ల సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే రవికే టిక్కెట్‌ దక్కుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడైనా వరంగల్‌ నుంచి పోటీ ఎక్కువగా వుంటుంది. ఈసారి అంతకన్నా ఎక్కువగా వున్నప్పటికీ పోటీ పడాలనుకుంటున్న అభ్యర్ధులు సైతం హరికోట్ల గురించే చర్చించుకుంటున్నారు. ఆయన రాజకీయాలపై సీరియస్‌గా వున్నారంటే మాత్రం మనం ఆశలు వదిలేసుకోవాల్సిందే అని అనుకుంటున్నారట. ఎలాగైనా కాంగ్రెస్‌ నుంచి రవికే టిక్కెట్‌ దక్కే అవకాశాలున్నందున ఆయనకు సహకరించడా లేక, అంతకన్నా బలంగా ప్రయత్నం చేయడమా? అన్నది కొందరు తేల్చుకోలేకపోతున్నారట. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే రవికి ఈ టికెట్‌పై హమీ వున్నట్లు సమాచారం.
బీఆర్‌ఎస్‌ను ఢీ కొనాలంటే ఖచ్చితంగా బలమైన అభ్యర్ధి కావాలి.
అందరిలోనూ తలలో నాలుకలా వుండే అభ్యర్ధిని ఎంచుకోవాలి. జిల్లా ప్రజలకు ఎంతో సుపరిచితమైన వ్యక్తి కావాలి. ప్రజల్లో మంచి గురింపున్న నాయకుడు కావాలి. ప్రతిపక్షాలు కూడా వెలెత్తిచూపించకుండా వుండేలా అభ్యర్ధి కావాలని అనుకుంటున్న కాంగ్రెస్‌కు హరికోట్ల రవి అందుకు సరైన ఎంపిక అని అనుకుంటున్నారట. దాంతో ఇప్పటికే ఆయనకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన క్షేత్ర స్దాయి పనులు చక్కదిద్దుకుంటున్నట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఒక వేళ రవికే టికెట్‌ ఇస్తే తాము ఆశలు వదులుకోవాల్సిందే అని బిఆర్‌ఎస్‌, బిజేపిలు కూడా అనుకుంటున్నాయి. వరంగల్‌ పార్లమెంటు నియోకవర్గం నుంచి రవి ఎంపిక సరైందే అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. రవి ఎంపిక వల్ల కాంగ్రెస్‌కు చాలా అంశాలు గెలిచేందుకు ఉపయోగపడతాయి. ఎందుకంటే హరికోట్లరవి ఉన్నత విద్యావంతుడు. చిన్న పల్లెటూరు నుంచి కష్టపడి ఉన్నత స్ధానానికి చేరుకున్న వ్యక్తి. యువతకు ఆదర్శ ప్రాయుడు. ఉద్యోగ నిర్వహణలో కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. అన్ని పార్టీల నేతలు కూడా ఆయనతో ఎంతో సన్నిహితంగా వుంటారు. ఎక్కడా వివాదాలు లేవు. ఉద్యోగ సంఘ నాయకుడుగా కూడా ఆయనకు మంచి పేరుంది. అంబెద్కర్‌ వాదిగా ఆయనను ఎంతో గౌరవిస్తారు. అంబెద్కర్‌ భావజాలాన్ని సమాజంలోకి ఎంతో బలంగా తీసుకుపోయిన నాయకుడు రవి. సమాజంలో చైతన్యం నింపేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల జీవితాలను ప్రభావితం చేయడంలో ఆయన ఎంతో కృషి చేస్తారు. సామాజిక సృహ కల్గిన నేతగా సమాజ చైతన్యం కోసం అనేక ప్రజా సంఘాలతో కూడా కలిసి పనిచేసిన అనుభవం రవిది. అందువల్ల అన్ని వర్గాల ప్రజలు, సంస్ధలు, ఉద్యోగ సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలుకూడా రవిని ఆదరిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. హరికోట్లరవి ఇటీవల రాజకీయంగా ఎంతో క్రియాశీలకంగా కనిపిస్తున్నారు. వరంగల్‌ఎస్సీ రిజర్వు స్ధానం కావడం, జిల్లాలో అన్ని ప్రాంతాలనుంచి, అన్ని వర్గాల నుంచి మంచి సానుకూల దృక్పధం వుండడంతోపాటు, ఇంకా ఎంతో సుధీర్ఘమైన ఉద్యోగ జీవితం వున్నప్పటికీ సమాజ సేవ కోసం ఆయన పడే తపను గుర్తించి కాంగ్రెస్‌పార్టీ టికెట్‌ ఇచ్చేందుకు సానుకూలంగా అందని సమాచారం.
మంత్రి పొంగులేటితో రవికి మంచి అనుబంధం వుంది.
గతంలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్నారు. 2014 ఎన్నికల్లో మదిర నుంచి పోటీ చేసేందుకు సిద్దపడ్డారు. పొంగులేటి 2014 ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేశారు. ఆయన ఆంతరంగికులను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించారు. గెలిపించుకున్నారు. అదే సమయంలో వైసిపి నుంచి రవిని పోటీ చేయమన్నారు. కాని అప్పటికి పూర్తి స్ధాయిలో నిర్ణయం తీసుకోవడంలో కొంత జాప్యం జరిగింది. లేకుంటే అప్పుడే హరికోట్ల ఎమ్మెల్యేగా గెలిచి వుండేవారు. తర్వాత ఉద్యోగ నిర్వహణలో బిజీగా వున్నారు. మళ్లీ ఇంత కాలానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయాలల్లో క్రియాశీలమకయ్యారు. ఆయన చెప్పినట్లే ఖమ్మంనుంచి బిఆర్‌ఎస్‌ను అసెంబ్లీ గేటు తాకనివ్వనని చేసిన శథపం కూడా ఫలించేలా ప్రయత్నం చేశాడు. ఎంతో కష్టపడి జిల్లాను కాంగ్రెస్‌ను కంచుకోటగా చేసిన నాయకుడు మంత్రి పొంగులేటి. అలాంటి నాయకుడి ఆశీస్సులు దండిగా వున్న నాయకుడు రవి. అటు పార్టీ పెద్దల దీవెనలు, మంత్రి పొంగులేటి ఆశీస్సులతో హరికోట్లరవికి టికెట్‌ ఖాయంగానే కనిపిస్తోంది.
హరికోట్ల స్వస్ధలం ఖమ్మం జిల్లాం ముదిగొండ మండలం మల్లారం గ్రామం.
పేద దళిత కుబుంబంలో జన్మించిన రవి చిన్న తనం నుంచి ఎంతో చురుకైన విద్యార్ధి. పట్టుదలో ఎంతో కష్టపడి చదువుకున్నారు. ఉన్నత విద్యలు పూర్తిచేసుకున్న తర్వాత సబ్‌ రిజిస్ట్రార్‌ ఉద్యోగంలో చేరారు. ఉద్యోగ జీవితంతోపాటు సామాజికబాధ్యతన నిర్వర్తించారు. అంబెద్కర్‌, పూలే స్పూర్తితో ఆయన ముందుకు సాగారు. ఉమ్మడి వరంగల్‌తో ఆయనకు ఎంతో అనుబంధం వుంది. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే, మరో వైపు నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఒక దశలో మహబూబాద్‌ నుంచి ఆయన ట్రాన్స్‌ఫర్‌ సందర్భంలో ప్రజలు ఆయనను ఘనంగా వీడ్కోలు పలకడం ఒక గొప్ప ఉదాహరణ. ప్రస్తుతం ఆయన ఉమ్మడి వరంగల్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తూ, ఉద్యోగులు బాగోగుల బాధ్యతలు కూడా మోస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ ఉద్యోగులు రాష్ట్ర కన్వీనర్‌గా కూడా వున్నారు. అంతే కాకుండా గతంలో మాల ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడుగా కూడ రవి పనిచేశారు. పేద విద్యార్దులకు చదువుల కోసం నిరంతరం తన వంతు సాయం అందిస్తూ వుంటారు. తెలంగాణ ఉద్యమంలో రవి ఎంతో కీలకభూమిక పోషించారు. ముఖ్యంగా కరోనా విపత్తు సమయంలో రవి అనేక మందికి సహయ సహాకారాలు అందించారు. ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచారు. దాంతో రవికి ప్రజల్లో మంచి పేరుంది. పేదల పెన్నిదిగా ఆయనను ప్రజలు కొలుస్తుంటారు. తన శక్తికి మంచికూడా కరోనా సమయంలో ఎన్నో కుటుంబాలను ఆదుకున్నారు. వారి జీవితాలు నిలబెట్టారు. అటు అన్ని వర్గాలలో సత్సంబందాలు, ప్రజల్లో ప్రేమాభిమానాలు రవి సొంతం చేసుకున్నారు. అలాంటి రవికి వరంగల్‌ టికెట్‌ కేటాయిస్తున్నారని తెలిసి ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన గెలపుకోసం కృషి చేస్తామని యువత చెబుతోంది.

ఆంధ్రాలో ‘‘రాజన్న బిడ్డ’’ దే ‘‘రాజ్యం’’

https://epaper.netidhatri.com/

`మూడో ముఖ్యమంత్రి ‘‘షర్మిలే’’

`ఉభయ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్‌ చేతిలోనే.

`ఆంధ్రలో షర్మిలకు తెలంగాణ కాంగ్రెస్‌ పూర్తి సహకారం.

`రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోనే ఆంధ్రాలో కాంగ్రెస్‌కు పునర్వైభవం.

`షర్మిల తెలంగాణ రాజకీయాలలోకి వచ్చినప్పుడు రేవంత్‌ సూచన.

`ఇప్పుడు రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోనే ఆచరణ.

`తెలంగాణలో కాంగ్రెస్‌ నీ అధికారంలోకి తెచ్చాడు.

`ఆంద్రలో కాంగ్రెస్‌కు మళ్ళీ ఉపిరిపోస్తున్నాడు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

రాజకీయాలు చాలా విచిత్రమైనవి. ఒక నాడు అన్న కోసం త్యాగం చేసిన చెల్లె, ఇప్పుడు అన్నతోనే పోరాటం చేయాల్సివస్తోంది. ఒకనాడు అన్న అన్యాయం జరిగిందని అన్న పక్షాన నిలబడి కొట్లాడిన చెల్లె ఇప్పుడు అన్నతోనే కొట్లాడాల్సి రావడం విచిత్రం. అన్నకు అధికారం కోసం ఆరాపడిన చెల్లె, ఇప్పుడు అదే అన్నను గద్దె దించేందుకు పోరాటం చేస్తోంది. ఇలాంటి సందర్భాలు బహుషా ప్రపంచ చరిత్రోలనే ఎక్కడా జరిగి వుండకపోవచ్చు. రాజుల కాలంలో ఏమైనా జరిగాయో? ఏమో కాని ప్రజాస్వామ్యం పురుడు పోసుకున్న తర్వాత ఎక్కడా జరిగిన ధాఖరలాలు లేవు. ఒక దశలో నాకు ఎలాంటి రాజకీయ పదవులు అవసరం లేదని చెప్పిన షర్మిలనే తెలంగాణ రాజకీయాలకు వచ్చి భవిష్యత్తులో నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నేడు నేనెందుకు ముఖ్యమంత్రి కావొద్దని అనుకుంటోంది. నేనెందుకు రాజకీయాలు శాసించకూడదనుకుంటోంది. సరిగ్గా రెండేళ్ల క్రితం షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు ఆమె అన్న వదిలిన బాణమే అన్నారు. ఆ తర్వాత అన్న సహాకారంలో కేసిఆర్‌ వదిలిన బాణం అన్నారు. మరి కొంత కాలానికి బిజేపి వదిలిన బాణం అన్నారు. కాని ఆమెకు మాత్రమే తెలుసు. తనకు తాను నాయకురాలిగా నిరూపించుకునేందుకు ఎక్కడో అక్కడ నిలడాలనుకున్నారు. నిలిచి రాజకీయం చేయాలనుకున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కొవాలనుకున్న సామెతను ఇప్పుడు నిజం చేస్తున్నారు.
ఆంధ్ర రాజకీయాల్లో ఒక్కసారిగా మెరుపు మెరిసినట్లు మెరుసింది షర్మిల.
ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో చక్రం తిప్పే స్ధితికి చేరుకున్నది. అయితే ఇదంతా కేవలం ఆమె రాజశేఖరరెడ్డి బిడ్డ కావడం వల్లనే అన్నది కొందరి వాదన. కాని నిజానికి షర్మిల ఒక పోరాట యోధురాలు. దాంతో ఇప్పుడు జరుగుతున్న చర్చను ఓసారి గమనిస్తే ఆంధ్రాలో రాజన్న బిడ్డదే రాజ్యమా! అన్నదే వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ పిసిసి అధ్యక్షురాలిగా ఆమె పేరు ప్రకటించిన తర్వాత విజయవాడ మొత్తం జన సందోహంతో నిండిపోయింది. కాంగ్రెస్‌ జెండాలు చాలా కాలం తర్వాత రెపరెపలాడాయి. విజయవాడ మొత్తం కాంగ్రెస్‌ మయమైంది. నిజానికి ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం మారిపోతుందని ఊహించేలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ వుంది. ఆ పార్టీకి అధ్యక్షుడు వున్నాడు. కాని గత పదేళ్ల కాలంలో ఆ పార్టీకి మనుగడ లేదు. నాయకుల ఉనికి లేదు. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎక్కడా డిపాజిట్లు కూడా రాలేదు. ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్‌ విభజించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేదు. కాకపోతే ఇంత తొందరగా ప్రజలు మళ్లీ కాంగ్రెస్‌ జెండాలు పట్టుకుంటారని కూడా ఎవరూ అనుకోలేదు. అది కూడ షర్మిల రావడం మూలంగా జరిగిందే తప్ప, సోనియా గాంధీ వచ్చినా జెండా ఎగిరేదికాదు. పది మంది జనం రోడ్లపైకి వచ్చేవారు కాదు. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో షర్మిల రాక సునామీ తలపిస్తోందంటున్న వాళ్లు కూడా వున్నారు. అందుకేఉ ఆంధ్రప్రదేశ్‌ మూడో ముఖ్యమంత్రి షర్మిలే అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఒకనాడు కాంగ్రెస్‌ను వదిలి జగన్‌ వెంట వెళ్లిన వాళ్లుంతా, మళ్లీ షర్మిల కోసం రావడం అంటేనే కాంగ్రెస్‌కు పాత రోజులు వచ్చినట్లే లెక్క. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌ జెండా ఎగరవేయ బోతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఇక కాంగ్రెస్‌ చేతిలోనే వుండబోతున్నాయి. షర్మిలకు తెలంగాణ నుంచి పూర్తి సహాకారం అందేందుకు అన్ని రకాల హమీలు కూడా వున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం రావడానికి కూడా కసరత్తు జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చింది రేవంత్‌రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌కు కూడా ఊపిరిపోయనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఒకనాడు అన్నకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, పోరాటం చేసిన వనిత షర్మిల.
ఓదార్పు యాత్రలో వున్న అన్న జగన్‌ను అప్పటి ప్రభుత్వం అన్యాయంగా జైలుకు తరలించిందని ఓదార్పు యాత్ర చేపట్టింది. ఆ తర్వాత బస్సు యాత్ర చేసింది. తదనంతరం అన్న కోసం పాదయాత్ర చేసింది. అన్నను అధికారంలోకి తీసుకురావడానికి దశాబ్ధ కాలంపాటు అహర్నిషలు కృషి చేసింది. జనంలో వున్నది. అన్న కోసం పనిచేసింది. అన్నను ముఖ్యమంత్రి చేయాలిని కంకణం కట్టుకున్నది. 2014 ఎన్నికల ముందు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రచారం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ ప్రచారం చేసింది. కాని వైసిపికి 2014లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారం దక్కలేదు. అయినా జగన్‌ నిరుత్సాహపడలేదు. షర్మిల కూడా అలసిపోలేదు. 2019 ఎన్నికల్లో అన్న కోసం మళ్లీ ప్రచారం చేసింది. 2019 ఎన్నికల్లోనే షర్మిల పోటీ చేస్తుందని అందరూ అనుకున్నారు. కాని చేయలేదు. 2019లో కూడా విశాఖపట్నం నుంచి షర్మిల పోటీ చేస్తుందనుకున్నారు. చేయలేదు. అంతకు ముందు 2014లో విజయమ్మ విశాఖపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో షర్మిల కీలక భూమిక పోషిస్తుందనుకున్నారు. కాని జరగలేదు.
ఉన్నట్లుండి షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చింది.
తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసింది. మళ్లీ 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీచేస్తానని చెప్పింది. అక్కడ ఇల్లు కూడా నిర్మాణం చేసుకున్నది. ఖమ్మం జిల్లాలో పెద్ద రాజకీయ సభ ఏర్పాటుచేసింది. ఆ సభ కూడా ఎంతో విజయవంతమైంది. దాంతో షర్మిల తెలంగాణ రాజకీయాల్లో కీలకభూమిక పోషిస్తుందని అందరూ అనుకున్నారు. కాకపోతే షర్మిల తెలంగాణ రాజకీయాలు చేయడం ఎవరికీ సుతారం ఇష్టం లేదు. తెలంగాణ నా మెట్టినిల్లు ..అసలైన ఇల్లు అని ఎంత చెప్పుకున్నా ఆమెను పెద్దగా జనం నమ్మలేదు. పాదయాత్ర సందర్భంగా ఆమెకు ప్రజలు బాగానే వచ్చినా ఎక్కడో ఆమెకు నమ్మకం కలగలేదు. ఇదే సమయంలో తెలంగాణలో అన్ని పార్టీలతోనూ ఆమె గిచ్చి కయ్యం పెట్టుకున్నట్లే వ్యవహరించారు. దాంతో ఆమెను ఎవరూ నమ్మేందుకు సిద్దం కాలేదు. ఆఖరకు ఆమె పార్టీని ఎవరికీ జెండా పీకేశారు. అయితే ఇదంతా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం చేయడంకోసం చేసిన రిహార్సల్‌ అని చాలా కాలం తర్వాత జనాలకు అర్ధమైంది. తెలంగాణలో ఆమె పరోక్షంగా కాంగ్రెస్‌కు సహరించింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టింది. ఏది ఏమైనా ఆమె అనుకున్న దారిలోనే ప్రయాణం చేస్తున్నట్లు మాత్రం అర్దమౌతోంది.
అన్నను బలంగా ఢీ కొట్టాలంటే బలమైన శత్రువుతో చేతులు కలిపి వెళ్తేనే కొట్టలను అనుకున్న షర్మిల కాంగ్రెస్‌ పంచన చేయడం ఎవరూ ఊహించిందికాదు.
శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సూత్రం ఇక్కడ వర్కవుటైంది. ఈ విషయంలో మాత్రం రాజశేఖరరెడ్డి రాజకీయాన్ని ఆమె మరోసారి చేసి చూపించిందని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆమెకు ఒక్క ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ బలమే కాదు, తెలంగాణ కాంగ్రెస్‌ మద్దతు కూడా సంపూర్ణంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారం పూర్తిగా ఆమెకు వుంది. ఈ బలమంతా ఆమెకు ఎంతో ఉపయోగపడుతుంది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు కూడా చాలా మంది షర్మిలకు సహకారం అందిస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే జగన్‌కు ఎట్టి పరిస్ధితిల్లోనూ సహకారం అందించలేరు. కాని షర్మిలకు అందించేందుకు అవకాశం వుంది. ఏదో రకంగా ఆ కుటుంబానికి సాయం చేసే అవకాశం రావడం మాకు అదృష్టం అనుకునే నాయకులు కూడా చాలా మందే తెలంగాణ కాంగ్రెస్‌లో వున్నారు. ఇది ఆమెకు ఎంతో ఉపయోగపడుతుంది. భవిష్యత్‌ ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాలను ఆమె ఏలుతుందని చెప్పడంలో సందేహం లేదు.

తెలంగాణ బిజేపిలో పెద్దలే గద్దలా?

https://epaper.netidhatri.com/

బలంగా వున్న పార్టీని బలహీనం చేస్తున్నదెవరు?

ఆదిపత్యపోరుకు ఆజ్యం పోస్తుందెవరు?

అసలైన నాయకులను కాదని ఇతరులను అందలమెక్కిస్తున్నదెవరు?

క్రమశిక్షణకు తూట్లు పొడుస్తున్నదెవరు?

బిజేపిలో టికెట్ల బేరానికి తెరలేపిందెవరు?

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు!

పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నా పట్టింపులేనిదెందుకు?

పార్టీ ఆంతరంగిక సమావేశాలకు బైటి వ్యక్తుల ఎలా వచ్చారు?

మల్కాజిగిరి నియోజకవర్గ స్థాయి సమావేశంలో క్యాడర్‌ ఆగ్రహానికి కారకులెవరు?

మేం వేరు..మా పార్టీ వేరు. మాకు క్రమశిక్షణ ఎక్కువ. దేశం కోసం..ధర్మం కోసం పనిచేసే ఏకైక పార్టీ బిజేపి. అని పదే పదే చెప్పుకునే బిజేపి కూడా అన్ని సంప్రదాయ రాజకీయ పార్టీల లాగానే మారుతోందా? ప్రత్యేక సుగుణాలు మాయమౌతున్నాయా? ఎంత కాలమైనా పార్టీ కోసమే పనిచేస్తామన్న భావన నాయకుల్లో మాయమౌతోందా? కొత్తగా వచ్చిన వారిని అందలమెక్కించి, ఇంత కాలం పార్టీకి సేవ చేసిన వారిని పక్కన పెడుతోందా? అందులో ఎవరి పాత్ర ఎంత? ఎవరెవరి లెక్కెంత? వారి లక్కెంత? అన్నవి కూడా చూసుకునేదాకా వచ్చిందా? అంటే అవుననే అంటున్నారు. బిజేపిలో కూడా సంప్రదాయ రాజకీయాలు వచ్చి చేరినట్లు చాలా మంది కరడుగట్టిన బిజేపి వాదులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు పార్టీ కోసం పది మంది పనిచేసినా వంద మందితో సమానమైన రాజకీయం పనిచేసేవాళ్లు. పది మంది బిజేపి నాయకులు ఉద్యమం చేసినా రాజకీయ ప్రకంపనాలు కనిపించేవి. దేశమంతా బిజేపి బలపడుతోంది. తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. అనేక రాష్ట్రాలలో అధికారంలో వుంది. గుజరాత్‌ లాంటి రాష్ట్రంలో వరుసగా ఏడు సార్లు అధికారంలో వుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఉత్తరాధిన తిరుగులేని శక్తిగా అవరతరించింది. కాని దక్షిణాధిన ఎందుకు ఎదగలేకపోతోంది. ఎందుకు బిజేపి జెండా రెపరెలపాడకుండాపోతోంది. ఎదిగినట్లే ఎదిగి ఎందుకు చతికిలపడుతోంది. దేశంలోనే బిజేపి అంత బలంగా లేని కాలంలో హైదరాబాద్‌, తెలంగాణలో ఎంతో బలంగా వుండేది. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం కొట్లాట హైరాబాద్‌, తెలంగాణ నుంచే మొదలైందని ఎంత మందికి తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో బలంగా వున్న బిజేపి తెలంగాణ ఏర్పాటు తర్వాత మరింత బలపడకుండా ఎందుకు అక్కడే వుంది. గతం కన్నా ప్రజలు ఎంతో గొప్పగా బిజేపిని ఆదరిస్తున్నారు. ఊరూర స్వచ్ఛందంగా బిజేపిలో చేరుతున్నారు. బిజేపి కోసం పనిచేస్తున్నారు. కాని నాయకుల్లో మాత్రం సఖ్యత లేదు. పార్టీ ఎదగాలన్న కసి వారిలో లేదు. ప్రశ్నించే తనం లేదు. ఎదిరించే తత్వం లేదు. కేవలం కూర్చున్న దగ్గర గుర్రాలు మలపడం అందరూ నేర్చుకున్నారు. ఇదే సగటు బిజేపి కార్యకర్త పడుతున్న మనోవేధనకు నిదర్శనం.
తెలంగాణ బిజేపిలో పెద్దలే గద్దలా? అన్న చర్చ బలంగా సాగుతోంది. పార్టీలో పెత్తనం చేస్తున్నవాళ్లు ఎంత మంది వున్నారో అందరికీ తెలుసు. పార్టీ కోసం పనిచేస్తున్నవారిని ఎవరు పక్కన పెడుతున్నారో తెలుసు. ఎవరు పార్టీలోనే కుయుక్తులు పన్నుతున్నారో ప్రజలు బాగానే గమనిస్తున్నారు. అందుకే గత శాసన సభ ఎన్నికల్లో పార్టీ కోసం పని చేస్తారని నమ్మిన వారిని గెలిపించారు. పార్టీ కోసం పని చేస్తున్నట్లు నటిస్తున్న వారిని పక్కన పెట్టారు. అందులో బలమైన నాయకులుగా తమకు తాము గొప్పలు చెప్పుకున్న వాళ్లు కూడా వున్నారు. అందుకే వాళ్లంతా ఓడిపోయారు. కొత్త అభ్యర్ధులు గెలిచారు. ప్రజల్లో వున్న వా ళ్లు గెలిచారు. మీడియా పులులను మాత్రం ప్రజలు వద్దనుకున్నారు. బిజేపి కార్యకర్తలు కూడా కాదనుకున్నారు. అందుకే వాళ్లు ఓడిపోయారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. వారికి ఇంకా ఎదరులేకుండా చేసుకోవాలనుకుంటున్నారే గాని, పార్టీ తిరుగులేని శక్తిగా ఎదగాలనుకోవడం లేదు. వాళ్లు బలపడితే పార్టీ బలపడినట్లే అని భ్రమ పడుతున్నారు. వారి కుర్చీలు కాపాడుకునే ప్రయత్నమే చేస్తున్నారు. మిగతావారిని బలహీనులను చేస్తున్నారు. అంతే కాదు చాలా మంది బలమైన బిజేపి నాయకులను పార్టీ కార్యాలయం మెట్లు కూడా ఎక్కకుండా చేస్తున్నారు. ఇది అంటున్నవారు సాక్ష్యాత్తు పార్టీ కోసం అహర్నిషలు పనిచేస్తున్న నిస్వార్ధపరులైన కార్యకర్తలు. ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ నిలదీయడం బిజేపి క్యాడర్‌కు బాగా తెలుసు. అందుకే బిజేపి క్యాడర్‌, పెద్ద నాయకులు తప్పులను కూడా ప్రశ్నిస్తుంది. ఇదే బిజేపికి పెద్ద బలం. అయితే అలా ప్రశ్నించేవారిని పక్కనపెట్టి, పెద్ద నాయకులుగా చెలామణి అవుతున్నవారి అనుచరులకు, అనుయాయులకు మాత్రమే పార్టీలో ప్రాధాన్యత లభించేలా చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పెద్దలే ఎంతో బలంగా వున్న పార్టీని బలహీన పరుస్తున్నారు.
గల్లీ స్దాయి నుంచి పార్టీ కోసం పని చేస్తున్నవారిని డిల్లీ స్దాయి నాయకులు గుర్తిస్తున్నారే గాని, రాష్ట్ర స్ధాయి నాయకులు మాత్రం అలాంటి వారిని వద్దనుకుంటోంది. అలాంటి నాయకులు వస్తే, రాష్ట్ర స్ధాయిలో వారి పరపతికి గండి పడుతుందని భయపడుతున్నారు.. ఆదిపత్య పోరుకు ఆజ్యం పోస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌లో వున్న పరిస్దితులు ఇప్పుడు బిజేపిలో కనిపిస్తున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కనీసం ఏడాదిన్న పాటు కూడా పనిచేయని పి.వి. నర్సింహారావు దేశానికి ప్రధాన మంత్రిగా ఐదేళ్లపాటు పనిచేశారు. దేశాన్ని పాలించేంత శక్తియుక్తులున్న నాయకుడిని ఆనాడు రాష్ట్రంలో రాజకీయాలు చేయనీయలేదు. సరిగ్గా ఇంత కాలానికి తెలంగాణ బిజేపిలో అలాంటి పరిస్ధితులే కనిపిస్తున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్ల పంపకాలను చూస్తేనే బిజేపిలో ఏం జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో బిజేపి,జనసేన పొత్తు సాగింది. అసలు తెలంగాణలో జనసేనకు నాయకులెక్కడిది. అసలు ఆపార్టీకి క్యాడరేది. పార్టీ నిర్మాణమేది. ఆంధ్రప్రదేశ్‌లోనే దానికి నీడ లేదు. కాని తెలంగాణలో జనసేత పొత్తుతో సాగారు. అంత వరకు బాగానే వుంది..గాని టిక్కెట్ల విషయంలో బిజేపి నేతలను, జనసేనలోకి పింపించి టిక్కెట్లు ఇవ్వడం ఏమిటో? ఎవరికీ అంతు పట్టలేదు. అంటే ఏం జరిగింది? సంప్రదాయ రాజకీయ పార్టీల బాటలో బిజేపి నడుస్తుందన్న సంకేతాలు పింపినట్లు కాదా? ఆయా స్దానాలలో బిజేపికి కోసం ఎంతో కాలంగా పనిచేస్తున్న వారిని కాదని టిక్కెట్లు ఎవరికి ఇచ్చారో తెలియందా? ఎంత చేతులు మారాయో? అన్న చర్చ నిజం కాదా? అసలైన నాయకులను కాదని ఇతరులను అందలం ఎక్కించడం లేదా? కేవలం పెద్దలుగా చెలామణి అవుతున్న వారి అనుచరులకు మాత్రమే పదవులు వస్తున్నాయి. వారికే ప్రాదాన్యతనిస్తున్నారు. దాంతో బిజేపిలో క్రమశిక్షణకు తూట్లు పడుతున్నాయన్న ఆందోళన వ్యక్తమౌతోంది. బిజేపిలో కూడా టిక్కెట్ల బేరాలా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. బిజేపిలో టిక్కెట్ల బేరం పై ముక్కున వేలేసుకుంటున్నారు? పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్నా ఎవరికీ పట్టింపు లేదు.
కాని తమకు సంబంధించిన వాళ్లను మాత్రం ఎన్నికల్లో నిలిపేందుకు, వారికి టిక్కెట్లు ఇప్పిందుకు, ప్రజల్లో మరోసారి పార్టీని పలుచన చేసేందుకు, వారి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటిదే ఇటీవల జరిగిన మల్కాజిగిరి పార్లమెంటరీ స్ధాయి క్యాడర్‌ సమావేశం. ఆ సమావేశానికి ఎవరు హజరయ్యారు? పార్టీకి సంబంధించిన వాళ్లు కాకుండా బైటి వక్తులు ఎలా హజరయ్యారు. వేదిక మీద ఎలా కూర్చున్నారు. వారిని తీసుకొచ్చిందెవరు? అసలు బిజేపి సభ్యత్వం లేని వాళ్లతో ఆంతరంగిక సమావేశాలు జరగడం ఎంత వరకు సమంజసం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీకి సంబంధం లేని వ్యక్తులు హటాత్తుగా సమావేశంలోకి రావడం, వేదిక మీద కూర్చోవడాన్ని బిజేపి క్యాడర్‌కు నచ్చలేదు. వెంటనే ప్రశ్నించారు. అందుకు సహకరించిన నాయకులను నిలదీశారు. వారి నిర్ణయాలను అక్కడే ఎండగట్టారు. దాంతో వారు వేదిక దిగి వెళ్లిపోయారు. ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు ఎన్నో త్యాగాలు చేస్తే నాయకులైన వారు తమకు వ్యతిరేక గళం వినిపించగానే సభా వేదిక వదిలేసి వెళ్తారా? ఇదేనా వాళ్లు నేర్చుకున్న సంస్కారం. పార్టీ అంటే ఒక కుటుంబం. తప్పు చేసిన వారిని నిలదీస్తారు. ఒకనాడు అలా నిలదీసే తత్వంతోనే వాళ్లు నాయకులయ్యారు. ఇప్పుడు నిలదీతను జీర్ణించుకోలేకపోతున్నారు. అంతే కాకుండా తమను ప్రశ్నిస్తే మేం వుండమని వెళ్లిపోయేంత క్రమశిక్షణా రాహిత్యం కూడా అక్కడ కనిపించింది. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది…క్యాడర్‌ ఆగ్రహానికి కారణమేమిటి? అన్నదానిపై డిల్లీ పెద్దలు దృష్టిపెడితే రాష్ట్ర పార్టీ నాయకుల బాగోతాలు అన్నీ బైటకొస్తాయి.

