కార్లు ఢీ
– ఒకరు మృతి
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం జనగామ బైపాస్ రోడ్డుపై (ఇందిరమ్మ కాలనీ వద్ద) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ఒకరు మతిచెందారు. జనగామ సీఐ, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ని క్రమబద్దీకరిస్తూ ప్రమాద వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.