మీ నోరు పడిపోయిందా…

https://epaper.netidhatri.com/

`మేడిగడ్డ జీవగడ్డ అని చెప్పలేరా..

`కాంగ్రెస్‌ ప్రచారం అబద్దమని అనలేరా…

`బిఆర్‌ఎస్‌ నేతలకు అవగాహన లేదా..

`మాకేం అవసరమని ఊరుకుంటున్నారా..

`కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అధ్యయనం చేయండి.

`అసలు నిజాలు ప్రజలకు చెప్పండి.

`ఇల్లు కడితేనే ఇబ్బందులు వస్తాయి.

`ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకుంటామా

ఉద్యమ కాలంలో అన్నీ కేసిఆరే చూసుకుంటాడు. అధికారంలో వున్న నాడు అన్నీ కేసిఆరే చూసుకుంటాడు. సమస్యలొస్తే కేటిఆర్‌, హరీష్‌రావులు పరిష్కరిస్తారు. ఎన్నికల్లో టికెట్లు ఇస్తారు. గెలిపించేందుకు ఫండిరగ్‌ ఇస్తారు. నియోజకవర్గాల వారిగా వెళ్లి ప్రచారం చేస్తారు. అభ్యర్ధుల గెలపుకోసం వారి వారి నియోకవర్గాలు కూడా వదిలి పార్టీ అభ్యర్ధులను గెలిపించేందుకు కృషి చేస్తారు. మిమ్మల్ని నాయకులను చేస్తారు. మీకు పదవలు కల్పిస్తారు. ఇది చాలు..మీకు అంతకన్నా ఏం కావాలి. పాలకులైతే ఏలుతారు.. ప్రతిపక్షంలో వుంటూ నోరు మూసుకుంటారు..అదే కార్యకర్తల మీద అయితే అరుస్తారు. మీకు నచ్చని కార్యకర్తలను వేదిస్తారు. జెండాలు మోసేవారిని ద్వేషిస్తారు. పార్టీకి ఇబ్బందులొస్తే పట్టించుకోరు. పార్టీ కష్టకాలంలో వుంటే ఆదుకోవాలని ప్రయత్నం చేయరు. పార్టీని ఇతర పార్టీలు ప్రశ్నిస్తుంటే ఎదురు ప్రశ్నించలేరు. వెచ్చగా వుంటే పంటాం..పచ్చగా వుంటే తింటాం…అనుకునే నాయకుల మూలంగానే బిఆర్‌ఎస్‌ పార్టీ ఇంత దాకా వచ్చింది. ఇప్పటి దాకా మాకేమిస్తారు..మాకేమిస్తారు అని అడిగన వాళ్లు ఏనాడైనా పార్టీకి మేమేమిచ్చామని ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకోవాలి. బిఆర్‌ఎస్‌ పార్టీ పాలక పక్షం నుంచి ప్రతిపక్షంకు చేరుకున్నది ఎందుకో తెలుసా? ప్రజల నుంచి ఆనాడు ఎన్ని విమర్శలు వచ్చానా ఎమ్మెల్యేలు మారారా? మారాలన్న ఆలోచైనా చేశారా? చెప్పిన వారిని శత్రువులుగా చూస్తిరి. అడిగిన వారిని దూరం పెడితిరి. ఇప్పుడు పార్టీని ముంచి కాలక్షేపం చేస్తుంటిరి. మళ్లీ పార్టీ ఎలా నిలబడాలి..ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అని నిత్యం కేటిఆర్‌, హరీష్‌రావులు మళ్లీ కాళ్లకు బలపం పట్టుకొని తిరిగేలా చేస్తిరి. ఉద్యమ కాలంలో వెలుగు వెలిగిన నేతలే, అధికారంలో వున్న పదేళ్లు వెలుగుల్లోనే వున్నారు. పార్టీ ఓడిపోయిందని చాటుకు వెళ్లకండి. ఎందుకంటే ఈ చీకటి కొద్ది కాలమే…ప్రజల గుండెల్లో వున్నది బిఆర్‌ఎస్‌ పార్టీయే…ప్రజలు కావాలనుకుంటున్నది కేసిఆర్‌నే…అధికారంలో వున్న కాంగ్రెస్‌ పార్టీ అసత్యాలను నమ్మకండి. వారు చేసే కుయుక్తుల్లో పడకండి. పదేళ్లపాటు ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వంలో సాగిన పాలనతో తెలంగాణ ఎంత అభివృద్ది చెందిందో చెప్పండి. పల్లెల్లోకి వెళ్లండి. బావుల్లో నీళ్లు చూపించండి. బోర్లలో నీళ్లు చూపించండి. ఇదంతా కేసిఆర్‌ పుణ్యం కాదా? అడగండి. మళ్లీ పాత రోజులు వచ్చేందుకు కనీసం ఇప్పుడైనా ఓడిపోయిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పదువులు పొందిన వాళ్లంతా ప్రజల్లోకి రండి. ముఖ్యంగా కాళేశ్వరం విజయాలు చెప్పండి. అసలు కాళేశ్వరం అంటే ఏమిటో ప్రజలకు వివరించండి. కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలు చెబుతున్న విషయాలు ఎలా అసత్యాలో నిరూపించండి.
ఎందుకంటే కాళేశ్వరం అన్నది ఒక బృహత్తరమైన ప్రణాళక. తెలంగాణకు జీవనాడి…అది చాలా మందికి అర్ధం కావడం లేదు. మేడిగడ్డను మేడి పండు అంటూ కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజలకు నీళ్లు ఇవ్వలేమని తెలిసి, కేసిఆర్‌ ను, బిఆర్‌ఎస్‌ను అప్రతిష్టపాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు. అసలు మేడిగడ్డ అంటే మేడి పండు కాదు..తెలంగాణకు మేడిగడ్డ ఒక జీవగడ్డ. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అన్నది గొప్ప జలయజ్ఞం. కాంగ్రెస్‌ చెబుతున్న కట్టుకథల్లో ఏ మాత్రం నిజంలేదు. తాజాగా కాంగ్రెస్‌ నేతలు కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలు బిఆర్‌ఎస్‌ నేతలకు కూడా అర్ధం కావాల్సిన అవసరం వుంది. ఓ వైపు నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ కింద క్రాప్‌ హాలీడే ప్రకటించారన్న విషయం తెలిసందే. మరి అలాంటి ప్రాంతానికి ఎస్‌ఆర్‌ఎస్పీ నుంచి చివరి కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేటలకు నీళ్లు వస్తున్నాయని అంటున్నారు. కాళేశ్వరం నీళ్లు కాదని ప్రజలను, రైతులను మభ్యపెడుతున్నారు. వాటిని అమాయకులైన ప్రజలు నమ్మే ప్రమాదముంది. అసలు కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ ప్రాజెక్టు మాత్రమే కాదు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులతోనే పూర్తయ్యేది కాదు. శ్రీపాద ఎల్లంపల్లి, మేడరం జలాశయం, మధ్య మానేరు, ఎగువ మానేరు ప్రాజెక్టుల అనుసందానం. వాటికి తోడుగా మధ్య మానేరు, అనంతసాగర్‌ రిజర్వాయర్‌, రంగనాయక్‌ సాగర్‌, కొండ పోచమ్మ సాగర్‌, మల్లన్నసాగర్‌, శామీర్‌పేట చెరువు ఇలా చెప్పుకుంటూ పోతే ఒడిచే ముచ్చట కాదు. అంత పెద్దది కాళేశ్వరం చరిత్ర. కాళేశ్వరం కింద మూడు ముఖ్యమైన బ్యారేజ్‌లతోపాటు, 1531 గ్రావిటీ కాలువల ద్వారా నీరు పరుగులుపెడుతుంది. సుమారు 203 టన్నెళ్ల ( అంటే సొరంగాలు, అడ్డు వచ్చిన కొండలు కూడా తవ్వి నిర్మాణంచేశారు) ద్వారా కాళేశ్వరం నీళ్లు దుంకుతాయి. మొత్తం 20 లిఫ్టుల ద్వారా నీళ్లు తెలంగాణ చివరి ఆయకట్టు దాకా చేరుతాయి. అందుకోసం 19 పంపు హౌజ్‌లు నిర్మాణం చేశారు. మొత్తం మీద కొత్తగా 20 రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. రోజుకు కనీసం 2 టిఎంసిలు నీళ్లను ఏడాదిలో 90 రోజుల నుంచి 180 రోజుల పాటు నిరంతరంగా నీటి లభ్యత వున్నన్ని రోజులు ఎత్తిపోసే ప్రాజెక్టు కాళేశ్వరం. ఒకప్పుడు ఎత్తిపోతల పథకం అంటే ఒకటో, రెండో టిఎంసీలకు పరమితం.
ఒక టిఎంసి నీటిని ఎత్తిపోయాలంటే కనీసం నెల నుంచి నెల పదిహేను రోజుల సమయం పట్టేది. ఆ లోపు పుణ్య కాలం దాటిపోయేది. పంటలు ఎండిపోయేవి. కాని నేడు కాళేశ్వరం ఒక జల ప్రవాహం. రెండు రోజులకు ఒక టిఎంసి ఎత్తి పోసేంత పెద్ద భగీరధ ప్రయత్నం. కేవలం కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోసం అబద్దాలు వల్లించి,వల్లించి కాళేశ్వరం మీద విషం చిమ్మింది. ప్రజల్లో అనుమానాలు నాటింది. మనం చిన్న ఇల్లుకుట్టుకుంటే ఎంత జాగ్రత్తగా నిర్మాణం చేసుకున్నా, కొద్ది రోజుల్లోనే ఏదో ఒక రిపేర్‌ వస్తుంది. నిరంతరం దాన్ని బాగు చేసుకుంటూనే వుండాల్సివుంటుంది. అలాగే నీటి ప్రాజెక్టులను కూడా నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. ఇక తాజాగా కొందరు కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నట్లు ప్రస్తుతం తెలంగాణలో పారకంలో వున్న నీళ్లన్నీ శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి వస్తున్నాయంటూ కొత్త కధలు అల్లుతున్నారు. నిజంగా శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు నీళ్లు తెలంగాణ అంతటా పారే అవకాశమే వుంటే అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చింది. తెలంగాణ ఎందుకు ఎడారైంది? తెలంగాన పల్లెలన్నీ ఎందుకు వలసలు వెళ్లిపోయాయి. అసలు శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ చేసిన మోసం,ద్రోహం తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అసవరం వుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం శ్రీకారం చుట్టింది నిజాం పాలకులు. దానినే దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ శంకుస్ధాన చేశాడు. అప్పుడు ఉమ్మడి పాలకులు తెలంగాణకు అన్యాయం చేస్తారని నెహ్రూ కూడా ఊహించారు. మొత్తం 300 టిఎంసీల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. కాని ఉమ్మడి పాలకులు దానిని 180 టిఎంసిలకు కుదించారు. అయినా ఆనాడు తెలంగాన కాంగ్రెస్‌ నాయకులు ప్రశ్నించలేదు. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టును కూడా కేవలం వరదనీటి జలాల మీదే ఆధారపడేలా చేశారు. అందుకోసం కాకతీయ, లక్ష్మి,సరస్వతీ కాలువలు కూడా నిర్మాణం చేశారు. 180 టిఎసింలు అనుకున్న దగ్గర ఆఖరుకు 120 టిఎంసిలతో ముగించారు. ఇంత కాలంగా సిల్ట్‌ పేరుకుపోవడం, దానిని నిర్వహణ సరిగ్గా చేపట్టకపోవడంతో ఆ ప్రాజెక్టులో కనీసం 90 టిఎంసిల నీళ్లు కూడా నిలువ లేకపోతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు నీళ్లను విద్యుత్‌ ప్రాజెక్టులకు మళ్లించి ఎన్టీఆర్‌ హయాంలో మరోసారి తెలంగాణకు అన్యాయం చేశారు. తెలంగాణ సాగును ఆగం చేశారు. అలా సగం నీళ్లు విద్యుత్‌ ప్రాజెక్టులకు పోగా నిజామాబాద్‌ జిల్లానుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలకే ఆ నీళ్లు సరిపోని పరిస్ధితి. అలాంటిది శ్రీరాం సాగర్‌ నీళ్లు సూర్యపేట దాకా తెచ్చామంటూ కాంగ్రెస్‌ నాయకులు చెప్పుకుంటుంటే బిఆర్‌ఎస్‌ నాయకులకు నోళ్లు లేవా? తెలంగాణలో ఏ మూల చూసినా కనిపించేవన్నీ కాళేశ్వరం నీళ్లే అని చెప్పలేరా? అంతే కాదు ఎల్లంపల్లి నిండు కుండలా వుండడం కూడా కాళేశ్వరం పుణ్యమే అని చెప్పలేరా? తెలంగాణలోని ప్రతి పల్లెలోని చెరువు గంగాళంలా వుందంటే కాళేశ్వరం వల్లనే అని చెప్పడానికి వెనుకాడుతున్నారా? తాజాగా మంత్రి కొండా సురేఖ విడుదల చేసిన రంగనాయక సాగర్‌ నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్లే కదా? మరి బిఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులు ఎందుకు ఎందుకు నోరు మెదపడం లేదు. ఇప్పటికైనా మూగ నోము వీడండి…నిజాలు చెప్పడం నేర్చుకోండి. ప్రజల్లోకి వెళ్లండి. లేకుంటే పార్టీ మిమ్మల్ని పక్కనపెట్టేదాకా తెచ్చుకోకండి. కాళేశ్వరం ద్వారా తెలంగాణకు కొత్త నీరు వచ్చినట్లే, బిఆర్‌ఎస్‌లో కొత్తనీరు వస్తే తప్ప పాత నీరు పిల్టర్‌ అయ్యేలా లేదు.

అద్దంకి అడ్డంకి ఎవరికి?

https://epaper.netidhatri.com/

 

పొమ్మనలేక పొగ!

హైదరబాద్‌,నేటిధాత్రి:

 

కొన్ని ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకవు అంటే ఇదే..అందరికీ విషయం తెలుసు. ఇచ్చుకునేవారికి తెలుసు. పుచ్చుకునేవారికి తెలుసు. వివరాలందరికీ తెలుసు. అయినా నిశ్శబద్ధం…కొన్ని సార్లు సమాదానాలు లేకపోవడమే మంచిది. సమయం సందర్భం అనేవి ఎప్పుడూ రాజకీయాలలో బడుగులకేనా? అన్న ప్రశ్న మాత్రం ఎప్పుడూ ఉత్పన్నమౌతూనే వుంటుంది. సమాధానం చెప్పడం దాట వేడయం జరగుతూనే వుంటుంది. ఇంతకీ అద్దంకి దయాకర్‌ విషయంలో మళ్లీ అన్యాయం ఎందుకు జరిగింది. ఒక నాయకుడు ఎదగకుండా అణచి వేయడం అంటే అంతగా జరుగుతుందా? ఆధిపత్యపోరులో బడుగులకు ఎప్పుడూ అన్యాయమేనా? తాజాగా శాసన సభ సభ్యుల కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులు కాంగ్రెస్‌ను వరించాయి. అయితే అందులో ఒకటి సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు అద్దంకి దయాకర్‌కు వస్తుందన్న ప్రచారం విసృతంగా జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి వినిపిస్తున్న పేరు అద్దంకి దయాకర్‌. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నుంచి కూడా రేపు లిస్టు వస్తుందనగా కూడా ఒక రోజు ముందే లీకు వచ్చింది. తెలంగానలోని కాంగ్రెస్‌ నాయకులే కాదు, ఆయన శ్రేయోభిలాషులు కూడా ఎంతో మంది ఆయనకు అభినందనలు తెలియజేశారు. కాని ఏం జరిగింది. తెల్లారితే లిస్ట్‌లో అద్దంకి పేరు మాయమైంది. ఇదెక్కడి విచిత్రమని అందరూ అనుకున్నారు. అద్దంకి కూడా ముందు కలవరపడ్డాడు. కాని ఇప్పటికిప్పుడు ఏం చేయలేని పరిస్ధితి. ఎదురు తిరగలేని స్ధితి. నాకు టిక్కెట్‌ ఎందకు ఇవ్వలేదని ప్రశ్నించలేని పరిస్ధితి. సోషల్‌ మీడియా పుణ్యమా? అని కూడా ప్రభుత్వాలే తారు మారుతౌతుండగా? పదవులు ఒక లెక్కనా? అన్నంతగాకా వచ్చింది. అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఖరారైందన్న లీకు రాగానే, ఈ సభ వల్లనే ఆయనకు ఎమ్మెల్సీ వచ్చిందంటూ ఓ వీడియో తెగ వైరల్‌ అయ్యింది. ఇంకేమంది లిస్టు రాకముందే, లీకైన పేరులో కొత్త పేరు వచ్చి చేరింది. అంతకు ముందు ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ పేరు లేదు. హటాత్తుగా వచ్చి చేరింది. ఇంతకీ ఏం జరిగిందన్నదానిపై ఎవరి వాదనలు ఎలా వున్నా? ఆది నుంచి నల్లగొండ జిల్లాకు చెందిన కోమటి రెడ్డి సోదరుల వైపే వేళ్లన్నీ చూపాయి. గత అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్ల ప్రకటన సమయంలో కూడా అదిగో వచ్చే, ఇదిగో వచ్చే అంటూ ఊరించి ఊరించి ఆఖరుకు టిక్కెట్‌ ఇవ్వనేలేదు. అద్దంకి డిల్లీకి వెళ్లి వచ్చినా కూడా పని జరగలేదు. మొదటి లిస్టులోనే అద్దంకి పేరు అన్నారు. రెండో లిస్టు అన్నారు. ఆఖరు లిస్టులో కూడా హాండ్‌ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వస్తే అద్దంకికి మంచి స్ధానం వుంటుందన్నారు. దాంతో అద్దంకి దయాకర్‌ తన తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను గెలిపించాడు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి తెలంగాణ మొత్తం ప్రచారం చేశాడు. కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఎంతో కృషి చేశాడు. అంతే కాదు ఆయన కాంగ్రెస్‌ విజయం కోసం, ఈసారి ఎలాగైనా పార్టీ అధికారంలోకి రావాలని సినిమా కూడా తీశాడు. అలా కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో సేవ చేశాడు.


నిజానికి అద్దంకి దయాకర్‌ తెలంగాణ ఉద్యమ సమయంలోనే పెద్ద నాయకుడుగా గుర్తింపు పొందాడు.
వ్యక్తిగతంగా మంచి నాయకుడుగా కీర్తిని పొందాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ వైపు అడుగులు వేశాడు. ఆయన ఆనాడే టిఆర్‌ఎస్‌ వైపు కాలు కదిపితే ఆయన రాజకీయ భవిష్యత్తు మరో రకంగా వుండేదేమో? కాని ఆయన పోరాడే మనత్తత్వం. పోరాటం నుంచే నాయకుడయ్యాడు. దాంతో ఆయన కాంగ్రెస్‌ వైపు నిలిచాడు. అయితే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు 2014లో పట్టం కడతారని అనుకున్నాడు. రాజకీయ వ్యూహంలో ఆనాడే తొలి తప్పటడుగు వేశాడు. కాంగ్రెస్‌ ఆ సమయంలో టిక్కెట్‌ ఇచ్చింది. కాని అద్దంకి గెలవలేదు. అయినా కాంగ్రెస్‌లోనే వున్నాడు. ఎంతో మంది కాంగ్రెస్‌ను వీడారు. టిఆర్‌ఎస్‌లో చేరారు. కాని అద్దంకి అక్కడే వున్నాడు. 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇచ్చింది. ఎన్నికల పలితాల సమయంలో అద్దంకి గెలిచాడనే ముందు ప్రకటించారు. కాని తర్వాత తక్కువ మెజార్టీతో ఓడిపోయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయినా ఆయన కుంగిపోలేదు. రాజకీయ అవసరాల కోసం ఎటు వైపు చూడలేదు. కాంగ్రెస్‌ పార్టీ కోసం పని చేస్తూ వచ్చాడు. కాని ఈసారి టికెట్‌ రాలేదు. అయినా ఆయన పార్టీని వదిలేయలేదు. పార్టీ కోసం విసృతంగా ప్రచారం చేశారు. పార్టీ గెలుపుకు ఎంతో కృషి చేశాడు. అంతే కాదు ఎన్నికల సమయంలో టిక్కెట్ల ప్రకటనప్పుడే అద్దంకి దయాకర్‌ మంత్రి వెంకటరెడ్డి కాళ్లు కూడా మొక్కాడు. తర్వాత మంత్రి వర్గ కూర్పు సమయంలో కూడా వెంకటరెడ్డి ఆశీస్సులు తీసుకున్నాడు. ఏనాటికైనా అద్దంకి మంత్రి కావాల్సిన వాడు..అంటూ దీవించాడు. కాని ఎమ్మెల్సీ ప్రకటన ఆగిపోయింది. అడ్డుకున్నవారు ఎవరు? అన్న ప్రశ్నకు మళ్లీ వేళ్లన్నీ ఆ సోదరుల వైపే చూపించాయి.
అసలు అద్దంకి చేసిన తప్పేమిటి?
ఆది నుంచి ఆయనకు అన్యాయం జరుగుతూనే వుంది. కాంగ్రెస్‌ పార్టీ వీడిన రాజగోపాల్‌రెడ్డి విషయంలో అద్దంకి కాస్తకటువుగా మాట్లాడాడు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి ఓటమికి పనిచేశాడు. ఇదే ఆయన చేసిన పెద్ద పొరపాటు. అయితే రాజగోపాల్‌రెడ్డిపైన అద్దంకి నోరు పారేసుకోవడాన్ని జీర్ణించుకోలేని మంత్రి వెంకటరెడ్డికి ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా క్షమాపణ చెప్పాడు. అయితే అప్పుడు అద్దంకికి పూర్తిస్ధాయిలో రేవంత్‌రెడ్డి మద్దతు వుందన్న ప్రచారం జరిగింది. ఇటీవల ఓ ఛానల్‌ ఇంటర్వూలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అద్దంకికి మంచి స్ధానం లభిస్తుందనే చెప్పారు. కాని ఇంత ప్రచారం జరిగినా అద్దంకికి హ్యాండే మిగిలింది. ఇప్పుడు ఆయనను ఎంపిగా పంపించాలన్న ఆలోచనతోనే అద్దంకి పేరు పక్కన పెట్టాల్సివచ్చిందని అధిష్టానం అంటున్నట్లు కూడా మళ్లీ కొత్త కథ వినిపిస్తోంది. అంటే రెడ్డెచ్చె కధ మొదలాయే? అన్న సామెత గుర్తు చేసుకుంటున్నారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఒకసారి, నాయకులు ఆగ్రహంతో ఒకసారి, ఇలా అద్దంకికి పదవులు వాయిదా పడుతూ వస్తాయా? వరిస్తాయా? అన్నది కాలమే సమాదానం చెప్పాలి.

అడిగితే..చెప్పుతో కొడతారా?

https://epaper.netidhatri.com/

`మంత్రులు మాట్లాడాల్సిన మాటలేనా?

`పాలకులకు సంయమనం ముఖ్యం.

`అధికారంలో వున్నవారికి ఓపిక అవసరం.

`ప్రతిపక్షాల విధే ప్రశ్నించడం.

`సమాధానం చెప్పడం పాలకుల కర్తవ్యం.

`ప్రతిపక్షమంటేనే ప్రజా గొంతుక.

`పాలకులను నిలదీయడమే దాని బాధ్యత.

హైదరబాద్‌,నేటిధాత్రి:

నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందంటారు. ఏది జారినా ఫరవా లేదు కాని, నోరు జారకూడదని పెద్దలు ఏనాడు చెప్పారు. మాట పొదుపు మనిషికి గొప్ప కీర్తిని అందిస్తుంది. అందమైన మాట ఎంతో మేలు చేస్తుంది. ఇలాంటి మంచి విషయాలు మనకు అనేకం వున్నాయి. అయినా ఆవేశం అప్పుడప్పుడు అవసరం లేకున్నా కట్టలు తెంచుకుంటుంది. నోటి నుంచి ఏదో ఒకటి వచ్చేలా చేస్తుంది. వివాదాలు చుట్టుముట్టేలా చేస్తుంది. విమర్శల పాలు చేస్తుంది. నాయకులైతే ప్రజలకు దూరం చేస్తుంది. మాట మాట్లాడాలే గాని మాట తూల కూడదని నాయకులు నేర్చుకోవాలి. అయినా అప్పుడప్పుడు నాయకులు మాట జారుతూనే వుంటారు.. ఇదెక్కడి సంప్రదాయం. రాజకీయాల్లో రాను రాను ఇదేం వింత కోణం..మార్పు కావాలి…మార్పు కావాలని ప్రజలకు చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నదేమిటి? గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, ప్రశ్నించే గొంతుకలను అణి వేస్తుందని చెప్పిన కాంగ్రెస్‌ నాయకులు ఆ మాటలు అప్పుడే మర్చిపోయారా? తెలంగాణలో ప్రజలకు తమ సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదా? అని ప్రశ్నించిన కాంగ్రెస్‌ నాయకులు అధికారంలోకి రాగానే ఆ విషయం గుర్తు లేదా? అధికారంలోకి రాగానే అదే నాయకులకు ప్రశ్న చేదౌతుందా? రెండు నెలలు కాకముందే కోమమొస్తుందా? ప్రజలు ప్రభుత్వాన్నేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. పరిధి దాటి విమర్శించడం లేదు. అసలు ప్రభుత్వాన్ని ఇంత వరకు ఏమీ అనడం లేదు.
ఏటా రైతులకు ప్రభుత్వం నుంచి అందే రైతు బుంధు ఎప్పుడు వస్తుందని మాత్రమే అడుగుతున్నారు.
రైతు బంధు విషయంలో మంత్రులందరిదీ ఒకటే మాటైతే ఎవరూ అడిగేవారు కాదు. రైతుబంధు పడిరదని కొందరంటారు. పడుతోందని కొందరంటారు. వేస్తామని కొందరంటారు. నిజానికి చిన్న కతమతాలున్న రైతులకు రైతు బంధు వేస్తున్నారన్న సమచారం వుంది. కాకపోతే రైతు బంధు ఎప్పుడో పడిరదని వార్తలు కూడా ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. మాకెందుకు రాలేదన్న ఆందోళన చాలా మందిలో వ్యక్తమౌతోంది. దాంతో మాకు రాలేదు, మాకు రాలేదన్న మాటలే ఎక్కువగా వినిపించడంతో ప్రశ్న మొదలౌతోంది. ఇది తప్పెలా అవుతుంది. తాజాగా ఎకరంపైగా సాగు భూమి వున్న రైతులకు రైతు బంధు రావడం లేదన్న ప్రచారం సాగుతోంది. అది నిజమో? కాదో వివరణ ఇవ్వాల్సిన బాద్యత ప్రభుత్వానికి వుంది. రైతు బంధు అనేది ఏ ఒక్కరి వ్యక్తిగత సమస్య కాదు. తెలంగాణలోని రైతులందరి సమస్య. దాని కోసం ఒకటికి పది సార్లు మంత్రులు సమాధానాలు చెప్పాల్సిన అవసరం వుంది. రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత వారిపై వుంది. అయినా రైతు బంధు రావడం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే విడతల వారిగా అందుతోందనో, వాయిదాల పద్దతిలో వస్తుందన్న విషయం సున్నితంగా చెబితే సరిపోతుంది. ఆని రైతు బంధు రావడం లేదని ఎవరంటే వారిని చెప్పుతో కొడతామన్నంత అర్ధమొచ్చెలా ఆవేపడాల్సిన పనిలేదు.
పాలకులకు ఎంతో ఓపిక వుండాలి.
ఎన్నుకున్న ప్రజలకు ఎంతో సునాయాసంగా సమాధానం చెప్పాలి. మేం పాలకులం కాదు..సేవ కులం అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పి యాభై రోజులు కాలేదు. అప్పుడే మంత్రులు ఆవేశపడితే ఎలా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన మాటకు అర్ధమేముంటుంది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవి త్యాగం చేసిన మంత్రి వెంకటరెడ్డి. అలాంటి వారి నుంచి ఇలాంటి మాటలు రావడం ప్రజలు జీర్ణించుకోలేరు. ఎందుకంటే వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కావలనుకుంటున్న నాయకుడు. అవకాశం వస్తే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్ని అర్హతలు వున్న నాయకుడు. ముఖ్యమంత్రి స్ధాయి వున్న మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి నుంచి ఎంతో ఓర్పుతో కూడిన సమాధానాలు కోరుకుంటారు. అలాంటి నాయకుడు రైతు బంధు విషయంలో మరింత సంయమనంతో సమాధాన చెబితే ఎంతో బాగుండేంది. కోమటిరెడ్డి వెంటకరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో తీవ్ర దుమారం రేగుతోంది. రైతులంటే అంత చులకనైపోయారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రచ్చ రచ్చగా ఈ వ్యాఖ్యలు మారుతున్నాయి.
ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రైతులు.
ఆ రైతుల మనసు నొప్పించకుండా మసలుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎందుకంటే ఇన్ని రోజులు తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్‌ అభివృద్ది అనుకున్నారు. కాని తెలంగాణ గ్రామీణ సమాజం, ప్రజలు గ్రామీణ బారతం బాగుపడాలని కోరుకుంటోంది. అందుకే కాంగ్రెస్‌కు తెలంగాణ పల్లె ఓటేసింది. ఇది కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికైనా గమనించాలి. మాట్లాడే ముందు కాస్త ముందూ వెనక ఆలోచించుకొని మాట్లాడాలి. రైతు బంధు పడలేదంటే చెప్పుతో కొడతారా? మంత్రులు మాట్లాడాల్సిన మాటలేనా? పాలకులకు ఎంతో సంయమనం వుండాలి. ప్రజలు ప్రశ్నించకుండా ఎవరు ప్రశ్నిస్తారు? ప్రజల పక్షాన ప్రశ్నించేవారిని ఎంత మందిని కొడతారు? అధికారంలో వున్నవారికి ఓపిక ఎంతో అవసరం. స్పందించాలనుకుంటే స్పందించండి. లేదంటే వివరణ ఇవ్వండి. ఒకటికి పది సార్లైనా వివరణ ఇవ్వడం మంత్రులుగా, పాలకులుగా, నాయకులుగా వారి బాధ్యత. అధికారంలో వుండేవారికి భూదేవికి వున్నంత సహనం వుండాలి. ఓపిక ఎంతో అవసరం. ప్రతి పక్షాలున్నదే ప్రశ్నించేందుకు? ప్రజలు ప్రతిపక్ష స్ధానమిచ్చిందే ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు? ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పితే నిలదీసేందుకు. సమాధానాలు చెప్పాల్సిన బాద్యత పాలకులది. ప్రతిపక్షమంటేనే ప్రజా గొంతుక. దాన్ని నొక్కడం సరైంది కాదు. సరైన సమాధానం చెప్పి ప్రతిపక్షాల నోరు మూయించండి. ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రతిపక్షాలకు ప్రశ్న లేకుండా చేయండి. పాలకులను నిలదీయాల్సిన కర్తవ్యం ప్రతిపక్షాలది. దాని బాధ్యతను వాళ్లు సరిగ్గానే నిర్వర్తిస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా తన మాట తాను నిలబెట్టుకోవాలి. ప్రజల నుంచే గాని, ప్రతిపక్షాల నుంచి గాని ప్రశ్న లేకుండా చూసుకోవాలి. వంద రోజుల సమయం అంటూ కాల యాపన చేయకుండా వీలైనంత తొందరగా వాటిని అమలు చేయాలి. ఎందుకంటే ఏ మాత్రం ఏమరపాటు జరిగినా ఎన్నికల కోడ్‌ వస్తుంది. అప్పుడు కోడ్‌ను బూచిగా చూపి తప్పించుకునేందుకు వీలౌతుందని అనుకుంటే తప్పుడు సంకేతాలే వెళ్తాయి. అప్పుడు ఎవరూ చెప్పాల్సిన అవరసం లేదు. ప్రతపక్షాలు ప్రశ్నించాల్సిన అవసరం రాదు. ప్రజలే ఆలోచిస్తారు. కోడ్‌ దాకా ప్రభుత్వం కాలయాపన చేసిందని గ్రహిస్తారు. అప్పుడు ఎన్నికల ఫలితాలు ఎవరికి అనుకూలంగా తీర్పునిస్తారో కాంగ్రెస్‌ నేతలు, ప్రభుత్వపెద్దలు ఆలోచిస్తే చాలు.

ఆప్తుడు…అందరివాడు

https://epaper.netidhatri.com/view/163/netidhathri-e-paper-24th-january-2024/2

`అన్ని వర్గాల ప్రజలకు బంధువు.

`అన్ని పార్టీల నేతలకు అజాతశత్రువు.

`పేదలకు పెన్నిది…

`ఆప్తులకు అన్నార్థుడు…

`సాయం కోరి గడపలోకొస్తే వట్టి చేతులతో పంపడు.

`దానగుణం.. రజోగుణం వున్న రవిచంద్రుడు.

`ఎప్పుడూ చిరునవ్వుతో వెలిగే సూర్యుడు.

`అందరినీ ప్రేమగా పలకరించే చల్లని మనసున్న చంద్రుడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
సత్యం, సుహృద్భావం, సమ్మతం, నిర్మలం, దరహాసం మనిషికి ఆభరణాలు. వ్యక్తి జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని నింపడమే కాదు, వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేవి. అవి నిండుగా, మెండుగా వుండేవారు జీవితంలో ఎదురులేని, తిరుగులేని శక్తియుక్తులు సాధించి, ఉతన్న స్ధాయికి చేరుకుంటారని పెద్దలు చెబుతుంటారు. పట్టుదల, పరిశ్రమ, కార్యదీక్ష, ఎంచుకున్న లక్ష్యం స్ధిరమైంది,నిత్యమైంద్కెతే గమ్యం చేరడం సులువంటారు. అలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి మార్గం ఎంచుకొని విజయాలలో ఉన్నత శిఖరాలు అందుకొని, తెలుగు రాష్ట్రాలలో అందరికీ తెలిసి, గుర్తుపట్టగలిగే నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. ఆయన ఒక గొప్ప వ్యాపార వేత్త. కాని అందరికీ ఒక తెలంగాణ ఉద్యమ కారుడిగానే చాలా వరకు పరిచయం. వితరణశీలిగా మరింత మందికి తెలిసిన దయామయ గుణం. సంపాదనా పరులు ఎంతో మంది వుండొచ్చు. కాని వితరణశీలురు బహు అరుదు. అడిగిన వారికి లేదనడు. ఇంటికొచ్చిన వారికి కాదనడు. దేవాలయాల నిర్మాణం అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించడు. బడుల నిర్మాణం అంటే సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటాడు. పేదలకు అండగా వుంటాడు. వారిని ఆదుకుంటాడు. తాను సంపాదిం చిన దానిలో పేదల కోసమే ఎక్కువ ఖర్చు చేస్తుంటాడు. పది మందిలో అందరూ సమాన గౌరవంతో బతకాలని కోరుకునే సామాజిక వేత్త ఆయనలో దాగివ ్నన్నారు. అందుకు ఏద్కెనా గొప్ప కార్యక్ర మం చేయాలన్నా, ఏద్కెనా ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టా లన్నా తెలుగు రాష్ట్రాలలో ముందు గుర్తొచ్చేవారిలో వద్దిరాజు ఒకరు. అదే ఆయనకున్న గొప్ప గుణం. అందుకే ఆయన అందరికీ సుపచితం.
వద్దిరాజు రవిచంద్ర…అనే పేరు తెలియని తెలంగాణ వాది లేడు.

నాయకుడు లేడు. పార్టీ లేదు. వ్యాపార సామ్రాజ్యంలో రారాజు.. .వ్యక్తిగత జీవితంలో మహారాజు. వితరణలో కర్ణుడంతటి పేరు సంపా దించు కున్నాడు. పుట్టిన ఊరు, తాగే నీరు, పీల్చే గాలి కూడా జీవితాలపై ప్రభా వం చూపుతుందని చెప్ప డానికి మన కళ్ల మందు చాలా మంది కనిపిస్తుం టారు. అలాంటి గొప్ప ఆలోచనలు, మనస్తత్వం కలబోసిన వ్యక్తే వద్దిరాజు. ఎందుకంటే కుటుంబ నేఫధ్యం ఎంత గొప్పదో, ఆయన పుట్టిన ఊరు కూడా అంత ప్రత్యేకమైంది. కాకతీయలు మొదట పాలించిన నేల. అరి గజకేసరి అనే బిరుదుతో ప్రసిద్ధిగాంచిన కాకతీయ మొదటి ప్రోలరాజు నిర్మాణం చేసిన గ్రామం కేసముద్రం.
గణపతి దేవుడు సోదరి మైలాంబ, తన తల్లి బయ్యాంబ పేరు మీద నిర్మాణం చేసిన బయ్యారం దరిదాపు ప్రాంతం. ఇవన్నీ వున్న మహాబూబాద్‌ జిల్లా అంటే ఒకప్పుడు కవులకు కాణాచి. సాహితీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. తొలి తెలుగు పత్రిక తెనుగు ఆవిష్కరణ జరిగిన ఇనుగుర్తి గ్రామం రవిచంద్ర స్వస్ధలం. ఆ జిల్లా తొలి తరం స్వతంత్ర కాకతీయ రాజరిక పాలనకు నెలవు. అలాంటి ప్రాంతంలో పుట్టి పెరి గిన వారిలో దేశాన్ని ఏలిన మాజీ ప్రధాని పివి కూడా వున్నారు. ఆ ప్రాంతం లో వ్యా పార సామా జ్య్రంలో నెంబర్‌ వన్‌గా పేరు గాంచిన వద్దిరాజు రవిచంద్ర వున్నారు.
వద్దిరాజు రవిచంద్రది వ్యవసాయ కుటంబం. వ్యాపారాలు ఆదినుంచి నెరుపుతున్న కుటుంబం.

కిరాణ వ్యాపారం నుంచి 1972లో రైస్‌ మిల్లు వ్యాపారం, ఆ తర్వాత అంచెలం చెలుగా గ్రాన్కెట్‌ వ్యాపారం ఇలా ఒక్కొ మెట్టు ఎదుగుతూ వచ్చారు. తిరుగులేనిశక్తిగా ఎదిగారు. బ్లాక్‌ గ్రాన్కెట్‌ వ్యాపారంలో నెంబర్‌ వన్‌ స్ధానంలో కొనసాగుతున్నారు. పెద్దగా పైకి ఆయన ప్రజల్లో కనిపించినట్లు అనిపించకపోయినా ప్రజలంటే ఆయనకు ఎంతో ఇష్టం. పేదలకు సాయం చేయడమంటే కూడా ఎంతో సంతోషం. వారి కళ్లలో ఆనందం చూడాలని కోరుకుంటారు. అందుకే ఆయన సన్నిహితులు, హితులు,మిత్రులు, బంధువులు, ఆఖరుకు తన వద్ద విధుల్లో వుండే చిన్నా, పెద్ద ఉద్యోగులను కూడా ఆయన ఎంతో ప్రేమగా చూసుకుంటారని అంటుంటారు. అందుకే ఆయనంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. పార్టీలకు అతీతంగా ఆయనను అభిమానిస్తుంటారు. అదే తెరాసకు దగ్గర చేసింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముఖ్య అనుచర గణంలో ఒకడిని చేసింది. ఆయనకు దగ్గర చేసింది. ఆత్మీయుడిగా మార్చింది. ఎంతో మంది సీనియర్లు వున్నప్పటికీ వద్దిరాజు రవిచంద్ర గొప్పదనం, వ్యక్తిత్వం మూలంగానే ఆయనకు రాజ్యసభ సీటు వరించింది. కాని ఆయన ఏనాడు పదవుల కోసం ఆలోచించలేదు. ఆశించలేదు. పార్టీకోసం చేయాల్సినంత సేవ చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నారు
నాయకులకు అండగా వుంటున్నారు.కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

అటు ఖమ్మం, ఇటు వరంగల్‌ రెండు జిల్లాల్లో ఆయన నాయకులను, కార్యకర్తలను ఆదరించడం అన్నది ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కదిలించింది. మెప్పించింది. పార్టీపై వద్దిరాజుకు వున్న అభిమానం గురించి తెలిసేలా చేసింది. అందుకే వద్దిరాజను రాజ్యసభ వరించింది. ఇదిలా వుంటే పార్టీ పరంగా ఆయనకు జాతీయ స్ధాయిలో వున్న పరిచయాలు, సంబంధాలు కూడా ఇప్పుడున్న పరిస్ధితుల్లో తెరాసకు ఎంతో అవసరం కూడా. ముఖ్యమంత్రి కేసిఆర్‌ జాతీయ స్ధాయి రాజకీయాల్లో క్రియాశీలం కానున్నారు. వద్దిరాజు రవిచంద్రకు ఆది నుంచి జాతీయ స్ధాయి నాయకులతో పెద్దఎత్తున పరిచయాలున్నాయి. వద్దిరాజు వ్యాపారాలు దేశంలో అనేక రాష్ట్రాలలో వున్నాయి. దాంతో ఆయనకు విసృతమైన పరిచయాలు కూడా వున్నాయి. కాకపోతే ఆయన ఎక్కడా వాటిని ప్రచారం చేసుకున్న సందర్భం లేదు. లోప్రొఫైల్‌ మెంట్కెన్‌ చేయడమే ఆయనకు ఆది నుంచి అలవాటు. కాని ఆయన గురించి తెలిసిన వారికి మాత్రమే వద్దిరాజు జీవన ప్రయాణం తెలుసు.
గతంలో ఆయన వరంగల్‌ తూర్పు నుంచి పోటీ చేశారు.

ఎన్నికలకు కేవలం పదిహేను రోజుల ముందు టిక్కెట్టు తెచ్చుకున్నా, నియోజకవర్గంలో రెండో స్ధానంలో నిలిచారు. అంటే ఆయనకు ప్రజల్లో వున్న అభిమానం ఎంతటిదో ఈ ఒక్క లెక్క చాలు. అటు నాయకుడిగా ప్రజలకు చేరువగా, దాతగా వితరణశీలిగా సామాన్య జనం గుండెల్లో వుంటూ, వ్యాపారవేత్తగా దేశ వ్యాప్తంగా పరిచయాలున్నాయి. దాంతో గత ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్‌ సూచనల మేరకు టిఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటినుంచి ఆయన పార్టీకి తన సేవ చేస్తూ వస్తున్నారు. కాని ఏనాడు తనకు పదవులు కావాలని కోరలేదు. అర్హత వున్న నాయకుడికి పదవులు వచ్చి ఒళ్లో వాలుతాయి. అదే నిజమైంది. వద్దిరాజు లాంటి బలమైన బిసి నేతకు పదవి రావడం అంటే బిసి సామాజిక వర్గానికి ఒక ధ్కెర్యమనే చెప్పాలి. ఆయన ఇప్పటికే కాపు రాష్ట్ర సంఘానికి అధ్యక్షుడుగా వున్నారు. రాష్ట్ర గ్రాన్కెట్‌ అసోసియేషన్‌కు ప్రెసిడెంటుగా కొనసాగుతున్నారు. పైగా కరీంనగర్‌కు చెందిన మంత్రి గంగులకమలాకర్‌ సోదరుడికి వద్దిరాజు వియ్యంకుడు. ఆయన వ్యాపారవేత్తగా ఆయనేంటో ఖమ్మం ప్రజలకు తెలుసు. సినిమాల్లో చెప్పినట్లు ఇంట్లో జరిగే పెళ్లి పది తరాలు చెప్పుకునేలా వుండాలన్నది ఎవరైనా కలే కల. కాని ఆ కల అందరికీ తీరదు. కాని వద్దిరాజు తన కుమారుడి పెళ్లి అంగరంగవైభవంగా చేయడం ఖమ్మం ఇంకో పదేళ్లు చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. సంతోషాన్ని కూడా అందరితో పంచుకునే సహృదయుడు. అలాంటి నేతకు రాజ్యసభ సభ్యుడు కావడం ఆయన సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంతో సంతోషిస్తున్నారు. ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, రాజకీయంగా ఆయన మరిన్ని పదవులు అదిష్టించాలని ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న రవిచంద్ర
(రవన్న)కు నేటిధాత్రి శుభాకాక్షలు తెలియజేస్తుంది…

జిల్లాలను గిచ్చితే రచ్చ, రచ్చే?

https://epaper.netidhatri.com/

`కొత్త జిల్లాల కుదింపైనా, కత్తిరింపైనా కయ్యమే!

`కుదింపు పేరుతో ప్రభుత్వం కత్తిరింపు కుయుక్తులు.

`అశాస్త్రీయత పేరుతో పేను గొరుగుడు పనే..

`మా జిల్లా వద్దన్నవారెవరైనా వున్నారా?

`కుదించమని సూచించారా?

`ప్రజలనుంచి వచ్చిన డిమాండ్లే కొత్త జిల్లాలు!

`జిల్లాల కుదింపు అసాధ్యం.

`కొట్లాడి సాధించుకున్న జిల్లాల కోత కుదరదు.

`సిరిసిల్లకు జెల్లకొడతారా?

`ములుగును ముంచగలరా?

`పాలమూరు పార్టులు పేర్చుతారా?

`ఖమ్మం జిల్లా క్రోడీకరిస్తారా?

`మళ్ళీ ఉద్యమాలు ఎగదోయాలని చూస్తున్నారా?

`చల్లగా వున్న తెలంగాణలో రాజకీయ వేడితో చలికాచుకుంటారా?

హైదరబాద్‌,నేటిధాత్రి:

ఒక ప్రశ్నకు వంద సమాధానాలు ఫరవాలేదు. అంతేకాదు వంద ప్రశ్నలకు కూడా ఒకే సమాదానం వుండేలా కూడా చూసుకోవాలి. వైద్య పరిభాషలో సర్వ రోగ నివారణిలా వుండాలి. ఎందుకంటే అదే పరిపాలనలో మరింత పారదర్శకతను ఆవిష్కరిస్తుంది. సమాధానాలు వెతుక్కునేంత పని ప్రజలకు లేకుండా చేస్తుంది. అందుకే పరిపాలనలో కొనసాగింపుండాలే కాని, కుదుపులు, కుదింపులు వుండకూడదు. కత్తిరింపులు కొన్ని విషయాలలో అసలే వుండకూడదు. జనం కావాలని కోరుకున్నవాటిని ముట్టుకోవడం అంటే మళ్లీ సమస్యను మొదటికి తెచ్చినట్లే. నిజంగానే ఏ పాలకులైనా చిన్న చిన్న తప్పిదాలు చేయొచ్చు. వ్యవస్ధీకృతంగా జరగొచ్చు. అలాంటప్పుడు వ్యవస్ధనే రూపు రేఖలు మార్చాలనుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం కూడా వుంటుంది. ఆపరేషన్‌ చేసిన ఆరోగ్యం కుదుటపడేయాల్సిన చోట, అవయవమే తీసేస్తా? అంటే అది వైద్యమనిపించుకోదు. అలాగే పాలకులు తీసుకునే నిర్ణయాలు జనామోదం పొందేలా వుండాలి. జిల్లాల విషయంలో కొత్త ప్రభుత్వం వేలు పెట్టడం అంటే తేనెతుట్టెను కదిలించడమే. ఇది ఎవరికీ మంచిది కాదు. ప్రభుత్వాలు సహజంగా ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టాలని ఎప్పుడూ అనుకోవు. ప్రజల ఆలోచనల నుంచే పాలకులు కొన్ని ప్రయత్నాలు మొదలుపెడతారు. అది కొన్ని సార్లు చిన్నచిన్న పొరపాట్లు జరగొచ్చు. అంత మాత్రాన ప్రయత్నమే తప్పని అనుకోకూడదు. ఇప్పుడు అదే జరుగుతోంది. పరిపాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం తెలంగాణలోని పది జిల్లాలను 33 జిల్లాలగా విభజించింది. అధికార యంత్రాంగాన్ని కూడా అందుకు అనుగుణంగా మార్చివేసింది. ఏ అధికారి ఎలా పని చేయాలి. ఎంత వరకు పనిచేయాలి. ఎన్ని ఇన్‌చార్జిలుగా తన పనిని విభజించుకోవాలన్నదానిపై అధికారులకు కూడా ఓ స్పష్టత వచ్చింది. అలాంటి దాన్ని మరోసారి సరిచేయాలనుకోవడం తప్పు కాదు. కాని శాస్త్రీయత పేరుతో మళ్లీ కొంత గందరగోళం సృష్టిండం మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్దితి రావొచ్చు. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్‌ వైపు నిలిచి గెలిపించారు. ఇప్పుడు అదే గ్రామీణ ప్రాంతాలలో మరోసారి ఆత్మగౌరవం అన్నది నిద్రలేపే ప్రయత్నం చేయొద్దు. గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదన్నది కొంత వరకు వున్న మాటే అయినా పాలనా పరంగా చాలా దూరం వెళ్లింది. ఇప్పుడు మళ్లీ మానిన గాయాన్ని రేపడం వల్ల ఎవరికీ మేలు జరగకపోవచ్చు. ప్రభుత్వం వేసిన కమీషన్‌ అవే జిల్లాలను సమర్ధిస్తే ప్రభుత్వం పరువు పోతుంది. కొన్ని మార్పులు కోరితే, వాటి అమలుకు ప్రభుత్వం పూనుకుంటే వ్యతిరేకత వస్తుంది. ఎలా చూసినా ప్రభుత్వానికి ఇబ్బందికరమే…కమీషన్‌ వేశాక ఏదో ఒకటి చేయకపోతే ప్రభుత్వం చేతగాని తనం కూడా అవుతుంది. కాకపోతే చిన్న, చిన్న సమస్యల కోసం తేనెతుట్టెను కదిలించడం అన్నది సరైంది కాకపోవచ్చు.
జిల్లాల పునర్వవ్యవస్ధీకరించేందుకు ప్రత్యేకంగా ఓ కమీషన్‌ ఏర్పాటు చేస్తామని ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ప్రకటన చేయడం జరిగింది.
ఈ కమీషన్‌ జిల్లాల విభజనపై సమగ్రమైన అధ్యయనం చేసి, ప్రభుత్వానికి ఒక రిపోర్టు ఇస్తుంది. ఇంత వరకు బాగానే వుంది. కాని కమీషన్‌ తన అధ్యయనం తర్వాత దాన్ని ప్రజల ముందు వుంచి, మళ్లీ ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుందని చెప్పడమే అసంబద్ధం. ఎందుకంటే ముందు ఎక్కడైనా ప్రజాభిప్రాయ సేకరణ చేపడతారు. అది ముందు జరగాల్సిన విషయం. ప్రజాభిప్రాయంలో వెల్లడైన అంశాలతో కమీషన్‌ ఒక అధ్యయనం చేసి, ఒక కూర్పు చేస్తే దానికి శాస్త్రీయత వుంటుంది. కమీషన్‌ ఒక రిపోర్టు ఇచ్చిన తర్వాత అది ప్రభుత్వం భహిర్గతం చేయకుండా దాచినా సరైంది కాదు. ఒక వేళ బైటపెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినా ప్రజలు అంగీకరించే పరిస్థితి వుండదు. గతంలో అనేక కమీషన్లు చూశాం. కాని ఏదీ అమలు చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా అదే జరుతుంది. ఒక వేళ ప్రభుత్వం పూర్తి స్దాయిలో దృష్టిపెట్టి కమీషన్‌ పని త్వరగా పూర్తి చేసి రిపోర్టు ఇచ్చినా, రాజకీయ కోణంలో ప్రభుత్వం వెనకడుగు వేయొచ్చు. దాంతో పుణ్య కాలం పూర్తి కావొచ్చు. ప్రభుత్వం అబాసు పాలు కావొచ్చు. జిల్లాల విభజన సమయంలో కొన్ని ఉద్యమాలు తీవ్రంగా సాగిన సందర్భాలు చూశాం. జనగామ ప్రాంతం గతంలో నిజాం హయాంలో నల్లగొండ జిల్లాలో వుండేది.
ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరంగల్‌ జిల్లాలోకి వెళ్లిపోయింది.
అప్పటి నుంచి జనగామకు వరంగల్‌తో అనుబంధం పెరిగింది. జిల్లాల విభజన సమయంల జనగామను హన్మకొండ జిల్లాలో అలాగే వుంచినా బాగుండేది. కాని గత ప్రభుత్వం తొలుత యాదాద్రి, భువనగరి జిల్లాలో కలిపింది. దాంతో జనగామలో పెద్దఎత్తున ఉద్యమం సాగింది. నిజానికి కేసిఆర్‌ ప్రభుత్వం అశాస్త్రీయతను ప్రదర్శించింది. అయితే జనగామ ప్రాంతం భువనగిరి పార్లమెంటు పరిధిలోకి వెళ్లింది. దాన్ని దృష్టిలో వుంచుకొని గత ప్రభుత్వం జనగామను యాదాద్రిలో కలిపారు. కాని పోరుగడ్డ జనగామ అందుకు అంగీకరించలేదు. తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం 144 సెక్షన్‌ అమలులో వున్న జనగామలో, తెలంగాణ వచ్చాక కూడా అదే సెక్షన్‌ అమలులో వుంది. అయినా ప్రజలు వెనక్కి తగ్గలేదు. తెలంగాణ కోసం ఎంత ఉద్యమం చేశారో…జిల్లా కోసం కూడా అంతే ఉద్యమం చేశారు. తెలంగాణలో ఆసిఫాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, వనపర్తి, ములుగు, జనగామలు చిన్న జిల్లాలుగా గుర్తించారు. మరి జనగామను ప్రభుత్వం ముట్టుకునే ప్రయత్నం చేస్తే మళ్లీ ఉద్యమం మొదలౌతుంది. తెలంగాణలో జరిగిన ఈ అశాస్త్రీయతను చూసిన తర్వాతే ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన జిల్లాల విభజన పార్లమెంటు స్ధానాలను దృ ష్టిలో పెట్టుకొని చేశారు. అయితే 2026లో మళ్లీ దేశ వ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల డీ లిమిటేషన్‌ వుంది. అప్పుడు మారితే ఏం జరుగుతుందన్నది అక్కడ కూడా ఆగమ్య గోచరమే అవుతుంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవార్గల వారిగా జిల్లాల విభజన చేపడితే, డీలిమిటేషన్‌ సమస్య మళ్లీ ముందుంది. దాంతో సమస్య మళ్లీ మొదటికి రావొచ్చు.
ఇదంతా లేనిపోని పితలాటమమే తప్ప ప్రయోజనం వుండదు.
ఎందుకంటే ములుగు జిల్లా కోసం ప్రస్తుత మంత్రి సీతక్క ఎంతో కాలం పోరాటం చేసి సాదించుకున్నారు. ఇప్పుడు ఆమె మంత్రి వర్గంలో వున్నారు. ప్రభుత్వం ఒక వేళ మంత్రి వర్గంలో ములుగు జిల్లాలను తొలగించాన్న దానిపై చర్చ వస్తే ఏం చేస్తారు? ఒక వేళ ఆమె జిల్లారద్దుకు అంగీకరించకపోతే ప్రభుత్వానికి తలనొప్పి. ఒక వేళ ఒప్పుకుంటే జిల్లా సాధన కోసం రాజకీయ ప్రయోజనం కోసమే ఉద్యమం చేసిందన్న అపవాదు మూట గట్టుకుంటుంది. అంతే కాకుండా జిల్లా ఏర్పాటు కావడం వల్లనే ములుగులో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడం జిరిగింది. ఆ పనులు కూడా పూర్తి దశలో వున్నాయి. ఒక వేళ ములుగు జిల్లా రద్దు అంటే ముందు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాల్సిన పరిస్ధితి అక్కడే మొదలు కావొచ్చు. అందుకే పరిపాలన సాఫీగా సాగే పనులకు పూనుకుంటేనే ఎంతైనా మంచిది.

ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్‌కు ఉరితాళ్లు?

https://epaper.netidhatri.com/

 

అలవికాని హామీలిచ్చి ప్రజల జీవితాలను తొలి రోజు నుంచే తలకిందులు చేసిన కాంగ్రెస్‌ పార్టీకి ‘‘ఆరు గ్యారెంటీలే’’ ‘‘ఉరితాళ్లు’’గా మారుతాయంటున్న సిద్దిపేట ఎమ్మెల్యే ‘‘హరీష్‌ రావు’’, నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’తో ప్రజలు పడుతున్న బాధలు వివరించారు. ఆ విషయాలు

‘‘హరీష్‌ రావు’’ మాటల్లోనే..

`అన్నింటికీ ఒకటే మంత్రం..

`అధికారంలోకి వచ్చిన మరుక్షణం..

`3 న గెలిస్తే 9 నే అన్ని ఆరు హామీలు అమలు చేస్తాం అన్నారు.

`నవంబర్‌ లోనే కరెంటు బిల్లు కట్టొద్దన్నారు.

`సోనియా గాంధీ కరెంట్‌ బిల్లు చెల్లిస్తుందని చెప్పారు.

`ఇప్పుడు వందరోజుల సమయం అడుగుతున్నారు.

`రైతుబంధు బుడిబుడి అడుగులు.

`రుణమాఫీపై కట్టు కథలు..

`నిరుద్యోగ భృతికి తిలొదకాలు.

`ఉద్యోగాలు ఇప్పటికైతే వాయిదాలు.

`కాంగ్రెస్‌ ని జనం క్యా మతలబ్‌ హై అంటున్నారు.

హైదరబాద్‌,నేటిధాత్రి:

జీవితమంతా అధర్మ పాలన చేసిన దుర్యోధనుడు కూడా ఆఖరు నిమిషంలో కూడా పాండవులది అధర్మ యుద్దం అన్నాడట. అలా వుంది కాంగ్రెస్‌ నాయకుల తీరు. అరవై ఏళ్లపాటు తెలంగాణ ప్రజలను వంచించి, మోసం చేసిందే కాంగ్రెస్‌ పార్టీ. అయినా ఒక్క ఛాన్స్‌ ఒక్క చాన్స్‌ అంటూ తెలంగాణ ష్ట్రప్రేజలను ప్రాధేయపడితే మరోసారి అవకాశం ఇచ్చినా పాలన సాగించకుండా, బి ఆర్‌ఎస్‌ను తిట్టడమే పనిగా కాంగ్రెస్‌ పెట్టుకున్నది. ప్రజా రంజక పాలన పదేళ్లపాటు సాగించిన బిఆర్‌ఎస్‌ పాలనను ప్రశ్నించే నైతిక అర్హత కాంగ్రెస్‌కు లేదు. ప్రజలను పదే పదే మభ్యపెట్టి ఎన్నికల ప్రచారం చేసింది కాంగ్రెస్‌ . ఎన్నికలనగానే అలవి కాని హమీలు గుప్పించింది కాంగ్రెస్‌. అధికారంలోకి రాగానే ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను తుంగలో తొక్కింది కాంగ్రెస్‌. ఆరు గ్యారెంటీలని ఊదరగొట్టి, ఇప్పుడు బిత్తర చూపులుచూస్తున్నది కాంగ్రెస్‌. ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చక వంచిస్తోంది కాంగ్రెస్‌. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు తెలంగాణ ప్రయోజనాలు కాంగ్రెస్‌ పట్టలేదు. కాని 2014లో కేసిఆర్‌ తెలంగాణ తెచ్చిన తర్వాత, బిఆర్‌ఎస్‌ పాలన వచ్చిన తర్వాత ఎన్నికల ముందు చెప్పినవే కాదు, చెప్పనివి కూడా అనేకం అమలు చేసిన ఘనత మాది. ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇంకా కాంగ్రెస్‌ పార్టీ నేతలుకు ఆ అరుపులెందుకో అర్ధం కావడం లేదు. ఇంకా బిఆర్‌ఎస్‌ మీద పొడబొబ్బలెందుకు పెడుతున్నారో వారికే తెలియడం లేదు? పాలించమని ప్రజలు పదేళ్ల తర్వాత అధికారం అప్పగిస్తే బిఆర్‌ఎస్‌ చేసిందేమిటి అని ప్రశ్నించుకుంటూ కూర్చున్నారు. ఇచ్చిన హమీలు గాలికి వదిలేశారు? కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన దాదాపు యాభై రోజలు కావొస్తోంది. ఈ సమయంలో ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమిటి? కాంగ్రెస్‌ ప్రభుత్వం సాధించేందేమిటి? మూటగట్టి ప్రజలకు పంచిందేమిటి? కాంగ్రెస్‌లో మిడిసిపాటు,మిడిమిడి జ్ఞానం వున్న నాయకులు తప్ప, వివేకవంతమైన నాయకులేరి? కాలం కలిసి వచ్చినప్పుడు ఏవరు ఏది చెప్పినా బాగానే వుంటుంది కాని అబద్దాలతో ఎల్లకాలం కాలం గడపలేరు. ప్రజలను నమ్మించలేదు. అయినా ఇప్పుడు ప్రజలకు కావాల్సింది నమ్మకం. ఇక భరోసా. ఇచ్చిన హామీల అమలు. అంతే తప్ప కాలయాపన కాదు…ఎన్నికలు అయిపోగానే ప్రమాణ స్వీకారం రోజే ఆరు గ్యారెంటీల అమలు అని చెప్పిందే కాంగ్రెస్‌ పార్టీ. మరి ఇప్పుడు వాటని దాట వేసే ధోరణి ఎవరు చేస్తున్నారన్నది ప్రజలకు తెలుసు. బిఆర్‌ఎస్‌ హాయాంలో ప్రజల నుంచి నిరసన అన్న పదమే ఎక్కడా వినపడిరది కాదు. ఏనాడు ప్రజలకిచ్చిన హమీని బిఆర్‌ఎస్‌ వదిలేయలేదు. అలవి కాని హామీలు గుప్పించి, అబద్దాలు పదే పదే వల్లెవేసి ప్రజలు మాయ చేసి, మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే తెలంగాణ ప్రజల జీవితాలను తలకిందులు చేసిన కాంగ్రెస్‌కు ఆ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలే ఉరితాళ్లుగా మారుతాయంటన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో తెలంగాణ ప్రజల పడుతున్న బాధలు వివరించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే…
అన్నింటికీ ఒకటే మంత్రం.
మేం అదికారంలోకి రావాలన్న ఆలోచన తప్ప, అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలా సేవచేయాలన్న సోయి కాంగ్రెస్‌నేతల్లో వుండదు. అది మరోసారి స్పష్టమైంది. ఎంత సేపు అధికార యావతప్ప, సేవ చేద్దామన్న సోయి ఏనాడు వుండదు. ఇప్పుడు కూడా లేదు. అసలు ఏ ధైర్యంతో ఆరు గ్యారెంటీలు ఇచ్చారన్నదానిపై వారిలో ఏ ఒక్కరి దగ్గర సమాదానం లేదు. లంకెబిందెలున్నాయనుకొని వచ్చాం..అంటూ పొంతన లేని సమాదానాలు చెప్పి, తప్పించుకుంటామంటే, మోసం చేస్తామంటే తెలంగాణ ప్రజలు క్షమించరు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటూ ఊకదంపుడు మాటలు అనేకం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. ఇన్ని సార్లు చెబుతున్నారన్న ఆలోచనతో ప్రజలు నమ్మారు. నమ్మితేనే కదా? మోసం చేసేది అన్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం మోసానికి తెరతీసింది. ఎన్నికల మందు కరంటు బిల్లులు కట్టొద్దని చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుంది. తెలంగాణ ప్రజల కరంటు బిల్లులు కాంగ్రెస్‌ పార్టీ కడుతుంది. సోనియా గాంధీ చెల్లిస్తుందని చెప్పారు. ఇప్పుడు రెండు నెలలు గడుస్తోంది. కరంటు బిల్లుల ఊసు లేదు. అందుకే బిఆర్‌ఎస్‌ ప్రజలు కరంటు బిల్లు కట్టొద్దని ప్రజలకు సూచిస్తోంది. నల్లగొండ ప్రచారంలో కోమటి రెడ్డి వెంకటరెడ్డి కరంటు బిల్లు కట్టమని ఎవరైనా వస్తే నాపేరు చెప్పమని ప్రచారం చేశాడు. ఇప్పుడు ఆ మాట మర్చిపోయాడు. ఎన్నికల ముందేమో, అధికారం కోసం చెప్పిన మాటేమిటి? ఇప్పుడు వంద రోజులు సమయం కోరడమేమిటి? అప్పుడే అలా చెప్పాల్సి వుండే? కాని అలా చెప్పలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు వేస్తామన్నారు. అంతే కాదు రూ.15వేలు ఇస్తామన్నారు. కాని ఇప్పటి వరకు రైతు బంధు లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేశామంటుంటాడు. ఓ మంత్రి రైతు బంధు పడుతుందంటాడు. మరో మంత్రి వేస్తామంటాడు. ఇందులో ఎవరి ప్రకటన నమ్మాలో ప్రజలకు అర్దం కాకుండాపోతోంది. ఇక ఎన్నికల ముందు రైతులను రెచ్చగొట్టి రుణాలు తెచ్చుకొమ్మన్నారు. రెండు లక్షలు వరకు ఏక కాలంలో రుణమాఫీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు. ప్రజలు,రైతులు రుణమాఫీ గురించి ప్రశ్నిస్తే వాయిదాలు వేస్తున్నారు. ఇదిలా వుంటే జిల్లా సహాకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులను నుంచి వసూళ్లు మొదలు పెట్టాలని ఆదేశాలిస్తున్నారు. అంటే ప్రతి విషయంలోనూ కట్టుకథలే అల్లారని ప్రజలకు అర్ధమౌతోంది. గృహ లక్ష్మిపేరుతో చెప్పిన పధకాలు మూడు. ఉచిత బస్సు ప్రయాణం పేరుచెప్పి ప్రజలకు బస్సులు అందుబాటులో లేకుండాచేస్తున్నారు. ఇదేనా కాంగ్రెస్‌ ప్రభుత్వ చిత్తశుద్ది. ఇండ్లకు, సాగుకు అప్పుడే కరంటు కోతలు మొదలుపెట్టారు. అధికారంలోకి రాగానే మొదటి క్యాబినేట్‌లోనే డిఎస్సీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మెగా డీఎస్సీ వేస్తామన్నారు. ఏడాది కాలంలోనే రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామన్నారు. అప్పటి దాకా నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామన్నారు. కాని ఏం చేశారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి గురించి తాము ఏనాడు చెప్పలేదంటూ తొలి సమావేశాలలోనే చేతులెత్తేశారు. అప్పుడే ఈ ప్రభుత్వ పనితీరు అర్దమైంది. ప్రజలకు మోసపోయామని తెలిసిపోయింది. ఇక టిఎస్పీఎస్సీ గురించి అంతంత ఎత్తు ఎగిరిచెప్పారు. ఇప్పుడు వంద రోజుల సమయం అంటున్నారు. మరి రైతులు ఇప్పటికే కరంటు సరిగ్గా రాక పొలాలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్దితి కనిపిస్తోందని బాధపడుతున్నారు. భూ గర్భ జలాలు కూడా తగ్గే పరిస్దితులు కనిపిస్తున్నాయి. గతంలో తాము అధికారంలో వున్నప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఏ ఒక్క చెరువులో చుక్కనీరుతగ్గకుండా చూసుకున్నాం. ఎప్పటికిప్పుడు చెరువులు నింపడం జరిగింది. రైతులకుసాగు నీటి కష్టం రానివ్వలేదు. కరంటు కష్టంతెలియనీయలేదు. కాని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అవగాహన లేక పోవడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లే పరిస్దితి కనిపిస్తోంది. ఏ రైతులనైతే మోసం చేసి ఓట్లు వేయించుకున్నారో అదే రైతులను నుంచి త్వరలోనే కాంగ్రెస్‌కు నిరసన తప్పదు. కాంగ్రెస్‌కు ప్రజా క్షేత్రంలో ఉరి తప్పదు. కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీలు ఉరితాళ్లుగా మారనున్నాయి. కేవలం అధికారం కోసమే రాజకీయాలు చేస్తే ఇలాగే వుంటుంది. ప్రజల మేలు కోరి చేస్తే అత్యుత్తమ పాలన అందుతుంది. అది కేసిఆర్‌ పాలనలాగా వుంటుంది.

కోట్లాది మంది భారతీయుల నమ్మకానికి ప్రతీక అయోధ్యలో రామ మందిరం

కూకట్పల్లి, జనవరి 22 నేటి ధాత్రిఇంచార్జి

అయోధ్య శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశ ప్రజ లందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి శ్రీ బండి రమేష్తో కలిసి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ గొట్టి ముక్కల వెంక టేశ్వర రావు గొట్టిముక్కల వెంక టేశ్వరరావు నియోజకవర్గం లోని మోతినగర్, జింకలవాడ, ఫేతేనగర్, ప్రభాకర్ రెడ్డి నగర్లలో రాములవారి ఆలయాలలో ప్రత్యేక పూజలలో అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొ నడం జరిగింది.
ఫోటో నెంబర్ 2 లో…

త్వరలో మళ్ళీ టిఆర్‌ఎస్‌!

`బిఆర్‌ఎస్‌ నుంచి యూ టర్న్‌.

`గూగుల్‌ కూడా టిఆర్‌ఎస్సే అంటోంది.

`క్యాడర్‌ అభీష్టం మేరకే…

`అతి త్వరలో శుభవార్త.

`నాయకులు కోరుతున్నది టిఆర్‌ఎస్సే.

`ఏ లెక్కన చూసినా టిఆర్‌ఎస్సే నెం.1

`తెలంగాణ ఆత్మను నింపుకున్నది టిఆర్‌ఎస్‌.

`ఆత్మను వదులుకున్నట్లున్నది బిఆర్‌ఎస్‌.

`జనం సూచనలు చెవికెక్కించుకోండి.

`పదికాలాలపాటు ప్రజలే పార్టీని కాపాడుకుంటారు.

`కార్యకర్తలు వందేళ్లు జెండా మోస్తారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నిజంగా ఇది బిఆర్‌ఎస్‌ శ్రేణులకు శుభవార్తే..తీయని సందేశమే… వేడుకలాంటి విశేషమే..ఎందుకంటే చాల కాలం తర్వాత మళ్లీ ఆత్మను గుండెల్లో నింపుకుంటున్నంత సంతోషం వ్యక్తమౌతున్నదే. బిఆర్‌ఎస్‌ భవిష్యత్తులో టిఆర్‌ఎస్‌గా మారనుందన్న మాటే క్యాడర్‌లో సంతోషాన్ని నింపుతుంది. ఆనందం తాండవం చేస్తుంది. టిఆర్‌ఎస్‌ అన్న పేరు క్యాడర్‌కు ఇరవై రెండేళ్ల గుండెల నిండా నిండిన జెండా బంధం…రాజకీయానుబంధం. తెలంగాణ ప్రజలతో ఆత్మరుణానుబంధం. అది ఎవరూ తెంచేది కాదు. తెంచుకునేది అంతకన్నా కాదు. ఎందుకంటే తెలంగాణ సాధన కోసం పద్నాలుగేళ్లపాటు నిరంతరంగా కొట్లాడిన పార్టీ టిఆర్‌ఎస్‌. పసి పిల్లాడి నుంచి పండు ముసలి వరకు, పూరి గుడిసె నుంచి ఎత్తైన భవంతుల వరకు, సామాన్యుడి వాహనం సైకిల్‌, సంపన్న వర్గాల కార్లపై కూడా నిరంతరం ఎగిరిన జెండా గులాబి జెండా. తెలంగాణ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న జెండా టిఆర్‌ఎస్‌ జెండా. అదే తెలంగాణ ప్రజల అస్తిత్వం. ప్రాంత మమకారం. పిడికెలెత్తి నినదించిన నినాదం. తెలంగాణ ఆత్మగౌరవం. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ తరంగం. అంతటి త్యాగమయ చరిత్ర టిఆర్‌ఎస్‌కు వుంది. గులాబి జెండా తెలంగాణ ప్రజల గుండెల్లో రెపరెపలాడినా, చేతిలో కర్రపై ఆకాశాన్నందుకునేంతగా ఎరుగుతున్నా, ప్రపంచానికి తెలంగాణ ఆకాంక్షను తెలిసేలా చేసిన ఏకైక జెండా టిఆర్‌ఎస్‌ జెండా..గులాబి జెండా. అయితే ఎప్పుడైతే బిఆర్‌ఎస్‌గా మారిందో అప్పుడే తెలంగాణ ఆత్మ దూరమైందన్న భావన అందరిలోనూ వ్యక్తమైంది. పేరు మారితే బంధంలో ప్రకంపనాలొస్తాయని చెప్పారు…టిఆర్‌ఎస్‌ను మార్చొద్దని తెలంగాణ సమాజమంతా సూచించిందే…కాని తెలంగాణ ఆత్మగౌరవం,తెలంగాణ నాయకత్వం డిల్లీలో సగర్వంగా నిలబడాలన్న ఆలోచనతో బిఆర్‌ఎస్‌గా మారింది. కేసిఆర్‌ ఎంత వివరణ ఇచ్చినా, క్యాడర్‌ బలవంతంగా అంగీకరించినా ప్రజలు ఒప్పుకోలేదు. పార్టీ పేరుమార్పు జనం మెచ్చలేదు.  

 తెలంగాణ ఆత్మగౌరవం గులాబీ జెండాలో కనిపించిన, బిఆర్‌ఎస్‌ గులాబీలో కనిపించడం లేదు. 

అదే పెద్ద వెలితి. అందుకే ప్రజలు కూడా టిఆర్‌ఎస్‌ను గుండెల్లో పెట్టుకున్నంతగా బిఆర్‌ఎస్‌ను పెట్టుకోలేదన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే 2018 ముందస్తు ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ఊహించని మెజార్టీని సొంతం చేసుకున్నది. ఉద్యమ కాలంలో సబ్బండ వర్గాలు ఎలా మద్దతు పలికాయో, 2018లో టిఆర్‌ఎస్‌కు అంతే మద్దతునిచ్చాయి. టిఆర్‌ఎస్‌ను గెలిపించాయి. తెలంగాణ ఇచ్చింది మేమే అని ఆనాడు కాంగ్రెస్‌ ఎంత ప్రచారం చేసుకున్నా, ప్రజలు వినిపించుకోలేదు. కాంగ్రెస్‌ను ఇక నమ్మం అనే తేల్చేశారు. కాంగ్రెస్‌ నాయకులకు డిపాజిట్లు కూడా రానంతగా టిఆర్‌ఎస్‌ నాయకులను బంపర్‌ మెజార్టీలతో గెలిపించారు. కాంగ్రెస్‌కు అడ్రస్‌ లేకుండా చేశారు. రెండోసారి కేసిఆర్‌ను ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో టిఆర్‌ఎస్‌ రానున్న రోజుల్లో బిఆర్‌ఎస్‌ అవుతుందని ఎవరూ అనుకోలేదు. జరిగిన రాజకీయ పరిణామాలు ఎలా వున్నా త్వరలో మళ్లీ టిఆర్‌ఎస్‌ అన్న పేరు వినిపంచనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌తోపాటు, కేటిఆర్‌, హరీష్‌రావులు ప్రజల నుంచి ఎలాంటి స్పందనవస్తుందన్న దానిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

 ముఖ్యంగా కేసిఆర్‌ ఈ విషయంలో చాల ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రజలు బిఆర్‌ఎస్‌ లో తెలంగాణ ఆత్మ లేదంటూ అప్పటి ప్రతిపాక్షాలైన కాంగ్రెస్‌, బిజేపి, బిఎస్పీలతో పాటు, యువత, విద్యార్దులు, తెలంగాణ వాదులు, కవులు, కళాకారులు హెచ్చరిస్తూనేవున్నారు. టిఆర్‌ఎస్‌ అని తెలంగాణ వాదాన్ని ముందుపెట్టుకొని, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి రాజకీయాలు చేశారంటూ కాంగ్రెస్‌,బిజేపిలుచేసిన విమర్శలను ప్రజలు కూడా నమ్మినట్లు తెలుస్తోంది. బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే కేసిఆర్‌ దేశ రాజకీయాల మీద దృష్టిపెట్టి తెలంగాణను పట్టించుకుకోకపోవచ్చన్న చర్చ కూడా సమాజంలో జోరుగానే సాగింది. అప్పటికే కేసిఆర్‌ పెద్దగా ప్రజల్లోకి వస్తున్నది లేదు. పైగా బిఆర్‌ఎస్‌ పేరుతో రాష్ట్రాలు తిరుగుతున్నాడు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఆయన చేసిన పర్యటనలు తెలంగాణ ప్రజల మీద తీవ్ర ప్రభావాన్ని చూపాయన్నది కూడా తెలుస్తోంది. టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత ఎక్కడైనా పార్టీ పోటీ చేస్తుందని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పోటీ చేస్తామని చెప్పడం కూడా తెలంగాణ ప్రజలు మెచ్చలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తే పద్నాలుగేళ్ల ఈ సుధీర్ఘ పోరాటానికి తెలంగాణ వాదానికి , త్యాగాలకు విలువేముందన్న అభిప్రాయంతెలంగాణ సమాజంలో వ్యక్తమైంది. తీరా ఎన్నికల సమయంలో బిఆర్‌ఎస్‌ పేరుతో తెలంగాణ వాదం వినిపించే ప్రయత్నం చేసినా, కాంగ్రెస్‌ వల్ల తెలంగాణ ఆగమౌతుందని కేసిఆర్‌ చెప్పినా ప్రజలు వినలేదు. బిఆర్‌ఎస్‌కు ప్రజలు ఓటేయలేదు. గెలిచిన కాంగ్రెస్‌కు, ఓడిపోయిన బిఆర్‌ఎస్‌కు మధ్య ఓట్ల తేడా చిన్నదే అని ఎంత చెప్పుకున్నా ఓటమి అన్నది ఐదేళ్ల పాటు తెలంగాణ ప్రజలకు పార్టీని, నాయకత్వాన్ని దూరం చేసినట్లే…అయితే బిఆర్‌ఎస్‌ ఓటమికి పూర్తిగా పేరు మాత్రమే కారణం కాదు. కాని బిఆర్‌ఎస్‌ ఓటమిలో పేరు కూడా ప్రధాన అంశమైందని చెప్పడంలో సందేహం లేదు. 

 ఇప్పటికైనా బిఆర్‌ఎస్‌ నుంచి టిఆర్‌ఎస్‌ యూటర్న్‌ కావాల్సిందే అని క్యాడర్‌ పట్టుబడుతోంది.

 లేకుంటే ప్రజల్లో చులకనౌతామని చెబుతోంది. కాంగ్రెస్‌ పార్టీ చేసిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు కేసిఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నది నిజమే…కాని కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్‌ అంటూ చేసిన ప్రచారం రేపు బిజేపి చేయకుండా వుండదు. కేంద్రంలో ఒక వేళ మళ్లీ బిజేపి అధికారంలోకి వస్తే తెలంగాణలో బిజేపి మరింత బలపడే అవకాశాలులేకపోలేదు. నిజానికి గతంలోనే బిజేపిని కేసిఆర్‌ పెంచిపోషిస్తున్నాడన్న విమర్శను కూడాఎదుర్కొన్నారు. కేంద్రలో మళ్లీ బిజేపి అధికారంలోకి వస్తే బిఆర్‌ఎస్‌ను రాజకీయంగా బిజేపి దెబ్బతీయదన్న గ్యారెంటీ లేదు. అంతే కాకుండా ఒక వేళ కాంగ్రెస్‌ను చీల్చే ప్రయత్నం బిజేపి చేస్తే, ఖచ్చితంగా బిఆర్‌ఎస్‌లో కూడా చీలిక తేకుండా వుండలేరు. అందువల్ల కేసిఆర్‌ జాగ్రత్త పడాల్సిన అవసరం వుంది. బిఆర్‌ఎస్‌ అంటూ గూగుల్‌ కూడా ఇష్టపడడం లేదు. గూగుల్‌కూడా టిఆర్‌ఎస్సే అంటోంది. క్యాడర్‌కూడా అదే కోరుకుంటోంది. ఏ లెక్కన చూసినా టిఆర్‌ఎస్సే నెంబర్‌ వన్‌. పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రతిపక్షపాత్ర పోషించిననా టిఆర్‌ఎస్‌ జనంలో నానింది. అంతే కాదు నాడు ఆంధ్ర నాయకులను భయపెట్టింది. తెలంగాణ ఉద్యమాన్ని భుజానకెత్తుకున్నది. తెలంగాణ ఆత్మను నింపుకున్నది. ఒక దశలో కాంగ్రెస్‌ పార్టీ బిఆర్‌ఎస్‌ను చూసి భయపడిరది. తెలంగాణ ఇచ్చింది. అలాంటి టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చడంతో ఆత్మను వదులుకున్నట్లున్నట్లైంది. జనం చెబుతున్నది కూడా ఇదే. ఇప్పటికీ మించిపోయిందేమీలేదు. వెంటనే టిఆర్‌ఎస్‌గా మార్చితేనే ఎంతో మేలు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆలోచిద్దాం..అని వాయిదా వస్తే పార్లమెంటు స్ధానాలు దక్కకపోతే కాంగ్రెస్‌ చేసే రాజకీయం ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. అందువల్ల టిఆర్‌ఎస్‌ అనండి. పది కాలాల పాటు ప్రజలే పార్టీని కాపాడుకుంటారు. వందేళ్లపాటు క్యాడర్‌ జెండా మోస్తారు.

ఆదాయం మిన్న…అభివృద్ధి సున్న!

https://epaper.netidhatri.com/

`మంత్రి సురేఖగారు మీరన్నా నిధులివ్వండి!

`అవినీతి ఉద్యోగులను తొలగించండి.

`ఏళ్ల తరబడి తిష్ట వేసిన వారిని సాగనంపండి.

`రాజన్నకు పూర్వ వైభవం కల్పించండి.

`వేములవాడ ఎందుకో వెనుకబడ్డది!

`దక్షిణ కాశీకే దిక్కులేకుంటున్నది.

`ఉమ్మడి రాష్ట్రంలో రాజన్నకు అన్యాయమే!

`తెలంగాణలో అభివృద్ధికి ఆమడ దూరమే!

`ఏటా వంద కోట్లన్నారు…ఏనాడో మర్చిపోయారు.

`రాజన్నకే శఠగోపం పెట్టారు.

`పాలకులు అలా…ఉద్యోగులు ఇలా!!

`దేవుని సొమ్ము ఏళ్లుగా మెక్కుతున్నారు!?

`పదేళ్లకు పైగా పదమూడు మంది తిష్ట!

`ఉద్యోగుల అవినీతిపై విచారణ.

`నిజనిర్థారణ జరిగినా చర్యలు లేవు.

`విచారణ నివేదిక బుట్ట దాఖలు చేశారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ ఉద్యమానికి వేముల వాడ రాజన్న ఆశీస్సులు వున్నాయి. తెలంగాణ ఉద్యమ ప్రస్ధానం, ఆట,పాట అంతా వేముల వాడ రాజన్న చుట్టే తిరుగాయి. అందుకే తెలంగాణ వచ్చింది. వేములవాడ రాజన్న కనికరమే తెలంగాణకు వరమైంది. తెలంగాణ ఉద్యమం ఊరూ, వాడ చేరేందుకు, రాజన్న పేరు మీద పాటలు కైగట్టి పాడని కవిగాయకులెందరో వున్నారు. అలా రాజన..ఓ రాజనా…ఎత్తుర తెలంగాణ జెండ…రాజన ఓ రాజన్నా..అంటూ పాటలు పాడారు. అసలు రాజన్న పదం లేకుండా తెలంగాణ పాటే లేదు. అంత గొప్పది రాజన్న దీవెన. ఆయన దీవెనతోనే మలి దశ తెలంగాణ సాధ్యమైంది. కాని తిరుపతి వెంకన్నకు తెలంగాణ మొక్కులు చేరాయి. విజయవాడ దుర్గమ్మకు మొక్కులు నెవరేరాయి. యాదగిరి నర్సన్నకుకొత్త కోవెల వచ్చింది. వెయియ కోట్లతో కొత్త గుడి నిర్మాణం జరిగింది. కాని తెలంగాణ ఉద్యమం మొత్తం తన పేరు చుట్టూ తిరిగిన రాజన్న ఆలయం మాత్రం అలాగే వుంది. అక్కడే వుంది. యాదగిరి గుట్ట పేరు మార్చి యాదాద్రి చేసిన తర్వాత అందరూ ప్రశ్నించడంతో నాడు కేసిఆర్‌ ఎముడాల రాజన్నకే ఏటా వంద కోట్లు ఇస్తామని మాట తప్పాడు. పదవి పోగొట్టుకొని ఇంట్లో కూర్చున్నాడు. తెలంగాణలో వేముల వాడ రాజన్న అంటే ఎంతో మహిమాన్వితమైన దేవుడు. తెలంగాణలో అత్యంత పురాతమైన దేవాయాలలో వేములవాడ రాజన్న ఆలయం ఎంతో విశిష్టమైంది. పశ్చిమ చాళుక్యుల కాలం కోనేరులో వున్నాననిచెప్పి, గుడి కట్టమని స్వయంగా శివుడే ఆదేశిస్తే గుడి నిర్మాణం జరిగింది. నాటి నుంచి రాజన్న పూజలందుకుంటున్నాడు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్నాడు. నిత్యం లక్ష మందికి పైగా వేముల వాడ రాజన్నను భక్తులు దర్శించుకుంటారు. మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు కొంగు బంగారమైన దేవుడు రాజరాజేశ్వర స్వామి. ఇప్పుడు బస్సు సౌకార్యలు, ఇతర రవాణా సౌకర్యాలున్నాయి. ఆరోశతాబ్ధంలో నిర్మాణమైన ఆలయం చాళుక్యుల కాలం నుంచి వెలుగు వెలుగుతోంది. రాజన్న ఆలయ కోనేరులో స్నానమాచరిస్తే శారీరక రోగాలన్నీ మాయమౌతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అలా కొన్ని వందల సంవత్సరాలుగా తెలంగాణలో విరాజిల్లుతున్న గొప్ప శైవక్షేత్రం. ఉమ్మడి పాలకులు ఏనాడు వేముల వాడను పట్టించుకోలేదు. వసతుల సౌకర్యాలు కల్పించలేదు. ఇప్పటికీ వేముల వాడలో వున్న గృహ సముదాయాలు కొన్ని వందల ఏళ్ల కాలం నాడు నిర్మాణం చేసినవే తప్ప, ఉమ్మడి రాష్ట్రంలో గాని, తెలంగాణ వచ్చిన తర్వాత గాని చేసిన నిర్మాణాలు లేవు. తెలంగాణలోని కొన్ని లక్షల కుటుంబాలు ఏటా రాజన్నను దర్శించుకోకుండా వుండరు. తెలంగాణలోని అన్ని దేవాలయాలకన్నా, ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వేముల వాడ నుంచే లభిస్తుంది. అయినా పాలకులు ఏనాడు వేముల వాడ అభివృద్దిపై దృష్టిసారించలేదు. గతంలో ఏటా వంద కోట్లు ఇస్తామని గొప్పలు చెప్పిన కేసిఆర్‌ మాటలు మాత్రం అనేకం చెప్పారు. వేముల వాడ టెంపుల్‌ ఏరియా అధారిటీ ఏర్పాటుచేశారు. పురుషోత్తమ రెడ్డిని సీఈవోగా నియమించారు. తొలిసారి ప్రకటించిన వంద కోట్లలో కూడా కొంత మాత్రమే ఇచ్చారు. కొంత దేవాలయ స్ధలాన్ని చదను చేసి వదిలేశారు. ఆ తర్వాత నిధులు మంజూరు మర్చిపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత కనీసం కొత్త క్యూలైన్‌ కూడా ఏర్పాటు చేయలేదు. నిర్వహణ లోపం గతం కన్నా అద్వాహ్నం చేశారు. సానిటేషన్‌ గురించి పట్టించుకునే నాధుడు లేడు.
ఇక ఉద్యోగుల అవినీతికి లెక్కే లేదు.
అంత పెద్ద గుడికి పూర్తి స్ధాయి ఈవో ఎప్పుడూ వుండడు. ఎప్పుడూ ఇన్‌చార్జి ఈవోలే దిక్కవుతారు. ఏటా కనీసం వంద కోట్ల ఆదాయం వేముల వాడ నుంచి ప్రభుత్వానికి వెళ్తుంది. ఈ ఆలయంలో ఓ పదమూడు మంది ఉద్యోగులు దశాబ్ద కాలానికి పైగా తిష్టవేశారు. వారు చేసే అవినీతి అంతా ఇంతా కాదు. వీరి అవినీతి మీద విజిలెన్స్‌ ఎంక్వైరీ కూడా జరిగింది. సుమారు31 పేజీల నివేదిక తయారు చేశారు. విజిలెన్స్‌ అధికారులు ఒక్క రోజే రెండు లక్షల లడ్డూల రికవరీ చేసినట్లు రాశారు. రాజన్న భక్తుల కోసం కొనుగోలు చేసిన వస్తువులలో 25రూపాయలకు పైగా సరుకులు మాయమైనట్లు నిర్ధారణ చేశారు. ఇక కాళ్యాణ కట్టలో జరిగే అవినీతి, ధర్మశాల కిరాయిలలో చేతి వాటాలలకు లెక్కేలేదు. రీజినల్‌ జాయింట్‌ కమీషనర్‌ రామకృష్ణ మొత్తం ఎంక్వైరీ చేసి నివేదిక ఉన్నతాధికారులకు ఇచ్చారు. కాని అది బుట్ట దాఖలైంది. ఎలా పైనుంచి కింది దాకా రాజన్న సొమ్మును తింటున్నారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. భక్తులకు అసౌకర్యాలు సృష్టిస్తున్నారు.
ఎముడాల రాజన్న.. మా పార్టీ అధికారంలోకి రావాలని, నాయకులు ఎన్నికల్లో గెలవాలని మొక్కులు మొక్కుతారు. కోడెలు కట్టేస్తారు.
పదవుల కోసం పాహిమాం..పాహిమాం అంటారు. రాజకీయాలతో రాజ్యమేలాలని రాజన్నా, రాజన్నా అని కొలుస్తారు. తీరా కోర్కెలు తీరగానే, పదవులు రాగానే రాజన్నను మర్చిపోతారు. ఇది ఇప్పటి తరం నాయకులు పరిస్ధితి. అయినా రాజన్న అందర్నీ చల్లగానే చూస్తాడు. తప్పులు చేసిన వారిని కూడా క్షమిస్తాడు. దీవెనార్తులు ఇస్తూనే వుంటాడు. అందుకే పాలకులు తప్పు చేసినా, ఉద్యోగులు ఆలయాన్ని ఊడ్చుకుతింటున్నా ఊరుకుంటున్నాడు. ఉన్నది మేస్తున్నా కనికరిస్తున్నాడు. అవును…నిజమే..లేకుంటే దశాబ్ధాల తరబడి పూచిక పుల్ల కూడా వదిలిపెట్టకుండా దోచుకుతింటూ, దేవుని సొమ్మునే కైంకర్యంచేస్తూ, గుడికి చెందాల్సిన సొమ్మును దోచేస్తుంటే కూడా ఎవరూ ఏం చేయలేకపోతున్నారు. ఎంత మంది భక్తులు పిర్యాధులు చేసినా పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లు ఎక్కడిక్కడ ఎవరికి అందినంత వారు దోచేస్తున్నారు. ఆలయానికి వచ్చిన ఆదాయానికి కన్నం పెడుతున్నారు. రాజన్న భక్తులకు చుక్కలు చూపిస్తున్నారు. దేవుని సొమ్ము స్వాహా చేస్తున్నారు. దక్షిణాదిలో వైష్ణవాలయాలు వెలిగిపోతుంటే, శివాలయాలు దీపానికి కూడా నోచుకోవడం లేదని కొత్త బాష్యాలు చెప్పిన గత ముఖ్యమంత్రి కేసిఆర్‌ వేముల వాడను అభివృద్ధి చేస్తానని మాటలు చెప్పాడు. రాజన్నను కూడా మాయ చేశాడు.
కొత్త ప్రభుత్వం వచ్చింది. తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది.
ఉమ్మడి కరీంనగర్‌ నుంచి ఇద్దరు మంత్రులున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర సయమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజన్నను దర్శించుకున్నారు. ఆశీర్వాదం తీసుకున్నారు. దేవాదాయ, ధర్మాధాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ వున్నారు. త్వరలో సమ్మక్క`సారక్క జాతర పెద్దఎత్తున తెలంగానలో జరగనున్నది. తెలంగాణ నలు మూలలనుంచి సమ్మక్క జాతరకు వెళ్లే భక్తులు చాల వరకు ముందు వేముల వాడ రాజన్నను దర్శనం చేసుకున్న తర్వాతే సమ్మక్కతీర్ధం వెళ్తారు. అందువల్ల ఈ సమయంలో వేములవాడ అభివృద్దికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని భక్తులు ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా గత పదేళ్లకాలంలో వేములవాడలో జరిగిన అవినీతిపై కూడా మంత్రి కొండా సురేఖ దృష్టిసారించాలని కోరుతున్నారు. దశాబ్ధానికి పైగా పాతుకుపోయిన ఉద్యోగులు, ఈవోతో సహా అనేక అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్‌ ఎంకైరీలో తేలింది. రిపోర్టు కూడా సంబంధిత శాఖ వద్ద కూడా వుంది. వెంటనే ఎంతో పవిత్రమైన రాజన్న ఆలయంలో తప్పు చేసిన వారికి శిక్షలు పడాల్సిందే. దేవుని సొమ్మును దోచుకున్నవారి భరతం పట్టాల్సిందే. లేకుంటే కొత్త ప్రభుత్వం మీద కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పాలకులు మారినా రాజన్న ఆలయంలో తిష్ట వేసుకొని కూర్చున్న అవినీతి పరులను కదల్చడం ఎవరి తరం కాదన్న అహం వారిలో మరింత పెరుగుతుంది. భక్తులకు సౌకర్యాల కల్పనలో మరింత నిర్లక్ష్యం కనిపిస్తుంది. కొత్త ప్రభుత్వం వెంటనే స్పందించి, రాజన్న ఆలయానికి మంచి రోజులు, భక్తులు మెరుగైన సౌకర్యాలు, సేవలు కల్పించాలని కోరుతున్నారు.

పేదలకు విదేశీ విద్య వెలగపండే..నా?

https://epaper.netidhatri.com/

`5 లక్షలిస్తేనే సంతకం పడేనా?

`మంత్రి పొన్నం దీనిపై దృష్టి పెడతారా?

`తన టేబుల్‌ మీద వున్న ఫైలుపై సంతకం చేస్తారా?

`మంత్రికి తెలిసి జరుగుతోందా!

`తెలియకుండానే ఫైల్‌ రెడీ అయ్యిందా?

`బిసి.వెల్ఫేర్‌ డిపార్ట్మెంట్‌, ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ సెక్షన్‌ బాగోతం!

`గతంలో 2 లక్షలకు నడిచిన వ్యవహరం.

`ప్రభుత్వం మారడంతో 5 ఐదులక్షలకు పెంచిన బేరం.

హైదరబాద్‌,నేటిధాత్రి:

పేదల సంక్షేమ కోసం ప్రభుత్వాలు కేటాయించే కొన్ని నిధులు దుర్వినియోగం కావడం చూస్తూనే వుంటాం. పేదల కోసం కేటాయించిన నిధులు కొన్ని సార్లు గద్దల పాలు కావడం కూడా వింటూనే వుంటాం..ఇక్కడా అదే జరుగుతోందని సమాచారం. అది బిసి. వెల్ఫేర్‌ డిపార్టుమెంటు ఓవర్సీస్‌ సెక్షన్‌లో( మహాత్మ జ్యోతిరావ్‌ పూలే విదేశీ విద్యా నిధి) పనిచేసే ఓ ముగ్గురు ఉద్యోగుల చేతి వాటం మూలంగా నిధులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరికీ కూడా విషయాలు తెలియకుండా అత్యంత గోప్యంగా ఈ తంతు జరుగుతున్నట్లు సమాచారం. ఆ సెక్షన్‌లో డిడిగా ఉదయ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ నికేష్‌, పిఏ. ఔట్‌సోర్సింగ్‌ వెంకటేష్‌లు ముగ్గురు కలిసి ఈ వ్యవహారం నడుపుతున్నారని తెలిసింది. గత కొన్నేళ్లుగా వీరు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని పెద్దఎత్తున విమర్శలున్నాయి. ఇటీవల కొత్త ప్రభుత్వం రావడంతో గతంలో వసూలు చేసేదానికన్నా, ఎక్కువ మొత్తంలో విద్యార్ధుల తల్లిదండ్రులనుంచి తీసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం.
ఇంతకీ ఏం జరుగుతోంది: మహాత్మా జ్యోతిరావు పూలే విదేశీ విద్యా నిధి అనే రాష్ట్ర ప్రభుత్వం ఏటా కొన్ని నిధులు కేటాయిస్తూ వుంటుంది. ప్రతి ఏడు తెలంగాణ నుంచి కనీసం 300 మందికి తక్కువ కాకుండా విదేశీ చదువు కోసం వెళ్లే విద్యార్ధులకు ఆర్దిక సాయం అందిస్తుంది. ఇదే కొందరు అక్రమార్కులకు ఆదాయ మార్గంగా మారింది. విద్యార్ధి దశలో ఎంతో కష్టపడి చదువుకునే పేద విద్యార్ధులకు ఆర్ధిక సమస్యలు ప్రధాన అడ్డంకిగా మారి వారి ఉన్నత చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. అలా గొప్ప స్ధాయిలో వుండాల్సిన ఎంతో మంది భవిష్యత్తు ఎక్కడో ఒక దగ్గర ముందుకు సాగకుండా ఆగిపోతోంది. వారి విజ్ఞానం సమాధి చేయబడుతోంది. సమాజానికి వారి మేధస్సు దూరమౌతోంది. నెరవేరని కలగా వారి జీవితాలు మిగిలిపోతున్నాయి. కుటుంబాల ఆర్ధిక పరిస్ధితి అంతంత మాత్రంగా వుండడం ఒక్కటే శాపమౌతుంది. కాని ఆ విద్యార్ధుల్లో ఎంతో ప్రతిభ దాగివుంటుంది. తమకు కొంత డబ్బు వుంటే అందరిలాగా విదేశీ విద్య అందేదన్న బాధ మనసును తొలుస్తూ వుంటుంది. ఇంతే మన ఖర్మ అని ఎక్కడో అక్కడ చదువు ఆపేసుకోవాల్సివస్తుంది. అలాంటి విద్యార్ధుల చదువు మధ్యలోనే ఆగిపోవద్దని వారి విజ్ఞానం వృధా కావొద్దని వారి, ఆశలు ఆడియాసలు కావొద్దని గతంలో ప్రభుత్వాలు మంచి నిర్ణయం తీసుకున్నాయి. పేదలకు కూడా పూర్తిగా ఉన్నత విద్యను ఉచితంగా అందుబాటులో వుంది. రాష్ట్రం వరకు ఎంత చదువుకున్నా అంత మేర ఉచితంగా విద్యను ఫీజు రీఎంబర్స్‌ మెంటు పేరుతో ప్రభుత్వం అందిస్తోంది. అయితే కొందరు ఎంతో చురుకైన విద్యార్థులు మరింత ఉన్నతమైన జీవితం కోసం కలలు కంటుంటారు. రాత్రింబవళ్లు శ్రమిస్తుంటారు. విజయాలు సాదిస్తుంటారు. అయినా విదేశీ విద్య అనగానే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అది ధనవంతులకు పెద్ద ఇబ్బంది కాదు. కాని పేదలకు అదే పెద్ద కష్టం. దాంతో ఆశలు చంపుకునేవారు ఎంతో మంది వున్నారు. మన జీవితాలు ఇంతేలే అని అడ్జస్ట్‌ అయ్యే వాళ్లున్నారు. కొంత మంది కుంగిపోయేవాళ్లుంటారు. అలా ఎంతో ప్రతిభ వున్నవారి చదువు ఎక్కడా ఆగిపోకుండా ఈ విద్యా నిధి దోహదపడుతుంది. పేదలలో ఎంతో మంది విజ్ఞాన వంతులున్నారు. ఎంతో మేదాశక్తి వున్నవారున్నారు. వారికి కొద్దిగా ఆర్ధిక తోడ్పాటునందిస్తే అద్భుతాలు సృష్టిస్తారు. అధ్భుతమైన విజయాలు సాధిస్తారు. అలాంటి వారి జీవితాశయాలు మొగ్గదశలోనే వాడిపోకూడదు. స్వార్ధ పరుల మూలంగా వారి భవిష్యత్తు నాశనం కావొద్దు. అయితే తెలంగాణలో ఏటా కొన్ని వేల మంది వెళ్లాలనుకుంటారు. కాని ప్రభుత్వం అంత మందిని ప్రోత్సహించలేదు. కేవలం ఏటా 300 మందిని మాత్రమే పంపేందుకు అవకాశం కల్పించింది. ఇదే అక్రమార్కులకు రాచమార్గమైంది.
ఎవరు అర్హులు: ఈ విద్యానిధిపై ఇంకా చాలా మందిలో అవగాహన లేదు. ఈ సదుపాయం అందాలంటే విద్యార్ధులు 35 ఏళ్ల వయసు మించకూడదు. ఇంజనీరింగ్‌, అగ్రికర్చర్‌ సైన్స్‌, మెడిసిన్‌, ఇలా కొన్ని ప్రత్యేక విభాగాలైన విద్యను విదేశాలలో చదువుకునేందుకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుంది. ఉన్నత విద్యలో 60శాతానికి పైగా మెరిట్‌ వున్నవారికి ఈ సదుపాయం కల్పించబడుతుంది. అయితే ఆ విద్యకు సంబందించిన కొన్ని పరీక్షలు కూడా వారు ఉత్తీర్ణత సాధించాల్సి వుంటుంది. జీఆర్‌ఈ, జీమ్యాట్‌ సాధించాలి. ఐ 20 ఆహ్వానాలు వుండాలి. అందుకు వీసాలు వచ్చిన వారిని ఈ నిధి అర్హులుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. అయితే ఇది అన్ని దేశాలలో ఉన్నత విద్యకోసం కాదు. కేవలం కొన్ని దేశాలకే పరిమితం. అందులో అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్‌ కొరియా, జపాన్‌, రష్యా, కెనడా, జర్మనీ, యూకే. సింగపూర్‌, న్యూజిలాండ్‌ వంటి దేశాలకు మాత్రమే వర్తింపజేస్తారు. గతంలో ప్రతిభావంతులైన విద్యార్ధులను ప్రోత్సహించేందుకు రూ.10 లక్షలు ఇచ్చేవారు. కాని తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం రూ.20 లక్షలు అందజేస్తూ వస్తోంది. ఈ అవకాశాన్ని పేద విద్యార్దులు ఉపయోగించుకోవాలి.
అవినీతి జలగలు: ఇలా బిసి విద్యార్థులకు వరమైన ఈ నిధినుంచి స్కాలర్‌షిప్‌ పొందేందుకు అర్హత సాధించాలంటే ప్రతిభ ఒక్కటే వుంటే సరిపోదన్నట్లు, ఆ నిధులు ఇవ్వాలంటే రెండు లక్షలు లంచం ఇస్తే తప్ప రూ.20 లక్షలు ఇవ్వడం లేదు. ఇలా విద్యార్ధుల ఉజ్వలమైన భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ వస్తున్నారు. ఈ మాత్రం ఇచ్చుకోలేక ఎంతో మంది అర్హులైన విద్యార్ధులు చదువులను వదిలేసుకున్నవారు వున్నారు. కొంత మంది ధనవంతులు కూడా ఇలాంటి స్కీమ్‌లను వినియోగించుకునేందుకు సెక్షన్‌లోని ఉద్యోగులు అడిగినంత ఇచ్చి, రూ.20 లక్షలు తీసుకున్నవారు కూడా వున్నారు. అసలు అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌కు తెలియకుండానే ఉదయ్‌, నికేష్‌, వెంకటేష్‌ అనే ఉద్యోగులు పైల్‌ తయారు చేస్తుంటారన్న విషయం బైటకు వచ్చింది.
తాజాగా 5లక్షలు: గతంలో రెండు లక్షలు వసూలు చేసే ఈ ఉద్యోగులు కొత్త ప్రభుత్వం వచ్చిందని, పై వారికి ముట్టజెప్పాలని చెప్పి రూ.5 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. అలా తీసుకున్న సొమ్ముతో తయారుచేసిన ఫైలు బిసి సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ టేబుల్‌ మీదకు పంపించారని తెలుస్తోంది. కొత్తగా వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ కు ఈ విషయం వెళ్లిందా? ఒక్కొక్కరి దగ్గర అంతంత వసూలు చేసి, కొత్త ప్రభుత్వాన్ని, మంత్రిని అబాసు పాలు చేసే అవకాశం వున్నాయి. అధికారులు తప్పు చేసినా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది. గత ప్రభుత్వంలో రెండు లక్షలు వసూలు చేశారన్న అపవాదు వుంది. అందుకే అధికారం కోల్పోయారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అవినీతి అధికారుల కొమ్ముకాస్తుందన్న అపవాదు ఎదుర్కొవాల్సివస్తుంది. అందువల్ల అసలు అడ్మినిస్ట్రేవివ్‌ ఆఫీసర్‌ సంతకం లేకుండానే ఫైలు ఎలా మంత్రి వద్దకు చేరిందో తెలియాల్సిన అవసరం వుంది. ఇంత కాలం పేదల సొమ్ము అప్పనంగా తిన్న ఈ ముగ్గురు ఉద్యోగులను విధులనుంచి తొలగించి వారు తిన్నది కక్కించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

గుట్ట లోగుట్టు తేల్చుతారా?

https://epaper.netidhatri.com/

భక్తిరంజిత గుట్టనే మింగిరే!

`రేవంత్‌ రెడ్డి ఆనాడు అక్రమమనెనే!

`దాసోజు కూడా బాగానే కొట్లాడెనే?

`విజయారెడ్డి కేసు నమోదు చెసెనే!

`అయినా కోవెల కూలెనే!

`దేవుడు కొండ దిగెనే?

`అనాధగా ఓ మూలన నిలబడెనే!

`దేవుని గుడి చెదిరే..భవంతులు వెలసెనే!

`స్థలం స్వాధీనం చేసుకుంటారా?

`గుట్ట మింగిన ఘనులకు వదిలేస్తారా?

`బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేస్తారా?

`ప్రభుత్వ భూమిని అప్పనంగా దోచిపెట్టిన వారిని జైలుకు పంపుతారా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అది ప్రకృతి రమణీయతకు ప్రతిరూపమైన పచ్చని వెండికొండలాంటి ప్రదేశం. సమాచారం మేరకు సుమారు పద్నాలుగు ఎకరాల నిర్మానుష్యమైన, అరుదైన ఆయుర్వేద మూలికలు కలిగివున్న ప్రాంతం. అభయాంజనేయ స్వామి కొలువైన వున్న స్ధలం. జాతీయ పక్షి నెమళ్లు నడయాడుతూ, నాట్యమాడే ఆహ్లాదరకమైన వాతావరణం. జీవ వైవిద్యానికి నిదర్శనం. ఏటా వేలాదిమంది హనుమాన్‌ భుక్తులు మాల ధారణతో ఆ కోవెలను నమ్ముకొని అంజన్నను కొలిచే ధ్యాన లోకం. అయితేనేం గత ప్రభుత్వం కొందరు వ్యక్తులకు అప్పనంగా కట్టుబెట్టింది. ముందూ వెనుక ఆలోచించకుండా అధికారులు చెప్పిన దానికి తలూపింది. మన మనిషే కదా? అని అంతా దోచిపెట్టింది. ఇవ్వాల్సిన దానికి లెక్కలేదు. ఇచ్చిన దానికి తెక్కలేదు. ఆక్రమించుకున్నదానికి లెక్కే లేదన్నట్లు కొండను అప్పనంగా కట్టబెట్టారు. ఆ వెంటనే వాళ్లు ఆ కొండను పిండి చేశారు. అక్కడ గుట్ట ఆనావాలు లేకుండా చేశారు. అసలు ఇచ్చిన భూమి ఎంత అంటే అధికారులు చెప్పరు? తీసుకున్నదెంత అని చెప్పడానికి ఎవరూ అందుబాటులో వుండరు. కాని అధికారులు దగ్గరుండి అందించింది కొండంత. ఇదే సందన్నట్లు ఇసంత రమ్మంటే ఇళ్లంతా నాదే అనుకున్నాడు. గుట్టే కాదు, ఆ గుట్టముందూ, వెనకవున్న భూమిని కూడా స్వాహా చేశారు. గుట్టమీద కొలువై వున్న అంజన్నను కూడా పక్కకు పొమ్మన్నారు. పాపం దేవుడు తన గోడు ఎవరికీ చెప్పుకోలేక అప్పటి నుంచి మౌన వ్రతం చేస్తున్నాడు.
కొండలెక్కినా దేవుడా ..ఆ బండలలో ఏముంది?
నువు చేసిన లోకం చూడు…అని భక్తులు పాటలు పడుతుంటే, దేవుడు ఆ పాటలు వింటుంటే, ఆ ఏమరపాటులో కొండలు కొట్టేస్తున్న ఘనులున్నారు. కొండలు, గుట్టులు మింగేస్తున్నారు. దేవున్ని నిజంగానే కొండ దించేస్తున్నారు. దేవుడికి ఆ కాస్త చోటు కూడా లేకుండా చేస్తున్నారు. ఆస్ధులు, అంతస్ధులు కావాలి దేవుడా వరాలియ్యవా? అని మొక్కుల మీద మొక్కులు మొక్కాలి. తదాస్తు అనగానే దేవుడు కొలువై వున్న కొండలనే దోచేయాలి. దేవుడా అని వేడుకున్న నోటితోనే అడ్డుగా వున్న కోవెల కూల్చేయమనాలి. వ్యాపారం చేయాలి. కొండలు తవ్వి అంతస్ధులు నిర్మించాలి. ఆ దేవుణ్ణి అనాదను చేయాలి. లోకాన్ని కాపాడే దేవుడికే శఠగోపం పెట్టాలి. పైకి బొట్టు, బోనం, భక్తి ముసుగు చూపించాలి. కాలం కలిసి రాగానే దేవుణ్ణి కూడా దూరంగా తరిమేయాలి. ఇదంతా ఎక్కడ జరిగిందనుకుంటున్నారా? హైదరాబాద్‌లోనే… జూబ్లీహిల్స్‌లోనే…
సరిగ్గా రెండేళ్లుగా నేటిధాత్రి దినపత్రిక గుట్ట`గుడి అంటూ నెత్తి, నోరు కొట్టుకొని ఎంత మొత్తుకున్నా, గుట్టను ఎవరూ కాపాడలేదు.
గుడిని మింగేకుండా అడ్డుకోలేదు. ఈ సంగతి ఆనాటి పాలకులకు తెలుసు. ఆనాటి ప్రతిపక్షనేత, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా తెలుసు. గుట్టను కూల్చితే ఊరుకోం..ప్రభుత్వ స్ధలం దారాధత్తంచేస్తే సహించమని చెప్పిన రేవంత్‌రెడ్డి నాడు ఎంతో కంఠశోషతో చెప్పారు. నేడు అధికారంలోకి వచ్చారు. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెట్టిన వైనంపై లోతైన తవ్వకాలు జరగాలి. ఆనాడు ప్రభుత్వం గుట్టను కూల్చిన వ్యక్తులకు కట్టబెట్టింది ఎంత? అధికారులు దోచిపెట్టింది ఎంత? అసలు అక్కడున్న ప్రభుత్వ స్ధలమెంత? ఇప్పుడు ఆ స్ధల యజమానులుగా చెప్పుకుంటున్నవారు అక్రమంగా ఆక్రమించింది ఎంత? అందులో ముడుపులు ముట్టిందెంత? పుచ్చుకున్నదెంత? వాళ్లెంతమంది అన్నది కూడా తేలాలి.
అది జూబ్లీహిల్స్‌ ప్రాంతం. అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం.
కొందరి కన్ను పడిరది. ప్రభుత్వం వారికి రుణ పడి వుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏదో జరిగింది. అది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వరమైంది. అందులోనూ గత ప్రభుత్వంలో కీలకమైన నేతగా వున్న వ్యక్తికి అప్పనంగా గుట్టను కట్టబెట్టింది. అసలు ఈ విషయం తెలిసిన నేటి ధాత్రి మొదటి రోజు నుంచి జరుగుతున్న మోసాన్ని వివరిస్తూనే వున్నది. విన్నవారంతా ఆ వ్యక్తికి రాత్రికి రాత్రి చీకటి బంధవులౌయ్యారు. గుట్టను కాపాడుతామన్నవారు, మరునాడు మాయమౌతున్నారు. మేమున్నామంటూ వచ్చి చెప్పిన పెద్ద పెద్ద నాయకులు ఆ తర్వాత మౌనం పాటించారు. అంతే కాదు గుట్ట..గుడిని కాపాడేది మేమే అంటూ కొంత మంది స్వాములు కూడా ఆ సమయంలో బయలు దేరారు. యాగాలు, యజ్ఞాలు చేశారు. టెంట్లు వేసుకొని దీక్షలు చేపట్టారు. లోగుట్టు పెరుమాళు కెరుక అన్నట్లు స్వాములు కూడా సైలెంటుగా పక్కకు వెళ్లిపోయారు. అక్కడ బహుళ అంతస్ధులు సముదాయాలు నిర్మాణం చేస్తున్నవారికి సరెండరైపోయారు. ఈ విషయంపై వరుస కధనాలు రాసిన నేటిధాత్రి వార్తలను చూసిన స్వాములే బెదించే ప్రయత్నం చేశారు. తెలంగాణకు ఏ మాత్రం సంబంధం లేని గుంటూరు స్వాములెందుకొచ్చారు? గుట్ట కాపాడే ముసుగెందుకేసుకున్నారు? నేటిధాత్రిని ఎందుకు బెదిరించారు? ఇప్పటీ అర్ధం కాని శేష ప్రశ్నలివి. ఇలా ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా నేటిధాత్రి కధనాలను ఆపలేదు. గుట్ట, గుడి కథ రాష్ట్రంలో పెద్ద వార్త దావానలంగా మారింది. ఆరెస్సెస్‌ రంగలోకి దిగింది. భజరంగ్‌ ధళ్‌ ధర్నా చేసింది. బిజేపి మేమున్నామని అన్నది. స్ధానిక ఎమ్మెల్యే స్పందించాడు. స్వాహా పర్వమంతా బిఆర్‌ఎస్‌నేతదే అని తెలిసి తనకు అందాల్సింది తీసుకొని వెళ్లిపోయాడు? నగర బిజేపి ఏకైక ఎమ్మెల్యే నేనున్నాడన్నాడు. నాటి పిపిసి. అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అనేక సార్లు మీడియా ముందు ప్రస్తావించారు. ప్రభుత్వం ఆ స్ధలం తిరిగి తీసుకునేదాకా వదిలిపెట్టమని ఆనాడు రేవంత్‌ రెడ్డి అప్పటి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఆ గుట్టను స్వాహా చేయడాన్ని అడ్డుకుంటామన్నాడు. ఆ సమయంలో కాంగ్రెస్‌లో వున్న నేటి బిఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ అనేక సార్లు గుట్ట గుడి వివాదంలో వేలు పెట్టాడు. ఆనాటి ప్రభుత్వాన్ని తూర్పార పట్టాడు. అన్యాయమని మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి, నిజా నిజాలు వెల్లడిరచారు. ఈ విషయంలోనే దాసోజు కాంగ్రెస్‌నుంచి బైటకు వెళ్లాడన్న వార్తలు కూడా ఆనాడు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు అదే దాసోజు బిఆర్‌ఎస్‌లో చేరాడు. సైలెంటు అయ్యాడు. గుట్ట వ్యవహారం మర్చిపోయాడు.
అసలు అక్కడ గుడే లేదని కూడా సదరు నాయకుడి వ్యాపార భాగాస్వాములు రివర్స్‌ గేమ్‌ మొదలుపెట్టారు.
దాన్ని నేటిధాత్రి పూర్తి స్ధాయి ఆధారాలు ప్రచురించింది. జూబ్లిహిల్స్‌ కార్పోరేటర్‌ విజయారెడ్డి కూడా సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన విషయం కూడా వెలుగులోకి నేటిధాత్రి తెచ్చింది. ఈ గుట్టమీద కన్ను పడిన సదరు వ్యాపారులే గతంలో ఓసారి గుడిని కూల్చే ప్రయత్నం చేశారు అన్న ఆరోపణలు కూడా వున్నాయి. ఏకంగా అంజన్న విగ్రహాన్ని కూడా ద్వంసం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎంతో మంది హిందుత్వ వాదులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సంగతి విజయారెడ్డి దృష్టికి రావడంతో అంజన్న విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆమె పిర్యాదు చేశారు. అయితే దేవాదాయ శాఖ అప్పటికీ స్ధలాన్ని స్వాధీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఎందుకంటే గుడి కూల్చిన తర్వాత నేటిధాత్రి దేవాదాయ శాఖను కూడా ప్రశ్నించడం జరిగింది. దేవాదాయశాఖ అధికారులను కూడా కమ్మేసినట్టు సమాచారం. అప్పటి ప్రభుత్వ పెద్దలు, ఉన్నత స్ధాయి అదికారులు, రెవిన్యూ యంత్రాంగం భరితెగించి, అప్పటి బడా నాయకుడికి సహకరించారు. ప్రజలు ఎంత మొత్తుకున్నా గుట్టను తిరిగి ఫ్రభుత్వం స్వాధీనం చేయలేదు. దేవాదాయా శాఖకు అప్పగించలేదు. విచిత్రమేమిటంటే అదే జూబ్లీహిల్స్‌లో ప్రైవేటు స్ధలాన్ని కొంత మంది సినీ గద్దలకు పెట్టి, అక్కడ గుడి కట్టేందుకు సహకరించి మరింత స్ధలం ఇచ్చారు. ఆ పక్కనే గుడి వున్న గుట్టను ఓ బిఆర్‌ఎస్‌ నాయకుడికి కట్టబెట్టి, గుట్టనే లేకుండా చేశారు. గుడిని మాయం చేశారు. అభయాంజనేయ స్వామికే శఠగోపం పెట్టారు..ఇదండీ సంగతి…మరి ప్రభుత్వం మేలుకుంటుందా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందిస్తారా? లేక మాదాకా సమాచారం లేదని చేతులు దులుపుకుంటారో చూడాలి…ఎందుకంటే గుట్ట గుడి సంగతులు రాస్తే రామాయణమంతా వున్నాయి?

కాంగ్రెస్‌ హమీలు..అరుంధతి నక్షత్రమే!

https://epaper.netidhatri.com/

నెల రోజుల కాంగ్రెస్‌ పాలనపై ‘‘మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు’’ నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు ఆయన మాటల్లోనే..

`పథకాలు మంగళం సమర్పయామి అనుకోవడమే!

`పట్టపగలు ప్రజలకు చుక్కలు చూపించడమే.

`మమ.. అనుకొని చేతులు దులుపుకోవడమే!

`కూర్చునేది లేదు…కుదురుకుంటున్నట్లు లేదు!

`సీటు కాపాడుకోవడం కోసం కూడా సమయం సరిపోయేట్టు లేదు.

`రెండు లక్షలు అప్పు చేసుకోమన్నారు…రాగానే మాఫీ మర్చిపోయారు.

`రైతుభరోసా ఎక్కడుందో ఎవరూ చెప్పలేరు.

`ఇప్పటికే నిరుద్యోగ భృతికి మంగళం పాడారు.

`అసెంబ్లీ సాక్షిగా ఇస్తామని ఎక్కడా చెప్పలేదని తేల్చేశారు.

`మహిళలకు అన్ని బస్సు సర్వీసులు ఫ్రీ అన్నారు…పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌కు పరిమితం చేశారు.

`హైదరాబాద్‌, డిల్లీ యాత్రలకే పుణ్య కాలం పోతోంది.

`చీమ చిటుక్కుమన్నా డిల్లీకే వెళ్లాలి.

`అడుగుముందుకేయాలన్నా అధిష్టానాన్ని అడగాలి.

`సంక్షేమం గాలికి…కాంగ్రెస్‌ నేతల పరుగులు డిల్లీకి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

గాలి వానకు గొడుకు పడితే ప్రయోజనం వుంటుందా? ముళ్లకంచెను నీటిలో నాటితే నాటుకుంటుందా? కాంగ్రెస్‌ పరిస్ధితి కూడా అంతే… కాంగ్రెస్‌ను నమ్ముకున్న తెలంగాణ అరవైఏళ్లు గోసపడిపంది. అందుకే తెలంగాణ కోసం కేసిఆర్‌ కొట్లాడిరది. తెలంగాణ తెచ్చింది. తెచ్చిన తెలంగాణలో వెలుగులు నింపింది. కొన్ని సార్లు ప్రజలు కూడా మాయలో పడిపోయే అవకాశం వుంటుంది. అయితే అది తాత్కాలికమే. ఎల్లకాలం ప్రజలను ఎవరూ మోసం చేయలేదు. కాంగ్రెస్‌ చేసిన మోసం అధికారంలోకి వచ్చిన మరునాడే తేలిపోయింది. ఎన్నికల ముందు ఏం చెప్పారు? ప్రమాణ స్వీకారం రోజే ఆరు గ్యారెంటీల మీద సంతకాలన్నారు. తెలంగాణ ప్రజలు కొంత నమ్మారు. దాంతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అయినా కాంగ్రెస్‌లో మార్పు రాలేదు. మారు కావాలని పదే పదే తెలంగాణ ప్రజలకు చెప్పి,నమ్మించిన కాంగ్రెస్‌ పార్టీ మారిందా? అంటే మారలేదు. గతం తాలూకు బాగోతాలు మర్చిపోలేదు. అందుకే తొలి రోజు నుంచే పాలన గాలికొదిలేశారు. రాజకీయం మాత్రమే చేస్తున్నారు. అసలు అధికారంలోకి వచ్చామన్న నమ్మకం వారికే లేదు. అందుకే సంక్షేమం గాలికి వదిలేశారు. రైతులకు ఇచ్చిన హమీలు మర్చిపోయారు. బిఆర్‌ఎస్‌ అధికారంలో వున్నప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ రైతాంగ సంక్షేమం, తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం పనిచేశారు. కాని కాంగ్రెస్‌ పార్టీ తన ప్రయోజనం తప్ప ప్రజా ప్రయోజనం అన్నది మర్చిపోయింది. బిఆర్‌ఎస్‌ అధికారంలో వున్న సమయంలో నీటి పారుదల ప్రాజెక్టు గేట్లు ఎత్తితే గంగమ్మ ఉరకలెత్తి, పరుగు పరుగున పొలాలకు చేరినట్లు, రైతు బంధు వేయగానే ట్రింగ్‌, ట్రింగ్‌ మంటూ రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం పడేది. మరి ఇప్పుడు ఎవరు ఏం చెబుతున్నారో అర్ధం కావడం లేదు. ముఖ్యమంత్రి రైతు భరోసా వేశామంటాడు. మరో మంత్రి రైతు భరోసా వస్తుందంటాడు..మరో మంత్రి వేస్తామంటాడు..ఇందులో ఎవరి మాటలు నిజమో వాళ్లుకే తెలియకుండా పోయింది. తెలంగాణ రైతులకు సంకటంగా మారింది. అంటున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో నెల రోజుల కాంగ్రెస్‌ పాలనపై పంచుకున్న ఆసక్తి కరమైన విషయాలు ఆయన మాటల్లోనే…
తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి, మాయ చేసి, పదే పదే అబద్దాలు వల్లెవేసి, చెప్పిందే చెప్పి, అధికారంలోకి వచ్చారు. వచ్చిన మరుసటి రోజు నుంచే ప్రజలను మోసం చేస్తున్నారు.
వారి చేతగాని తనం కప్పిపుచ్చుకోవడానికి బిఆర్‌ఎస్‌మీద లేని పోని అవాస్తవాలు ప్రచారం చేసుకుంటూ నెల రోజులు గడిపేశారు. ఇక ఇంకా ఎలా కాలం గడపాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌ పేరు చెప్పి మరింత కాలం పబ్బం గడుపుకోవాలని మాత్రమే చూస్తున్నారు. కాని ప్రజలకు మేలు చేసే అంశం మర్చిపోయారు. ఇచ్చిన హామీలు గాలికొదిలేశారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశమిచ్చారు. ఒక్క ఛాన్స్‌..ఒక్క ఛాన్స్‌ అంటూ గత ఏడాది కాలంగా ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వేడుకుంటూ వచ్చారు. అయినా ప్రజలు కనికరించేట్లు కనిపించలేదు. నిరుద్యోగ యువతను రెచ్చగొట్టారు. ఇలా అన్ని వర్గాల ప్రజలకు లేని పోని, అలవి కాని హామీలను గుప్పించారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలనే కాపీ కొట్టి, కొత్తగా చెప్పడం మొదలుపెట్టారు. ప్రజలను ఏదో విధంగా నమ్మించారు. అధికారంలోకి వచ్చి పట్టుమని పది రోజులు కాకముందే ప్రజా గ్రహానికి గురయ్యారు. గతంలో ఇలా పది రోజలకే ప్రజల నుంచి ఇంతటి వ్యతిరేక ఎదుర్కొన్న ప్రభుత్వం ఏదీ లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన విధానానికి, అదికారంలోకి వచ్చి అనుసరిస్తున్న ఆచరణకు పొంతన లేదు. అందుకే ప్రజలకు కూడా పది రోజులకే కాంగ్రెస్‌ పాలన ఎలా వుంటుందో అర్ధమైంది. అప్పుడు ప్రజల తిరుగుబాటు మొదలైంది. కాంగ్రెస్‌ అంటేనే కరంటు కష్టాలు, ప్రజలకు నష్టాలు..రైతులకు ఆపసోపాలు..అన్ని వర్గాల ప్రజలను అయోమయానికి గురిచేయడమే… గతంలో చూసినవే… యాభై ఏళ్లు ప్రజలు అధికారమిచ్చినా ఎలాంటి సంక్షేమాలు అమలు చేయని, కాంగ్రెస్‌, ఒక్క ఛాన్స్‌ ఒక్క ఛాన్స్‌ అని వేడుకుంటున్నప్పుడే బిఆర్‌ఎస్‌ చెప్పింది. కాంగ్రెస్‌ మాటలు నయవంచనకు రూపాలని పేర్కొనడం జరిగింది. అయినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను కనికరించి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్‌ హామీలు అరుంధతీ నక్షత్రమే.. పట్టపగలు ప్రజలకు చుక్కలు చూపించడమే అని మరోసారి రుజువైంది. కాంగ్రెస్‌ పథకాలు మంగళం సమర్పయామీ! అన్నదే ఇక వినపడేది.. ముమ్మాటికీ నిజమయ్యేది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైంది.
ఇచ్చిన హామీలలో రెండిరటిని చూపించి మమ అనిపించడం తప్ప చేసేదేమీ లేదు.
సరిగ్గా పాలనపై దృష్టిపెట్టేది లేదు. పెట్టేంత సమయం కాంగ్రెస్‌ నాయకులకు లేదు. ఎంత సేపు కుర్చీ కాపాడుకోవడం కోసం ఆరాటం మాత్రమే వుంటుంది. ప్రజలకు మేలు చేసే ఆలోచనలు కూడా వచ్చేందుకు సమయం వుండదు. కుర్చీలో కూర్చునేందుకు ఎలాంటి రాజకీయాలుచేశారో..ఎలాంటి మభ్యపెట్టే మాటలు చెప్పారో…కుర్చీ కాపాడుకోవడానికి కూడా అవే మాటలు చెబుతారు. కుర్చీలను అంటిపెట్టుకొని వుంటారు. ప్రజలకోసం ఆలోచించే తీరిక చేసుకోరు. పట్టుమని నెల రోజుల కాకముందే లుకలుకలు. కుదురుకోకముందే కుర్చీలాటలు. వాటిని కాపాడుకునేందుకు ఎత్తుగడలు. అనునిత్యం కుర్చీలకు కాపలాలు ..ఇక ప్రజల బాగోగులు ఎలా చూస్తారు.. కుర్చీలాటతో నెంబర్ల లెక్కలు వేసుకుంటున్నారు. పరిపాలన చేస్తామని వేడుకుంటే, అవకాశమిస్తే కుర్చీల కోసం అప్పుడే అంతర్గత కుమ్ములాటలను చూపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రజల మేలు ఏనాడు పట్టించుకోరు..గతం చెప్పిన సత్యమే ఇది…గతంలోకి తొంగిచూస్తే కనిపించే నిజాలివే…
అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు ఆశలు కల్పించారు.
ఇప్పుడు మీన మేషాలు లెక్కిస్తున్నారు. ఎన్నికల సమయంలోనే తాము నిజాయితీగా చెప్పిన మాటలన్నా, కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన అబద్దాలు కొంత మేర నమ్మారు. దాంతో రుణమాఫీపై ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం రైతులను ఒక రకంగా కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను రెచ్చగొట్టారు. వెళ్లి బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొమ్మని చెప్పారు. అయితే రెండులక్షల రుణం ఎలా ఇస్తారన్న సోయి కూడా లేకుండా చెప్పిన కాంగ్రెస్‌ మాటలను రైతులు నమ్మడమే పాపమైంది. నమ్మితేనే కదా! మోసం చేసేది అన్నట్లు కాంగ్రెస్‌ నాయకులు చెప్పిన మాటనే పదే పదే చెప్పి గోబెల్స్‌ ప్రచారం చేశారు. జనాన్ని బురిడీ కొట్టించారు. రెండు లక్షల రుణమాపీ సాధ్యం కాదని కాంగ్రెస్‌ నాయకులకు కూడా తెలుసు. అధికారంలోకి రావాలంటే ఇలాంటి అబద్దాలు చెబితే తప్ప తెలంగాణ ప్రజలు నమ్మేలా లేరని చెప్పారు…అమలు చేస్తామని కాంగ్రెస్‌ చెప్పినన్నీ అలవి కాని హామీలే… చేతులెత్తేసేవే అని మేం మొదటి నుంచి హెచ్చరించినవే..అయినా జనం కాంగ్రెస్‌ను నమ్మారు. ఎలా చెప్పారంటే డిసెంబర్‌ 9 నాడే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పడంతో ప్రజలు కూడా నమ్మారు. అంతే తప్ప కాంగ్రెస్‌ను పూర్తిగా విశ్వసించలేదు. గత కాంగ్రెస్‌ చరిత్రలు ప్రజలకు బాగాతెలుసు. పల్లె ప్రజానికం కొంత అమయకులు. అందుకే వారిని సులభంగా మోసం చేయగలిగారు. అదే అర్భన్‌ ప్రజలు కాంగ్రెస్‌ను అసలే నమ్మలేదు. బిఆర్‌ఎస్‌ అభివృద్ధి నమూనాను చూశారు. పదేళ్ల క్రితం తెలంగాణకు, ఇప్పటి తెలంగాణకు ఎంత తేడా వుందన్నదానిని గుర్తించారు. ఈ అభివృద్దికి బ్రేక్‌ పడొద్దని విశ్వసించారు. బిఆర్‌ఎస్‌కు అర్భన్‌ ప్రాంతాలు మద్దతుగా నిలిచాయి. కొన్ని విషయాలు తాము కూడా ప్రచారం చేసుకోలేదు. 2019 తర్వాత సుమారు 7లక్షల రేషన్‌ కార్డులు ఇవ్వడం జరిగింది. కాని కాంగ్రెస్‌ పార్టీ రేషన్‌ కార్డులు ఇవ్వలేదని చేసిన ప్రచారం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. నెల గడుస్తున్నా రైతు భరోసా ఎక్కడుందో ఎవరూ చెప్పడం లేదు. ఇప్పటికే నిరుద్యోగ భృతికి మంగళం పాడారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదని తేల్చేశారు. ఎన్నికల ముందు అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు. రెండిరటికి పరిమితం చేశారు. తొలి పధకంలోనే కోత కోశారు. హైదరాబాద్‌ నుంచి డిల్లీకి యాత్రలకే పుణ్యకాలం గడిచిపోతుంది. చీమ చిటుక్కుమన్నా డిల్లీకి వెళ్లాలి. అడుగు ముందుకేయాలన్నా అధిష్టానాన్ని అడగాలి. సంక్షేమంగాలికి..కాంగ్రెస్‌ నాయకుల పరుగులు డిల్లీకి..ఇంతే కాంగ్రెస్‌ పాలన..ఇంతకు మించి ఒక్క అడుగు కూడా వేయలేని అబద్దాల లాలన. తెలంగాణ ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు.

దిల్‌ రాజు మీద సీ(సిని)మాంధ్ర కుట్ర!

https://epaper.netidhatri.com/

`చిరంజీవి అనని దానిని అన్నట్లు ప్రచారం.

` చిరంజీవి మనసులో పెట్టుకొని వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు.

`దిల్‌ రాజుకు దిల్‌ లేదంటూ గతంలోనూ కథనాలు.

`దిల్‌ రాజు మోనోపలి అంటూ ఓ వర్గం ఆరోపణలు.

`బిఆర్‌ఎస్‌ వున్నంత కాలం వాళ్లు సైలెన్స్‌!

`కాంగ్రెస్‌ రాగానే కొత్త పైత్యం షురూ!

సినిమా అంటేనే రంగుల ప్రపంచం. పైసలతో పరాచికం. పెట్టే పెట్టుబడి రాబడి రావొచ్చు. రాకపోవచ్చు. కాని తీసిన సినిమా చూసి మురిసిపోయేవారు వున్నారు. నిండా మునిగిపోయి అడ్రస్‌ లేకుండాపోయిన వారున్నారు. అయినా సినీ తరం ఎప్పుటికీ తరంతరం..నిరంతరమే అన్నట్లు సాగుతోంది. సినిమా ఆడితే ఎంతో వైభోగం..ఆడకపోతే నిర్మాత బతుకు ఆగం.. అలా నిండా మునిగినోళ్లే అనేకం. .అయితే ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కొమని పెద్దలు చెప్పినట్లే సినిమా నిర్మాణం ఒక జూదం…సినిమా తీసేవారి దృష్టిలో కళామ తల్లి సేవనం.. ఇతరలు దృష్టిలో వ్యాపారం.. నిజంగా చెప్పాలంటే ఒక వ్యసనం…అయినా దాన్ని ఫ్యాషన్‌ అనే అనుకుంటారు..ఎందుకంటే అక్కడ గెలిస్తే గొప్ప జీవితం మిగులుతుంది. కాకపోతే తమకు తెలిసిందిన సినిమా మాత్రమే చెబుతుంటారు. ఒక్కసారి సినిమాను నమ్ముకుంటే వారికి అదే ప్రపంచం. గెలిచేవారు కొందరే…ఓడిన వారే ఎంతోమంది అయినా అదే కలల ప్రపంచం. కాసుల ప్రపంచం..కళ్ల నిండా కన్నీళ్లు కనిపిస్తున్నా, కంటి ముందు కష్టాలు కనిపిస్తున్నా, దుఖాలు వెంటాడుతున్నా, దురదృష్టం పరుగెత్తిస్తున్నా వాటిని కూడ లేక్క చేయకుండా బతికే ఏకైక ఆశా జీవి.. సీనీ జీవి…నిర్మాత..! నటులౌదామని వచ్చి దర్శకులైనవారున్నారు. నిర్మాతలైనవారు వున్నారు. ఒకప్పుడు సినిమా అంటే కళామ తల్లి. ఇప్పుడు వ్యాపారం కల్పవల్లి. కాలం మారుతోంది. సినిమా రూపం మారుతోంది. పెద్ద తెరమీద నుంచి బుల్లి తెరదాకా నిన్నటిదాకా చూసిన సినిమా నేడు అరచేతిలోకి వచ్చేస్తోంది. అయినా దాని రాజసం దానిదే…సినిమా అంటే సినిమానే…అరచేతిలో పట్టుకొని బొమ్మచూసినా, తాడి చెట్టంత బొమ్మను తెరమీద చూసినా అదో గొప్ప అనుభూతి. అది సినిమాకే చెల్లింది. అలాంటి సినీవైభవ కార్మగారాన్ని నడుపుతున్న, ఒక రకంగా చెప్పాలంటే ఏలుతున్న తెలంగాణ తేజం దిల్‌ రాజు..నిజంగా దిల్‌ వున్న సినీ మొనగాడు. తెలంగాణలోనే సీనీ మకుటం లేని నిర్మాతలకు రారాజు…
నిజం చెప్పాలంటే తెలుగు సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలంటే తెలంగాణ సినిమా! సీమాంధ్ర సినిమా!! అని ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే తెలంగాణ సినిమాను ఇప్పటికీ చిన్న చూపు చూస్తున్న సీమాంధ్ర సినీ రంగానికి తెలంగాణలో చోటు లేకుండా పోవడమే మంచిది. ఇప్పటికీ ఎప్పటికీ తెలంగాణ సినిమా, సీమాంద్ర సినిమా వేరువేరే. ఈ రెండు కలిపినట్లు కలిపి, నటించి, తెలంగాణ సినిమాను కనుమరుగు చేసి, తెలంగాణ వారిని ఎదగకుండా చేసి, మొత్తం గుండు గుత్తగా గంప గుత్తను చేసుకొని ఇప్పటికీ రాజ్యమేలుతున్న వారంతా సీమాంధ్రకు చెందినవాళ్లే… అందుకే ఎలాగూ ఇంత దూరం వచ్చిన తెలుగుసినిమాను ఒక్క మాటలో చెప్పాలంటే దిల్‌ రాజుకు ముందు..దిల్‌రాజుకు తర్వాత అని తప్పక చెప్పాలి. సీమాంద్రకు చెందిన హీరోల విషయంలో, దర్శకుల విషయంలో, ఆఖరుకు నిర్మాతల విషయంలోనూ ఈ మాట పదే పదే చెప్పుకొని వాళ్లకు వాళ్లే గొప్పలకు పోతుంటారు. ఎందుకంటే తాను పాటలు రాస్తానంటూ తెలంగాణకు చెందిన జాతీయ అవార్డు పొందిన సినీ కవిని నువ్వా..పాటలా? అంటూ హేళన చేశారు. ఎగతాలి చేసిన వారున్నారు. అందుకే తెలుగు సినిమా మీద తెలంగాణ ముద్ర లేకుండా, రాకుండా చూసుకున్నారు. వందేమాతరం శ్రీనివాస్‌ లాంటి గొప్ప సంగీత దర్శకుడు కూడా తనది తెలంగాణ అని చెప్పుకోవడానికి భయపడిని సందర్భంలో బతికాని, ఇప్పుడు హాయిగా ఊరిపి పీల్చుకుంటూ, నేను తెలంగాణ, నాది తెలంగాణ అని చెప్పుకుంటున్నానని చెప్పాడంటే ఆ సీమాంధ్ర ఆదిపత్యం ఎలా వుండేదో అర్ధంచేసుకోవచ్చు. తెలంగాణకు ఉద్యమానికి ఊపిరిపోసి, తెలంగాణ ఉద్యమం ఉరకలెత్తించిన మిట్టపల్లి సురేందర్‌ కవి గాయకుడుని కూడా మోసం చేసిన చరిత్ర సీమాంధ్రులది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా! రక్తబంధం విలువ నీకు తెలియదురా? అంటూ తెలంగాణ ఉద్యమంలో కన్నీటి వ్యధని, గర్భశోఖాలు మిగులుతుంటే ఆ పాట విని తెలంగాణ అంతా తల్లడిల్లింది. ఆ పాట వింటూ తెలంగాణ అంతా కన్నీటి పర్యంతమైంది. అలాంటి పాటలు రాసిన మిట్టపల్లి సురేందర్‌ లాంటి కవిని కబ్బోర్డులో దాచిన దుర్మార్గపు చరిత్ర సీమాంధ్రది. అలాంటి సీమాంద్ర పెత్తనం నుంచి తెలంగాణ సినిమాను కాపాడిన ఏకైక నిర్మాత దిల్‌ రాజు..తెలుగు సినిమా పేరు చెప్పి తెలంగాణ సినిమాను ఆగం చేసిన వారికే ఇప్పుడు దిల్‌ రాజు మాతో సినిమా తీస్తే చాలు అనుకుంటున్నారు.
పెద్ద పెద్ద నిర్మాతలుగా పేరున్నవారు. ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు తీసినట్లు చెప్పుకునేవారు, గిన్నిస్‌ రికార్డులు సొంత చేసుకున్నవారు కూడా సినిమా తీయాలంటే గజగజ వనికిపోతున్న సమయంలో తెలుగు సినిమాను నేను ఆదుకుంటాను..నేను నిలబెడతాను అని వచ్చిన ఏకైక సినీ తేజం..తెలుగు సినిమాకు వరం..దిల్‌ రాజు ప్రొడక్షన్‌. ఒక దశలో సినిమా అంటేనే ఆడమ దూరం నిర్మాతలు పరుగెత్తుతున్న తరుణంలో వరుసగా 9 హిట్లు ఇచ్చి, తెలుగు సినిమాకు ఊపిరిపోసి, తెలుగు సినిమా దమ్ము చూపిన ఏకైక నిర్మాత దిల్‌ రాజు. అయితే పైకి సంబురం వ్యక్తం చేస్తూ, ఎప్పుడు దిల్‌ రాజు పడిపోతాడో అప్పుడు నవ్వుకుందామని చూసిన వాళ్లు కూడ చాలా మంది వున్నారు. అయితే పడి లేవడం దిల్‌ రాజుకు కొత్త కాదు. పడి లేవడం తెలిసిన దిల్‌ రాజు ఒక్కసారి పడితే పదిసార్లు లేచేంత బలం కూడదీసుకొని ముందుకు విచ్చిన సందర్భాలు కూడా వున్నాయి. నవ్విన నాప చేను పండినట్లు, దిల్‌ రాజు ఎక్కడ దొరక్కపోతాడా? అని ఎదురు చూసిన వాళ్లకు కూడా కళ్లు బైర్లు కమ్మేంత వెలుగు చూసిన నిర్మాత దిల్‌ రాజు. దిల్‌ రాజు నిజంగా దిల్‌ వున్న రాజే కాదు..ఎంతో ధైర్యం వున్న రాజు కూడా. అందుకే బలగం తీశాడు.. ఎంతో బలమైన నమ్మకం నింపిన సంకల్పంతో తీశాడు. బలగం అనే సినిమా మొత్తంగా ధియేటర్‌లోనే ఆడితే ఆ రికార్డును ప్రపంచంలో ఎవరూ అందుకోనంత వుండేది. రికార్డులను తిరగరాసేంది. సినీ ప్రభంజనాన్ని సృష్టించేది. కాసుల వర్షం కురిపించేది. అయినా డబ్బుకోసం దిల్‌ రాజు ఆలోచించలేదు. బలగం అందరూ చూడాలనుకున్నాడు. తెలంగాణలోని ప్రతి పల్లెలో ఉచిత ప్రదర్శన వేయించాడు. కాని సీమాంధ్ర బలగం సినిమాను ఆదరించలేదు. అక్కున చేర్చుకోలేదు. తెలంగాణ సంస్కృతిని కోసమైనా సీమాంధ్ర చూడలేదు. పెద్ద పెద్ద హీరోల సినిమానే మూడు రోజుల్లో చుట్టేస్తున్న సందర్భం. సూపర్‌ హిట్‌ సినిమాలంటే మూడు వారాలు ఆడితే చాలనుకుంటున్న రోజులు. కనీసం ఓటీటిలో పేరొస్తే చాలనకుంటున్న కాలం. అలాంటి దశలో ఏడాది పాటు చర్చించుకునే సినిమా తీశాడు. తెలంగాణ సంస్కృతి వున్నంత కాలం మాట్లాడుకునే సినిమా తీశాడు. పల్లెల్లో పరదాలు కట్టుకొని బలగం సినిమా చూశారు. ధియేటర్లకు బండ్లు కుట్టుకొని వెళ్లి సినిమా చూశారు. తెలంగాణ సంస్కృతే ఈ సినిమా చూసి మురిసేలా చేశాడు. ఈ సినిమాతోనే తెలంగాణ సినిమా, సీమాంధ్ర సినిమా అన్నది స్పష్టంగా రెండుగా విడిపోయినట్లు కనిపించింది. అప్పటి నుంచే సీమాంధ్ర సినీ లోకం దిల్‌ రాజు మీద లేని పోని వార్తలు వండి వారుస్తోంది. ఇటీవల చిరంజీవి దిల్‌ రాజుపై సెటైర్లు వేశారంటూ కొన్ని సీమంధ్రకు చెందిన వాళ్లు విపరీత ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి అయినా ఎంత పెద్ద సినీ జీవికైనా దిల్‌ రాజు లాంటి నిర్మాతలే కావాలి. దిల్‌రాజు లాంటి నిర్మాత లేకుంటే ఏ స్టారు లేడు…ఎవరికీ స్టార్‌ డమ్‌ నిర్మాత లేకుండా రాలేదు. అయినా రెండు రాష్ట్రాల సినిమాకు వారధిగా మిగిలింది ఒకే ఒక్కడు…ఆ ఒక్కడు దిల్‌రాజు మాత్రమే..ఎనీ డౌట్‌?

అల్లమా? అబద్దమా!?

https://epaper.netidhatri.com/

` గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఏం చేయలేదని మీ ఉద్దేశ్యమా?

`పదేళ్లు ప్రెస్‌ అకాడెమీ చైర్మన్‌గా ఏం చేయడానికి అవకాశం రాలేదని చెప్పడం ఆంతర్యమా!

`ఎన్నికల సమయంలో ఒక్క మీట్‌ ది ప్రెస్‌ ఏర్పాటు చేయలేకపోయావా?

`అన్నా..హరీషన్న అంటే ఎంతో మంది జర్నలిస్టులకు కరోనా కాలంలో సాయం చేశారు.

`ఒక్క ట్విట్‌తో కేటిఆర్‌ స్పందించేవారు.

`జర్నలిస్టుల సంక్షేమం కోసం కేసిఆర్‌ వంద కోట్ల నిధులిచ్చారు.

`పదేళ్లలో జర్నలిస్టులకు నేనిది చేశానని ఒక్కటి చెప్పు!

`అప్పటి ప్రభుత్వ పెద్దలు పెద్ద పీట వేస్తేనే చేసిందేమీ లేదు?

`ఇప్పుడు ప్రభుత్వంతో కొట్లాడతావా?

`చెప్పడానికి మీకు లేకపోయినా వినడానికి జర్నలిస్టు సమాజం సిగ్గుపడుతుంది?

`ఇప్పుడు జర్నలిస్టుల కలలు నిజం చేస్తావా?

`ఇంకా నిన్ను జర్నలిస్టులు నమ్ముతారా?

`ఇప్పుడు అసలు ప్రభుత్వ పెద్దలు మెట్లైనా ఎక్కనిస్తారా?

`ఇప్పుడు హెల్త్‌ కార్డులు గుర్తుకొచ్చాయా?

`జర్నలిస్టులకు ఇండ్లు ఇప్పిస్తావా?

`నమ్మినందుకు బిఆర్‌ఎస్‌ను నిండా ముంచావు.

`పదేళ్లలో ఒక్కనాడైనా మీడియా ముందుకు వచ్చావా?

`ఇప్పుడు ఏదో వెలగబెడతావా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అవకాశవాది అవతారం ఎత్తుతున్నావా? అల్లం నారాయణ. అల్లమా! ఇక చాలించు…ఏం చెప్పదల్చుకున్నావ్‌ అల్లం నారాయణ. నేను మంచివాడినే…పోరాట యోధుడినే కానీ మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ నా కాళ్లు, చేతులు కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టాడని చెప్పదల్చుకున్నావా? వద్దు, వద్దంటున్నా పదేళ్లు పదవి ఇచ్చి నా నోరు మూయించాడని చెప్పాలనుకుంటున్నావా? జర్నలిస్టుల సమస్యల మీద ఎన్ని సార్లు మాట్లాడాలని చూసినా అవకాశం ఇవ్వలేదని మధనపడినట్లు నిట్టూర్పు వెల్లడిరచాలని అనుకుంటున్నావా? నా పదవి కోసం మాత్రమే సమయమిచ్చారని, జర్నలిస్టుల సమస్యలు అనగానే వెళ్లగొట్టే వారని చెప్పదల్చుకున్నావా? నాకు మేలు జరిగింది.. కానీ అయ్యో మీకు మేలు చేయలేకపోయానని మొసలి కన్నీరు కార్చేందుకు చూస్తున్నావా? కుర్చీలో కూర్చున్నంత కన్నీళ్లతోనే కాలం గడిపానని మభ్యపెట్టదల్చుకున్నావా? పదవిలో పదేళ్లు వున్నా కడుపు నిండా తిన్నది లేదు, కంటి నిండా నిద్రపోయింది లేదు. జర్నలిస్టుల బాధలు నన్ను నిద్రపోనివ్వలేదని జర్నలిస్టులను పట్టుకొని ఏడవాలనుకుంటున్నావా? ఇంతకీ ఏం చెప్పాలనుకొని మీడియా ముందుకు వచ్చావ్‌…ఎవరని బద్నాం చేద్దామని నిర్ణయించుకున్నావ్‌…నాయకులమని చెప్పుకున్న వారికి తప్ప ఏనాడైనా జర్నలిస్టుల మొహం చూశావా? వారి సమస్యలు విన్నావా? విని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లావా? తిన్నింటి వాసాలు లెక్కబెట్టడానికి బయలుదేరావా? అసలు ఏ జర్నలిస్టైనా నిన్ను నమ్ముతారని అనుకుంటున్నావా? నీ వెంట నడిచేందుకు సిద్దంగా వున్నారనుకుంటున్నావా? ఎలా జర్నలిస్టు నాయకుడిని అనుకుంటున్నావ్‌ నారాయణ. తెలంగాణ పోరాట యోధుడు ఎక్కడైనా మౌనం దాల్చుతాడా? గొంతు వినపడకుండా దాచుకుంటాడా? పదేళ్ల పాటు మూగ నోము పాటిస్తాడా?

గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం జర్నలిస్టులకు ఏం చేయలేదని మీ ఉద్దేశ్యమా?
జర్నలిస్టులకు గత ప్రభుత్వం ఏ ఒక్కరికీ ఇల్లు ఇవ్వలేదని చెప్పడానికి మీడియా ముందుకు వచ్చావా? నిజంగా జర్నలిస్టుల సమస్యలను పేపర్‌ మీద రాసుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దగ్గరకో, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి దగ్గరకు వెళ్లగలవా? ఏ ముఖం పెట్టుకొని వెళ్తావు. పదేళ్లు ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా వుండి ఏం చేశావని వాళ్లు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతావు. పదవి ఇచ్చారుగాని పనులు చేయలేదని చెబుతావా? జర్నలిస్టులకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెబుతావా? మోసం చేసిందని చెప్పగలవా? జర్నలిస్టులకు న్యాయం చేయలేకపోయిన అసమర్థుడిని చెప్పుకుంటావా? నా తప్పేం లేదని తప్పించుకుంటావా? గత ప్రభుత్వం జర్నలిస్టు సమాజానికి ఏం చేయనప్పుడు పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు. జర్నలిస్టుల గొంతక ఎందుకు కాలేదు? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం జీతం తీసుకుంటూ నమస్తే తెలంగాణ లో ఉద్యోగం చేశావు. దానిని కూడా త్యాగంగా చెప్పుకున్నావు. తెలంగాణ వచ్చాక ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా పదవిని అనుభవించావు. మరి జర్నలిస్టు సమాజానికి ఏం చేశావు? చెప్పడానికి ఏమీ లేకపోవడంతో పదేళ్లు ప్రెస్‌ అకాడెమీ చైర్మన్‌గా ఏం చేయడానికి అవకాశం రాలేదని చెప్పడం అసమర్థుని జీవిత యాత్ర అని అనుకుంటున్నావా? నీకు అన్ని రకాల అవకాశాలు నిన్నటి ప్రభుత్వం కల్పించింది. కానీ నీ కాలు ఇల్లు కదలలేదు. జర్నలిస్టులకు మేలు చేయాలన్న సోయి నీకు రాలేదు. జర్నలిస్టుల సంక్షేమానికి నీకు మనసు రాలేదు. మొత్తంగా జర్నలిస్టు సమాజానికి నువ్వేమీ చేయలేదు. ఇదే తెలంగాణలో వున్న వేలాది మంది జర్నలిస్టుల అభిప్రాయం.
అన్నా..హరీషన్న అంటే ఎంతో మంది జర్నలిస్టులకు కరోనా కాలంలో సాయం చేశారు.
మంత్రులుగా ఎంతో బిజీగా వున్న హరీష్‌ రావు లాంటి వారు అనేక సార్లు స్పందించారు. ఇంత పెద్ద తెలంగాణ జర్నలిస్టు సమాజం కరోనా సమయంలో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా ముందు వరుసలో నిలబడిరది. అలాంటి సమయంలో ఉద్యోగులకు ప్రత్యేక వైద్య సదుపాయాల అందాయి. కానీ జర్నలిస్టులకు ప్రైవేటు ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించే కృషి అల్లం చేయలేదు. ఎంతో మంది జర్నలిస్టులు మృత్యువాత పడ్డారు. వారి కుటుంబాలు వీధినపడ్డాయి. ఎంతో మంది జర్నలిస్టులు కరోనా వైద్యం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకున్నారు. ఇప్పటికీ అనారోగ్యం వెంటాడుతూ, వృత్తికి దూరమైన వాళ్లు వున్నారు. అదే సందర్భంలో ఒక్క ట్విట్‌తో కేటిఆర్‌ స్పందించేవారు. కానీ అల్లం జాడ ఆ సమయంలో ఎవరికీ దొరకలేదు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కేసిఆర్‌ వంద కోట్ల నిధులిచ్చారు. ఆ సమయంలో వాటిని వెచ్చిస్తామని చెబితే కేసిఆర్‌ వద్దనే వారా? ఈ పదేళ్ల కాలంలో గొప్పలు తప్ప, జర్నలిస్టు కొన్ని తరాల వరకు మర్చిపోలేనిది ఏదైనా వుందా? జర్నలిస్టు సమాజం మొత్తం ముక్త కంఠంతో ఒప్పుకునే ఒక్కటి చెప్పు! చెప్పలేవు. ఎందుకంటే నువ్వు చేయలేదన్నది నూరుపైసల నిజం. చెప్పినా ఎవరూ నమ్మరన్నది ముమ్మాటికీ నిజం.
పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరిగినట్లు చేశావు.
గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతో నమ్మకంతో పెద్ద పీట వేస్తేనే చేసిందేమీ లేదు? ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంతో మాట్లాడతావా? రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంతో కొట్లాడతావా? నలుగురు జర్నలిస్టులను తీసుకొని రొడ్డెక్కగలవా? నీ వెంట నడిచేందుకు నలుగురు జర్నలిస్టులు వస్తారనుకుంటున్నావా? చెప్పడానికి మీకు లేకపోయినా వినడానికి జర్నలిస్టు సమాజం సిగ్గుపడుతుంది? ముందు అది తెలుసుకో..పదేళ్ల కల నుంచి ఇప్పుడు మేలుకొని వచ్చినట్లు జర్నలిస్టుల కలలు నిజం చేస్తావా? అది జర్నలిస్టు సమాజం నమ్మమంటావా? ఇంకా నిన్ను జర్నలిస్టులు నమ్ముతారా?అసలు ప్రభుత్వ పెద్దలు మెట్లైనా ఎక్కనిస్తారా? ఇప్పుడు హెల్త్‌ కార్డులు గుర్తుకొచ్చాయా? అంటే గత ప్రభుత్వం జర్నలిస్టుల ఆరోగ్యాలను గాలికి వదిలేసిందని నువ్వు చెబుతున్నట్లేనా? అసలు గత ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్‌ కార్డులు జారీ చేయలేదని చెప్పదల్చుకున్నావా? మరి ఆసుపత్రిలలో జర్నలిస్టుల పేరిట జరిగిన వైద్యమంతా అబద్దమని చెప్పదల్చుకున్నావా? జర్నలిస్టులకు ఇండ్లు ఇప్పిస్తావా? గత పదేళ్ల కాలంలో తెలంగాణలో జర్నలిస్టులకు ఇండ్లు ఇచ్చిన దాఖలాలు లేవని ప్రచారం చేయదల్చుకున్నావా? కొన్ని నియోజకవర్గాలలో, జిల్లాలలో జర్నలిస్టులకు అందిన ఇండ్లు నిజం కాదా? అదంతా అబద్ధమని చెబుతున్నట్లేనా? జర్నలిస్టులకు ఇండ్లు ఇచ్చినట్లు అప్పటి మంత్రులు, ఎమ్మెల్యే చెప్పిన ముచ్చట అంతా తూచ్‌ అని అల్లం నిర్థారణ చేసినట్లేనా? నిన్ను నమ్మినందుకు బిఆర్‌ఎస్‌ను నిండా ముంచావు. అది కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఏదో చేయాలనుకున్నావు. పదవిలో వున్నప్పుడు ఆరోగ్యం సహకరిస్తలేదని అనేక మందితో అన్నట్లు గుర్తు. ఇప్పుడు హటాత్తుగా మీడియా ముందుకు వచ్చేంత పవర్‌ ఒక్కసారిగా ఎలా వచ్చే…పదేళ్లలో ఒక్కనాడైనా మీడియా ముందుకు వచ్చాయా? ఇప్పుడు ఏదో వెలగబెడతావా?
ఎన్నికల ముందు ప్రతి యూనియన్‌ మీట్‌ ది ప్రెస్‌ ఏర్పాటు చేయడం అన్నది ఒక ఆనవాయితీగా మారింది.
దాదాపు అన్ని గుర్తింపు వున్న యూనియన్లు కూడా మీట్‌ ది ప్రెస్‌ ఏర్పాటు చేస్తున్నారు. 2014 నుంచి 2023 వరకు యూనియన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అల్లం నారాయణ ఎందుకు మీట్‌ ది ప్రెస్‌ ఏర్పాటు చేయలేదు. జర్నలిస్టుల సమస్యలపై ఎందుకు పార్టీల వైఖరి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అంతగా ఎన్నికల సమయంలో పొడిచేసే కార్యక్రమాలు వున్నాయి. అంతా డొల్ల. అవకాశవాదం. జర్నలిస్టుల ఆత్మగౌరవం తాకట్టు పెట్టి, పబ్బం గడుపుకోవడం అలవాటు చేసుకున్నాడన్నది అందరూ అంటున్న మాటే!

లీడర్లను కాదు క్యాడర్‌ నమ్మండి!

https://epaper.netidhatri.com/

`బిఆర్‌ఎస్‌ సైనికులకు సముచిత స్థానం ఇవ్వండి.

`క్యాడర్‌ అభిప్రాయాలు వినండి.

`వారికి మరింత ప్రాధాన్యత కల్పించండి.

`పార్టీ నాది అని గర్వంగా చెప్పుకునేది క్యాడరే.

`గులాబీ జెండా చేతిలో పట్డుకునేది క్యాడరే.

`కండువా కూడా బరువు అనుకునే వారిని పక్కన పెట్టండి.

`పక్క చూపులు చూసే వారిని పసిగట్టండి.

`ఇప్పటికైనా సంస్థాగత నిర్మాణం చేపట్టండి.

`క్యాడర్‌కు పదవులు పంచండి.

`సీనియర్లను పరిశీలకులుగా మార్చండి.

`నాయకులు పెత్తనం మాని, ప్రేమగా మాట్లాడం నేర్చుకోండి.

`అవసరమైన శిక్షణా తరగతులు నిర్వహించండి.

`మరో వందేళ్లు మళ్ళీ పునాదులు వేయండి.

`క్యాడర్‌ త్యాగాలే లీడర్ల పదవులు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అంతర్మధనం ఎప్పుడైనా మంచిదే. ఎప్పటికీ మేలే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు జయాలు, పరాయజయాలు సహజం. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు ఎంత గొప్ప పరిపాలన అయినా సరే ఓటమి చెందడం సహజం. రాజకీయ పార్టీలు చేసే కొన్ని ప్రచారాలు కూడా ప్రజలను మాయ చేస్తుంటాయి. మభ్యపెడుతుంటాయి. గతంలో గొప్ప గొప్ప పాలకులు కూడా ఓడిన సందర్భాలున్నాయి. ఓటమిని ఎదుర్కొన్న దాఖలాలు అనేకం వున్నాయి. ఎన్టీఆర్‌ హాయాంలో ఇదే కాంగ్రెస్‌ పార్టీ సినిమాలు నిర్మించింది. ఆనాడు సోషల్‌ మీడియా లేదు. కాని సినిమారంగం ప్రభావం బాగా వుండేది. ప్రజలపై సినిమాల ప్రభావం విపతీతంగా వుండేది. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో నటుడు ఘట్టమనేని కృష్ణ పని గట్టుకొని కొన్ని సినిమాలు తీశాడు. అదే సమయంలో మండలాదీషుడు, గండిపేట రహస్యం. నా పిలుపే ప్రభంజనం. అంటూ కొన్ని సినిమాలు నిర్మించారు. ప్రజల్లో అపోహలు సృష్టించారు. అదే నటుడు కృష్ణ అనేక సార్లు ఎన్టీఆర్‌ ఎంతో నిజాయితీ పరుడు అంటూ కితాబిచ్చారు. ఒక ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసి, ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తున్న పార్టీని ఓడిరచి, తర్వాత ఆయన మంచి నాయకుడు. ఆ పార్టీ గొప్పది అని చెప్పుకుంటే ఏం లాభం. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఒకప్పుడు పివి. నర్సింహారావు ప్రధానిగా వున్నప్పుడు జేఎంఎం ముడుపులు కేసు అంటూ పెద్దఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎంపిలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కాపాడుకున్నాడు అన్నారు. సంస్కరణలు తెచ్చి, దేశం పరువు తీశాడని అన్నారు. అంతర్జాతీయ విఫణిలో దేశాన్ని నిలబెట్టాడని అన్నారు. విదేశీ పెట్టుబడులకు ద్వరాలు తెరిచాడని ప్రచారం చేశారు. మన దేశాన్ని ఇతర దేశాలకు రుణ గ్రస్ధ దేశంగా మార్చుతున్నాడని ప్రచారం చేసి, ఆయన ప్రభను మసక చేశారు. చివరికి ఆయన చనిపోయినప్పుడు కూడా పార్ధీవ దేహానికి సముచిత గౌరవం ఇవ్వలేదు. కాని ఇప్పుడు పివిని దేశమంతా కొనియాడుతోంది. కాంగ్రెస్‌ కూడా దేశం ఈ రోజలు ఈ స్ధాయిలో వుందని చెప్పడానికి ఎంతో గర్వంగా వుందని అది కాంగ్రెస్‌ ప్రభుత్వ గొప్పదనమని చెప్పుకుంటోంది.
అలాగే పదేళ్ల కేసిఆర్‌ పాలనపై ప్రతిపక్షాలు కూడగట్టుకొని అసత్యాలను విపరీత ప్రచారం చేశారు.
విష ప్రచారం విసృతంగా చేశారు. ఇప్పుడు సినిమాల ప్రభావం తగ్గి, సోషల్‌ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగింది. దానికి తోడు మీడియా కూడా బిఆర్‌ఎస్‌ ఓటమి కోసం చేయాల్సినంత చేశాయి. ఇలా రెండు రకాల మీడియా ప్రభావం బిఆర్‌ఎస్‌ ఓటమికి కారణలాలయ్యాయి. కేసిఆర్‌ ప్రజలను కలవడంటూ, ప్రజలంటే చులనక అంటూ ప్రచారం చేశారు. అలా ప్రతిపక్షాలు విరుచుకుపుడుతుంటే బిఆర్‌ఎస్‌ నాయకులు మైనం పాటించారు. తాము కూడా అసంతృప్తిగా వున్నట్లు ప్రతిపక్షాలకు తప్పుడు సంకేతాలు బిఆర్‌ఎస్‌నేతలు కూడా కొంత మంది పంపించారు. అంతే కాకుండా నిత్యం నియోజకవర్గాలో ఓ స్దాయి నాయకులు కీచులాడుకోవడం వంటికి కూడా పార్టీకి తీరని నష్టంచేశాయి. అయితే లీడర్లు కూడా పార్టీ భ్రష్టు పట్టిండచంలో ఆరితేరిపోయారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన నాయకులు సమావేశంలో ఈ విషయం తేటతెల్లమైంది. అయితే ఈ సంగతి గతంలో తెలియంది కాదు. అధికారంలో వున్నప్పుడు తప్పులు పొరపాట్లు ఎక్కడా కనిపించవు. ఒక వేళ ఎవరైనా తప్పు జరుగుతుందని తెలిపిన వారినే గిద్దిస్తారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలంటూ వారిని పార్టీకి దూరం చేస్తారు. అంతే కాని పార్టీలో ఏం జరుగుతుందని ఏనాడైనా కార్యకర్తలను పిలిచి అడిగారా? లేదు. పదేళ్ల కాలంలో ఏనాడు కార్యకర్తలతో అటు పార్టీ అధినేత కేసిఆర్‌ కాని, అగ్రనేతలు కేటిఆర్‌, కవితలుగాని సమావేశమైంది లేదు. ఎంత సేపు లీడర్లతో మంతనాలు..వారితో సమావేశాలు. అయినా కనీసం వారి మాటలైనా విన్నట్లు కూడా ఎక్కడా విన్నది లేదు. వార్తలు వచ్చింది లేదు. రాష్ట్ర స్ధాయిలో మోనో పలి, జిల్లా స్ధాయిలో ఓ స్ధాయి నాయకుల తీరు అంతా కలిసి పార్టీని నిండా ముంచాయి. మరో వైపు ఓ స్ధాయి నాయకులు పార్టీని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని విపరీతంగా సంపాదించారన్న ఆరోపణలు వచ్చాయి. అయినా వారిని వారించిన దాఖలాలు లేవు. వారికి హెచ్చరికలు జారీ చేసింది లేదు. దాంతో అడ్డూ అదుపు లేకుండా నాయకులు సంపాదించుకున్నారు. కార్యకర్తలకు అందాల్సిన వాటిని కూడా నాయకులే ఎత్తుకెళ్లారు. క్యారడ్‌ ఎప్పుడూ నాయకుల వెంట తిరగడం తప్ప వారికి మిగిలిందేమీ లేదు. వారికి ఒరిగిందేమీ లేదు. సంపాదించుకున్నది లేదు. కాలం వృధా అయ్యింది. వయసు తరిగిపోయింది. అయినా ఎవరూ పెద్దగా కనికరించిందిలేదు. ఇప్పటికైనా క్యాడర్‌ను అదరించండి. వారికి ఓ దారి చూపండి. నాయకులుగా వారిని గుర్తించండి. అంతకన్నా పార్టీ నుంచి ఏమీ ఆశించడం లేదు.
లీడర్లను కాదు క్యాడర్‌ను నమ్మండి. బిఆర్‌ఎస్‌ సైనికులకు సముచిత స్ధానం ఇవ్వండి.
క్యాడర్‌ అభిప్రాయాలు స్వీకరించండి. వారికి తగిన ప్రాదాన్యత కల్పించండి. పార్టీ నాది అని గర్వంగా చెప్పుకునేది క్యాడరే. పార్టీని కాపాడుకునేది క్యాడరే. గులాబీ జెండా భుజం దించకుండా మోసేది క్యాడరే. కండువా కూడా బరువు అనుకునే నాయకులెవరో తెలుసుకోండి. పక్క చూపులు చూసే వారిని పసిగట్టండి. ఇప్పటికైనా పార్టీ సంస్ధాగతమైన నిర్మాణం చేపట్టండి. గ్రామ స్ధాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకు పార్టీ పదవులు ప్రకటించండి. అధికారంలో వున్నప్పుడు ఎలాగూ పదవులు ఇవ్వలేదు. రాజ్యాంగబద్దమైన పదవులు కల్పించలేదు. ఖాళీగా వుంచారే గాని, క్యాడర్‌కు ఇవ్వలేదు. కొన్ని పదవులు ఇచ్చిన వారికే మళ్లీ మళ్లీ ఇచ్చారు. కాని అవకాశం రాని వాళ్ల గోడు వినలేదు. అయినా వారు పార్టీని వదులుకోవడానికి సిద్దంగా లేదు. నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. కొన్ని జిల్లాలో నాయకులు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారు. అలాంటి అవకాశవాదులను పెంచి పోషిస్తున్నారని కూడా క్యాడర్‌ గతంలో నెత్తినోరు మొత్తుకొని చెప్పిన వినలేదు. అందుకు పదువుల పంపకంలో ఇప్పటి వరకు అవకాశం రాని వారిని గుర్తించి ఇవ్వండి. సీనియర్లను పరిశీలకులుగా మార్చండి. నాయకత్వ బాధ్యతలు మళ్లీ వారి చేతుల్లో పెట్టకండి. లేకుంటే మళ్లీ వారి వ్యహరశైలి మొదటికే వస్తుంది. నాయకులు పెత్తనం మాని, క్యాడర్‌తో, ప్రజలతో ప్రేమగా మాట్లాడడం నేర్చుకోండి. అవసరమైన శిక్షణా తరగతులు నిర్వహించండి. గతంలో కేసిఆర్‌ తెలుగుదేశంలో వున్న కాలంలో శిక్షణా తరగతులు ఇచ్చేవారు. 2014లో అధికారంలోకి వచ్చాక తొలి నాళ్లులో కొన్ని సార్లు శిక్షణా తరగులు బ్రహ్మాండంగా నిర్వహించారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక అసలు క్యాడర్‌నే దూరం చేసుకున్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన నాడే వందేళ్ల పాటు చెక్కు చెదరని పార్టీగా ప్రజల్లో వుండేలా ముహూర్తం పెట్టినట్లు గతంలో కేసిఆర్‌ అనేక సార్లు చెప్పారు. కాని పార్టీ పేరు ఇరవైఏళ్లలో మార్చేశారు. మరి బిఆర్‌ఎస్‌ మరో వందేళ్ల పునాదులు వేయండి. అందుకు పార్టీ సంస్ధాగత నిర్మాణంతోనే సాధ్యమౌతుంది. నిజానికి ప్రజలు బిఆర్‌ఎస్‌ను ఓడిరచలేదు. బిఆర్‌ఎస్‌ నాయకులే పనిగట్టుకొని ఓడిపోయారు. ఇది ముమ్మాటికి నిజం. నూరుపైసల వాస్తవం. ప్రజల ముందుకు వెళ్లడానికి కూడా చాలా మంది నాయకులు నామోషిగా ఫీలయ్యారు. ఇతర నాయకులను కలుపుకొని పోయేందుకు సిద్దపడలేదు. అంతే కాదు వాడి దగ్గరకు నేను వెళ్లాలా? అన్న అహం నింపుకొని చేజేతులా పదవిని చేతి పార్టీలో పెట్టిన వాళ్లున్నారు. అయితే ప్రజల్లో వున్న సానుభూతిని ఇప్పుడే పాడు చేసుకోవద్దు. ప్రభుత్వం తప్పులు చేసే అవకాశం ఇంకా ఇవ్వాలి. ప్రజలకు కాంగ్రెస్‌ పాలన అర్ధం కావాలి. బిఆర్‌ఎస్‌ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు తేడా తెలియాలి. ఇప్పటికే కొంత అర్దమౌతోంది. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం క్యాడర్‌ చేసే విధంగా నాయకులు వారిని ప్రోత్సహించాలి. నాయకులు ఎప్పటికప్పుడు పరిస్ధితిని అంచనా వేసుకుంటూ వుండాలి. పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కవ సీట్లు గెలిచేందుకు ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టాలి.

సిట్టింగులను పక్కనపెట్టండి!

https://epaper.netidhatri.com/

`కొత్తవారికి అవకాశం ఇవ్వండి.

`కార్యకర్తల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోండి.

`ఆత్మలు ఇతర పార్టీలలో వున్న వారుకూడా వున్నారు.

`వడపోత అవసరం.

`లేకుంటే ప్రజలు మరింత నిరాశకు లోనౌతారు.

`ప్రజలు కేసిఆర్‌ వెంట వున్నారు.

`కార్యకర్తలు కోరుకునే అభ్యర్థులను నిలబెట్టండి.

`అత్యధిక సీట్లు ఖాయం చేసుకోండి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఇప్పటికైనా తేరుకోండి..జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. కార్యకర్తలు ఏం చెబుతున్నారో వినిపించుకోండి. వారి అభిప్రాయాలు స్వీకరించండి. వారి సూచనలకు విలువ ఇవ్వండి. కనీసం వారు ఏం చెప్పాలనకుంటుంటున్నారో చెప్పనీయండి. వారి మనుసలో ఏముందో మీరే అడిగి తెలుసుకోండి. లేకుంటే నాయకులు, కార్యకర్తల మనసులో వున్న తాజా అభిప్రాయాలు కూడా సమాధి అయిపోతాయి. పొగడ్తలకు ఇంకా పొంగిపోకండి. అంతా బాగుందని ఎవరైనా అంటే మురిసిపోకండి. పూర్తిగా నమ్మేయకండి. నిజనిర్ధారణ చేసుకోండి. పది మంది అభిప్రాయలను పోల్చి చూడండి. ప్రతి నియోజకవర్గం సందర్శించండి. కింది స్ధాయికార్యకర్త కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి. తోటి కార్యకర్తల మనోభావాలకు విలువనివ్వండి. ఇప్పటికైనా మన పార్టీలో కూడా మాట్లాడే స్వేచ్ఛ వుందని గర్వపడేలా చేయండి. వారు సంతోషపడేలా చూడండి. మా మాటలకు, మా సూచనలకు విలువ వుంటుందన్న నమ్మకాన్ని వారిలో కల్పించండి. ఎందుకంటే నిన్నటిదాకా అధికారంలో వున్నారు. ఏ కార్యకర్తకు అందుబాటులో లేరు. ఎంత సేపు పాలన తప్ప పార్టీకి సమయం ఇవ్వలేదు. ఈ మాట ఎన్టీఆర్‌ కాలం నుంచి, చంద్రబాబు పాలన నుంచి, ఇప్పుడు తెలంగాణలో కేసిఆర్‌ పాలనలో కూడా వింటూనే వున్నాం. ఎందుకంటే ఈ విషయాలు పూర్తిగా కేసిఆర్‌కు కూడా తెలుసు.
ఉమ్మడి రాష్ట్రంలో 1989లో ఎన్టీఆర్‌ ఓడిపోవడానికి కారణం కేవలం ఆయన నేరుగా ప్రజలను కలవకపోవడం.
పై స్ధాయి నేతలకు తప్ప, ఆయన దర్శనబాగ్యం ఎవరికీ అందకపోవడం. ఎంతో నిజాయితీగా, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా 1989లో తెలుగుదేశం ఓడిపోయింది. తర్వాత 1994లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. కానీ అధికార మార్పిడి జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. పాలనలో విపరీతమైన సంస్కరణలు తెచ్చారు. కొత్త పరిపాలనావిధానాలు అమలు చేశారు. పాలనలో ప్రజలను భాగస్వాములు చేశారు. శ్రమ దానం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పచ్చదనం..పరిశుభ్రత అనే కార్యక్రమాలు చేపట్టారు. రైతులకు చేయూత అనే కార్యక్రమం అమలు చేశారు. ఆ రోజుల్లో రైతులకు పని ముట్లు ఉచితంగా ప్రభుత్వం ద్వారా అమలు చేశారు. హైటెక్‌ పాలనకు మొదలు పెట్టారు. నేరుగా అధికారులతో చంద్రబాబు మాట్లాడుతుండడం చేశారు. జన్మభూమి కార్యక్రమంతో ప్రజలకు బాగా చేరువయ్యారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలు తీర్చారు. కొత్తకొత్త ఫ్లైఓర్లు నిర్మాణం చేసి, హైదరాబాద్‌కు అప్పుడున్నంత మేర కొత్త హంగులు దిద్దారు. అప్పటి ప్రజా ప్రతినిధులు ఎప్పుడూ ప్రజల్లో వుండాలంటే ఎప్పటికిప్పుడు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసేవారు. ఈ కార్యక్రమాల సృష్టివెనుక, అమలు వెనకు వున్న నాయకుడు కేసిఆర్‌. ఈ విషయం ఈతరానికి తెలియకపోవచ్చు. అంతే కాదు, 1999 ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి రావడానికి తటస్థులను రాజకీయాల్లోకి ఆహ్వానించి, కొత్త తరం రాజకీయాలకు పురుడుపోసిన చాణక్యంలో కేసిఆర్‌ పాత్ర కూడా ఎంతో కీలకమైంది. మరి అలాంటి కేసిఆర్‌ పాలకుడుగా తెలంగాణలో ఉద్యమ నేత ప్రజలకు మరింత చేరువౌతాడని అందరూ అనుకున్నారు. కాని ఆయన రానురాను జనానికి దూరమౌతూవచ్చారు. కాని జనానికి అవరమైన అన్ని పనులు చేసిపెట్టారు. ఎన్ని చేసినా మా నాయకుడు మా కళ్ల ముందుకు రావడం లేదన్న వెలితి మాత్రం ప్రజల్లో అలాగే మిగిలిపోయింది. అదే బిఆర్‌ఎస్‌ను దెబ్చతీసింది.
ఒకనాడు తెలుగుదేశం పార్టీ ప్రస్ధానం, ప్రాభవం కోసం ఎంతో కృషి చేసిన కేసిఆర్‌, తన సొంత పార్టీ విషయంలో మాత్రం పదేళ్లకే ప్రజలకు దూరమయ్యేలా కావడానికి ఆయన జనంలో లేకపోవడమే అన్నది మాత్రం అందరూ అంగీకరిస్తున్న విషయం.
తెలంగాణలో ఇప్పటికీ ఎవరి నాయకత్వం కావాలని ఏ సగటు వ్యక్తిని అడిగినా టక్కున చెప్పే సమాధానం ఒక్కటే..అది కేసిఆర్‌ …అంతలా ఆయన ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. కాని ఆయన ద్వారా నేతలైన వారు మాత్రం ప్రజలకు దూరమయ్యారు. కేసిఆర్‌ తో ప్రజల్లోకి వస్తే సమస్యలు తెలుస్తాయి. నాయకుల నిజస్వరూపాలు తెలుస్తాయని అందరూ అనుకున్నారు. కాని ఆయన రాలేదు. నాయకుల పట్ల ప్రజల్లో వున్న వ్యతిరేకతను స్పష్టంగా తెలుసుకోలేకపోయారు. పైగా పదేళ్ల కాలంలో ప్రతి మూడు నెలలకోసారి పార్టీ తరుపున చేయించిన అనేక సర్వేలలో ఎమ్మెల్యేల పనితీరుపై అనేక రిపోర్టులు వచ్చాయి. వాటిని కూడా అనేక పార్టీ సమావేశాల్లో సాక్ష్యాత్తు కేసిఆరే వెల్లడిస్తూ వచ్చారు. తీరు మార్చుకోవాలని సూచిస్తూ వచ్చారు. ఒక రకంగా హెచ్చరించారు. కాని ఏం జరిగింది. కేసిఆర్‌ చర్యలు తీసుకోలేదు. అప్పటి ఎమ్మెల్యేలు తమ తీరును మార్చుకోలేదు. పద్దతులు అసలే మార్చుకోలేదు. పెద్దగా పనులు నిర్వహించిన దాఖలాలు కనిపించలేదు. తెలంగాణ వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌లో ఓ ముప్పై మంది ఎమ్మెల్యేల పనితీరుపై నిరంతరం ఆరోపణలు వచ్చాయి. మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. రాసిని జర్నలిస్టులను బెదించిన వార్తలు కూడా వచ్చాయి. కాని ఆరోపణలు వచ్చిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తమ తీరు మార్చుకోలేదు. అటు ప్రజల్లోనే కాదు, పార్టీలో కూడా నాయకులకు అందుబాటులో లేకుండా, గ్రూపులు తయారు చేసి, కార్యకర్తల్లోనే చీలిక తెచ్చిన ఎమ్మెల్యేలు కూడా వున్నారు. మనమంతా ఒక కుటుంబం అంటూనే వ్యత్యాసాలు చూపించిన నేతల పట్ల ఎన్నికల తరుణం సమీపిస్తున్నప్పుడు వారి అసంతృప్తిని భహిరంగానే వ్యక్తం చేస్తూనే వచ్చారు. వారి అభిప్రాయాలు పార్టీ పరిగణలోకి తీసుకోలేదన్నది వాస్తవం. అప్పటి ఎమ్మెల్యేల తీరును తప్పుపడుతూనే, మళ్లీ వాళ్లకే టిక్కెట్లు ఇస్తే ప్రజలు ఎలా స్వాగిస్తారనుకున్నారో గాని, మొత్తానికి పార్టీని చేజేతులా ముంచుకున్నది మాత్రం వాస్తవం.
త్వరలో పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి.
ఈ పార్లమెంటు ఎన్నికల్లోనైనా సిట్టింగుల పేరుతో టిక్కెట్లు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. ప్రజా వ్యతిరేకత, నాయకుల అసంతృప్తి లేని వారికి టిక్కెట్లు ఇవ్వండి. పార్టీ శ్రేణులు ఎంత కష్టమైనా పడి, ప్రజలను ఒప్పించి, మెప్పించి గెలిపించుకుంటారు. అంతే కాని పార్టీలోనే వ్యతిరేకత వున్న వారికి మాత్రం మళ్లీ టిక్కెట్లు ఇవ్వొద్దు. మళ్లీ జాతీయ పార్టీల ముందు దిగదుడుపు కావొద్దు. ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీపై ప్రజలకు సంతోషం లేదు. మళ్లీ ప్రజలు కేసిఆర్‌ నాయకత్వం వైపే చూస్తున్నారు. తెలంగాణ విముక్తి ప్రధాతగానే, తెలంగాణ ప్రగతి దాతగా కేసిఆర్‌నే ప్రజలు కోరుకుంటున్నారు. అందువల్ల గెలుపు గుర్రాలకు అవకాశం ఇవ్వండి. ప్రజల్లో వ్యతిరేకత వున్నవారిని పక్కన పెట్టండి. అవసరమైతే కొత్త వారికి అవకాశం ఇవ్వండి. సీనియర్లను పార్టీ సేవలకు వినియోగించుకోండి. ఇంత కాలం ఎలాంటి పదవులు అందని వారిలో పార్టీలో మంచి పేరున్న నాయకులను గుర్తించండి. వారికి అవకాశం ఇవ్వండి. ప్రజలే గెలిపించుకుంటారు. శాసన సభ ఎన్నికల్లో అభ్యర్ధులకు సహరించక, వారి ఓటమికి పరోంక్షంగా సహకరించిన పార్లమెంటు సభ్యులు కూడా బిఆర్‌ఎస్‌లో వున్నారు. కొందరేమో తటస్ధంగా వుంటూ, ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొనలేదు. మరికొందరు ఎమ్మెల్యేలుగా వున్న సమయంలో తమ మాట లెక్క చేయలేదని, తమకు ప్రాధాన్యతనివ్వలేదని మనసులో పెట్టుకొని పార్టీని దగ్గరుండి ఓడిరచిన వారు కూడా వున్నారు. అలాంటి వారు ఎవరన్నది పార్టీలో అందరికీ తెలిసిందే..ఇది బహిరంగ రహస్యమే..అందువల్ల వారిని పూర్తిగా పక్కన పెట్టాల్సిన అవసరం వుంది. అలాంటి అవకావవాదులు, ఒక వేళ పార్టీ గెలిపించినా, మరో వైపు చూడకుండా వుండరన్న నమ్మకం లేదు. అలాంటివారు కూడా వున్నారు. అందుకే ప్రజలు కూడా తస్మాస్‌ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. గత శాసన సభ ఎన్నికల సమయంలోనే ప్రజలు హెచ్చరించారు. అయినా అదే నాయకులను ప్రజలమీద బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేశారు. దాంతో ప్రజలు ఆ నాయకులను తిరస్కరించారు. ఇప్పుడు కూడా పొరపాటను అదే పనిచేయొద్దు. ప్రజల్లో, పార్టీలో కూడా మంచి పేరు లేని వారికి టిక్కెట్లు ఇవ్వొదు. ఇదీ జనం మాట…పార్టీ శ్రేణులు మొత్తుకుంటున్న మాట…

ప్రతిపక్షం ముందు పాలక పక్షం వెలవెల.

https://epaper.netidhatri.com/

`హరీష్‌ రావు ముందు తేలిపోయిన మంత్రులు.

`హరీష్‌ రావు చెప్పిన వివరాలకు అసెంబ్లీ అవాక్కు.

`ప్రభుత్వ తప్పుడు లెక్కలను కడిగేసిన హరీష్‌ రావు.

`అడుగడుగునా హరీష్‌ రావును అడ్డకునేందుకు ఐదుగరు మంత్రుల అవస్థలు.

`పొంతన లేని మాటలు చెప్పలేక మంత్రుల తిప్పలు.

`ప్రభుత్వ శ్వేతపత్రం తప్పుల కుప్ప అని హరీష్‌ రావు ఎద్దేవా.

`కాగ్‌ రిపోర్ట్‌లతో కలిపి వివరిస్తూ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకున్న హరీష్‌ రావు.

`సమాధానం చెప్పుకోలేక పాలకపక్షం చూసిన దిక్కులు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ప్రతిపక్షం దూకుడు అసెంబ్లీలో ప్రదర్శించింది. పాలక పక్షం గిలగిలలాడిరది. ఒక రకంగా చెప్పాలంటే విలవిలలాడిరది. ఒక్కడుగా మాజీ మంత్రి హరీష్‌రావు దూకుడు ముందు అధికారపక్షమంతా వెలవెలబోయింది. బుధవారం అసెంబ్లీలో ప్రతిపక్ష స్ధానంలో వుండి కూడా హరీష్‌రావు వన్‌మాన్‌ షో చేశాడు. పాలకపక్షానికి చెమటలు పట్టించారు. కాళేశ్వరం మీద కట్టుకధలు,పిట్ట కథలు చెప్పి, తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి హరీష్‌రావు అసెంబ్లీ సాక్షిగా చుక్కలు చూపించారు. తనదైన శైలిలో అధికార పక్షానికి మాట లేకుండా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని హరీష్‌రావు డిమాండ్‌ చేయడంతో పాలకపక్షం బిత్తరపోయింది. ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టి, ప్రజలు ముందు దోషిగా నిలబెడదామని అనుకున్న పాలకపక్షం తేరుకోవడానికే కొంత సమయం పట్టింది. శ్వేతపత్రాలతో ప్రతిపక్షానికి చుక్కలు చూపిస్తామనుకున్న పాలకపక్షం పట్టపగలు చుక్కలు చూడాల్సి వచ్చింది. అసలు పాలకపక్షంలో ఎవరున్నారో? ప్రతిపక్షంలో ఎవరున్నారో తేరుకోలేక, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సహా, మంత్రులు బిత్తరపోయినంత పనైంది. ఒక దశలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులాంటి వారు కూడా ఆర్ధిక మంత్రి హరీష్‌రావు అంటూ సంబోధించడం విశేషం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో బుధవారం ఆసక్తికరమైన సందర్భం చోటు చేసుకున్నది. గతంలో కూడా ఎప్పుడూ ఇలాంటి సందర్భం ఎప్పుడూ కనిపించలేదు. మొదటిసారి చట్ట సభ అసెంబ్లీలో ప్రతిపక్షం ముందు అధికార పక్షం వెలవెల బోయింది. మాజీ మంత్రి హరీష్‌రావు వాగ్ధాటికి పాలకపక్షం కకావికలమైంది. నిజానికి శ్వేతపత్రాల విడుదల అంటే ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ భపడుతుందని అధికార కాంగ్రెస్‌ ఊహించింది. కాని అందుకు భిన్నంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే హరీష్‌రావు గుక్క తిప్పుకోకుండా, లెక్కల మీద ఎలాంటి షశబిషలు లేకుండా అలవోకగా పాలకపక్షం సభముందుంచిన లెక్కల లోగుట్టు విప్పుతుంటే అధికార పక్షం నోరెళ్లబెట్టి వినాల్సివచ్చింది. అంతే కాకుండా కాళేశ్వం మీద విచార చేపడతామంటూ, పదే పదే కాంగ్రెస్‌ నాయకులు బైట చేస్తున్న ప్రకటనలకు సభా వేధికగా హరీష్‌రావు పాలకపక్షం ఊహించని విధంగా దెబ్బకొట్టే ప్రయత్నంచేశారు. అలా హరీష్‌రావు స్పందించడంతో పాలపపక్షానికి పాలుపోలేదు. వెలవెల పోయి చూడడం తప్పలేదు.
సహజంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ పాలకపక్షంగా, ఓటమిపాలైన పార్టీని చెడుగుడు ఆడుకున్న సంఘనలు వుండేవి.
కాని బిఆర్‌ఎస్‌ ప్రతిపక్షంలో వున్నా, తమదే పై చేయి అని పాలకపక్షం చేయికి వాయిస్‌ లేకుండా చేయడం గమనార్హం. ఎందుకంటే నిజాలను ఎవరూ తారుమారు చేయలేరు. కట్టుకథలల్లి ఎల్లకాలం నిజాలని నమ్మించలేరు. తప్పులను చెప్పి ఒప్పులుగా మార్చలేరు. తొమ్మిదిన్నరేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ సుబిక్షంగా వుంది. సుసంపన్నమైన ప్రగతిని సాధించింది. చింతలు లేని జీవితాలు తెలంగాణ ప్రజలు అనుభవించారు. అరవైఏళ్ల గోస పోయింది. పల్లెల్లో మళ్లీ పచ్చదనం, పాడి, పంట వెల్లివిరిసింది. పల్లె ఆకుపచ్చని అందాలు అద్దుకున్నాయి. తెలంగాణ సాగులో విప్లవం సాధించింది. ఊహించని దిగుబడులతో అన్నపూర్ణగా విలసిలిల్లంది. రైతు రాజయ్యాడు. రైతు రాజ్య స్ధాపన జరిగింది. అంత గొప్పగా బంగారు తెలంగాణ తీర్చిదిద్దబడిరది. కాని అధికారమే పరమావిధిగా కాంగ్రెస్‌పార్టీ పదే పదే ఎన్నికల ముందు అబద్దాలు వల్లెవేసింది. చెప్పిందే చెప్పి, తప్పుడు ప్రచారాలు నమ్ముకొని బిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసి, అధికారంలోకి కాంగ్రెస్‌ అదికారంలోకి వచ్చింది. పది రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం అసలు రంగు బైటపడుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి పాలనపై అవగాహన లేక, మేధావులుగా తమకు తాము చిత్రీకరించుకునే వారి మాటలు నమ్మి, అధికార పక్షం బోల్తాపడిరదన్న విషయాన్ని హరీష్‌రావు లెక్కలతో సహాబైటపెట్టారు. ప్రభుత్వం వద్ద సమాధానం లేకుండా చేశారు. సమర్ధుడైన నాయకుడు ప్రశ్నిస్తే ఎలా వుంటుందో పాలకపక్షానికి తెలిసి వచ్చింది. వెంటనే తేరుకునే ప్రయత్నం చేయాలనుకున్నారు. కాని హరీష్‌రావు వాగ్ధాటికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని అడుగుడగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అడుగడుగునా హరీష్‌రావుకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నంచేశారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్‌ గత ప్రభుత్వం జీతాలు సరిగ్గా ఇవ్వలేదంటూ ఏదో చెప్పబోయి ఇరుకున పడ్డాడు. ఇదే సమయంలో ప్రభుత్వ ఖజానా అంటే బీరువా కాదు. అందులో డబ్బు దాచుకోవడం వుండదని, ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్ధ ఒక ప్రవాహం లాంటిదంటూ, వచ్చే లెక్క, పోయే లెక్క వుంటుందని హరీష్‌రావు అనడంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ కలుగజేసుకున్నారు. తాను మొదటిసారి అసెంబ్లీకి ఎన్నిక కావడం నిజమే కాని, గతంలోనే తాను పార్లమెంటు సభ్యుడినని, ప్రభుత్వ ఖజానా అంటే బీరువా కాదని తమకు తెలుసని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. దాంతో అధికార పక్షం ఎంత డిఫెన్స్‌లో వుందో అర్ధమైంది. ఆ తర్వాత మంత్రి హరీష్‌రావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్న క్రమంలో మరోసారి మంత్రి జూపల్లి కలుగజేసుకున్నారు. సందర్భంలేకుండా తలదూర్చి హరీష్‌రావు ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక విద్యుత్‌ అప్పులు, విద్యుత్‌ తయారీ సంస్ధలు, కేంద్రం ఒత్తిళ్లు, మోటార్లకుమీటర్ల అంశం ప్రస్తావనకువచ్చింది. ఈ విషయంలో హరీష్‌రావు చెబుతున్న విషయాలు అధికార పక్షానికి నచ్చలేదు. కేంద్రం ప్రభుత్వం ఎంత ఒత్తిడిచేసినా, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎట్టిపరిస్ధితుల్లోనూ మోటర్లకు మీటర్లు పెట్టమని తెగేసి చెప్పిన విషయాన్ని ఘంటాపధంగా హరీష్‌రావు మరోసారి చెప్పారు. అంతే కాకుండా తన కంఠంలో ప్రాణం వుండగా మోటార్లును ఎట్టిపరిస్ధితుల్లో కూడా అనుమతించేది లేదని తేగేసిచెప్పిన సందర్భాన్ని గుర్తుచేశారు. దాంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలుగజేసుకొని, సమర్ధించుకోబోయారు. మోటర్లకు మీటర్ల అంశపై తాను పార్లమెంటరీ కమీటీ సభ్యుడినంటూ చెప్పుకున్నాడు. హరీష్‌రావును అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
ఎన్నికల సమయంలో సాక్ష్యాత్తు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పిన విషయాలను హరీష్‌రావు సభ దృష్టికి తెచ్చారు.
అంతే కాకుండా తెలంగాణలోని 70లక్షల మంది రైతుల ప్రయోజనాల కోసం, 35వేల కేంద్రం అప్పు కూడా వదులుకున్నామని చెప్పడంతో ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ సభ్యులు బల్లలు చర్చడంతో అసెంబ్లీలో అధికార పక్షం అవాక్కయింది. సహజంగా పాలకపక్షం ప్రతిపక్షం మీద దాడి చేస్తున్నప్పుడు సభ్యులు బల్లలు చరుస్తుంటారు. కాని చాలా కాలం తర్వాత పాలకపక్షంమీద ప్రతిపక్షం ఎదురుదాడి చేసి, పాలకపక్షానికి మాటలు లేకుండా చేసి బల్లలు చర్చే పరిస్దితి రావడం అంటేనే ప్రతిపక్షం పైచేయి సాధించినట్లు లెక్క. అది ఈ రోజు అనేక సార్లు అసెంబ్లీలో కనిపించింది. ఎలాగైనా మధ్యలో కలుగుజేసుకొని హరీష్‌రావును ఇరుకున పెట్టాలని ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రయత్నం చేశారు. వరంగల్‌ నడిబొడ్డును వున్న జైలు కూల్చేశారంటూ, ఆసుపత్రి ఊరు అవతల నిర్మాణం చేస్తే బాగుండేదన్నారు. వెంటనే అందుకున్న హరీష్‌రావు ప్రజలకు అత్యవసర సేవలు అందాల్సిన ఆసుపత్రి ఊరవతల నిర్మాణం చేయాలని, జైలు నగరం నడిబొడ్డున వుండాలని సురేఖ చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. దాంతో మరోసారి ప్రతిపక్ష సభ్యులు బల్లలు చర్చారు. ఎలాగైనా మంత్రి హరీష్‌రావు దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్న ఆలోచనతో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నం చేశారు. కాని ఆయన వేసిన ఎత్తును కూడా హరీష్‌రావు చిత్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో వున్న లుకలుకలు అసెంబ్లీ సాక్షిగా బైట పెట్టి, బిఆర్‌ఎస్‌ బలమైన ప్రతిపక్షమని మరోసారి రుజువు చేశారు. అధికారంలో వున్నా, ప్రతిపక్షంలోవున్నా ప్రజల కోసం నిత్యం పాటు పడేది బిఆర్‌ఎస్సేనని మరోసారి హరీష్‌రావు నిరూపించారు. పాలకపక్షం సభ్యులనుంచి కూడా తర్వాత ప్రశంసలందుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version